ఐఐఐటిలో సోమవారం జరిగిన ‘జీవన విద్య’ శిక్షణా శిబిరంలో ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ శతృజ్ఞ రావట్
సాక్షి, సిటీ బ్యూరో: మానవీయ విలువలతోనే సామాజికాభివృద్ధి సాధ్యమని నగరంలోని ఐఐఐటిలో విశ్వమానవ విలువల విభాగం సమన్వయకర్త ప్రొఫెసర్ డా. శతృజ్ఞ రావట్ తెలిపారు. సి.హెచ్.డి.హెచ్.సి. – ఎ.ఎస్.డబ్ల్యూ.ఎ. సంస్థ ఆధ్వర్యంలో ఐఐఐటీలో జరిగిన ‘జీవన విద్య’ శిక్షణా శిబిరానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ శిబిరంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని వయసు, వృత్తులు, వర్గాల వారు హాజరయ్యారు. మనిషి కుటుంబంలోను, సమాజంలోను సానుకూల సంబంధ బాంధవ్యాలతో ఆనందంగా జీవించడానికి కావలసిన ముఖ్యమైన నైపుణ్యాలను చాలా సులభంగా అర్ధమయ్యే రీతిలో వక్తలు చర్చించారు.
ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో దేని కోసం పాటు పడుతున్నాం? ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం? సంసారంలో, బంధువులతో సంబంధాలను పక్షపాతం లేకుండా లోతుగా అర్ధం చేసుకోవాలి? ఇంటా బయటా దైనందినజీవితంలో ఎదురయ్యే సమస్యలపై ఆత్మావలోకనం ద్వారా ఎవరికి వారు సదవగాహనను పెంచుకొని ఈ సమస్యల నుంచి బయటపడటం ఎలా? తద్వారా ఆత్మీయంగా, అనందంగా జీవించడం ఎలా? సమాజంలో భాగస్వాములం కావడం, ప్రకృతితో మమేకమై జీవించడం ఎలా? వంటి అనేక విషయాలపై సి.హెచ్.డి.హెచ్.సి. రిసోర్స్‌పర్సన్లు శాస్త్రీయ పద్ధతుల్లో సోదహరణంగా వివరించారు. పాల్గొన్న ప్రతి ఒక్కరూ అనేక కీలక అంశాలపై స్పష్టత వచ్చిందని సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ శిబిరంలో సి.హెచ్.డి.హెచ్.సి. రిసోర్స్‌పర్సన్లు శివశంకర్, నరసింహస్వామి, అమ్మ శ్రీనివాస్, గిరిధర్, వాసు అవగాహన కల్పించారు. హరిత, కోమల, దయానంద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. సి.హెచ్.డి.హెచ్.సి. సంస్థ ప్రతి నెలా ఆన్‌లైన్‌లో, ప్రత్యక్షంగా జీవన విద్య శిక్షణా శిబిరాలను 2018 నుంచి నిర్వహిస్తున్నదని నిర్వాహకులు అమ్మ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి దాకా దాదాపు 25 వేల మందికి రెండు రాష్ట్రాలలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు వారికి ఈ జ్ఞానాన్ని పంచామని, ప్రతి వ్యక్తికి జీవన విజ్ఞానాన్ని అందించడం ద్వారా ఆనందకరమైన సమాజాన్ని నిర్మించడమే తమ ఉద్దేశమని ఆయన తెలిపారు. భోజన ఖర్చులకు మాత్రమే ఫీజు తీసుకుంటూ ఉచితంగా జీవన విద్య జ్ఞానాన్ని పంచుతున్నామన్నారు.
(చదవండి: శిశువు రక్షణ అందరి బాధ్యత! కానీ ఇప్పటికీ ఆ విషయంలో వైద్యుల ఆందోళన..)
Comments
Please login to add a commentAdd a comment