
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఒకేసారి నాలుగు క్రీడా గురుకుల పాఠశాలల ఏర్పాటుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా నాల్గింటిని రాష్ట్రానికి మంజూరు చేసింది. ఒక్కో పాఠశాలకు తక్షణ నిర్వహణకు గాను రూ. కోటి వంతున నిధులు విడుదల చేసింది. వీటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమచేయడంతో పాఠశాలల ఏర్పాటుకు గిరిజన సంక్షేమ శాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు మొదలు పెట్టింది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ సమీపంలో వీటి ఏర్పాటుకు ప్రాథమికంగా నిర్ణయించింది. స్థలాల లభ్యత, మౌలిక వసతులను పరిశీలిస్తున్న అధికారులు... వారంలోపు ఖరారు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment