society
-
2500 మిలియన్ల ఏళ్ల చరిత్ర ఉన్న బండరాళ్లివి!
రాక్ సొసైటీ గుర్తింపు పొందిన ఉర్దూ విశ్వవిద్యాలయంలోని పత్తర్ కే దిల్, ఏక్తా మే తాకత్ హై పేర్లు కలిగిన రెండు బండరాళ్లకు మాత్రం 2500 మిలియన్ల ఏళ్ల చరిత్ర ఉందని, దక్కన్ పీఠభూముల్లో భాగం అని చెబుతున్నారు. ముఖ్యంగా నాలుగు బండరాళ్లలో రెండు రాళ్లు పక్కపక్కనే ఉండడాన్ని గుర్తించి ఈ రాళ్లకు ‘పత్తర్కే దిల్’ అని నామకరణం చేశారు. రాళ్లన్నీ ఒకేచోట ఉండడంతో ఏక్తా మే తాకత్ హై (యునైటెడ్ వి స్టాండ్) అని నామకరణం చేశారు. అలాగే మరోచోట ఉన్న రాళ్లకు కూడా అనేక్ తా మే ఏక్తా (యూనిటీ ఇన్ డైవర్సిటీ) అని కూడా పిలుస్తున్నారు. రాక్స్ పేరిట వీకెండ్స్ వాక్ ∙విభిన్న రాష్ట్రాలు, భాషలు, కులాలు, మతాలకు చెందిన వారితో మినీ భారత్‌గా మారిన హెచ్‌సీయూలో విద్యార్థులలో ఐక్యత బలపడేలా చేసేందుకు హెచ్‌సీయూ ఎక్స్‌ప్లోరర్ పేరిట వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేశారు. ఈ గ్రూపు ద్వారా వీకెండ్స్‌లో వాక్‌లను నిర్వహిస్తున్నారు. హెచ్‌సీయూ క్యాంపస్‌లో మష్రూమ్ రాక్, వైట్ రాక్, టెంపుల్ రాక్, వర్జిన్ రాక్, వైట్ రాక్స్, హైరాక్స్, సాసర్ రాక్, కోన్ రాక్ కాంప్లెక్స్ ఇలా రకరకాల పేర్లతో ఈ బండరాళ్లను విద్యార్థులు పిలుస్తుంటారు. హెచ్‌సీయూ, మనూ యూనివర్సిటీల్లో హెరిటేజ్ రాక్స్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ‘ఏక్తా మే తాకత్ హై’పేరుతో పిలిచే రాళ్లు ‘పత్తర్ కే దిల్.. ఏక్ తా మే తాకత్ హై.. అనేక్ తా మే ఏక్తా.. ‘మష్రూమ్ రాక్,.. వైట్ రాక్స్.. టెంపుల్ రాక్’లు హెరిటేజ్ రాక్స్గా గుర్తింపు పొందాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన భారీ బండరాళ్లకు పెట్టిన పేర్లు ఇవి. నగరంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న రాతి సంపద హెచ్‌సీయూ, మనూ ఉర్దూ యూనివర్సిటీల్లో ఉండడం విశేషం. నగరంలో గుర్తించిన హెరిటేజ్ రాళ్లలో హెచ్‌సీయూ ‘మష్రూమ్రాక్’ ఉంది. వీటికి శతాబ్దాల చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతుంటారు. వీటి గురించి భావితరాలకు తెలిసేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. హెచ్‌సీయూలో 2,300 ఎకరాలు, ‘మనూ’లో 200 ఎకరాలు కలిపి 2,500 ఎకరాలలో విభిన్న తరహాలో ఏర్పడిన భారీ బండరాళ్ల (రాక్స్)ను రక్షిస్తూ వస్తున్నారు. – రాయదుర్గం -
అదర్ కోహినూర్స్, రాక్స్ ఆఫ్ హైదరాబాద్ ప్రత్యేక డాక్యుమెంటరీ, అక్టోబర్ 20న
అదర్ కోహినూర్స్, రాక్స్ ఆఫ్ హైదరాబాద్ బృందం హైదరాబాద్ హెరిటేజ్ గురించి సరికొత్త డాక్యుమెంటరీని ఆవిష్కరించనుంది. అక్టోబర్ 20న హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగే గ్రాండ్ ఈవెంట్లో అధికారికంగా దీన్ని లాంచ్ చేయనుంది. హైదరాబాద్ పట్టణ విస్తరణతో కనుమరుగవుతున్న రాళ్లకు (అదర్ కోహినూర్స్) నివాళిగా దీన్ని రూపొందించామని నిర్వాహకులు తెలిపారు.ఉమా మగల్ దర్శకత్వం వహించి నిర్మించిన ఈ 48 నిమిషాల డాక్యుమెంటరీ, హైదరాబాద్‌లోని ప్రత్యేకమైన ప్రకృతిలో అద్భుతమైన రాళ్లను, వాటి వైభవాన్ని పరిచయం చేయనుంది. నగర గొప్ప సాంస్కృతిక, చారిత్రాత్మక సంబంధాన్ని ఆవిష్కరిస్తుంది. అక్టోబరు 20న సాయంత్రం 6 గంటలకు ప్రసిద్ధ "సాంగ్ ఆఫ్ ది కోహినూర్స్"ని ర్యాప్ సాంగ్ ఈ కార్యక్రమం మొదలు కానుంది. డీజే ముర్థోవిక్ స్వరపరిచిన అనుజ్ గుర్వారా అందించిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకోనేంది. ఈ పాటను హైదరాబాద్ ప్రేమ గీతం అని పిలుస్తారు. ఈ చిత్రం కేవలం హైదరాబాద్ రాళ్ల డాక్యుమెంటేషన్ కాదు; ఇది ఒక సాంస్కృతిక ఉద్యమం. నగర ప్రత్యేకమైన సహజ వారసత్వాన్ని జరుపుకోవడానికి ,రక్షించడానికి విభిన్న నేపథ్యాల నుండి ప్రజలను ఒకచోట చేర్చడం. నగర ప్రకృతి దృశ్యాన్ని గౌరవించే స్థిరమైన పట్టణ అభివృద్ధిపై చర్చ జరగాలని టీం భావిస్తోంది.మరిన్ని వివరాల కోసం, సందర్శించండి: డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.అదర్స్కొహినూర్.కామ్ -
TCSS ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్(TCSS)ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు సంబవాంగ్ పార్క్‌లో అక్టోబర్ 5న(శనివారం) ఎంతో కన్నుల పండుగగా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరు సాంప్రదాయ పాటలు ఆటలతో ఎంతో హుషారుగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో పాటలతో ఈ వేడుకలు మిన్నంటాయి. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎంతో మంది ఎన్నారైలు సుమారు 4000 నుండి 5000 వరకు పాల్గొని బతుకమ్మ ఆడారు. సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు వారందరికీ , స్థానికులకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తు దశాబ్దానికి పైగా సింగపూర్‌లో బతుకమ్మ పండుగకు విశేష ఆదరణ కలుగజేయడం ద్వారా టీసీఎస్ఎస్ చరిత్రలో నిలిచిపోయిందని సొసైటీ సభ్యులు అన్నారు. ఈ సంబురాల్లో అందంగా ముస్తాబైన బతుకమ్మలకు, ప్రత్యేక సాంప్రదాయ, ఉత్తమ వస్త్రధారణలో మహిళలకు గృహ ప్రవేశ్, సౌజన్య డెకార్స్, ఎల్ఐఎస్ జువెల్స్ , బీఎస్కే కలెక్షన్స్ వారు ప్రత్యేక బహుమతులు అందజేశారు.ఇరు తెలుగు రాష్ట్రాల తెలుగువారు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ వైభవాన్ని చాటి చెప్పడం ఎంతో సంతోషకరమని, బరాలు విజయవంతంగా జరుగుటకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ టీసీఎస్ఎస్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. టీసీఎస్ఎస్తో ప్రేరణ పొంది ఇతర సంస్థలు కూడా బతుకమ్మ నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు.ఈ వేడుకల్లో టీసీఎస్ఎస్ ప్రత్యేకంగా తయారు చేయించిన బతుకమ్మ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా విడుదల చేసిన సింగపూర్ బతుకమ్మ ప్రోమో పాట "సింగపూర్ కొచ్చే శివుని పెండ్లాము.. సిరులెన్నో తీసుకొచ్చే మా పువ్వుల కోసము.." యూట్యూబ్‌లో విడుదల చేసినప్పటి నుంచి వేల వీక్షణాలతో దూసుకుపోతుందని తెలిపారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికీ సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి , కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు రోజా రమణి, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.వీరితో పాటు సొసైటీ మహిళా విభాగ సభ్యులు రోజా రమణి, గడప స్వాతి, బసిక అనిత రెడ్డి, జూలూరు పద్మజ, సునీత రెడ్డి, హేమ లత, దీప నల్ల,కాసర్ల వందన, బొందుగుల ఉమా రాణి, నంగునూరు సౌజన్య, నడికట్ల కళ్యాణి, హరిత విజాపుర్, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సౌజన్య మాదారపు, ఎర్రమ రెడ్డి దీప్తి, సృజన వెంగళ, హర్షిణి మామిడాల, సుధా రాణి పెసరు ఈ బతుకమ్మ పండుగ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. సింగపూర్ వేడుకలను సొసైటీ ఫేస్బుక్ ,యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.ఈ వేడుకలకు సహకారం అందించిన సంపంగి రియాలిటి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, మై స్క్వేర్ ఫీట్ (గృహప్రవేశ్) ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో, సరిగమ గ్రాండ్ రెస్టారెంట్ అండ్ బిస్ట్రో, జి.ఆర్.టి జ్యూవెల్లర్స్, మై హోమ్ గ్రూప్ కంస్ట్రక్షన్స్, అభిరామి జ్యూవెల్లర్స్, వీర ఫ్లేవర్స్ ఇండియన్ రెస్టారెంట్, ప్రద్ ఈవెంట్ మేనేజ్ మెంట్, జి.ఆర్.టి ఆర్ట్లాండ్, జోయాలుక్కాస్ జ్యూవెల్లర్స్, ఏ.ఎస్.బి.ఎల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్, ఎస్.వి.ఎస్ (శ్రీవసుధ) ట్రూ వెల్త్ ఇండియా, ది ఆంధ్ర కర్రీ క్లాసిక్ ఇండియన్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్, కుమార్ ప్రాప్ నెక్స్ , గారెంటో అకాడమీ, ఎస్ పి సిస్నెట్ సొల్యూషన్ దట్స్ పర్ఫెక్ట్ , సౌజన్య హోమ్ డెకార్స్ , ఎల్.వై.ఎస్ జెవెల్స్ మరియు బి.ఎస్.కె కలెక్షన్స్, లాలంగర్ వేణుగోపాల్, రాకేష్ రెడ్డి రజిది, సతీష్ శివనాథుని, కవిత ఆనంద్ అండ్ సంతోష్ ఆమద్యల, హేమ సుభాష్ రెడ్డి దుంతుల, మల్లేష్ బారేపటి, శ్రీధర్ కొల్లూరి,చంద్ర శేఖర్ రెడ్డి కోమటిరెడ్డి, విజయ రామ రావు పొలినేని , సునీల్ కేతమక్క ,రంజిత్ రెడ్డి మండల, నాగేశ్వర్ రావు టేకూరి , బండారు శ్రీధర్ మరియు పార్క్ యాజమాన్యానికి సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ వేడుకలకు సహకారం అందజేసిన కల్వ రాజు, సుగుణాకర్ రెడ్డి రావుల, మల్లేశ్ బరపతి, చల్లా కృష్ణ, మల్లవేని సంతోష్ కుమార్, మల్లారెడ్డి కళ్లెం, బాదం నవీన్, భాను ప్రకాష్ , సాయికృష్ణ కొమాకుల , ముక్కా కిశోర్‌కు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కీ.శే. గోనె నరేందర్ రెడ్డి గారు సొసైటీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. -
మానవీయ విలువలు వికసించాలి..
ఈనాడు సమాజంలో ఎటుచూసినా అమానవీయం, అరాచకం, అమానుషం రాజ్యమేలుతున్నాయి. మంచి, మర్యాద, మానవీయత మచ్చుకైనా కానరావడం లేదు. మనిషి మానవత్వాన్ని మరిచి మృగంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు చూస్తున్నాం. తమ పాత్రలో నీళ్ళు తాగాడని, పెళ్ళిలో గుర్రంపై ఊరేగాడని, తమ చెప్పుచేతల్లో ఉండకుండా తమతో సమానంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారని బడుగులు, బలహీన వర్గా లపై దాడులు చేయడం, హింసించడం, చంపడం లాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఇలాంటి సంఘటనలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు పలకడం మానవ విలువల హననానికి పరాకాష్ట. ఆ స్థాయి వ్యక్తుల్లోనే విలువలు లుప్తం కావడం వల్ల సమాజంలో అసహనం, విద్వేష భావజాలం, కుల, మత రాజకీయాలు పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ పెద్ద స్థాయిలో మానవీయ పరిమళ వికాసాన్నీ మనం చూశాం. కోవిడ్ సమయంలో ఇలాంటి అనేక దృశ్యాలు మన కంటబడ్డాయి. వలస కూలీల దుఃస్థితికి చలించి మానవతను చాటుకున్న అనేకమందిని మనం దర్శించాం. అనేకమంది మానవతావాదులు దేశ సరిహద్దుల్లో, అననుకూల పరిస్థితుల్లో సైనికుల రూపంలో అసాధారణ సేవలు అందిస్తూ మానవత్వాన్ని చాటుకోవడం, ప్రకృతి విపత్తులు విరుచుకు పడినప్పుడు ఆపదల్లో చిక్కుకున్న ప్రజలను ఎంతో సాహసోపేతంగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అన్నిరకాల సహాయక చర్యల్లో పాల్గొనడం మనకు తెలిసిందే. ఇదే మానవత్వం!ఇవ్వాళ ఉగ్రవాదం రూపంలో, ప్రభుత్వాల నిరంకుశ విధానాల రూపంలో, మతం, కులం, జాతి, ప్రాంతీయ విభేదాల రూపంలో అనేక దేశాల్లో మానవత్వానికి తీరని హాని కలుగుతోంది. అడుగంటుతున్న మానవతా విలువలను పరిరక్షించి, మానవ హృదయాల్లో వాటిని మరలా పునః ప్రతిష్ఠించవలసిన అవసరం ఉంది. ఇందుకోసం అన్ని దేశాలూ నడుం బిగించాలి. – ఎమ్‌డి. ఉస్మాన్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్ -
ఒడవని జీవో 317 లొల్లి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలో జీవో 317 అమలుపై తీవ్ర గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు చేపట్టేందుకు గత నెలలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించినప్పటికీ సాంకేతిక సమస్యలు నెలకొనడంతో అమలు తీరు అయోమయంలో పడింది. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 317 కేటగిరీలో దాదాపు నాలుగు వందల మందికి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన 550 మంది టీచర్ల సర్వీసు క్రమబద్ధీకరించిన అనంతరం వారికి కూడా జోన్ల కేటాయింపు, పోస్టింగ్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు ముందడుగు పడలేదు. కనీసం ఉద్యోగుల సీనియార్టీ జాబితాలు సైతం రూపొందించకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.సొసైటీ కార్యాలయంలో ఎవరికి వారే...జీవో 317 కింద ఉద్యోగుల కేటాయింపు, సీని యార్టీ జాబితాలపై ఉద్యోగులంతా ఎస్సీ గురు కుల సొసైటీ కార్యాలయం చుట్టూ తిరుగుతు న్నారు. గత నెల 24, 25 తేదీల్లో వీరికి వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండగా... సాంకేతిక కారణాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దాదాపు పది రోజులు గడిచినా ఇప్పటివరకు ఈ అంశంలో ఎలాంటి పురోగతి లేదు. దీంతో సొసైటీ కార్యాలయంలో సంబంధిత అధికారులను సంప్రదించినప్పటికీ తమకేమీ తెలియదంటూ చేతులు దులిపేసుకుంటున్నా రని ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రస్తు తం ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ మొదలైంది. ఎస్టీ గురుకుల సొసైటీలో ఉద్యో గుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈనెల 20వ తేదీనాటికి బదిలీల ప్రక్రియ ముగించాలని రాష్ట్ర ప్రభు త్వం స్పష్టం చేసింది. ఇతర గురుకుల సొసైటీ లన్నీ వేగవంతంగా ప్రక్రియ పూర్తిచేస్తుండగా.. ఎస్సీ గురుకుల సొసైటీలో నెలకొన్న విచిత్ర పరిస్థితితో ఉద్యోగులంతా తలపట్టుకుంటున్నా రు. ముందుగా జీవో 317 కేటాయింపుల తర్వాత సాధారణ బదిలీలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జీవో 317 బాధితులు ఆందోళన చెందొద్దుజీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులు ఏమాత్రం ఆందోళన చెందవద్దని.. వారికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. జీవో 317 బాధిత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శనివా రం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు వివరించిన అంశాలను విన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జీవో 317 బాధిత ఉద్యోగులు, స్పౌజ్ బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్‌కమిటీ శాశ్వత పరిష్కారం చూపుతుందని స్పష్టం చేశారు. అతి త్వరలో కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డికి తుది నివేదిక అందించనుందని వెల్లడించారు. -
సోషల్ మీడియా అసాంఘిక శక్తులు బలి తీసుకున్న జీవితాలు
-
మగపిల్లల పెంపకం
సాధారణంగా పెంపకం విషయంలో ఆడపిల్లలకి ఎన్నో జాగ్రత్తలు చెప్పటం చూస్తాం. మగపిల్లలకి చెప్పవలసినది ఏమీ లేదని చాలా మంది అభిప్రాయం. ఈ కారణంగానే సమాజంలో ఎన్నో అయోమయ పరిస్థితులు, అలజడులు, అరాచకాలు. ముఖ్యంగా ఆడపిల్లలకి సమాజం మీద ఏవగింపు, కోపం, పురుషద్వేషం పెరిగి అవాంఛనీయ సంఘటనలకి దారి తీయటం జరుగుతోంది. అమ్మాయిలు విప్లవభావాల పట్ల ఆకర్షించబడటం, పెళ్లి చేసుకోవద్దు అనుకోటం, చేసుకున్నా విడాకులు తీసుకోవటం, కుటుంబాలు విచ్ఛిన్నం కావటం, లేదా అమ్మాయిలనే పెళ్లి చేసుకోవటమో, సహజీవనం చేయటమో జరుగుతోంది. ఇవన్నీ కొంతవరకైనా అదుపులో ఉండి సమాజంలో సమరసత ఉండటానికి మగపిల్లలని సరిగా పెంచటం ప్రధానం. మన తరువాతి తరం వారికి మనం ఏం నేర్పిస్తున్నాం? అని కాస్త వివేచన చేస్తే ... అమ్మో! ఎంత భయం వేస్తుందో! మన ప్రవర్తన ద్వారా నేర్పే విషయాలే కాదు, మన మాటలు, ఆదేశాలు, ఉపదేశాలు, బోధలు మొదలైనవి కూడా తలుచుకుంటే బాధ కలుగుతుంది. ఆడ, మగ వివక్ష ఇంట్లోనే మొదలవుతుంది. ఆడపిల్ల పుట్టిందనగానే ముందుగా ‘‘అయ్యో!’’ అనేది తల్లే. పెంపకంలోనూ తేడా చూపిస్తారు. ఉదాహరణకి ఇంట్లో అమ్మాయిని తల్లే అంటుంది ‘‘ఆడపిల్లవి నీకెందుకు?’’ అని. అంటే ఆడపిల్ల కొన్ని విషయాలు పట్టించుకోకూడదు. అవసరం లేదు. కొడుకు కూడా కొన్ని పట్టించుకోకూడదు. కానీ అవి వేరు. అవి ఇంటి విషయాలు, వంటవిషయాలు మొదలైనవి. ఇంక కొన్ని కుటుంబాలలో ఆస్తిపాస్తులు పంచి ఇవ్వటం మాట అటుంచి కూతురిని ఇంటిపని చెయ్యమని, కొడుకుని చదువుకోమని చెప్పేవారు కనపడుతూనే ఉన్నారు. ఇద్దరినీ సమానంగా చూడటం ఎట్లా కుదురుతుంది? ఆడపిల్లలు కొంచెం నాజూకుగా ఉంటారు, మగపిల్లలు కాస్త మొరటుగా ఉంటారు కదా! అనిపించటం సహజం. సమానత్వం అంటే వారి పట్ల ప్రవర్తించే తీరు సమానంగా ఉండటం. వారికి ఇష్టమయినవి, వారి అభిరుచులకు తగినవి అందించటం. నిజానికి మగపిల్లలైనా ఏ ఇద్దరికీ ఒకే రకమైన అభిరుచులు, లక్ష్యాలు ఉండవు కదా! ఒకరికి ఇంజనీరింగ్ ఇష్టమైతే మరొకరికి వైద్యవృత్తి ఇష్టం, వేరొకరికి వ్యవసాయం మీద మక్కువ ఉండవచ్చు. వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వటం తల్లితండ్రుల కర్తవ్యం. అదే ఆడపిల్లల విషయంలో కూడా పాటించాలి. ఇదిప్రోత్సాహం మాత్రమే. అసలు చేయవలసినది మగపిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. ఆడపిల్లలని గౌరవించటం నేర్పాలి. ఇది తండ్రి ప్రవర్తన వల్ల కలుగుతుంది. తండ్రి తల్లిని గౌరవిస్తూ ఉంటే కొడుకు కూడా తల్లిని, స్త్రీలని గౌరవిస్తాడు. చీటికి మాటికి భార్యని భర్త చులకన చేస్తూ ఉంటే కొడుకుకి ఆడవారిని తక్కువగా చూడటం అలవాటు అవుతుంది. తరువాతి కాలంలో ఈ భావం సరి అవటం కష్టం. ఇటువంటి పెంపకంలో పెరిగిన వారే ఆడపిల్లలని ఏడిపించటం నుండి యాసిడ్ దాడులు, అత్యాచారాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. ఏ ఇంట్లో తండ్రి తల్లిని అగౌరవపరచడో, ఆడపిల్లలని బరువుగా భావించ కుండా ఉంటారో ఆ ఇంట్లో పెరిగిన మగపిల్లలు తోటి ఆడపిల్లలతో మర్యాదగా ప్రవర్తిస్తారు. అటువంటి వాళ్ళు ఉన్న సమాజంలో మన ఆడపిల్లలు కూడా భద్రంగా ఉంటారు. ప్రతి క్షణం ఆడపిల్ల, మగపిల్లవాడు అనే మాటని అని వారికి ఆ సంగతి గుర్తు చేస్తూ ఉండకూడదు. ఇంటి పనులన్నీ ఇద్దరి చేత సమానంగా చేయిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ రోజులలో ఆడ, మగ అందరు ఉద్యోగం చేస్తున్నారు. మగవారి బాధ్యత అయిన సంపాదించటంలో ఆడవారు భాగస్వామ్యం వహిస్తున్నప్పుడు, ఇంటి పనిలో మగవారు కూడా భాగస్వామ్యం వహించాలి అని చిన్నప్పుడే బుర్రకి ఎక్కించాలి. ముందు తిన్నకంచం తీయటం, వంటపనిలో సహాయం చేయటం అలవాటు చేయాలి. లేక΄ోతే కోడలు అత్తగారి పెంపకాన్ని తప్పు పడుతుంది. – డా. ఎన్. అనంతలక్ష్మి -
మానవీయ విలువలతోనే సామాజికాభివృద్ధి!
సాక్షి, సిటీ బ్యూరో: మానవీయ విలువలతోనే సామాజికాభివృద్ధి సాధ్యమని నగరంలోని ఐఐఐటిలో విశ్వమానవ విలువల విభాగం సమన్వయకర్త ప్రొఫెసర్ డా. శతృజ్ఞ రావట్ తెలిపారు. సి.హెచ్.డి.హెచ్.సి. – ఎ.ఎస్.డబ్ల్యూ.ఎ. సంస్థ ఆధ్వర్యంలో ఐఐఐటీలో జరిగిన ‘జీవన విద్య’ శిక్షణా శిబిరానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ శిబిరంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని వయసు, వృత్తులు, వర్గాల వారు హాజరయ్యారు. మనిషి కుటుంబంలోను, సమాజంలోను సానుకూల సంబంధ బాంధవ్యాలతో ఆనందంగా జీవించడానికి కావలసిన ముఖ్యమైన నైపుణ్యాలను చాలా సులభంగా అర్ధమయ్యే రీతిలో వక్తలు చర్చించారు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో దేని కోసం పాటు పడుతున్నాం? ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం? సంసారంలో, బంధువులతో సంబంధాలను పక్షపాతం లేకుండా లోతుగా అర్ధం చేసుకోవాలి? ఇంటా బయటా దైనందినజీవితంలో ఎదురయ్యే సమస్యలపై ఆత్మావలోకనం ద్వారా ఎవరికి వారు సదవగాహనను పెంచుకొని ఈ సమస్యల నుంచి బయటపడటం ఎలా? తద్వారా ఆత్మీయంగా, అనందంగా జీవించడం ఎలా? సమాజంలో భాగస్వాములం కావడం, ప్రకృతితో మమేకమై జీవించడం ఎలా? వంటి అనేక విషయాలపై సి.హెచ్.డి.హెచ్.సి. రిసోర్స్పర్సన్లు శాస్త్రీయ పద్ధతుల్లో సోదహరణంగా వివరించారు. పాల్గొన్న ప్రతి ఒక్కరూ అనేక కీలక అంశాలపై స్పష్టత వచ్చిందని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ శిబిరంలో సి.హెచ్.డి.హెచ్.సి. రిసోర్స్పర్సన్లు శివశంకర్, నరసింహస్వామి, అమ్మ శ్రీనివాస్, గిరిధర్, వాసు అవగాహన కల్పించారు. హరిత, కోమల, దయానంద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. సి.హెచ్.డి.హెచ్.సి. సంస్థ ప్రతి నెలా ఆన్లైన్లో, ప్రత్యక్షంగా జీవన విద్య శిక్షణా శిబిరాలను 2018 నుంచి నిర్వహిస్తున్నదని నిర్వాహకులు అమ్మ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి దాకా దాదాపు 25 వేల మందికి రెండు రాష్ట్రాలలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు వారికి ఈ జ్ఞానాన్ని పంచామని, ప్రతి వ్యక్తికి జీవన విజ్ఞానాన్ని అందించడం ద్వారా ఆనందకరమైన సమాజాన్ని నిర్మించడమే తమ ఉద్దేశమని ఆయన తెలిపారు. భోజన ఖర్చులకు మాత్రమే ఫీజు తీసుకుంటూ ఉచితంగా జీవన విద్య జ్ఞానాన్ని పంచుతున్నామన్నారు. (చదవండి: శిశువు రక్షణ అందరి బాధ్యత! కానీ ఇప్పటికీ ఆ విషయంలో వైద్యుల ఆందోళన..) -
అత్తింట్లో చిత్రహింసలు: మేళతాళాలతో కుమార్తెకు తండ్రి ఘన స్వాగతం
మేళ తాళాలతో ఘనంగా పెళ్లిచేసి కూతురిని బ్యాండ్-బాజా-బారాత్‌తో సాగనంపడం మన అందరమూ చూసి ఉంటాం కానీ పెళ్లయిన కూతురిని అదే ఆనందంతో శాశ్వతంగా ఇంటికి తిరిగి తీసుకురావడం మీరు ఎప్పుడైనా చూశారా? అవును ఇది నిజంగా జరిగింది. అరుదైన ఈ ఘటన ఝార్ఖండ్ రాజధాని రాంచీలో చోటుచేసుకుంది. మూడు ముళ్లూ పడిన తరువాత చచ్చిన బతికినా మెట్టినింట్లోనే మన సమాజంలో ఎక్కువ మంది ఆడ పిల్లలని వేధించే మాటలివి. ఏ కష్టం వచ్చినా.. కాంప్రమైజ్ అయ్యి బతకాల్సిందే. తరాలు మారుతున్నా అమ్మాయిల జీవితాల్ని శాసిస్తున్న ఇలాంటి కట్టుబాట్లను తోసి రాజన్నారొక తండ్రి. తండ్రి అంటే ఇలానే ఉండాలి అన్నట్టుగా ప్రవర్తించి ఈ ప్రపంచంలోని అమ్మాయిలందరి మనసు దోచుకున్నారు. రాంచీకి చెందిన ప్రేమ్ గుప్తా తన కుమార్తె సాక్షి గుప్తాకు గతేడాది ఏప్రిల్‌లో సచిన్ కుమార్ అనే వ్యక్తితో ఘనంగా పెళ్లి జరిపించారు. భర్తతో నిండు నూరేళ్లు హాయిగా జీవించమంటూ ఆశీర్వదించి అత్తారింటి సాగనంపారు. అయితే వేయి కలలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆమె ఆశలన్నీ ఆవిరైపోయాయి. భర్తకు ఇంతకుముందే పెళ్లి అయింది. ఒకసారి కాదు, రెండుసార్లు పెళ్లి చేసుకున్నాడు. మూడో పెళ్లి తర్వాత కూడా సాక్షితో కలిసి సవ్యంగా జీవించలేదు. అయినా సర్దుకు పోదాం అనుకుంది. అతడే మార తాడులే అనుకుని బంధం కొనసాగించాలని సాక్షి నిర్ణయించుకుంది. దీనికి తోడు అత్తింటి వేధింపులు కూడా ఎక్కువ కావడంతో, తల్లిదండ్రులతో తన గోడును వెళ్ల బోసుకుంది. కూతురి కష్టాలు చూసిన తండ్రి చలించిపోయాడు. సాక్షికి అండగాఉండాలనే నిర్ణయం తీసుకోవడంమాత్రమేకాదు. భాజాభజంత్రీలు, బాణాసంచాతో ఊరేగింపుగా తన కుమార్తెను తిరిగి పుట్టింటికి స్వాగతం పలికారు తండ్రి. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలోషేర్ చేశారు. ఆడపిల్లలు చాలా విలువైన వాళ్లు.. వాళ్లను గౌరవించాలి..అంటూ సమాజానికి మంచి సందేశ మిచ్చారు. దీంతో నెటిజన్లు ఆయనను అభినందిస్తున్నారు. -
ఎల్లలు దాటనున్న మాడుగుల హల్వా!
సాక్షి, విశాఖపట్నం : నోట్లో వేసుకోగానే మైమరపించే మాడుగుల హల్వా రుచిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీనిని ప్రత్యేక పరిశ్రమగా అభివృద్ధి చేయడంతో పాటు.. భౌగోళిక గుర్తింపు తీసుకొచ్చేందుకు అడుగులేస్తోంది. ఇందుకోసం దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఒప్పందం కుదుర్చుకుంది. జీడి పప్పు.. బాదం పలుకులు.. కవ్వంతో చిలికిన ఆవు నెయ్యి, ఎండు ఖర్జూరం నీళ్లు, తేనే.. గోధుమ పాలు.. వీటన్నింటినీ రాతి రుబ్బు రాయితో గంటల పాటు సానబెట్టి.. ఆపై కట్టెల పొయ్యిలో తగిన ఉష్ణోగ్రతలో తగిన పాకంతో పదునుపెట్టగానే పుట్టుకొస్తుందీ హల్వా. మాడుగులలో 1890వ సంవత్సరంలో దంగేటి ధర్మారావు కుటుంబం మాత్రమే దీనిని తయారు చేసేది. ప్రస్తుతం ఈ వ్యాపారంపై అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 5 వేల మందికి పైగా నిరుపేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మొట్టమొదటిగా ‘మాడుగుల హల్వా’ ఎంపిక మాడుగుల హల్వా వ్యాపారాన్ని మరింత వృద్ధిలోకి తేవడమే కాకుండా విదేశాల్లో దర్జాగా విక్రయించేందుకు అవసరమైన చేయూతనందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించనుంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ)లో భాగంగా ఈ పరిశ్రమని అభివృద్ధి చేయనుంది. ఇందుకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు సమకూరుస్తాయి. యంత్రాల్ని సమకూర్చడం, స్కిల్స్ అప్‌గ్రేడ్ చేయడం, ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ వంటివి కల్పిస్తారు. వీటితో పాటు.. మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ఇందుకోసం రాష్ట్రంలో తొలిసారి మాడుగుల హల్వాని ఎంపిక చేశారు. ఇకపై ఈ హల్వా.. ఒక బ్రాండెడ్ ప్రొడక్ట్‌గా మార్కెట్లో లభించనుంది. ఇందుకు కావాల్సిన వసతుల్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. పథకంలో భాగంగా ఏడాది పాటు ప్యాకేజింగ్ మెటీరియల్, గోదాముల్లో నిల్వ చేసుకునేందుకు అద్దె, రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వమే అందిస్తుంది. ఎలాంటి పెట్టుబడి భారం లేకుండా హల్వాని విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన వ్యయంలో 50 శాతం వరకూ గ్రాంట్ కింద ప్రభుత్వం సమకూరుస్తుంది. భౌగోళిక గుర్తింపునకు ఒప్పందం.. వందేళ్ల చరిత్ర గల మాడుగుల హల్వాకు భౌగోళిక గుర్తింపు తెచ్చేందుకు దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంతో ఏపీ ఫుడ్‌ప్రాసెసింగ్ సొసైటీ శుక్రవారం ఎంవోయూను కుదుర్చుకుంది. ఈ గుర్తింపు కోసం అవసరమయ్యే రుసుములు, ఇతర ఖర్చులకు సంబంధించి రూ.3 లక్షల వరకూ ప్రభుత్వమే భరించనుంది. వచ్చే ఆరు నెలల్లోపు మాడుగుల హల్వాకు కూడా భౌగోళిక గుర్తింపు వచ్చే అవకాశాలున్నాయి. ఈ గుర్తింపు వస్తే ఇక ఈ పేరుతో ఇక్కడి నుంచి తప్ప మరెవరూ, ఎక్కడా మాడుగుల హల్వాను తయారు చేయలేరు. వారసత్వ సంపదగా గుర్తింపు వందల ఏళ్ల చరిత్ర కలిగిన అనేక తినుబండారాలు తయారు చేసే పరిశ్రమలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ చిరు వ్యాపారం మాదిరిగానే మిగిలిపోయాయి. వాటన్నింటినీ అభివృద్ధి చేసి.. వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే మాడుగుల హల్వాకు భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మాదిరిగా దీని అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నాం. ఆ తర్వాత మిగిలినవాటిపైనా దృష్టిపెడతాం. – కేజే మారుతి, ఏపీ ఫుడ్‌ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ -
ఆ భూకేటాయింపు సమర్థనీయమేనా?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో ఎకరం రూ.1 చొప్పున 5 ఎకరాలను రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి ఇవ్వడం ఎలా సమర్థనీయమో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. బుద్వేల్ సర్వే నంబర్ 325/3/2లో 5 ఎకరాల భూమిని 2018 సెప్టెంబర్ 9న రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి సర్కార్ కేటాయించింది. ఈ మేరకు జీవో నంబర్ 195ను కూడా వెలువరించింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన కె.కోటేశ్వర్రావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. జీవో జారీ చేసిన సర్కార్ దాన్ని రహస్యంగా ఉంచడంవల్లే హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం భూ కేటాయింపు జరిపిందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. -
'ఆ చిన్నచూపే ఆమె కళ్లలోని కలలను చిదిమేశాయని తెలుసుకో'
అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ వేర్వేరా? అంటే కశ్చితంగా కాదు అని చెప్పగలిగే ధైర్యం, సమానత్వం ఈ సమాజంలో ఉందా? ఆడవాళ్లకు దేశాన్ని పాలించే సత్తా ఉంది అని టీవీల్లో, పేపర్లో చూసి వాళ్లను మెచ్చకుంటారు..కానీ అలాంటి నైపుణ్యాలు ఉన్న ఆడపిల్ల నీ ఇంట్లోనూ ఉందని ఏనాడైనా తెలుసుకున్నావా? అబ్బాయిని పై చదువులకు పంపాలంటే ధూమ్‌ధామ్‌గా పంపే తల్లిదండ్రులు అమ్మాయిల చదువులకు మాత్రం ఆలోచిస్తున్నారు. ఆ డబ్బలన్నీ కట్నం కింద పోగేసి పెళ్లి చేసేస్తే పెద్ద బాధ్యత తీరిపోతుంది అనుకునేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. కానీ ఇది ఎంతకాలం? అమ్మాయి తల్లిదండ్రులు ఎప్పటికీ భయపడుతూ, భయపెడుతూ బతకాల్సిందేనా? నీ దృష్టిలో అబ్బాయే ఆదర్శనీయుడైతే, అమ్మాయి కూడా ఆధునికురాలే. మహిళ దేశాన్ని ఏలగలదు అనుకుంటావు. కానీ నీ కూతుర్ని మాత్రం ఇంకా ఆ పుక్కిడి పురాణాల్లోనే బంధిస్తున్నావు. నువ్వు కనీసం ఒక్కసారైనా ఇలా ఆలోచించలేదు.నువ్వుంటున్న ఆ గాఢాంధకారం వల్లే ఆమె ఇంకా వెలుగులను చూడలేకపోతుందని.ఒక్కసారి ఆ కళ్ళలోతుల్లోకి చూసే ప్రయత్నం చేశావా? నువ్వు చూసిన ఆ చిన్న చూపే ఆమె కళ్ళలో ఉన్న కలలను చిదిమేశాయని తెలుసుకో.తను ఒంటరై ఏడ్చిన ఆ కన్నీళ్ల బరువు తెలుసుకో.ఏ సమాజమైతే ఆమెను ఇన్నాళ్లు ఛీత్కరించిందో అదే హీన చూపు తనను ఇంకా అభద్రతా భావంలోకి నెట్టేసిందని తెలుసుకో.అయినా గతమంతా ఇదే కదా..అదే కథా!ఇప్పటికే ఆ చీత్కారాలే ఇంకా చెవుల్లో కర్ణకఠోరంగా మ్రోగుతూనే ఉన్నాయి. ఓ ప్రియ మిత్రమా.. ఇది నీకే ..ఇప్పటికీ నువ్వు పిశాచాల వేటకు బలికావలసిందేనా?నీ జీవితమంతా ఇతరులపై ఆధారపడడమేనా?కానీ వాళ్ళు నీ అసలు సిసలు నిర్వచనాన్ని ఎలా మరిచారు?బహుశా నీతో పోటీ పడలేమని వాళ్ల భయం కావచ్చు. అందుకే నీ లక్ష్యాలను అణచివేయాలని నిర్ణయించుకున్నారు కావచ్చు. వాళ్ళు ఎలా మరచిపోయారు నిన్ను చేరుకోవడం అసాధ్యం అని.ప్రేమను పంచడంలో ఒక అమ్మ స్థానాన్ని వేరెవరూ భర్తీ చేయలేరని.నిస్వార్థమైన ప్రేమను చూపే కూతురి సంతోషం ముందర ప్రపంచంలో ఉన్న మొత్తం ఆనందాలను తీసుకొచ్చినా సరిపోల్చలేమని.నీ కలల సామ్రాజ్యానికి నువ్వే మహారాణివైతే వేరెవరి విమర్శలు నీ స్థానాన్ని తగ్గించలేరని.. ఇంగ్లీష్ రచన -శ్రీయాన్షు, సెయింట్ ఆన్స్ స్కూల్,హైదరాబాద్ తెలుగు అనువాదం - శ్రీధర్ కందుకూరి, హైదరాబాద్ -
రూ.21 కోట్లు కొల్లగొట్టేశారు.. కుటుంబ సభ్యుల నిర్వాకం..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కుటుంబ సభ్యులనే డైరెక్టర్లుగా నియమించుకుని అధిక వడ్డీల ఆశ చూపి అమాయకులను బురిడీ కొట్టించి న కాకినాడ కార్తికేయ బిల్డింగ్ సొసైటీ గుట్టురట్టు అయ్యింది. సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంతో అక్రమార్కుల ఆస్తులను సీజ్‌చేసి వేలం వేసేందుకు మార్గం సుగమమైంది. తద్వారా సొసైటీ బాధితులకు ప్రభు త్వం నుంచి భరోసా లభించింది. కాకినాడ కేంద్రంగా ఏర్పాటైన కార్తికేయ బిల్డింగ్ సొసై టీ డిపాజిటర్లకు మెచ్యూరిటీ సొమ్ములు ఇవ్వకుండా బోర్డు తిప్పేసిన వ్యవహారాన్ని ‘కొంప ముంచిన కార్తికేయ’.. శీర్షికన ‘సాక్షి’ గత ఏప్రిల్ 2న వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ‘కార్తికేయ’లో జరిగిన రూ.కోట్ల కుంభకోణంపై ప్రత్యేక దృష్టిపెట్టి సహకార శాఖ ద్వారా విచారణ జరిపించింది. ఆ శాఖ కమిషనర్ అహ్మద్‌బాబు, కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సహకార శాఖ ద్వారా వివిధ కోణాల్లో విచారణ జరిపించింది. కార్తికేయ బిల్డింగ్ సొసైటీ ఆర్థిక కుంభకోణం విలువ రూ.21.58 కోట్లుగా లెక్క తేల్చి ప్రభుత్వానికి నివేదిక సిద్ధంచేసింది. అధిక వడ్డీల ఆశచూపి.. అధిక వడ్డీలు ఇస్తామంటూ 300 మంది డిపాజిటర్లను నమ్మించి సుమారు రూ.19.40 కోట్ల వరకు సొసైటీ వారి నుంచి సేకరించింది. ఈ మొత్తానికి ఇవ్వాల్సిన వడ్డీయే రూ.2.05 కోట్లకు పైగా ఉంది. డిపాజిట్ల మొత్తంలో రూ.10 కోట్లను సొసైటీ ఖాతాలో ఎక్కడా నమోదు చేయకుండానే నొక్కేశారని తేలింది. అలాగే, అసలు రుణాలేమీ ఇవ్వకుండానే ఇచి్చనట్లుగా 361 మంది బినామీ పేర్లతో రూ.5.36 కోట్లు స్వాహా చేశారు. ఇందుకు వడ్డీ రూ.2 కోట్లు వచ్చినట్లుగా రికార్డుల్లో చూపించారు. అంతేకాక.. రుణాలివ్వగా వాటి నుంచి వచ్చిన వడ్డీ రూ.1.65 కోట్లు అసలు సొసైటీలో జమచేయకుండానే వాటినీ దారి మళ్లించేశారు. ఈ వడ్డీ సొమ్ములో ఒక్కపైసా కూడా సొసైటీ నగదు పుస్తకంలో లేకపోవడం చూసి సహకార శాఖ అధికారులు విస్తుపోయారు. పిల్లల పెళ్లిళ్లు, ఇల్లు కట్టుకోవడం వంటి భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందనే ముందుచూపుతో రిటైరైన ఉద్యోగులు, చిరుద్యోగులు, సన్న, చిన్నకారు రైతులు ‘కార్తికేయ’లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన రూ.2.56 కోట్లను కూడా మాయం చేసేసి డిపాజిటర్ల నోట మట్టికొట్టారు. కుటుంబ సభ్యులే డైరెక్టర్లుగా.. ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా సహకార అ«ధికారి బొర్రా కనక దుర్గాప్రసాద్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ రిజి్రస్టార్ ఎన్విఎస్ఎస్ దుర్గాప్రసాద్ విచారణ జరిపి కుంభకోణాన్ని నిర్థారించారు. బిల్డింగ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, అప్పటి ప్రెసిడెంట్ కోడి వీరవెంకట సత్యనారాయణ తన భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు వెంకటేశ్, శంకర్‌ను డైరెక్టర్లుగా నియమించుకుని ప్రజల సొమ్మును దిగమింగారు. వీరితో పాటు చేపూరి గంగరాజు, బాలం విజయకుమార్, గ్రంథి వీరేంద్ర, టేకి త్రినా«థ్ పుష్పరాజ్యం, అంజుమ్ సుల్తానా, దొమరసింగు సింహాద్రిరావు, ఇరుసుమల్ల పార్వతి, ముసినాడ సాంబశివరావు, సొసైటీ మేనేజర్ మీర్ అమీర్‌హుస్సేన్, అకౌంటెంట్ కోన కనకమహాలక్ష్మి కుమ్మక్కై ఈ కుంభకోణానికి పాల్పడినట్లుగా తేలింది. ప్రభుత్వ చొరవతో ఆస్తులు సీజ్.. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించడంతో కోడి వీరవెంకట సత్యనారాయణ పేరుతో ఉన్న మూడు విలువైన ఆస్తులను సీజ్‌చేశారు. ఇందులో కాకినాడ వాకలపూడిలోని 1,400 చదర పు గజాలు ఖాళీ స్థలం, కాకినాడ నూకాలమ్మ గుడి వద్ద ఉన్న బిల్డింగ్ సొసైటీ భవనంతోపాటు మరో ఇల్లు సీజ్ చేశా రు. వీటి విలువ రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఉంటాయి. త్వరలో వీటిని వేలం వేసి ఆ సొమ్ముతో డిపాజిటర్లకు ప్రభుత్వం న్యాయం చేయనుంది. చదవండి: ఇదే నాకు మొదటి పెళ్లి... నాకు మందు, సిగరేట్లు కావాలి బాధ్యులపై క్రిమినల్ కేసులు.. కుంభకోణానికి పాల్పడ్డ కోడి వీరవెంకట సత్యనారాయణ సహా 14 మందిపై జిల్లా సహకార అధికారి బొర్రా దుర్గాప్రసాద్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్రిమినల్ కేసులు నమోదుచేశారు. కాకినాడ టూటౌన్ ఇన్స్పెక్టర్ బి. నాగేశ్వర్‌నాయక్ వీరిపై ఐపీసీ 120బి, 420, 406, 408, 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి విచారణ కొనసాగిస్తోందని దుర్గాప్రసాద్ ‘సాక్షి’కి చెప్పారు. -
నేను ఫామిలీ కి ఎందుకు వాల్యూ ఇవ్వనంటే
-
రికార్డు సృష్టించిన ట్రాన్స్‌జెండర్ ఆషాఢం ఆశ.. ఎలా అంటే?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆ ఇద్దరూ.. ఊహ తెలిసినప్పటి నుంచీ.. తాము స్త్రీలమా.. పురుషులమా.. అన్న విషయం తెలియక మథనపడ్డారు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, విద్యార్హతల సర్టిఫికెట్ ఇలా ప్రతి చోటా గుర్తింపు సమస్యే. పైపెచ్చు హేళన, వివక్ష. దీంతో మరింత మనోవేదనకు గురయ్యారు. ఇలాగే ఉంటే.. తమ మనుగడ కష్టమవుతుందని భావించారు. ఇంటి గడప దాటి తమలా ఉండే వారితో కలిసి జీవిస్తున్నారు. తమ కాళ్ల మీద తాము నిలబడే గౌరవ ప్రదమైన జీవితం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తోటివారికి సైతం సహకరిస్తున్నారు. సమాజంలో అన్నీ ఉండి కూడా ఏమీ చేయలేని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వారే కరీంనగర్‌కు చెందిన ఆషాఢం ఆశ, నక్కా సింధు. స్వయం ఉపాధికి ప్రభుత్వ రుణం సంపాదించిన రాష్ట్రంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌గా ఆషాఢం ఆశ రికార్డు సృష్టించింది. అదేవిధంగా స్వయం ఉపాధి కోసం డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించిన రాష్ట్రంలోని రెండో ట్రాన్స్‌జెండర్‌గా నక్కా సింధు గుర్తింపు సాధించింది. కరీంనగర్ జిల్లాకు చెందిన వీరిద్దరూ తమ కమ్యూనిటీకి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ అనగానే.. ట్రాఫిక్ సిగ్నళ్లు, రైళ్లు, రైల్వేస్టేషన్లలో డబ్బులు వసూలు చేసేవాళ్లే కాదు.. అని కుండబద్ధలు కొడుతున్నారు. తమకు అవకాశాలిస్తే.. నైపుణ్యంతో సొంతకాళ్ల మీద నిలబడతామని ఢంకా భజాయిస్తున్నారు. ఫొటోగ్రఫీ వృత్తి కోసం 5 లక్షల రుణం సాధించిన ఆశ ప్రభుత్వ రుణం సంపాదించిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా రికార్డు కాలేజీ సర్టిఫికెట్లు ఇవ్వలేదు.. కరీంనగర్‌కు చెందిన ఆషాఢం ఆశ మగాడిలా పుట్టినా.. చిన్ననాడే తన ఆలోచనలన్నీ అమ్మాయిలా ఉన్నా యని ఆమెకు అర్థమైపోయింది. ఆమె ప్రవర్తనను మొదట్లో కుటుంబసభ్యులు వ్యతిరేకించినా తర్వాత అర్థం చేసుకున్నారు. తన ఇష్టం మేరకు చదివించి హోటల్ మేనేజ్మెంట్లో సైతం చేర్పించారు. కానీ ఆఖరి సెమిస్టర్లో తాను థర్డ్ జెండర్ అని గుర్తించిన క్లాస్మేట్స్ వేధించడం ప్రారంభించారు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆశ.. ఆపరేషన్లు చేయించుకుని పూర్తిగా అమ్మాయిలా మారింది. తీరా వెళ్లి సర్టిఫికెట్లు కావాలని అడిగితే కాలేజీ నిరాకరించింది. విధిలేని పరిస్థితుల్లో ఫొటోగ్రఫీ, గ్రాఫిక్స్ నేర్చుకుంది. మొదట్లో ఆల్బమ్‌లు అందంగా డిజైన్ చేసేది. తర్వాత తానే స్వయంగా ఫొటోలు తీయడం ప్రారంభించింది. మెల్లిగా ఈవెంట్లకు ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం చాలామంది అవకాశాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ మెప్మా అధికారుల ద్వారా కలెక్టర్ కర్ణన్‌ను కలిసింది. ఆయన వెంటనే రూ.5 లక్షలు బ్యాంకు రుణం ఇప్పించడంతో ఫొటోగ్రఫీ వృత్తిని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. సమాజం మారుతోంది.. సహకారం లభిస్తోంది సమాజంలో మాపై చిన్నచూపు ఇంకా ఉంది. తొలి నాళ్లలో నేను ఫొటోలు బాగా తీసినా థర్డ్ జెండర్నని చెప్పి వెనుకడుగు వేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వస్తోంది. మా సమస్యలను సమాజం మెల్లిగా అర్థం చేసుకుంటోంది. ప్రముఖ నటులు లారెన్స్, సుధీర్‌బాబు, అక్షయ్ కుమా ర్లు మాలాంటి వారి కథలతో సినిమాలు తీయడం ద్వారా మా ఇబ్బందులు సమాజానికి తెలిసేలా చేశారు. ప్రభుత్వాలు, కోర్టుల నుంచి మాకు గుర్తింపు, సహకారం లభించడం గొప్ప విషయం. మాలాంటి వారికి ఆధార్, పాన్, ఓటరు తదితర గుర్తింపు కార్డులు, ప్రభుత్వ సాయాల సాధనకు కృషి చేస్తున్నా. ట్యాక్సీ కోసం డ్రైవింగ్ లైసెన్స్ పొందిన సింధు సహచర థర్డ్ జెండర్లలో స్ఫూర్తి నింపుతున్న వైనం విజయగాథలతో స్ఫూర్తి పొంది.. కరీంనగర్‌కే చెందిన నక్కా సింధు కొన్నినెలల క్రితం వరకు ఎలాంటి పనిలేకుండా ఉండేది. ఆశ లాగానే థర్డ్ జెండర్ కావడం వల్ల ఎవరూ పనిచ్చేవారు కాదు. స్కూలు వరకే చదువుకోవడం, బయట వివక్ష , హేళన కారణంగా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. కానీ ఉస్మాని యాలో ప్రభుత్వ డాక్టర్లుగా చేరిన ట్రాన్స్జెండర్లు డాక్టర్ ప్రాచీ రాథోడ్, డాక్టర్ రుతు జాన్పాల్ల గురించి తెలుసుకున్నాక సింధు జీవితంలో మార్పు వచ్చింది. తమిళనాడులో థర్డ్‌జెండర్ కోటాలో ఎస్సై ఉద్యోగం సాధించిన ప్రతీక యాష్మీ విజయ గాథ కూడా ఆమెలో స్ఫూర్తినింపింది. ఎలాగైనా తన కాళ్ల మీద తాను నిలబడాలనే పట్టుదలతో కరీంనగర్ మెప్మా వారి సాయంతో డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందిన రెండో థర్డ్‌జెండర్‌గా (తొలి లైసెన్స్ జనగామ జిల్లాలోని డాలీ పేరిట జారీ అయింది) ప్రత్యేక రికార్డు సాధించింది.వెంటనే ట్యాక్సీ తీసుకునేందుకు అవసరమైన రుణం కోసం దరఖాస్తు చేసుకుంది. చిన్నచూపు పోవాలి.. నాకు చాలాకాలం పాటు ఎలాంటి పని దొరకక పోవడంతో చాలా కుంగిపోయా. కానీ నాలాంటి వారు కొందరి గురించి తెలుసుకున్నాక కొత్త ధైర్యం వచ్చింది. కరీంనగర్ మెప్మా వారి ప్రోత్సాహం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అదే పట్టుదలతో కలెక్టర్ గారి సహకారంతో డ్రైవింగ్ లైసెన్స్ సాధించా. ప్రస్తుతం ట్యాక్సీ తీసుకోవడానికి అవసరమైన రుణం కోసం దరఖాస్తు చేసుకుంటున్నాను. సమాజంలో థర్డ్ జెండర్లపై చిన్నచూపు పోవాలి. అప్పుడే మాలాంటి వారికి అవకాశాలు వస్తాయి. – నక్కా సింధు -
మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో.. !?
భారతదేశంలో మరణానికి ముందు వెనుకల కూడా సనాతనమైన, అమానవీయమైన సాంప్రదాయాలు మనిషిని వెంటాడుతున్నాయి. ఆ సంప్రదాయాల్లో పడి గంజిలో పడ్డ ఈగల్లా బయ టకు రాలేక, అందులో పడి చావలేకా... కొట్టుమిట్టాడుతున్నాం. అద్దె ఇంట్లో ఆత్మీయులు, కుటుంబ సభ్యులు మరణిస్తే కనీసం అక్కడ ఉండి కర్మకాండలు నిర్వహించుకోవడానికి వీలులేని దయనీయ సామాజిక వ్యవస్థలో మనం బతుకుతున్నాం. అందుకే అద్దె ఇంట్లో ఉండేవారు అంతిమ దశలో తమకంటూ సొంత గుడిసె అయినా ఉండాలని కోరుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ తల్లి తన కుమారుణ్ణి ఊరు చివర చిన్న గుడిసె అయినా పరవాలేదు, సొంత ఇల్లు కట్టమని వేడుకుంది. దీంతో ఆమె కుమారుడు లోన్ తీసుకుని సొంతిల్లు కట్టి తల్లి భయాన్ని పోగొట్టాడు. కరీంనగర్ పట్టణంలో బస్వరాజు కనకయ్య, భార తమ్మ అనే రజక దంపతులు ఎన్నో ఏళ్ళుగా తమ చేతనైన పనిచేసుకొని బతుకుతున్నారు. వాళ్లకు ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి స్వప్న దివ్యాంగురాలు. ఒక కాలు పని చేయదు. రెండో అమ్మాయి సరితకు పెళ్ళయ్యింది. నిజానికి బసవయ్యకు పెళ్లయిన ఒక కుమారుడు ఉన్నా అతడు తొమ్మిదేళ్ల క్రితం గుండె పోటుతో చనిపోయాడు. అప్పుడు కూడా అప్పటి అద్దె ఇంటి యజమాని ఇంటికి రానివ్వలేదు. ఇపుడు బసవరాజు కనకయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడి మరణించాడు. ఆసుపత్రి యాజమాన్యం ఆయన బతికే అవకాశం లేదని, ఇంటికి తీసుకుపోతే బాగుంటుందని చెప్పింది. ఆ స్థితిలో ఉన్న కనకయ్యను ఇంటికి తీసుకుపోతే, ఇంటి యజమానులు రానీయలేదు. గత్యంతరం లేక కరీంనగర్ పట్టణంలోని శ్మశానంలోకి తీసుకెళ్ళారు. ప్రాణం ఉండగానే కనకయ్యను శ్మశానంలోకి తీసుకెళ్ళిన కుటుంబం ఆయన చావుకోసం ఎదురు చూసింది. ఒక రోజు తర్వాత కనకయ్య కన్నుమూశాడు. మరణానంతరం జరగాల్సిన కర్మకాండ అంతా ముగించుకొని మాత్రమే తిరిగిరావాలని ఇంటి యజమాని చెప్పడంతో ఇద్దరు ఆడపిల్లలతో మృతుని భార్య 14 రోజులు శ్మశానంలోనే గడిపింది. హైదరాబాద్‌లోని అపార్ట్మెంట్లలో ఎవరైనా అద్దెకు ఉండి, అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే, ఆ కాంపౌండ్ నుంచి శవాన్ని తీసివేయాలి. ఒకవేళ ఆసుపత్రిలో మరణిస్తే అటునుంచి అటే సొంత ఊరికైనా తీసుకెళ్ళాలి. లేదా నేరుగా శ్మశానానికి తీసుకెళ్ళాలి. కొన్ని గ్రామాల్లో మరొక వింత సాంప్రదాయం ఉంది. ఎవరైనా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళి, చికిత్స పొందుతూ మరణిస్తే, ఆ వ్యక్తి మృతదేహాన్ని రానివ్వని గ్రామాలు కూడా ఉన్నాయి. పది సంవత్సరాల క్రితం మంథని దగ్గర్లోని ఒక ఊరి ప్రజలు ఇట్లాగే ప్రవర్తిస్తే, పోలీసుల సహకారంతో ఆ మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్ళి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. దీనికి నేనే ప్రత్యక్ష సాక్షిని. అదేవిధంగా తిరుపతి పట్టణంలో, దాని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినట్టు, జరుగుతున్నట్టు పాత్రికేయ మిత్రుల ద్వారా తెలిసింది. విశాఖతో పాటు అనేక చోట్ల ఇంటి అద్దె కోసం వచ్చిన వాళ్ళను కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు ఉంటే ఇంటి యజమానులు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. మనిషికి మరణం తథ్యమనీ, అది ఎప్పుడైనా, ఎవరికైనా రావొచ్చనీ తెలిసి కూడా మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారనేది అర్థం కాని ప్రశ్న. దీనికి గాను నేను ఎవ్వరినీ నిందించడం లేదు. కానీ దీని గురించి ఆలో చించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కొందరు పుట్టించిన సాంప్రదాయాలు కారణమవుతున్నాయని భావించక తప్పదు. ఇంట్లో ఒక మరణం జరిగితే, కొందరు పురోహి తుడిని సంప్రదిస్తుంటారు. ఇటీవల ఇటువంటి వారి సంఖ్య మరింత పెరిగింది. ఆ పురోహితుడు... వ్యక్తి ఏ ముహూర్తంలో చనిపోయాడో నిర్ణయించి దుర్ముహూర్తమైతే, దానికి శాంతి ఉపాయాలు సూచించి, కొన్నిసార్లు కొన్ని నెలల పాటు మరణించిన ఇంటిని విడిచి పెట్టాలని సూచిస్తున్నారు. దీనిని చూసి ఇంటి యజమానులలో... తమ ఇంట్లో వేరే వాళ్ళ మరణం జరగరాదని, మృతదేహాన్ని ఇక్కడపెట్టరాదనే ఛాందస భావనలు కూడా బాగా పెరుగుతున్నాయి. తమ ఇంట్లో పెళ్లి జరగబోతున్న వారు సొంత బంధువుల అంత్యక్రియలకూ హాజరు కావడానికి ఇష్టపడటం లేదు. ఇట్లా మరణం చుట్టూ అల్లుకున్న ఈ ప్రవర్తన మన సమాజం డొల్లతనాన్ని చూపెడుతున్నది. నిజానికి మన రచనలలో, ప్రసంగాల్లో మృత దేహాన్ని పార్థివ దేహం అంటారు. అంటే పంచభూతాలతో నిండిన శరీరం జీవం పోవడం వల్ల... వాయువును, అగ్నిని, నీటిని, తన సహజ స్వభావాన్ని కోల్పోయి కేవలం మట్టిగా మిగిలిందని చెబుతారు. మట్టి మట్టిలో కలుస్తుంది. పంచ భూతాలతో నిండిన శరీరంలో మట్టి మిగిలినందున ఎంతో పవిత్రమైందిగా చూడాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుండడం వింత సాంప్రదాయంగా భావించొచ్చు. కానీ చావును ఒక భయంకరమైన ఘటనగా చూపించి, దాని చుట్టూ ఒక మూఢనమ్మకాన్ని సృష్టించి, ఆ అంధ విశ్వాసాన్ని సమాజం అంతటా వ్యాప్తి చేస్తున్నారు. ఇటువంటి మూఢ నమ్మకాలను తొలగించకుండా, సమాజంలో మానవత్వాన్ని నింపలేం. ఈ మూఢ నమ్మకాలను ప్రేరేపిస్తున్న వారే ముందుకు వచ్చి, ఇవి సరైనవి కావని చెప్పాలి. లేదా అవి శాస్త్రీయమైనవైతే వాటిని ఆధారాలను, శాస్త్రాలను బయటపెట్టాలి. ఒకవేళ వాళ్ళు ఆ పని చేయలేకపోతే, మానవత్వమున్న ప్రతి ఒక్కరం దీని మీద ఒక కార్యాచరణకు పూనుకోవాలి. అదే విధంగా ప్రభుత్వం వైపు నుంచి రెంట్ కంట్రోల్ యాక్ట్‌లో కొన్ని మార్పులు చేయాలి. ఇంటి యజమానులు ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడితే, శిక్షించడానికి వీలుగా ఆ చట్టంలో సవరణలు చేసి, వాళ్ళను శిక్షార్హులుగా చేయాలి. దీని గురించి న్యాయనిపుణులు, ప్రజా ప్రతినిధులు ఆలోచిం చాలి. మన దేశంలో రోజు రోజుకీ పెరుగుతున్న పట్టణీకరణ, అద్దె ఇండ్ల సమస్యలను పెంచుతున్నది. కావున ఇది కోట్ల మంది సమస్య. రాజకీయ పార్టీలు, సంఘాలు మానవత్వంతో తమ పాత్రను నిర్వహించాల్సి ఉంది. (క్లిక్ చేయండి: 66 ఏళ్లుగా సర్వసాధారణం.. ఇప్పుడెందుకు వివాదం!) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
జడలు విప్పుతున్న వికృత హింస.. చుట్టూ పరిస్థితులు మారాలి
ఇటీవల హైదరాబాద్‌లోని ఓ పాఠశాలలో ముక్కు పచ్చ లారని చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. దీనిని చూస్తుంటే ఆడ పిల్లలు చిన్నా పెద్దా తేడా లేకుండా ఎక్కడైనా, ఎప్పుడైనా లైంగిక దాడికి గురయ్యే అవకాశం ఉందని అర్థమవుతోంది. జడలు విప్పుతున్న ఈ వికృత అమానవీయ హింస ఆడ పిల్లల తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. లైంగిక దాడులకు ప్రేరేపించే సంస్కృతి మన చుట్టూ విశృంఖల స్థాయిలో విస్తరిస్తున్నది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా... లైంగిక దాడులు కొనసాగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రక్త సంబంధీకులు, టీచర్లు, డ్రైవర్లు... ఇలా మన చుట్టుపక్కల ఉండే మనకు పరిచయం ఉన్నవారూ, లేనివారి రూపాల్లో లైంగికదాడులు పొంచి ఉంటున్నాయి. ఈ ఘటనలు చోటు చేసుకున్న సందర్భాల్లో పలుకుబడి ఉన్న నిందితులు బెదిరించడం వల్ల చాలామంది బాధిత కుటుంబాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడానికీ భయపడుతున్నారు. అలాగే లైంగిక దాడి సంగతి బయటికి తెలిస్తే పరువు పోతుందన్న భయం భారతీయ సమాజంలోని తల్లిదండ్రులకు సహజంగానే ఉంటుంది. అందుకే ఎవరికీ చెప్పు కోలేక తమలో తాము కుమిలిపోతూ ఉంటారు. అటువంటి కుటుంబాలపై దాడులు మరిన్ని జరిగే అవకాశం ఉంది. అందుకే బాధిత కుటుంబాలు వెంటనే పోలీస్ సహాయం పొందాలి. చిన్నపిల్లల విషయంలో ఆడ, మగ అన్న తేడాను చూపించకుండా ఇద్దరిపైనా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ క్రూరులు మరో అడుగు ముందుకువేసి చైల్డ్ సెక్స్, చైల్డ్ పోర్నోగ్రఫీల రూపంలో ఈ భయంకర సంస్కృతిని ఇంటర్నెట్లో పెట్టి డబ్బు చేసుకునే పనీ చేస్తున్నారు. అంటే వీళ్లు ఈ అసాంఘిక, అమానవీయ కార్యకలాపాలను ‘మార్కెట్ సరుకు’గా మార్చేశారన్న మాట. ‘వర్జిన్ సెక్స్’ పేరుతో టీనేజ్ పిల్లలపై లైంగికదాడులు చేస్తూ అంతర్జాలంలో ఆ వీడియోలు వైరల్ చేసి డబ్బులు సంపాదించడం ఇందులో భాగంగానే చూడాలి. ఈ దాడులకు గురైన పిల్లలు క్రమంగా సెక్స్ వ్యాపారం ఊబిలో కూరుకుపోయి జీవితాలను కోల్పోతున్నారు. ఆధునిక యాంత్రిక ప్రపంచంలో తల్లిద్రండులు పిల్లలకు పట్టించుకునే తీరిక లేకపోవడం వల్ల నేరస్థులు పిల్లలను ట్రాప్ చేయగలుగుతున్నారు. అలాగే పిల్లలకు సెల్‌ఫోన్ అందుబాటులో ఉండటం వల్ల అన్నీ చూసే అవకాశం ఏర్పడుతోంది. మాదక ద్రవ్యాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఫలితంగా వారు దారితప్పుతున్నారు. టీవీల్లో ప్రసారం అవుతున్న కంటెంట్ కూడా ఈ దురాగతాలకు కారణమవుతున్నది. ఈ పరిస్థితి మారాలంటే పాఠశాల స్థాయిలోనే మోరల్ సైన్స్ క్లాస్‌లను తప్పని సరిగా విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉంది. బ్యాడ్ టచ్, గుడ్ టచ్‌ల గురించిన అవగాహన పిల్లలకు కల్పించాలి. పిల్లలపై లైంగిక దాడుల నియంత్రణ, వాటిని ఎదుర్కోవడానికి రూపొందించిన ‘పోక్సో’ తరహా చట్టాల పట్ల అవగాహన కూడా సమాజాన్ని అప్రమత్తం చేయటంలో ఉపకరిస్తాయి. (క్లిక్ చేయండి: ఆపన్నులకు ఫ్యామిలీ డాక్టర్ భరోసా) - డా. కడియం కావ్య కడియం ఫౌండేషన్ ఛైర్పర్సన్ -
బిడ్డల్ని కనే సమయాన్ని వాయిదా వేయనక్కర్లేదు! ప్రసవం తర్వాత కూడా..
స్త్రీలు తమ జీవితంలో మాతృత్వాన్ని వరంగా భావిస్తుంటారు. అయితే, మారుతున్న సమాజం, జీవన పరిస్థితులు వీటితో పాటు విభిన్న రంగాలలో.. వివిధ వృత్తులలో రాణిస్తున్న మహిళలు పనుల దృష్ట్యానో, స్థిరపడలేదనో.. బిడ్డలను కనే సమయాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. కొన్నిస్లారు వృత్తికి – అందానికి ముడిపెట్టే సందర్భాలూ తలెత్తుతుంటాయి. ఇలాంటప్పుడు వైద్యపరంగా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ కొత్త వివాదాలకు దారులు తీస్తుంటారు. సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. వీటిలో మంచీ చెడులు ఎలా ఉన్నా ప్రసవం తర్వాత స్త్రీ శారీరక స్థితిని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకోగలిగే పరిస్థితుల పట్ల అవగాహన కలిగి ఉండటం మంచిది అంటున్నారు నిపుణులు. ఇటీవల సినీనటి నయనతార సరోగసి విధానం ద్వారా ఇద్దరు బిడ్డలకు తల్లి అయ్యిందనే వార్త వైరల్ అవుతోంది. అందం ప్రధానాంశంగా ఈ వార్త చర్చనీయాంశం అయ్యింది. పిల్లలు పుట్టిన తర్వాత శరీరంలో మార్పులు చోటు చేసుకోవడం సహజంగా జరుగుతుంటుంది. అయితే, వాటి గురించి అంతగా ఆందోళన అవసరం లేదని గ్లామర్ ఫీల్డ్‌లో ఉండి తల్లి అయినవారు తమ జీవనశైలి గురించి ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తుంటారు. ఇందులో భాగంగా ఇటీవల సినీనటి కాజల్ అగర్వాల్ బిడ్డను కన్నాక తన శరీరంలో వచ్చిన మార్పులు, వాటిని అనుకూలంగా మార్చుకునే పద్ధతుల మీద రిలీజ్ చేసిన నోట్ కూడా వైరల్ అవుతోంది. ఇలాంటప్పుడు కుటుంబ, సామాజిక, ఆరోగ్యకరమైన జీవనశైలికి స్వయంగా తీసుకోదగిన నిర్ణయాల్లో అవగాహన ప్రధాన అంశం అవుతుంది.. ♦ నాలుగు నెలల నుంచి.. మాతృత్వపు ఆనందాన్ని పొందుతూనే వృత్తిపరంగా తనను తాను మలుచుకుంటున్న కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న స్వీయఅనుభవాలలో ‘మాతృత్వం అంటే కెరీర్‌కు ముగింపు కాదు. కెరీర్ గురించి ఆలోచిస్తున్నామంటే బిడ్డను నిర్లక్ష్యం చేయడం కాదు. ఒకటి కావాలంటే ఒకటి కోల్పోతాం అనే భావన కానీ, గిల్టీగా ఫీలవ్వాల్సిన అవసరమే లేదు. ప్రసవం తర్వాత వర్క్‌లోకి వెళ్లడానికి కొంత సమయం పట్టచ్చు. కానీ, మన ప్రాధాన్యతలను సెట్ చేసుకుంటే ప్రతీది సరిగ్గా, సులభంగా చేయచ్చు. నేను ప్రసవం అయ్యాక నాలుగు నెలల నుంచి తిరిగి పని చేయడం మొదలుపెట్టాను. ముందు నా శరీరం ఎలా ఉండేదో.. తర్వాత ఎలా ఉంటుందో అనే ఆలోచన నాకు లేదు. బిడ్డ పుట్టడం అనుభూతిని నేను పొందగలిగాను. శారీరక శ్రమ ద్వారా నా బాడీని నేను కాపాడుకోగలనన్న నమ్మకం నాకుంది. అందుకు జిమ్‌కు వెళుతున్నాను. గుర్రపు స్వారీ మునుపటి కన్నా కష్టంగా ఉన్నట్టు మొదట్లో అనిపించింది. మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ కూడా అలాగే అనిపించింది. నా శక్తిస్థాయిలను తిరిగి పొందడానికి చేసే ప్రక్రియ మునుపటి కన్నా కొంత కష్టమైనదే. కానీ, తిరిగి నైపుణ్యాల సాధనను ఒక హాబీగా కొనసాగించేందుకు ప్రయత్నించాను. ఇప్పుడు ఈ ప్రక్రియ నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది’ అని రాసిన ఈ నోట్ ఎంతో మంది తల్లులకు స్ఫూర్తినిస్తుంది. ♦ రెండు నెలల నుంచి .. ఇరవై ఏళ్లుగా హెల్త్ అండ్ ఫిట్నెస్ మోటివేటర్‌గా ఉన్న అనుప్రసాద్ ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ– ‘నార్మల్ డెలివరీ అయినవాళ్లు రెండు నెలల నుంచీ, సిజేరియన్ అయితే ఆరు నెలల నుంచి జిమ్‌లో వ్యాయామాలు చేయచ్చు. ముందుగా వారి వివరాలను జిమ్ ట్రైనర్‌కి చెప్పి, తగిన వ్యాయామాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇరవై ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నాను, ఎంతో మంది మహిళలకు ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇచ్చాను. బాడీఫిట్నెస్కు కృషి చేసేవారిలో అమ్మాయిలే కాదు, అమ్మలూ ఉన్నారు. ప్రసవం తర్వాత కొన్నాళ్ల పాటు పిల్లల పనులు, ఇంటి పనులతో తీరికలేదని.. వ్యాయామం అనే ఆలోచన చేయరు. దీంతో పాటు వీరు తీసుకునే ఆహారం సరైనదిగా ఉండకపోవడంతో శరీరంలో మరిన్ని మార్పులు వస్తాయి. అందుకే, చాలా మందిలో ‘పిల్లలు పుట్టాక శరీరం లావు అవుతుంది లేదంటే, షేప్ ఉండదు..’ అనుకుంటారు. కానీ, నిజానికి తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది’ అని వివరించారు. ♦ ఆరు వారాల నుంచి.. ప్రసవం తర్వాత తల్లులకు చెప్పే జాగ్రత్తలలో వ్యాయామం తప్పనిసరిగా ఉంటుందంటున్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ శిరీష. ‘ప్రీ ప్రెగెన్సీలో ఉన్న ప్రతి సిస్టమ్ ప్రసవం తర్వాత ఆరు వారాల సమయంలో సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఈ సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తపడమని చెబుతాం. అలాగే, కొద్ది రోజులు బరువులు ఎత్తకుండా సాధారణ పనులు చేసుకోవచ్చు. మంచి ప్రొటీన్స్ ఉన్న పోషకాహారం తీసుకోవాలి. సిజేరియన్ అయితే గాయం మానడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు ఇంటి వద్ద చేయదగిన వ్యాయామాల గురించి వివరిస్తాం’ అని తెలిపారు. అందం మాతృత్వానికి ఎప్పుడూ కొలమానం కాదు. జీవన విధానంలో వచ్చే ఆనందాలను పొందుతూనే, ఎంచుకున్న రంగంలో విజయశిఖరాలను అంతే హుందాగా పొందవచ్చు. అపోహలకు దూరం ప్రసవం తర్వాత మూడు నెలల నుంచి వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. పోస్ట్ నేటెల్ ఎక్సర్సైజులు అని ఉంటాయి. ఈ వ్యాయామం వల్ల చర్మం, కండరాలు తిరిగి వాటి సాధారణ స్థితికి వచ్చేస్తాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల అందం పోతుందని కూడా చాలా అపోహలు ఉన్నాయి. ఎక్కువ సేపు ఫీడింగ్ ఇవ్వకుండా ఉన్నా సమస్యలు తలెత్తుతాయి. ప్రతి రెండు గంటలకు ఒకసారి బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలి. మన జీవన శైలి సరిగ్గా ఉంటే శరీరాకృతిలో పెద్ద మార్పులు రావు. – డాక్టర్ శిరీషారెడ్డి, గైనకాలజిస్ట్ తగినంత సాధన జిమ్‌లో వ్యాయామాలు చేయాలనుకున్నవారు ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. వారి ఇతరత్రా ఆరోగ్య సమస్యలను బట్టి నెమ్మదిగా వ్యాయామాలు మొదలుపెట్టవచ్చు. ఒకేసారి వర్కౌట్స్ కాకుండా లైట్‌వెయిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నుంచి రోజూ కొద్దిగా టైమ్‌ను పెంచుకుంటూ శరీరానికి వ్యాయామం అలవాటు చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. దీంతో వారి పూర్వపు శరీరాకృతి వచ్చేస్తుంది. వాకింగ్ వంటి ఫిజికల్ యాక్టివిటీ రోజూ గంట సేపు చేసినా మంచి ప్రయోజనం ఉంటుంది. దీంతో పాటు నూనె, చక్కెర, జంక్ పదార్థాలు కాకుండా మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకుంటే ఆరోగ్యంగానూ, యాక్టివ్‌గానూ ఉంటారు. – అనుప్రసాద్, హెల్త్ అండ్ ఫిట్నెస్ మోటివేటర్ – నిర్మలారెడ్డి -
కులరహిత సమాజం కోసం...
ఎడ్మండ్ బర్క్ అనే ఐరిష్ తత్వవేత్త ‘నిజమైన మతమే సమాజానికీ, మానవీయ ప్రభుత్వానికీ పునాది’ అని పేర్కొన్నాడు. ఉదాహరణకు చైనాలో కమ్యూనిజం విజయం సాధించడానికి బుద్ధిజం కారణమని చెప్పవచ్చు. హిందూ దేశంగా ప్రసిద్ధిగాంచిన భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు గడిచిపోయినప్పటికీ కుల అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా సామాజిక సంబంధాల్లో మార్పు లేకుండా ఉండటానికి హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థే కారణం. ఎందుకంటే కులాలు జన్మించినవే హిందూ మతానికి చెందిన శాస్త్రాల నుండి కనుక. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పౌరులకు రాజ్యాంగబద్ధంగా సమస్త హక్కులను కల్పించి కుల నిర్మూలన, సమ సమాజ స్థాపనే రాజ్యాంగం లక్ష్యంగా నిర్ధారించారు. ఆర్థిక, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో సంస్కరణలు చేయడం వల్ల మాత్రమే సమాజంలో మార్పు తేలేం. మతంతో సంబంధం లేని సామాజిక సంస్కరణలు తేవడం వలన సమాజంలో కొంత మార్పును మాత్రమే తేగలం. అదే మతంతో ముడిపడి ఉన్న సంస్కరణలైతే అత్యధిక మార్పులు తేవచ్చు. అయితే ఇందుకోసం మత సంస్కరణ జరగాలి. మత సంస్కరణలు చెయ్యలేని సందర్భంలో మతంతో ముడిపడి ఉన్న సమస్యలను రాజ్యాంగ సవరణల ద్వారా అధిగమించవచ్చు. ఫలితంగా సామాజిక దొంతర మారే అవకాశం లభిస్తుంది. రాజ్యాంగ సవరణలు ద్వారా అమెరికా, దక్షిణ ఆఫ్రికా దేశాల్లో మన కుల వ్యవస్థను పోలిన జాతి వివక్షను నిషేధించడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసు కోవాలి. దక్షిణాఫ్రికాలో 1948లో అక్కడి నేషనల్ పార్టీ వారు తెలుపు–నలుపు ప్రజల మధ్య జాతి వివక్షను చట్టబద్ధమైనదిగా మార్చారు. అయితే ఆ సమయంలో ప్రభుత్వం అమలు చేసిన విధానానికి మద్దతు పలు కుతూ కొంతమంది క్రైస్తవులు బైబిల్‌ను దుర్వినియో గించారు. దేవుడు అందరినీ సమానంగా సృష్టించాడు అని బైబిలు చెప్పినప్పటికీ కొందరు శ్వేత జాతి మత పెద్దలు వారి ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇలా చేశారు. అయితే అక్కడి ప్రభుత్వం మత సంస్కరణలు చేయలేని పరిస్థితుల్లో 1994లో రాజ్యాంగ సవరణల ద్వారా సమాజంలో వర్ణవివక్ష లేని సమాజాన్ని స్థాపించింది. అమెరికాలో కూడా 1865లో 13వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతి ఆధారిత బానిసత్వాన్ని తొల గించి అందరూ సమానులే అని నిర్ధారించి తద నంతరం అనేక సవరణల ద్వారా సమ సమాజాన్ని స్థాపించారు. (క్లిక్: సామాన్య శూద్రుడికి సెయింట్‌హుడ్) దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లవుతున్నా, పరువు హత్యల పేరున కులాంతర వివాహం చేసుకున్న దంపతులను హత్య చేస్తున్నారు. ఇలాంటి హత్యలు దేశంలో మానవ జాతికే కళంకం తెస్తున్నాయి. ఇలాంటి తరుణంలో... మన దేశంలో హిందూ మతంలో సంస్కరణలు, హిందూ మత గ్రంథాల సవరణలు సాధ్యమయ్యేపని కాదు. కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యంగ పీఠిక, అధికరణల మేరకూ; సుప్రీంకోర్టు 2011లో కె.కె. భాస్కరన్ వర్సెస్ స్టేట్ అఫ్ తమిళనాడు, నందిని సుందర్ వర్సెస్ స్టేట్ అఫ్ ఛత్తీస్‌గఢ్ కేసుల్లో ఇచ్చిన తీర్పుల ప్రకారం... దేశంలో పౌరుల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలి. తద్వారా రాజ్యాంగంలో ‘ఆర్టికల్ 17ఏ’ను చేర్చి కుల వ్యవస్థను నిషేధించాలి. అది సాధ్యం కానిపక్షంలో ‘కులాంతర వివాహాల పరిరక్షణ’ చట్టాన్ని ఏర్పాటు చేసి పక డ్బందీగా అమలు చెయ్యాలి. ప్రాథమిక విద్యాభ్యాసం నుండి విద్యార్థులకు దేశాన్ని పీడిస్తున్న కుల సమస్యను నిర్మూలించడానికి తగు విధానాలను నేర్పించాలి. లేనట్లయితే రాజ్యాంగ లక్ష్యమైన కులరహిత సమాజాన్ని స్థాపించడం అసాధ్యం. (క్లిక్: మతాలు కాదు... మనిషే ప్రధానం) - కోడెపాక కుమార స్వామి వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు -
కుల సమాజమే కానీ...
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ... దేశంలో మత అసహనం, హిందువుల్లో ఉన్మాదం పెరుగుతోందని; ప్రజాస్వామ్య సంస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నాయనీ బీజేపీ వ్యతిరేక పార్టీలు చేస్తున్న ఆరోపణలలో నిజం ఎంత అనే విషయాన్ని వాస్తవిక దృష్టికోణంలో పరిశీలించాలి. హిందుత్వ సంస్థలు హిందువులను రెచ్చగొడుతున్నాయనీ, మైనారిటీలపై ముఖ్యంగా... ముస్లింలపై విద్వేషాన్ని, పగను ప్రోది చేస్తున్నాయని ఆ పార్టీల ఆరోపణ! వాస్తవంగా ఈ దేశంలో హిందువులు ఒక మత సమూహం కాదు. ఇది కులపరంగా విభజితమైన సమాజం. ఈ సమాజంలో అనాదిగా అసంఘటిత ఛాయలే దర్శనమిస్తున్నాయి. ఈ సమాజం నుండి రాజకీయంగా ఎదిగిన నాయకులందరూ కులపరమైన ఆలోచనా దృక్పథంతోనే ఉంటారు. అంతేకానీ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి ఇత్యాది విషయాలను అర్థం చేసుకునే స్థాయి వీరికి ఉండదు. అదే ఉంటే దేశ విభజన జరిగేది కాదు. కశ్మీర్ రావణ కాష్ఠం అయ్యేది కాదు. కాశ్మీరు లోయ నుండి 3 లక్షల మంది హిందువులను తరిమివేయడం జరిగేది కాదు. హిందువులందరూ ఒకే సమూహం అనే భావం ఉన్నట్లయితే ఈ ఘటనలన్నింటికీ ప్రతిచర్యలు వేరే విధంగా ఉండేవి. ఈ దేశంలో మైనారిటీల పట్ల లౌకికవాద పార్టీ నాయకులు అందరూ మూకుమ్మడిగా ఒకే మాట మీద ఉండటంతో... కులాల వారీగా విభజితమైన హిందువుల్లో అసంతృప్తి, ఆవేదన పుట్టుకొచ్చి కొంత చైతన్యం అంకురించింది. దాన్ని హిందుత్వ రాజకీయ పార్టీ అయిన బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుని కేంద్రంలోనూ, అనేక రాష్ట్రాలలోనూ అధికారంలోకి వచ్చింది అనేది వాస్తవం. (క్లిక్: ఇలా ఎన్ని పేర్లు మారుద్దాం?) లౌకిక వాదులుగా చెప్పుకునేవారు ప్రధాని మోదీపై వ్యతిరేకత, ద్వేషాలను.. దేశంపై వ్యతిరేకతగా మార్చుకోవడం.. వారి విచిత్రమైన భావదాస్యపు ఆలోచనకు ప్రతీక! ప్రపంచంలో ఏ దేశంలోనూ మన దేశంలోని మైనార్టీలు అనుభవించే స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు కనిపించవు. పాక్ వంటి చోట్ల దేశ విభజన తర్వాత హిందూ జనాభా తగ్గిపోతుంటే.. మనదేశంలో మాత్రం ముస్లిం జనాభా పెరిగిపోవడం మైనారిటీలకు ఇక్కడ ఉన్న స్వేచ్ఛకు సంకేతంగా చెప్పవచ్చు. (క్లిక్: ఆ హత్యను ఖండిస్తున్నాం) – ఉల్లి బాల రంగయ్య రాజకీయ, సామాజిక విశ్లేషకులు -
తీర్పుల్లో మానవీయ కోణం
చెన్నై/సాక్షి ప్రతినిధి, చెన్నై: న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు నిబంధనలు, పద్ధతులను గుడ్డిగా అనుసరించరాదని, మానవీయ కోణాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. తీర్పులిచ్చే ముందు సామాజిక–ఆర్థికాంశాలను, సమాజంపై వాటి ప్రభావాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ‘‘నేటి ఇన్స్టంట్ నూడుల్స్ కాలంలో జనం కూడా ఇన్స్టంట్ జస్టిస్ (తక్షణ న్యాయం) కోరుకుంటున్నారు. దానివల్ల అసలైన న్యాయానికి అన్యాయం జరుగుతుందనే నిజాన్ని అర్థం చేసుకోవడం లేదు’’ అన్నారు. చెన్నైలో మద్రాస్ హైకోర్టు ప్రాంగణంలో పరిపాలనా భవన నిర్మాణానికి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, కోర్టులతో న్యాయం జరుగుతుందని సామాన్య జనం గట్టిగా నమ్ముతున్నారని పేర్కొన్నారు. అయితే, ‘‘కోర్టుల పద్ధతులు, భాషతో వారు మమేకం కాలేకపోతున్నారు. న్యాయ వ్యవస్థలో సామాన్యులను సైతం భాగస్వాములుగా మార్చాలి. పెళ్లి మంత్రాల్లా కాకుండా కోర్టు వ్యవహారాలను, కేసుల పురోగతిని కక్షిదారులు అర్థం చేసుకోగలగాలి’’ అన్నారు. న్యాయ వ్యవస్థ, సంస్థల బలోపేతానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నానని వివరించారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉందన్నారు. తీర్పు ఇవ్వడం అనేది కేవలం రాజ్యాంగ ధర్మం కాదు, అదొక సామాజిక బాధ్యత అని వెల్లడించారు. న్యాయమూర్తులు ఎప్పటికప్పుడు పరిజ్ఞానం పెంచుకోవాలని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. హైకోర్టుల్లో స్థానిక భాషలను ప్రవేశపెట్టడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. సమీప భవిష్యతులో ఈ సమస్య పరిష్కారమవుతున్న నమ్మకం తనకు ఉందన్నారు. కృత్రిమ మేధ (ఏఐ)తో ఇది సాధ్యం కావొచ్చని అభిప్రాయపడ్డారు. గుర్తింపును, భాషను, సంస్కృతిని కాపాడుకోవడంలో తమిళ ప్రజలు ముందంజలో ఉంటారని ప్రశంసించారు. కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాల కోసం సుప్రీంకోర్టు బెంచ్‌ను చెన్నైలో ఏర్పాటు చేయాలని స్టాలిన్ ఈ సందర్భంగా సీజేఐని కోరారు. మాతృభాషను మరవొద్దు మాతృభాష పరిరక్షణ విషయంలో తెలుగువారు తమిళులను ఆదర్శంగా తీసుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ ఉద్బోధించారు. చెన్నైలో ప్రపంచ తెలుగు సమాఖ్య (చెన్నై) 29వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘‘తెలుగు వారిని ఒకప్పుడు మదరాసీలు అనేవారు. తెలుగు భాష, సంస్కృతికి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్‌ను ఈ సమయంలో స్మరించుకోవాలి. తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలని ఇటీవల తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిసినప్పుడు కోరా. చెన్నైలో ఒకప్పుడు తెలుగు వారు కూడా భాగస్వాములే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయాక కర్నూలు, తర్వాత హైదరాబాద్, ప్రస్తుతం అమరావతిని రాజధానులుగా చేసుకున్నాం. మాతృభాషలో మాట్లాడేందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను డిగ్రీ దాకా తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నా’’ అని చెప్పారు. తెలుగు ప్రజలు తమ మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దని సూచించారు. ఇతర భాషలు కూడా నేర్చుకోవాలని, మాతృభాషలో మాట్లాడడం వల్ల ప్రావీణ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. -
దర్యాప్తుపై ‘ముద్ర’కు సీఐడీ వెనకడుగు!
సాక్షి, హైదరాబాద్: కుంభకోణాల్లోనే ఈ సొసైటీది ప్రత్యేక ‘ముద్ర’. ఏకంగా తన ఉద్యోగులందరికీ టోకరా వేసింది. పెద్ద ఎత్తున రైతులకు కుచ్చుటోపి పెట్టింది. వీరి వద్ద నుంచి సుమారు రూ.200 కోట్ల మేర స్వాహా చేసింది. అయితే ఈ సొసైటీ అక్రమాలపై దర్యాప్తునకు సీఐడీ వెనుకడుగు వేయడం గమనార్హం. అదే ‘ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’. నల్లగొండ, రామాయంపేట, హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఈ సొసైటీపై కేసులు నమోదయ్యాయి. ఇదీ కుంభకోణం కథ... తిప్పినేని రామదాసప్పనాయుడు అనే వ్యక్తి చైర్మన్‌గా ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఏర్పాటైంది. ఇది ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీం కింద ఏర్పాటు చేసిన సంస్థగా అందరినీ నమ్మించాడు. హైదరాబాద్‌లోని నల్లకుంటలో హెడ్ ఆఫీస్ ఏర్పాటు చేశాడు. అగ్రికల్చర్ సొసైటీ పేరుతో ప్రతి జిల్లాల్లో రైతుల నుంచి రూ.50 వేల చొప్పున డిపాజిట్లు వసూలు చేశాడు. మండలాలు, డివిజన్లలో సొసైటీ కార్యాలయాలను ఏర్పాటు చేసి మేనేజర్, క్యాషియర్ లాంటి ఉద్యోగులను నియమిం చాడు. రెండేళ్ల తర్వాత సొసైటీ పూర్తిస్థాయిలో బ్యాంకుగా మారుతుందని చెప్పి ఒక్కో ఉద్యోగి నుంచి రూ.లక్ష వసూలు చేసి ఒరిజినల్ సర్టిఫికెట్లను తన వద్ద సెక్యూరిటీగా పెట్టించుకున్నాడు. నెలకు రూ.20 వేల జీతం చెల్లిస్తానని చెప్పి రూ.4 వేలు, రూ.8 వేల చొప్పున చెల్లిస్తూ వచ్చాడు. అయితే మూడు నెలల్లోనే రామదాసప్పనాయుడు నుంచి ఉద్యోగులకు వేధింపులు మొదలయ్యాయి. డిపాజిట్ల రూపంలో మరింత ఎక్కువ సొమ్ము వసూలు చేయాలని హుకుం జారీచేశాడు. దీంతో ఉద్యోగులు ఒత్తిడికిలోనై రాజీనామాలు సమర్పించగా క్రిమినల్ కేసులు పెట్టిస్తానని, అసాంఘిక శక్తులతో సంబంధాలున్నాయని వేధించాడు. ఒరిజినల్ సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వాలని కోరగా ప్రతి ఉద్యోగి 10 లక్షలు కట్టాలని బెదిరించాడు. దీనితో బాధిత ఉద్యోగులంతా పోలీసులను ఆశ్రయించారు. రూ.200 కోట్లకుపైగా వసూలు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాల పేరుతో 1,780 మంది నుంచి రూ.లక్ష నుంచి ఆపై మొత్తం లో వసూలు చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. రైతులకు రుణాలు, ఇతర వ్యవసాయ సంబంధిత స్కీంల పేరుతో భారీగానే వసూలు చేసినట్టు ఆ ఉద్యోగులు వెల్లడించారు. ఇలా మొత్తంగా రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు వసూలు చేసి ఉంటాడని పోలీస్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ డబ్బుతో పక్క రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. వాటిని స్వాధీనం చేసుకుంటేగానీ బాధితులకు న్యాయం చేయలేమని పోలీసులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను సీఐడీకి బదిలీ చేసి విచారణ పక్కాగా జరిగేలా చూడాలని దర్యాప్తు అధికారులైన పలువురు సీఐలు, ఎస్ఐలు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. ఈ మేరకు ఎస్పీలు, కమిషనర్లు సీఐడీకి లేఖలు రాసినా పట్టించుకోవడంలేదు. స్కామ్ సొమ్ముతో కొనుగోలు చేసిన భూములను స్వాధీనం చేసుకోవాలంటే హైదరాబాద్ సీసీఎస్‌తోపాటు సీఐడీకి మాత్రమే అధికారాలున్నాయి. -
టెక్ సంస్థలకు జవాబుదారీతనం ఉండాలి
న్యూఢిల్లీ: ఫేస్బుక్, గూగుల్ వంటి బడా టెక్ కంపెనీలు.. సమాజం పట్ల జవాబుదారీతనంతో ఉండేలా చూసేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ఈ దిశగా భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను.. వాక్ స్వాతంత్య్రానికి వ్యతిరేకమైనవిగా ప్రచారం చేయరాదని ఆయన స్పష్టం చేశారు. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిర్వహించిన వార్షిక ఎన్టీఎల్ఎఫ్ (నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ప్రోగ్రాం) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చంద్రశేఖర్ ఈ విషయాలు తెలిపారు. దేశీయంగా పరిస్థితుల రీత్యా అభ్యంతరమైన కంటెంట్‌ను తొలగించాలంటూ యూట్యూబ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను ప్రభుత్వం ఇటీవల తరచుగా ఆదేశిస్తుండటాన్ని.. వాక్స్వాతంత్య్రంపై దాడిగా కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘బడా టెక్ కంపెనీలు, టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లు తాము సర్వీసులు అందించే సమాజం, వర్గాల పట్ల మరింత జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడాలంటే, దేశాలు పరస్పరం సహకరించుకోవాలి‘ అని చంద్రశేఖర్ చెప్పారు. సైబర్ నేరాలు, సైబర్‌భద్రత తదితర అంశాల్లో పాటించాల్సిన నియంత్రణపరమైన సూత్రాలను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. డేటా భద్రత బిల్లుకు మరింత సమయం.. డేటా భద్రత బిల్లును ప్రవేశపెట్టడంపై జాప్యం జరిగే అవకాశం ఉందని మంత్రి ఈ సందర్భంగా సూచనప్రాయంగా తెలిపారు. దీనిపై హడావుడిగా చట్టం చేసి ఆ తర్వాత సవరణలు చేస్తూ పోయే యోచన ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ బిల్లుకు మద్దతుగా, వ్యతిరేకంగా భారీ స్థాయిలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని, అనేక సలహాలు.. సూచనలు కూడా వస్తున్నాయని ఆయన తెలిపారు. వీటన్నింటిపై చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు. గోప్యతకి సంబంధించిన ఆందోళనలపై స్పందిస్తూ.. భద్రత, నమ్మకం, జవాబుదారీతనం, స్వేచ్ఛ మొదలైనవన్నీ పరస్పర విరుద్ధమైన సూత్రాలని.. సౌలభ్యాన్ని బట్టి ఎంచుకోవడం మారుతూ ఉంటుందని చంద్రశేఖర్ చెప్పారు. అయితే, ప్రభుత్వ విధానాల రీత్యా భద్రత, నమ్మకం అత్యంత ముఖ్యమైనవిగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ‘దేశాన్ని డిజిటైజ్ చేయడం ఎంత ముఖ్యమో, మన ప్రజాస్వామ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవడం .. వినియోగించే టెక్నాలజీ విశ్వసనీయమైనదిగా, జవాబుదారీతనంతో కూడుకున్నదై ఉండేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం‘ అని మంత్రి అభిప్రాయపడ్డారు. 55 వేలకు పైగా ఫ్రెషర్ల హైరింగ్: ఇన్ఫీ దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా భారీగా నియామకాలు చేపట్టనుంది. సుమారు 55,000 మంది పైచిలుకు ఫ్రెషర్లను నియమించుకునే యోచనలో ఉంది. ఎన్టీఎల్ఎఫ్లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీఈవో సలిల్ పరేఖ్ ఈ విషయాలు తెలిపారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాలేజ్ గ్రాడ్యుయేట్ల నియామకాలు 55,000 స్థాయిలో ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా ఇదే స్థాయిలో లేదా ఇంతకన్నా ఎక్కువే రిక్రూట్ చేసుకుంటాం‘ అని వివరించారు. ఇంజినీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్లకు టెక్నాలజీ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని పరేఖ్ తెలిపారు. ఆవిష్కరణలపై కంపెనీలు దృష్టి పెట్టాలి: విప్రో సీఈవో థియెరీ కొత్త ఆవిష్కరణలను రూపొందించడంపై కంపెనీలు మరింతగా కసరత్తు చేయాలని ఎన్టీఎల్ఎఫ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విప్రో సీఈవో థియెరీ టెలాపోర్ట్ అభిప్రాయపడ్డారు. ఈ టెక్నాలజీ దశాబ్దంలో మరింత సమర్ధత పెంచుకోవడం, బాధ్యతాయుతంగా పనిచేయడంపై దృష్టి పెట్టడంతో పాటు ప్రతిభావంతులను అట్టే పెట్టుకునేలా తమ విధానాలను సవరించుకోవాలని సూచించారు. అన్ని పరిశ్రమలు, మార్కెట్లలోని సంస్థలు తమ వ్యాపార సమస్యలను పరిష్కరించుకునేందుకు డిజిటల్ బాట పడుతున్నాయని, రాబోయే సంవత్సరాల్లో ఈ ధోరణి మరింతగా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. -
అమ్మాయిలకు అద్దె ఇళ్ల కష్టాలు.. బౌన్సర్లతో బెదిరింపులు
చదువుకునేందుకు ఉద్యోగాలు చేసేందుకు నగరాలకు వచ్చే అమ్మాయిలు, మహిళలకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ఒంటరి మహిళలు, పెళ్లికాని అమ్మాయిలకు ఇళ్లు ఇవ్వమంటూ అపార్ట్మెంట్ సొసైటీలు విద్యార్థినులు, లేడీ ఎంప్లాయిస్‌ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కేవలం అమ్మాయిలు ధరించే దుస్తులు సరిగా లేవన్న కారణంతో ఈ దారుణానికి అపార్ట్మెంట్ సొసైటీ సభ్యులు తెగబడుతున్నారు. కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇంత కాలం ఇళ్లకే పరిమితమై వర్క్ ఫ్రం హోంలో ఉన్న ఉద్యోగులు ఆఫీసుల బాట పడుతున్నారు. ఉన్నత విద్య కోసం గ్రామాలను వదిలిన విద్యార్థినులు నగరాల బాట పడుతున్నారు. అయితే ఇలా వస్తున్న మహిళల పట్ల కొందరు ఛాందసవాదులు పెడుతున్న రూల్స్ ఇబ్బందికరంగా మారుతున్నాయి. అహ్మదాబాద్‌లో వ్యాపార వాణిజ్య రంగాల్లో మెట్రో నగరాల సరసన చేరేందుకు వడివడిగా అడుగులు వస్తోంది అహ్మదాబాద్. ఈ నగరంలో ఎన్నో అంతర్జాతీయ సంస్థల కార్పొరేట్ ఆఫీసులు, జాతీయస్థాయి విద్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ పని చేసేందుకు, చదువుకునేందుకు గుజరాత్ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి చాలా మంది అహ్మదాబాద్ చేరుకుంటారు. స్థానికంగా ఉన్న ఇళ్లలో పేయింగ్ గెస్టులుగా, ఇళ్లలో, అపార్ట్మెంట్లలో అద్దెకు ఉంటున్నారు. నిన్నామొన్నటి వరకు ఇలా ఉండే వారికి ఏ ఇబ్బందులు లేవు, కానీ తాజాగా అమ్మాయిలు, మహిళలను టార్గెట్‌గా చేసుకుని కొత్త రూల్స్ పెడుతున్నారు. అమ్మాయిలకు ఇవ్వం అహ్మదాబాద్‌లో గత కొద్ది కాలంగా చాపకింద నీరులా కొత్త రకం ప్రచారం తెరపైకి తెచ్చారు. పెళ్లైన జంటలకే ఇళ్లు అద్దెకు ఇవ్వాలి తప్పితే సింగిల్‌గా ఉండే అమ్మాయిలు, మహిళలకు ఇల్లు అద్దెకు ఇవ్వొద్దంటూ ప్రచారం ప్రారంభించారు. కనీసం పెయింగ్ గెస్టులుగా కూడా ఇళ్లలో ఉండనివ్వరాదంటూ హుకుం జారీ చేస్తున్నారు. చాలా మంది మౌనంగా ఈ ఇబ్బందులు పడుతున్నారు. కాదని ఎదురు తిరిగితే దాడులకు తెగబడుతున్నారు. దీనికి సంబంధించి ఇటీవల జరిగిన ఓ ఘటన అహ్మాదాబాద్ మిర్రర్లో ప్రచురితమైంది, దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బౌన్సర్లతో దాడులు అహ్మదాబాద్‌లోని వైష్ణోదేవీ ఏరియా సమీపంలో ఉన్న రత్నా పారడైజ్ అపార్ట్మెంట్ సొసైటీ సభ్యులు మహిళల పట్ల కఠిన ఆంక్షల విషయంలో మరింతగా దిగజారారు. తమ అపార్ట్మెంటులో ఉంటున్న నిర్మా యూనివర్సిటీ విద్యార్థినులను ఫ్లాట్ ఖాళీ చేయాలంటూ ఆగస్టు 27న ఆదేశించారు. దీనికి వారు అంగీకరించకపోవడంతో బౌన్సర్లతో బెదిరించారు. కాలేజీ నుంచి అపార్ట్మెంట్కి వచ్చిన స్టూడెంట్స్‌ని గేటు దగ్గరే గంటల తరబడి నిలబెట్టారు. వర్షంలో తడుస్తున్నా లోనికి రానివ్వలేదు. పోలీస్ స్టేషన్లో అదే తీరు సోసైటీ సభ్యుల వేధింపులను ఆ విద్యార్థినులు ప్లాట్ యజామాని యోగేష్ పటేల్ దృష్టికి తీసుకెళ్లారు. సోసైటీ సభ్యుల తీరుని ప్లాట్ యజమాని ఖండించగా మరుసటి రోజు బౌన్సర్లు అతనిపై దాడికి పాల్పడ్డారు. వెంటనే జిల్లా రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్ సొసైటీ ఆఫీసులో జరిగిన ఘటనపై అతను ఫిర్యాదు చేశాడు. ఇది జరిగిన రెండు రోజులకు ఆగస్టు 29న యోగేష్ పటేల్‌కి స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి పిలుపు వచ్చింది. అతనిపై నాలుగు ఫిర్యాదు వచ్చాయని, వాటిపై విచారణ చేయాలంటూ.. యోగేష్ పటేల్‌తో పాటు అతని భార్యా పిల్లలను ఆ రోజంతా స్టేషన్లోనే ఉంచారు. చివరకు సొసైటీపై రిజిస్ట్రార్ ఆఫీసులో ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చారు. అయితే పోలీసులు ఈ ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు. మమ్మల్నీ ఇబ్బంది పెట్టేందుకే మా సొసైటీలో బ్యాచ్‌లర్స్‌కి ఇళ్లు అద్దెకు ఇవ్వొద్దని ముందే చెప్పాం. కానీ యోగేష్ పటేల్ ఆ నిబంధన ఉల్లంఘించాడు. దాన్ని కప్పి పుచ్చుకునేందుకే మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు అంటూ మరో సొసైటీ మెంబర్ కరణ్ కియాని అంటున్నారు. వాళ్ల దుస్తులు బాగాలేవు నిర్మా యూనివర్సిటీ విద్యార్థులతో మాకు ఏ సమస్యా లేదు. అయితే అప్పుడప్పుడు వారు ధరించే దుస్తులు మాకు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాంటి దుస్తులతో వారు అపార్ట్మెంట్లో తిరగడం మాకు ఇబ్బందిగా ఉంటోంది. అందుకే ఖాళీ చేయమని కోరుతున్నాం అంటూ అరుణ్ జోషి అనే సొసైటీ మెంబర్ మీడియాకు తెలిపారు. ఇంకెక్కడ భద్రత రత్నా సొసైటీలోని ప్లాట్స్‌లో నేను అమ్మాయితో పాటే ఉంటున్నాను. తనకు కాలేజీకి వెళ్లడం, ఇంటికి వచ్చి చదువుకోవడం తప్ప మరో ధ్యాసే ఉండదు. అలాంటిది ఇప్పుడు మమ్మల్ని ప్లాటఠ్ ఖాళీ చేయమనడం ఎంత వరకు సబబు. ఫుల్ సెక్యూరిటీ ఉండే అపార్ట్మెంట్లోనే మాకు రక్షణ లేకుండా ఇంకా ఎక్కడ దొరకుతుంది అంటూ బాధిత విద్యార్థినుల తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. డీజీపీకి చేరిన పంచాయతీ తమను ఇళ్లు ఖాళీ చేయించేందుకు పారడైజ్ అపార్ట్మెంట్ సొసైటీ బలవంతం చేయడంపై బాధిత విద్యార్థినులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. నిర్మా యూనివర్సిటీలో విద్యార్థులు అందరికీ సరిపడ వసతి లేదని, అందువల్లే తాము బయట ప్లాట్‌లో ఉంటూ చదువుకుంటున్నామని వివరించారు. ఇప్పుడు బలవంతంగా తమను ప్లాట్ ఖాళీ చేయిస్తే ఎక్కడికి పోవాలంటూ ప్రశ్నించారు. తమను బెదిరించిన బౌన్సర్లు, ఇబ్బంది పెడుతున్న సొసైటీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రియల్టర్ల ఆందోళన పెద్ద నగరాల్లో అపార్ట్మెంట్ల అద్దె అనేది ఎంతో ముఖ్యమైన బిజినెస్ అని.. కేవలం పెళ్లైన వారికే వాటిని అద్దెకు ఇవ్వాలంటూ నిబంధనలు పెడితే ఇళ్ల అమ్మకాలు పడిపోతాయని రియల్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ సెక్టార్లో ఇండిపెండెంట్‌గా పని చేస్తున్న యువతులు అహ్మాదాబాద్‌కు వచ్చేందుకు వెనుకంజ వేస్తారని చెబుతున్నారు. - సాక్షి, వెబ్ ప్రత్యేకం చదవండి : ఒంటరి మహిళల ఉమ్మడి శక్తి -
జూబ్లీహిల్స్ సొసైటీ అక్రమాలు.. రంగంలోకి పోలీసులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నూతన పాలక మండలి అక్రమాల ఆరోపణలపై పోలీసులు రంగంలోకి దిగారు. సొసైటీ కార్యాలయానికి చేరుకున్న జుబ్లీహిల్స్ పోలీసులు విచారణ ప్రారంభించారు. సొసైటీ ప్రెసిడెంట్ రవీంద్రనాధ్, కోశాధికారి నాగరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సొసైటీ స్థలం తక్కువ ధరకు అమ్మి రూ.5 కోట్ల నష్టం చేశారని సభ్యుడు సురేష్ బాబు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సొసైటీ స్థలం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణను జీహెచ్ఎంసీ తొలగించింది. ప్రాథమిక సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలో సొసైటీ ప్రెసిడెంట్ రవీంద్రనాధ్, కోశాధికారి నాగరాజుకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. -
వేటపాలెం సొసైటీపై విచారణ చేపట్టాలి: కన్నబాబు
సాక్షి, విజయవాడ: ప్రకాశం జిల్లా చీరాల మండలం వేటపాలెం కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆర్థిక వ్యవహారాలపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారు. ఈ సొసైటీలో అవకతవకలు జరిగాయంటూ పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై వాస్తవాలతో నివేదిక అందజేయాలన్నారు. డిపాజిట్‌దారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నివేదిక ఆధారంగా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. సహకార శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో కలిసి పని చేస్తున్నారని మంత్రి కన్నబాబు అన్నారు. వేటపాలెం సొసైటీ కార్యదర్శి, సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సమాజం లో మద్యం అలవాటు ఎంతో ప్రభావం చూపుతుంది
-
కదులుతున్న అవినీతి డొంక: ‘పచ్చ’నేతల గుండెల్లో రైళ్లు
గండేపల్లిలో అక్రమాల తీగ లాగితే.. తొండంగిలో అవినీతి డొంక కదులుతోంది. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ముగ్గురు నేతల అండతో.. అమాయక రైతుల కళ్లుగప్పి కోట్లకు పడగలెత్తిన ‘పచ్చ’ నాయకుల పాపం పండుతోంది. సహకార వ్యవస్థను జలగల్లా పీల్చి పిప్పి చేసిన వారి బాగోతాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. గండేపల్లి సహకార సొసైటీలో జరిగిన అవినీతిపై ఓపక్క శాఖాపరమైన విచారణ జరుగుతుండగా.. మరోపక్క లోకాయుక్త కూడా సుమోటోగా విచారణ చేపట్టింది. దీంతో ఈ కుంభకోణం ‘సూత్రధారుల’ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అవినీతి కార్యకలాపాలతో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)ను నష్టాల్లో ముంచేసిన ప్రబుద్ధుల జాతకాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. టీడీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి, చంద్రబాబు సర్కార్‌లో డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న వరుపుల రాజా హయాంలో.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అమాయక రైతులను మోసం చేసి, ‘పచ్చ’నేతలు సాగించిన కోట్ల రూపాయల కుంభకోణం గుట్టు క్రమంగా వీడుతోంది. టీడీపీ పాలనలో డీసీసీబీ పరిధిలోని పలు సహకార సంఘాల్లో జరిగిన కుంభకోణాలను 2019 నవంబర్ నుంచి ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చింది. వీటిపై డీసీసీబీ ప్రస్తుత చైర్మన్ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు) స్పందించి, విచారణ జరిపించి, పలువురిపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. డీసీసీబీ సహా పలు సొసైటీల్లో అవినీతి బాగోతాలపై శాఖాపరంగా విచారణ జరుగుతుండగా.. తాజాగా తొండంగి మండలంలో రైతు రుణాల పేరిట రూ.10 కోట్లు పైనే కొట్టేసిన వారిపై లోకాయుక్త సుమోటోగా విచారణ చేపట్టింది. దీంతో సూత్రధారులైన ‘పచ్చ’నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తొండంగిలోనే రూ.10.7 కోట్ల లావాదేవీలు ప్రత్తిపాడు మండలం లంపకలోవ తరువాత ఆ స్థాయిలో కోట్ల రూపాయల అవినీతి జరిగిన సొసైటీ గండేపల్లి. ఇక్కడ అక్షరాలా రూ.23 కోట్లు అడ్డంగా బొక్కేశారు. అప్పటి టీడీపీ నేత, సొసైటీ ప్రెసిడెంట్ పరిమి బాబు కుటుంబ సభ్యులు మొదలు కారు డ్రైవర్ వరకూ.. ఇలా తెలిసిన వారందరినీ బినామీలుగా సృష్టించి సొమ్ములు దిగమింగారు. దీనిపై ప్రెసిడెంట్ సహా పలువురిపై క్రిమినల్ కేసు నడుస్తోంది. దీని విచారణలో వెలుగు చూస్తున్న వాస్తవాలు పలువురిని నివ్వెరపరుస్తున్నాయి. గండేపల్లి సొసైటీలో జరిగిన రూ.23 కోట్ల మేర కుంభకోణం జరగగా ఇందులో రూ.10.7 కోట్ల బినామీ రుణాలు తొండంగి సొసైటీ కేంద్రంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు సర్కార్‌లో అన్నీ తానుగా వ్యవహరించిన యనమల రామకృష్ణుడి సొంత మండలం తొండంగి చుట్టూ ఈ కుంభకోణం తిరగడం గమనార్హం. తొండంగి మండలమే ఎందుకంటే.. అసలు గండేపల్లి సొసైటీకి, తొండంగి సొసైటీలోని రైతులకు లింకేమిటి? అక్కడి రైతులకు రుణాలివ్వాలనే మంచి మనస్సు ‘పచ్చ’ నేతలకు ఎందుకు వచ్చిందని విచారణ చేసిన సహకార అధికారులకు నిర్ఘాంతపోయే వాస్తవాలు కళ్లకు కట్టాయి. పక్కా ప్లాన్ ప్రకారమే బినామీ రుణాలు నొక్కేయడానికే టీడీపీ నేతలు తొండంగి మండలాన్ని ఎంపిక చేసుకున్నారని రైతులు చెబుతున్నారు. అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడితో నాటి డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజాకు బలమైన బంధమే ఉండేది. రాజా రాజకీయ ఎదుగుదలకు యనమల అండదండలు దండిగా ఉండేవి. అప్పట్లో ఇద్దరూ అధికారంలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గండేపల్లి సొసైటీలో జరిగిన రూ.23 కోట్ల కుంభకోణం మూలాలు తొండంగి మండలంలో వెలుగులోకి రావడంతో టీడీపీ నేతల పాత్రపై అక్కడి రైతుల్లో అనుమానాలు బలపడుతున్నాయి. గండేపల్లి సొసైటీ రుణ జాబితా ఆధారంగా జరుపుతున్న విచారణలో ఒక్క తొండంగి మండలంలోనే ఎక్కువ మంది బినామీ పేర్లతో సొమ్ములు దిగమింగిన విషయం వెలుగులోకి వచ్చింది. టీడీపీ నేతలకు అప్పట్లో అధికార బలం ఉండడంతో తొండంగి మండలంలో ఈ రుణాలతో సంబంధం లేని అమాయక రైతుల పేర్లతో జాబితా రూపొందించారని పలువురు ఆరోపిస్తున్నారు. తొండంగిలోనే 59 మంది బినామీలు ఈ కుంభకోణానికి సంబంధించి తుని నియోజకవర్గంలో 61 మంది బినామీ రైతుల పేర్లు లెక్క తేల్చగా, వీరిలో తొండంగి మండలంలోనే 59 మంది ఉన్న విషయం డివిజనల్ సహకార అధికారి డీఆర్ రాధాకృష్ణ ప్రాథమిక విచారణలో తేలింది. తొండంగి సొసైటీ సభ్యులుగా తేలి్చన 61 మందిలో 13 మంది మాత్రమే నిజమైన వారు. మిగిలిన వారి అడ్రస్‌లే ఆ సొసైటీలో లేకపోవడం విచారణాధికారులను విస్మయానికి గురి చేసింది. ముఖ్య నేతల ‘సహకారం’ లేకుండా తొండంగి మండలంలో ఇంతటి కుంభకోణానికి ఆస్కారమే ఉండదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. యనమల రామకృష్ణుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కృష్ణుడు, వారి ముఖ్య అనుచరుడైన పోల్నాటి శేషగిరిరావు కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగిందని తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆరోపించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. చనిపోయిన రైతులు, సొసైటీ సభ్యులు కాని రైతుల పేర్లతో నకిలీ పాసు పుస్తకాలు, డాక్యుమెంట్లు తయారు చేయడమే కాకుండా వాటిని తుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మార్ట్గేజ్ కూడా చేయించినట్టు ప్రాథమిక సమాచారం. ఇటువంటి పనులు సామాన్యుల వల్ల కాదని, అప్పటి టీడీపీ నేతల హస్తం లేకుండా ఇదంతా జరగదని అంటున్నారు. 36 మంది రైతులను విచారించగా వారిలో ఏడుగురు అసలు బతికే లేకపోవడం గమనార్హం. అంతమంది అమాయక రైతుల పేర్లపై పాస్ పుస్తకాలు, డాక్యుమెంట్లు సృష్టించడం వెనుక కచ్చితంగా అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నేతల ప్రమేయం ఉంటుందని అంటున్నారు. విచారణ పూర్తయ్యేసరికి ఈ కుంభకోణంలో మరింత మంది ‘పచ్చ’ నేతల బండారాలు బయటపడటం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: విషాదం: అమ్మకు తోడుగా వచ్చి.. మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాక్ -
మేధావుల మౌనం అతి ప్రమాదకరం
మేధావులు, ప్రజాస్వామిక వాదులు, ఉద్యమ శక్తులు మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ గడ్డ పోరాటాలకు అడ్డా. ఇక్కడి మట్టి బిడ్డలకు ఆత్మ గౌరవం ఎక్కువ. ఇక్కడి మట్టికి, గాలికి, నీటికి అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉంటుంది. దుర్మార్గంపై తిరుగుబాటు చేసే స్వభావం ఉంటుంది. సమ్మక్క సారక్కల దగ్గర నుండి రాణి రుద్రమ దాకా. నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి తొలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం దాకా. సిరిసిల్ల జగిత్యాల ప్రజా ఉద్యమాల దగ్గర నుండి మలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం దాకా. ఇలా అనేక పోరాటాలను, ఉద్యమాలను నడిపిన చరిత్ర ఉంది తెలంగాణ గడ్డకు. తెలం గాణ రాష్ట్రం సాధించుకునే వరకు ఇక్కడి మేధావులు, కవులు, కళాకారులు, ప్రజాస్వామికవాదులు అందరూ సమాజంలో తమ తమ విద్యుక్తధర్మాన్ని నిర్వర్తిస్తూ వచ్చారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ బాధ్యతల నుండి చాలామంది వైదొలిగారు. ఎందుకు ఈ పరిణామం జరిగింది? దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి అనే చర్చ జరగాలి. పాలకులు చేసే తప్పులను ప్రశ్నించే దాశరథి, కాళోజి వారసులు ఇప్పుడు తెలంగాణలో లేరా! మాయమైపోయారా! రాజ్యం చేసే తప్పులపై గజ్జకట్టి డప్పుకొట్టి జన జాగృతికి నడుంబిగించిన ప్రజా కళాకారులు ఇప్పుడు ఎందుకు మౌనం దాల్చారు? జనం గొంతు వినిపించే జయశంకర్ సార్ వారసులైన మేధావులు పదవులకు పెదవులు మూశారా. తెలంగాణ వస్తే హక్కులు వస్తాయి, సామాజిక న్యాయం జరుగుతుంది, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అనుకుంటే ఉన్న హక్కులు పోతున్నాయి. ఉద్యమ వారసులు, మేధావులు, ప్రజాస్వామిక శక్తులు మౌన ముద్ర దాల్చారు. దీనికి కారణం ఏమిటి! కారకులు ఎవరు! తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు దగ్గరైన వీరు రాష్ట్రం ఏర్పడ్డాక పదవులకు ఆశపడ్డారా? పదవులు తీసుకుని సాధించుకున్న తెలంగాణను గాలికి వదిలేసి సొంత ప్రయోజనం చూసుకున్నారా? ప్రశ్నించేతత్వాన్ని, పోరాడే గుణాన్ని మొద్దుబార్చారా? తెలంగాణ సహజత్వాన్ని భ్రష్టుపట్టించారా? ఆత్మగౌరవాన్ని అటకెక్కించారా? ప్రజల వాయిస్ వినిపించే గొంతుకలను మూగనోము పట్టించారా? తెలంగాణ వస్తే ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఇలా జరుగుతుంది అంటే ప్రజలు తెలంగాణ కోసం కొట్లాడేవారు కాదేమో. యువకులు తమ నిండు ప్రాణాలను బలిదానం చేసేవారు కాదు. ఉద్యోగులు సకల జనుల సమ్మె చేసేవారు కాదు. తెలంగాణ ఉద్యమ శక్తుల శక్తిని, మేధావులకున్న బలాన్ని, కవులు కళాకారుల ఆట, పాటలకున్న పవర్‌ను ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గుర్తించాడు. ఉద్యమ సమయంలో తనకు దగ్గరైన కవులను, కళాకారులను, మేధావులను ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తరువాత వారిని తన వెంటనే తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే వీరి ప్రభావం సమాజంలో ఎలా ఉంటుందో తెలుసు కనుక, వీరిని దూరం చేసుకుంటే ఏమి జరగబోతుందో కూడా ఊహించుకున్నాడు. అందుకే అధికారంలోకి రాగానే వీరందరిని తన కబంధ హస్తాలలో బంధించాడు. కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చాడు. వారు బయటికి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేదికలు ఎక్కి ఆటపాటలు పాడకుండా కట్టడి చేశాడు.. అలాగే మేధావి వర్గానికి పదవులు ఇచ్చి పెదవులు మూయించాడు. ఉద్యమ వారసులందరినీ తన అదుపులో ఉంచుకున్నాడు. అందుకే వీవీ, సాయిబాబాల మీద కుట్ర కేసులు పెట్టి జైలుకు పంపినా. ప్రజాస్వామికవాదులను అరెస్ట్ చేసినా, ధర్నాచౌక్ ఎత్తేసి సభలు, సమావేశాలు పెట్టుకునే అవకాశం లేకుండా చేసినా ప్రశ్నించేవాడు ఉండడానికి వీలు లేదు, ఉద్యమాలు చేస్తే కేసులు పెడతామని హెచ్చరిస్తుంటే తెలం గాణ సమాజం మౌనంగా రోదిస్తోంది. మేధావులారా మేల్కొనండి. తెలంగాణకున్న పోరాటాల వారసత్వాన్ని కాపాడుకుందాం. మేధావి మౌనం సమాజానికి మంచిది కాదు. దేశ వ్యాపితంగా అప్రజాస్వామిక శక్తులు విజృంభిస్తున్నాయి. విభజన రాజకీయాలతో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే కుట్రలకు తెర లేపారు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశమైన మన దేశాన్ని మధ్యయుగాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన పదవులకు ఆశపడి మీ పాత్రను విస్మరించకండి. రాజకీయాలకు అతీతంగా ఎటువంటి వివక్షత చూపించకుండా ప్రజల పక్షాన, సమాజ హితం కోరి మీరు చూపించే మార్గం పాలకులకు దశ, దిశ కావాలి. తెలంగాణ మట్టికి, గాలికి, నీటికి ఉన్న ప్రత్యేకతను కాపాడండి. పోరాటాల వారసత్వాన్ని కొనసాగించండి. డా. శ్రవణ్ దాసోజు వ్యాసకర్త జాతీయ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ -
అభిమానికి కౌంటరిచ్చిన అమెజాన్ సీఈఓ
ముంబై: అమెజాన్ బ్యానర్లో నల్లజాతీయులకు మద్దతుగా వేసిన ప్రకటన(Black lives Matter) కొందరికి బాధ కలిగించింది. నల్ల జాతీయులకు మద్దతుగా ప్రకటన వేయడం పట్ల అమెజాన్ సీఈఓ జెఫ్ బిజోస్పై మెసీ అనే అభిమాని అసహనం వ్యక్తం చేశాడు. మెసీ మాట్లాడుతూ.. తాను అందరి అభిప్రాయాలను చెబుతున్నానని.. అమెజాన్ కంపెనీ ఈ స్థాయిలో వృద్ధి చెందడానికి అన్ని వర్గాల సహకారం ఉందని అన్నారు. నల్లజాతీయులకు మద్దతుగా(Black lives Matter)బదులు అందరు జీవించాలి(All Lives Matter) అనే నినాదానికి ప్రాధాన్యం ఇవ్వాలని బెజోస్‌ను కోరారు. బెజోస్ స్పందిస్తూ.. తన అభిమాని మెసీ ఆరోపణను వ్యతిరేకిస్తానని, నల్లజాతీయులకు మద్దతుగా ప్రకటన వేశానంటే వేరే వారిని పట్టించుకోనని అర్థం కాదంటూ మెసీకి కౌంటర్ ఇచ్చాడు. ఎవరి వ్యక్తిగత అనుభవాల ఆధారంగా వారు జీవిస్తుంటారని.. కాగా కొన్ని జాతులు, రంగుల వారు సమాజంలో వివక్షకు గురవుతున్నారని, వారికి మద్దతుగా తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని బెజోస్ అన్నారు. అందరు బాగుండాలనే కోరుకుంటానని.. తాను అందరి వాడినని జెఫ్ బిజోస్ స్పష్టం చేశాడు. చదవండి: అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు -
జార్జ్ హత్య : సత్య నాదెళ్ల స్పందన
వాషింగ్టన్ : ఆఫ్రికన్-అమెరికన్ పౌరుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై టెక్ దిగ్గజాలు, గూగుల్, మైక్రోసాఫ్ట్ తమ విచారాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేశాయి. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జాతి వివక్షను, జాత్యంహకారాన్ని ఖండించారు. నల్లజాతి సమాజానికి తమ సంఘీభావం తెలిపిన సత్య నాదెళ్ల సమాజంలో ద్వేషానికి, జాత్యహంకారానికి చోటు లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే దీనిపై సానుభూతి, పరస్పర అవగాహన మొదలైనప్పటికీ, ఇంకా చేయాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. (జార్జ్‌ది నరహత్యే !) ఇప్పటికే జార్జ్ ప్లాయిడ్ మృతిపట్ల సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ సానుభూతిని ప్రకటించింది. ఈ సంఘటన పట్ల భాధ, కోపం, విచారం, భయంతో ఉన్న వారెవ్వరూ ఏకాకులు కాదు.. జాతి సమానత్వానికి మద్దతుగా నిలబడతామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి గూగుల్ , యూట్యూబ్ హోమ్‌పేజీ స్క్రీన్ షాట్ ను ఆయన ట్విటర్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. (దేశీయ ఉగ్రవాద చర్యలు: రంగంలోకి సైన్యం) There is no place for hate and racism in our society. Empathy and shared understanding are a start, but we must do more. I stand with the Black and African American community and we are committed to building on this work in our company and in our communities. https://t.co/WaEuhRqBho — Satya Nadella (@satyanadella) June 1, 2020 Today on US Google & YouTube homepages we share our support for racial equality in solidarity with the Black community and in memory of George Floyd, Breonna Taylor, Ahmaud Arbery & others who don’t have a voice. For those feeling grief, anger, sadness & fear, you are not alone. pic.twitter.com/JbPCG3wfQW — Sundar Pichai (@sundarpichai) May 31, 2020 -
మగధీరుడు
తమకేం కావాలో స్త్రీలకు ఉన్నంత స్పష్టత పురుషులకు లేకపోవడం వల్ల స్త్రీలకేం కావాలన్న విషయమై పురుషులెప్పుడూ అస్పష్టంగానే ఉంటారు. హాలీవుడ్ ఈ పాయింట్‌ని పట్టుకుని పురుషుడిని పూర్తిగా ఉద్వేగ ప్రాణిని చేసి అతడి మగధీరత్వంపై సందేహాలు రాజేసింది. లేదా అతడిని పరిపూర్ణ మానవుడిగా చూపే ప్రయత్నమైనా కావచ్చది! మాధవ్ శింగరాజు మగవాళ్ల ప్రపంచం వేరుగా ఉంటుంది. ‘మగ ప్రపంచం’ అంటూ ఒకటి ఉన్నా లేకున్నా అలాంటిదొకటి ఉంటుందని అనుకునేలా పుట్టుక నుంచి మగవాళ్లు ఉంటుంటారు కనుక.. ఎప్పుడైనా మగవాళ్లు, ఎందుకైనా మగవాళ్లు ఆ మగ ప్రపంచంలో కనిపించకపోతే మగవాళ్లలా అనిపించరు. అప్పుడు ‘పాపం’ అనిపిస్తుంది. ‘పాపం మగాళ్లు’ అని! సమాజం మీద పడి దౌర్జన్యంతో సహాయాలు పొంది జీవిస్తుండే స్వార్థపరుౖ న మానవుడు హటాత్తుగా ‘నేను మీకు సహాయపడగలనా?’ అని అదే సమాజం మీద పడి అడుగుతూ పోతుంటే కలిగే ఆశ్చర్యం నుంచి జనించే ‘పాపం’ అనే భావన అది. ‘ఆడవాళ్లకేం కావాలి?’ అనే ప్రశ్న వేసుకుని, సమాధానం కోసం జీవితమంతా అన్వేషించి, అన్వేషణ పూర్తిగా ఫలించకనే అసువులు బాసిన సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆ ప్రశ్నేదో అడవాళ్లనే అడిగి ఉంటే ఆయన్ని వాళ్లు కొంతలో కొంతైనా సంతృప్తిగా సాగనంపేవారు.. ఆయనకు అర్థం అవగలిగినంత అర్థం చేయించి! తమకేం కావాలో స్త్రీలకు ఉన్నంత స్పష్టత పురుషులకు లేకపోవడం వల్ల స్త్రీలకేం కావాలన్న విషయమై పురుషులెప్పుడూ అస్పష్టంగానే ఉంటారు. ‘ఆడవాళ్లకేం కావాలి?’ అని కాకుండా.. ‘మగవాళ్లకేం కావాలి?’ అని ఫ్రాయిడ్ తవ్వకాలు జరపకపోవడానికి.. మగవాళ్లకు ఏం కావాలన్నదానిపై తనకొక స్పష్టత ఉన్నట్లు ఆయన పొరపడి ఉండటం ఒక కారణం అయి ఉండొచ్చు. మగవాళ్లకు అధికారం కావాలి. అనుకున్నది సాధించడం కావాలి. అవసరం లేనంత డబ్బు కావాలి. ఆడవాళ్లు కావాలి. గుండె నిండా పీల్చి వదలడానికి ఒక సిగరెట్ కావాలి. దూకుడుగా పరుగులెత్తించడానికి కారు కావాలి. ఎవరి ముక్కునైనా బద్దలు కొట్టడం కావాలి. తనొక హీరో కావడం కావాలి. తననే అందరూ చూడటం కావాలి. తనను ‘మగాడు’ అనడం కావాలి. తేలికా మరి మగాడు మగాడిలా ఉండటం? కావచ్చేమో. మగాడిలా ఉన్న మగాడు ఎప్పటికీ మగాడిగా ఉండిపోవడం మీదే సందేహాలన్నీ! చక్రాల కుర్చీలో చంకల కింది కర్రల్ని ఒళ్లో పెట్టుకుని కూర్చొని ఉన్నాడు అతడు. ఖరీదైన చిన్న చీకటి గది. ఒంటరితనానికి ఫ్లోర్ ల్యాంప్, పాతకాలం టీవీ, టీపాయ్, కొక్కేల స్టాండు, మరొక కుర్చీ.. వీటిని అమరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ గది. పశ్చాత్తాపానికి వస్తురూపం ఉండదు కనుక అదొక్కటీ కనిపించడం లేదు. ‘‘క్రిస్మస్సా ఈరోజు’’.. అడిగాడు అతడు. ‘సండేనా ఈరోజు’, ‘మండేనా ఈరోజు’ అన్నట్లు అడిగాడు. పాపం అనిపిస్తుంది అతడు ఆ మాట అడుగుతుంటే. ఒకనాటి నేర సామ్రాజ్యపు చక్రవర్తి చక్రాల కుర్చీకి పరిమితమై కాలస్పృహ లోపించి.. రాబోయే క్రిస్మస్ కోసమో, వచ్చిపోయిన క్రిస్మస్ కోసమో ఎదురు చూస్తూ ఉండటం.. తన కోసం వచ్చిపోతుండే ప్రీస్ట్‌కి ఎలాంటి భావమూ కలిగించదు. ‘‘మళ్లెప్పుడొస్తారు?’’ అని అడుగుతాడు ప్రీస్ట్‌ని. ‘‘క్రిస్మస్ తర్వాత’’ అంటాడు ఆయన, తలుపును దగ్గరగా వేసి వెళ్లబోతూ. ‘‘పూర్తిగా వెయ్యకుండా కాస్త తెరిచి ఉంచండి’’ అని ఆయన్ని కోరుతాడు అతడు. లోపల తనంటూ ఒక వ్యక్తిని ఉన్నానని లోకానికి తెలియడం కోసం కావచ్చు. ‘ది ఐరిష్‌మ్యాన్’ చిత్రంలోని చివరి సన్నివేశం ఇది. మగాడిలా బతికిన ఫ్రాంక్ షీరన్.. చివరి దశలో మనిషి చూపు కోసం, మనిషి స్పర్శ కోసం బతుకు ఈడుస్తుంటాడు కన్ఫెషన్ బాక్స్ లాంటి ఆ గదిలో. ‘మ్యారేజ్ స్టోరీ’ చిత్రంలోని చార్లీది కూడా అటూఇటుగా ఫ్రాంక్ షీరన్ పరిస్థితే. ఫ్రాంక్‌ని వదిలి అతడి కుటుంబం దూరంగా వెళ్లిపోతే, చార్లీ నుంచి దూరంగా వెళ్లిపోడానికి చార్లీ భార్య నికోల్ కట్టుబట్టల్తో ప్రతిరోజు, ప్రతి నిముషం సిద్ధంగా ఉంటుంది. చార్లీ ఆమెను వెళ్లనివ్వడు. ‘నువ్వు, హెన్రీ లేకుండా నేను బతకలేను’ అంటాడు. మగాడేనా అనిపిస్తుంది. మగాళ్లేమిటి ఇలా తయారయ్యారనిపిస్తుంది. ‘పోతే పో.. నువ్వే ఎప్పటికైనా నా కాళ్ల దగ్గరికి వస్తావ్.. దిక్కులేని దానిలా..’ అనాలి కదా మనకు తెలిసినంత వరకు మగాడంటే. అనడు. కొడుకు హెన్రీని దగ్గరకు లాక్కుంటాడు. కొడుకును చార్లీ చేతుల్లోంచి లాక్కుని వేరే వెళ్లిపోతుంది నికోల్. తనకంటూ ఓ జీవితం లేకుండా చేశాడని భర్త మీద ఆమె కంప్లయింట్. ఎప్పుడూ తన కెరీర్‌నే చూసుకుంటాడు. తన కెరీర్ గురించే చెబుతుంటాడు. ఆమెకూ ఓ కెరీర్ ఉందని, ఆ కెరీర్లోనూ కొన్ని విశేషాలు ఉంటాయని, వాటిని వినేందుకు తను శ్రద్ధ చూపాలని అనుకోడు. ఆమె నటి. అతడు రంగస్థల దర్శకుడు. చుట్టూ అమ్మాయిలు. వాళ్లలో ఓ అమ్మాయితో అఫైర్ ఉందని కూడా ఆమె అనుమానం. మొత్తానికి విడిపోతారు. చివర్లో మళ్లీ కలుసుకుంటారు. అదీ చార్లీ ప్రయత్నం వల్లనే. గదిలోకి రాగానే ఇద్దరే ఉన్నప్పుడు ఆమె కాళ్లను గట్టిగా పట్టేసుకుంటాడు చార్లీ.. వదిలితే మళ్లీ ఎక్కడ వెళ్లిపోతుందో అన్నంత గట్టిగా.. అభద్రతగా. మగాళ్ల దృష్టిలో ఇది పరువుపోయే ‘లొంగుబాటు’ లేదా ‘కృంగుబాటు’. మనోహ్లా దర్గీస్ మాత్రం దీనిని.. మగవాళ్లు బరువును దించుకోవడం అంటున్నారు. ఫిల్మ్ క్రిటిక్ ఆవిడ. ఏముంటుంది ఈ మగాళ్లపైన దించుకునేంత బరువు! భార్యా పిల్లల్ని పట్టించుకోకుండా పెద్ద మగాళ్లలా సమాజాన్ని ఉద్ధరించడమేగా? అవును.. అదే బరువు. మాస్క్యులినిటీని (మగధీరత్వాన్ని) మోయవలసిన బరువు. హాలీవుడ్ ఇప్పుడు తమ కథానాయకుల నుంచి ఆ బరువును దింపే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఒక్క హీరోను కూడా ఫుల్ లెంగ్త్ హీరోగా చూపించలేదు హాలీవుడ్! నువ్వు మగాడివైతే కావచ్చు. మనిషిని మించినవాడివైతే కాదు అని చెప్పడమా ఇది? కావచ్చు. మనిషనే ప్రాణికి ఉద్వేగాలు తప్పనప్పుడు ఎంత మగాడైతే మాత్రం ఉద్వేగాలనుంచి తప్పించుకోగలడా? ఫ్రోజన్ 2, యాడ్ ఆస్ట్రా, ఎ బ్యూటిఫుల్ డే ఇన్ ది నైబర్‌హుడ్, ట్రిపుల్ ఫాంటియర్, 1917, ది కిచెన్, హస్లర్స్, వన్సపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్.. ఈ చిత్రాలన్నిటిలోనూ పురుషుడు హాఫ్ బేక్డ్గానే కనిపించడంపై మనోహ్లా న్యూయార్క్ టైమ్స్‌లో మంచి ఇయర్ ఎండింగ్ రివ్యూ రాశారు. మంచి అంటే సెన్సిబిల్ రివ్యూ. మగాళ్లకేదో తక్కువైంది అనకుండా.. వాళ్లింకా ఏదో (మగతనాన్ని మించినది) ఎక్కువగా కోరుకుంటున్నారని రాశారు. ఊరికే కోరుకోవడం కాదు. పడి చావడం! భార్యతో, తల్లిదండ్రులతో, తోబుట్టువులతో, స్నేహితులతో.. అనుబంధాల కోసం, ఆత్మీయతల కోసం దాహ పడడం. అది ఈ సినిమాల్లో కనిపిస్తుంది. ‘ది ఐరిష్‌మ్యాన్’ థియేటర్లలో ఆడుతున్నప్పుడు బోర్ కొట్టి ప్రేక్షకులు మధ్యలోనే లేచి వెళ్లిపోయారట. బోర్ కొట్టే ఎందుకు అనుకోవాలి. సినిమా చూస్తున్నప్పుడు ఏ సన్నివేశంలోనో మనసు లోపలి ‘స్ట్రింగ్’ కదిలి, బోరున ఏడ్వడానికి వాష్‌రూమ్‌లోకి వెళ్లి ఉండొచ్చు కదా. లేదా సిగరెట్ తాగుతూ ఏ ఒంటరితనం లోనికో.. రెండు నిముషాల పాటు. -
స్త్రీని ఉపాసించే సంస్కృతి మనది
మానవుడిని మాధవుడిగా మార్చే సనాతన ధర్మంలోని గొప్పతనాన్ని సామాన్యుల చెంతకు తీసుకువెళ్లాలి ... తద్వారా సమాజంలో శాంతిని నెలకొల్పాలి అనే లక్ష్యంతో ఆధ్యాత్మిక ప్రవచన జ్ఞానయజ్ఞాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు సామవేదం షణ్ముఖశర్మ. గుంటూరులో యోగవాశిష్టం పై ప్రవచనం చేస్తున్న సందర్భంగా ‘మానవుడు ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు నడవాలి’, ‘పురాణాలలో స్త్రీమూర్తికి ఇచ్చిన స్థానం ఏంటి’ తదితర సందేహాలకు వారు ఇచ్చిన సమాధానాలు సాక్షికి ప్రత్యేకం. ఆధ్యాత్మికం అంటే ? శరీరం, ప్రాణం, మనస్సే కాకుండా ఆత్మ అనే వస్తువు ఉంది అనే జ్ఞానానికే ఆధ్యాత్మికం అని పేరు. ఆత్మ అనేది ఎప్పుడూ నశించనిది, సత్యమైనది. దాని గురించి తెలుసుకున్నవాడు భౌతిక జీవితంలో ఆనందంగా, శాంతంగా జీవించగలుగుతాడు. సైన్సు భౌతికవిజ్ఞానాన్నే చెబుతుంది. పరా విద్య ఆధ్యాత్మికం, పరమాత్మ గురించి చెబుతుంది. మనిషిలో వివేకాన్ని రగిల్చి అశాశ్వతమైన భౌతిక సుఖాల కోసం అవినీతికి, అధర్మానికి పాల్పడకుండా కాపాడే శక్తి ఆధ్యాత్మిక విజ్ఞానానికే ఉంది. ఆధ్యాత్మిక మార్గం అంటే ? భౌతికప్రపంచంలో ధర్మపరమైన అనుబంధం ఉండాలి. అంతరంగంలో ఆత్మస్వరూపుడైన భగవంతుడున్నాడనే స్పృహ ఉండాలి. ఆ స్పృహæతో భౌతిక జీవిత ధర్మాన్ని పాటించినట్లయితే అది వ్యక్తికి, సమాజానికి క్షేమం. సైన్సు సాధించలేనిది ఆధ్యాత్మికత సాధించగలదు. శరీరం పోయినా నువ్వు ఉంటావు అనే భరోసా సైన్సు ఇవ్వలేదు. ఆధ్యాత్మిక శాస్త్రం ఇస్తుంది. తప్పు, ఒప్పు గమనించే పరమాత్మ ఒకరు ఉన్నారని తెలిసాక తప్పు చేయడానికి వెనుకాడతాము. మంచి చేయడానికే ప్రయత్నిస్తాము. ఆధ్యాత్మిక మార్గం అధర్మాన్ని చేయనివ్వదు. ఒక ఓర్పును,ౖ ధైర్యాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికం జీవితానికి అతీతమైనది కాదు. సరైన జీవితం ఆధ్యాత్మికం. భగవంతుడు అన్నిటికీ ఆతీతుడని ఋషిప్రోక్తం పురాణ కథలలో దేవతలు మానవుల్లా కోపతాపాలకు, రాగద్వేషాలకు గురయినట్లు కనబడుతుంది. దీనిని అర్థం చేసుకోవడం ఎలా ? పురాణాలను అర్థం చేసుకోవడానికి ప్రత్యేక అధ్యయనం అవసరం. మామూలు కథలలాంటివి కాదు. వాటిలో అనేక సంకేతాలు, సందేశాలు ఉంటాయి. యోగశాస్త్రం మంత్రశాస్త్రం, ధర్మశాస్త్రం, జ్యోతిశ్శాస్త్రం, తత్వశాస్త్రం, మనస్తత్వ శాస్త్రం కథల రూపంలో ఇమిడి ఉంటాయి. శివుడు, విష్ణువు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. వారి భావాలు మనలా ఉండటాన్ని లీల అంటారు. మనలా ప్రవర్తించారనడం సరికాదు. మనకు అర్థమయ్యేలా ఋషులు బోధించారు. మానవుడి స్థాయిలో జరిగితే కర్మ అంటారు. భగవంతుడి స్థాయిలో జరిగితే లీల అని చెప్పుకుంటాం. పురాణాలలో భగవంతుని లీలలు చెప్పబడ్డాయి. లీలల్లో సందేశాలు ఉంటాయి. జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం మనకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ఋషులు మనకు కథల రూపంలో అందించారు. కోపాలు, తాపాలు, భావాలు అన్ని లోకాల్లో ఉంటాయి. పశువులు, మానవులు, దేవతలు వారి వారి స్థాయికి తగ్గట్టుగా ఆ భావాలు, స్పందనలు వ్యక్తమవుతాయి. దేవతలకు కలిగే భావాలు, స్పందనలు లోకక్షేమానికి దారితీస్తాయి. అంతుపట్టని భగవత్ తత్వం కూడా ఇలాంటి కథల వలన సామాన్య మానవుడికి చేరువ అవుతుంది. పురాణాలలో స్త్రీకి తక్కువ స్థానం ఇచ్చారని కొందరు విమర్శిస్తారు మీలాంటి ప్రవచకులు గొప్పస్థానాన్ని ఇచ్చారని చెబుతారు ఏది సత్యం ? భారతీయ సంస్కృతిలో స్త్రీకి ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. ఇంచుమించు అన్ని పురాణాల్లో స్త్రీ పాత్రలు గొప్పగా చూపబడ్డాయి. వేదాలలో ఋషులు ఎలా ఉన్నారో, ఋషికలు అలాగే ఉన్నారు. బ్రహ్మ వాదులు ఎలా ఉన్నారో బ్రహ్మవాదినిలు ఉన్నారు. తత్వశాస్త్రంలోనూ గొప్ప స్త్రీ మూర్తులు ఉన్నారు. రాజ్యాలను నడిపేవారు, గృహసామ్రాజ్యం నడిపే పాత్రలు కోకొల్లలు కనపడతాయి. దత్త చరిత్రలో–మదాలస, త్రిపురరహస్యంలో–హేమలేఖ, యోగవాశిష్టంలో – పద్మలీల, మార్కండేయ పురాణంలో– రాజ్యాలేలిన రాణుల చరిత్ర కనపడతాయి. ప్రపంచాన్ని నడిపే శక్తిగా స్త్రీ రూపాన్ని ఉపాసన చేస్తున్నాము. స్వామి వివేకానంద స్త్రీని మాతృమూర్తిగా గౌరవించడం మన సాంప్రదాయమని బోధించారు. పురాణాలలో, వేదాలలో, ధర్మశాస్త్రంలో స్త్రీకి ఒక గౌరవస్థానం రక్షణస్థానం ఇవ్వబడ్డట్లుగా స్పష్టంగా కనపడుతుంది. ప్రశ్న భక్తులకు మీ సందేశం ? మనకున్న సంస్కృతి యుగాలనాటిది. మనిషికి కావలసిన ఇహపరమైన అన్ని విషయాలు మన గ్రంథాలలో చెప్పబడ్డాయి. అనేక శాస్త్రాల విజ్ఞాన సమన్వయం హిందూ ధర్మశాస్త్రాలలో కనపడుతుంది. వాటి ఎడల ముందుగా గౌరవభావం ఏర్పడితే తరువాత తెలుసుకోవడం జరుగుతుంది. మనిషి బౌద్ధికంగా, ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావాల్సిన పూర్ణజ్ఞానం మహర్షులు మనకు ఇచ్చారు. దీనిని మతదృష్టితో కాకుండా విజ్ఞానదృష్టితో గ్రహిస్తూ దానిని ఆచరించే ప్రయత్నం చేయాలి. భారతీయులందరికీ తమ ధర్మంపై, విజ్ఞానంపై భక్తి, గౌరవ భావం ఏర్పడాలి. ఎవరి ధర్మాన్ని వారు ఆచరిస్తూ ఇతరుల ధర్మాన్ని గౌరవించాలి. ఇంకొకరి ధర్మాన్ని నిందించడం వ్యక్తిత్వ లోపమని తెలుసుకోవాలి’’ అంటూ అనుగ్రహ భాషణ చేశారు సామవేదం షణ్ముఖ శర్మ. – కోలుకొండ శ్రీకర్, సాక్షి, గుంటూరు ఈస్ట్ -
ధీరోదాత్త కథానాయిక
‘ప్రియాస్ శక్తి’ ఒక గ్రాఫిక్ నవల. 2014లో విడుదలైంది. అందులో హీరోయిన్ పేరు ‘ప్రియా శక్తి. ఆమె శక్తి స్వరూపిణి. తాజాగా ఇప్పుడు సీక్వెల్‌గా ‘ప్రియా అండ్ ది లాస్ట్ గర్ల్స్’ అనే నవల రిలీజ్ అయింది. ఈ మధ్య వ్యవధిలో మూడేళ్ల క్రితం ‘ప్రియాస్ మిర్రర్’ అనే నవల వచ్చింది. ఈ మూడు నవలల్లో ప్రియ పాత్రలో ఒక పరిణామ క్రమం కనిపిస్తుంది. తొలి నవల్లో ప్రియ ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలపై పోరాడుతుంది. రెండో నవల్లో అత్యాచారాలు, ఆసిడ్ దాడులపై ఫైట్ చేస్తుంది. తాజా నవలలో అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి దింపుతున్న వారిపై యుద్ధం చేస్తుంది. ఇటువంటి శక్తిమంతమైన పాత్రలతో అమ్మాయిలలో ఆత్మవిశ్వాసాన్ని నింపవచ్చని, సమాజంలో మార్పు తేవచ్చని ఈ సీక్వెల్ నవలల రచయిత రామ్ దేవినేని అంటున్నారు. ‘జెండర్ ఈక్వాలిటీ ఛాంపియన్’గా ఐక్యరాజ్యసమితి గుర్తించిన ప్రియా శక్తి కామిక్ పాత్రను సృష్టించింది ఇండో–అమెరికన్ రైటర్ రామ్ దేవినేని. ఆ ప్రియ ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తింది. అమ్మాయిలను, మహిళలను వ్యభిచారంలోకి దింపడం కోసం జరుగుతున్న అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఈ మూడోనవలలో పోరాటానికి సిద్ధమైంది ప్రియ. అమాయకులైన అనేకమంది అమ్మాయిలను మభ్యపెట్టి, చీకటిగృహాలకు తరలించి, వ్యభిచారం చేయిస్తుంటుంది ఒక గ్యాంగ్. చివరికి గ్రామంలో ఒక్క అమ్మాయి కూడా కనపడదు! అప్పుడు ప్రియాశక్తి పులిమీద కూర్చుని సాహసయాత్ర ప్రారంభించి, దుష్టుడైన రాహు గుహకి చేరుకుంటుంది. రాహు ఆశబోతు, అసూయాపరుడు, కామమోహితుడు. అతడే ఆ ప్రదేశాన్ని పాలిస్తుంటాడు. అక్కడ మహిళలు కేవలం మగవారికి ఆనందాన్ని కలిగిస్తూండాలి, వ్యతిరేకిస్తే, వారిని శిలగా మారుస్తాడు రాహు. రాహు కోసం పనిచేస్తున్న ఒక మహిళ, ప్రియను రాహుకి అప్పచెప్పాలనుకుంటుంది. అతడిపై పోరాడి, అతడిచేత చిక్కిన బాలికల్ని విడిపించడానికి అదే అదను అనుకుంటుంది ప్రియ. అయితే ఆమెకు విజయం కనుచూపుమేరలో కనపడదు. ఎట్టకేలకు అమ్మాయిలను విడిపించి, వెనక్కు తీసుకువస్తే, వారి తల్లిదండ్రులు ఆ పిల్లలను కుటుంబంలో చేర్చుకోవడానికి అంగీకరించరు. వెనక్కు వచ్చిన వారిని కుష్ఠువ్యాధి గ్రస్థుల కంటె నీచంగా చూడటం ప్రారంభించారు. వారిని ఊరికే తిట్టడం, నిందించడం, వెటకారాలాడటం చేస్తుంటారు. వారిలో మార్పు కోసం ప్రియ కృషి చేస్తుంటుంది. ఇది తాజా నవల థీమ్. ఈ నవల రాయడం కోసం రచయిత రామ్ భారతదేశంలోని కొన్ని రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లి స్వయంగా అక్కడి పరిస్థితులు చేశారు. ఒక చిన్న ఇరుకు గదిలో ఇద్దరు ముగ్గురు మహిళలు జీవిస్తున్నారు. వారిలో చాలామందికి వయసు వచ్చిన పిల్లలు ఉన్నారు. వారి ఎదుటే ‘అన్నీ’ జరిగి పోతుంటాయి. ‘‘ఇది నిజంగా హృదయాన్ని కలచివేసే దృశ్యం’’ అన్నారు రామ్ దేవినేని. ఏటా ప్రపంచవ్యాప్తంగా పది కోట్లమంది అక్రమ రవాణా జరుగుతోందని, ఇందులో రెండు కోట్ల ఏడు లక్షల మంది పిల్లలు, మహిళల అక్రమ రవాణా ఒక్క భారతదేశంలో జరుగుతోందని ‘అప్నే ఆప్’ సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మంచి మంచి సందేశాత్మక సినిమాలు తీయడం, ప్రతీకాత్మక చిత్రాలు గీయడం వంటివి మంచి సాధనాలుగా ఉపయోగపడతాయని రామ్ అంటున్నారు. కామిక్స్‌తో కూడా యువతకు మంచి అవగాహన కలిగించవచ్చని అన్నారు. – డా. వైజయంతి పురాణపండ శక్తి బయటికి రావాలంటే భయాన్ని విడిచిపెట్టాలి! రామ్ దేవినేని నిర్మాత, కథా రచయిత, సినీ దర్శకులు, పబ్లిషర్. న్యూయార్క్, న్యూఢిల్లీలలో సినిమాలు తీస్తూ, మ్యాగజీన్లు నడుపుతున్నారు. ‘కర్మ కిల్లింగ్స్’ అనే చిత్రాన్ని తీసి, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. ఆయన నిర్మించిన ‘రష్యన్ ఉడ్‌పెకర్’ డాక్యుమెంటరీ చిత్రానికి సన్‌డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ జ్యూరీ అవార్డు లభించింది. ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డుకూ ఆ చిత్రం నామినేట్ అయింది. తన పాత్ర ‘ప్రియ శక్తి’ గురించి చెబుతూ.. ‘‘ప్రియ అసాధారణమైన ‘సూపర్ హీరో’. ఆమె ఆలోచనా విధానమే ఆమె బలం. సూపర్‌మ్యాన్ శక్తి కంటె, ఒక ఆలోచనే శక్తిమంతమైనది. ప్రతి మనిషిలోను ఆ శక్తి అంతర్లీనంగా దాగి ఉంటుంది. అయితే మనిషిలో ఉండే భయం ఆ శక్తి మరుగున పడేస్తుంది. ఆ భయాన్ని వదులుకుంటే దేన్నయినా జయించగలం’’ అని అన్నారు రామ్. -
స్పర్శలో తేడా ఉంటే తేడాగాళ్లే..!!
సాక్షి, తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): స్పర్శలో తేడాలు గమనించాలి. ముఖ్యంగా ఇది విద్యార్థి దశలోనే నేర్పించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి, చెడు స్పర్శలపై అవగాహన కల్పించాలి. అప్పుడే బాలికలు, యువతులపై జరుగుతున్న లైంగిక దాడులు కొన్నైనా ఆపవచ్చు’...అని సినీ నటి రకూల్ ప్రీత్ సింగ్ అన్నారు. 555కే 2.0 వాక్ ముగింపు సందర్భంగా అక్కయ్యపాలెం దరి పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ ఓ ఉపాధ్యాయుడు ఒక విద్యార్థినికి ప్రతి రోజు చాక్లెట్ ఇచ్చేవాడని, అలా ఇస్తూ తనను తాకేవాడని...అదే విద్యార్థి తన తన తల్లి వద్ద చాక్లెట్ తీసుకున్నప్పుడు ఆమె చేతి స్పర్శ గమనించిందని, ఉపాధ్యాయుడి చేతి స్పర్శ, తల్లి చేతి స్పర్శలో తేడా ఉండడంతో టీచర్‌పై ఫిర్యాదు చేసిందన్నారు. ఇలా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నందున వారికి స్కూళ్లలోనే ఈ విషయం తెలియజేయాలన్నారు. 555కే వాక్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న నిర్వాహకులు, సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, ముగించిన, సహకరించిన వారందరినీ రకుల్ అభినందించారు. ముందుగా 5ఏఎం క్లబ్ వ్యవస్థాపకుడు, 555కే వాక్ నిర్వాహకుడు కేవీటి రమేష్ మాట్లాడుతూ నేటి సమాజంలో బాలలపై జరుగుతున్న హింస, లైంగిక దాడుల విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ఫిట్ ఇండియా, పోలియో నిర్మూలన దిశగా ముందడుగు వేసేందుకు 18వ తేదీన ఈ యాత్ర ప్రారంభించామన్నారు. ఈ వాక్ విజయవాడలో ప్రారంభించి గుడివాడ, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, అమలాపురం, రాజోలు, యానాం, రామచంద్రపురం, రాజమండ్రి, తుని, అనకాపల్లి మీదుగా సాగిందని తెలిపారు. ఈ 5రోజుల యాత్రలో 55మంది సభ్యులు సుమారు 425 స్కూళ్లను సందర్శించి, 65వేల మంది విద్యార్థులకు, తల్లితండ్రులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. దీనిలో 11 గ్రామాలను, సిటీలను ఎంపిక చేసుకుని అక్కడ ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న స్వచ్ఛంధ సేవాసంస్థలతో కలిసి పనిచేసినట్టు రమేష్ వివరించారు. కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన కరాటే రికార్డ్ చాంపియన్ అమినేష్ వర్మను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ ప్రెసిడెంట్ రాధిక, వైభవ్ జ్యుయలర్స్ ఎండీ గ్రంధి మల్లికా మనోజ్, అంతర్జాతీయ స్కేటర్ రాణా, ఆంధ్రప్రదేశ్ యువజన రాష్ట్ర అధ్యక్షుడు ఆడారి కిషోర్‌కుమార్, రోటరీ క్లబ్ సభ్యులు సుభోధ్, ప్రకాష్, అధిక సంఖ్యలో విద్యార్థులు, వాకర్స్ పాల్గొన్నారు. -
నేను మారాను..మీరూ మారండి..!
ప్లాస్టిక్ వద్దు... క్లాత్ బ్యాగ్ ముద్దు పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్లాస్టిక్ సంచులను వదిలేసి ఈ టిఫిన్ బాక్స్‌లను, క్లాత్ బ్లాగ్‌లను వినియోగిస్తున్నాను. మీరు కూడా టిఫిన్ బాక్స్ చాలెంజ్‌ను స్వీకరించి ప్లాస్టిక్ రహిత సమాజానికి పాటుపడాలి. సాధ్యమైనంత వరకు కవర్ల వాడకాన్ని తగ్గించాలి. పేపర్, జ్యూట్ బ్యాగ్స్ వాడాలి. ప్రభుత్వం కూడా ఎక్కువ ప్రచారం కల్పించాలి. ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. తాగే గ్లాసు నుంచి తినే కంచ వరకు ప్రస్తుతం అంతా ప్లాస్టిక్ భూతమే కనిపిస్తోంది. పర్యావరణాన్ని కబళించే ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు నడుం బిగించాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. అనుకున్నదే తడవుగా ఎక్కడికి వెళ్లినా.. టిఫిన్ బాక్స్ తీసుకువెళుతూ అందరికి చాలెంజ్ విసురుతున్నాడు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ను పారదోలేందుకు గత ఏడాది ఉగాది పండుగ రోజున ‘టిఫిన్ బాక్స్’ చాలెంజ్ తీసుకొచ్చాడు హైదరాబాద్‌కు చెందిన దోసపాటి రాము. ఎల్బీనగర్లో ఉండే రాము ఈ చాలెంజ్ ద్వారా కొన్ని లక్షల ప్లాస్టిక్ కవర్లను తగ్గించి ఎంతో మందికి పర్యావరణంపై అవగాహన కలిగిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నాడు. నగరంలో వాడుతున్న కవర్లలో కొన్ని కవర్ల వాడకాన్ని అయినా తగ్గించాలని తన ప్రయత్నాన్ని గత ఏడాది ఉగాదిన తన ఇంటిలోనే మొదలు పట్టాడు. ‘మటన్, చికెన్ షాపునకు వెళ్తే టిఫిన్ బాక్స్ తీసుకెళ్లండి. కూరగాయల మార్కెట్‌కి వెళ్లే జ్యూట్ లేదా క్లాత్ బ్యాగును తీసుకెళ్లండి’’ అంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ తాను పాటించడం మొదలు పెట్టాడు. అంతేగాక ‘మీరు కూడా ప్లాస్టిక్‌కు బదులు టిఫిన్ బాక్స్‌లు వాడండి’ అంటూ ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో స్నేహితులకు చాలెంజ్ విసిరారు. వాళ్లు ఈ ఐడియా నచ్చి మరికొంత మందికి చాలెంజ్ చేస్తూ ప్లాస్టిక్ కవర్ల వాడాకాన్ని తగ్గించారు. కూరగాయల మార్కెట్లలో.. సాధారణంగా కూరగాయల మార్కెట్లలో ప్లాస్టిక్ కవర్ల వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించిన రాము ఎల్బీనగర్, నాగోల్, కొత్తపేట, రాక్‌టౌన్ కాలనీలోని వారపు సంతలో మకాం వేస్తూ ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల కలిగే అనర్థాలను మైక్ పట్టుకుని సంతకు వచ్చే వారికి వివరించడంతోపాటు స్థానికుల సాయంతో పేపర్ బ్యాగ్స్ తయారు చేయించి, ఆ బ్యాగులను కూరగాయలు అమ్మే వారికి పంపిణీ చేశాడు. ఇలా రెండు నెలల పాటు చేయడంతో మార్కెట్‌కు వచ్చే వాళ్లకు అవగాహన వచ్చి ఇంటినుంచి వచ్చేటప్పుడే క్లాత్ బ్యాగులు తెచ్చుకోవడం మొదలు పెట్టారు. దీంతో కొన్ని వందల కవర్ల వాడకం తగ్గిపోయిందని, ఇక్కడే గాక నల్లగొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో సైతం టిఫిన్ బాక్స్ చాలెంజ్‌కు మంచి స్పందన వచ్చిందని రాము చెబుతున్నాడు. – మంగినేపల్లి సాయి కుమార్, సాక్షి, నకిరేకల్ -
సీఎం గొప్పగా పనిచేస్తున్నారని విన్నాం...
ముఖ్యమంత్రి చాలా గొప్పగా పనిచేస్తున్నారని విన్నాం. ఆయన ఈసమస్యను 10 నిమిషాల్లో పరిష్కరించగలరని నమ్మకం ఉంది. మీరేమో 8 వారాల సమయం కావాలంటున్నారు. పిటిషనర్ సొసైటీ నుంచి తీసుకున్న భూమికి సమానమైన భూమిని ఇస్తారని మీరే ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో మేం కూడా ఆదేశాలిచ్చాం. మీ ఉత్తర్వులను పట్టించుకోరు. మా ఉత్తర్వులను కూడా పట్టించుకోకుంటే ఎలా. మీరు (అధికారులు) ఇలా గడువు కోరుతుండటం వల్లే న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. మేం చెప్పిన ఈ విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లండి. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారిని ఉద్దేశించి హైకోర్టు సాక్షి, హైదరాబాద్: యూసుఫ్‌గూడలోని కల్యాణ్‌నగర్ సొసైటీ నుంచి తీసుకున్న భూమికి సమానమైన భూమిని ఆ సొసైటీకి ఇచ్చే విషయంలో 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వు లు జారీ చేసింది. కల్యాణ్‌నగర్ సొసైటీ 1964లో 39 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. లేఔట్ నిమిత్తం అనుమతులు తీసుకుంది. తరువాత ప్రభుత్వం ఈ భూమిని మురికివాడల అభివృద్ధి కోసం తీసుకుంది. దీనిపై సొసైటీ హైకోర్టును ఆశ్రయించగా, తీసుకున్న భూమికి సమానమైన భూమిని ఇస్తామని కోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మేరకు జీవో లు కూడా ఇచ్చింది. అయితే, ఈ జీవోలు ఇప్పటివర కు అమలు కాకపోవడంతో సొసైటీ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. తివారీని కోర్టుకు పిలిపించిన ధర్మాసనం ఏళ్ల తరబడి ఈ సమస్యను పరిష్కరించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై ధర్మాసనం మండిపడింది. దీనిపై స్వయంగా హాజరై వివర ణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రాజేశ్వర్ తివారీని ఆదేశిస్తూ విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. అనంతరం జరిగిన విచారణకు తివారీ హాజరయ్యారు. తీసుకున్న భూమికి సమానమైన భూమి ఇస్తానని జీవోలు జారీ చేసి ఇప్పటివరకు వాటిని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిం చింది. ప్రభుత్వం వద్ద ఫైల్ పెండింగ్‌లో ఉందని తమకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారని, భూమి ఇవ్వకుండా వారిని ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పడమేనా మీ పని అంటూ ప్రశ్నించింది. పెండింగ్ కేసులు పెరగక ఏం చేస్తుంది? ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందని, ఇందుకు బాధ్యులెవరని అడిగింది. పూర్తి వివరాలతో మరో అఫిడవిట్ దాఖలు చేస్తామని తివారీ చెప్పగా, ‘ఆ పని ముందే ఎందుకు చేయకూడదు. మీరు తీరు బడిగా మరో పిటిషన్ దాఖలు చేస్తారు. దానికి సమాధానం ఇచ్చేందుకు గడువు కావాలని పిటిషనర్ కోరతారు. కోర్టుల్లో పెండింగ్ కేసులు పెరిగిపోతాయంటే ఎందుకు పెరగవు. ఇలా వాయిదాల మీద వాయిదా లు తీసుకుంటూ తీరుబడిగా అఫిడవిట్లు వేసుకుంటే కేసుల పరిస్థితి అలాగే ఉంటుంది’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలతోపాటు మీరిచ్చిన ఉత్తర్వులను ఎప్పటిలోపు అమలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించగా, కోర్టు ఇచ్చే ఆదేశాలను బట్టి నడుచుకుంటామని తివారీ చెప్పారు. సీఎం దృష్టికి తీసుకెళ్లండి... దీనిపై ఎప్పటిలోపు నిర్ణయం తీసుకుంటా రో చెప్పాలని కోర్టు తివారీని ప్రశ్నించగా.. 8 వారాల గడువు కావాలని సమాధానమిచ్చారు. ‘మీ సీఎం చాలా గొప్పగా పనిచేస్తున్నారని విన్నాం. మేం విన్న దానిని బట్టి ఈ సమస్య పరిష్కారానికి ఆయనకు 10 నిమిషాల సమయం చాలు. ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లండి. ఆయనే పరిష్కరిస్తారు’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ వద్ద ఆందోళనలు
సాక్షి, నాంపల్లి(హైదరాబాద్): హైదరాబాద్‌లోని నాంపల్లిలో ప్రతిఏటా జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) బుధవారం రాత్రికి అగ్నికి ఆహుతైంది. క్షణాల్లోనే అక్కడున్న వందల స్టాళ్లు బూడిద అయ్యాయి. దీంతో తమకు న్యాయం చేయాలంటూ నష్టపోయిన స్టాల్ నిర్వాహకులు గురువారం సొసైటీ ముందు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో వ్యాపరస్తులు సొసైటీ ముట్టడికి యత్నించారు. దీంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. మేమేంటో చూపిస్తాం: స్టాల్ నిర్వాహకులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చెలరేగిన మంటలతో లక్షల రూపాయలు నష్టపోయామని వ్యాపరస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు నష్ట పరిహారం చెల్లించాలంటూ సొసైటీ సభ్యులను డిమాండ్ చేస్తున్నారు. 30 నిమిషాల్లో అధికారులు వచ్చి మాట్లాడకపోతే ఆందోళన మరింత ఉదృతం చేస్తామని పేర్కొన్నారు. తమకు న్యాయం చేస్తామని సోసైటీ సభ్యులు హామీ ఇవ్వకపోతే తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. సకాలంలో ఫైరింజన్లు రాకపోవటం వల్లే తమ స్టాళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయని వారు ఆరోపిస్తున్నారు. -
సూపర్ 'షీ'రోస్
మగాడు చాలా తెలివైనోడు... మగాడు మోసగాడు. ‘‘బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్.. దేర్ ఈజ్ ఏ ఉమన్’’ అంటూ మహిళను తెరవెనకే బందీ చేశాడు.. సూపర్ మ్యాన్.. స్పైడర్ మ్యాన్..టార్జాన్... బ్యాట్ మ్యాన్.. హెర్క్యూలస్.. హీ మ్యాన్.. ఫాంటమ్.. శక్తిమాన్.. ప్రపంచాన్ని ఉద్ధరించేవాళ్లంతా మగానుభావులే! అని తెలుసుకున్న కొందరు ఆర్టిస్టులు కలిసి కొంతమంది సూపర్ ఉమన్లను సృష్టించారు.. మహిళల గొప్పతనానికి గుర్తింపు లేని సమాజంలో తాటతీసే ఇలాంటి హీరోయిన్లను క్రియేట్ చేయడమంటే నవ సమాజానికి సూపర్ షీరోస్ పరిచయమవడమే! బాయీ సెక్సువల్... ముంబైలోని కామటిపురాలోని ఓ సెక్స్వర్కర్కు పుట్టిన కూతురు. జీవితంలోని చీకటి కోణాలను చూస్తూ పెరుగుతుంది. బాయీని అదే దారిలో నడిపించాలనుకుంటుంది తన తల్లి ఉంటున్న బ్రోతల్ హౌజ్ యజమాని. బాయి కూడా ఆ దారినే ఎంచుకుంటుంది కాని బ్రోతల్ హౌజ్ యజమాని అనుకున్న రీతిలో కాదు. బాయి ఆధునిక యువతి. సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఉంటుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లను మెయిన్టైన్ చేస్తుంటుంది. పగలంతా కామటిపురాకు దగ్గర ప్రాంతాల్లోని ఇళ్లల్లో పని చేస్తూ.. రాత్రంతా మోటర్‌బైక్ మీద బస్తీల్లో గస్తీ తిరుగుతుంది. ఏ అమ్మాయిని.. ఎవడు ఏడ్పించినా.. పిల్లలను, టీనేజర్స్‌ని ట్రాఫికింగ్ చేస్తున్నట్టు అనుమానం వచ్చినా ఆ మగవాళ్లను చీల్చి చెండాడుతుంది. మొబైల్‌ఫోన్ ఆమె ప్రధాన ఆయుధం. వనితా ఫెయిర్‌నెస్ తెల్లగా.. చక్కటి శరీరాకృతితో మెరిసిపోయే బొమ్మలాంటి అమ్మాయి కాదు వనిత. పేదరికం, నిరుద్యోగం, అవినీతి, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే ధీర. ఎక్కడ అవినీతి ఉన్నా తన దగ్గరున్న వైట్‌వాష్ గన్‌తో పారదోలి.. వ్యవస్థను ఫెయిర్ చేసేస్తుంది. మోహ్ మాయా ఆమె పురుషాధిపత్యాన్ని సహించదు. ఆడపిల్ల కంట కన్నీరొలికితే చాలు కారణమైన వాళ్ల పట్ల కాళీలా మారుతుంది. మహిళల మీద, చిన్న పిల్లల మీద జరిగే హింసకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఆంఖ్‌మారీ జాన్ స్త్రీని రెండో పౌరురాలిగా చూడడాన్ని క్షమించదు. మహిళ ఇబ్బందులు ఎలాంటివో.. తనెన్ని అవమానాలకు గురవుతోందో వాటిని పురుషుడి అనుభవంలోకీ తెచ్చి చూపిస్తుంది . కన్నుగీటి స్త్రీ సమస్యలను పురుషులకు బదిలీ చేసేంత శక్తిమంతురాలు ఆంఖ్‌మారీ జాన్. పూనమ్ 3000 సాధారణ యువతి. సింగిల్ పేరెంట్. అద్భుతాలు చేతకావు. రోజువారీ జీవితంలోని ఇబ్బందులను ఎదుర్కోవడమే ఆమె టాస్క్. తన కొడుకును మంచి స్కూల్లో చేర్పించడమే ఆమె లక్ష్యం. ‘మన సమస్యలను తీర్చడానికి ఎవరూరారు.. అసలు ఎవరూ ఉండరు. ఎవరి జీవితం వాళ్లదే. స్ట్రగులే లైఫ్ అని చెప్తుంది. పోరాడడమే మనం చేయగల అద్భుతం అంటుంది. నింజా నానీ చాదస్తం, సంప్రదాయంతో ఇంట్లో వాళ్లను తిప్పలు పెడ్తున్నా.. మోరల్ సపోర్ట్, ఆర్థిక ఇబ్బందులను గట్టెక్కించే చిట్కాలు, పిల్లల పెంపకంలో ఇచ్చే సలహాలు.. క్లిష్ట పరిస్థితుల నుంచి కుటుంబాన్ని బయటపడేసే పెద్దరికం.. నింజా నానీ నైజం. మిస్ పమేలా ఓ చేత్తో బేకరీ నిర్వహిస్తూనే ఇంకో చేత్తో సమాజంలోని అవలక్షణాలతో ఫైట్ చేస్తుంటుంది. ఆ ఫైట్ ఎక్కడికి దారితీసినా వెరవదు. వెనకడుగు వేయదు. అవతలి పక్షం వాళ్లను మైదా ముద్దలా చేసి ఫుట్‌బాల్ ఆడుతుంది. విజయంతో నిలబడుతుంది. లేడీ నైట్ (యోధురాలు) స్కాలర్.. వీరురాలు.. శూరురాలు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె ఒక సూపర్ పవర్. బైక్, కారు, లారీ.. అన్నీ డ్రైవ్ చేస్తుంది. గుర్రాన్నయితే గాల్లో కూడా పరిగెత్తిస్తుంది. అదీ లేడీ నైట్ ప్రత్యేకత. ఈ మహిళల గురించి చదువుతుంటే.. ఇన్స్పైరింగ్గా ఉంది కదా! ప్రేరణ కూడా వస్తోంది.. అవునా?! మనమూ ఇలా అవ్వాలి అనీ అనిపిస్తోంది కదూ.. బట్ సారీ.. ఇవి రియల్ లైఫ్ స్టోరీస్ కాదు! కామిక్ క్యారెక్టర్స్! ఒహ్హో.. దీర్ఘమైన నిట్టూర్పు.. మూతి ముడిచేసుకునే ఎమోజీలు వద్దు. ఇలాంటి ఎమోషన్స్‌తో బలహీనపడొద్దనే చెప్పే స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ విమెన్ రోల్స్ ఇవి! సూపర్ హీరోయిన్స్ క్యారెక్టర్స్!వాటి పేర్లు వేరైనా ఈ పాత్రలన్నిటి వెనక ఉన్న లక్ష్యం ఒకటే.. మహిళ ఇండిపెండెంట్‌గా ఉండాలి.. సాధికారత సాధించాలి. ఆత్మస్థయిర్యం, హాస్య చతురత, చాకచక్యం, లౌక్యం.. ఇవన్నీ ప్రతి మనిషికీ ఉండాల్సినవి.. జీవితంలో గెలవాలంటే ఇవి తప్పనిసరి కూడా. వీటిని ప్రతి అమ్మాయికీ ఓ మెస్సేజ్‌లా ఇవ్వాలనే ఈ పాత్రలను క్రియేట్ చేశాం’’ అంటారు ఈ నాయికలకు రూపం ఇచ్చిన ఆర్టిస్టులు. ఇంతకీ ఆర్టిస్టుల ప్రస్తావనే రాలేదు... బాయీ సెక్సువల్కు ప్రాణం పోసింది మహారాష్ట్రకు చెందిన రుచా దయార్కర్. వనితా ఫెయిర్నెస్కు రూపమిచ్చింది టిన్టిన్ క్వారంటినో . ‘మోహ్ మాయా’ కృతికా సుసర్ల సృష్టి. ‘ఆంఖ్‌మారీ జాన్’.. అరుంధతీ ఘోష్, జార్జ్ మ్యాథన్ల బ్రెయిన్ హీరోయిన్. ‘పూనమ్ 3000’ విష్ణు ఎమ్ నాయర్ కథానాయిక. అమ్మమ్మ, నానమ్మల స్ఫూర్తితో ‘నింజా నానీ’కి ఊపిరి పోసింది లావణ్యా కార్తిక్. ‘మిస్ పమేలా’ ఆనందా మీనన్ ఇష్ట సఖి. ‘లేడీ నైట్’ మంజులా పద్మనాభన్ ఊహల్లోంచి వచ్చిన స్ట్రాంగ్ లేడీ. సండే అబ్జర్వర్, పయోనీర్, హిందూ బిజినెస్ లైన్ వంటి పత్రికల్లో వచ్చే ‘సుకి’ అనే కామిక్ క్యారెక్టర్ గురించి తెలిసిన వాళ్లకు మంజులా పద్మనాభన్ సుపరిచితురాలు. సుకికి జన్మనిచ్చింది ఆమే. ఇప్పుడు లేడీ నైట్‌తో ఓ సూపర్ హీరోయిన్ను తయారు చేసింది. అసలు ఇవన్నీ ఎందుకు పుట్టాయంటే సూపర్ హీరోయిన్ క్యారెక్టర్స్ వెలితిని గ్రహించిన ‘బ్రెయిన్‌డెడ్ ఇండియా’ అనే ఆర్టిస్ట్స్ కలెక్టివ్ గ్రూప్ ఒక ఆన్లైన్ ప్రాజెక్ట్ కోసం.. సృజనాత్మకమైన పోటీని నిర్వహించింది. దాని పేరు ‘‘స్త్రీ స్త్రీ సెప్టెంబర్’’.మోడర్న్ ఇండియా సూపర్ హీరోయిన్స్ ఎలా ఉండాలో... గుణాలను అభివర్ణిస్తూ.. కాస్ట్యూమ్స్‌ను కూడా డిజైన్ చేస్తూ.. వాటి బలాబలాలను కూడా చెప్తూ పాత్రలను రూపొందిచమని దేశ వ్యాప్తంగా ఎంట్రీలను ఆహ్వానించింది. చాలామంది ఆర్టిస్టులు స్పందించారు. 25 ఎంట్రీలను ఎంపిక చేసింది బ్రెయిన్‌డెడ్ గ్రూప్. అందులోని కొన్నిటినే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాం. ఈ సూపర్ హీరోయిన్స్‌ని బ్రెయిన్‌డెడ్ నిర్వాహకులు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్స్ ద్వారా ఇప్పటికే నెటిజన్లకు పరిచయం చేసేశారు. ‘‘సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. మాకు వచ్చిన ఎంట్రీలన్నిటిలో సాహసం.. సరదా కలగలసి ఉన్నారు సూపర్ హీరోయిన్స్. కామిక్ అండ్ సీరియస్ రెండూ అన్నమాట. అయితే ఎక్కడా వాస్తవానికి అతీతంగా లేవు. డే టు డే లైఫ్‌లో ఆడవాళ్లు ఫేస్ చేసే వాటి మీదే కాన్సన్ట్రేట్ చేశారు ఆర్టిస్టులు. ఆ హార్డిల్స్‌ను ఓవర్‌కమ్ చేసుకోవడానికి కావల్సిన ధైర్యం, స్థితప్రజ్ఞతను ఇంజెక్ట్ చేసేలా ఉన్నాయి ఈ క్యారెక్టర్స్’’ అంటున్నారు.. నిర్వాహకులు అరుంధతీ ఘోష్, జార్జ్ మ్యాథన్. మంచి ప్రయత్నం.. ఫెయిరీ టేల్స్.. ప్లేస్‌లో పై పాత్రలతో కొత్త తరానికి సరికొత్త కథలు వినిపించాలి. – శరాది -
వ్యవస్థ విలువ
ఏ రోజు పేపరు తెరిచినా ఈనాటి దేశ పాలన ఆయా ప్రభుత్వాలు కాక సుప్రీం కోర్టు, చాలాచోట్ల హైకో ర్టులు నిర్వహిస్తున్నాయనిపి స్తుంది. తెల్లవారి లేస్తే ఫలానా పరీక్షలలో అయిదు మార్కులు కలపాలా వద్దా, గవర్నరుగారు ఇచ్చిన తాఖీదు ఫైలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎంత కాలం ఉండవచ్చు, కలిసి ఒక గదిలో బతికే అమ్మాయి, అబ్బాయి ఎంత కాలానికి భార్యాభర్తలనిపించు కుంటారు, అరెస్టయిన ఫలానా వ్యక్తి నేరస్తుడు అవునా? కాదా? చిన్న పిల్లల పునరావాసాలపైన నిబంధనలు సబబా, కాదా? ఫలానా నీటి పారుదల కాలువ పక్కన మరుగుదొడ్డిని నిర్మించవచ్చా, కూడదా?– ఈ విషయాలన్నింటిపై న్యాయం చెప్పా లని సుప్రీంకోర్టును వ్యాజ్యాల ద్వారా అభ్యర్థించారు. ఈ మధ్య డీఎంకే నేత ఎం.కరుణానిధి తమిళ నాడులో కన్నుమూశారు. ఆయన వయస్సు 94 ఏళ్లు. దేశమంతా నివాళులర్పించింది. ఆయన 13 సార్లు శాసనసభకి ఎన్నికై, అయిదుసార్లు రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా సేవ చేశారు. ఒక పక్క శవం ఉండగా ఆయన పార్థివ శరీరానికి మెరీనా బీచ్‌లో అంత్య క్రియలు చేయడానికి అనుమతి ఇవ్వాలని ఆయన పార్టీ నాయకులు ముఖ్యమంత్రిని అర్థించారు. ముఖ్యమంత్రి కారణాలు చెప్పి కాదన్నారు. రాత్రికి రాత్రే మద్రాసు హైకోర్టు విచారణ జరిపి, మెరీనాలో కరుణానిధి అంత్యక్రియలు జరపడానికి అనుమతిని ఇచ్చింది. బయటవారికి కనిపించేది పాలకవర్గం వ్యతి రేకతో, చట్టపరమైన అభ్యంతరం మాత్రమే కాదు, ఒక పక్క దేశ రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులు, విదేశీ ప్రముఖులు నివాళులర్పిస్తుండగా, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏఐడీఎంకే ప్రభుత్వం న్యాయస్థా నంలాగా పెద్దరికం చూపలేకపోయిందే అని. ఒక అనూహ్యమైన, అద్భుతమైన విషయం. సాలీనా 160 లక్షల పోలీసు కేసులున్న బిహార్ దక్షిణ ప్రాంతంలోని ‘పాడియా’ అనే గ్రామవాసులు ఇంత వరకూ న్యాయస్థానం ముఖం చూడలేదు. గత 100 సంవత్సరాలలో ఒక్కటి ఒక్కటంటే ఒక్క పోలీసు కేసు లేదట. ఇది ఈనాటి భారతదేశంలో తగాదాలు లేని, మధ్యవర్తి అవసరం రాని జీవితం గొప్ప సంస్కారం. ఇది ఒక గ్రామం ఒక శతాబ్దంగా పాటిం చడం, అదిన్నీ మన దేశంలో గొప్ప విడ్డూరం. న్యాయ వ్యవస్థ మనకు మనం ఏర్పాటు చేసు కున్న ‘నియతి’. ఆ వ్యవస్థ మన సంస్కారానికీ, పరి ణతికీ సూచిక. అయితే ఆ వ్యవస్థ తప్ప మన నిర్ణ యాలకీ, జీవన విధానానికీ గతిలేని స్థితిని తెచ్చు కోవడం ఆ వ్యవస్థ పతనానికి నిదర్శనం. మనం ఏర్పరచుకున్న న్యాయస్థానం గొప్ప విచక్షణ, నిష్పక్ష పాత వైఖరి గల వ్యవస్థ. మన తలకు మించిన సమ స్యలకి దాన్ని ఆశ్రయించడం మన లక్ష్యం. ఏ రామ మందిరం తగాదానో, ఏ ముస్లిం విడాకుల సంప్రదా యమో, కశ్మీరులో 370 అధికరణ ఆవశ్యకతో– ఇలాంటివి సుప్రీంకోర్టు నిర్ణయించి తీర్పు ఇవ్వాల్సిన గంభీరమైన సమస్యలు. ఫలానా పరీక్షలో అయిదు మార్కులు కల పాలా? రహదారి బంగళా పక్క సారా దుకాణం ఉండాలా? వంటి అతి సామాన్య సమస్యల పరిష్కా రానికి కాదు. మరి ఇప్పుడాపనే జరుగుతోంది. ఈ దేశాన్ని పాలక వ్యవస్థ కాక అతి ముఖ్యమైన కొండ కచో నవ్వు పుట్టించే, చాలాసార్లు నవ్వులపాలు చేసే సమస్యల పరిష్కారం ఈ వ్యవస్థ మీద పడింది. ఫలానా జాతీయ గీతం ఫలానా చోట వెయ్యాలా వద్దా? అప్పుడు మనం నిలబడాలా, అక్కరలేదా? ఇది వ్యవస్థలో చిత్తశుద్ధి, విచక్షణ లేకపోవడానికి నిద ర్శనమని నాకనిపిస్తుంది. కాళీపట్నం రామారావుగారి ‘యజ్ఞం’ గొప్ప కథ. వివరాలు అలా ఉండగా స్థానికులు అంగీక రించిన ఊరిపెద్ద శ్రీరాములు నాయుడు ఆ ఊరిలో చిన్న రైతు అప్పలరాముడు అప్పు గురించి నిర్ణ యాన్ని చెప్తాడు. కథంతా ఆ నిర్ణయం పర్యవ సానాన్ని గురించి. ఆ నిర్ణయానికి తలొంచడం ఆ గ్రామం ‘కట్టుబాటు’. నాయుడి తీర్పు విన్నాక పర్య వసానం కథ. అలా కాక అప్పలరాముడు రొమ్ము విరిచి ‘ఇలా నిర్ణయించడానికి నువ్వెవరయ్యా?’ అన్నా, ‘ముందు పట్నంలో నీ మూడో పెళ్లాం సంగతి తేల్చు’ అని బోర విరిస్తే అది మరొక కథ. ఓ గొప్ప విలువ పతనం. ఏమిటీ ఈ విపరీతం? ఏమయింది ఈ వ్యవ స్థకి? ఒకరిపట్ల ఒకరికి, ఒక వ్యవస్థపట్ల గౌరవం, నమ్మకం, మర్యాద లుప్తమవడమే ఇందుకు నిద ర్శనం. ప్రతీ విషయానికీ సుప్రీంకోర్టుని ఆశ్రయిం చడం, క్లిష్ట సమస్యపై తీర్పు చెప్పాలని అభ్యర్థిం చడం గడుసైన వ్యవహారం. వ్యవస్థను బెదిరించి నడి పించడమే. మనం ఏర్పరచుకున్న గొప్ప వ్యవస్థ మన విశ్వాస రాహిత్యం, విచక్షణా రాహిత్యం, దుర్విని యోగం, నవ్వు పుట్టించే ఆకతాయి వ్యాజ్యాల కార ణంగా మరుగుదొడ్లు, దెయ్యాల స్థాయికి తీసుకువస్తే ఏమవుతుంది? ఏ రోజు పేపరు తెరిచినా అందుకు వంద సమాధానాలు దొరుకుతాయి. గొల్లపూడి మారుతీరావు -
జిల్లాకు రూ.45 కోట్ల ఎన్సీడీసీ రుణాలు
కర్నూలు(అగ్రికల్చర్)/అర్బన్ : గొర్రెల పెంపకాన్ని మరింత ప్రోత్సహించేందుకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ) ద్వారా జిల్లాకు మూడేళ్లలో రూ.45 కోట్లు వస్తాయని అంధ్రప్రదేశ్ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని పశుసంవర్ధకశాఖ సమావేశ భవనంలో జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీడీసీ నిధుల వినియోగం పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2018–19లో జిల్లావ్యాప్తంగా రూ.10.58 కోట్లు వ్యయం చేస్తున్నామని తెలిపారు రుణం మొత్తంలో 20 శాతం సబ్సిడీ, 60శాతం ఎన్సీడీసీ నిధులు పోను 20 శాతం లబ్ధిదారులు భరించాల్సి ఉంటుందన్నారు. 60 శాతం లోన్‌కు పావలావడ్డీ వర్తిస్తుందన్నారు. ఆడిట్, ఎన్నికలు జరిగిన సహకార సంఘాల సభ్యులకే రుణాలు పంపిణీ చేస్తామన్నారు. సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 5,200 గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు ఉన్నాయని, వీటిలో అర్హత కల్గిన సభ్యులకే రుణాలు ఇస్తామని స్పష్టం చేశారు. గొర్రెల పెంపకందారుల సమస్యలను పరిష్కరించేందుకు జీవమిత్రల వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలిపారు. పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ సుదర్శన్‌కుమార్, జిల్లా గొర్రెల అభివృద్ధి విభాగం ఏడీ డాక్టర్ చంద్రశేఖర్, గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు. అర్హత ఉన్న సొసైటీలకే అందించండి ఎన్సీడీసీ నిధుల(రూ.45 కోట్ల)ను రాజకీయాలకు తావులేకుండా అర్హత కలిగిన సొసైటీలకే రుణాలుగా అందించాలని ఏపీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం నేతలు కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లాకు వచ్చిన గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ ఎండీ ఎం శ్రీనివాసరావును సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పీ గోవిందు, నాయకులు జేఎన్ శేషయ్య వినతిపత్రం అందించారు. జీవక్రాంతి, పశుక్రాంతి పథకాల్లో గొర్రెల కాపరుల పిల్లలకు ఉపాధి కల్పించాలని, గడువు ముగిసిన నేపథ్యంలో జిల్లా యూనియన్‌కు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. నాయకులు జీ ఆంజనేయులు, కె.మద్దిలేటి, కే రామక్రిష్ణ, జీ రాంమూర్తి, కే రాముడు, చంద్రన్న తదితరులు ఉన్నారు. -
కొత్తగా 4 క్రీడా గురుకులాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఒకేసారి నాలుగు క్రీడా గురుకుల పాఠశాలల ఏర్పాటుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా నాల్గింటిని రాష్ట్రానికి మంజూరు చేసింది. ఒక్కో పాఠశాలకు తక్షణ నిర్వహణకు గాను రూ. కోటి వంతున నిధులు విడుదల చేసింది. వీటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమచేయడంతో పాఠశాలల ఏర్పాటుకు గిరిజన సంక్షేమ శాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు మొదలు పెట్టింది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ సమీపంలో వీటి ఏర్పాటుకు ప్రాథమికంగా నిర్ణయించింది. స్థలాల లభ్యత, మౌలిక వసతులను పరిశీలిస్తున్న అధికారులు... వారంలోపు ఖరారు చేయనున్నారు. -
సమాజంలో ఉపాధ్యాయులే కీలకం
వడమాలపేట : విద్యార్థులు ఏ రంగంలో రాణించాలన్నా, సమాజం బాగుండాలన్నా గురువులే కీలకమని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. శనివారం పత్తిపుత్తూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో కొత్తగా నిర్మించిన అదనపు భవనాలను ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు పేదకుటుంబాల నుంచి వచ్చిన వారేనని, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. అనంతరం ఆమె ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. భవనం శిథిలావస్థకు చేరుకుందని పాఠశాల పల్లంలో ఉండడం వల్ల వర్షం వస్తే నీళ్లు తరగతి గదులలోకి వస్తాయని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంగన్వాడీలకు 200 కుర్చీల పంపిణీ.. మండలం గ్రాంట్ నుంచి 43 అంగన్వాడీ కేంద్రాలకు 200 కుర్చీలను శనివారం ఎమ్మెల్యే ఆర్కే రోజా పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం కోసం వచ్చే గర్భిణులు, బాలింతలు కిందకూర్చుని భోజనం చేయడానికి పడుతున్న ఇబ్బందులను గుర్తించే వీటిని మండల గ్రాంట్ నుంచి అందజేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ టీచర్ల డ్రస్కోడ్, పనితీరు బాగుందని కితాబిచ్చారు. చిన్నక్క మృతికి సంతాపం.. మండలంలోని పూడి గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుడు రామయ్య కుమార్తె చిన్నక్క మృతికి ఎమ్మెల్యే ఆర్కే రోజా సంతాపం తెలిపారు. శనివారం ఆమె పూడి గ్రామానికి చేరుకుని చిన్నక్క మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కార్యక్రమాలలో ఎంపీపీ మురళీధర్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీలక్ష్మి, ఎంఈఓ పద్మావతి, సీడీపీఓ పద్మజారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు జైమునీంద్రులు, సూపర్వైజర్ తులసీ, పత్తిపుత్తూరు సర్పంచ్ ఆవుల ప్రతిమ, ఎంపీటీసీ రంగనాథం, నాయకులు సదాశివయ్య, సుబ్రమణ్యంయాదవ్, మధన్‌మోహన్‌రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, తులసీరామిరెడ్డి, హరిరెడ్డి, లోకేష్‌రెడ్డి, వెంకటరెడ్డి, రాజశేఖర్, నాగరాజు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
అభాండం
ఉదయాన్నే సొసైటీలోకి అడుగుపెట్టేసరికి మా సెక్రటరీ గారు ఇంకా రాలేదు. ఆయన అప్పుడే రాడు కూడా. నా సీట్లోకి వెళ్లి నిశ్చింతగా వెనక్కి జారగిలపడి కూర్చున్నాను. ‘‘అరేయ్ రామూ!’’ పరుగు పరుగున వచ్చీ రావడంతోనే నన్ను లోగొంతుతో పిలిచాడు శంకర్రావు.‘‘ఏరా శంకూ! ఏమైందిరా..’’‘‘రా.....రా!’’ అంటూ నా చెయ్యి పట్టుకుని బయటకు లాక్కుపోయాడు. ‘‘ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు?’’ నెమ్మదిగా శంకు చెయ్యి విడిపించుకుంటూ అన్నాను. ‘‘నాకు చేతులూ, కాళ్లూ ఆడటం లేదురా? భయంగా వుంది.’’ అంటూ బావురుమని ఏడ్చేశాడు. ‘‘అరేయ్ ఎందుకురా ఏడుస్తావ్? ఏమైందో చెప్పరా?’’ ఆత్రుతగా అడిగాను.శంకర్రావు కూడా నాతో సొసైటీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఇద్దరం ఒక్కసారే సొసైటీలో చేరాము. మాతోపాటు మరో ఇద్దరు సీనియర్లున్నారు. సెక్రటరీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగి. మా మీద అజమాయిషీ చెయ్యడానికి వచ్చిన అధికారి. నలభై గ్రామాలు ఊరూరా తిరిగి అప్పులు వసూలు చేసే కష్టం మాది, రుణాలు బట్వాడా చేసి వేలకు వేలు లంచాలు వసూలు చేసుకునే అధికారం ఆయనది.నన్ను ఆలోచనల్లోనుంచి బయటపడేస్తూ మా సొసైటీకి కొద్ది దూరంలో ఉన్న పాడుబడ్డ ఇంట్లోకి లాక్కుపోయాడు. అది శంకూ వాళ్ల ఇల్లే. అన్నదమ్ముల గొడవల్లో వాటాలు నప్పక ఇంట్లో దీపం వెలిగించే దిక్కులేక పాడుబడిపోయింది. వాళ్ల తండ్రి పోయాక అన్నదమ్ములు నలుగురికీ పెళ్లిళ్లు అయ్యాయని, ఎవరి మట్టుకు వాళ్లు వేరే కాపురాలు పెట్టుకున్నారని చెప్పాడు. అందరిలో ఆఖరివాడైన శంకుకే ఆ ఇల్లు ఇద్దామని వాళ్లమ్మ కోరికట. శంకే ఓ రోజు సొసైటీలో ఉండగా తన కథంతా చెప్పాడు.నేరుగా లోపల ఉన్న గదిలోకి తీసుకెళ్ళాడు శంకు. మౌనంగా అనుసరించాను. గది తలుపులు తెరవడానికి తటపటాయిస్తున్నాడు. దగ్గరగా మూసి వున్న తలుపుల్ని టక్కున కాలితో తన్నాను. తలుపులు రెండు బార్లా తెరుచుకున్నాయి. లోపల దృశ్యం చూసి ఒక్కసారిగా అదిరిపడ్డాను. శంకు మాత్రం బాధతో గబుక్కున కళ్లు మూసుకున్నాడు.ఎదురుగా శంకు పెద్దన్నయ్య. మా సొసైటీ ప్రెసిడెంట్. గదిలో ఉన్న కిటికీ రాడ్‌కు తాడు కట్టి ఉరిపోసుకుని చచ్చిపడి ఉన్నాడు. శంకే తేరుకుని గబాలున వెళ్ళి వాళ్లన్నయ్య మెడకు ఉన్న తాడు కత్తెరతో కత్తిరించబోయాడు. నేనే టక్కున అడ్డుకుని వద్దని వారించాను. ఇంట్లో వాళ్లకి కబురు చెప్పి ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దామని శంకుని బలవంతంగా బయటకు లాక్కొచ్చాను. శంకు దుఃఖం ఆపుకోలేకపోతున్నాడు. ఇద్దరం రోడ్డు మీదకు వచ్చాము. ఇంతలో మా సొసైటీ వైస్ ప్రెసిడెంట్ శివరామ్మూర్తి గారు అటుగా వస్తూ మమ్మల్ని చూశారు. గుండెల్లో నుండి తన్నుకొస్తున్న దుఃఖం ఆపుకుంటూ కళ్లు తుడుచుకుంటున్న శంకుని చూసి ‘‘ఏమైంది?’’ అంటూ శంకు భుజం మీద చెయ్యేశాడాయన. ఏడుస్తూ జరిగింది చెప్పాడు శంకు. ‘‘కొంపలంటుకుంటాయ్. పోయినోడు చక్కగానే ఉరేసుకు చచ్చిపోయాడు. ఇది గాని పోలీసులకు తెలిస్తే అందర్నీ అనుమానంతో చంపుకు తింటారు. ఊరందరికీ ఈ విషయం తెలియక ముందే శవాన్ని మామూలుగా పడుకోబెట్టేద్దాం. ఏదో జ్వరంతో చనిపోయాడని జనాల్ని నమ్మించాలి. ఎవరికీ అనుమానం రాకుండా మీ వాళ్లకు కబురు చెయ్యి..’’ అంటూ ముందుకు సాగిపోయాడాయన.ఆయనన్నదీ కరెక్టే అనిపించింది. పావుగంటలో శంకు అన్నదమ్ములతో పాటు వాళ్ల అమ్మగారు వచ్చేశారు. ఉరితాడు కత్తిరించి ఇంటి బయట చాప పరిచి శవాన్ని తిన్నగా పడుకోబెట్టారు. ఊరందరికీ విషయం తెలిసేలోగా శవాన్ని శ్మశానానికి తీసుకుపోవడం మంచిదని శివరామ్మూర్తిగారే దగ్గరుండి కార్యక్రమాలు ఆదరాబాదరా పడుతూ పూర్తి చేయించాడు. నాకా క్షణం ఆయన మీద వీసమెత్తు అనుమానం కూడా కలగలేదు. శవాన్ని నిలువుగా పడుకోబెట్టినా కాళ్లు రెండూ ముడుచుకుని బిగుసుకుపోయాయి. నిటారుగా సాగదీద్దామని శంకు అన్నదమ్ములు, బంధువులు ఎంత ప్రయత్నించినా కుదరలేదు. శవానికి స్నానం చేయిస్తున్నప్పుడు నేనే కాదు అక్కడున్న వాళ్లంతా అదిరిపడ్డారు. మా సొసైటీ వైస్ ప్రెసిడెంట్ శివరామ్మూర్తిగారైతే తల బాదుకుని ఏడ్చేశారు. ‘‘అయ్యో ఎంత పనైపోయిందిరా తమ్ముడూ. తప్పు చేశాం రా! వీడేదో తాగిన మైకంలో బాధలు తట్టుకోలేక ఉరి పోసుకున్నాడనుకున్నాను. ఇలా జరిగుంటుందని ఊహించలేదురా! వీడ్నెవరో చంపేశార్రా తమ్ముడూ. చంపేసి మీ ఇంట్లోనే ఉరి పోసుకుని చచ్చిపోయినట్టు తెచ్చి పడేశారు’’ అంటూ తల బాదుకుని ఏడ్చాడాయన. శవమ్మీది రక్తపు మరకలు అది హత్య అని చెప్తున్నాయి.‘‘ఇప్పుడేం చేద్దాం..’’ అంటూ శివరామ్మూర్తిగారి దగ్గరకొచ్చి అడిగారు ముగ్గురూ.‘‘పోలీసు రిపోర్టు ఇస్తే హంతకులెవరో తెలుస్తుంది. కానీ మనం తొందరపడి శవాన్ని ముట్టుకున్నాం. ఉరితాడు కట్ చేశాం. ఇప్పుడు శవానికి స్నానం కూడా చేయించేశాం. హంతకుడి ఆధారాలన్నీ మన చేతులతో మనమే తుడిచేశాం. ఇప్పుడేం చేయాలో తోచటంలేదు.’’ అన్నాడాయన.చనిపోయినవాడు ఎలాగూ పోయాడు. ఇక లేనిపోని పెంట నెత్తిమీదకి ఎందుకని నిర్ణయించుకున్నారు శంకు అన్నదమ్ములు. శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్తున్న సమయంలో పెడబొబ్బలు పెట్టుకుంటూ వచ్చింది శంకు పెద్ద వదిన. పిల్లలు ముగ్గుర్నీ వెంటబెట్టుకు వచ్చిందావిడ. పాపం చిన్నపిల్లలు. ఆర్నెల్ల నుండి భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నాడట. భర్త చావు వార్త విని ఆమె వాళ్ల పుట్టింటి నుండి పిల్లల్ని తీసుకుని బావురుమంటూ పరిగెత్తుకొచ్చింది. శ్మశానం నుండి ఇంటికొచ్చాను గాని నా మనసు మనసులో లేదు. ఉరి పోసుకు చావ లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఎవరో హత్యే చేశారు. ఈ ఊర్లో ఆయనకి శత్రువులెవరబ్బా? ఆ రోజు శంకూ నేనూ సినిమాకి వెళ్లాము. నేనే బలవంతంగా శంకుని లాక్కెళ్ళాను. ‘‘మీ అన్నయ్యకి శత్రువులెవరున్నార్రా? వెధవలు మీ అన్నయ్యని బాగా చిత్రవధ చేసి చంపేశార్రా!’’ శంకును రెచ్చగొట్టాలనే అలా అన్నాను. కోపమొస్తే కొంతైనా వాళ్ల అన్నయ్య వెనుక దాగి వున్న నిజాలు చెప్తాడని. ‘‘నువ్వన్నది నిజమేరా, అదే చేసుంటుంది’’ కసిగా పళ్లు కొరుకుతూ అన్నాడు. ‘‘ఎవర్రా?’’ ఆశ్చర్యంగా అన్నాను.‘‘బ్రాందీషాపు దగ్గర చికెన్ చీకులు అమ్ముతుందే అది’’ కోపంగా అన్నాడు శంకు.‘‘ఆవిడా!’’ ఆశ్చర్యంగా అన్నాను. ‘‘మా అన్నయ్యకి ఎలా తగిలిందో తెలీదురా.... రాత్రీ పగలు దానింట్లోనే ఉండేవాడని అంటార్రా అందరూ’’ బాధగా అన్నాడు శంకు.ఆ మర్నాడు రుణాల వసూలుకు ఊరి మీదకు బయలుదేరాను. దారిలో బ్రాందీ షాపు కనిపించింది. దాని పక్కనే శంకు చెప్పిన ఆవిడ చీకుల కొట్టు కనిపించింది. అప్రయత్నంగా అటు వెళ్లాను. ‘‘ఏం బాబూ ఇలావచ్చావు? ఒక కవాపుల్ల తింటావా?’’ అంటూ అప్పుడే నిప్పుల మీద కాల్చిన చికెన్ ముక్కలు చూపిస్తూ అడిగిందామె. ఒక కర్రకు గుచ్చి వున్నాయవి. దాన్నే చీకులు అంటారేమో అని అనుకున్నాను.‘‘మా ప్రెసిడెంట్‌గారు చనిపోవడం చాలా బాధాకరం కదా! ఆయనకూ మీకు మంచి స్నేహం వుందని, ఆయనే మీకు లోను ఇప్పించారని విన్నా’’ అన్నాను ఆమె కళ్లలోకి చూస్తూ.‘‘అయ్యో! ఆయన అంత ఏగిరం పడే మనిషి కాదు బాబు. బ్రాందీ షాపుకొస్తే సొసైటీ ప్రెసిడెంట్గోరు కదా మీ ఇంట్లో కూర్చుని మందు తాగుతారు అని బ్రాందీ షాపు ఓనరుగారు చెప్పిన దగ్గర నుండి మా ఇంట్లో కూర్చుని మందు తాగి వెళ్లిపోయేవారు బాబు అంతే!’’ అంది ఆమె. ఇంత కంటే ఆమె నుండి ఎక్కువ రాబట్టలేమనిపించింది.ఆ మర్నాడు సొసైటీలో కూర్చున్నాను. శివరావు ఏడుపు మొహం పెట్టుకుని కూర్చున్నాడు. ‘‘గురూ! నీకు తెలుసా! మన ప్రెసిడెంట్ గాని బ్రతికి ఉంటే ఈ సెక్రటరీగాడి పనైపోను.’’ కసిగా పళ్లు కొరుకుతూ అన్నాడు అటెండర్ శివరావు.‘‘నిజమా?’’ ఆశ్చర్యంగా అడిగాను.‘‘ప్రెసిడెంట్ గారి పేరు చెప్పి రైతులందరి దగ్గరా అప్పులిస్తూ డబ్బులు నొక్కేస్తున్నాడని తెలిసిందట. అంతే! ఆయన ఆఫీసుకొచ్చి గది తలుపులు వేసి మరీ బండ బూతులు తిట్టాడు. ఈ నెల్లో ఈయన గార్ని మన సొసైటీ నుండి సాగనంపేస్తానని కూడా అన్నారు’’ అన్నాడు.నాకంతా అయోమయంగా ఉంది. ప్రెసిడెంట్‌కి తెలీకుండా ఇన్ని లక్షలు అప్పులిస్తూ లంచాలు తీసుకుంటున్న సెక్రటరీకి ఆయన్ని చంపేసేటంత ధైర్యం ఎక్కడిది?‘‘మన వైస్ ప్రెసిడెంట్ శివరామ్మూర్తిగారు మధ్య పడకపోతే ఎలా ఉండేదో’’ మళ్లా శివరావే అన్నాడు. ‘‘శివరామ్మూర్తిగారా?’’ ఆశ్చర్యంగా అన్నాను. ‘‘అవును. సెక్రటరీ గాడెళ్ళి ఆయన దగ్గర తన గోడు వెళ్లబోసుకుని ఉంటాడు. ప్రెసిడెంట్ గారు చనిపోయే ముందు రోజే రాజీ కోసం ముగ్గురూ ఆ రంభ ఇంట్లో మందు పార్టీ చేసుకున్నారు గురూ’’ అన్నాడు శివరావు.ఉలిక్కిపడ్డాను. నాకెందుకో ఎక్కడో, ఏదో జరిగిందనిపించింది. శంకు కోసం సెల్ తీసి ఫోన్ చేశాను. నా అనుమానాలన్నీ వాడికి పూస గుచ్చినట్టు చెప్పాను. ఇద్దరం బ్రాందీ షాప్ దగ్గరకు వెళ్ళాము. అక్కడికి కొద్ది దూరంలోనే ఉంది చీకుల దుకాణం. దాని వెనుకే వున్న రంభ ఇంటికెళ్ళాము. వాళ్లాయన లేడు ఎక్కడికో వెళ్లాడని చెప్పింది.‘‘బ్యాంకోళ్లిద్దరూ మా ఇంటికొచ్చాసారేం బాబూ’’ అంది నవ్వుతూ.‘‘నీతో మాట్లాడాలి.’’ అన్నాను నేను. ‘‘... మన సొసైటీ ప్రెసిడెంట్ ఆత్మహత్య చేసుకోలేదు. ఎవరో చంపేసి అక్కడ పడేశారు’’ అన్నాను నేనే ఆమె కళ్లల్లోకి తీక్షణంగా చూస్తూ. ‘‘నిజమా! ఎంత ఘోరం’’ ఆశ్చర్యం నటిస్తూ అంది రంభ. ‘‘చనిపోయిన రాత్రి మా అన్నయ్య మీ ఇంట్లోనే ఉన్నాడట కదా’’ శంకు కోపంగానే అన్నాడు. ఆ మాటకు ఒక్కసారే అదిరిపడింది.తేరుకొని, – ‘‘అవునవును బాబు.. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, శివరామ్మూర్తి గారు ముగ్గురూ ఉన్నారు. వాళ్లతో మా ఆయన కూడా ఉన్నాడు.’’ అంది తడబడుతూ.‘‘ఆ రోజు ఇక్కడే గొడవ పడి మీరే మా ప్రెసిడెంట్ గారిని చంపేశారని తెలిసింది’’ కావాలనే అబద్ధం ఆడాను. ‘‘అయ్యో! గొడవ పడ్డం మాట నిజమే. మీ అన్నయ్య గారే సెక్రటరీగారితో గొడవ పడ్డారు. ఆ గొడవలోనే చిన్న తోపులాటలో మీ అన్నగారి తల బలంగా గోడకు తగిలింది. అంతే మీ అన్నగారు సొమ్మసిల్లి పడిపోతే మా ఆయనే సాయం చేసి ఆటో ఎక్కించాడు. తర్వాత ఏమైందో మాకు తెలీదు.’’ అంది భోరున ఏడుస్తూ. ఆ వెంటనే ఇదంతా పోలీసు కమిషనర్ ఆఫీసుకు వెళ్లి చెప్పాము. ఆ మర్నాడు పోలీసు జీపు నేరుగా వచ్చి మా సొసైటీ ముందు ఆగింది. సెక్రటరీని, ప్రస్తుత ప్రెసిడెంట్ శివరామ్మూర్తి గారిని జీపులో ఎక్కించుకుని వెళ్లారు పోలీసులు. ఆ విషయం ఊరంతా గుప్పుమంది. ఆ మధ్యాహ్నం పోలీసులు రెండు మూడు జీపుల్లో వచ్చి నేరుగా శ్మశానానికి వెళ్లారు. వాళ్లతోపాటు శంకు కుటుంబ సభ్యులందర్నీ తీసుకువెళ్లారు. శవాన్ని పోస్టుమార్టవ్ు కోసం పెద్దాసుపత్రికి తీసుకుపోయారు పోలీసులు. రెండు రోజుల ఇంటరాగేషన్ కోసం పోలీసు కస్టడీలో ఉన్నారు సెక్రటరీ, కొత్త ప్రెసిడెంట్ శివరామ్మూర్తి. మూడోరోజు ఇద్దరూ సొసైటీకి వచ్చారు. వస్తూనే నన్నూ, శంకుని తన కేబిన్‌లోకి పిలిచాడు ప్రెసిడెంట్ శివరామ్మూర్తి. అతని పక్కనే సెక్రటరీ కూడా కూర్చున్నాడు. ‘‘మీ ఇద్దరూ మంచి పని చేశార్రా! చనిపోయే ముందు రోజు మేము ముగ్గురం కలిసి మందు కొట్టడం నిజమే. సెక్రటరీగారు, మీ అన్నయ్య గొడవ పడ్డం నిజమే. కానీ వాణ్ని మేము చంపలేదురా. చేతులారా స్నేహితుణ్ని చంపేసేటంత దుర్మార్గుడిగా కనిపిస్తున్నానా?’’ దాదాపు ఏడుస్తున్నట్టే అన్నాడు శివరామ్మూర్తి. ‘‘ఆ రోజు ఆటో ఎక్కించి తీసుకొస్తూ సోడాతో మొహం కడిగేసరికి మీ అన్నయ్య తెలివిమీదకి వచ్చాడు. మీ అన్నే తనింట్లో పడుకుంటాను దించెయ్యమంటే ఆ గదిలో చాప మీద పడుకోబెట్టి వచ్చేశాము. అంతే మాకు తెలిసిన నిజం.’’ అంటూ చెప్పాడు సెక్రటరీ. అదే సమయంలో పోలీసు స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. హంతకుడు దొరికాడు.నలుగురం పోలీసుస్టేషన్ దగ్గరికెళ్ళేసరికి బయట రంభ ఏడుస్తూ నిలబడి వుంది. ఎస్సై ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు రంభ మొగుడు. ‘‘వీడే మీ సొసైటీ ప్రెసిడెంట్‌ని చంపేశాడు. చెప్పరా.. చెప్పు.’’ అంటూ పక్కనే చేతులు కట్టుకు నిలబడ్డ రంభ మొగుణ్ని లాఠీతో కొడుతూ అన్నాడు ఎస్సై.‘‘అవును నేనే.. నేనే చంపేశాను. ఆటోలో మీరు అతణ్ని వాళ్ల పాడుబడ్డ ఇంట్లో దించి వెళ్లడం చూశాను. అర్ధరాత్రి ఎవరూ చూడకుండా వెళ్లి గొంతు నులిమి చంపేశాను.’’ కసిగా అన్నాడు రంభ మొగుడు. ‘‘అతణ్ని చంపాలన్న పగ నీకెందుకు?’’ అడిగాడు ఎస్సై.‘‘మా ఆవిడ.. మా ఆవిడతో తిరిగితే నేను ఊరుకుంటానా? ’’ కోపంగా అరిచాడు. మా నలుగురికీ నోట మాట కరువైంది. ఇందులో నిజమెంతో.. అబద్ధమెంతో ఆ భగవంతుడికే తెలియాలి. నిజం చెప్పగలిగిన రంభ ‘‘చనిపోయిన దేవుడులాంటి మనిషి మీద లేనిపోని అభాండాలు వెయ్యకండి బాబు.’’ అంటూ తల బాదుకుని ఏడుస్తోంది. -
దాని
సమాధుల తోట మెయిన్ గేటులోంచి లోపలికి వస్తున్న అతణ్ని ఆమె పలకరించింది. ‘‘తెల్లవారుజామున వస్తే సరిపోయేది కదా, ఇంత ముందుగానా?’’ అంది. ‘‘ముందుగానే చూద్దామని,’’ అన్నాడు. అతను ఎవరితో మాట్లాడాడో తెలియక పక్కనున్న వాళ్లు దిక్కులు చూశారు. ‘పెద్దవాడు. మతిస్థిమితం లేదు.’ అని నిశ్చయించుకున్నారు. ఎదుటలేని మనిషితో మాట్లాడుతూ లోనికి పోతున్నాడు. ‘‘ఈస్టర్ పండగ రోజు ఉదయం నా సమాధిలోంచి లేచి, నన్ను వెంటబెట్టుకొని తీసుకుపోవడానికి వచ్చిన నా తండ్రితో కలిసి వెళ్లిపోతాను. ‘‘ఆ రోజే ఎందుకు?’’ అతను అడిగాడు. ‘‘సిలువ వేయబడ్డ తన కుమారుణ్ని బతికించి, తీసుకుని పోయింది ఆరోజునే. తన పిల్లలందరినీ నా తండ్రి ఆ రోజే తీసుకొని పోతాడు.’’ ‘‘సమాధిలోంచి లేచి, నువ్వు నీ తండ్రితో వెళ్లిపోయావని నాకెట్లా తెలుస్తుంది?’’ ‘‘నా సమాధి నాప బండ, తొలగి, పగిలి ఉంటుంది.’’ ఈ సంభాషణ హాస్పిటల్ బెడ్ మీద చావు బతుకుల్లో ఉన్న భార్యాభర్తల మధ్య జరిగింది. ‘‘మనిద్దరం కలిసే చనిపోదాం’’ అన్నాడు భర్త. ‘‘అలా కుదరదు. నాకు పిలుపు వచ్చింది. నీకు రాలేదు. నేను వెళ్లక తప్పదు.’’‘‘నేను ఒంటరిగా ఉండాలా?’’ ‘‘కొద్దిరోజులే! నీకూ పిలుపు వస్తుంది. నాతోనే స్వర్గంలో శాశ్వతంగా ఉంటావు’’ ‘‘నీ తండ్రి నన్ను నీ దగ్గరకు రానిస్తాడా? ఉండనిస్తాడా?’’ ఆమె ఆలోచనలో పడింది. ఏభై ఏళ్ల క్రితం వాళ్లిద్దరూ పెళ్లి చేసుకొని ఆమె తండ్రి ఇంటికి పోతే, కూతుర్ని ఇంట్లోంచి నెట్టేశాడు. తల్లీ, చెల్లి, తమ్ముడూ అడ్డంపడి ఆమెను లోనికి తీసుకుపోయారు. అతణ్ని వీధిలోనే నిలబెట్టాడు ఆమె తండ్రి. ‘‘కులం మతం లేని వాడి ముఖం నేను చూడను. నా గడప తొక్కరాదు’’ అన్నాడు. ఆమె ఇల్లు, ఊరు వదిలివచ్చి ఏభై ఏళ్లయింది. ఈ జీవితమంతా వాళ్లిద్దరూ సుఖంగానే ఉన్నారు. ‘‘ఈ లోకం తండ్రికి, ఆ లోకం తండ్రికి తేడా ఉంది. ఈయన సమాజం మనిషి. ఆయన స్వర్గం దాత. మనల్ని ఈ లోకంలో ఏకం చేసినట్టే ఆ లోకంలోనూ కలిపి ఉంచుతాడు,’’ ఆమె చెప్పింది. ‘‘నేనొక్కణ్నే ఇక్కడ ఉండను. నీతో వచ్చేస్తా, ఇప్పుడే’’ ‘‘ఆ సమయం రాలేదు. నీ చిట్టచివరి మనుమరాలి పెళ్లి చేసిందాకా నీకు పిలుపు రాదు’’ ‘‘అంతదాకా నేను ఒంటరిగా ఉండాలా? ఉండను!’’ ‘‘పిచ్చికన్నా! నీకు పని ఉంది. అందాకా ఉండాలి. ఇప్పటికీ నా తండ్రిని చాలాసార్లు బ్రతిమిలాడాను. సాకులు చెప్పి చెప్పి విసిగిపోయాను. నన్ను వెళ్లనివ్వు!’’‘‘నావల్ల అవుతుందా, వెళ్లు అనటానికి’’ ‘‘నువ్వు ఊ అనందే నేను ఈ బంధం తెంచుకోలేను.’’‘‘నువ్వు వెళితే, నేను ఒంటరిగా, నువ్వు ఒంటరిగా..’’ ‘‘తప్పదు. ఇరవై ఏళ్లు మనం ఒంటరి వాళ్లమే కదా, ఆపైనేగా జంటగా మారింది. ఇక కొంత కాలం ఎడబాటు, తర్వాత కలయిక, అన్యోన్య జీవనం శాశ్వతంగా’’ ఆమె మౌనంగా ఉంది. అతని కన్నీరు కదిలింది. ఉన్నట్టుండి అడిగాడు. ‘‘నువ్వు ఇప్పుడే చనిపోకపోతే ఏం?’’ ‘‘సమయం మన చేతుల్లో ఉందా? తండ్రి ఇష్టం.’’ పదేళ్ల కిందట, హాస్పిటల్ బెడ్ మీద, చేయి పట్టుకొని కన్నీళ్లు తుడిచి నవ్వింది. ‘‘మళ్లీ కలుద్దాం’’ అని కళ్లు మూసుకొంది. మళ్లీ కళ్లు తెరవలేదు. అదే ఆఖరు నవ్వు. అతనికి సమాధుల తోటలో ఆమె సమాధిని ఎన్నిసార్లు చూచినా తనివి తీరదు. ఆమెను చూచినట్లే ఉంటుంది. ప్రతి ఈస్టర్ రోజు రాత్రంతా ఆమె సమాధి పక్కనే కూర్చుంటాడు. ఆమె సమాధిలోనే ఉంటే దుఃఖ జీవి. లేచి తండ్రితో వెళితే ఆనంద జీవి. అందుకే ఆమె దుఃఖ విముక్తి కలగాలని తండ్రిని చేరుకోవాలని కోరుకుంటాడు. ఎప్పుడు సమాధి నాపబండ పగులుతుందా, తొలగుతుందా అని ఎదురుచూస్తుంటాడు.ఆమె తండ్రి దగ్గరకు పోయేటప్పుడు తనకు కనబడుతుందో లేదో, ఏ రూపంలో ఉంటుందో ఏమో, ఏమీ రూపం లేకుండా ఉండిపోతుందో ఏమో, తండ్రి కనిపిస్తాడో లేడో, ఇద్దరూ పవిత్ర ఆత్మ రూపంలో ఉంటారో ఏమో! అతణ్ని ఆమె గుర్తుపడుతుంది. పైగా ప్రతి ఈçస్టర్ రోజున పెళ్లినాటి బట్టలే కట్టుకోమంటుంది. అన్నీ తెల్లటి బట్టలే. చిరుగులు పట్టినా, చిమటలు కొట్టినా, రంధ్రాలు పడ్డా, ఆ బట్టలే, ఆ తెల్లటి బట్టలే కట్టుకోమంటుంది.ఆమెకిష్టం కదా, అవీ కట్టుకొంటాడు. ఆమె అతణ్ని గుర్తుపట్టటం తేలికే! ఏభై ఏళ్ల క్రితం అతను ఆమె చేయి పట్టుకొన్నాడు. ఆమె నవ్వింది. ‘‘నా చేయి పట్టుకొన్నావు’’ అంది. ‘‘అవును’’ అన్నాడు. ‘‘ఈ చేయి వదలవుగా’’ అని అడిగింది. ‘‘వదలను’’ అన్నాడు. ‘‘నిజం?’’ ప్రశ్నించింది. ‘‘నిజం, నేను చనిపోయినా వదలను’’ అన్నాడు. అప్పుడామె నవ్వింది. ‘‘మరి నువ్వూ?’’ అన్నాడు. ‘‘చనిపోయాక కూడా నీ చేయి వదిలిపెట్టను’’ అని నవ్వింది. ఆ నవ్వు ఏభై ఏళ్లు అతణ్ని బతికించింది. తోడుగా ఉంది. పదేళ్ల క్రితం హాస్పిటల్ బెడ్‌మీద, చనిపోయే ముందు నవ్వింది. అద్భుతమైన నవ్వు. అది పదేళ్ల నుంచి అతణ్ని బతికిస్తూ ఉంది. అప్పుడామె ధైర్యంగా ఉంది. నవ్వుతూనే ఉంది. అతను గుర్తు చేశాడు.‘‘చనిపోయినా నా చేయి వదలనన్నావు కదా’’ గుర్తుచేశాడు. ‘‘అవును. అన్నాను. నిజమే!’’ అంది. ‘‘మరి నన్ను విడిచి, మన పిల్లల్ని, పిల్లల పిల్లల్ని వీడి నువ్వు వెళతానంటున్నావే?’’ నవ్వింది. అంత అనారోగ్యంలో కూడా ఎంత చక్కగా నవ్విందో. ‘‘నేను ఇచ్చిన మాట తప్పటం లేదు’’ అంది. ‘‘మరి?’’ రెట్టించాడు. ‘‘నా తండ్రి రమ్మంటున్నాడు తండ్రిమాట జవదాటగలనా?’’ వెంటనే అడిగాడు. ‘‘నాకిచ్చిన మాట తప్పుతావా?’’ ‘‘తప్పాలని లేదు. నేను బలహీనురాలిని. ఏం చేయను? నీ బిక్కముఖం చూస్తుంటే నాకు బాధగా ఉంది. నన్ను, నా తండ్రితో వెళ్లనివ్వు’’ ‘‘కాదు, నేనూ, నీతో వస్తాను’’‘‘సంతోషమే. ఎన్నడూ ఆటంకపెట్టని నువ్వు, ఎప్పుడూ అనుమతించిననువ్వు, ఎల్లప్పుడు నన్ను అనుసరించిన నువ్వు, ఇప్పుడూ అనుసరిస్తానంటే ఆనందమే. కానీ, నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నై. నా తండ్రి నువ్వేం చేయాలని సంకల్పించి నిన్ను సృజించాడో, అవి నెరవేర్చిందాకా నువ్వురాలేవు. సంతోషంగా ఉండు. నిన్ను ఈ లోకం మీదికి ఆ లోకపు తండ్రి ఎందుకు పంపాడో అది తీరిందాకా నీకు పిలుపు రాదు. పిలుపు రానంతకాలం నువ్వు బయలుదేరలేవు. నువ్వు చేయవలసినవి, నువ్వే చేయవలసినవి, ఎన్నో పనులు ఉండి ఉంటాయి. నువ్వో పువ్వువు. పరిమళం పంచటమే నీ పని. కాలం తీరిందాకా పువ్వు వాడదు. రాలదు. పువ్వు రాలే సమయం వస్తే ఏ బంధమూ ఆపదు. ఆ గడియ వచ్చాక ఎవరూ ఉండరు. నా మాటేంటంటావా? నా తండ్రి నాకు అప్పగించిన పని సంపూర్ణంగా, నిర్విఘ్నంగా నెరవేర్చాను. నా తండ్రి నన్ను చెయ్యమన్న పనులన్నీ చేయటానికి నువ్వు అన్ని విధాలా సహకరించావు. నా తండ్రి నా కోసం నిన్ను సృష్టించాడు. నా పని అయిపోయింది. నన్ను తీసుకుపోతున్నాడు. నీ పనికాలేదు. నిన్నిక్కడే ఉంచుతున్నాడు.’’‘‘ఎంతకాలం, ఇలా.. ఒంటరిగా?’’‘‘నాకేం తెలుసు. నా తండ్రికి తెలుసు. నువ్వు వచ్చేముందు నా తండ్రి నాకు చెబుతాడు. నీకోసం చూస్తూ ఉండే నేను, నీకు ఎదురుగా వస్తాను. చేయి పట్టుకుంటాను. వెంట తీసుకుపోతాను. తండ్రికి చూపుతాను. దగ్గర కూర్చోబెడతాను. ఈ లోకంలో నా తండ్రి ఇంట్లోకి నిన్ను తీసుకొని పోలేకపోయాను. కానీ ఆ లోకంలో నా తండ్రి దయా సన్నిధిలో నిన్ను కూర్చోబెడతాను. ఇప్పుడు చెబుతున్నాను విను. నీ చేయి ఎప్పటికీ విడిచిపెట్టను’’ఆమె ఓదార్పు వింటుంటే, దుఃఖం తగ్గి అతనికి ఎంతో ఉపశమనం కలిగింది.‘‘నిన్ను నాకిచ్చినట్లే ఇచ్చి, ఇంతలోనే తీసుకుపోవటం ఏమిటి?’’‘‘ఇవ్వటం, తీసుకోవటం తండ్రి ఇష్టం. కొడుకునిచ్చాడు. కొడుకు సిలువ మీద రక్తం చిందించాడు. మనల్ని పునీతుల్ని చేశాడు. ఆ దైవరక్తమే మనకు రక్షణ, నిరీక్షణ ఇచ్చింది. ఈ లోకంలో రక్షణ. ఆ లోకంలో నిరీక్షణ. నేను నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను.’’ ‘‘ఇది నీకు న్యాయంగా ఉందా?’’‘‘అది నా తండ్రి నిర్ణయం. దానికి తిరుగులేదు. నీకు పిలుపు రాగానే నువ్వు వచ్చి నాతో కలిసి ఉంటావు.’’సమాధుల తోటలో పండువృద్ధుడు, ఎనభై ఏళ్లవాడు ఆమె సమాధి చుట్టూ తిరిగాడు. చుట్టూ చూశాడు.చిమ్మ చీకటి. అర్ధరాత్రి. నిశ్శబ్దం సమాధులతోటను పరిపాలిస్తూ ఉంది. సమాధి చుట్టూ కొవ్వొత్తులు వెలిగించాడు. వెలుతురులో సమాధిని చూశాడు. నాపబండ ఏదీ పగట్లేదు. సమాధి చెక్కు చెదరకుండా ఉంది.తండ్రిరాలేదు. ఆమె వెళ్ళలేదు. ఈ లోకంలోనే విశ్రాంతిగా ఉంది. అతను నిశ్చయించుకొన్నాడు.ఆమె పల్చటి మనిషి. గుత్తులపూల చెండ్లు బరువని ఒక్క గులాబిపెట్టుకొనేది. వేలెడు కనకాంబరాల మాల తలలో చెక్కుకొనేది.ఆమెకు సొమ్ములిష్టంకాదు. చీరెలిష్టంకాదు. పూలిష్టంకాదు. కాని భర్త ఏం తెచ్చినా, ఇచ్చినా పెట్టుకొనేది. కట్టుకొనేది. అలంకరించుకొనేది. గులాబీలు, కనకాంబరాల మాలలు తెచ్చాడు. సమాధిని అలంకరించాడు. ఆమెను చూసుకున్నట్లుగా ఉంది. సమాధిలోంచి ఆమె సమ్మతిని తెలుపుతూ తల ఊపి ఉంటుంది.అలంకరింపబడ్డ సమాధిని తనివి తీరా చూసుకోవటానికి పెద్దకొవ్వొత్తులు వెలిగించాడు. సమాధి దేదీప్యమానంగా వెలిగింది. తను సంతృప్తిగా నిలబడ్డాడు.అతనికెప్పటికీ అర్థంకాని సంగతి, ఆమె ధైర్యం! మృత్యువు ముఖంమీదికి వచ్చినా నవ్వగలగటం. అద్భుతంగా నవ్వగలగటం ఆమెకే చెల్లు. పైగా భర్తను ఓదార్చటం! చావును అంత ధైర్యంగా ఆహ్వానించేవాళ్లు అరుదు. ఆమె అరుదైన స్త్రీ. ‘‘నీకు భయంలేదా?’’ అని పదేళ్ల క్రితం, మృత్యుముఖంలో ఉన్న ఆమెను అడిగితే నవ్వుతూ చెప్పింది – ‘‘నాకేం భయం! ఇక్కడ నువ్వున్నావు! అక్కడ నా తండ్రి ఉన్నాడు’’.ఆమె మాటలు అతనికి ధైర్యమిచ్చాయి. ఆమె ఓదార్పు గొప్పవరం. ‘‘ఇదిగో నువ్విచ్చిన పువ్వు’’ అని తలలోని గులాబీని తడిమింది. ‘‘ఇది నీ ప్రేమ. ఇది నా సౌభాగ్యం. దీంతో నా తండ్రి దగ్గరకుపోవటం, ఎంత ఆనందం!’’ నవ్వింది.పూవును తడిమితే పరిమళం తుట్టెరేగినట్లు లేచింది. ఆమె అంతా పరిమళమయింది. ఆమె ఏమీ కోరేదికాదు. ఇది లేదు, అది లేదు అని విసుక్కొనేది కాదు. ఏమీ లేకపోయినా, సుఖంగా సంతోషంగా ఉండేది. సంసార సాగరంలో మునిగి తేలుతూ, ఒక్క నీటి చుక్క కూడా అంటకుండా ఉండటం ఆమెకే చెల్లు.ఆమె సమాధి చుట్టూ పూలు అలంకరించి, నాపబండ మీద పూల మాలలుంచి, కొవ్వొత్తులు వెలిగిస్తే అతనికి తృప్తి! సాంబ్రాణి కడ్డీలు కాలిస్తే వచ్చే పరిమళం ఆమె ఇష్టపడేది. ఇష్టపడేదని ఎలా తెలుసునంటే, పరిమళం ఆఘ్రాణిస్తూ కూర్చునేది.అలంకరించిన సమాధి కొవ్వొత్తులు వెలిగించి అగరొత్తులు కాలిస్తే వచ్చే పరిమళం సమాధుల తోటలో చాలా దూరం వ్యాపించింది, పొగతో పాటు. ముసలిప్రాణం అలసి పోయింది. నిలబడలేకపోయాడు. సమాధిమీద కూర్చోబోయాడు. అపచారమనిపించింది. సమాధి నాపరాతి బండనానుకొని నేల మీద కూర్చొని, తల సమాధి మీద పెట్టుకొన్నాడు. ఆమె చేతుల్లో తన తలపెట్టుకొన్నట్లు ఆనందించాడు. అగరబత్తీల పొగ తలలోకి దూరి, ఆమె సుతారంగా తల నిమిరినట్లు అనిపించింది. మగతగా ఉంది. కళ్ళు మూసుకుపోయాయి. మాగన్నుగా నిద్రపట్టేసింది. నిద్రలోనే, నేల మీదికి, దుమ్ములోకి, ధూళిలోకి, దూగరలోకి జారిపోయాడు. సమాధి బారుగా దానిని ఆనుకొని, దానిమీద చేయివేసి, బక్కప్రాణి నిద్రపోయాడు. ఆమె పక్కలో ఉన్నట్లు, తన చేయి ఆమె పైన వేసినట్లు సుఖంగా నిద్రపోయాడు.అమావాస్య అర్ధరాత్రి. పైగా సమాధులున్న చోటు. అటు రాత్రి మనుషులు రారు. ఈస్టరు తెల్లవారుజాము నుంచి పలచగా, తెల్లవారాక దట్టంగా జనసంచారం ఉంటుంది. నాపబండ చిట్లినట్లు అనిపించింది. కొద్దిక్షణాల్లోనే ఫటిల్లుమని పగిలిన శబ్దం. ఆమె సమాధిలోకి ప్రాణవాయువు ఊదినట్లు చిన్న శబ్దం వినవచ్చింది. అంతలో గాలి పీల్చినట్లు అలికిడి.బండకదిలింది. సమాధిలోంచి ఆమె వెలుపలికి వచ్చింది. అతన్ని చూచింది. ఆమె అతని దగ్గరకు రాలేదు. అతను ఆశించినట్లుగా ఆమె అతని తల నిమరలేదు. కాని చెప్పింది. ‘‘నా తండ్రి వచ్చాడు. నేను నా తండ్రితో స్వర్గానికి వెళుతున్నాను’’‘‘నా చేయి పట్టుకోవా?’’‘‘నేను మాటనే కాని, మనిషిని కాదు. నాకు నా సహజరూపంలేదు. నేనిప్పుడు నా ఆత్మస్వరూపం. నా తండ్రి స్వరూపం. నేన్నీకు కనబడను. నేను నీతో మాట్లాడగలగటం మన అన్యోన్య దాంపత్యానికి గుర్తు. ఈ దివ్యదేహంలో మనిషి మాటలు ఇంకా ఎంతోకాలం ఉండవు.’’‘‘నన్ను తాకవా?’’ – ‘‘తాకలేను.’’‘‘చేయి పట్టుకోవా?’’ – ‘‘పట్టుకోలేను’’‘‘నా తల సవరించవా?’’ – ‘‘సవరించలేను.’’‘‘ఏం? ఎందువల్ల? ఇష్టంలేదా?’’ – ‘‘ఇష్టంలేక కాదు. ఇప్పుడు నేన్నీ భార్యనుకాదు. నా తండ్రి కూతుర్ని. నాకు దేహం లేదు. నా తండ్రితో వెళుతున్నాను.’’‘‘నీ తండ్రి వచ్చాడా?’’ – ‘‘వచ్చాడు. నా చేయి పట్టుకొన్నాడు. నేను పసిపిల్లలాగా నడుస్తున్నాను. పడిపోవటం లేదు. ఎక్కువసేపు నీతో మాట్లాడితే పడిపోతానేమో.’’ ‘‘నీకు ప్రయాణం ఖర్చుకు డబ్బు కావాలి కదా! వస్తూ డబ్బు తెచ్చాను. ఇదిగో తీసుకో, దగ్గరుంచుకో..’’ – ‘‘నాకెందుకు డబ్బు?’’‘‘ఎందుకైనా మంచిది. తీసుకో’’ – ‘‘నాకు నా తండ్రి చేయి ఉండగా డబ్బెందుకు, ఎవరికైనా ఇవ్వు.’’‘‘కాదు నీకే ఇస్తా’’ – నీ చేయి లేదు. వెలుతురులాగా పొగలాగా, అస్పష్టమైన ఆకారం నీది. ఇదిగో డబ్బు ఇక్కడే పెడుతున్నా.’’ – ‘‘నీ ఇష్టం.’’డబ్బు తీసి, సమాధిమీద పెట్టి, దానిమీద పూల బరువు ఉంచి, ఆపైన ఆమె కుట్టిన ఎంబ్రాయిడరీ చేతి గుడ్డపెట్టి చూశాడు. గాలికి కొట్టుకొని పోదు అని నిర్ధారించుకొన్నాడు.ఆమె కావాలనుకొంటే ఈ డబ్బు తీసుకుపోతుంది. వద్దనుకొంటే వదిలి వెళ్ళిపోతుంది అనుకొన్నాడు.ఇంక ఆమె మాట కూడా వినిపించటంలేదు. స్వర్గానికి వెళ్ళిపోయింది కాబోలు, ఈ లోకపు బందిఖానా అయిన డబ్బును ఆ లోకపు స్వేచ్ఛాప్రాణికి ఇవ్వబోయి అపచారం చేశానా అని దిగులుపడ్డాడు.అంతలో ఆమె మాట మళ్లీ వినిపించింది. ‘‘నా తండ్రి పిలుస్తున్నాడు. నేను వెళతాను.’’ –‘‘వెళ్లొస్తానను’’– ‘‘అనలేను’’ – ‘‘నేనూ నీ వెంట వస్తాను’’ – ‘‘నా ఇష్టం ఏముంది?’’ ‘‘దేనికీ అడ్డుచెప్పేదానివి కాదుకదా! అన్నింటికి అవును, సరే, నీ ఇష్టం, అలాగే అనేదానివి కదా, ఇప్పుడు ఎందుకు నా ఇష్టానికి మాటకు, ఆలోచనకు అందకుండా ఉన్నావు’’‘‘అప్పుడు నీ భార్యను – ఇప్పుడు నా తండ్రి కూతురును’’‘‘నీ కొర్కెలన్నీ తీరాయా!’’‘‘నాకు కోర్కెలు లేవు. నా తండ్రి కోరిక, నీ కోరిక తీరటమే నాకు ముఖ్యం. మరి నేను వెళ్ళనా?’’‘‘మళ్ళీ ఎప్పుడో, ఎక్కడో, ఎలాగో మనం కలుసుకొనే రోజు?’’‘‘నా తండ్రి పిలుపు మేరకు నువ్వు వచ్చినప్పుడు మనది శాశ్వతమైన కలయిక.’’‘‘అందాకా నేను ఒంటరినా?’’ ‘‘నువ్వు ఎన్నుకోబడ్డ విత్తనానివి. నువ్వెట్లా మొక్కై, మానై, పుష్పించి ఫలించాలో అది నా తండ్రి ఇష్టం. నీ చేత ఇంకా ఏం చేయిస్తాడో ఆ తండ్రికి తెలుసు. ఆ పథకం పరిపూర్ణమయ్యేదాకా నీకు పిలుపురాదు. తండ్రి ఆహ్వానం ఉండదు. నిన్ను నా తండ్రి ఎందుకు ఎంచుకున్నాడో నాకు తెలియదు. నీకూ తెలియదు. ఈ తెలియనితనమే ఈ లోకంలో మన జీవితం. తండ్రి ఉద్దిష్టం నెరవేరితే, నీ పని అయిపోయినట్లే! అప్పుడు ఈ లోకానికి నీ అవసరం ఉండదు. నా తండ్రి పిలుపు వచ్చేదాకా ఆగు.’’‘‘మళ్ళీ నిన్ను చూచేరోజు?’’‘‘నా తండ్రి ఏర్పాటు చేసే ఉంటాడు.’’ ఆమె రూపం మసకబారింది. మంచులాగా విడిపోయింది. పొగ లాగా తేలిపోయింది. ఆమె ఆకారం లేదు. మాటలేదు. అర్ధరాత్రి అమావాస్య. నిశ్శబ్దం. శూన్యం.గాలి తేలి, ధూళి లేచి, సమాధి నాపబండకు తగిలి నేల మీద పడింది. నేల మీద ఉన్న అతని ముఖాన్ని తాకింది. నిద్ర చెడింది. లేచి కూర్చున్నాడు. కల గుర్తుకు వచ్చింది. వాస్తవమేమో అని భ్రాంతి కలిగింది. ఆమె తండ్రితో వెళిపోయిందన్న భావన స్ఫురించటంతో చటుక్కున లేచి నిలబడ్డాడు. సమాధిని చూశాడు. దాని చుట్టూ తిరిగాడు.పెట్టిన పూలు చెదరలేదు. వేసిన మాలలు కదలలేదు. చేసిన అలంకారం మారలేదు. కొవ్వొత్తులు ఆరిపోలేదు. అగరొత్తులు కాలిపోలేదు. పొగ ఆగలేదు.నాపబండ పగిలి, ఆమె లేచి, తండ్రితో వెళుతూ మాట్లాడిన మాటలు గుర్తుకు రాసాగాయి.గబగబా సమాధి చుట్టూ చూశాడు. నాపబండ పగల్లేదు. సమాధి ఒరగలేదు. ఆలోచించసాగాడు. ఆమె తండ్రితో వెళ్ళిపోవటం కలా, నిజమా?అతను ఊడిపోయిన పంచె కట్టుకొన్నాడు. లుంగలు చుట్టుకుపోయిన జుబ్బా సరిచేసుకొన్నాడు. కిందపడి గాలికి రెపరెపలాడుతున్న పై పంచె తీసి భుజాన వేసుకొన్నాడు.చేతిగుడ్డ కింది పూలు, వాటి కింది డబ్బుకాగితాల పొత్తి, చెక్కుచెదరకుండా స్ధిరంగా ఉంది.తెల్లవారుతూ ఉంది. సమాధుల తోటలో ఉన్న తమ ఆత్మీయుల, బంధువుల, అయినవాళ్ళ స్మృతి జెండాలుగా జనం వస్తున్నారు. అతను వెలుపలికి పోసాగాడు. అంతకు ముందే, అప్పటిదాకా నిద్రపోయిన సమాధుల తోట సంరక్షకుడు, లేచి, ముఖం కడుక్కొని, సమాధుల చుట్టూ తిరిగి చూచి వచ్చి విధి నిర్వాహణకు బయలుదేరాడు.ఆమె సమాధి కాంతి, పరిమళం ఆకర్షిస్తే అటు నడిచాడు. ఈమె బంధువులు వచ్చి వెళ్ళినట్లున్నారు అనుకొన్నాడు.తాను తెల్లవారుజామున లేచి చూచినప్పుడు ఆ సమాధి దగ్గర తెల్లటి ఆకారం కదులుతున్నట్లుగా ఉండటం గుర్తుకువచ్చింది.సమాధి మీద చేతిగుడ్డ, పూలు, డబ్బు కాగితాల పొత్తి చూశాడు. డబ్బు పైకి తీశాడు. లెక్కబెట్టాడు. కళ్ళవెంట నీళ్ళు తిరిగాయి. ఇంత డబ్బా? అనుకొన్నాడు. ఆనందం ఆగలేదు. తన సంవత్సర జీతమంత! ఇంత డబ్బు దేవుడి దానమే! జేబులో పెట్టుకొన్నాడు. తెల్లటి ఆకాశం గుర్తువచ్చింది.ఆగలేకపోయాడు.ఆవేశంతో ఊగిపోసాగాడు. పెద్దగా కేకలు పెడుతున్నాడు. ‘నా తండ్రి వచ్చాడు. నాకు దానం చేశాడు. ‘దాని’ తెల్లగా ఉన్నాడు. పొగలాగా ఉన్నాడు. మంచులాగా ఉన్నాడు. గాలిలో తేలియాడాడు. తోటలో దిగటం చూశాను. తోట నుంచి నిష్క్రమించటం చూశాను. ఆకాశంలోంచి దిగాడు. ఆకాశంలోకే వెళ్లిపోయాడు. నేను చూశాను. నా తండ్రి వచ్చాడు. తోటను ఆశీర్వదించాడు. నన్ను దీవించాడు. ఇదిగో దానం. ఇదిగో డబ్బు!’’ అని ఆనందంతో కేకలు పెడుతున్నాడు.జనం ఆశ్చర్యంగా అతడి అరుపులు వింటున్నారు.అతను సమాధుల తోట మెయిన్ గేటు నుంచి రోడ్డు మీదికి వచ్చాడు.అప్పుడే రద్దీ మొదలవుతూ ఉంది.సూర్యుడు రాకముందు, కనిపించకముందు, సూర్యకిరణాలు వచ్చి తొలివెలుగు, తొలి వెలుతురు సృష్టించినట్లు తూర్పు నవ్వుతూ ఉంది. ఆమె నవ్వుతూ ఉంది. అతనికి ఆనందంగా ఉంది. ముందుకు నడుస్తున్నాడు. ఆమె అడిగింది.‘‘అంతదూరం, ఇంటిదాకా నడిచే వెళతావా?’’ – ‘‘వెళ్తాను’’ఆమె అడిగితే సమాధానం చెప్పినట్లుగా అనిపించింది. ఆమె జాలిగా చెప్పింది.‘‘నడవలేవు, నామాట విను, టాక్సీఎక్కి ఇంటికి వెళ్ళు. జేబులో డబ్బులేకపోయినా, ఉన్నదంతా నాకే ఇచ్చినా, ఇంటిదగ్గర టాక్సీఫేర్ ఇవ్వవచ్చు. టాక్సీ ఎక్కు’’ – ‘‘నడుస్తాను’’‘‘ఈ వయస్సులో ఈ స్థితిలో ఎంతో దూరం నడవలేవు’’ – ‘‘నడుస్తాను’’‘‘ఎంతకాలం?’’ – ‘‘ఎంతకాలమైనా, తండ్రి పిలుపు వచ్చేదాకా, నడుస్తుంటాను. నడుస్తూనే ఉంటాను’’ఆమె మౌనంగా ఉంది. అతను నడుస్తూనే ఉన్నాడు. - ఆచార్య కొలకలూరి ఇనాక్ -
నేర రహిత సమాజమే లక్ష్యం
మంచిర్యాల క్రైం: నేరరహిత సమాజ స్థాపన లక్ష్యంగా నిర్బంధ తనిఖీలు చేపడుతున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. పట్లణంలోని తిలక్‌నగర్ కాలనీలో మంగళవారం ఉదయం 4నుంచి 8గంటల వరకు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసమే పోలీస్ వ్యవస్థ పని చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే తిలక్‌నగర్‌లో నిర్బంధ తనిఖీలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువీకరణపత్రాలు లేని 31 ద్విచక్రవాహనాలు, ఎనిమిది ఆటోలు, ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. యువత పోలీస్‌మిత్ర వలంటరీగా చేరి శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పలు సమస్యలను సీపీ దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో బెల్టుషాపుల నిర్వహణతో పాటు గుడుంబా, అంబార్ విక్రయాలు, పేకాట జోరుగా సాగుతున్నాయన్నారు. ఈమేరకు సీపీ స్పందిస్తూ కాలనీకి జనమైత్రి పోలీస్ ఆఫీసర్‌గా గోవింద్ సింగ్ ఏర్పాటు చేశామని, సమస్యలుంటే ఆయనకు తెలియపర్చాలన్నారు. తనిఖీల్లో మంచిర్యాల డీసీపీ వేణుగోపాల్‌రావు, ఏసీపీ గౌస్‌బాబా, సీఐలు చంద్రమౌళి, ప్రమోధ్‌రావు, ప్రతాప్, ట్రాఫిక్ సీఐ సతీష్, జన్నారం, సీసీసీ, లక్సెట్టిపేట, శ్రీరాంపూర్, హాజీపూర్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
సినిమాలతో సమాజంపై దుష్ప్రభావం!
సాక్షి, హైదరాబాద్: సమాజంపై సినిమాల దుష్ప్రభావం చాలా ఉందని, మహిళలను అసభ్యంగా చిత్రీకరిస్తుండడం వల్లే వ్యభిచారానికి డిమాండ్ పెరిగిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం వ్యాఖ్యానించారు. సినిమాల ప్రభావంతో 21 ఏళ్ల వయసులోనే యువత పెడదోవ పడుతున్నారని పేర్కొన్నారు. కుటుంబసభ్యులతో కలసి సినిమాలు చూసే పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్, ప్రజ్వల, తెలుగు సినీ పరిశ్రమల ఉమ్మడి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘స్టాప్ డిమాండ్ ఇన్ సెక్స్ ట్రాఫికింగ్’ప్రచారోద్యమం ప్రారంభోత్సవంలో జస్టిస్ కోదండరాం మాట్లాడారు. ఇకముందైనా మంచి సినిమాలు తీయాలని సినీ పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దీనిపై స్పందించారు. ప్రేక్షకులకు ఆహ్లాదం పంచాలనే లక్ష్యంతో సినిమాలు తీస్తున్నామని, కుటుంబసభ్యులతో కలసి చూడదగిన రీతిలోనే సినిమాలు తీస్తున్నామని పేర్కొన్నారు. సమాజంలో చైతన్యం తేవాలి.. మహిళల అక్రమ రవాణా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా పేర్కొన్నారు. అమెరికాలో మహిళల అక్రమ రవాణా నిరోధానికి అక్కడి ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టిందని తెలిపారు. సమాజంలో చైతన్యం తేవడం ద్వారా వ్యభిచారానికి డిమాండ్ తగ్గి.. మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం కనుమరుగవుతాయని ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి నెలా సగటున 60 మంది మహిళలను వ్యభిచార కూపాల నుంచి రక్షిస్తున్నామని చెప్పారు. కాగా.. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారికి మంచి సమాజాన్ని ఇవ్వాలన్నదే తన తాపత్రయమని సినీ నటుడు మంచు విష్ణు పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా నిర్మూలనకు కేంద్రం త్వరలో కొత్త చట్టం తీసుకురానుందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళల అక్రమ రవాణా, వ్యభిచారానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శించారు. మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడుతున్న సునీతా కృష్ణన్‌ను జస్టిస్ ఎస్వీ భట్, జస్టిస్ నవీన్‌రావు, సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, అక్కినేని అమల, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, స్త్రీశిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్ తదితరులు అభినందించారు. -
జానీ... అబద్ధమే చెప్పాడు!
చెప్పే మాటకి, చేసే పనికి మధ్య వైరుధ్యం కనిపిస్తే కృతి అడిగినటువంటి ప్రశ్నలు సమాజం నుంచి వస్తాయి. తేడా అంతా చిన్నారి కృతి అడిగినట్లు సమాజం ప్రశ్నలు మాటల్లో ఉండవు. ఆ మనిషిని విశ్వసించకపోవడం అనేది చూపుల్లో కనిపిస్తుంది. ‘‘నాన్నా! రైమ్స్ బుక్... మామయ్య తెచ్చాడు’’ చూపించింది కృతి. ‘‘రైమ్స్ నేర్చుకుందామా’’ అంటూ బుక్ చేతిలోకి తీసుకుని కూతుర్ని ఒళ్లో కూర్చోబెట్టు కున్నాడు కృతి నాన్న. ‘‘జానీ జానీ... ఎస్ పపా, ఈటింగ్ షుగర్? నో పపా, టెల్లింగ్ లైస్? నో పపా, ఓపెన్ యువర్ మౌత్? హహ్హహ్హ...’’ నాన్న చెప్పినట్లు పలుకుతోంది కానీ... కృతి చూపంతా జానీ వెనుక దాచేసిన చక్కెర బాటిల్, నోట్లోంచి కారుతున్న చక్కెర మీదనే ఉంది. ‘‘జానీ చేతిలో షుగర్ బాటిల్ నాన్నా, నోట్లో కూడా చక్కెర ఉంది’’ చూపించింది. ‘‘నిజమే బంగారం’’ కాదనడానికి వీల్లేని పరిస్థితి. ‘‘చక్కెర తింటూ తినట్లేదని అబద్ధం చెప్పాడు, అబద్ధాలు చెబుతున్నావా అని అడిగితే కాదని మళ్లీ అబద్ధమే చెప్పాడు. జానీ రెండు అబద్ధాలు చెప్పాడు’’ వేళ్లు చూపించింది కృతి. ఆన్సర్ దొరకదని తెలిసినా క్షణకాలం కృతిని తప్పించుకుందామని పుస్తకంలో ముఖం దాచు కున్నాడు నాన్న. రైమ్స్ బుక్‌లో నక్షత్రాలు గిర్రున తిరుగుతున్నాయి. జానీ అబద్ధం చెప్పాడని చెబితే ఎందుకు చెప్పాడని మళ్లీ ప్రశ్న వస్తుంది, అది తప్పు కదా అని అనుబంధ ప్రశ్న, ఈ చైన్ ఈ రోజుకి తెగదు. ‘‘నాకు ఆఫీస్‌కి టైమయింది కన్నా’’ అంటూ ఒడిలో నుంచి కృతిని దించేశాడు నాన్న. చిన్నప్పుడు తార్కికత చాలా చురుగ్గా ఉంటుంది. వయసుతోపాటు లాజిక్ సెన్స్‌ను కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ పెద్దవాళ్లమవుతాం. ఇక మిగిలే సెన్స్ అంతా ‘ఒకరికంటే మనం వెనుకపడకూడదు’... అనేదొక్కటే. రేపటి రోజున మనల్ని మనం మనిషిగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నించే సహనం ఎప్పుడు ఎక్కడ జారిపోయిందో గుర్తుండదు. ఇప్పుడు తెలిసిందల్లా రేపటిలోకి వెళ్లడానికి అడ్డుగా ఉన్న నేటిని దాటేయడమే. నేటిని దాటడానికి చెప్పిన అబద్ధం మర్నాడు నిలదీస్తుంది. దానికి సమాధానం చెప్పడం కృతిని మాయ చేసినంత సులభం కాకపోవచ్చు. నిన్నటి రోజున చెప్పిన అబద్ధం నేడు నిలదీస్తూనే ఉంటుంది. -
హైడ్రోజన్ కార్లు... ఇంకో అడుగు దగ్గరగా..
పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్‌తో కూడా కొద్దోగొప్పో కాలుష్యం సమస్య ఉంటుందేమోగానీ.. హైడ్రోజన్‌తో మాత్రం అస్సలు ఉండదు. ఈ విషయం చాలాకాలంగా తెలుసుగానీ.. ఈ వాయువును చౌకగా ఉత్పత్తి చేయడంతోపాటు, సురక్షితంగా నిల్వ చేయడం, సరఫరా చేయడంలో సమస్యలు ఉండటం వల్ల అవి ఇప్పటివరకూ పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా (లాస్ఏంజిలెస్) శాస్త్రవేత్తలు నికెల్, ఐరన్, కోబాల్ట్‌లతో హైడ్రోజన్‌ను చౌకగా ఉత్పత్తి చేసేందుకు ఓ వినూత్న పరికరాన్ని తయారు చేశారు. దీనిద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గ్రామీణ ప్రాంతాల్లో అక్కడికక్కడే విద్యుత్తు తయారు చేసుకునే అవకాశమేర్పడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త రిచర్డ్ కానెర్ తెలిపారు. సాధారణ హైడ్రోజన్ ఫ్యుయల్‌సెల్స్, సూపర్ కెపాసిటర్లలో రెండు ఎలక్ట్రోడ్లు ఉంటే.. వీరు తయారు చేసిన పరికరంలో మూడు ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వీటిల్లో ఒకటి సూపర్ కెపాసిటర్‌గా విద్యుత్తును నిల్వ చేసుకుంటుంది. అదేసమయంలో నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడగొడుతుంది. -
సామాజిక ప్రయోజనమే సాహిత్య లక్ష్యం
- ప్రపంచీకరణతో మానవీయ సంబంధాలు విధ్వంసం - సీమ, ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయంపై కథలు అవసరం - డాక్టర్ పాపినేని శివశంకర్ కర్నూలు(కల్చరల్): సమాజం నుంచే సాహిత్యం పుట్టుకొస్తుందని, సామాజిక ప్రయోజనమే సాహిత్యం ప్రధాన లక్ష్యం కావాలని కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ రచయిత డాక్టర్ పాపినేని శివశంకర్ అన్నారు. లలిత కళాసమితి స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని స్థానిక టీజీవి కళాక్షేత్రంలో జరుగుతున్న రచయితల మహాసభల రెండో రోజు శనివారం ఆయన ‘తెలుగు కథా పరిణామం’ అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కరువు కాలంలో బయట నదులు ఎండిపోతున్నాయి.. లోపల గుండెల్లోని నదులు కూడా ఎండిపోతున్నాయన్నారు. బయట ఎండిపోతున్న నదులకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయేమో కానీ.. గుండె లోపలి దయ, కరుణ, జాలి, మానవత్వం అనే నదులు ఎండిపోతే ఇక ప్రత్యామ్నాయం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. గతంలో మానవీయ విలువలు కల్గిన సాహితీ సృజన జరిగిందన్నారు. ప్రస్తుతం వ్యక్తిత్వ ప్రధానమైన అంశాలు, వ్యక్తి కేంద్రిత ప్రభావం సాహిత్యంలో పెరిగిపోతుందన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని వృత్తుల ధ్వంసం, మానవీయ సంబంధాల విధ్వంసంపై చాలా కథలు వచ్చాయన్నారు. సమాచార విప్లవం ద్వారా రిలయన్స్ రిలేషన్స్ పెరిగిపోతున్నాయి కానీ రియల్ రిలేషన్స్ తరిగిపోతున్నాయన్నారు. ఇంకా ప్రపంచీకరణ వికృత పరిణామాలపై కథలు రాయాల్సిన అవసరముందన్నారు. రాయలసీమ నుండి కరువు, వలసలు, ముఠాకక్షల ఇతివృత్తంతో చాలా కథలు వచ్చాయన్నారు. అయితే విభజన నేపథ్యంలో ఉత్తరాంధ్ర, రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై కథలు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కర్నూలు జిల్లా రచయిత జంధ్యాల రఘుబాబు మాట్లాడుతూ లలిత కళాసమితి రచయితల మహాసభలు నిర్వహిస్తూ సాహిత్యంలోని అన్ని ప్రక్రియలపై సమావేశాలు నిర్వహించడం, ఆ సమావేశాలలో అనుభవజ్ఞులైన నిపుణులైన మేధావులతో ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ‘స్త్రీవాద సాహిత్యం, సమాలోచనం’ అనే అంశంపై హైదరబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ శరత్ జ్యోత్స్న ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్త్రీవాద రచయిత్రులు చాలా విప్లవాత్మకమైన అంశాలను సాహిత్యంలోనికి తీసుకొచ్చారన్నారు. స్త్రీ స్వేచ్ఛ గురించి చలం అనేక కథలు రాశారన్నారు. ఓల్గా రాజకీయ కథలు, పి.సత్యవతి కథలు, రంగనాయకమ్మ నవలలు, పురుషాధిక్య సమాజంపై అనేక వ్యంగ్యాస్త్రాలను విసిరాయన్నారు. అలనాటి సాంప్రదాయ సాహిత్యంలోనూ స్త్రీలు స్వేచ్ఛను కాంక్షించే విధంగా రచనలు చేశారన్నారు. తిరుపతి పద్మావతి యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ రాజేశ్వరమ్మ మాట్లాడుతూ స్త్రీవాద సాహిత్యంలో వచ్చిన కవిత్వం పురుషాధిపత్యాన్ని ధీటుగా ప్రశ్నించిందన్నారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు స్త్రీలను వివక్షకు గురిచేస్తున్న పురుషాధిక్య సమాజంపై స్త్రీ వాదం తిరుగుబాటు చేసిందన్నారు. ఇంకా పదునైన కథలు, కవిత్వం రచించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో రచయిత్రులు దండెబోయిన పార్వతి, కళ్యాణదుర్గం స్వర్ణలత స్త్రీవాద సాహిత్య ప్రయోజనాలను వివరించారు. ప్రముఖ కళాకారుడు, ప్రజానాట్యమండలి మాజీ అధ్యక్షుడు శాంతారామ్ మాట్లాడుతూ ఉత్తమ సాహిత్య సృజనకు విమర్శ ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. అనంతపురం వాస్తవ్యులు, సుప్రసిద్ధ కథా రచయిత బండి నారాయణస్వామి రాయలసీమలో వర్ధమాన కథకుల రచనల గురించి ప్రసంగించారు. రాయలసీమ నుంచి ఇటీవల కాలంలో పదునైన కథలు పుట్టుకొచ్చాయన్నారు. విభజన నేపథ్యంలో అన్ని రంగాలలో రాయలసీమ ఎదుర్కొంటున్న వివక్షను, సీమలోని వెనుకబాటుతనాన్ని సాహిత్యంలో ప్రస్ఫుటంగా కనిపించేటట్లు చేయాలన్నారు. ఏ ఉద్యమానికైనా ఊతంగా నిలిచేది కళలు, సాహిత్యమేనన్నారు. రాయలసీమలో కథకు, కవులకు, కళాకారులకు కొదువ లేకున్నా బలమైన సాహిత్యం ఆవిర్భవించాల్సిన ఆవశ్యకత ఇంకా ఉందన్నారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనం ప్రేక్షకులను ఆకట్టుకున్నది. కార్యక్రమంలో లలిత కళాసమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, మహాసభల కన్వీనర్ ఇనాయతుల్లా, కో–కన్వీనర్ డాక్టర్ విజయ్‌కుమార్, ఆహ్వానసంఘం సభ్యులు మహమ్మద్ మియా, కెంగార మోహన్, డాక్టర్ జయరాం, ఎస్.డి.వి.అజీజ్, మధుసూదనాచార్యులు, కె.ఎన్.మద్దిలేటి, లలిత కళాసమితి కార్యవర్గ సభ్యులు బాలవెంకటేశ్వర్లు, సంగా ఆంజనేయులు పాల్గొన్నారు. విమర్శ ఉంటేనే సాహిత్యం సుసంపన్నం : తెలకపల్లి రవి సద్విమర్శ ఉంటేనే సాహిత్యం సుసంపన్నం అవుతుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సాహిత్య విమర్శకులు తెలకపల్లి రవి పేర్కొన్నారు. ప్రగతి శీల సాహితీ సృజన వైపు సాహిత్య విమర్శ ప్రోత్సహించాలన్నారు. శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు విమర్శనాత్మక దృష్టితోనే సాహితీ సృజన చేశారన్నారు. ప్రస్తుతం సినిమాలలో, పత్రికల్లో వస్తున్న సాహిత్యం పట్ల పదునైన విమర్శ లేకపోవడం చేతనే ప్రమాదకరమైన సాహితీ సృజన జరుగుతుందన్నారు. -
సంజామల సహకార సంఘానికి రాష్ట్ర స్థాయి గుర్తింపుసం
సంజామల: సంజామల సహకార సంఘానికి రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించినట్లు సొసైటీ చైర్మన్ పెండేకంటి కిరణ్‌కుమార్ చెప్పారు. స్థానిక సొసైటీలో సోమవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ సంఘం సభ్యులు, సిబ్బంది సహకారంతో సొసైటీ అభివృద్ది బాటలో నడుస్తోందన్నారు. సొసైటీకి ఆప్కాబ్ కంప్యూటరీకరణ సౌకర్యం పైలట్ ప్రాజెక్టుకింద ఎంపికయినట్లు తెలిపారు. వర్గవైసమ్యాలు, రాజకీయాలకతీతంగా సంఘంలో అన్నివర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. సంజామల గతంలో జిల్లాస్థాయిలో గుర్తింపు ఉండేదని ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడం పట్ల సిబ్బందికి పాలకవర్గ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో చల్లా తిరుపాలయ్య, ఓబులమ్మ, బండి జనార్దన్‌రెడ్డి, సొసైటీ సీఈఓ రవీంద్రనా«ద్గుప్త తదితరులు పాల్గొన్నారు. -
ఎల్పీడీపై వీడిన అస్పష్టత
కంపెనీలకు మాత్రమే ఇస్తామంటూ నిబంధన రైతులను ముప్పుతిప్పలు పెడుతున్న సీడీబీ కొబ్బరి సొసైటీలకు డెమోప్లాట్లు ఇవ్వాల్సిందే స్పష్టం చేసిన సీపీసీఆర్‌ఐ, సీడీబీ డైరెక్టర్ చౌడప్ప అమలాపురం : కొబ్బరి రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేయాల్సిన కోకోనట్ డవలప్మెంట్ బోర్డు (సీడీబీ) కొందరి ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తోందని కోనసీమ కొబ్బరి రైతులు ఆరోపిస్తున్నారు. లేయింగ్ అవుట్ ఆఫ్ డిమాన్‌స్ర్టేషన్ ప్లాంట్ల (ఎల్‌ఓడీపీ) ఎంపిక కోసం లేని నిబంధనలు ప్రవేశపెట్టిందా? అంటే అవునంటున్నారు రైతు సంఘాల ప్రతినిధులు. సీడీబీలో లేని నిబంధనను ఇక్కడ అమలు చేసి వందలాది మంది రైతుల ప్రయోజనాలను కాలరాసిందని ఆరోపిస్తున్నారు. కొబ్బరి సాగుకు చేయూతనిచ్చేందుకు సీడీబీ గత కొన్నేళ్లుగా ఎల్ఓడీపీకి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో రైతుకు హెక్టారుకు రూ.35 వేల చొప్పున రెండేళ్లపాటు ఎరువులను ఉచితంగా అందిస్తోంది. ఎంపిక చేసిన ప్రాంతాలను మొదట క్లస్టర్ల్గా చేసి ఒక్కో దాని పరిధిలో 25 హెక్టార్లను ఎల్‌ఓడీపీ స్కీమ్‌ను అమలు చేశాయి. తరువాత రైతులు కోకోనట్ ప్రొడ్యూసర్ సొసైటీలగా ఏర్పడితే ఇస్తామని చెప్పింది. దీంతో కోనసీమలో వందలాది సొసైటీలు ఏర్పడ్డాయి. తరువాత నిబంధన మార్చిన సీడీబీ అధికారులు ఫెడరేషన్లుగా ఏర్పడితేనే ఎల్‌ఓడీపీ ఇస్తామని చెప్పారు. తరువాత ఈ నిబంధననూ మళ్లీ మార్చేసి కేవలం కంపెనీలుగా ఏర్పడ్డవారికి మాత్రమే ఇస్తామన్నారు. దీని వల్ల సొసైటీలకు, వాటిలోని వేలాది మంది రైతులకు ఎల్‌ఓడీపీ స్కీమ్ అందకుండా పోయింది. ఈ సంఘాలను పక్కనబెట్టారు – ముమ్మిడివరం మండలం లంకాఫ్ఠాన్నేల్లంకలో సుమారు 750 మంది రైతులు 17 సొసైటీలుగా ఏర్పడ్డారు. సీడీబీ సూచన మేరకు వీరంతా స్వామి వివేకానంద ఫెడరేషన్‌గా ఏర్పడ్డారు. రెండేళ్లు గడుస్తున్నా ఎల్‌ఓడీపీ ఇవ్వలేదు. ఇందుకు సీడీబీ అధికారులు చెప్పే కారణం వీరందరూ కలిసి కంపెనీ కాలేదని. – కోనసీమలో భద్రకాళీ వీరేశ్వరస్వామి (ఐ.పోలవరం), బలరామ సీపీఎఫ్ (బండారులంక), ఆర్ధర్ కాటన్ (అయినవిల్లి), సుజలా (అంబాజీపేట) ఫెడరేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 2,500 మంది రైతులున్నారు. కొన్ని ఫెడరేషన్లు 2013లోనే సీడీబీలో రిజిస్టర్ అయ్యాయి. కేవలం కంపెనీలుగా ఏర్పడలేదని వీరికి కూడా ఎల్‌ఓడీపీ అందించలేదు. ఆ నిబంధన ఉందా? కంపెనీలుగా ఏర్పడినవారికే ఎల్ఓడీపీలో ఎరువులు ఇవ్వాలనే నిబంధన ఉందని సీడీబీ అధికారులు చెబుతుండగా, అటువంటిదేమీ లేదని రైతులు తేల్చిచెబుతున్నారు. కోనసీమలో ఒక కంపెనీ ప్రయోజనం కోసం మొదట సొసైటీలు, తరువాత ఫెడరేషన్లు, తరువాత కంపెనీలకు ఎరువులు ఇస్తామనే నిబంధనలు పెట్టారని రైతులు ఆరోపిస్తున్నారు. సొసైటీలకు ఎల్‌ఓడీపీ ఇవ్వాల్సిందే ‘కోకోనట్ ప్రొడ్యూసర్ కంపెనీలకు మాత్రమే డెమోప్లాట్లు ఇవ్వాలనే నిబంధన ఏమీలేదు. సొసైటీలకు సైతం డెమోప్లాట్లు ఇవ్వాల్సిందే. మీ ఫెడరేషన్‌కు ఎందుకు ఇవ్వలేదనేదానిపై నేను చర్చిస్తాను’అని సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీపీసీఆర్‌ఐ), కోకోనట్ డవలప్మెంట్ బోర్డు (సీడీబీ)ల డైరెక్టర్ పాలెం చౌడప్ప చెప్పారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు దీనిపై డీసీసీబీ డైరెక్టర్, స్వామి వివేకానంద ఫెడరేషన్ చైర్మన్ గోదాశి నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఆయనతోపాటు రైతు సంఘం ప్రతినిధులు ముత్యాల జమ్మిలు మాట్లాడుతూ సీడీబీలో లేని ఈ నిబంధన వల్ల కోనసీమలో సుమారు ఐదు వేల మంది రైతులు ఎల్‌ఓడీపీ ప్రయోజనాలు పొందలేకపోతున్నారని వివరించగా ఆయన పై విధంగా స్పందించారు. దీనిపై తాను సీడీబీ పాలక మండలి సమావేశంలో మాట్లాడతానన్నారు. సొసైటీలకు ఎల్ఓడీపీలో ఎరువులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
బాలికల హక్కులను పరిరక్షించాలి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సమాజంలోని ప్రతి ఒక్కరూ బాలికల హక్కులను పరిరక్షించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం నందికొట్కూరు రోడ్డులోని సెయింట్ జోసెప్ జూనియర్ బాలికల కళాశాలలో జాతీయ బాలిక దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన చైల్డ్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో ముద్రించిన జెండర్ సమానత్వం సాదిద్ధాం అనే పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలపై వివక్ష చూపరాదన్నారు. బాలికలు తమకున్న హక్కులను స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకోవడానికి సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, అధికారులు, సహకరించాలని సూచించారు. ఎటువంటి పరిస్థితుల్లో బాల్య వివాహాలు చేయరాదని చెప్పారు. కార్యక్రమంలో బర్డ్స్ జోనల్ కోఆర్డినేటర్ కిరణ్‌కుమార్, రోషన్, రిటైర్డ్ డీఎస్పీ పాపరావు, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. -
సమాజంలో స్త్రీ పాత్ర కీలకం
- కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కర్నూలు సిటీ: సమాజంలో స్త్రీ పాత్ర కీలకమని కర్నూలు ఎంపీ బుట్టారేణుక అన్నారు. సోమవారం స్థానిక కెవీఆర్ మహిళ డిగ్రీ కాలేజీలో మహిళల హక్కులు– సమస్యలు, సాధ్యాసాధ్యాలు అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడారు. హక్కులు, చట్టాలను ప్రతి మహిళ తెలుసుకుని ఉండాలన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా పోరాడి పరిష్కరించుకోవాలన్నారు. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు డాక్టర ఆవుల మంజులత, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ లక్కరాజు జయశ్రీ, డిప్యూటీ కలెక్టర్ నాగమ్మ, కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర సీవీ రాజేశ్వరిలు ప్రసంగించారు. శాతవాహనుల కాలంలో స్త్రీలకు ప్రాధాన్యత ఉండేదని.. రానురాను పురుషాధిక్యంలో స్త్రీ వివక్షతకు గురవుతోందన్నారు. చట్టం దృష్టిలో స్త్రీ, పురుషులు సమానమని, లింగ వివక్ష చూపకూడదన్నారు. మహిళలపై దాడులు రోజు రోజుకూ పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితిల్లో మార్పులు రావాలంటే మహిళల్లో అక్షరాస్యతా శాతం పెరగాలన్నారు. గర్భంలోనే ఆడపిల్లను చిదిమి వేడయం నేరమన్నారు. కార్యక్రమంలో కేవీఆర్ కాలేజీ అధ్యాపకులు ఇందిరా శాంతి, శ్రీదేవి, డాక్టర్ వీరాచారి, సుబ్బరాజ్యమ్మ, డాక్టర్స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
ఉత్కృష్టసోమం–అగ్నిష్టోమం
సమాజంలో పెచ్చరిల్లుతున్న అశాంతిని, అసంతృప్తిని తొలగించి, లోకకల్యాణం చేకూర్చేందుకు, సనాతన సంస్కృతీ సంప్రదాయాలను నిలబెట్టేందుకు 23 సోమవారం నుంచి 28 శనివారం వరకు ‘ఉత్కృష్ట సోమయాగం’ జరగనుంది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లిలో బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్యసోమయాజులు బ్రహ్మత్వంలో... మాడుగుల భవానీ శశిభూషణ శర్మ దంపతుల యాజమాన్యంలో ఈ బృహద్యజ్ఞం జరుగుతోంది. కృష్ణానదీ తరంగాలపై వీచే గాలి సోకినా చాలు. పాపాలన్నీ నశించి విష్ణులోకాలను పొందుతారని పురాణాలు పేర్కొన్నాయి. అటువంటి పవిత్ర కృష్ణానదీ తీరాన్ని ఆనుకొని ఉన్న బీచుపల్లి క్షేత్రం ఈ చారిత్రక యాగానికి వేదికవడం ముదావహం. గతంలో ఈ ప్రాంతమంతా విరివిగా శ్రౌతయాగాలు జరిగేవి. ఈ ప్రాంతంలోనిశ్రౌతపండితులు దక్షిణభారతదేశంలో అగ్రగాములుగా ఉండేవారని చరిత్ర. అటువంటి చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో వందేళ్ల తర్వాత ఈ సోమయాగం... శ్రౌతయాగ రక్షణలో ‘శ్రుతి సంవర్ధినీ’ మరుగున పడుతున్న వైదిక సంస్కృతిని పరిరక్షించాలనే లక్ష్యంతో, శ్రౌతధర్మం పట్ల అందరికి అవగాహన కలిగించి శ్రౌతయజ్ఞాలలోని ఆచార, సంప్రదాయాలను నేటి తరానికి అందించాలనే తపనతో మూడేళ్ల క్రితం ఏర్పాటయిన శ్రుతి సంవర్ధినీ సభ ఇప్పుడు ఈ యాగాన్ని నిర్వహిస్తోంది. మహాతపశ్శాలులైన ద్రష్టలు లోకాతీతదృష్టిని సంపాదించి మానవునికంటే ఉత్తమమైన శక్తులున్నాయని చాటిచెప్పారు. అటువంటి శక్తులు సాకారమైనా, నిరాకారమైనా కావచ్చు. ఈ ప్రపంచంలో నిలబడడంలో వాటి సహకారం ఎంతైనా అవసరం. ఆ శక్తులనే మనం దేవతలని పిలుచుకుంటున్నాం. అటువంటి దేవతలకు కృతజ్ఞతా పూర్వకమైన బుద్ధితో చేసేదే యజ్ఞం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ ఐదింటిని కలిపి పంచభూతాలని అంటారు. ప్రకృతికి ఈ పంచభూతాలే ముఖ్యకారణాలు. అటువంటి పంచభూతాలలో అగ్ని మూడవది. యజ్ఞయాగాది క్రియలలో ముందుగా కావలసింది అగ్నిదేవుడే! ‘అగ్నిముఖావైదేవా’. అన్న వాక్యానుసారం దేవతలకు ఏది సమర్పించాలన్నా దాన్ని అగ్నిముఖంగా ఇవ్వాల్సిందే. అలా ఇచ్చినవాటినే దేవతలు స్వీకరిస్తారు. దీనినే యజ్ఞమని అంటారు. యజ్ఞాలు శ్రౌతయజ్ఞాలని, స్మార్తయజ్ఞాలనీ రెండురకాలు. వీటిలో వేదోక్తమైన శ్రౌతయజ్ఞాలకు విశేష ప్రాధాన్యత ఉంది. వాటిలోనిదే అగ్నిష్టోమం. సోమయాగం అంటే ఏమిటి? విశ్వంలో ప్రాణులు బతకడానికి కావలసిన అన్నం, నీరు, గాలి, మొదలైన వాటిని ప్రసాదించే దేవతలకు కృతజ్ఞతాపూర్వకంగా హవిస్సులను సమర్పించి వారిని ఆరాధించాలి. ‘‘దేవేభ్య ఇదం నమమ–నేను సమర్పించిన ఈ హవిస్సు ఆయా దేవతలకు చెందుతుంది. ఇందులో నాది ఏమీలేదు’’ అన్న భావనతో స్వార్థాన్ని విడచి సమస్త పాపాలను తొలగించుకొని చిత్తశుద్ధిని పొందుతాం. ఈ విధంగా సర్వదేవతల స్వరూపుడైన పరమేశ్వరుణ్ని తృప్తిపరచి, తద్వారా దేవ ఋణం నుంచి విముక్తుడవడమే ఈ యాగ ముఖ్య ఉద్దేశ్యం. అన్ని యాగాలలో సమర్పించే పురోడాశం, నెయ్యి, పాలు, పెరుగు మొదలైన హవిస్సులేగాక, అమృతలత జాతికి చెందిన ‘సోమలత’ అనే ప్రధానమైన హవిస్సును నలుగురు ఋత్విక్కులు మంత్రోక్తంగా దంచి, ముద్దను ఒక బట్టలో పెట్టి దానిని పిండి ఆ రసాన్ని గ్రహ, చమస అనే పేరుతో ఉన్న పాత్రలలోకి తీసుకుంటారు. అనంతరం దీనిని యాగంలో సమర్పిస్తారు. ఈ సోమరసాన్ని అగ్నిలో ఆహుతి ఇచ్చినప్పుడు ఆ యాగ దేవతయిన ఇంద్రుడు తృప్తిచెంది, ప్రజలకు బలాన్ని, కీర్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించి, క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే ఈ యజ్ఞాలూ, యాగాలూ. యజ్ఞయాగాల వల్ల వాతావరణ కాలుష్యం తగ్గి, వర్షాలు కురుస్తాయని, భూగర్భజలాలు పెరిగి, పంటలు బాగా పండుతాయని సైన్సుపరంగా కూడా రుజువైంది. ఈ అగ్నిష్టోమయాగంలో త్రివృత్, పంచదశ, సప్తదశ, ఏకవిగంశములనే నాలుగు రకాల స్తోత్రాలు, సామగాన రూపకాలైన పన్నెండు స్తోత్రాలు ఉన్నందువల్ల దీనికి జ్యోతిరగ్నిష్టోమం అని పేరు. అగ్నిష్టోమమనే యజ్ఞాయజ్ఞియ స్తోత్రంతో ఈ యాగం పూర్తి అవుతున్నందున దీనికి ‘అగ్నిష్టోమం’ అనే పేరు సార్థకమైంది. అగ్నిష్టోమానంతరం సంతానార్థులకోసం పుత్రకామేష్ఠి యాగం నిర్వహిస్తున్నారు. – అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని వేదపండితులు -
మగ్గిపోతున్న నేతన్న
కూడు, గూడు, గుడ్డ.. ఇవే మనిషి మనుగడకు అవసరమైనవి. డిజిటల్ యుగంలో మానవుడు ఎంతగా దూసుకుపోతున్నా.. ఇవి లేకుండా ఒక్క అడుగు ముందుకు వేయలేడన్నది జగమెరిగిన సత్యం. అంతటి ప్రాధాన్యమున్న ఆయా రంగాలపై పాలకులు తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు. చేనేత సహకార సంఘాల ఆర్థిక పరిస్థితులు చితికిపోతున్న తరుణంలో.. మగ్గాన్ని నమ్ముకున్న నేతన్నతో పాటు అతడికి కూడు పెట్టే చేనేత సొసైటీలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. – సఖినేటిపల్లి చేనేత కార్మికుల అభ్యున్నతికి కోసం ఏర్పాౖటెన చేనేత సహకార సంఘాలు కష్టాల్లో ఉన్నాయి. సంఘాల్లో దుస్తుల నిల్వలు పేరుకు పోవడంతో కార్మికులకు పని కల్పించలేని స్థితికి సంఘాలు చేరుకున్నాయి. సంఘాల్లో తయారైన దుస్తులను కొనుగోలు చేయాల్సిన ఆప్కో తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తోంది. సంఘాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంతో పాటు సంఘాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేది ఆప్కో. తమ సంస్థకు చెందిన దుకాణాల్లో దుస్తుల అమ్మకాలు పూర్తయ్యాకే సొసైటీల్లో పేరుకుపోయిన దుస్తులు కొనుగోలు చేస్తామని ఆప్కో చెబుతోంది. ఈ తరుణంలో సంఘాలు గడ్డు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఫలితంగా సంఘాలు ఆర్థిక పరిపుష్టిని కోల్పోయి, కార్మికులకు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మోరి చేనేత సహకార సంఘంలో ఆప్కో కొనుగోళ్లు లేక దుస్తుల నిల్వలు రూ.60 లక్షలకు పేరుకుపోయాయి. రూ.10 కోట్ల విలువైన నిల్వలు జిల్లావ్యాప్తంగా 50 చేనేత సంఘాల్లో రూ.10 కోట్ల విలువైన దుస్తులు పేరుకుపోయినట్టు సంఘ ప్రతినిధులు చెప్పారు. ఆయా సంఘాల్లో ఉత్పత్తి అవుతున్న దుస్తుల్లో మూడో వంతైనా ఆప్కో కొనుగోలు చేస్తే కార్మికులకు పని కల్పించడానికి వీలవుతుందని అంటున్నారు. పది సంఘాలకే రిబేటు! సుమారు రెండేళ్ల క్రితం ఇచ్చిన సొసైటీల్లోని దుస్తుల నిల్వల జాబితా ఆధారంగా జిల్లాలో కేవలం పది సంఘాలకే రిబేటు సౌకర్యాన్ని ప్రస్తుత ప్రభుత్వం కల్పించింది. ఇందులో అప్పట్లోనే రూ.48 లక్షలు నిల్వలున్నట్టుగా ఇచ్చిన నివేదిక ఆధారంగా మోరి సొసైటీకి రిబేటు తాత్కాలికంగా ఇచ్చారు. శాశ్వత రిబేటుకోసం నిరీక్షణ శాశ్వత ప్రాతిపదికన రిబేటు సౌకర్యం ప్రకటించాలని సొసైటీ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల దుస్తుల అమ్మకాలు ఏడాది పొడవునా సాగించేందుకు వీలవుతుందని చెబుతున్నారు. సక్రమంగా లేని రిబేటు సౌకర్యం వల్ల అమ్మకాలు పెరగడం లేదని, వస్త్ర ప్రపంచంలో పోటీతత్వం తట్టుకోవడానికి వీలుగా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు. నిబంధనలు లేని రిబేటు ఇవ్వాలి ఏడాది పొడవునా షరతులు, నిబంధనలు లేని రిబేటు సౌకర్యం సంఘాలకు కల్పించాలి. 20 శాతం రిబేటు సౌకర్యాన్ని శాశ్వతంగా కొనసాగించమని కోరాం. రాష్ట్రవ్యాప్తంగా ఇందుకు రూ.150 కోట్లు భరించడం కష్టమని, దీనిని రూ.50 కోట్లకు పరిమితం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రెండేళ్ల క్రితం రూ.40 కోట్ల మేర రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన దుస్తుల నిల్వ లకు తగ్గట్టుగా ఆయా సంఘాలకు ఇప్పుడు రిబేటు అమలవుతోంది. చెన్నైలో లాగే నేత కార్మికులకు మగ్గం వద్ద సబ్సిడీపై విద్యుత్ సరఫరా ఇవ్వాలని కోరుతున్నాం. – చింతా వీరభద్రేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు, జిల్లా చేనేత సంఘాల సమాఖ్య, మోరి -
మగ్గిపోతున్న నేతన్న
కూడు, గూడు, గుడ్డ.. ఇవే మనిషి మనుగడకు అవసరమైనవి. డిజిటల్ యుగంలో మానవుడు ఎంతగా దూసుకుపోతున్నా.. ఇవి లేకుండా ఒక్క అడుగు ముందుకు వేయలేడన్నది జగమెరిగిన సత్యం. అంతటి ప్రాధాన్యమున్న ఆయా రంగాలపై పాలకులు తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు. చేనేత సహకార సంఘాల ఆర్థిక పరిస్థితులు చితికిపోతున్న తరుణంలో.. మగ్గాన్ని నమ్ముకున్న నేతన్నతో పాటు అతడికి కూడు పెట్టే చేనేత సొసైటీలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. – సఖినేటిపల్లి చేనేత కార్మికుల అభ్యున్నతికి కోసం ఏర్పాౖటెన చేనేత సహకార సంఘాలు కష్టాల్లో ఉన్నాయి. సంఘాల్లో దుస్తుల నిల్వలు పేరుకు పోవడంతో కార్మికులకు పని కల్పించలేని స్థితికి సంఘాలు చేరుకున్నాయి. సంఘాల్లో తయారైన దుస్తులను కొనుగోలు చేయాల్సిన ఆప్కో తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తోంది. సంఘాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంతో పాటు సంఘాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేది ఆప్కో. తమ సంస్థకు చెందిన దుకాణాల్లో దుస్తుల అమ్మకాలు పూర్తయ్యాకే సొసైటీల్లో పేరుకుపోయిన దుస్తులు కొనుగోలు చేస్తామని ఆప్కో చెబుతోంది. ఈ తరుణంలో సంఘాలు గడ్డు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఫలితంగా సంఘాలు ఆర్థిక పరిపుష్టిని కోల్పోయి, కార్మికులకు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మోరి చేనేత సహకార సంఘంలో ఆప్కో కొనుగోళ్లు లేక దుస్తుల నిల్వలు రూ.60 లక్షలకు పేరుకుపోయాయి. రూ.10 కోట్ల విలువైన నిల్వలు జిల్లావ్యాప్తంగా 50 చేనేత సంఘాల్లో రూ.10 కోట్ల విలువైన దుస్తులు పేరుకుపోయినట్టు సంఘ ప్రతినిధులు చెప్పారు. ఆయా సంఘాల్లో ఉత్పత్తి అవుతున్న దుస్తుల్లో మూడో వంతైనా ఆప్కో కొనుగోలు చేస్తే కార్మికులకు పని కల్పించడానికి వీలవుతుందని అంటున్నారు. పది సంఘాలకే రిబేటు! సుమారు రెండేళ్ల క్రితం ఇచ్చిన సొసైటీల్లోని దుస్తుల నిల్వల జాబితా ఆధారంగా జిల్లాలో కేవలం పది సంఘాలకే రిబేటు సౌకర్యాన్ని ప్రస్తుత ప్రభుత్వం కల్పించింది. ఇందులో అప్పట్లోనే రూ.48 లక్షలు నిల్వలున్నట్టుగా ఇచ్చిన నివేదిక ఆధారంగా మోరి సొసైటీకి రిబేటు తాత్కాలికంగా ఇచ్చారు. శాశ్వత రిబేటుకోసం నిరీక్షణ శాశ్వత ప్రాతిపదికన రిబేటు సౌకర్యం ప్రకటించాలని సొసైటీ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల దుస్తుల అమ్మకాలు ఏడాది పొడవునా సాగించేందుకు వీలవుతుందని చెబుతున్నారు. సక్రమంగా లేని రిబేటు సౌకర్యం వల్ల అమ్మకాలు పెరగడం లేదని, వస్త్ర ప్రపంచంలో పోటీతత్వం తట్టుకోవడానికి వీలుగా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు. నిబంధనలు లేని రిబేటు ఇవ్వాలి ఏడాది పొడవునా షరతులు, నిబంధనలు లేని రిబేటు సౌకర్యం సంఘాలకు కల్పించాలి. 20 శాతం రిబేటు సౌకర్యాన్ని శాశ్వతంగా కొనసాగించమని కోరాం. రాష్ట్రవ్యాప్తంగా ఇందుకు రూ.150 కోట్లు భరించడం కష్టమని, దీనిని రూ.50 కోట్లకు పరిమితం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రెండేళ్ల క్రితం రూ.40 కోట్ల మేర రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన దుస్తుల నిల్వ లకు తగ్గట్టుగా ఆయా సంఘాలకు ఇప్పుడు రిబేటు అమలవుతోంది. చెన్నైలో లాగే నేత కార్మికులకు మగ్గం వద్ద సబ్సిడీపై విద్యుత్ సరఫరా ఇవ్వాలని కోరుతున్నాం. – చింతా వీరభద్రేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు, జిల్లా చేనేత సంఘాల సమాఖ్య, మోరి -
షష్టి స్ఫూర్తి
త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీ (చిన్న జీయర్ స్వామీజీ)తో ‘సాక్షి ఫ్యామిలీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ భగవద్ రామానుజస్వామి... వారిది మిలీనియమ్ మార్చ్! దళితులను గుడిలోకి తీసుకువెళ్ళారు! అతి శక్తిమంతమైన ‘నారాయణ మంత్రం’ దాచుకోకుండా పంచిపెట్టారు! పెద్ద జీయర్‌స్వామి... వీరిది ఫ్రీడమ్ మార్చ్! తన భూమినంతా దానం చేసి, స్వరాజ్యం కోసం పోరాడారు... నిరతాగ్నిహోత్రంతో... దేశమంతటా... 108 ‘శ్రీరామక్రతువు’లు చేశారు. భక్తులతో ‘రామ’కోటి రాయించి, సమతా ‘స్తూపాల’ను ప్రతిష్ఠించారు. మహానుభావులు... ‘ధర్మం’ కోసం కృషి చేశారు. చిన్న జీయర్ స్వామి... వీరిది ప్రోగ్రెసివ్ మార్చ్! వేదానికి అధ్యయన జ్యోతి... అంధులకు అక్షర కాంతి... గిరిజనులకు విద్యాక్రాంతి. భగవద్ రామానుజ, పెద్ద జీయర్ స్వాముల పరంపరకు ‘జెండాపై కపిరాజు’. మనకు తెలిసిన స్వామి... మనలో ఒకడైన స్వామి... కళ్ళతో పలకరిస్తారు... చిరునవ్వుతో సాంత్వన కలిగిస్తారు. ఊరి పెరటిలో... తులసి మొక్క... సమాజంలోని సర్వరోగాలకూ నివారిణి! వీరికి 60 ఏళ్ళు... వీరి పరంపరకు వెయ్యేళ్ళు... వీరి స్ఫూర్తి... పదికాలాలు విరాజిల్లు!! - రామ్, ఎడిటర్, ఫీచర్స్ నమస్కారం స్వామీజీ! మీకు 60 వత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా తిరునక్షత్ర మహోత్సవం చేస్తామని భక్తులు ప్రతిపాదన తెచ్చినప్పుడు ఏమనిపించింది? (సాలోచనగా ఆగి... దేహం వంక చూపిస్తూ) 60 ఏళ్ళనేది ఈ శరీరానికి గడిచాయని అంటున్నారు. నిజానికి, సన్న్యాసికి శారీరకమైన జన్మ, వయస్సు ఉండవు. సన్న్యాసం స్వీకరించినప్పటి నుంచి మరుజన్మ కిందే లెక్క. అయితే, భక్తులు ప్రేమగా చేసుకుంటామని అన్నప్పుడు కాదనడానికి మనమెవరం! అయితే ఏదైనా ఘనకార్యం సాధిస్తే, అప్పుడు ఆ ఘనకార్యానికి ఉత్సవం చేసుకోవచ్చు. అలాంటివి ఏం చేశామని! గడచిన 36 ఏళ్ళ పైచిలుకు సన్న్యాసాశ్రమ ప్రస్థానంలో అంధులకు విద్యాలయాలు, వేద పాఠశాలలు, ఆసుపత్రులు, గిరిజన విద్యాలయాల లాంటివెన్నో ఏర్పాటు చేశారు కదా! (చిరు దరహాసంతో...) అవును. కానీ, సమాజానికి చేయాల్సినది ఇంకా ఎంతో ఉంది! విదేశాలకు వెళ్ళి, వేదధర్మాన్ని ప్రచారం చేసిన తొలి జీయర్ కూడా మీరే! విదేశాలకు వెళ్ళడమే తప్పు అనుకొనే సంప్రదాయంలో అంతటి సాహసం ఎలా చేశారు? విదేశాల్లో భారతీయ ధర్మ ప్రచారానికి వెళ్ళడం వెనుక ఒక దైవికమైన ఘటన ఉంది. 1992లో, 1993లో కూడా ధర్మప్రచారానికి నన్ను విదేశాలకు రమ్మని అడిగారు. కానీ, మేము రామని చెప్పాము. 1993లో ఒక సన్నివేశం వల్ల వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఏడాది దీపావళి వేడుక తరువాత అర్ధరాత్రి విజయవాడ దగ్గర సీతానగరంలోని మా ఆశ్రమం నుంచి మేము ఆరాధించే కోదండ రామస్వామి విగ్రహాలు చోరీ అయ్యాయి. మూడు రోజుల పాటు ఆశ్రమంలో నిద్రాహారాలు లేవు. ఆ రాత్రి అక్కడ బీట్‌లో ఉన్న కోటేశ్వరరావు అనే ఎస్.ఐ. ఇదంతా చూసి, ‘దేవుడి విగ్రహాలు దొరికే వరకు కట్టుకున్న దుస్తులు కూడా మార్చను’ అని దీక్ష పట్టారు. నాలుగో రోజున దొంగల్ని పట్టుకున్నారు. విగ్రహాలు సాధించారు. మాకు ఆ సమాచారమిచ్చారు. అయిదో రోజున విగ్రహాలు రావడంతో, వెయ్యి కలశాలతో మా స్వామికి అభిషేకం చేసి, ఆరాధించాం. అప్పటి నుంచి ప్రతి ఏటా దానికి గుర్తుగా మా ఆరాధ్యదైవమైన కోదండరామ స్వామికి ‘సహస్ర కలశాభిషేకం’ చేస్తున్నాం. ఇవాళ్టికీ కోటేశ్వరరావు గారు ఎక్కడున్నా, ఆ రోజున ఆ కార్యక్రమానికి వస్తారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నతాధికారి. ఆయన వచ్చాక, ఆయన చేతులకు తాకించి కానీ, ఆ అభిషేక కార్యక్రమం మొదలుపెట్టం. ఈ విగ్రహాల చోరీ వ్యవహారం జరిగాక, సాక్షాత్తూ స్వామే ఎలాగూ బయటకు వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు, మనమే స్వయంగా తీసుకొని ఎందుకు వెళ్ళకూడదని అనిపించింది. అది స్వామి ఆదేశంగా భావించి, అప్పటి నుంచి ధర్మప్రచారం కోసం విదేశాలకు వెళ్ళి వస్తున్నాం. సంపన్న అమెరికా నుంచి, వర్ధమాన భారతం దాకా ప్రపంచమంతా తిరిగారు కదా! అన్నిచోట్లా సమస్యలే! అన్నిచోట్లా అశాంతే! కారణం ఏమిటంటారు? ఇవాళ శాంతి లేకపోవడానికి ప్రధాన కారణాలు... ఒకటి- ఉగ్రవాదం, రెండు - ఆర్థిక అసమానతలు. రెండూ అశాంతికి దారి తీస్తున్నాయి. ఆర్థిక అసమానతలు తొలగించాలంటే, వ్యక్తుల్లో విద్యను పెంచాలి. దిగువ వర్గాల వారు కూడా ఉన్నత వర్గాల వారితో పోటీపడేలా, వారిలో నైపుణ్యం పెంచాలి. అవకాశాలు కల్పించాలి. ఇక, ఉగ్రవాదాన్ని తగ్గించడానికి శాసనాలు, ప్రేమతత్త్వం రెండే మార్గాలు. చాలాదేశాల్లో కఠిన శాసనాలున్నాయి. కానీ, మన దేశంలో ఉన్న శాసనాల్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి. అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని సరిదిద్దాలి. మరోపక్క వ్యక్తిలో తోటివారి పట్ల ప్రేమను పెంచాలి. మనమంతా సహోదరులమనే భావన కలిగించాలి. అలాంటి భావన ఇవ్వగలిగింది మన వైదిక వాఙ్మయం. ఇతర మతాల్లో, వారి గ్రంథాల్లో కూడా ఆ భావన ఉంది. కానీ వాటిని బోధించడంలో, ఆచరించడంలో వస్తున్న తప్పులు, తేడాల వల్ల కొన్నిసార్లు ఉపద్రవం సంభవిస్తోంది. కానీ, హిందూ ధర్మంలోనూ రకరకాల శాఖలు, రూపాలు ఉన్నాయిగా!? మన ‘భగవద్గీత’ మొదలైన గ్రంథాలేవీ, ‘దైవాన్ని ఇలానే నమ్మాలి, ఇలానే పూజించాలి’ అని కట్టడి చేయడం లేదు. పరస్పర విద్వేషం చెప్పడం లేదు. భగవద్గీతలోనే పరమాత్మ ‘యాన్తి దేవవ్రతో దేవాన్...’ అని చెప్పాడు. ‘నన్ను ఏ రూపంలో ఆరాధిస్తే, ఆ రూపంలో కనిపిస్తాను’ అన్నాడు. కాబట్టి ఎన్ని రూపాలు, ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నా దేవుడు ఒక్కడే! ఎవడు ఏ విధానంలో ఆరాధన చేసినా, ఫలితం పొంది తీరతాడు. మతమార్పిడి తప్పు. అందుకే, మేము ‘స్వీయ ఆరాధన... సర్వ ఆదరణ’ అని మేము చెబుతాం. వివరంగా చెప్పాలంటే, ‘నీ మతాన్ని నువ్వు ఆరాధించు. నీది కానిదేదో దాన్ని గౌరవించు, ఆదరించు!’ మన భారతదేశానికి ఇదే జీవనాడి. మన రాజ్యాంగం కూడా మత స్వేచ్ఛనిచ్చింది కదా! మతస్వేచ్ఛ నిచ్చింది. పరస్పరం గౌరవాదరాలతో బతకాలనే చెప్పింది. కానీ, అమలుపరచడం దగ్గరకొచ్చే సరికే సమస్యలు. కొన్ని వేల ఏళ్ళుగా మన పక్కనే ఏ ఆలయం ఉన్నా, మసీదు ఉన్నా, చర్చి ఉన్నా, గౌరవించి, ఆదరించిన సంస్కృతి మనది. కానీ, ఇప్పుడు కొందరు తమ మతగ్రంథాల సారాన్ని తప్పుగా బోధించడం వల్ల ఉగ్రవాదం పెచ్చరిల్లుతోంది. ఈ దేశపు రాజ్యాంగాన్ని గౌరవించం కానీ, ఈ పౌరసత్వం, ఇక్కడి హక్కులు అన్నీ కావాలంటే ఎలా? మనం ముందు భారతీయులం... ఆ తరువాతే ఏమైనా! ప్రపంచంలోని ఈ సమకాలీన విషయాలు మీకెలా తెలుస్తుంటాయి? ఇవాళ ఇంటర్నెట్ వచ్చింది. అవి చూసే భక్తులున్నారు. చెబుతుంటారు. మీరు కూడా టెక్నాలజీనీ, ల్యాప్‌టాప్ లాంటివి బాగా వాడతారట? (నవ్వుతూ... తల పంకించారు...) సైన్సు, మతం పరస్పర భిన్నమైనవనే వాదన గురించి ఏమంటారు? నిరూపణ జరిగిన సిద్ధాంతాలన్నీ సైన్స్ అయితే, నిరూపణ కానివి ఫిలాసఫీ అని అని కదా ప్రసిద్ధి (నవ్వులు...). అయితే, సైన్స్‌కు అందని నిజాలు చాలానే ఉన్నాయి. సైన్స్‌లో డార్విన్ పరిణామ సిద్ధాంతం లాంటివి మీరు ఒప్పుకోరని విన్నాం! పరిణామం అనేది అనివార్యం. కానీ, (నవ్వుతూ...) వాళ్ళు చెప్పే పద్ధతిలో పరిణామ సిద్ధాంతాన్ని మేము అంగీకరించం. చూడండి. మనం గింజ వేస్తే దాని నుంచి ఆకులు, కొమ్మలు, పువ్వులు, పండ్లతో చెట్టు వస్తోంది. అది పరిణామం. కానీ, ఆ గింజలో లేని ఆకు, వేరు, పువ్వు, పండు రావడం లేదు కదా! ఆ గింజలోనే అవన్నీ సూక్ష్మరూపంలో ఉన్నాయి. పరిణామంలో అవి పైకి కనిపించాయి. అంతే! సూక్ష్మరూపంలో లేనిది స్థూలరూపంలోకి రాదు. మీరు ఒకప్పుడు దైవాన్ని కూడా ఒప్పుకొనేవారు కాదట! మరి, అటు నుంచి ఇటు వైపు ప్రయాణం... (నవ్వేస్తూ...) చిన్నప్పుడు అవకాశమున్న పుస్తకమల్లా చదివేవాళ్ళం. ‘ఆంధ్రప్రభ’, ‘ఆంధ్రపత్రిక’ లాంటి వాటిల్లో వచ్చే సీరియల్స్ కాగితాలు చించి, కుట్టుకొని, బైండ్ చేయించుకొని సేకరించిపెట్టేవాళ్ళం. అలా చాలా కథలు చదివాం. ‘ఎ టేల్ ఆఫ్ టు సిటీస్’ లాంటి అనువాద సాహిత్యం చాలా చదివాం. అలా చదివిన సాహిత్యంతో లోలోపల అనేక ప్రశ్నలు వస్తుండేవి. వాటికి సమాధానాల కోసం అన్వేషిస్తుండేవాళ్ళం. అవన్నీ మా పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారి దగ్గరకు వచ్చాక, తీరాయి. తెనాలి దగ్గర నడిగడ్డపాలెంలో గురువులు గోపాలాచార్యుల వద్ద మాకు వేదాంత గ్రంథాల బోధన జరిగింది. గోపాలాచార్యులు, మా పెద్ద స్వామి వారు సహాధ్యాయులు. కలసి వేదాంత ప్రచారం చేశారు. స్వామి వారు ఊరూరా తిరుగుతూ క్రతువులు చేస్తుంటే, గోపాలాచార్యుల వారు నడిగడ్డపాలెంలోని ఆశ్రమంలో ఉంటూ, అందరికీ వేదాంత శిక్షణనిచ్చేవారు. మేమూ అక్కడ కొన్నాళ్ళు ఉండి, అవి అధ్యయనం చేశాం. అలా పూర్తిగా ఇటువైపు వచ్చాం. స్వామీజీ! ఒకప్పుడు మీలో మార్క్సిస్టు భావాలుండేవనీ, ఆ పుస్తకాలు చదివేవారనీ... (మళ్ళీ నవ్వేస్తూ...) అవన్నీ ఒకప్పటి సంగతులు. ఇప్పటికీ సమాజసేవ, దిగువ వర్గాల అభ్యున్నతి లాంటి విషయాల్లో మీది వామపక్ష భావజాలమేనేమో... (నవ్వులు...) సమాజం మన శరీరం లాంటిది. ఇందులో ఏ అంగం ఎక్కువ, ఏది తక్కువ అంటే ఏం చెబుతాం! సమాజంలో అన్ని వర్గాలూ ఒకదానికొకటి సహకరించుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా ఒకరు, మరొకరిని అణచివేస్తానంటే ఎలా? అదే సమయంలో అందరూ పనిచేయాలి. చేసేవాడు చేస్తూ ఉంటే, తిని కూర్చొనేవాడు కూర్చుంటానంటే కుదరదు. పనిచేయడానికి బద్ధకించేవాణ్ణి పనిచేసేవాడిగా మార్చాలి. అందుకని ప్రతి ఒక్కరిలో నైపుణ్యం పెంపొందింపజేయాలి. ఉన్నత వర్గాలతో పోటీ పడేలా దిగువ వర్గాలకీ అవకాశం కల్పించాలి. వారిని తీర్చిదిద్దాలి. దీన్ని కేవలం వామపక్షం, వామభావజాలం అంటే ఎలా? నిజానికి, ఇది ప్రతి ఒక్క వ్యక్తి కర్తవ్యం అంటాను. అయితే, అదే సమయంలో - నైపుణ్యం లేకపోయినా 20 మార్కులతో పాస్ అయిన వ్యక్తిని విమానానికి పైలట్‌గానో, అల్లోపతి డాక్టర్‌గానో పెడితే... వాట్ హ్యాపెన్స్ టు ది క్వాలిటీ ఆఫ్ దిస్ కంట్రీ? మొత్తం సమాజమే నష్టపోతుంది. అసమర్థుడైన వ్యక్తిని ఆపరేషన్‌కి డాక్టర్‌గా పంపిస్తే ఏమవుతుందో ఊహించుకోండి! అన్నట్లు... మీరు కూడా మంచి వైద్యులట! మంచి మందులిస్తారట! (నవ్వేస్తూ...) హోమియో వైద్యం నేర్చుకుంటున్నా. మందులు ఇస్తుంటా. మీ తాత గారు, తండ్రి గారిలా వైద్యవిద్య వంశపారంపర్యంగా వచ్చినట్లుందే! పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారు ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు. ఇక మాకు జన్మనిచ్చిన తండ్రి గారు ఆ రోజుల్లోనే చెన్నైలో చదువుకొన్న ఎల్.ఐ.ఎం (లెసైన్స్డ్ ఇండియన్ మెడిసిన్) డాక్టర్. ఇద్దరూ వైద్యంలో దిట్టలే! కానీ, ఇవాళ మనం డాలర్ల జబ్బును రూపాయలిచ్చి కొనుక్కుంటున్నాం. ప్రతిదీ ఖరీదై, అల్లోపతి వైద్యం సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతోంది. ఈ పరిస్థితుల్లో అది మాత్రమే పద్ధతి కాదు, ఇంకో పద్ధతి ఉందంటూ వచ్చిన హోమియోపతి మంచి ప్రత్యామ్నాయం. సామాన్య ప్రజలు ఎక్కువగా ఉండే మన దేశ పరిస్థితికి శ్రమ, ఖర్చు తక్కువైన ఈ వైద్యవిధానం బాగా సరిపోతుంది. రోగి లక్షణాలు సరిగ్గా తెలుసుకొని ఔషధమిచ్చే మంచి వైద్యుడుంటే మందు అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, దీన్ని కూడా వ్యాపారంగా మారుస్తున్నవారు లేకపోలేదు. అందుకనే, అందరికీ ఈ వైద్యం అందుబాటులోకి రావాలని ‘ఇంటిగ్రేటివ్ సిస్టమ్’లో మా శంషాబాద్ ఆశ్రమంలో ‘జిమ్స్’ హోమియో కాలేజ్, ఆసుపత్రి నడుపుతున్నాం. అంటే, ఇటు ప్రజల శారీరక ఆరోగ్యం, అటు ఆధ్యాత్మికతతో మానసిక ఆరోగ్యం రెండూ మీరు చూస్తున్నారన్న మాట! (నవ్వుతూ...) అంతే అనుకోవచ్చు! కానీ, సన్న్యాసంలో ఉంటూ సామాజిక సంస్కరణ, సముద్ధరణ చేయడమెలా వచ్చింది? వెయ్యేళ్ళ క్రితం రామానుజాచార్యులూ ఇదే చేశారు. ఆయన కేవలం ఆధ్యాత్మిక నాయకులే కాదు. ఆ రోజుల్లోనే అందరి మోక్షం కోసం గోపురమెక్కి, ‘తిరుమంత్రం’ ఎలుగెత్తి చాటిన సామాజిక సంస్కర్త. ఆయన స్ఫూర్తితో వచ్చిన మా పెద్ద స్వామి వారైతే స్వాతంత్య్ర సమరయోధులు. దేశం కోసం పోరాడారు. ఆ రోజుల్లోనే ప్రజల బాగు కోసం గ్రామాలు పట్టుకు తిరిగారు. సొంత భూములు హరిజనులకిచ్చి, వారి ఉద్ధరణకు కృషి చేశారు. స్త్రీలు ఘోషాలో ఉండే ఆ రోజుల్లోనే భార్యకు రాట్నం మీద నూలు వడకడం నేర్పించి, ఆ నూలు దుస్తులు భుజాన వేసుకొని, ఊరూరా పంపిణీ చేసేవారు. దుర్భిక్ష సమయంలో పొలాల్లో తిరిగి, ఎకరానికి ఒక కట్ట చొప్పున గ్రాసం తీసుకొని, పశువులకు మేత పెట్టేవారు. సన్న్యాసాశ్రమం స్వీకరించాక కూడా ఆయన సామాజిక ఉద్ధరణ మార్గంలోనే వెళ్ళారు. మాది కూడా ఆ బాటే! ఇన్నేళ్ళ ఈ బాటలో... ఈ షష్ట్యబ్ది పూర్తివేళ మీరు స్మరించుకోవాల్సిన వ్యక్తులంటే..? (ఆసనంలో ఒక్కసారి వెనక్కి వాలి... దీర్ఘంగా శ్వాస విడుస్తూ...) చాలామంది ఉన్నారు. జన్మనిచ్చిన తల్లితండ్రులు, గురువులు, మా పెద్ద స్వామి వారు, మేము ఈ స్థితికి చేరడానికి కారణమైన వ్యక్తులు, ఈ ప్రయాణంలో పరిచయమైన వ్యక్తులు, తీర్చిదిద్దిన వ్యక్తులు, కలసి ప్రయాణించిన, ప్రయాణిస్తున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. రాజమహేంద్రిలో స్కూలులో చదువుకుంటున్నప్పుడు ‘నారాయణా! నువ్వు తెలివిగలవాడివి. నీకు పాతికకి పాతిక మార్కులు వేస్తే, కొమ్ములొస్తాయిరా’ అంటూ, అంతా సరిగ్గా రాసినా లెక్కల్లో కూడా ఇరవై అయిదుకి ఇరవై నాలుగున్నర మార్కులే వేసిన మా మాస్టారిని స్మరించుకోవాలి. ‘ప్రపంచం గురించి చెప్పి, ఇలా ఉండాలి సుమా’ అని చెప్పిన మార్క్సిస్టు మిత్రులున్నారు. చిన్నప్పటి నుంచి మాలో ఒక క్రమశిక్షణ నేర్పిన రామచంద్ర అనే ఆర్.ఎస్.ఎస్. కుర్రాడు ఉన్నాడు. పొట్టకూటి కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నప్పుడు జీవితమంటే ఎలా ఉంటుందో నాకు నేర్పిన అనుభవాలున్నాయి. ఇలా ఎందరో, ఎన్నెన్నో! ఆ పూర్వాశ్రమ జీవితంలో ఎదురైన అనుభవాల వివరాలు ఏమైనా...! అప్పట్లో మేము సికింద్రాబాద్‌లో క్యారవాన్ దగ్గర ఉండేవాళ్ళం. కోఠీ వైపు వెళ్ళాలి. పురానాపూల్, అఫ్జల్‌గంజ్, ఘోషామహల్ పక్క నుంచి వెళుతుండేవాళ్ళం. పైసా.. పైసాకి కష్టపడుతూ, కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్ళిన రోజులు గుర్తే! ఒకసారి కష్టపడి ఒక సైకిల్ కొనుక్కున్నాం. కానీ, కొన్న మూడో రోజునే దాన్ని ఎవరో పట్టుకుపోయారు. అదంతా జీవితంలో ఒక దశ. సామాన్య ప్రజల కష్టాలన్నీ స్వయంగా చూశాం, అనుభవించాం. మరి, ఆధ్యాత్మిక విద్యకు ముందు అప్పట్లో మీరు చదివిన లౌకికమైన చదువులు... ఆ రోజుల్లో ఆంధ్రా యూనివర్సిటీ మెట్రిక్యులేషన్ చదివాం. ఆ తర్వాత పై చదువుల కోసం ప్రయత్నించినా, ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వచ్చేది. పరీక్షలకు హాజరు కాలేకపోయాం. టైప్, షార్ట్‌హ్యాండ్‌ల్లో హయ్యర్ పాసయ్యాం. మా పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారి దగ్గరకు చేరినప్పుడు ‘ఆలయాల జీర్ణోద్ధరణ కమిటీ’ తరఫున మేము అన్ని రకాల క్లరికల్ జాబ్స్ చేసేవాళ్ళం. లెక్కలు, స్టేట్మెంట్స్ తయారుచేసేవాళ్ళం. స్వామి వారి దగ్గరకు వచ్చాక అంతకు ముందు మాకున్న అనేక సందేహాలు తీరాయి. మళ్ళీ మా మనసు మారకుండా ఉండడం కోసం మా సర్టిఫికెట్లన్నీ మేమే చింపేశాం. మీరు అమెరికన్ యాసలో మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. రష్యన్ కూడా నేర్చుకున్నారట! (నవ్వుతూ...) పూర్వాశ్రమంలో హైదరాబాద్‌లోనే ‘సీఫెల్’ (ఇప్పటి ‘ఇఫ్లూ’)లో సరదా కోసం చదివాం. కానీ, ఆశ్రమజీవితంలోకి వచ్చినప్పుడు ఆ కఠోర దీక్ష, క్లిష్టమైన వేదాంత విద్య ఎలా అలవడ్డాయి? ఒక రకంగా నన్ను మా పెద్ద స్వామి వారి పాదాల దగ్గరకు చేర్చింది మా తల్లి గారే! ‘నీకు ఏది మంచిదో వారు నిర్ణయిస్తారు’ అన్న ఆమె మాట! భగవత్ కృప వల్ల చిన్నప్పటి నుంచి అనుకున్నది ఎలాగైనా పూర్తి చెయ్యాలనే మనస్తత్త్వం, పట్టుదల అలవడ్డాయి. అప్పట్లో ఒకసారి పెద్ద స్వామి వారి క్రతువు కోసం కొన్ని మూర్తులు అవసరమయ్యాయి. కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్ళి, అందించి వచ్చే పని నాకు అప్పగించారు. తీరా నేను బయల్దేరితే రైలు మిస్సయింది. బస్సు మిస్సయింది. కానీ, ఆయనకు అవి ఇచ్చే రావాలి తప్ప, ఇంటికి వెనక్కి రాకూడదనే పట్టుదల నాది. అప్పటికి ఈ తరం పిల్లల్లాంటి లోకజ్ఞానం కూడా లేని పల్లెటూరి బైతులం మేము. అయినా సరే, సామర్లకోట దాకా బండిలో, తరువాత మరో వాహనంలో, ఆ పైన నడక... ఇలా ఎట్టకేలకు తెల్లవారు జామున పెద్ద స్వామి వద్దకు చేరాం. అనుకున్న ముహూర్తానికి అన్నీ సక్రమంగా అందించగలిగాం. ఆ తరువాత ఈ ఆశ్రమజీవితంలోకి వస్తున్నప్పుడు కూడా వేద, వేదాంత విద్యల అధ్యయనంలోనూ అదే పట్టుదల. మరి ఈ సుదీర్ఘ ప్రయాణంలో చుండూరు ఘటన, తిరుమలలో వెయ్యికాళ్ళ మండపం లాంటి కొన్ని సందర్భాల్లో మీ వ్యాఖ్యలపై వివాదాలు, విమర్శలు వచ్చినప్పుడు ఏమనిపించేది? అప్పట్లో చుండూరు ఘటనలో వాస్తవాన్ని వెలికితీసి చెప్పడానికే మాట్లాడాను. ఇతరులు చాలామంది, చివరకు మీడియా కూడా వెనుకంజ వేస్తుంటే, చుండూరులో జరిగింది కేవలం రెండు వర్గాల మధ్య ఘర్షణ కాదు... అది మతసంబంధమైన ఘర్షణ కూడా అని వాస్తవం చెప్పాం. అప్పట్లో ఒక ప్రముఖ ఆంగ్ల మ్యాగజైన్ విలేఖరి వచ్చి, నాతో అన్నీ మాట్లాడారు. కానీ, పత్రికలో మాత్రం వాస్తవాన్ని కాస్తంత దాచిపెడుతూనే రాశారు. మీడియా కూడా ఉన్నది ఉన్నట్లు రాయడానికి ధైర్యం చేయలేదు. కానీ, మేము మాత్రం సత్యమే చెప్పాను. చివరకు తిరుమలలో వెయ్యి కాళ్ళ మండపం విషయంలో కూడా! మేము ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదు. క్రమాన్నీ, ధర్మాన్నీ తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు, మనం మాట్లాడకపోతే తప్పు అవుతుంది. మిగతావాళ్ళకు సాహసం లేదు. మేము విమర్శల్ని పట్టించుకోకుండా, వాస్తవం మాట్లాడాల్సిన కర్తవ్యం నిర్వర్తించాం. అంతే! సమాజోద్ధరణ ధ్యేయమైన మీ లాంటి కొందరిని మినహాయిస్తే, ఇవాళ అసలు ‘గాడ్’ కన్నా‘గాడ్మన్’ల హవా ఎక్కువైందని ఒక విమర్శ! నిజమే. దానికి కారణం - దైవాన్ని గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా, ఒక శాస్త్రీయమైన అధ్యయన ప్రక్రియ లేకుండా కొందరు ఒక స్థానంలో కూర్చోవడమే! అధ్యయనం లేకుండానే ఒక పీఠంపై కూర్చొన్నప్పుడు, వేలమంది వచ్చి మొక్కుతూ ఉంటే, తెలియని ఉద్ధతి, గర్వం వస్తాయి. మనకు తెలియకుండానే రెండు, నాలుగు, ఎనిమిది, పదహారు - ఇలా కొమ్ములు మొలుస్తాయి. అందుకే, ఎప్పుడూ అవి లేకుండా, రాకుండా అధ్యయనం చేస్తూనే ఉండాలి. అది మా పెద్ద స్వామి వారు చెప్పిన మాట! ఒకసారి ఆ గర్వం వస్తే అందరూ మన మాటే వినాలనుకుంటాం. కాదని ఎవరైనా అంటే, వారి మీద కసి, కోపం పెరుగుతాయి. దాంతో, ఏదో అంటాం. ఇవన్నీ అధ్యయనం, వినయం లేకపోవడం వల్ల వచ్చే పర్యవసానాలు. రోజూ తెల్లవారు జాము నుంచి రాత్రి దాకా మానవ సేవ, మాధవ సేవ, భక్తజనం మధ్య ఉండడంతో, మాకైనా అధ్యయనానికి తీరిక దొరకదు. కానీ, అధ్యయనం చేయాలి. మానకూడదు. వేదకాలం నుంచి ఉన్నత స్థితిలో ఉన్న స్త్రీ ఇవాళ్టి పరిస్థితి చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? స్త్రీలను గౌరవించడం మనందరి విధి. వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే సమాజానికి క్షేమం. అందుకే, ‘ఉమెన్స్ హెల్త్ కేర్’ అనే ప్రాజెక్ట్ పెట్టాం. ఇవాళ స్త్రీలలో ఎక్కువ మందిని బాధిస్తున్నవి - సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. వీటి పట్ల స్త్రీ మూర్తుల్లో చైతన్యం కలిగిస్తూ, వాళ్ళకు ఉచితంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేస్తున్నాం. ఇప్పటి దాకా తెలుగు నేలపై 5 లక్షల 25 వేల మందికి ఉచితంగా ఈ స్క్రీనింగ్ చేశాం. ఇక, స్త్రీల ప్రవర్తన విషయానికి వస్తే ఆధునిక తరంలో ధర్మం పట్ల లక్ష్యం తక్కువవుతోంది. తమిళనాడు, ఉత్తరాది లాంటి చోట్ల స్త్రీలలో ధర్మం పట్ల జాగృతి కాస్త ఉన్నా, మన తెలుగు నేలపై ధర్మం పట్ల సుముఖత తగ్గుతున్నట్లుంది. వేదాలు, ఆగమాలు చదివిన పురోహితుల్ని పెళ్ళి చేసుకోవడానికి పిల్లలు, పిల్లనిచ్చేవారు సిద్ధంగా లేరంటే ఏమనాలి? అందరూ సాఫ్ట్వేర్ వరుల వెంటపడుతున్నారు. నిజానికి, స్త్రీలు ఇవాళ విద్యలో, సహనంలో, కృషిలో చాలా ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి, ఇక వారిలో మనది ఈ జాతి, మనది ఈ ధర్మం, మనది ఈ సంప్రదాయం అనే భావన కలిగించాల్సి ఉంది. అందు కోసం కృషి చేస్తున్నాం. మరోపక్క, స్త్రీని కేవలం ఒక భోగవస్తువుగా చూసే పురుషులూ ఇవాళ ఎక్కువయ్యారేమో? నిజమే. అది కూడా మన విద్యావిధానంలోని లోపమే. వ్యక్తిని వ్యక్తిగా చూడాల్సిన విజ్ఞత నేర్పాల్సింది విద్యే కదా! కానీ, పిల్లలకు మంచి చెడు చెప్పే తీరిక, మన సంస్కృతి, సంప్రదాయం నేర్పే ఓపిక తల్లితండ్రులకు లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయే సరికి, పిల్లలకు అవన్నీ నేర్పే తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలు ఇంట్లో లేరు. ఎంతసేపూ చదువులు, మార్కుల మీదే శ్రద్ధ. విద్య సంస్కారాన్ని కలిగించాల్సింది పోయి, సంస్కారాన్ని తొలగిస్తోంది! ఇప్పటికే జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. ఒక తరం నష్టపోయింది. దాని ప్రభావమే స్త్రీల పట్ల చులకన భావం. అందుకే, ఇప్పటికైనా మనం మేల్కోవాలి. పిల్లల్లో మన ధర్మం మీద శ్రద్ధ, రుచి కలిగించాలి. వాళ్ళను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. మరి, అందుకు ఏం చేయాలంటారు? పెద్దలకూ, పిల్లలకూ మన సంస్కృతి, సంప్రదాయాలు తెలియాలి. మన దేశ ఘనచరిత్రకు ప్రతిరూపాలైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలెన్నో ఉన్నాయి. కానీ, జీర్ణోద్ధరణ అనో, సుందరీకరణ అనో పేరు పెట్టి, వాటి రూపాన్ని మార్చకూడదు. శంకరాచార్యులు, రామానుజాచార్యుల కాలం నాటి నిర్మాణాలున్నాయి. వేదవ్యాసుడు తిరుగాడిన బదరికాశ్రమం లాంటివి ఉన్నాయి. ఆ ఆశ్రమ ప్రాంతానికి వెళితే, కొన్ని వేల ఏళ్ళ నాటి మన జాతి చరిత్ర తెలిసి, మనకు పెద్ద అండ వచ్చినట్లవుతుంది. మన దేశాన్నీ, శ్రీలంకనూ కలుపుతూ సముద్రంలో శ్రీరామచంద్రుడు నిర్మించిన ‘నల సేతు’ ఇప్పటికీ ఉందని ‘నాసా’ వారి ఉపగ్రహ ఫోటోలు చూపిస్తున్నాయి. ఇవాళ్టికీ దర్భశయనం దగ్గరకు వెళితే 6 అడుగుల లోపల నీటిలో ఆ సేతువు రూపం కనిపిస్తుంది. మేము చూశాం. రామాయణ కాలం నాటి ఆ వారధిని కాపాడుకొంటే, మనం అక్కడకు వెళ్ళినప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల వెనక్కి మానసికంగా వెళతాం. మనలో హనుమంతుడి అంత శక్తి వస్తుంది. ఇంత చరిత్ర, వారసత్వం ప్రపంచంలో మన భారత జాతికి తప్ప మరొకరికి లేదు. జనంలో ఈ చైతన్యం తేవాలి. రామానుజాచార్యుల సహస్రాబ్ది వేళ మీరు చేపట్టిన ‘సమతామూర్తి స్ఫూర్తికేంద్రం’ అలాంటిదేనా? అవును. విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేసిన భగవద్ రామానుజాచార్యులు 1017లో జన్మించి, 120 ఏళ్ళు కృషి చేశారు. ఆయన కేవలం మతాచార్యులే కాదు, దిగువ వర్గాల సముద్ధరణకు కృషి చేసిన సాంఘిక సంస్కర్త. ఆయన సహస్రాబ్ది సందర్భంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాం. ‘జీయర్ ఇన్టిగ్రేటెడ్ వేదిక్ అకాడెమీ’ (జీవా)కు అనుబంధంగా 45 ఎకరాల్లో 216 అడుగుల ఎత్తై రామానుజాచార్యుల వారి పంచలోహ మూర్తి నిర్మాణం ప్రారంభమైంది. వచ్చే 2017లో ఈ పాటి కల్లా దాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నం. ఇంకా, 108 దివ్యదేశాలు, వైదిక ధర్మ ప్రదర్శనశాలల నిర్మాణం కూడా చేస్తాం. విజయవాడ, సీతానగరం దగ్గర కొండ మీద 108 అడుగుల మరో భారీ విగ్రహం పెట్టాలని కూడా యోచన. అంతా భగవత్ సంకల్పం! ఇన్నేళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో మీకు తృప్తినిచ్చిన విషయం? ఇవాళ్టికీ గ్రామాలకు వెళ్ళి, వాళ్ళకు ఏదైనా చెబితే చక్కగా వింటారు. అర్థం చేసుకుంటారు. ఆచరిస్తారు. అలా గ్రామ గ్రామానికీ వెళ్ళి, మన ధర్మాన్ని ప్రచారం చేస్తూ, సమాజ ఉద్ధరణకు పాల్పడడం బాగుంటుంది. మరి, మీరింకా చేయాలని అనుకుంటున్నవి? మనం చేయగలిగినవి, చేయాల్సినవి, జరగాల్సినవి (చేతులు చాచి చూపిస్తూ...) బోలెడన్ని ఉన్నాయి! ఇప్పటి దాకా చేసింది కేవలం సముద్రంలో నీటిబొట్టే! చివరిగా, ఈ దీపావళి పండుగ వేళ ప్రజలకు మీరిచ్చే సందేశం? ఇవాళ చుట్టుపక్కల నుంచి దేశానికి అభద్రత పెరుగుతోంది. ఇలాంటి సమయంలో దేశ భద్రతకు సరైన చర్యలు చేపట్టే ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఆ రకంగా ప్రజలకు అదృష్టకాలం వచ్చింది. ప్రజలంతా ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్క రూపాయి మన సైనిక సంక్షేమ నిధికి ఇచ్చినా, అది కొన్ని వందల కోట్ల నిధిగా మారి, దేశ భద్రతకు పనికొస్తుంది. దేశానికి నిప్పు పెట్టే స్థితి కొంతైనా అడ్డుకుంటాం. ఈ ఉద్యమంలో కుల, మత, జాతి విచక్షణ లేకుండా భారతీయులందరూ పాల్గొనాలి. ఒక భారతీయ హిందువుగా, ఒక భారతీయ ముసల్మానుగా, ఒక భారతీయ క్రైస్తవుడిగా ప్రతి ఒక్కరం మన భారతదేశ భద్రతకు తోడ్పడాలి. వ్యక్తిగత విశ్వాసాలు ఎవరివి ఏమైనా, భారతదేశమనే ఈ గృహరక్షణ మనందరి ప్రథమ కర్తవ్యం కావాలి. దానికోసం సమాయత్తం కావాల్సిన సమయం ఇదే. అది చేయడమే నిజంగా మనకు దీపావళి. - డాక్టర్ రెంటాల జయదేవ -
ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది
నిడదవోలు : సమాజంలో దళితులు, అనగారిన వర్గాల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు విమర్శించారు. పట్టణంలోని నందిన చారిటబుల్ ట్రస్ట్ భవనంలో సోమవారం కేవీపీఎస్ రాష్ట్ర వర్క్ షాపును ఆయన ప్రారంభించారు. ప్రారంభ సూచికగా కేవీపీఎస్ జండా ఆత్మ గౌరవం, సమానత్వం కుల నిర్మూలన లక్షలతో కూడిన జండాను మాజీ ఎమ్మెల్యే, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు దిగుపాటి రాజ్‌గోపాల్ ఆవిష్కరించారు. అనంతరం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం ఏర్పడ్డాక దళితుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందని, దళితుల భూములను బలవంతంగా లాక్కొవడం, భూసేకరణ పేరుతో దాడులకు పాల్పడుతున్నాడని విమర్శించారు. రాజదాని పేరుతో వందల ఏకరాల దళితుల భూములను అక్రమంగా లాక్కోవడం దారుణమన్నారు. మా భూములను ఎందుకు లాక్కొంటున్నారని ప్రశ్నించిన వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. 2014, 15, 16 సంవత్సరాలకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇంత వరకు పూర్తి స్థాయిలో ఇవ్వలేదని మండిపడ్డారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్రు మాల్యద్రి మాట్లాడుతూ దళిత వాడలకు స్మసాన స్థలాలు కేటాయించాలని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ బ్లాక్‌లాక్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ సహాయ కార్యదర్శి పి. రామకష్ణ, జిల్లా అధ్యక్షులు దిగుపాటి రాజ్‌గోపాల్, డి. సాల్మన్, గణేష్, జువ్వల రాంబాబు, ఇంజేటి శ్రీను, ఎం. సుందర బాబు, కె. సుధీర్, గండి శ్రీను, గంటి కష్ణ తదితరులు పాల్గొన్నారు -
సొసైటీల అభివృద్ధిపై దృష్టి పెట్టండి
– ఆడిట్‌ను పకడ్బందీగా చేపట్టాలి. – సహకార శాఖ ప్రత్యేక కేటగిరి డిప్యూటి రిజిస్ట్రార్ వీరాచారి ఆదేశాలు కర్నూలు(అగ్రికల్చర్): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల అభివృద్ధిపై శ్రద్ధ పెట్టాలని సహకార శాఖ ప్రత్యేక కేటగిరీ డిప్యూటీ రిజిస్ట్రార్ వీరాచారి ఆదేశించారు. జిల్లా సహకార కేంద్రబ్యాంకు సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా సహకార అధికారులు, సిబ్బంది సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘాల బలోపేతానికి ఐసీడీపీ నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సహకార వ్యవస్థ పటిష్టతకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అన్ని సంఘాలు ఎరువుల వ్యాపారం చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. పీఏసీఎస్‌లను నిబందనల ప్రకారం ఆడిట్ చేయాలన్నారు. 2015–16 లో జరిగిన లావాదేవీలపై పక్కాగా ఆడిట్ నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకు 78 శాతం ఆడిట్ పూర్తయిందని, మిగిలిన 22శాతాన్ని నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. కోర్టు కేసులకు సంబంధించి సకాలంలో కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి సుబ్బారావు, కర్నూలు డివిజన్ సహకార అధికారి ఉమామహేశ్వరీ, ఆడిట్ అధికారి నాగలింగేశ్వరి, డీసీసీబీ ఓఎస్డీ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. -
దివాకర్‌కు ఇమేజ్ కొలీగ్ సొసైటీ పురస్కారం
సామర్లకోట : రోహిణి స్టూడియో అధినేత తామరపల్లి దివాకర్‌కు అమెరికాలోని ఇమేజ్ కొలీగ్ సొసైటీ అత్యున్నత గౌరవ పురస్కారాన్ని ప్రకటించింది. స్టూడియో లైటింగ్‌పై పొట్రెట్ ఫొటోగ్రఫీపై 12 చిత్రాలతో కూడిన ఫొటో డాక్యుమెంటరీని అంతర్జాతీయ పోటీల కోసం ఈ ఏడాది మార్చిలో ఫొటోగ్రఫీ సొసైటీ అమెరికా, ఫెడరేషన్ డీలా ఆర్ట్ ఫొటోగ్రఫీ (ఫ్రాన్స్)తో పాటు ఇమేజ్ కొలీజ్ సొసైటీ(అమెరికా)కు ఆయన పంపారు. ఈ ఏడాది దివాకర్ పంపిన తెలుపు–నలుపు విభాగంలోని ఫొటోలు కళ్లకు కట్టినట్టుగా ఉండటంతో, ఇమేజ్ కొలీజ్ సొసైటీ న్యాయనిర్ణేతలు ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. సంస్థ చైర్మన్ టోనీ లీకిమ్ తాన్ ఈ–మెయిల్ ద్వారా సర్టిఫికెట్ జారీ చేశారు. సొసైటీలో జీవిత కాలం సభ్యతాన్ని కూడా పంపారని దివాకర్ బుధవారం విలేకరులకు వివరించారు. అమెరికన్ గౌరవ పురస్కారాన్ని అసెంబ్లీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ ఇటీవల దివాకర్‌కు అందజేశారు. -
ఉనికిలి సొసైటీలో చోరీ
ఉనికిలి(అత్తిలి) : ఉనికిలి విశాల సహకార పరపతి సంఘం భవనంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన మండలంలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అత్తిలి మండలం ఉనికిలిలో మెయిన్‌రోడ్డు పక్కన ఉన్న సొసైటీ ప్రధాన ద్వారం తలుపులను పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు సేల్స్ కౌంటర్లోని రూ.రెండులక్షల నగదుతోపాటు నాలుగు సీసీ కెమెరాలు, రెండు కంప్యూటర్లు, ఎల్సీడీ టీవీని అపహరించుకుపోయారు. రికార్డు గదికి నిప్పటించారు. నగదు ఉన్న సొరుగులోని స్ట్రాంగ్‌రూం తాళాలు తీసుకున్న దొంగలు బంగారు ఆభరణాలు భద్రపరిచే రూం తెరిచేందుకు విఫలయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో వెళ్తూ వెళ్తూ.. రికార్డులు భద్రపరిచిన గదికి నిప్పంటించారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సొసైటీ భవనం పక్కనే నివాసం ఉంటున్న వృద్ధురాలు సుబ్బలక్ష్మి పొగలు రావడాన్ని గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సొసైటీ అధ్యక్షుడు వట్టికూటి సూర్యనారాయణఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. అగ్నిమాపక సిబ్బందికి వచ్చి మంటలను పూర్తిస్థాయిలో అదుపు చేశారు. ఎస్ఐ వి.వెంకటేశ్వరరావు సొసైటీకి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తణుకు సీఐ చింతా రాంబాబు కూడా వచ్చి సొసైటీని పరిశీలించారు. ఏలూరు నుంచి వేలి ముద్ర నిపుణలు రప్పించి ఆధారాలు సేకరించారు. పోలీసు జాగిలంతో తనిఖీలు చేపట్టారు. జాగిలం పశువుల ఆస్పత్రి వరకూ వచ్చి ఆగింది. సొసైటీ కార్యదర్శి రావి చిట్టిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వి.వెంకటేశ్వరరావు తెలిపారు. -
ముందు పెళ్లాం.. తరువాతే సేవ
అహ్మదాబాద్: జీవితంలో అన్ని సుఖాలను త్యజించి సన్యాసి జీవితాన్ని ప్రారంభించిన ఓ వ్యక్తికి.. ముందు నీ భార్య సంరక్షణ భాధ్యతలు చూసుకోనాయనా అంటూ.. కోర్టు ఝలక్ ఇచ్చింది. సన్యాసత్వం పుచ్చుకొని సంపాదనకు దూరంగా ఉంటున్నా సరే.. వదిలేసిన భార్యకు భరణం చెల్లించాల్సిందేనంటూ ఘాటుగా మందలించింది. సమాజానికి సేవచేయడానికి బయలుదేరడం మంచిదే గానీ.. మరి నీ భార్య పరిస్థితి ఏంటి అని ప్రశ్నించింది. వివరాలు..గుజరాత్‌కు చెందిన సునిల్ ఉదాసి అనే వ్యక్తి నుంచి విడాకులు పొందిన సోని భరణం కోరుతూ 2001లో కోర్టును ఆశ్రయించగా.. నెలకు రూ. 3500 భరణం ఇవ్వాలని ఉదాసికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఉదాసి కోర్టు చెప్పిన విధంగా భరణం చెల్లిస్తూ వచ్చాడు. అయితే 2011లో ఆయన జీవితంలో అనుకోని మార్పులు చోటుచేసుకున్నాయి. పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్లిన ఉదాసి.. ఢిల్లీలో ఓ ఆశ్రమంలో చేరి సన్యాసత్వం స్వీకరించాడు. బ్యాంకు ఉద్యోగం మానేశాడు. సేవాకార్యక్రమాల్లో నిమగ్నమౌతూ జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ క్రమంలో సంపాదన లేకపోవడంతో సోనికి చెల్లించాల్సిన భరణం కష్టమైపోయింది. దీంతో 'నేను ఇప్పుడు సంపాదించడం లేదు.. చెల్లించాల్సిన భరణాన్ని తగ్గించండి' అంటూ ఉదాసి కోర్టును ఆశ్రయించాడు. అయితే ఉదాసి వాదనను విన్న గుజరాత్ హైకోర్టు.. సమాజానికి సేవచేయటం మంచిదే కానీ.. ముందు సోని గురించి ఆలోచించమంటూ సలహా ఇచ్చింది. భరణం మాత్రం తగ్గించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పింది. -
అంధత్వ రహిత సమాజానికి ముందుకు రావాలి
ఆదివెలమ సంక్షేమ సంఘం పిలుపు నేత్రదానం చేస్తున్నట్టు ప్రమాణ స్వీకారం కిర్లంపూడి : అంధత్వ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆదివెలమ సంక్షేమ సంఘం నాయకులు మోటేపల్లి వీరభద్రరావు (వీరబాబు), తోట గోపీత్రినాథ్‌లు పిలుపునిచ్చారు. సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పద్మనాభ ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులతో పాటు ఆదివెలమ కులానికి చెందిన సుమారు 50 మందితో బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్‌కు నేత్రదానం చేస్తూ ప్రమాణపత్రాలపై సంతకాలు చేయడమే కాకుండా వేదికపై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వీరబాబు, గోపీత్రినాథ్‌లు మాట్లాడుతూ నేత్రదానంపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. నేత్రదానంపై ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా తాను చనిపోతూ మరో ఇద్దరికి కంటి చూపు ప్రసాదించాలని పిలుపునిచ్చారు. అలాగే మోటేపల్లి జనార్ధన్‌రావు, తోట గోపీత్రినా«ద్లు తమ మరణానంతరం తమ దేహాలను కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలకు అప్పగిస్తూ వీలునామా రాయనున్నట్టు తెలియజేశారు. నేత్రదానం చేస్తూ ప్రమాణం చేసిన వారిలో నానిశెట్టి శివరామకృష్ణ, మాదిరెడ్డి శ్రీరామ్‌కుమార్, రూపాదేవి, వాణీ విజయలక్ష్మి, మోటేపల్లి వీరభద్రరావు, నానిశెట్టి నారాయణరావు, తోట నాగమోహిని, కోకా సరోజినీదేవి, అరవ సుదర్శనరావు, మోటేపల్లి జనార్దనరావు తదితరులు ఉన్నారు. -
అన్నదాత ఆక్రందన
– 4.75 లక్షల హెక్టార్లలో ఎండిన వేరుశనగ – వర్షం వచ్చినా దిగుబడి కష్టమే – నీటి కొరత వేధిస్తున్నా రెయిన్గన్ల ద్వారా హడావిడి – 36 వేల హెక్టార్లను తడిపినట్లు తప్పుడు గణాంకాలు అనంతపురం అగ్రికల్చర్ : + అమడగూరు మండలంలో 6,064 హెక్టార్లలో వేరుశనగ పంట సాగైంది. ఇందులో 450 హెక్టార్లలో పంట ఎండిపోతుండగా 62 రెయిన్గన్లు, 62 స్ప్రింక్లర్ సెట్ల ద్వారా ఇప్పటికే 483 హెక్టార్లకు రక్షకతడి ఇచ్చినట్లు అధికారులు నివేదిక తయారు చేశారు. వాస్తవానికి వస్తే 5 వేల హెక్టార్లకు పైబడి విస్తీర్ణంలో పంట ఎండింది. 62 రెయిన్గన్లు ఇచ్చినా అందులో కొన్ని అధికార పార్టీ నేతల ఇళ్ల దగ్గర పెట్టుకున్నారు. 40 రెయిన్గన్ల ద్వారా ఇప్పటివరకు 206 హెక్టార్ల పంటకు మాత్రమే రక్షకతడి ఇచ్చారు. + తనకల్లు మండలంలో 8,812 హెక్టార్లలో వేరుశనగ వేశారు. 88 రెయిన్గన్లు, 88 స్ప్రింక్లర్ సెట్ల ద్వారా 871 హెక్టార్లలో పంటకు రక్షకతడి ఇచ్చి కాపాడినట్లు అధికారుల నివేదిక చెబుతోంది. వాస్తవానికి ఈ మండలంలో 4,800 హెక్టార్లలో పంట ఎండుముఖం పట్టింది. పది రోజులుగా 50 నుంచి 59 రెయిన్గన్ల ద్వారా 350 హెక్టార్లకు మించి రక్షకతడి ఇవ్వలేదు. ఈ రెండు మండలాల్లోనే కాదు.. దాదాపు అన్ని మండలాల్లోనూ ఇలాంటి లెక్కలే కన్పిస్తున్నాయి. + వేరుశనగ పంట సర్వనాశనమై అన్నదాత ఇంట ఆక్రందనలు వినిపిస్తున్నా జిల్లా యంత్రాంగం మాత్రం ముఖ్యమంత్రి మెప్పు కోసం ఆరాటపడుతోంది. ఏడెనిమిది రోజులుగా రెయిన్గన్లు, స్ప్రింక్లర్ల ద్వారా రక్షకతడులంటూ హడావిడి చేస్తున్నారు. అయితే.. నీటి కొరత కారణంగా ఆశించిన స్థాయిలో ఇవ్వలేని పరిస్థితి. అధికారులు మాత్రం రెయిన్గన్ల ద్వారా ఇప్పటికే రూ.200 కోట్ల విలువ చేసే వేరుశనగ పంటను కాపాడి.. ప్రభుత్వానికి రూ.40 కోట్ల వరకు పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్‌సబ్సిడీ) మిగిలేలా చేశామంటూ తప్పుడు గణాంకాలు నమోదు చేశారు. 5.75 లక్షల హెక్టార్లలో ఎండిన పంట ఈ సారి ముందస్తు వర్షాలు మురిపించడంతో జూన్‌లో 3.55 లక్షల హెక్టార్లు, జూలైలో 1.90 లక్షల హెక్టార్లు, ఆగస్టులో 61 వేల హెక్టార్లు... మొత్తం 6.06 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ వేసినట్లు అధికారిక నివేదిక చెబుతోంది. జూలై 29 తర్వాత వర్షం జాడ కనిపించలేదు. దీంతో 4.75 లక్షల హెక్టార్ల పంట పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు వర్షం వచ్చినా పండే పరిస్థితి లేదు. ఈ నెలలో ఒక్క మండలంలో కూడా కనీసం పదును వర్షం పడకపోవడం గమనార్హం. 88.7 మిల్లీమీటర్ల(మి.మీ) సాధారణ వర్షాపాతానికి గానూ కేవలం 4.5 మి.మీ వర్షం కురిసింది. 95 శాతం లోటు వర్షపాతం ఉందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడుల రూపంలో దాదాపు రూ.1,000 కోట్ల వరకు భూమిలో పోయడంతో రైతుల ఇంట దయనీయ పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఫలితం ఇవ్వని రెయిన్గన్లు ఒక్క ఎకరా పంట కూడా ఎండకుండా రక్షక తడులతో కాపాడతామంటూ రాష్ట్ర సర్కారు గొప్పలు చెప్పింది. రక్షకతడుల కోసమంటూ 4,621 రెయిన్గన్లు, 4,279 స్ప్రింక్లర్ సెట్లు, 2,859 డీజిల్ ఇంజిన్లు, 1.28 లక్షల హెచ్డీ పైపులను జిల్లాకు కేటాయించింది. వాటిని పంట విస్తీర్ణాన్ని బట్టి మండలాల వారీగా సరఫరా చేశారు. అయితే..రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో భూగర్భజలాలు 19 మీటర్ల సగటు లోతుకు పడిపోయాయి. ఎక్కడా నీరు సమృద్ధిగా లభించని పరిస్థితి. దీని గురించి ఆలోచించకుండా అధికారులు పరికరాల సరఫరాతో సరిపెట్టారు. వీటిని తమకు స్వాధీనం చేయాలని అధికార పార్టీకి చెందిన మండల, గ్రామ స్థాయి నేతలు ఎక్కడికక్కడ అధికారులకు హుకుం జారీ చేయడంతో పంపిణీ ఇష్టారాజ్యమైంది. గణాంకాలపై అనుమానాలు నీరు అందుబాటులో లేకపోవడంతో రెయిన్గన్లను చాలా వరకు ఉపయోగించలేదు. 4,621 రెయిన్గన్లు జిల్లాకు చేరాయని, ఇందులో 3,461 ఉపయోగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మరి మిగతా వాటి పరిస్థితి ఏమిటనేది చెప్పడం లేదు. జిల్లా అంతటా పంట దారుణంగా ఎండిపోతుండగా.. ఈ నెల 26న సాయంత్రం తయారు చేసిన అధికారిక నివేదికలో మాత్రం 46 వేల హెక్టార్లలో పంట ఎండిపోతోందని, ఇప్పటివరకు 26 వేల హెక్టార్లకు రక్షకతడులు ఇచ్చామని పేర్కొన్నారు. అయితే.. అమడగూరు, తనకల్లు మండలాల మాదిరిగానే మిగతా అన్ని మండలాలకు సంబంధించి తప్పుడు నివేదికలు తయారు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
సేవతోనే సమాజంలో గుర్తింపు
– ప్రతి చెంచుగూడెం నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలి – రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలి – చెంచుగూడేల అభివద్ధికి కషి – ఎస్పీ ఆకే రవికృష్ణ జూపాడుబంగ్లా/కొత్తపల్లి: సేవతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. డీఎస్పీ సుప్రజ దత్తత గ్రామమైన శివపురం చెంచుగూడెంలో శనివారం ఎస్పీ పర్యటించారు. ఈ సందర్భంగా గూడెం మహిళలు సాంప్రదాయ నత్యంతో ఎస్పీ, డీఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ చెంచుగూడెంలో కలియతిరిగి గూడెంలో నిర్మించిన బీటీ రహదారులు, తాగునీటి కుళాయిలు, నీటితొట్లు, ఆశ్రమ పాఠశాలలో తాగునీటి కుళాయిల ఏర్పాటు వంటి మౌళిక వసతులను పరిశీలించి ప్రారంభించారు. అనంతరం గూడెంలోని ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌సొసైటీ వారి సహకారంతో 92 మంది కుటుంబాలకు వంటింటి సామగ్రి, దోమతెర, దుప్పటి, టవాళ్లు, అందజేశారు. అలాగే పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున స్కూల్ డ్రస్సులను పంపిణీ చేశారు. అనంతరం నలుగురు గర్భిణిలకు శ్రీమంతం నిర్వహించి వారికి చీరె,సారెలను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ చదువుకుంటే ఉన్నత స్థానాలకు చేరుకోవడం ఎంతో సులువన్నారు. ప్రతి గూడెం నుంచి ఒక ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలన్నారు. ప్రభుత్వం గిరిజనులకు కల్పించిన రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శివపురం గూడెం అభివద్ధికి తనవంతు సహకారం అందిస్తానాన్నరు. ఓ రోజు గూడెంలో రాత్రి బసచేస్తానని ఆయన గూడెం వాసులకు హామీనిచ్చారు. కార్యక్రమంలో సీఐ శ్రీనాథ్‌రెడ్డి, దివాకర్‌రెడ్డి, ఎస్ఐలు సుబ్రమణ్యం, శివాంజల్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డి, రాజ్‌కుమార్, రమేష్, శివశంకర్‌నాయక్, ముచ్చుమర్రి పీఎస్ఐ నరసింహ, సర్పంచి సంతోషమ్మ, జడ్పీటీసీలు పురుషోత్తంరెడ్డి, యుగంధర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడున్నా శివపురం గూడెంను మరవను: డీఎస్పీ సుప్రజ విధి నిర్వహణలో తాను ఎక్కడున్నా శివపురం గూడెంను మరవనని, వీలున్నప్పుడల్లా ఇక్కడికి వస్తానని డీఎస్పీ సుప్రజ తెలిపారు. ఎస్పీ ఆకె రవికష్ణ ఆదర్శంతోనే తాను ఈ గూడెంను దత్తత తీసుకున్నానన్నారు. అప్పటి నుంచి ప్రతి పదిహేను రోజులకోసారి గూడెం ప్రజలతో చర్చించి వారికి కావాల్సిన వసతుల కల్పనకు కషి చేశానన్నారు. ఈ మేరకు గూడెంలో బీటీరోడ్లు, తాగునీటి కుళాయిలు, విద్యుత్ సౌకర్యం, పాఠశాలలో తాగునీటి కుళాయిలు, దుస్తువులు వంటి సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. -
నష్టాల్.. కష్టాల్...
నష్టాలనుంచి కోలుకోని సొసైటీలు వైద్యనాథ్ కమిషన్ సాయానికీ నోచుకోని వైనం రుణమాఫీ మొత్తాలు జమకాని దుస్థితి జాతీయ స్థాయి సాయానికి దూరం లాభాల సొసైటీలకే జాతీయ కార్పొరేషన్ సాయం జిల్లాలో రెండింటికే అవకాశం సాక్షి ప్రతినిధి, విజయనగరం : రుణమాఫీ వ్యవహారం సహకార సొసైటీలను నిలువునా ముంచింది. అసలే వైద్యనాథ్ కమిషన్ సాయం అందక... రైతులు తీసుకున్న రుణాలు కరువు కాటకాల కారణంగా సకాలంలో చెల్లించక... అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఆదుకోవాల్సిన సర్కారు వాటిపై కన్నెత్తయినా చూడట్లేదు. వీటి దుస్థితికి తోడు జాతీయ కార్పొరేషన్ సైతం లాభాల సైసైటీలకే సాయమందిస్తామన్న ప్రకటించడంతో జిల్లాలోని 93 సొసైటీలు ఆ అవకాశాన్ని కోల్పోయాయి. రుణమాఫీ మొత్తాలు జమయితే కొన్ని సొసైటీలైనా జాతీయ స్థాయి సాయానికి అర్హత సాధించగలిగి ఉండేవని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని పీఏసీఎస్‌లు: 95 నష్టాల్లో ఉన్నవి: 93 లాభాల్లో ఉన్నవి: 2 సహకార సంఘాల నష్టాలు: రూ. 108.41కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల బలోపేతానికి దివంగత వైఎస్ హయాంలో ప్రత్యేక కషి జరిగింది. నష్టాల్లో ఉన్న సంఘాలను గట్టెక్కించేందుకు ఆయన వైద్యనాథ్ కమిషన్ వేశారు. రకరకాల కారణాలతో నష్టపోయి ఉన్న రైతుల నుంచి బకాయిలు వసూలు చేయలేని పరిస్థితుల్లో సహకార సంఘాలున్నాయని, వాటిని ప్రభుత్వమే ఆదుకోవాలని వైద్యనాథ్ కమిటీ సిఫార్సు చేసింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు సంఘాలను పరిపుష్టి చేసేందుకు జిల్లాకు రూ. 66.40కోట్ల ఆర్థిక సాయం అందించారు. అటు తరువాత సొసైటీలకు ఆ సాయం చేరలేదు. అప్పటికే ఉన్న సొసైటీల రుణ బకాయిల కింద జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) దాదాపు సర్ధుబాటు చేసుకుంది. సంఘాలకు వెళ్లింది స్వల్పమే. దీంతో సహకార సంఘాలు లావాదేవీలను అభివద్ధి చేసుకోలేకపోయాయి. ఏటా డీసీసీబీ చేయాల్సిన ఫైనాన్స్ కూడా సక్రమంగా జరగలేదు. సొసైటీలకిచ్చిన గత రుణాలనే రీలోనింగ్గా మార్చుకుంటోంది. అసలేం జరగాలంటే... ఆప్కాబ్ నుంచి డీసీసీబీకి సాయం వస్తుంది. దాంట్లోంచి సొసైటీల వారీగా డీసీసీబీ రుణసాయం చేయాలి. సొసైటీలకొచ్చిన రుణసాయం నుంచి రైతులకు రుణాలు ఇవ్వాలి. రుణ బకాయిలు వసూలు చేసి తిరిగి డీసీసీబీకి సొసైటీలు చెల్లించాలి. ఇదంతా ఒక సైక్లింగ్ విధానం. కానీ, లావాదేవీలు సక్రమంగా జరగలేదు. గతేడాది రూ. 103.11కోట్లు సొసైటీలకు రుణ సాయం చేసినట్టు డీసీసీబీ లెక్కలు చూపిస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులు పరిశీలిస్తే వాటిలో అత్యధికం గతంలో ఇచ్చిన రుణాలను రీలోనింగ్గా చూపించి, సర్దుబాటు చేసుకుంది. అంటే, ఏళ్ల తరబడి రైతులు బకాయిలు చెల్లించకపోవడం... సొసైటీలకు కొత్తగా ఫైనాన్స్ అందకపోవడంతో అవి ఆర్థిక పురోగతి సాధించలేకపోయాయి. ఇంతలో సీఎం చంద్రబాబు నాయుడు రుణమాఫీ ప్రకటించారు. ఆ మొత్తాలు పూర్తిగా వచ్చేసుంటే నష్టాలనుంచి సంఘాలు బయటపడేవి. ప్రభుత్వం చేసిన అరకొర రుణమాఫీతో ఎక్కడికక్కడ బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వం చేసిన రుణమాఫీ ప్రకటన మేరకు రైతులు కూడా బకాయిలు చెల్లించడం లేదు. దీంతో సహకార సంఘాల నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. రూ. 108.41కోట్ల మేర నష్టాలున్నాయంటే ఈ సంఘాలు ఎప్పటికి గట్టెక్కుతాయో దేవుడికే ఎరుక. జాతీయ సాయానికి అనర్హత జిల్లాలో లాభాల్లో ఉన్న సహకార సంఘాలకే సాయమందిస్తామని జాతీయ సహకార అభివద్ధి కార్పొరేషన్(ఎన్సీడీసీ) ముందుకొచ్చింది. మూడేళ్ల పాటు వరుసగా లాభాలొచ్చిన సంఘాల జాబితాను పంపిస్తే వారికి అన్ని రకాలుగా సాయం చేస్తామని సూచించింది. అయితే ఎన్సీడీసీ ఇచ్చిన అవకాశానికి జిల్లాలో రెండే సొసైటీలు అర్హత సాధించాయి. జిల్లాలో 95 సహకార సంఘాలుండగా వాటిలో భోగాపురం మండలం పోలిపల్లి, గుర్ల మండలం కెల్ల సొసైటీలు మాత్రమే లాభాలు సాధించినట్టుగా నివేదికలు స్పష్టం చేశాయి. మిగతా 93సొసైటీలు నష్టాల్లోనే ఉన్నాయి. ఎరువులు, విత్తనాల అమ్మకాలు, «ధాన్యం కొనుగోలు తదితర సేవల ద్వారా సొసైటీల్లో లావాదేవీలు జరుగుతున్నా అవి నష్టాల నుంచి గట్టెక్కించలేకపోతున్నాయి. కారణాలేమైనప్పటికీ నష్టాల కారణంగా జాతీయ సహకార అభివద్ధి కార్పొరేషన్ నుంచి రావల్సిన అవకాశాలను కోల్పోవాల్సి వచ్చింది. ఏటా ఇదే పరిస్థితిని సొసైటీలు ఎదుర్కొంటున్నాయి. ఈ దుస్థితి నుంచి గట్టెక్కాలంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక సాయమందాలి. పూర్తిగా రుణమాఫీ చేసినట్టయితే రైతుల రుణ బకాయిల నుంచి గట్టెక్కి నికర ఆదాయంలోకి వస్తాయి. అప్పుడే జాతీయ సాయానికి అర్హత సాధించగలవు. -
‘సమ సమాజ నిర్మాణమే లక్ష్యం’
అనంతపురం సప్తగిరి సర్కిల్ : సమ సమాజ నిర్మాణమే అభ్యుదయ సాహిత్య లక్ష్యమని భారతీయ అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శి పెనుకొండ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అభ్యుదయ సాహిత్యం 80 ఏళ్ల చరిత్ర కలిగి ఉందన్నారు. సమ సమాజ నిర్మాణమే అభ్యుదయ సాహిత్య లక్ష్యమన్నారు. మార్క్సిజం, తాత్విక నేపథ్యం ద్వారా పేదలవైపు నిలబడి సాహిత్యాన్ని సృష్టించేదే అభ్యుదయ సాహిత్యమన్నారు. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, మహిళలు దళితులు 90 శాతం అభ్యుదయ సాహిత్యం వైపు ఉన్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిలుకూరి దేవపుత్ర, మల్లెల నరసింహమూర్తి, రాజారెడ్డి, నాగేంద్రగౌడ్ పాల్గొన్నారు. -
సమాజం తిరగబడే పరిస్థితి తెచ్చుకోకండి
ఖమ్మం: ప్రభుత్వోపాధ్యాయుల తీరుపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. సమాజం తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దని వారిని హెచ్చరించారు. అటువంటి దుస్థితి ఉపాధ్యాయులకు రాకూడదన్నారు. గతంలో ఉపాధ్యాయుడు సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉండేవాడని, కానీ ఇప్పుడు ప్రజలే ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగించి పాఠశాలలకు పంపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మంలోని పువ్వాడ ఆడిటోరియంలో జరిగిన ఉపాధ్యాయుల మోటివేషన్ కార్యక్రమానికి కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. హెచ్ఎం అంకితభావంతో పని చేస్తేనే. పాఠశాల హెడ్మాస్టర్ (హెచ్ఎం) అంకితభావంతో పనిచేస్తే ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని, ఉత్తమ ఫలితాలు కూడా సాధించవచ్చని కడియం పేర్కొన్నారు. అంకితభావం కొరవడిన చోటే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకన్నా అన్ని అర్హతలు కలిగిన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఎందుకు కుంటుపడుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ఉపాధ్యాయ సంఘాలు 50కి పైగా ఉన్నాయని, ఆయా సంఘాల నాయకులు చేతిలో డైరీలు పట్టుకుని డీఈవో కార్యాలయాల చుట్టూ తిరగడం శోచనీయమన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతోపాటు విద్యా వ్యవస్థలోని మార్పులకు ఉపాధ్యాయ సంఘాలు సూచనలివ్వాలని, ఇందుకోసం సెమినార్లు నిర్వహించాలని కడియం సూచించారు. సమయమంతా ప్రయాణాల్లోనే... ఉపాధ్యాయుల సమయమంతా బస్సులు, రైళ్లలోనే (స్కూళ్లకు రాకపోకల కోసం ప్రయాణాల్లోనే) గడిచిపోతోందన్నారు. మహిళా ఉపాధ్యాయులైతే ఇంట్లో పనిచేసుకొని హడావుడిగా పాఠశాలకు వెళ్లే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితిలో వెళ్లిన ఉపాధ్యాయులు ఏం బోధిస్తారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉండాలని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉపాధ్యాయులకంటే విద్యార్థులు తెలివైన వారిగా ఉంటున్నారన్నారు. సన్నాహం కాకుండా తరగతికి వెళ్లే ఉపాధ్యాయుడు బోధించడం కష్టమన్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోందని, మౌలిక వసతుల కల్పనకు ఎన్ని కోట్లు అయినా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నిధులు విడుదల చేసే పూచీ ప్రభుత్వానిదని, సక్రమంగా పాఠాలు చెప్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్ తదితరులు పాల్గొన్నారు. అవమానించడం తగదు: ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం కడియం చేసిన వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆయన వ్యాఖ్యలను ఖండించాయి. బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి ఉపాధ్యాయులను బహిరంగ వేదికపై అవమానించేలా మాట్లాడటం కడియం శ్రీహరికి తగదని ఖమ్మం జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. ఉపాధ్యాయ సంఘాలు డైరీలు పట్టుకుని తిరుగుతున్నాయని పేర్కొనడంతోపాటు ఉపాధ్యాయినులను కూడా కించపరిచేలా మంత్రి మాట్లాడటం శోచనీయమన్నాయి. ఏకీకృత సర్వీసుల రూపకల్పనలో కాలయాపన చేయడమే కాకుండా ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం...దాన్ని కప్పిపుచ్చుకుని ఉపాధ్యాయులను విమర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాయి. ప్రత్యేక తెలంగాణ కోసం అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమించాయని, ఈ విషయాన్ని మరిచిన మంత్రి ఇష్టారీతిన మాట్లాడి అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఖమ్మంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పీఆర్టీయూ, యూటీఎఫ్, ఎస్టీఎఫ్, టీఎన్‌యూఎస్, టీపీటీఎఫ్ సంఘాల నాయకులు మాట్లాడారు. -
రూ.24 లక్షలకు కుచ్చుటోపీ
– ఉడాయించిన సహకార బ్యాంకు డైలీ డిపాజిటర్ ఏజెంట్ – లబోదిబోమంటున్న బాధితులు కోవెలకుంట్ల: కోవెలకుంట్ల సహకార బ్యాంకులో డైలీ డిపాజిటర్ ఏజెంట్ డిపాజిట్ సొమ్ముతో ఉడాయించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులు అందించిన సమాచారం మేరకు వివరాలు... పట్టణానికి చెందిన నాగరాజు గత 20 సంవత్సరాల నుంచి సహకార బ్యాంకులో డైలీ డిపాజిటర్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. నూర్ అహమ్మద్, రంగడు, పుల్లయ్య, రామిరెడ్డి, అమీర్, నారాయణరెడ్డి, సావిత్రి, ప్రసాదు, వెంకటేశ్వరరావు, గణేష్‌రెడ్డి, దస్తగిరి, బాష, గోవిందు, చౌడయ్య, సుధాకర్‌రెడ్డి, శివభాస్కర్‌రెడ్డి, మరో 50 మంది ఏజెంట్ వద్ద ప్రతి రోజు రూ. వంద నుంచి రూ. 3వేల వరకు ఏజెంట్ వద్ద డిపాజిట్ చేశారు. ఏడాదిపాటు రోజుకు రూ. వంద చెల్లించిన లబ్ధిదారునికి ఏడాది ఆఖరులో బ్యాంకు రూ. 36,800 చెల్లిస్తుంది. ఆరు నెలల నుంచి లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా వాడుకున్నట్లు తెలుస్తోంది. డిపాజిటర్ల నుంచి సుమారు రూ. 24 లక్షలు వసూలు చేసి ఇటీవల కన్పించకుండా పోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 40 మంది లబ్ధిదారులు ఏడాదికాలం చెల్లించగా వారికి వడ్డీతో సహా మొత్తాన్ని అందజేయాల్సి ఉంది. ఈ తరుణంలో ఏజెంట్ కన్పించకపోవడంతో బాధితులు బ్యాంకును చేరుకుని తమకు న్యాయం చేయాలని అధికారులను విన్నవించుకున్నారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ కష్ణమూర్తి మాట్లాడుతూ ఏజెంట్ లబ్ధిదారుల నుంచి డిపాజిట్ వసూలు చేసి బ్యాంకులో జమ చేయలేదన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందన్నారు. సహకార బ్యాంకు జిల్లా శాఖకు ఫిర్యాదు చేయగా ఈ సంఘటనపై విచారణ అధికారిని నియమించినట్లు తెలిపారు. ఏజెంట్‌కు సంబంధించిన రికార్డులు, రసీదులు, తదితర అంశాలను పరిశీలించగా రూ. 12 లక్షలకు సంబంధించి లెక్కల్లో తేడాలు ఉన్నట్లు తేలిందన్నారు. డిపాజిటర్లు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని డిపాజిట్ చేసిన సొమ్మున చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
సమాజాన్ని మార్చే సత్తా విద్యకే ఉంది
మార్కులు, ఉద్యోగాలకే విద్య పరిమితం కావొద్దు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారే గొప్పవారయ్యారు ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తిమ్మాపూర్ : సమాజాన్ని మార్చేశక్తి విద్యకే ఉందని, మార్కులకు, ఉద్యోగాలకు మాత్రమే విద్యను పరిమితం చేయెుద్దని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అల్గునూర్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో న్యూ క్వాలిటీ పాలసీ (ఎన్క్యూపీ)పై ఉపాధ్యాయులకు మంగళవారం జిల్లాస్థాయి సెమినార్ నిర్వహించగా, ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు తగదని, సర్కారు బడుల్లో చదువుకున్న చాలా మంది ఉన్నత స్థానాలను అధిరోహించారన్నారు. బడుగుబలహీన వర్గాలకు చెందిన జ్యోతీరావుపూలే, బీఆర్.అంబేద్కర్ వంటివారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే అపరమేధావులుగా కీర్తిగడించారని వివరించారు. ఆ మహనీయుల స్ఫూర్తితో విద్యార్థులు ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 250 రెసిడెన్షియల్ స్కూళ్లను కొత్తగా ఏర్పాటు చేస్తోందన్నారు. బిడ్డల చదువుల కోసం తల్లిదండ్రులపై ప్రభుత్వం భారం పడనివ్వడం లేదన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా చేయడం గౌరవంగా భావించుకోవాలని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా పని చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ నీతూప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, జెడ్పీటీసీలు పద్మ, శరత్‌రావు, వేణు, ఎంపీపీ ప్రేమలత, ప్రిన్సిపాల్ అనంతలక్ష్మి పాల్గొన్నారు. -
బెటర్ తల
దేవుడు సృష్టించింది కొన్ని నాణ్యమైన తలలే! తక్కినవాటిని జుట్టుతో కప్పేశాడు! సినిమాలో ఒక జోక్: డాక్టర్: రెండు నెలల్లో నీకు బట్టతల గ్యారంటీ. ఇంత దాకా ఎందుకు తెచ్చుకున్నావ్? హీరో: స్ట్రెస్ వల్ల డాక్టర్. డాక్టర్: అవునా. స్ట్రెస్ ఎందుకు? హీరో: జుట్టు రాలిపోతోందని... ఆడవాళ్లు అనేక కారణాలకు స్పృహ తప్పుతారు. మగవాడు మాత్రం ఒకే ఒక కారణానికి కెవ్వుమంటాడు. అదేమిటో తెలుసా? అద్దంలో బట్టతల. దువ్వుకునేటప్పుడు వెంట్రుకలు రాలుతూ కనిపించినా నుదురు పైకి పాకుతూ కనిపించినా అందరికీ వెన్నులో చలి పుట్టొచ్చుగాని మగవాడికి మాత్రం మాడులో చలిపుడుతుంది. పుర్రె బయటపడుతుందేమోననే వెర్రి భయం పట్టుకుంటుంది. అసలు కేశంకు కొంచెం ‘ల’ వత్తు తగిలిస్తే క్లేశం వస్తుంది. అంటే దేవుడు కేశంలోనే క్లేశం పెట్టాడన్న మాట. శివుడికి బట్టతల ఇష్యూ లేదు. ఆయనది చిక్కుముడుల తల. పైగా గంగమ్మ ఏసి ఒకటి రన్ అవుతూ ఉంటుంది. విష్ణుమూర్తికి హెయిర్‌లాస్ ప్రాబ్లమ్ ఉన్నట్టు లేదు. కిరీటాన్ని హెల్మెట్‌లా పెట్టుకున్నాక కూడా మనకు జులపాల జుట్టు కనిపిస్తూనే ఉంటుంది. ఇక బ్రహ్మదేవునికి నాలుగు తలలతోపాటు నాలుగు గడ్డాల నిండుగా కూడా కేశాలు కళకళలాడుతూ ఉంటాయి. మరి ఈ ముగ్గురు దేవుళ్లకు లేని బాధ సగటు మగవాడికి ఎందుకు? బ్రహ్మ సృష్టించిన మగ ప్రాణికి ఎందుకు? ఒకవేళ ఇచ్చెనుపో... స్త్రీ జాతికి మగవాడి శిరోజాల మీదే దృష్టి పెట్టడం ఏలా? తరాల నుంచి వారికి మగవాడి ముఖం మీద కంటే తల మీద ఉన్న జుట్టు మీదే ఆసక్తి ఎక్కువ. ‘దీర్ఘ కేశములవాడు’... అని వారు మురిసిపోతారు. ‘నల్లని కురులవాడు’ అని మనసు పారేసుకుంటారు. ‘నీలాల ముంగురులవాడు’ అంటూ మఖ్మల్ పత్రం పై నెమలి ఈకతో లవ్ లెటర్ రాస్తారు. ఏం జుట్టు లేనివాడు మనిషి కాడా? జుట్టున్న నాగార్జున మాత్రమేనా మన్మథుడు? ఇలా ఎవరు నిలదీయాలి? ఈ లోకం కళ్లు ఎవరు తెరిపించాలి? అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్చ్. బట్టతల ఉంది. కేన్సిల్. ఎన్.ఆర్.ఐ... అమెరికాలో పెద్ద ఉద్యోగం. నో. పైన ఎకరం పోయింది. కేన్సిల్. బాగా వెనకేసుకున్నాడు.... బోనస్‌గా అత్తమామలు ఆడపడుచులు కూడా లేరు. నెవర్. ట్వంటీ ట్వంటీ మేచ్ ఆడటానికి సరిపడా గ్రౌండ్ ఉంది నెత్తి మీద కేన్సిల్. గవర్నమెంట్లో పెద్ద ఆఫీసర్. నోనో... ఆ ఓపెన్ టాప్వాడు సెల్ఫీకి పనికిరాడు... కేన్సిల్. ఇంతకీ ఏంటంటావ్. ఎవరినైనా తేండి... కాని నెత్తి మీద జుట్టున్నవాణ్ణి తేండి. ఇలా మాట్లాడేవాళ్ల మీద పరువు నష్టం దావా వేసే చట్టం ఎందుకు రాదు? దీని కోసం ఓపిక చేసుకుని అన్నా హజారే కాని ఓపిక లేకపోయినా అరవింద్ కేజ్రీవాల్గాని ఎందుకు పోరాటం చేయరు. బట్టతల ఉన్న సహోదరులారా... పోరాడండి... పోరాడితే పోయేదేమీ లేదు... మిగిలిన ఆ కాస్తంత జుట్టు తప్ప. మగవాడు పుట్టింది దేని మీదైనా సరే కాలు దువ్వడానికి కాని జుట్టు దువ్వడానికి కాదు. జుట్టు ఉన్నా పౌరుషమే. జుట్టు లేకపోయినా పౌరుషమే. అసలు బట్టతల వల్లే ఈ సమాజం నడుస్తోందని రూఢీగా చెప్పవచ్చును. సమాజం నడవాలంటే మేధావులు కావాలి. మేధావులుగా ఎవరైనా మారాలంటే వారికి బట్టతల రావాలి. అందుకే అన్నారు పెద్దలు ‘బట్టతలవాడు బ్రహ్మవిద్యలు నేర్చున్’ అని. బట్టతల వాళ్లకు ఉన్న అడ్వాంటేజెస్ ఎవరికి ఉన్నాయి. బార్బర్ ఖర్చు లేదు. తలస్నానానికి షాంపు ఖర్చు లేదు. జేబులో దువ్వెన ఖర్చు లేదు. పేల భయం లేదు. ఇన్నేలా? చాలామంది మగవాళ్లు తమ జుట్టును తీసుకెళ్లి భార్య చేతిలో పెడతారు. కాని బట్టతల ఉన్నవాళ్లు ఆత్మాభిమానం కలిగిన భర్తల్లా నిర్భీతితో మెలుగుతారు. బట్టతల కలిగినవారు నిస్వార్థపరులు. ఈ సంగతి ఉదాహరణతో సహా నిరూపించవచ్చు. చరిత్రలో ఎంతోమంది బట్టతల సైంటిస్ట్‌లు ఉన్నారు. వాళ్లంతా మానవ కల్యాణం కోసం ఆవిష్కరణలు చేశారే తప్పితే తమ బట్టతల మీద జుట్టు మొలిపించే ప్రయోగాలకు పోలేదు. థామస్ ఆల్వా ఎడిసన్‌కు సంపూర్ణ బట్టతల. కాని అతడు తన బుర్రలో వెలిగిన ఐడియాను బయట బల్బ్‌లా వెలిగించాడు కాని తలుచుకుంటే బట్టతల మీద బొచ్చు మొలిపించుకోలేక కాదు. ఆ సంగతి చేతకాకా కాదు. వద్దనుకున్నాడంతే. ఇక చాలు. బట్టతల ఉన్నందుకు సమాజం మగవాణ్ణి వెంటాడింది చాలు. యుగాలుగా మగవాడు సమాజానికి భయపడి తన బట్టతలను దాచుకున్నాడు. కిరీటాలు పెట్టాడు. తల పాగాలు చుట్టాడు. టోపీలు ధరించాడు. తల గుడ్డ కట్టాడు. స్కార్ఫ్‌ల్లో తలను దాచుకున్నాడు. కాని ఇక అక్కర్లేదు. నా బట్టతలే నా అందం. నా బట్టతలే నా సంస్కారం. నా బట్టతలే నా గౌరవం. నా బట్టతలే నా ఆభరణం అని ఇప్పుడు బట్టతలను ఓన్ చేసుకుంటున్నాడు. అసలు ఏకంగా బట్టతల చుట్టూ ఉన్న ఇతర వెంట్రుకలను కూడా తొలగించి బోడి గుండుతో తిరుగుతూ అదే ఫ్యాషన్‌గా నిరూపించుకోగలుగుతున్నాడు. 20 ఏళ్ల వయసు నుంచి 50 ఏళ్ల లోపు వాళ్లు బట్టతలతో లేదా బోడి గుండుతో కనిపించడం వారి శారీరక దృఢత్వానికి ఒక సంకేతంగా భావిస్తున్న రోజులు వచ్చాయి. స్త్రీలు, సమాజం మంచి వయసులో ఉండి బోడి గుండుతో తిరుగుతున్నవారిని దృఢమైనవారిగా గుర్తిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అయిదు పదేళ్ల క్రితం అయితే ఇలా కనిపించేవారిని చూసి నవ్వడం ఆనవాయితీగా ఉండేది. ఇప్పుడు నవ్వు స్థానంలో యాక్సెప్టెన్స్ వచ్చింది. సక్సెస్‌ను మించిన ఆకర్షణ లేదు. మగవాడు తాను ఎంచుకున్న రంగంలో సక్సెస్ అయితే అది అతడి నిజమైన బాహ్య ఆకర్షణ అయ్యే రోజులు వచ్చాయి. కనుక మగవాడు ఇప్పుడు బట్టతల బెంగను క్రమంగా వదిలించుకుంటున్నాడు. తనను ‘దానితో పాటు’గా అంగీకరించే స్థితికి సమాజాన్ని తీసుకువెళుతున్నాడు. తలంపు ముఖ్యం. తల కాదు. బట్టతల తలెత్తుకుని తిరుగుతున్న రోజులను స్వాగతిద్దాం. - శశి వెన్నిరాడై మహామహులు... తమ బట్టతలను లెక్క చేయకుండా మహామహులుగా మన్ననలు అందుకున్నవారు ఎందరో చరిత్రలో ఉన్నారు. గాంధీగారు తన బట్టతలను దాచుకునే వారు కాదు. నెహ్రూగారి బట్టతలకు తెల్లటి టోపీయే అందం. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాస్ చంద్రబోస్ వీరికంతా బట్టతలే. హీరోల్లో గొప్పవారు కూడా బట్టతలను లెక్క చేయలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, తమిళ సూపర్‌స్టార్ ఎం.జి.ఆర్, కన్నడ రాజకుమార్... వీరందరూ బట్టతల ఉన్నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఒక వెలుగు వెలిగినవారే. నటుడు రజనీకాంత్ ఇంత పెద్ద స్టార్‌గా ఉన్నా బట్టతలను దాచుకోరు. ధీరూభాయ్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం ఎంత అనేదే జాతి చూసిందిగాని ఆయన బట్టతలను ఎవరూ ఒక వంకగా చూడలేదు. క్రికెట్లో సయ్యద్ కిర్మాణి చేసే స్టంప్ ఔట్స్ చూశారే తప్పితే రౌండ్ క్యాప్ కింద ఉన్న అతడి బట్టతలను కాదు. అవును... నాకు బట్టతల ఉంది... ఆ నాలుగు వెంట్రుకలు కూడా పక్కకు పారేసి హాయిగా గుండుతో ఉంటాను ఇది నా ఫ్యాషన్ స్టేట్మెంట్ అని దేశంలో ధైర్యంగా ప్రకటించింది దక్షిణాదిన చో రామస్వామి అయితే ఉత్తరాదిన సినీ దర్శకుడు రాకేష్ రోషన్. ఆ తర్వాత పాప్ గాయకుడు బాబా సెహెగల్, జర్నలిస్ట్ ప్రీతిష్ నంది, అనుపమ్ ఖేర్ తదితరులు గుండుతో కనిపించసాగారు. తెలుగులో హాస్యనటుడు ఏవిఎస్ కూడా పూర్తి గుండునే తన మార్క్‌గా చేసుకున్నారు. సంగీత దర్శకుడు రమణ గోగుల దానిని కొనసాగిస్తున్నారు. కంప్యూటర్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ గాని నేటి ఆదర్శం సత్య నాదేళ్ల కాని తమ బట్టతలలను దాచుకోలేదు. వీరంతా జుట్టు లేనివారి జట్టు. బట్టతలకే జై కొట్టు. రహస్య బట్టతలలు.... అందరూ రజనీకాంత్‌లు కాలేరు. స్క్రీన్ మీద మేకప్ బయట అక్కర్లేదు అనుకోలేరు. అదేం తప్పు కాదు. ఎవరి ఇష్టాయిఇష్టాలు వారివి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వచ్చాక బాలీవుడ్లో చాలామంది హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నారని అంటారు. అమితాబ్ ఈ విషయంలో తొలి వరుసలో ఉంటారు. సల్మాన్‌ఖాన్, గోవింద, సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా, సన్ని డియోల్, హాస్య నటుడు జావేద్ జాఫ్రీ, సంగీత దర్శకుడు అనూమలిక్... ఇలా ఈ పట్టిక అనంతం. -
కులం హజంపై ఎలుగెత్తిన గళం
కొత్త కోణం మనుషులందరూ సమానమేననే భావన ఫూలే సంస్కరణ మార్గానికి ప్రాతిపదిక. కుల ఆధిపత్యం నిరాకరించిన విద్యను శూద్రులకు, మహిళలకు, అంటరాని కులాలకు అందించడం ద్వారానే వారిని చీకటి బతుకుల నుంచి బయటపడేయగలమని ఆయన విశ్వసించారు. శూద్రులను బానిసలుగా దిగజార్చిన మన కుల వ్యవస్థ, అమెరికాలో అమలైన బానిసత్వానికి తీసిపోదని విశ్లేషించారు. తల్లిదండ్రులకు, బిడ్డలకు మధ్య లేని దళారులు... భగవంతునికి, భక్తులకు మధ్య ఎందుకు? అంటూ ఫూలే ప్రశ్నించారు. పెళ్ళి భజంత్రీలు మోగుతున్నాయి. పెళ్ళి కొడుకుని ఊరేగిస్తున్నారు. అంతలో ఎవరిదోగానీ ‘నువ్వెవరివి?’ అనే ప్రశ్న దూసుకొచ్చింది. ‘నేను పెళ్ళి కొడుకు స్నేహితుడిని’ అన్నాడతను. ‘నీదేకులం?’ మళ్ళీ ప్రశ్న. అవహేళనని దిగమింగుకుంటూ ‘మాలి’ అని సమాధానమిచ్చాడా యువకుడు. బ్రాహ్మణ పెళ్ళి ఊరేగింపులో మాలివాడా? అంతా అతన్ని నానా మాటలూ అన్నారు. ఊరేగింపు ముందుకు పోయింది. ఆ యువకుని పాదాలు విముక్తిబాట పట్టాయి. ఇలాంటి అవమానాలు అతనికి కొత్త కాదు, కానీ వందలాది మందిలో జరిగిన ఈ అవమానం తన జాతిజనులకు జరిగిన అవమానంగా అతడు భావించాడు. శూద్ర, అతిశూద్రుల పట్ల సమాజానికున్న తప్పుడు భావజాలాన్ని ఎలాగైనా మార్చాలనుకున్నాడు. సమానత్వ భావనలేని సమాజం ప్రగతివిరోధంగా భావించాడు. ఆనాడు ఆయన మదిలో మొలకెత్తిన ఈ భావన కులవ్యవస్థపై పోరాటానికి పునాది వేసింది. అతడా మహత్తర పోరాటానికే జీవిత సర్వస్వం ధారపోశాడు. కుల వ్యతిరేక పోరాటానికి ఒక సైద్ధాంతిక భూమికను అందించాడు. ఆయనే మహాత్మాజ్యోతిబా ఫూలే. బాబా సాహెబ్ అంబేడ్కర్, తన ముగ్గురు గురువుల్లో ఒకరిగా పేర్కొన్న దార్శనికుడాయన (మిగతా ఇద్దరు గౌతమ బుద్ధుడు, కబీర్). మహారాష్ట్రకే చెందిన ఫూలే మరణించిన ఏడాదికి అంబేడ్కర్ జన్మించారు. ఫూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పూనాలో జన్మించారు. జ్యోతిబా ఫూలే తండ్రి గోవిందరావు అక్కడ కాయగూరల వర్తకం చేసేవారు. సతారా జిల్లాకు చెందిన ఫూలే పూర్వీకులు పూనాకు బతుకుదెరువుకోసం వచ్చారు. ఫూలే వారి ఇంటి పేరుగా మారడానికి కారణం వారు పూలవర్తకం కూడా చేయడమేనని భావిస్తున్నారు. అంతకు ముందు వారి ఇంటిపేరు గొర్హాయి. ప్రాథమిక విద్యతో చదువుకు స్వస్తి పలికి ఫూలే తండ్రికి తోటపనిలో సహాయ పడటం మొదలు పెట్టారు. అయితే ఫూలేకు చదువు పట్ల ఉన్న తపనను చూసిన ఒక ముస్లిం ఉపాధ్యాయుడు, ఒక క్రిస్టియన్ ఫాదర్ ఆ పిల్లాడిని చదివించేలా తండ్రిపై ఒత్తిడి తెచ్చారు. . దానితో 1841లో జ్యోతిబా ఫూలే పూనాలోని స్కాటిష్ మిషన్ హైస్కూల్లో చదువు కొనసాగించాడు. అక్కడే సదాశివ్ బల్లాల్ గొవాండే ఆయనకు మిత్రుడయ్యాడు. పుట్టుకతో బ్రాహ్మణుడైనా సదాశివ్, ఫూలే కుల వ్యతిరేక పోరాటానికి చివరి దాకా అండదండలు అందించాడు. సంస్కరణాస్త్రంగా విద్య విద్యార్థి దశలోనే ఫూలే ఒక తాత్విక దృక్పథం ఏర్పర్చుకోవడానికి ప్రముఖ సామాజికవేత్త థామస్ పెయిన్ రాసిన ‘ద రైట్స్ ఆఫ్ మ్యాన్’ ఉపయోగపడింది. అది, యూరప్, అమెరికా హక్కుల ఉద్యమాలకు గొప్ప దిశానిర్దేశం చేసింది. భూమి పైన పుట్టిన మనుషులందరూ సమానమేననే భావనను ఫూలే ఒంటబట్టించుకున్నాడు. కుల అసమానతలను అధిగమించాలంటే కుల ఆధిపత్యం నిరాకరించిన విద్యను శూద్రులకు, మహిళలకు, అంటరాని కులాలకు అందించాలనీ, అదొక్కటే వారిని చీకటి బతుకుల నుంచి బయటపడవేయగలదనీ ఫూలే దృఢ విశ్వాసం. అందుకే ముందుగా తన జీవిత భాగస్వామి సావిత్రీబాయిని విద్యావంతురాలిని చేశారు. ఆయన నేర్పిన ఆ అక్షరాలే ఆమెకు ఫూలే పోరాటంలో జీవితాంతం తోడునీడగా నిలవగలిగే చైతన్యాన్ని అందించాయి. సావిత్రీబాయి నేర్చుకున్న విద్యాబుద్ధులు ఆమెను భారత దేశంలోనే తొట్టతొలి మహిళా ఉపాధ్యాయిని చేశాయి. సావిత్రీబాయితో కలిసి జ్యోతిబా ఫూలే తన ఇంటిలోనే 1851లో ప్రత్యేకించి బాలికలకోసం ఒక పాఠశాలను ప్రారంభించారు. ఫూలే చేసిన ఈ సాహసాన్ని ఆధిపత్య కులాలు, ప్రత్యేకించి బ్రాహ్మణులు తీవ్రంగా వ్యతిరేకించారు. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దుష్ర్పచారం చేశారు, ఇతరులెవ్వరూ అందులో పనిచేయకుండా అడ్డుకున్నారు. అయినా పాఠశాలను నడపడానికి నిర్ణయించుకొన్న ఫూలే దంపతులపై భౌతిక దాడులకు కూడా తెగబడ్డారు. అయినా ఫూలే దంపతులు తమ విద్యా ఉద్యమాన్ని ఆపలేదు. ‘‘అవిద్య వల్ల అవివేకం, అవివేకం వల్ల అనైతికత, అనైతికత వల్ల వెనుకబాటుతనం, వెనుకబాటుతనం వల్ల పేదరికం, పేదరికం వల్ల నిమ్న కులాలు వివక్షకు, అణచివేతకు గురికావడం జరుగుతోంది. అందుకే అన్ని రుగ్మతలకు అవిద్యే కారణమని ఫూలే బలంగా విశ్వసించారు. అందువల్లనే కింది కులాలకు, అన్ని కులాల మహిళలకు విద్యను అందించాలనే దృఢ నిశ్చయంతో ఫూలే ముందుకు సాగారు. ఈ క్రమంలోనే 1851-52 మధ్య కాలంలో మరో రెండు బాలికల పాఠశాలలను ప్రారంభించారు. ఇందులో అంటరానికులాలైన మహర్, మాంగ్ బాలికలకు ఒక పాఠశాలను ప్రత్యేకించారు. 1882లో, విద్యా విషయాలపై బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన హంటర్ కమిషన్ ముందు ఇచ్చిన ఉపన్యాసంలో ఫూలే తన విద్యాపోరాటాన్ని వివరించారు. అంటరాని కులాల కోసం, ప్రత్యేకించి బాలికల కోసం పాఠశాలను నడిపిన మొట్టమొదటి సంఘసంస్కర్త జ్యోతిబా ఫూలే. శూద్రులు, అంటరాని కులాల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు అవసరమని మొట్టమొదటగా చెప్పింది కూడా ఆయనే. మన కులం ఆధునిక అమెరికన్ బానిసత్వం ఫూలే కుల వ్యవస్థపై, ముఖ్యంగా బ్రాహ్మణ పురోహిత వర్గం ఆధిపత్యం పై రెండు సిద్ధాంత గ్రంథాలను కూడా రాశారు. 1873లో‘గులాంగిరి’, 1881లో రైతుల అవస్థలపై ‘సేద్యగాని చర్నాకోల’ (షేఠ్ కార్యాంచా అసూడ్) అనే పుస్తకాలను రాసి... పురోహిత వర్గం ఇతర కులాలపై సాగిస్తున్న ఆధిపత్యాన్ని, దాని ప్రభావాలను వివరించారు. ‘గులాంగిరి’ పుస్తక ం భారత ఇతిహాసాలను, పురాణాలను మరొక కోణంలో చూపెట్టింది. భారత దేశంలోని ఆదివాసులను, స్థానిక ప్రజలను జయించడానికి ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చిన ఆర్యులు జరిపిన దాడులే మహా విష్ణువు దశావతారని ఫూలే ఆధారసహితంగా వివరించారు. బౌద్ధ మతాన్ని ధ్వంసం చేసే కుట్రలో భాగంగానే పరుశురాముడు ఆనాటి క్షేత్రియులను (స్థానికులను) వేలాదిగా హతమార్చాడని ఫూలే ధ్రువీకరించాడు. దీనినే బ్రాహ్మణ, క్షత్రియ వైరంగా కూడా చరిత్ర కారులు విశ్లేషించారు. ఈ పుస్తకానికి ముందు మాట రాస్తూ ‘‘బ్రాహ్మణులు శూద్రులను బానిసలుగా దిగజార్చిన వ్యవస్థ, కొన్నేళ్ల క్రితం వరకు అమెరికాలో అమలులో ఉన్న బానిసత్వ విధానానికి ఏ మాత్రం తీసిపోదు. కఠినాతి కఠినమైన బ్రాహ్మణ ఆధిపత్యంతో ఉన్న పీష్వాల కాలం వరకు నా శూద్ర సహోదరులు అమెరికాలో నీగ్రో బానిసలు అనుభవించిన వాటిని మించిన ఎన్నో కష్టాలను అనుభవించారు’’ అని ఆయన అన్నారు. భారత కుల వ్యవస్థను, కుల వివక్షను అమెరికాలోని బానిస వ్యవస్థతో పోల్చిన ఫూలే... ఈ పుస్తకాన్ని అమెరికన్ నీగ్రోల బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వీరులకు అంకితమిచ్చారు. అంతర్జాతీయంగా సాగుతున్న మానవ హక్కుల ఉద్యమాలను ఫూలే సన్నిహితంగా పరిశీలించారని ఇది స్పష్టం చేస్తోంది. దైవానికి పూజారులనే దళారులు అవసరమా? రైతుల దీన స్థితి, పేదరికం, వెనుకబాటుతనానికి కారణమైన పురోహిత వర్గ దోపిడీ, అణచివేతలను వివరిస్తూ, ఈ విషయంలో బ్రిటిష్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని చెండాడుతూ రాసిన ‘‘ సేద్యగాని చెర్నాకోల’’ నాడు సంచలనాన్ని సృష్టించింది. ఆ పుస్తకం మొదటి అధ్యాయంలోనే పూజారి వర్గం నిలువుదోపిడీని రకరకాల పూజలు, కర్మకాండల పేరుతో రైతులను పీల్చి పిప్పి చేయడాన్ని ఆయన సోదాహరణంగా వివరించారు. మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వానికి పన్నుల వసూళ్ళ మీద ఉన్న శ్రద్ధ రైతుల సంక్షేమం మీద లేదని కూడా ఫూలే ఆ పుస్తకంలో తెలిపారు. ఫూలే మూడవ కార్యాచరణ, ప్రత్యక్ష ఉద్యమం-యుద్ధం. అందు కోసం ఆయన 1873న సత్యశోధక్ అనే సంస్థను స్థాపించారు.‘‘మానవులంతా ఒకే తండ్రి బిడ్డలు. ఆ తండ్రి దేవుడు మాత్రమే. అందరికీ ఆయనే తండ్రి. తల్లి దండ్రులకూ పిల్లలకూ మధ్య సంభాషణ జరగడానికి బ్రోకర్లుగానీ, అనువాదకులుగానీ అవసరం లేనట్టే, దేవుడికీ మనుషులకూ మధ్య పూజారుల అడ్డు అక్కర్లేదు. ఈ సిద్ధాంతాన్ని అంగీకరించినవాడే సత్యశోధకుడు’’ అని సత్యశోధక్ సమాజ్ చాటింది. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం, అనాథలను సంరక్షించడం వంటి కార్యక్రమాలను ఫూలే దంపతులు అంకితభావంతో నిర్వహించారు. సార్వజనిక్ ధర్మ్ అనే సంస్థను స్థాపించి చాతుర్వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేశారు. 1827లో జన్మించి 1890లో మరణించిన జ్యోతిబా ఫూలే సాగించిన ఉద్యమం మహారాష్ట్రలోనేగాక దేశమంతటా ప్రభావాన్ని కలుగజేసింది. ముఖ్యంగా కొల్లాపూర్ సంస్థానాధీశుడైన సాహు మహరాజ్ పైన ఫూలే ప్రభావం చాలా ఎక్కువగా కన్పిస్తున్నది. ఫూలే ఆశయాలకనుగుణంగా సాహు మహరాజ్ బ్రాహ్మణేతర ఉద్యమం కొనసాగించారు. 1902లో సాహు మహారాజ్ ప్రకటించిన రిజర్వేషన్లు దేశ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం. అంతేకాదు అంబేడ్కర్ చదువుకు, ఆయన నడిపిన పత్రికకు ఆర్థిక సహకారం సైతం ఆయన అందించారు. ‘‘తాము అనుభవిస్తున్న బానిసత్వానికి వ్యతిరేకంగా శూద్రులను మేల్కొల్పిన మహాత్మా ఫూలే ఆధునిక భారత దేశ చరిత్రలో మరపురాని సామాజిక ఉద్యమ నాయకుడు. పరాయి పాలకుల నుంచి విముక్తికన్నా, భారత సామాజిక ప్రజాస్వామ్యం చాలా గొప్పదని చాటిచెప్పిన దార్శనికుడు మహాత్మా ఫూలే’’ అంటూ అంబేడ్కర్ మహాత్మా ఫూలే నిర్వహించిన గురుతర చారిత్రక, సామాజిక పాత్రను సరిగ్గా అంచనా కట్టారు. మల్లెపల్లి లక్ష్మయ్య ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిబా ఫూలే 189వ జయంతి సందర్భంగా వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213 -
ఓటుతోనే సమాజంలో మార్పు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి మణికొండ: మనతో పాటు చుట్టూ ఉన్న సమాజం అభివృద్ధి చెందాలంటే మనమంతా ఓటు వేయాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. వట్టినాగులపల్లిలోని శ్రీదేవి ఇంజినీరింగ్ కళాశాలలో ‘లెట్స్ ఓట్’ సంస్థ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఓటర్ల జాగృతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందమైన సమాజం, మానవవిలువలు, హక్కులు, ఆనందాలు, సుఖమయ జీవనం కావాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారన్నారు. అలాంటి పౌర సమాజాన్ని నిర్మించుకునేందుకు ఉన్నత విలువలు, సమస్యల నివారణకు కృషి చేసే నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో మార్పులు తెచ్చే పనిలో భాగమైన ఓటు వేయడాన్ని పక్కనపెట్టి మారిపోవాలని ఆశించటం అతిశయోక్తే అవుతుందన్నారు. ఓటింగ్‌లో అందరూ పాల్గొంటే భిన్నమైన ఫలితం వస్తుందని చెప్పారు. అరోరా కళాశాల విద్యార్థులు ‘కౌన్‌బనేగా కార్పొరేటర్?’ అనే కాన్సెప్ట్‌తో వెబ్సైట్ ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారని తెలిపారు. శ్రీదేవి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినిలు ఇంటింటికీ తిరిగి ఓటు హక్కు విలువను చెప్పేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. అలా వెళ్లే వారి బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేస్తామని వారరు ప్రతినబూనారు. ఓటు హక్కుపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ‘లెట్స్‌ఓట్’ సంస్థ ప్రతినిధులు భాస్కర్‌రెడ్డి, సుబ్బరంగయ్య, కళాశాల ప్రిన్సిపాల్ మల్లీశ్వరి, విద్యార్థినిలు పాల్గొన్నారు. -
సమాజాన్ని సంస్కరించే బాధ్యత విశ్వాసిదే!
సువార్త అమెరికాలో కొందరు ధనవంతులు ఖరీదైన చర్చి కట్టించుకొని గొప్ప దైవజనుడు క్లారెన్స్ జోర్డన్‌ని ఆహ్వానించారు. చర్చి ఎంత ఖరీదైనదో ఆయనకు వివరిస్తూ, చర్చి గోపురం మీది సిలువకే లక్ష డాలర్లయ్యాయి తెలుసా! అన్నారు. ‘‘మిమ్మల్నెవడో బాగా మోసం చేశాడు. రక్షణను, సిలువను దేవుడు ఉచితంగా ఇచ్చాడని మీకు తెలియదా?’’ అన్నాడాయన ఇక ఉండబట్టలేక. కొందరికర్థమయ్యేది డబ్బు భాష ఒక్కటే. ఒకసారి యేసు బోధ చేస్తుంటే వేలాదిమంది పొద్దు పోయేవరకు శ్రద్ధగా వింటున్నారు. భోజనాల కోసం వారిని ఇళ్లకు పంపమని శిష్యులంటే, ‘‘మీరే వారికి భోజనం పెట్టండి’’ అని ప్రభువు వారినే ఆదేశించాడు. పెడితే తినడం మాత్రమే తెలిసిన శిష్యులకిది రుచించలేదు. ఫిలిప్పు అనే శిష్యుడు లెక్కలేసి అందుకు రెండొందల దీనారాలు (అప్పట్లో చాలా మొత్తం) కావాలన్నాడు (మత్తయి 14:16 ; యోహాను 6:7). అది అరణ్యం, రాత్రి కావస్తోంది, పైగా ఐదు వేల మంది జనం!! ఈ మూడూ శిష్యుల దృష్టిలో సమస్యలు. కాని అలనాడు అరణ్యంలో ఆరు లక్షలమందికి పైగా ఉన్న ఇశ్రాయేలీయులను 40 ఏళ్ల పాటు ‘మన్నా’తో పోషించిన దేవునికి అవి సమస్యలు కావు కదా. ఒక బాలునివైన ఐదు రొట్టెలు, రెండు చేపల్ని ప్రభువు ఆశీర్వదించి శిష్యులచేతికిచ్చి పంచగా అంతా తృప్తిగా తినగా మిగిలిన ముక్కలే 12 గంపలకెత్తారు. దేవుని ఆదేశాలు, సంకల్పాలు ఎన్ని ఆటంకాలున్నా నెరవేరి తీరుతాయన్నది చరిత్ర చెబుతోంది. ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు రొట్టెలు, చేపల్ని కూడా శూన్యంలో నుండి సృష్టించగలడు. కాని కొత్త నిబంధన కాలమైన నేటి ‘కృపాయుగం’లో దేవుడు విశ్వాసి ద్వారానే అద్భుతాలు చేస్తాడు. ఒక బాలుని ఆహారాన్ని, అసాధ్యమని తేల్చిన శిష్యుల ద్వారానే దేవుడు వేలాది మందికి పంచాడు. ఎంత ప్రార్థన చేస్తాడు, ఎంత క్రమంగా చర్చికెళ్తాడు, ఎంత బైబిల్ జ్ఞానముంది అన్నవి కాదు, విశ్వాసిలో ఎంత ‘ఉద్యమ శక్తి’ ఉంది అన్నదే అతని ఆత్మీయ స్థాయికి కొలబద్ద! ‘‘మీరే వారికి భోజనం పెట్టండి’’ అని ఆనాడు ఆదేశించినట్టే ‘మీరే సమాజాన్ని బాగు చేయండి’ అని ప్రభువు ఈనాడు ఆదేశిస్తున్నాడు. ఇది ప్రతి విశ్వాసి చెవుల్లో మారుమోగాలి. అందరికన్నా ఎక్కువగా సమాజం గురించి విశ్వాసే ఆలోచించాలి. ఎందుకంటే పొరుగువారిని దేవుడు ప్రేమించమన్నాడు గనుక, ఆ పొరుగువారంతా మన చుట్టూ సమాజంలో ఉన్నారు గనుక. నేను ప్రార్థన చేస్తాను, దేవుడు బాగు చేస్తాడు’ అనుకోవడం పిరికితనం, బాధ్యతల నుండి తప్పించుకోవడం, ‘ప్రార్థన చేస్తాం’ లేదా ‘చేద్దాం’ అనే మాట ఊతపదమయింది. మనింట్లో దొంగలు పడితే మోకరించి ప్రార్థిస్తామా, మూలనున్న కర్రందుకుంటామా? కుటుంబాన్ని, చర్చిని, సమాజాన్ని సంస్కరించుకునే బాధ్యత పూర్తిగా విశ్వాసిదే! సతీసహగమనం, బాల్యవివాహం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన విలియంకేరీకి, కృష్ణా, గోదావరి నదుల మీద బ్యారేజీలు నిర్మించి ఒకప్పటి కరువు ప్రాంతాలైన ఈనాటి కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాలు ఆహారానికి సంపదకు నిలయంగా మార్చిన సర్ ఆర్థర్ కాటన్ అనే మరో విశ్వాసికి వారసులే నేటితరం విశ్వాసులు. ఆవగింజంత విశ్వాసముంటే కొండల్ని పెకిలించవచ్చునన్న యేసు మాటను వారు సార్థకం చేశారు, మనం నిరర్ధకం చేస్తున్నాం! -
సమాజం స్త్రీలకు అండగా నిలవాలి
సహాయం కోసం హెల్ప్‌లైన్ ప్రారంభం ఎస్పీ రమా రాజేశ్వరి స్త్రీలు, బాలికలపై హింస తగ్గాలంటే సమాజం వారికి అండగా నిలవాలని.. అన్ని వర్గాల ప్రజలు, సంస్థలు మద్దతుగా నిలబడినప్పుడే వారు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారని ఎస్పీ రమా రాజేశ్వరి అన్నారు. అంతర్జాతీయ బాలికలు, స్త్రీలపై జరుగుతున్న హింస తొలగింపు దినోత్సవంలో భాగంగా శనివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో తాండూరులో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. - తాండూరు తాండూరు: స్త్రీలు, బాలికలపై హింస తగ్గాలంటే సమాజం వారికి అండగా నిలబడాలి. అన్ని వర్గాల ప్రజలు, సంస్థలు మద్దతుగా నిలబడినప్పుడే వారు తమకు ఎదురవుతున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారని ఎస్పీ రమా రాజేశ్వరి పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ బాలికలు, స్త్రీలపై జరుగుతున్న హింస తొలగింపు దినోత్సవంలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణంలోని మల్‌రెడ్డిపల్లిలో విద్యావేత్తలు, పాఠశాలలు, కళాశాలల అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలతో ఎస్పీ వర్క్‌షాప్ నిర్వహించారు. అనంతరం స్థానిక సెయింట్ మార్క్స్ హైస్కూల్ లో విద్యార్థులతో, విలియం మూన్ పాఠశాల మైదానంలో ఆటో డ్రైవర్లతో ఎస్పీ సమావేశమయ్యారు. తర్వాత ఇందిరాచౌక్ నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు విద్యార్థినులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. బాలికలు, మహిళలపై జరుగుతున్న హింస, నేరాలకు వ్యతిరేకంగా, వాటిని నిరోధించేందుకు ప్రపంచవ్యాప్తంగా ‘ఆరేంజ్’ పేరుతో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. జిల్లాలో కూడా డిసెంబర్ 16 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వరకు అవగాహన కార్యక్రమాలను పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. సమాజం నుంచి సరైన మద్దతు లేకపోవడంతో మహిళలు తమ ఇబ్బందులను బయటకు చెప్పుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. మహిళలు, బాలికల రక్షణకు సమాజంతోపాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంధ సంస్థలు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందన్నారు. మేమున్నామనే భరోసా కల్పించినప్పుడే వారిపై హింస,వేధింపులు, నేరాలు తగ్గుతాయన్నారు. ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేయలేని మహిళల కోసం కొత్తగా తాండూరు డివిజన్లో 7893100200 హెల్ప్‌లైన్ నంబర్‌ను ఎస్పీ రమారాజేశ్వరి ప్రారంభించారు. మహిళల నుంచి వచ్చిన సమాచారాన్ని సేకరించి, వారికి కావాల్సిన సహాయాన్ని ఆయా పోలీసుస్టేషన్ల అధికారులు, షీ టీమ్‌ల ద్వారా అందిస్తామన్నారు. సమస్య తీవ్రంగా ఉంటే అధికారులు వారికి ప్రత్యేకంగా కౌనెల్సింగ్ నిర్వహిస్తారని తెలిపారు. ఈవ్‌టీజింగ్, గృహహింస, భయభ్రాంతులకు గురైనా, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చినా పోలీసులను సంప్రదిస్తే అన్ని విధాల సహాయం అందిస్తామని వివరించారు. బాలికలపై హింసను అరికట్టడానికి కళాశాలలు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు, యజమాన్యాలు ప్రిన్సిపాళ్లలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ హెల్ప్‌లైన్ కార్డులు, ఫోన్ నంబర్ తో పాటు మణికట్టు బ్యాండ్లు, పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్ సునీత, సీపీఐ పట్టణ కార్యదర్శి విజయలక్ష్మీ పండిత్, పట్టణ ఇన్చార్జి డీఎస్పీ స్వామి, సీఐ సైదిరెడ్డి, చైతన్య కళాశాల కరస్పాండెంట్ రమేష్‌కుమార్, పలువురు విద్యావేత్తలు తదితరులు ఉన్నారు. -
వజ్రం వంటిది వాక్కు
విద్య - విలువలు సమాజంలో ఎప్పుడూ మూడు రకాల వ్యక్తులు ఎదురవుతుంటారు. నీకన్నా అధికులు, నీతో సమానులు, నీకన్నా తక్కువ వారు. ఈ ముగ్గురితో ఎలా ప్రవర్తించాలో వేదం చెప్పింది. నీకన్నా అధికులు కనబడ్డారు. వారి ఆధిక్యాన్ని నీవు అంగీకరించాలి. మహానుభావుడు ఎంత సాధన చేశాడండీ... ఎప్పటికయినా వచ్చే జన్మకయినా అంత ఎత్తుకు ఎదగాలి అని మీరు వారికి నమస్కరించారనుకోండి. ఇప్పుడు మీరు ఎవరికి నమస్కరించారో వారు గొప్పవారన్నమాట పక్కనబెట్టండి, మీరు గొప్పవారయ్యారు. మీరు సంస్కారవంతులయ్యారు. మీరు నమస్కరించ లేదనుకోండి. అవతలివాడి ఆధిక్యం కించిత్ కూడా పోదు. వారి గౌరవం, వారి విద్వత్తు, వారి జ్ఞానం అలానే ఉంటాయి. పోయింది ఎవరి ఆధిక్యమంటే మనదే. వారి ఔన్నత్యాన్ని మనం అంగీకరించలేకపోయాం. తేడా మనలో ఉంది. పెద్దలు కనబడితే గౌరవించు. సమానులు కనబడితే... ఎదుటివ్యక్తి నీలాగా ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చి ఉంటాడన్న ఆలోచన రావాలి. నీవెంత కష్టపడిందీ నీకు తెలుసు. ఆయనను చూసినప్పుడు ఆదరభావం కలగాలి. ప్రేమతో మాట్లాడగలగాలి. నీకన్నా తక్కువ వారు కనబడితే... ఈశ్వరానుగ్రహంతో ఇతనుకూడా వృద్ధిలోకి రావాలని కోరుకోవాలి. ఇతనికన్నా పైన నేనున్నాను. నా అంతవాడయి నా స్థాయిని చేరుకోగలనన్న తృప్తి ఇతనికి కలుగుగాక, అని ప్రార్థించారనుకోండి. మీ పెద్దరికం నిలబడింది, మీ లాలిత్యం నిలబడింది. ఈ మూడురకాలుగా కాకుండా ఏ రకంగా ప్రవర్తించినా అది తెగడ్త. జీవిత పర్యంతం చదువుకుంటూనే ఉంటాం. దేనికి!!! సంస్కారబలం వృద్ధి చెందడం కోసం. సమాజంలో మనిషి మనిషిలాగా బతకాలి, పశువులాగా బతకకూడదు కనుక. దానికోసం చదువుకోవాలి. ఈ మూడింటికీ నీవు లొంగలేదు. నిన్ను తెగిడేవాడు కనబడ్డాడు. అప్పుడేం చేయాలి. అతన్ని సంస్కరించే పని చేయాలి. ఈశ్వరా! జారుడుమెట్ల మీద నిలబడి పెకైక్కాలనుకుంటున్నాడు. నిచ్చెన పెకైక్కడానికి కానీ దిగడానికి కాదుగదా. భగవాన్! ఇతను అహంకారంతో ఉన్నాడు. దాన్ని తొలగించి వృద్ధిలోకి వచ్చేటట్లు ప్రయత్నించు. అని వేడుకోవాలి. తెగడ్తను నీవు పుచ్చుకోకూడదు. నీవు స్వీకరించకూడదు. అందుకే వాదన చేయవద్దు అని శాస్త్రం చెప్పింది. వాదన అగ్నిలో ఆజ్యం పోసినట్లే ఉంటుంది. అది అసూయాజనితం. నీవు తెగడ్తను పుచ్చుకుంటే పాడయిపోయేది నువ్వే. అసూయతో ఉన్నవాడు బాగానే ఉంటాడు. నీ ఆగ్రహం ఎక్కువవుతుంటుంది. చాలాసార్లు పొరపాట్లు జరిగేది ఇక్కడే. అందుకే సంయక్-బాగా తయారవడానికి... సంస్కారాన్ని వినియోగించు.. అని శాస్త్రం చెప్పింది. లోకహితానికి కావలసిన రీతిలో సంస్కారాన్ని పొందు. కేవలం చదువుతో వెళ్ళి కూర్చుంటే సమాజంలో ప్రయోజనాన్ని పొందడంలో వైక్లబ్యాన్ని పొందుతారు. తెగడ్త-స్వప్రయోజనాన్ని సాధించుకోడానికి దాన్ని సాధనంగా వాడుకోవడం ఒకడు ఇదిలా ఉండకూడదు, అదలా జరగకూడదు అనుకుంటుంటాడు. అది ఎంత మంచి కార్యమయినా అది తను అనుకున్నట్లుగా మారిపోవడానికి తన వాక్కును ఉపయోగిస్తాడు. అసలు శ్రీరామాయణం అంతా ఎక్కడ మలుపుతిరిగింది! పుట్టినప్పటినుంచి కైకమ్మకు దాదిగా ఉన్న మంధర తప్ప శ్రీరామపట్టాభిషేకానికి అందరూ సంతోషించారు. ఇలా జరగకుండాఉంటే బాగుండుననే ఆలోచన ఆమెకు వచ్చింది. అంతే... కైక మనసులో కల్మషం నింపింది. శ్రీరాముడు, భరతుడు కొద్ది వ్యవధితో పుట్టినవారు. ఒకసారి రాముడు రాజయితే ఇక నీ వంశంలో ఎవరూ రాజుకాలేరు. రాముడి తర్వాత రాముడికొడుకే రాజవుతాడు. భరతుడే కాదు భరతుడి కొడుకు కూడా రాజు కాలేడు. కౌసల్య రాజమాత అవుతుంది. ఇప్పటిదాకా ఇద్దరూ సమానులే. ఇక అలా కుదరదు. రాజమాత వెడుతుంటే నీవు చేతులు కట్టుకుని నమస్కరిస్తూ ఆమె వెనక వెళ్ళాల్సి ఉంటుంది.. అని. మాటలు విషాన్ని ప్రోది చేసేసాయి. రాజయిన దశరథుడు, కౌసల్య, సుమిత్రలు, రామ, భరత, లక్ష్మణ, శత్రుఘు్నలు, మహర్షులు, యావత్ ప్రజలు అంతా ఒకవైపు నిలబడినా ఒక దాసి మాటలకారణంగా పట్టాభిషేకం జరపలేక పోయారు. నిజానికి కైకేయి కూడా పట్టాభిషేకానికి సంతోషించింది. కానీ మంధర తన మాటలతో మొత్తం కథను మార్చేసింది. అలా మాట్లాడేవారు రేపు మీ జీవితాల్లోకూడా తటస్థపడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు మీరు ఎంత పెద్ద పదవిలోకి వెళ్ళినా, ఎన్ని మంచి పనులు చేస్తున్నా, మీ పక్కనే చేరి ఎవడో దారితప్పిన వాడిని చూపి నీకెందుకీ మంచితనం, నీ కెందుకీ ప్రవర్తన, అని హితబోధ చేస్తున్నట్లుగా చెప్పేవారుంటారు. నీవు చేస్తున్నపని మీద విశ్వాసం ఉంచి ఇటువంటి మాటలను తోసేయడం అలవాటు చేసుకోలేకపోతే వాడు నిన్ను వాడుకుని వదిలేస్తాడు. నీ పని పులిస్తరాకులా తయారయిపోతుంది. అన్నం పెట్టుకుని తింటున్నంతసేపే విస్తరాకుకు గౌరవం. స్వకార్యాన్ని సాధించుకోవడానికి మీ పక్కన చేరిన వారి మాటలకు లొంగిపోవడానికి మీరు అలవాటుపడిపోయారో జీవితంలో మీరు వృద్ధిలోకి రాలేరు. మీ తల్లిదండ్రుల కష్టం, మీ కష్టం, అప్పటిదాకా మీరు సంపాదించుకున్న కీర్తి అడుక్కి వెళ్ళిపోతాయి. మహామంత్రి తిమ్మరుసు పోతే తప్ప విజయనగర సామ్రాజ్యం పడిపోదు అని తీర్మానించుకున్న వారు చివరకు ఆయనమీద రాయలవారికి లేనిపోనివన్నీ చెప్పారు. రాయలు తిమ్మరుసు కళ్ళు పొడిపించేసాడు. అప్పటికీ రామరాయల వల్ల సామ్రాజ్యం నిలబడినా ఆయనను కూడా తప్పుదోవ పట్టించారు. చివరకు ఇవ్వాళ శిథిలాలు మిగిలాయి. ఒక్కమాటతో రాజ్యం పడిపోయింది. ఒక్కమాటతో మహామంత్రి పడిపోయాడు. ఒక్క మాటతో రామాయణ కథ అడ్డంతిరిగింది. ఒక్కమాటతో రామచంద్ర మూర్తి జీవితపర్యంతం భార్య పక్కన లేకుండా గడిపేశాడు. మాట అంత శక్తిమంతమైనది. అందుకే ఒక వాక్కు మిమ్మల్ని సర్వ నాశనం చేయగలదు, ఒక వాక్కు మిమ్మల్ని అందుకోలేని ఎత్తులకు తీసుకెళ్ళగలదు అంటాడు. ఏమిటీ, నువ్వు కూడా ఈ ఉద్యోగంలో చేరదామనే వచ్చావా? అని ఎవరయినా అన్నారనుకోండి. మీరు చిన్నబుచ్చుకుంటారు. మిమ్మల్నీ మాటలు పదేపదే బాధిస్తుంటాయి. అప్పుడు నేను వచ్చి ఏం తక్కువయిందని నీకు! నీవెన్ని సాధించలేదు, నీవు తప్పకుండా సాధించగలవు అన్నాననుకోండి. నీ శక్తి ప్రజ్వలనం అవుతుంది. ఒకవాక్కు మిమ్మల్ని పతనం చేయగలదు, ఒక వాక్కు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చగలదు. అయితే అది పొగడ్త కాకూడదు. యుక్తాయుక్త విచక్షణతో కూడుకున్నదయి ఉండాలి. పెద్దల హితవాక్కులు ఎప్పుడూ వింటూ ఉండాలి. అవే మీకు సంస్కారబలాన్ని నేర్పుతాయి. మీరు ఎంత గొప్పవారయినా, ఎంత చదువుకున్నవారయినా సమాజంలోని ఇతర వ్యక్తులతో సమన్వయం మీకు చేతకాకపోతే ఎవర్ని దగ్గరగా ఉంచాలో ఎవర్ని దూరంగా ఉంచాలో చేతకానినాడు చాలా చాలా ఇబ్బంది పడతారు. స్వప్రయోజనాభిలాషుడయి మీ దగ్గరచేరి మాట్లాడుతున్నప్పుడు తన కార్యాన్ని సాధించుకోవడానికి నీ శక్తిని వాడుకుంటాడు. ఎందుకో తెలుసా!!! వాడు నీ అంత చదువుకోలేదు, నీ అంత కష్టపడలేదు, నీవు రాసినన్ని పరీక్షలు రాయలేదు, నీవు కూర్చున్న పదవిలోకి వాడు ఈ జన్మకు రాలేడు. కానీ వాడికి ఒక్కటి వచ్చు. మాటలతో మభ్యపెట్టి మీ స్థానాన్ని తన ప్రయోజనం కోసం వాడుకోవడం వచ్చు. ఆ అప్రతిష్ఠ నీది, ప్రయోజనం వాడిది. నీకు జాగ్రత్త పడడం చేతకాకపోతే నీ పెట్టుబడికి వాడు యజమాని ఔతాడు. అందుకే జాగ్రత్త పడమని శాస్త్రం హెచ్చరిస్తుంది. హితవాక్కు అన్ని వేళలా మృదువుగా, మధురంగా ఉండదు. ప్రతిసారీ చాలా మర్యాదగా, మెత్తగా మాట్లాడటం కుదరదు. రాజశాసనం ఎలా ఉంటుందో అలా ఉండాలి. సత్యంవద ధర్మంచర, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ... అంతేగానీ మీ అమ్మగారిని బాగా చూడు నాన్నా, మీ నాన్నగారిని బాగాచూడు నాన్నా అని చెప్పదు. రాజశాసనం ఎలా కఠినంగా ఉంటుందో అలా ఉంటుంది. మరీ ఇంత కఠినంగా ఉంటే ఎలా అని మన పురాణాలు ఒక స్నేహితుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు... ఇదిగో రేయ్, నీకు ఆఖరిసారి చెబుతున్నా వినకపోతే పాడయిపోతావ్ తర్వాత నీఖర్మ... ఇలా చెబుతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది...ప్రియుడు ప్రియురాలితో మాట్లాడినట్లు, ప్రియురాలు ప్రియుడితో మాట్లాడినట్లు అనునయంగా మాట్లాడితే వినే వాడొకడుంటాడు. తారమాట్లాడితే సుగ్రీవుడు వింటాడు. శ్రీ రామాయణం ఎక్కడా కఠినంగా ఉండదు. అందుకే దానిని కావ్యభాష అంటారు. వాల్మీకి అంటాడు... ఎవరు ఎలా మాట్లాడతారన్నది తెలుసుకోలేని వాడు కుటుంబ యజమాని అయితే ఆ కుటుంబం నాశనమవుతుంది. వాడు ఒక అధికారి అయితే అక్కడి వ్యవస్థ నాశనమవుతుంది. ఒక గ్రామాధికారయితే గ్రామం, దేశాధినేతయితే దేశం నాశనమవుతాయి. ఆవుల మంద వెనుక ఒక గొల్లవాడు వెడుతుంటే ఆవులు రక్షింపబడతాయి. నక్కవెడితే ఆవులు కనబడవు. అందుకే స్వభావం అన్నారు. నీకు పుట్టుకతో వచ్చినది ఏది, దాన్ని దిద్ది మార్చగలిగినది ఏది... అంటే ఒక్క మంచిమాట. అదే మిమ్మల్ని మారుస్తుంది. -
పక్షి పరిశోధనకు సొసైటీ...
తెలుగు రాష్ట్రాలలో మా సొసైటీ లో దాదాపు 400 మంది మెంబర్లుగా ఉన్నారు. వీరిలో అధికశాతం హైదరాబాద్‌లో ఉండగా ఆ తర్వాత తిరుపతి, వైజాగ్, కాకినాడకు చెందినవారూ సభ్యులుగా ఉన్నారు. ప్రతి నెల చివరి వారంలో ఒక కొత్త ప్రదేశానికి వెళ్లడం, అక్కడ పక్షులను గమనించడం, మార్పులను తెలుసుకోవడం, నివేదికలను పొందుపరచడం, ఫొటోల రూపంలో నిక్షి ప్తం చేయడం మా సొసైటీ ద్వారాం మేం చేస్తున్న పనులు. మూడు నెలలకు ఒకసారి ఇతర రాష్ట్రాలలోని పక్షి కేంద్రాలను గుర్తించి, అక్కడికి వెళుతుంటాం. ఇందుకు ఒక్కోసారి పది నుంచి యాభై మంది వరకు గ్రూప్‌గా కలుస్తుంటారు. వారు చూసిన, తెలుసుకున్న వివరాలను సొసైటీలోని సభ్యులందరికీ అంతర్జాలం ద్వారా తెలియపరుస్తారు. ఆసక్తి గల వారు ఎవ్వరైనా ఈ సొసైటీలో సభ్యులుగా చేరవచ్చు. నియమాలు తప్పనిసరి... ఒక పక్షిని దాని ముక్కు, పరిమాణం, రంగు, కాళ్లు, రెక్కలు, కళ్లు.. ఇవన్నీ చూసి, గుర్తించి, ఆ వివరాలను రికార్డుల్లో పొందుపరచాలి. అయితే, మనక న్నా ముందే మన రాకను పక్షి పసిగట్టేస్తుంది. అందుకని చాలా దూరం నుంచే పక్షులను చూడటానికి వెంట.. బైనాక్యులర్, ఎండ నుంచి రక్షణగా టోపీ, పక్షి వివరాలను తెలిపే ఫీల్డ్ గైడ్, ఒక బ్యాక్ ప్యాక్, సౌకర్యవంతంగా ఉండే షూస్, పక్షి గురించి రాసుకోవడానికి పేపర్-పెన్ను తప్పనిసరి అవసరం. కొంతమంది పక్షి విహారాన్ని వెళ్లినప్పుడు పక్షిని గూడు నుంచి బయటకు రప్పించడానికి సెల్లో బర్డ్ రింగ్ టోన్స్ పెడుతుంటారు. ఈ చర్య వల్ల పక్షి ఆందోళనకు లోనవుతుంది. పక్షి గుడ్లు, పిల్లలను, గూళ్లను ఫొటో తీయకూడదు. అలాగే ఫొటోలు తీయడానికి ఫ్లాష్‌ను ఉపయోగించకూడదు. వీటి వల్ల పక్షులు బెదిరిపోయి, ఉన్న స్థావరాన్ని విడిచి వెళ్లిపోతాయి. - సురేఖ ఐతా బత్తుల ఏపీ బర్డ్‌వాచ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ surekha.aitabathula9@gmail.com -
లేత నెత్తుటి మరకలే.. ఆ గాజుల తళుకులు
హైదరాబాద్ పాతబస్తీలో చితికిపోతున్న బాల్యం సాక్షి, హైదరాబాద్: అందమైన హరివిల్లుల్లా మెరిసిపోయే లక్క గాజుల్లో మసకబారుతున్న పసితనముంది.. తల్లి పొత్తిళ్లలో సేదదీరిన జ్ఞాపకాల తడి ఆరకుండానే పాతబస్తీ గాజుల బట్టీల్లోకి చేరిన చిన్నారుల నెత్తురు స్వేదమై ప్రవహి స్తోంది.. కళ్లు జిగేల్మనిపించే మెరుపుల వెనుక వేలాది మంది చిన్నారుల ఆక్రందన దాగుంది.. పలక, బలపం పట్టుకొని బడికి వెళ్లాల్సిన చిట్టి చేతులు మాఫియా కబంధ హస్తాల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. కన్నవాళ్లకు, పుట్టిపెరిగిన ఊళ్లకు దూరంగా బానిసల్లా కాలం వెళ్లదీస్తూ ప్రమాదకర రసాయనాలు, యాసిడ్లలో తడిసి ముద్దవుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలోని ఇరుకుగల్లీల్లో గాజుల బట్టీలు, ఇతర కుటీర పరిశ్రమల్లో సమిధలవుతున్న బిహార్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన చిన్నారుల వ్యథాభరిత జీవన చిత్రమిది. ఇటీవల పోలీసులు తనిఖీలు చేసి భారీ సంఖ్యలో పిల్లలకు విముక్తి కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ చిన్నారుల దయనీయమైన జీవన స్థితిగతులపై ‘సాక్షి’ ప్రత్యేక క థనం.. ముక్కుపచ్చలారని వయస్సులోనే..: మహ్మద్ కుర్బాన్, మహ్మద్ షాబాద్, రాజా, రోహిత్ కుమార్, మహ్మద్ షాహిల్, లాల్దీప్, శంకర్, మహ్మద్ ఇమ్రోజ్, రంజిత్, పరమేష్, రోహిత్ , కర్మ... ఇలా పేరేదైనా వారంతా ఐదు నుంచి పదిహేనేళ్లలోపు చిన్నారులే. బడికి వెళ్లి అక్షరాలు దిద్దాల్సిన దశలోనో.. నాలుగు, ఐదు తరగతుల్లో ఉన్నప్పుడో గాజుల బట్టీల వద్దకు వచ్చిపడిన వాళ్లే. పోలీసులు విముక్తి కల్పించిన సుమారు 400 మంది బాల కార్మికుల్లో 90 శాతానికి పైగా బీహార్‌లోని అత్యంత వెనుకబడిన జిల్లాలైన గయ, పట్నా, నలంద, జూనాగఢ్, బేలా, జాహనుబాద్, నవాడ, పదాసియా, ధమోల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చినవారే. అందులోనూ నిరుపేద దళితులు, మైనారిటీల పిల్లలే ఎక్కువగా ఉన్నారు. సొంత ఊళ్లల్లో సేఠ్ల దగ్గర చేసిన అప్పులు తీర్చడం కోసం తమ పిల్లలను పనికోసం హైదరాబాద్‌కు పంపించిన (మాఫియాకు విక్రయించిన) తల్లిదండ్రులు కొందరైతే... కుటుంబాన్ని పట్టించుకోకుండా బలాదూర్‌గా తిరిగే భర్తల దురాగతాలను భరిస్తూ పిల్లలను ఆకలిదప్పులతో చంపలేక హైదరాబాద్ గాజుల బట్టీలకు పంపించిన తల్లులు మరి కొందరు. పదేళ్ల మహ్మద్ దావీజ్ సొంత ఊరు ధమోల్. రెండేళ్ల కింద హైదరాబాద్‌కు వచ్చాడు. తండ్రి సికిందర్ మటన్ షాపులో పని చేస్తాడు. తల్లి షహనాజ్ ఇంటి దగ్గరే ఉంటుంది. తనతో పాటు ఆరుగురు అక్కచెల్లెళ్లు. అక్క పర్వీజ్‌కు పెళ్లయింది. మిగతా వాళ్లంతా తన కంటే చిన్నవాళ్లు. ‘‘మా నాన్న బాగా తాగుతాడు. ఇంట్లో ఒక్క పైసా కూడా ఇవ్వడు. పైగా మమ్మల్ని బాగా కొడతాడు. మరో గత్యంతరం లేక అమ్మ నన్ను ఇక్కడికి పంపించింది. ఎన్ని డబ్బులు తీసుకొందో తెలియదు. కానీ ఆజాద్ సేఠ్‌తో వెళ్లిపొమ్మంటే వచ్చాను’’ అని చెప్పాడు దావీజ్. ఒక్క దావీజ్ మాత్రమే కాదు.. ఇలా వచ్చిన పిల్లలు వేలాది మంది. అంతా పకడ్బందీగా... పాతబస్తీలో వారం, పది రోజులుగా పోలీసులు చేపట్టిన గాలింపుల్లో వందల మంది పిల్లలను గుర్తించారు. కానీ హైదరాబాద్‌లోని పాతబస్తీలోనే కాదు బీహార్‌లోని వెనుకబడిన జిల్లాలు, మారుమూల ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఈ ‘బానిస వ్యాపారం’ సాగుతోంది. ఏటా వేలాది మంది చిన్నారుల విక్రయం జరుగుతూనే ఉంది. హైదరాబాద్‌లోని గాజుల బట్టీల ఏజెంట్లతో సంబంధాలున్న కొందరు వ్యాపారులు (సేఠ్లు)... పేద, దళిత, మైనారిటీ కుటుంబాలకు గాలం వేస్తారు. పేదరికం కారణంగా పిల్లలను పోషించలేని దుస్థితిలో ఉన్న తల్లిదండ్రులకు ఎంతో కొంత ముట్టజెప్పి వారి పిల్లలను హైదరాబాద్ గాజు బట్టీల ఏజెంట్లకు అప్పగిస్తారు. పిల్లల వయసును బట్టి రూ. 5 వేల నుంచి రూ. 20 వేల వరకూ ఇస్తారు. రైళ్లు, బస్సులు వంటి ప్రజా రవాణా వాహనాల్లో వస్తే పోలీసులు గుర్తించే అవకాశం ఉండడంతో ఏజెంట్లు ఆ పిల్లలను తమ సొంత వాహనాల్లోనే హైదరాబాద్‌కు తీసుకువస్తారు. ఇలా ఆ పిల్లలంతా పాతబస్తీలోని భవానీనగర్, గాజులబండ, కంచన్‌బాగ్, ఫలక్‌నుమా, హుస్సేనీఆలం, తలాబ్‌కట్ట, చార్మినార్, ఛత్రినాక తదితర ప్రాంతాల్లోని ఇరుకైన గల్లీల్లో, అంతకంటే ఇరుకైన గదుల్లో ఉండే గాజుల బట్టీలకు చేరుతారు. గాజులతోపాటు, ప్లాస్టిక్ వస్తువులు, పతంగుల తయారీ, చీరల డిజైనింగ్ వంటి పనులకు వారిని ఉపయోగిస్తారు. చిత్రహింసలు.. రోగాలు.. వచ్చిన పిల్లలను వెంటనే పనిలో పెట్టుకోకుండా రెండు, మూడు రోజుల పాటు సరదాగా గడపనిస్తారు. తర్వాత వారం పాటు గాజుల తయారీలో శిక్షణ ఇస్తారు. అయితే వేడి కొలిమిలో లక్కను కరిగించి తయారుచేసే ఈ గాజులకు రంగు రంగుల రాళ్లు అతికించాలి. ఈ పనిలో రకరకాల రసాయనాలతో పాటు, యాసిడ్‌ను కూడా ఉపయోగిస్తారు. వాటి కారణంగా చాలా మంది పిల్లలు చర్మవ్యాధుల బారిన పడుతున్నారు. చర్మవ్యాధులతో పాటు తరచుగా జ్వరం, తలనొప్పి, వాంతులు, కడుపునొప్పి వంటి అనారోగ్యాలకు గురవుతారు. ఇటీవల పోలీసులు రక్షించిన పిల్లల్లో 14 మంది ఇలాగే జ్వరంతో బాధపడుతూ శనివారం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో చేరారు. ఇక పిల్లలంతా ఒక్కొక్కరు రోజుకు కనీసం వంద గాజులు తయారు చేయాలి. 10 గాజులు తగ్గినా... యజమానుల చేతుల్లో చిత్రహింసలు తప్పవు. మరోవైపు ఈ పిల్లల మీద ప్రతి క్షణం నిఘా ఉంటుంది. ఇందుకు కొన్ని చోట్ల సీసీ కెమెరాలను కూడా వాడుతుండడం గమనార్హం. చిన్నారి మిరాజ్ మాటల్లో చెప్పాలంటే.. ‘‘తెల్లారంగానే పనికి పోతాం. ఉదయం 11 గంటలకు కొంచెం బూందీ ఇస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రెండు రొట్టెలు, కొద్దిగా కూర. మళ్లీ రాత్రి 10 గంటలకు అన్నం పెడతారు. రోజూ ఇంతే. ఆదివారం మాత్రం ఖర్చు కోసం 20 రూపాయలు ఇస్తారు. రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు బట్టీల దగ్గర ఉండాల్సిందే. రోజూ వంద గాజులు తయారుచేయాలి. అంతకంటే తగ్గితే ఇక ఆ రోజు మూడినట్లే..’. వ్యాపారులకు మాత్రం కోట్లు.. పాతబస్తీ ఇరుకు గల్లీల్లోని బట్టీల్లో గాజులు తయారుచేసే చిన్నారుల వెట్టి చాకిరీ వ్యాపారులకు కోట్లు కురిపిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకొనే లాడ్‌బజార్ గాజుల అమ్మకాలతో కోట్లు పోగేసుకొనేది మాత్రం వ్యాపారులు, బట్టీ యజమానులు, ఏజెంట్లు, బీహార్ సేఠ్లు. రెక్కాడితేగానీ డొక్కాడే మార్గం లేక కన్నపిల్లలను అమ్ముకున్న తల్లిదండ్రులది మళ్లీ అదే దుస్థితి. 1,397 మంది బాలలకు విముక్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నేర పరిశోధన విభాగం(సీఐడీ) ఒక్క జనవరిలోనే ‘ఆపరేషన్ స్మైల్’ పేరిట 1,397 మంది బాలలను కాపాడింది. వీరిలో 354 మంది బాలికలు కూడా ఉన్నారు. 660 మందిని తల్లిదండ్రులకు, సంరక్షకులకు అప్పగించారు. మిగతావారిని రెస్క్యు హోంలకు పంపించారు. హైదరాబాద్‌లో 239, సైబరాబాద్ పరిధిలో 124, ఆదిలాబాద్ జిల్లాలో 127, కరీంనగర్లో 265, ఖమ్మంలో 140, మహబూబ్‌నగర్‌లో 24, మెదక్‌లో 20, నల్లగొండలో 234, నిజామాబాద్‌లో 67, రంగారెడ్డిలో 5, వరంగల్‌లో 131 మంది బాలలను కాపాడినట్టు సీఐడీ అదనపు డీజీ సత్యనారాయణ తెలిపారు. తొలుత యూపీలోని గాజియాబాద్ పోలీసులు కూడా ‘ఆపరేషన్ స్మైల్’ పేరుతో 30 రోజుల్లో 227 మంది బాలలను రక్షించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్న కేంద్ర హోం శాఖ సూచన మేరకు రాష్ట్ర సీఐడీ విభాగం జనవరి ఆద్యంతం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో దాడులు చేసింది. స్వచ్ఛంద సంస్థలు, బాలల సంరక్షణ కమిటీల వంటివాటి సహకారంతో పెద్ద సంఖ్యలో బాలలను కాపాడింది. చదువు కోవాలనుంది: మహ్మద్ సాదీ ‘మాది బీహార్. నెల రోజుల క్రితం మా అమ్మవాళ్లకు డబ్బులిచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు. చీరల పరిశ్రమలో పనిచేయిస్తున్నారు. రోజు 15 గంటలు పనిచేయాలి. చలికి రాత్రి పూట నిద్ర కూడా రావడం లేదు. కొద్దిసేపు కూర్చున్నా కొడుతున్నారు. ఎప్పుడూ కార్కానాలోనే ఉండాలి. నాకు ఇంటికి పోయి చదువుకోవాలనుంది.’ నిద్ర కరువు: గుడ్డూ ‘ఏడాది కింద బీహార్ నుంచి వచ్చాను. చీరల కార్కానాలో పనిచేస్తున్నా. రోజుకు గంటల తరబడి పనిచేయిస్తున్నారు. బయటికి వెళ్లనీయకుండా కార్కానాలోనే ఉంచేస్తారు. పడుకునేందుకు సరిగా లేక నిద్ర కూడా పోలేకపోతున్నాం.’ దాడులు చేస్తూనే ఉన్నాం.. ‘‘పాతబస్తీలో ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉన్నాం. ఇటీవలే చార్మినార్, లాడ్‌బజార్ ప్రాంతంలో దాడులు చేసి 70 మంది చిన్నారులను జువైనల్ హోమ్‌కు తరలించాం. వారి తల్లిదండ్రులను పిలిపించి అవగాహన కల్పించాం. పాతబస్తీలో బాల కార్మికులు కాస్త ఎక్కువగానే ఉన్నారు. దాడులలో ప్రతి సారి 20 మంది వరకు పట్టుబడుతున్నారు..’’ - నాగరాజు, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ -
మన కుమార్తెలు స్వేచ్ఛగా, ఆనందంగా ఉండాలి
అతి ప్రాచీన కాలం నుండి జీవితంలో అన్ని విషయాలలో స్త్రీ పురుషులను సమానంగా గౌరవించింది భారతీయ సంస్కృతి. భగవంతుని దివ్వరూపాన్ని అర్థనారీశ్వరరూపంలో సృజించటం ద్వారా ఈ సృష్టిని అంతటినీ రక్షించి పోషించటంలో స్త్రీ పురుషులకు గల సమాన భాగస్వామ్యాన్ని సూచించింది. ఆరోగ్యవంతమైన, ప్రగతిశీలమైన సమాజం కోసం స్త్రీలను, సమాజంలో వారి పాత్రను గౌరవించి తీరాలి. ఈనాడు ప్రపంచంలో స్త్రీశిశు మరణాలలో అత్యధిక సగటు భారతదేశంలో నమోదు అవుతోంది. బాలికల ఆరోగ్య సంరక్షణ విషయంలో శ్రద్ధవహించకపోవటమే దీనికి ప్రధాన కారణం. మగపిల్లలతో పోలిస్తే, ఆడపిల్లలు అనారోగ్యానికి గురైనపుడు వైద్యుని వద్దకు తీసుకువెళ్ళటానికి ఆలస్యం జరుగుతోంది. పురిటి మరణాలు తప్పించుకున్నా, ఆడశిశువులకు రోగనిరోధక శక్తి, పోషణ మగశిశువులకంటే తక్కువగా ఉన్నట్లు అనేక గణాంకాలు తెలియజేస్తున్నాయి. పసివారిని లైంగిక అకృత్యాలకు వాడుకోవటమనే అమానుషమైన విషయాన్ని మనం ఎదుర్కొనాల్సివస్తోంది. యాభై శాతానికి పైగా స్త్రీలకు విద్యాభ్యాసం లేకపోవటం మనం ఎదుర్కొంటున్న మరో పెద్ద సవాలు. ఇవన్నీ కేవలం స్త్రీ హక్కులకు సంబంధించిన విషయాలుగానే చూడరాదు. దీనిని మానవహక్కుల విషయంగా చూడాల్సి ఉంది. మనిషి మంచివాడు కావటానికి అతడి తల్లి పెంపకమే కారణమని ఒక సామెత ఉన్నది. ఆమె విలువలను పాదుకొల్పుతుంది. పునాదుల నుండి సమాజంలో పై స్థాయిల వరకూ ఉన్న మన పిల్లలలో మానవతా విలువలు, సకారాత్మక భావనలకు బీజాలు వేయటానికి ఇదే మంచి తరుణం. భానుమతీ నరసింహన్ (రచయిత అంతర్జాతీయ మహిళా సమ్మేళనానికి ఛైర్ పర్సన్‌గా , ఆర్ట్ ఆఫ్ లివింగ్ మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాలకు డెరైక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. www.artofliving.org