Social Development
-
సమాజం మా ఇజం!
నగరంలో వందల కొద్ది స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. అనాథలు, వయోవృద్ధులు మొదలు.. జంతు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక హక్కులు, మానవ హక్కులు, వికలాంగుల సేవ.. ఇలా విభిన్న అంశాల్లో సమాజ సేవ చేయడానికి ఎన్జీవోలను ఏర్పాటు చేశారు. అయితే ఈ సామాజిక సేవ ఒక సంస్థతోనో.. ఒక వ్యక్తితోనో సంపూర్ణంగా నిర్వహించలేం.. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అన్నీ వలంటీర్స్‌పై ఆధారపడి సేవలు కొనసాగిస్తున్నాయి. నగరం వేదికగా ఉన్న ఎన్జీవోల్లో సగానికి పైగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వలంటీర్ల మద్దతుతో కొనసాగుతున్నవే.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా విభిన్న రంగాల్లో సేవలందిస్తున్నారు. నేడు ప్రపంచ వలంటీర్ దినోత్సవం నేపథ్యంలో నగరం వేదికగా సేవలందిస్తున్న విభిన్న సామాజిక సేవా విభాగాల్లోని విశేషాలు తెలుసుకుందాం.. కోటిన్నరకుపైగా జనాభా కలిగిన హైదరాబాద్‌లో వేల సంఖ్యలో అనాథలు, నిరాశ్రయులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారికి సేవలందించడానికి ఎన్నో రకాల స్వచ్ఛంద సేవ సంస్థలు నిత్యం కృషి చేస్తున్నాయి. దాతల సహాయంతో కార్పొరేట్ కంపెనీల సీఎస్ఆర్ నిధులతో సామాజిక సేవ చేస్తున్న ఎన్జీవోలకు వలంటీర్ వ్యవస్థ వారధిగా పనిచేస్తుంది. ఇందులో అధిక శాతం యువతనే ఉండటం విశేషం. విద్యార్థులు, ఉద్యోగులుగా వ్యక్తిగత జీవితాన్ని కొనసాగిస్తున్న యువత హ్యాపీగా జీవితాన్ని అన్ని కోణాల నుంచి చూడాలన్న మంచి హృదయంతో వలంటీర్లుగా మారుతున్నారు. వారంలో ఒక రోజైనా లేదా రెండు, మూడు రోజులకు కాసింత సమయమైనా ఎన్జీవోలకు కేటాయిస్తూ తమవంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఇందులో భాగంగా వీధుల్లో ఫుట్‌పాత్‌లపై ఉన్న అనాథలకు, అన్నార్తులను కలిసి వారి పరిస్థితులను తెలుసుకొని వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో చేరి్పంచడం లేదా తాత్కాలికంగా వారి ఆకలి తీర్చడానికి తమవంతు కృషి చేస్తున్నారు. ఈ వలంటీర్లు ఏదో ఒక ఎన్జీవోతో కలిసి తమ సేవలను కొనసాగిస్తున్నారు. అంతేగాకుండా చలికాలంలో దుప్పట్లు పంచడం, వర్షాకాలంలో రెయిన్ కోట్లు పంచడం, ఎండాకాలంలో నీళ్లు అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. జంతువులకు బాసటగా.. నగరం వేదికగా జంతు ప్రేమికులకు ప్రత్యేకంగా సమూహాలు సైతం ఉన్నాయి. ఈ జంతువులకు కొన్ని ఎన్జీవోలతో కలిసి లేదా వారే ఒక సంఘంగా ఏర్పడి నగరంలోని నిరాదరణకు గురైన జంతువులు, సాధుజంతువుల సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హింస, దాడులకు గురైనప్పుడు వాటికి కారణమైన వ్యక్తులను వ్యవస్థలను న్యాయపరంగా శిక్షించేందుకు కృషి చేస్తున్నారు. వీరంతా సోషల్ మీడియా వేదికగా వెబ్సైట్లో పేజీలు క్రియేట్ చేసుకుని తమ సేవలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా పెట్స్ వేగన్స్ క్లబ్, బ్లూ క్రాస్ సొసైటీ వంటి పలు సంస్థలు పని చేస్తున్నాయి.రోగులకు సేవలందిస్తూ.. ప్రస్తుత తరుణంలో వివిధ కారణాలతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు రక్షణ అందించడం చాలా అవసరం. ఈ విషయంలో నగరం వేదికగా ఎంతోమంది స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. పెద్దఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. సోషల్ మీడియాలో లేదా ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ ఆహా్వనం మేరకు పలువురు వలంటీర్లు సదరు హాస్పిటల్స్‌కు వెళ్లి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు.పర్యావరణం.. మన హితం.. పర్యావరణ పరిరక్షణ కోసం పలువురు హౌస్ స్థాయిలో విభిన్న వేదికలుగా విశేష సేవలు అందిస్తున్నారు. వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించడం మొదలు కాలుష్యం పెరగడానికి కారణమైన మొక్కల నరకడానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న వారు సైతం ఉన్నారు. తప్పనిసరి నరికేయాల్సి వచ్చిన మొక్కలను తిరిగి మళ్లీ పెంచేలా కృషి చేస్తుండటం విశేషం. పర్యావరణ సంరక్షణలో ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి దశాబ్ద కాలంగా కొన్ని సంస్థలు అందులోని వాళ్లు విశేషంగా కృషి చేస్తున్నారు. మూగజీవుల కోసం..సాటి మనుషులకే కాదు మూగజీవాలకు కూడా ప్రత్యేకంగా హక్కులున్నాయి. వాటి గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నా వంతు సామాజిక బాధ్యతగా జంతు సంరక్షణకు సంబంధించిన సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. ఇందులో భాగంగా వీధి కుక్కలకు ఆహారం అందించడం, ఆదరణకు నోచుకొని జంతువులకు అనారోగ్య సమస్యలు ఉంటే వాటికి చికిత్స అందిస్తాం. ఈ మధ్యకాలంలో జంతువులపై దాడులు పెరిగిపోయాయి. వీటికి వ్యతిరేకంగా ఫైట్ చేయడమే కాకుండా హింసకు పాల్పడవద్దంటూ అవగాహన కల్పస్తున్నాం. – గౌతమ్ అభిష్క్, అనిమల్ యాక్టివిటీస్రక్తం అందేందుకు కృషి.. ప్రస్తుత జీవన విధానంలో ప్రమాదాలు కావొచ్చు.. ఇతర అనారోగ్య సమస్యలు కావొచ్చు.. అత్యవసర సమయంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోయిన వారు వేలు, లక్షల సంఖ్యలో ఉన్నారు. సరైన సమయంలో సాటి మనుషులు స్పందించకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి పరిస్థితి రాకూడదనే లక్ష్యంతో నేను వలంటీర్‌గా రక్తదానం చేస్తున్నాను. నేను రక్తదానం చేస్తూనే నా స్నేహితులను ఏకం చేసి నాలుగేళ్లలో దాదాపు నాలుగు వేల మందికి పైగా రక్తం అందించేలా కృషి చేశాను. – ముతీ ఉర్ రెహమాన్, హైదరాబాద్ -
మానవీయ విలువలతోనే సామాజికాభివృద్ధి!
సాక్షి, సిటీ బ్యూరో: మానవీయ విలువలతోనే సామాజికాభివృద్ధి సాధ్యమని నగరంలోని ఐఐఐటిలో విశ్వమానవ విలువల విభాగం సమన్వయకర్త ప్రొఫెసర్ డా. శతృజ్ఞ రావట్ తెలిపారు. సి.హెచ్.డి.హెచ్.సి. – ఎ.ఎస్.డబ్ల్యూ.ఎ. సంస్థ ఆధ్వర్యంలో ఐఐఐటీలో జరిగిన ‘జీవన విద్య’ శిక్షణా శిబిరానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ శిబిరంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని వయసు, వృత్తులు, వర్గాల వారు హాజరయ్యారు. మనిషి కుటుంబంలోను, సమాజంలోను సానుకూల సంబంధ బాంధవ్యాలతో ఆనందంగా జీవించడానికి కావలసిన ముఖ్యమైన నైపుణ్యాలను చాలా సులభంగా అర్ధమయ్యే రీతిలో వక్తలు చర్చించారు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో దేని కోసం పాటు పడుతున్నాం? ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం? సంసారంలో, బంధువులతో సంబంధాలను పక్షపాతం లేకుండా లోతుగా అర్ధం చేసుకోవాలి? ఇంటా బయటా దైనందినజీవితంలో ఎదురయ్యే సమస్యలపై ఆత్మావలోకనం ద్వారా ఎవరికి వారు సదవగాహనను పెంచుకొని ఈ సమస్యల నుంచి బయటపడటం ఎలా? తద్వారా ఆత్మీయంగా, అనందంగా జీవించడం ఎలా? సమాజంలో భాగస్వాములం కావడం, ప్రకృతితో మమేకమై జీవించడం ఎలా? వంటి అనేక విషయాలపై సి.హెచ్.డి.హెచ్.సి. రిసోర్స్పర్సన్లు శాస్త్రీయ పద్ధతుల్లో సోదహరణంగా వివరించారు. పాల్గొన్న ప్రతి ఒక్కరూ అనేక కీలక అంశాలపై స్పష్టత వచ్చిందని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ శిబిరంలో సి.హెచ్.డి.హెచ్.సి. రిసోర్స్పర్సన్లు శివశంకర్, నరసింహస్వామి, అమ్మ శ్రీనివాస్, గిరిధర్, వాసు అవగాహన కల్పించారు. హరిత, కోమల, దయానంద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. సి.హెచ్.డి.హెచ్.సి. సంస్థ ప్రతి నెలా ఆన్లైన్లో, ప్రత్యక్షంగా జీవన విద్య శిక్షణా శిబిరాలను 2018 నుంచి నిర్వహిస్తున్నదని నిర్వాహకులు అమ్మ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి దాకా దాదాపు 25 వేల మందికి రెండు రాష్ట్రాలలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు వారికి ఈ జ్ఞానాన్ని పంచామని, ప్రతి వ్యక్తికి జీవన విజ్ఞానాన్ని అందించడం ద్వారా ఆనందకరమైన సమాజాన్ని నిర్మించడమే తమ ఉద్దేశమని ఆయన తెలిపారు. భోజన ఖర్చులకు మాత్రమే ఫీజు తీసుకుంటూ ఉచితంగా జీవన విద్య జ్ఞానాన్ని పంచుతున్నామన్నారు. (చదవండి: శిశువు రక్షణ అందరి బాధ్యత! కానీ ఇప్పటికీ ఆ విషయంలో వైద్యుల ఆందోళన..) -
బ్లూ ఎకానమీ గురించి మాట్లాడరా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన ఐదవ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ ఆగస్టు 15న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి – ‘అంటరానితనం’ అనే పదాన్ని తన అధికారిక ప్రసంగంలో ప్రస్తావించి, అనూహ్యంగా మరోసారి పరిశీలకుల దృష్టిని తన వైపుకు తిప్పు కున్నారు. ప్రగతిశీల వాదులు సైతం – ఇంకా అదెక్కడ ఉందంటూ కనిపిస్తున్న దాన్ని – ‘కార్పెట్’ కిందికి తోస్తుంటే; అదేమీ కాదని జగన్ పని మాల– ‘అంటరానితనం’ ప్రస్తావనను అధికారిక వేదికపై తెచ్చారు. దాంతో ఇంతకూ అదిప్పుడు ఉందా లేదా? ఉంటే ఏమిటి? అనే చర్చను మన ముందుకు తెచ్చారు. ఇక ఇప్పుడు కార్య సాధకులు కనుక ఎవరైనా ఉంటే వారు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను అబద్ధం చేసే పని చేపట్టవచ్చు. సీఎం మాటల్లోనే అది– ‘ఈ నాలుగేళ్ల పాలనలోనే, రూపం మార్చుకున్న అంటరానితనం మీద, పేద వర్గాలను అణచి వేస్తున్న ధోరణుల మీద యుద్ధాన్ని ప్రకటించాం. అంటరాని తనం అంటే, ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోటానికి వీల్లేదని దూరం పెట్టటం మాత్రమే కాదు, పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్న మెంట్ బడిని పాడుపెట్టటం, పేదలు ఏ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారో ఆ ఉచిత సేవలు వారికి అందకుండా ఖరీదు చేయటం, పేదలు ఏ బస్సు ఎక్కుతున్నారో ఆ బస్సును ప్రైవేటుకు అమ్మేయాలని చూడటం, పేదలు కోరుకునే చిన్నపాటి ఇళ్ళ స్థలాన్నీ ఇంటినీ వారికి ఇవ్వకుండా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం... ఇవన్నీ రూపం మార్చుకున్న అంటరానితనంలో పేదల మీద పెత్తందారీ భావజాలంలో భాగాలే. పేదలు గెలిచే వరకూ, వారి బతుకులు బాగుపడేవరకూ ఇటువంటి అంటరానితనం మీద ఈ యుద్ధం కొనసాగుతుంది.’ ఇలా సాగింది ఆ సందేశం. ఈ సందేశం– ‘గ్రామర్’ ఏమై ఉంటుంది అని చూసి నప్పుడు, సీఎంగా తన రెండవ టర్మ్‌లో చేపట్టబోయే కార్యా చరణకు జగన్ తొమ్మిది నెలలు ముందుగానే ‘సామాజిక వాతావరణ’ ముందస్తు హెచ్చరికను జారీ చేశారేమోనని అనిపిస్తున్నది. అయితే, విమర్శకులు అనొచ్చు, ఎన్నికల ముందు రాజ కీయ నాయకులు ఇలా కాకుండా మరెలా మాట్లాడతారు? అని. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పైకి కనిపించకుండా అమలవుతున్నసాంఘిక వివక్షను ఎదుర్కోవడానికి ఈ ప్రభుత్వం చేపడుతున్న చర్యల ప్రతిఫలానాలు – ‘నీతి అయోగ్’ వంటి స్వతంత్ర ప్రతి పత్తిగల సంస్థలు సైతం వెల్లడిస్తున్న నివేదికల్లో చూడవచ్చు. పైకి కనిపించని సూక్ష్మం అనిపించే ఇటువంటి అంతర్గత అంతరాన్ని ఈ ప్రభుత్వం పట్టుకుంది. దాని మీద అది ’ఫోకస్’ వేసి తగు నివారణా చర్యలు మొదలుపెట్టింది. అయితే, ఈదృష్టికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. అది – రెండు వందల ఏళ్ళపాటు ఈ సర్కారు జిల్లాలు బ్రిటిష్ పాలనలో ఉండడం. దాంతో – ’మిషన్ అప్రోచ్’తో ప్రజల వద్దకు వెళితే వాళ్ళతో ‘కనెక్ట్’ కావడం కష్టం కాదు అని నమ్మి, దాన్ని– సర్కారే కాదు, నైజాం జిల్లాల్లో కూడా అమలుచేసి; అవును నిజమే అని నిరూపించినవాడు వైఎస్సార్. దానికి కొనసాగింపుగా ఈ చారిత్రక నేపథ్యాన్ని – ‘నాయకుడు’గా తననుతాను ‘ప్రూవ్’ చేసుకోవడానికి జగన్ గరిష్ఠ స్థాయిలో వాడుకోవడం వెలుగులోకి రాని అంశం. ఇప్పటికి మూడేళ్ళ క్రితమే తమ పార్టీ శ్రేణుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి నోటినుంచి– ‘అవుట్ రీచ్’ అనే పదం రావడం; ‘మిషన్ అప్రోచ్’కి కొనసాగింపుగా ఇక్కడ గుర్తుచేసుకోవడం అవసరం. ఇటీవల – ‘సోషల్ ఇంజనీరింగ్’ వంటి పదాలను పొలిటి కల్ సర్కిల్స్‌లో దేశమంతా విరివిగా వాడుతున్నారు. అయితే, జగన్ విషయంలో దాన్ని ఆలా చూడడం కుదరడం లేదు.అందుకు కారణం – ఆయనలా గతంలో సామాజిక దొంతర్ల పొరల్లోకి ఛేదించుకుంటూ లోపలికి వెళ్లినవారు మనకు కనిపించరు. ఆర్థిక ప్రయోజనాలు అందే పథకాలు అంటే సరే, కానీ ‘పవర్ పాలిటిక్స్’లోకి వచ్చే కొత్త సామాజిక వర్గాలకు– ‘లెవెల్ ప్లేగ్రౌండ్’ గతంలో ఎక్కడిది? ప్రముఖ తెలుగు నవల ’మాలపల్లి’ (1922) లో రచయిత ఉన్నవ లక్ష్మినారాయణ ప్రతిపాదించిన ‘నిమ్న వర్గాల రాజకీయ నాయకత్వాని’కి, ఇది 21వ శతాబ్ది ’వెర్షనా’ అన్నట్టుగా... కొత్త ఆశలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కొందరికి అది పొసగకపోవడం అంటారా, అది వేరే విషయం.సంక్షేమం సరే, ‘అభివృద్ధి’ ఏది? అనేది ఈ ప్రభుత్వం వైపు వేలు చూపించేవారి అతి తేలికైన ప్రశ్న. ఈ ప్రశ్న తర్వాత వెంటనే వీరు – ‘హైదరాబాద్’ అంటారు. ఇక్కడి సంపన్న జిల్లాల సొమ్ము అక్కడ అనుత్పాదక రంగాల్లో పెట్టుబడులై, జరిగిన – అర్బన్ ‘అభివృద్ధి’ నమూనా ఇప్పుడు ఇక్కడ వద్దా? అనేది వీరి ప్రశ్న. కనీస భౌగోళిక వాస్తవిక స్పృహ లేని వాదనలివి. రాష్ట్ర విభజన జరిగాక, 2014–19 మధ్య– ‘సన్ రైజ్ స్టేట్’ అంటూ తీరాన్ని ‘బ్రాండింగ్’ చేస్తూ, ‘కార్పొరేట్’ తరహా ‘పబ్లిసిటీ’కి దాన్ని పరిమితం చేయడం మాత్రమే జరిగింది తప్ప; అప్పట్లోనే ఆ సూర్యోదయ తూర్పుచూపుతో ప్రణాళికా రచన మొదల యివుంటే, ఇప్పటికి పరిస్థితి మరోలా ఉండేది. సముద్రతీర రాష్ట్రానికి ‘బ్లూ ఎకానమీ’ లక్ష్యంగా విశాఖ పట్టణం కేంద్రిత చూపు కాకుండా, ఇంకా హైదరాబాద్ అంటూ పాతపాట ఏమిటి? అనే ఇంగితం పదేళ్ల తర్వాత కూడా ఈ విమర్శకులకు తట్టకపోవడం విడ్డూరం. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 15,375 కోట్లతో– రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్ వే పోర్టులు; రూ. 3,521 కోట్లతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం త్వరితగతిన పూర్తి అవుతున్నాయని వీరికి పట్టదు. కారణం ఇక్కడ కూడా వివక్షే. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లలో ఉపాధి అనేసరికి వీటిలో సంపన్న వర్గాల యువతకంటే, దిగువ మధ్య తరగతి యువత ఉపాధికి జరిగే ప్రయో జనం ఎక్కువ. వీటి గురించి మాట్లాడకుండా ఉండడం అంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని తిరస్కరిస్తున్నట్టే! జాన్సన్ చోరగుడి వ్యాసకర్త సామాజిక, అభివృద్ధి అంశాల విశ్లేషకులు -
Yogita Bhayana: కింగ్‌ఫిషర్ టూ పరి..బాధితుల కోసం ‘భయనా’
ఢిల్లీకి చెందిన యోగిత భయనా అత్యాచార బాధితులకు పునరావాసం కల్పించడం కోసం ఏవియేషన్ కెరీర్ నుంచి బయటకు వచ్చి ‘పరి (పీపుల్ అగైనెస్ట్ రేప్ ఇన్ ఇండియా)’ అనే ఎన్జీవో స్థాపించింది. వాళ్లకు పునరావాసం, పోషణ, న్యాయపోరాటంతోపాటు చదువు కూడా చెప్పిస్తోంది. వినడానికి ఇది రెండు వాక్యాల విషయం లాగానే అనిపిస్తుంది. కానీ...ఈ ప్రస్థానంలో ఆమె దరి చేర్చిన జీవితాల సంఖ్య ఎంత పెద్దదంటే ఓ వెయ్యికి పైగానే. అంతమంది బాధితుల జీవితాలను గాడిన పెట్టడంలో నిమగ్నమైన యోగిత తనకు అత్యంత పెద్ద సవాల్ న్యాయవ్యవస్థలో నెలకొన్న జాగు అని చెప్తోంది. నిర్భయ పోరాటంలో నిర్భయ తల్లికి అండగా నిలిచిన యోగిత జీవిత ప్రస్థానం ఇది. చిన్నప్పటి నుంచి యాక్టివ్ యోగిత పద్నాలుగేళ్ల నుంచే సామాజిక సేవలో చురుగ్గా ఉండేది. ట్యూషన్లు చెప్పి ఆ డబ్బును వార్ధక్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లకు ఆర్థిక సహాయం చేసేది. స్కూల్ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతోపాటు సామాజకి కార్యకర్తగా ఎదిగింది. ఆ తర్వాత ఉమెన్ యాక్టివిస్ట్‌గా ఒక స్పష్టమైన దారిని ఎంచుకుంది. కెరీర్ పరంగా ఏవియేషన్ రంగం మీద ఏర్పడిన క్రేజ్‌తో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో చేరింది. కానీ ఆ ఉద్యోగంలో ఎక్కువ కాలం కొనసాగలేకపోయిందామె. జీవితంలో గొప్ప రిలీఫ్ పొందిన క్షణం ఏదంటే ఉద్యోగం మానేసినరోజేనంటోంది యోగిత. తన జీవితాన్ని సామాజిక సేవలో నిర్బంధించిన సంఘటనను గుర్తు చేసుకుంటారామె. కట్టిపడేసిన సంఘటన ‘‘ఓ రోజు రోడ్డు మీద నా కళ్ల ముందే ఓ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. గాయపడిన వ్యక్తిని కాపాడడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. నేను, నా ఫ్రెండ్ ధైర్యం చేసి అతడిని హాస్పిటల్‌కు తీసుకువెళ్లాం. ఆ ప్రభుత్వ వైద్యశాలలో గాయపడిన వ్యక్తికి వైద్యం చేయడానికి అవసరమైన పరికరాలు కూడా సరిగ్గా లేవు. అన్నీ సమకూర్చుకుని వైద్యం మొదలుపెట్టేలోపు ఆలస్యం అయిపోయింది. అతడు దక్కలేదు. అతడి భార్య, బిడ్డలు దిక్కులేని వాళ్లయిపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ సంఘటన వెంటాడుతూనే ఉండేది. నిద్రపోవడానికి కళ్లు మూసుకుంటే ఆ కుటుంబమే కళ్ల ముందు మెదిలేది. ఆలోచించే కొద్దీ పేదరికం ఎంత నరకమో అర్థం కాసాగింది. నిజానికి నన్ను మేల్కొలిపిన సందర్భం అది. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. కోర్టులో సాక్ష్యం చెప్పాను. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారం లభించే వరకు వారికి సహాయంగా ఉన్నాను. ఆ సంఘటన రగిలించిన ఆవేదనతో 2007లో దాస్ చారిటబుల్ ఫౌండేషన్‌ను స్థాపించాను. రోడ్డు ప్రమాదాల పట్ల చైతన్యవంతం చేయడం, కళ్ల ముందు ప్రమాదం జరిగితే ఎలా స్పందించాలనే అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించాం. సేవామార్గంలో మలుపు నా కార్యకలాపాలు ఇలా కొనసాగుతుండగా 2012 లో నిర్భయ ఘటన జరిగింది. దేశరాజధానిలో ఒక యువతి అమానవీయంగా అత్యాచారానికి గురి కావడం, ప్రాణాలతో పోరాడి తుదిశ్వాస వదలడం గుర్తుండే ఉంటుంది. దేశాన్ని కుదిపేసిన ఆ సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆ న్యాయపోరాటంలో తీర్పు రావడానికి ఏళ్లు పట్టింది. ఆంత కాలం నిర్భయ తల్లికి అండగా ఉన్నాను. ఆ సమయంలో నాకు ఎంతోమంది నుంచి వినతులు వస్తుండేవి. ‘మాకు కూడా ఇలాగే జరిగింది. న్యాయపోరాటం చేయాలంటే మాకు తోడుగా ఎవరూ రావడం లేదు’ అంటూ తమకు సహాయం చేయమని అడిగేవాళ్లు. తరచూ కోర్టుకు వెళ్లాల్సి రావడంతో మరికొన్ని సంగతులు కూడా తెలిశాయి. నిర్భయ కేసు... సామాన్యుల నుంచి పాలకుల వరకు అందరి దృష్టిలో పడింది కాబట్టి అప్పటికైనా విచారణ పూర్తి చేసుకుని తీర్పుకు నోచుకుంది. పదిహేనేళ్లు దాటినా కూడా అతీగతీ లేకుండా కాగితాల్లో మూలుగుతున్న కేసులు లెక్కకు మించి ఉన్నాయని తెలిసింది. ఒక యాక్టివిస్టుగా నేను చేయల్సిన పని చాలా ఉందనిపించి పరి ఎన్జీవోను స్థాపించాను. ఈ వేదిక ద్వారా సహాయం పొందిన బాలికలు, యువతులు, మహిళల వివరాలను చెప్పలేను. కానీ వెయ్యికి పైగా జీవితాలు గాడిలో పడ్డాయని చెప్పగలను. వాళ్ల తరఫున న్యాయపోరాటం చేయడం, పునరావాసం కల్పించడం, చదువుకునే వాళ్లను చదివించడం వంటివన్నీ చేస్తున్నాను. అత్యాచార బాధితులతోపాటు ఒంటరి మహిళలకు కూడా మా దగ్గర కారు డ్రైవర్, కారు క్లీనర్, హౌస్ కీపింగ్ వంటి పనుల్లో శిక్షణ తీసుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారు’’ అని చెప్పింది యోగిత. छात्रों की समस्या का समाधान किया जाए. पिछले एक साल से सिर्फ एक मौके की मांग कर रहे छात्रों के साथ न्याय जरूरी है. #UPSCExtraAttempt EXTRA ATTEMPT FOR ALL pic.twitter.com/C9Umb146jp — Yogita Bhayana योगिता भयाना (@yogitabhayana) December 1, 2021 -
పేదరికాన్ని నిర్మూలించడంలో ‘నాంది ఫౌండేషన్’ సేవలు భేష్!
-
Sakshi Excellence Awards: ఈ అవార్డు మాలో మరింత బాధ్యతను పెంచింది
Sakshi Excellence Awards: హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘ఎక్స్‌లెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్’ అవార్డును నాంది ఫౌండేషన్ ఫైనాన్స్ మేనేజర్ కె సతీష్ కుమార్ అందుకున్నారు. పేదరికాన్ని నిర్మూలించడానికి నిస్వార్థంగా ఆవిర్భవించినదే.. ‘నాంది’ ఫౌండేషన్. ఎ.పి., తెలంగాణతో సహా దేశంలోని 17 రాష్ట్రాలలో ఇంతవరకు 70 లక్షల మంది జీవితాల్లో మార్పు తెచ్చిన ‘నాంది’ 1998లో హైదరాబాద్‌లో ఆవిర్భవించింది. పేదరికాన్ని నిర్మూలించే ఒక శక్తిగా అవతరించింది. ఆదివాసీ వ్యవసాయదారులకు చేయూతనిచ్చి, వారితో చేతులు కలిపి లక్ష మందిని దారిద్య్రరేఖ దిగువ నుంచి ఎగువకు తెచ్చింది. ‘అరకు కాఫీ’తో దేశానికి బ్రాండ్ ఇమేజ్ తెచ్చింది. అల్పాదాయ కుటుంబాల్లోని 4 లక్షల మంది బాలికలకు విద్యను అందించింది. బాధ్యత పెంచింది సాక్షి మీడియా గ్రూప్‌కు, న్యాయ నిర్ణేతల బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అవార్డు మాలో మరింత బాధ్యతను పెంచింది. పాఠశాల విద్యార్ధుల కోసం మేం చేస్తున్న కృషి ఫలాలు మరింత మందికి అందాలని కోరుకుంటున్నాం. – కె. సతీష్ కుమార్, ఆరకు ఫైనాన్స్ మేనేజర్ -
అధ్వానంగా విద్యా వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అత్యంత అధ్వాన్నంగా తయారైందని సోషల్ డెమొక్రటిక్ ఫోరం కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్య తీవ్ర సంక్షోభంలో ఉందని, ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫోరం ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. నీతి ఆయోగ్ 2020–21 నివేదిక ప్రకారం, ఆర్థికాభివృద్ధిలో తొలి 5 స్థానాల్లో ఉన్న తెలంగాణ.. నాణ్యమైన విద్యలో 10 స్థానం, ఆరోగ్య సూచికల్లో 18వ స్థానం, మహిళా సాధికారతలో 23వ స్థానం, పేదరిక నిర్మూలనలో 15వ స్థానం, ఆకలి నిర్మూలన, ఆహార భద్రత, పోషకాహారం లభ్యతలో 17వ స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదికేడాది రాష్ట్ర ఆర్థిక వనరులు పెరుగుతుండగా, విద్యకు బడ్జెట్లో కేటాయింపులు గణనీయంగా తగ్గిస్తున్నారన్నారు. 2014–15లో రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 10.89 శాతం నిధులు కేటాయించగా, 2021–22 నాటికి 5.89 శాతానికి తగ్గించారని తప్పుబట్టారు. ఇప్పటికైనా సమీక్ష జరిపి పరిస్థితులను సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాసమస్యలపై గతంలో మేధావులు మాట్లాడేవారని, ప్రస్తుతం రాష్ట్రంలో మాట్లాడేవారు కరువయ్యారనే డెవలప్మెంట్ ఫోరం పురుడు పోసుకుందని మురళి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఫోరం కో–కన్వీనర్లు వెంకట్‌రెడ్డి, డాక్టర్ రమ, ఎంఎఫ్ గోపీనాథ్, ఝాన్సీ గడ్డం, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, సూరెపల్లి సుజాత, దస్రం నాయక్, సభ్యులు శంకర్, వీరస్వామి తదితరులు మాట్లాడారు. సర్కారుకు ఫోరం సూచనలు... ►ఉపాధ్యాయులు, ఎంఈఓ పోస్టుల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి ►పాఠశాలల్లో టాయిలెట్లు, స్వచ్ఛమైన తాగునీరు, ఫ్యాన్, ట్యూబ్‌లైట్, గ్రీన్ బోర్డుతో సహా చదువుకునే వాతావరణం ఉన్న తరగతి గదులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలి ►రూ.2వేల కోట్ల గ్రాంట్‌ను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు తక్షణమే విడుదల చేయాలి ►పాఠశాలలను పునః ప్రారంభిస్తున్నందున డ్రాప్ అవుట్స్ లేకుండా దృష్టి పెట్టాలి. ►బడ్జెట్లో 20 శాతం నిధులను విద్యకు కేటాయించాలి. -
శభాష్ కరేబియన్
కరేబియన్.. చిన్న చిన్న ద్వీపకల్పాలతో కూడిన దేశాల సమాహారం. చుట్టూ సముద్రం. తమదైన సంస్కృతీ సంప్రదాయాలను కలిగిన వివిధ దేశాలతో కూడిన దీవులను కరేబియన్ దీవులని పిలుస్తారు. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా మధ్యనున్న ఈ దీవుల్లో జరుగుతోన్న సంస్కరణలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి. సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ముందు విద్యాభివృద్ధిని సాధించాలి. శతాబ్దాల నాటి కాలం చెల్లిన విధానాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, కాలంతో పాటు మారుతూ, సమాజం నిత్యనూతనంగా విరాజిల్లాలంటే ప్రజలందరికీ సమానమైన విద్యావకాశాలు అందుబాటులో ఉండాలి. సరిగ్గా ఇలాంటి అభివృద్ధి నమూనానే అనుసరిస్తూ ప్రపంచ ప్రజల మెప్పు పొందుతోంది ఈ కరేబియన్ రీజియన్. ఈ సంస్కరణలకు మూల కారకురాలైన బార్బడోస్ ప్రధానమంత్రి మియామోట్లీ వైవిధ్యభరితమైన విద్యావిధానానికి రూపకల్పన చేసి అందరి మన్ననలు అందుకుంటున్నారు. మూడు ప్రధాన అంశాలపై ఆమె దృష్టి సారించారు. విద్యకు పునర్నిర్వచనం.. 1879 నాటి విద్యా విధానాన్నే ఇప్పటికీ అనుసరిస్తోన్న ఈ రీజియన్‌లో సెకండరీ స్కూల్ ఎంట్రన్స్ ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన విద్యార్థులకు మాత్రమే మంచి నాణ్యత కలిగిన విద్యాసంస్థల్లో ప్రవేశం ఉంటుంది. మిగిలిన వారికి నాణ్యమైన విద్య అందుబాటులో ఉండదు. అరకొర పాఠశాలల్లోనే వారు చదువుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విధానంలోని లోపాన్ని గుర్తించిన ప్రధానమంత్రి మియామోట్లీ దేశంలోని అన్ని పాఠశాలలనూ ఒకేరీతిన అభివృద్ధిపరిచారు. ఎంట్రన్స్ విధానాన్ని రద్దుచేసి, పాఠశాలలన్నింటినీ టాప్ స్కూల్స్‌గా మారుస్తూ సంస్కరణలు చేపట్టారు. విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా సాంకేతిక, వృత్తి విద్యాకోర్సులను ప్రవేశపెట్టారు. వివిధ కళల్లో శిక్షణనిచ్చే ఏర్పాటు చేశారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ప్రత్యేకమైన వసతులు కల్పించారు. చుట్టుపక్కల దేశాలు సైతం ఈ ఎంట్రన్స్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయడంలో విఫలమయ్యాయి. అవినీతి రహితమే ప్రభుత్వ హితం సామాజిక అభివృద్ధికి అడ్డంకిగా మారిన అవినీతిని అంతమొందించడమే లక్ష్యంగా బార్బడోస్ ప్రధాని మియామోట్లీ పనిచేస్తున్నారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు అందకపోవడానికీ, నేరాల రేటు పెరగడానికీ అవినీతి కారణమవుతోంది. హైతీ దీవిలో స్థానిక ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాధనం వృథా కావడం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతి వేళ్లూనుకోవడంతో ప్రజా ఉద్యమాలు పెల్లుబికాయి. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మియామోట్లీ ప్రభుత్వం అవినీతిరహిత సమాజం కోసం కృషి చేస్తోంది. మూలవాసులకు గౌరవం స్థానిక ప్రజల సాంస్కృతిక వారసత్వ హక్కులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందీ దేశం. 500 ఏళ్లలో తొలిసారి 2019లో జమైకాకి తైనో చీఫ్‌ని నియమించారు. నెల క్రితం ఇన్స్టిట్యూట్ ఆఫ్ జమైకా మూలవాసులు ‘తైనో డే’ నిర్వహించుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తైనో చెక్క కళాఖండాలను బ్రిటన్ నుంచి తిరిగి పొందేందుకు జమైకా ప్రభుత్వం జాతీయ కమిషన్ ద్వారా కృషి చేస్తున్నట్టు సాంస్కృతిక, లింగ, వినోద, క్రీడా రంగాల మంత్రి ఒలివియా గ్రాంజ్ వెల్లడించారు. మొత్తంగా ఆదివాసీల సంస్కృతినీ, వారి ఆకాంక్షలనూ గుర్తించి, గౌరవించే ప్రక్రియలో ఈ ప్రభుత్వం విజయపథంలో నడుస్తోంది. ఏ దేశమైనా తన మూలాలను అర్థం చేసుకోకుండా, తన స్వీయ చరిత్రను అవగాహన చేసుకోకుండా ముందుకెళ్లలేవు. తమ మూలాలను గ్రహించి, వాటిని గౌరవించుకుంటూ కరేబియన్ దేశం నూతన దశాబ్దంలోకి అడుగిడుతోంది. -
సామాజిక అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం
సాక్షి, అమరావతి: అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగే విధంగా పలు వినూత్న పథకాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక అభివృద్ధికి కృషి చేస్తున్నారని రాష్ట్ర నూతన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి బుధవారం ఆయన ఒక సందేశాన్ని విడుదల చేశారు. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేయడం, తన దృష్టికి వచ్చిన సమస్యలు, ఫిర్యాదుల ఆధారంగా నవరత్నాలు అనే మేనిఫెస్టోను రూపొందించి ప్రజల ముందుకు ప్రత్యేకంగా తీసుకువెళ్లిన విధానమే జగన్‌కు గొప్ప విజయాన్ని అందించిందన్నారు. తన తండ్రి దివంగత వైఎస్సార్ నాడు ప్రవేశపెట్టిన ప్రధాన సంక్షేమ పథకం ఆరోగ్యశ్రీని నేడు దేశం మొత్తం ఆదర్శంగా తీసుకున్న పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఈ పథకాన్ని ఇప్పుడు మరింత మెరుగుపర్చి, కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్న జగన్ ముందుచూపును తాను అభినందిస్తున్నానని తెలిపారు. అక్షరాస్యత రేటును పెంచేందుకు ఒక నూతన విధానాన్ని రూపొందించి, ప్రతి తల్లి తన బిడ్డను పాఠశాలకు పంపించేందుకు ప్రోత్సాహకాలను అందించడం ద్వారా ఆర్థిక, సామాజిక మార్పునకు శ్రీకారం చుట్టారని అభిప్రాయపడ్డారు. దీనివల్ల బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. వృత్తి విద్యా కోర్సులు, ఉన్నత చదువుల కోసం విద్యార్థుల అవసరాలను ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా తీర్చనున్నారని చెప్పారు. విద్య కోసం చేసే ఖర్చు మూలధనంగా పరిగణించడం ప్రశంసించాల్సిన అంశమని పేర్కొన్నారు. విద్యపై ఖర్చు చేసే సొమ్ముకు ఫలితాలు రావడానికి చాలా సుదీర్ఘమైన సమయం పడుతుందని, అయినప్పటికీ చాలా కొద్ది మంది వ్యక్తులు మాత్రమే ఈ విధమైన గొప్ప ఆలోచనలు చేస్తారని తెలిపారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు రైతులకు నగదు అందించడం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీ చేయడంతోపాటు మార్కెట్లో గిట్టుబాటు ధర కల్పించడం మంచి విషయమన్నారు. పింఛన్లతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ అందించేందుకు, గ్రామ వలంటీర్లను నియమించుకోవడం, వికేంద్రీకృత పాలన కోసం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడం సాహసోపేతమైన నిర్ణయమని ఆయన కొనియాడారు. స్వామి వివేకానంద సూక్తి సదా ఆచరణీయం ‘అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకూ విశ్రమించొద్దు’ అన్న స్వామి వివేకానంద సూక్తి సదా ఆచరణీయమని గవర్నర్ పేర్కొన్నారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను వారసత్వంగా పొంది, రాజకీయ, ఆర్థిక, సామాజిక సంస్కరణలకు ఆలవాలమై పవిత్ర కృష్ణా నదీ తీరాన కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో వెలుగొందుతున్న విజయవాడ నగరంలో తాను కూడా భాగస్వామిని కావడం చాలా సంతోషకరమైన పరిణామమన్నారు. ఎందరో మేధావులు, రచయితలు, ప్రముఖులు, రాజనీతిజ్ఞులు చూపిన దూరదృష్టి, దార్శనికతతో ఆంధ్రప్రదేశ్ అనేక అంశాల్లో అగ్రభాగాన నిలిచిందని చెప్పారు. తెలుగు భాష, ఇక్కడి సంస్కృతి తనకు కొత్తేమీ కాదని, పొరుగునే తమ రాష్ట్రం ఉందని శ్రీకాకుళం పక్కనే ఉన్న గంజాం తన స్వస్థలం అని హరిచందన్ తెలిపారు. అన్ని అవరోధాలను దాటి రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించే దిశగా ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొంటూ తన సందేశం ముగించారు. -
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: ఎక్స్‌లెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్ అవార్డు ఆశ్రిత
-
‘సాక్షి’ ఎక్సలెన్స్ విజేతల ఎంపిక పూర్తి
♦ ఎనిమిది కేటగిరీల్లో అవార్డులకు విజేతల ఎంపిక ♦ త్వరలో ఎంపికైన విజేతలకు అవార్డుల ప్రదానం ♦ ఎంట్రీలకు అనూహ్య స్పందన సాక్షి, హైదరాబాద్: వివిధ రంగాల్లో అద్భుత సేవలందించిన ప్రతిభావంతులకు ఏటా అందజేసే ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డుల విజేతల ఎంపిక సోమవారం ముగిసింది. సామాజిక సేవ, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామికం తదితర రంగాల్లో ‘సాక్షి ఎక్సలెన్స్-2015’ అవార్డులకు విజేతలను ఎంపిక చేశారు. త్వరలో నిర్వహించనున్న కార్యక్రమంలో విజేతలకు అవార్డులను అందజేయనున్నారు. ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డులకు ఈ ఏడాది కూడా అనూహ్య స్పందన లభించింది. ఆయా రంగాల్లో ఉత్తమ సేవలు అందజేసిన వ్యక్తులు, సంస్థల నుంచి విజేతలను ఎంపిక చేసే ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా కొనసాగింది. వివిధ రంగాల్లో అపార అనుభ వజ్ఞులైన ప్రముఖులు జ్యూరీగా వ్యవహరించారు. వివిధ దశల్లో జరిగిన ఎంపిక ప్రక్రియ సోమవారం ఫైనల్‌కు చేరుకుంది. ఎనిమిది కేటగిరీల్లో... సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల కోసం ఎనిమిది కేటగిరీలను గుర్తించారు. ఎడ్యుకేషన్, హెల్త్, ఫార్మింగ్(వ్యవసాయం), బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఇన్ లార్జ్ స్కేల్, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ స్మాల్ అండ్ మీడియం స్కేల్, సోషల్ డెవలప్మెంట్(ఎన్జీవోస్), యంగ్ ఎచీవర్ ఇన్ ఎడ్యుకేషన్, యంగ్ ఎచీవర్ ఇన్ సోషల్ సర్వీస్ రంగాల్లో అవార్డులను అందజేసేందుకు ఎంట్రీలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సాక్షికి అందిన ఎంట్రీలను వివిధ స్థాయిల్లో న్యాయనిర్ణేతలు వడపోశారు. చివరకు సోమవారం విజేతలుగా నిలిచిన ఉత్తమ వ్యక్తులు, సంస్థల ఎంపిక పూర్తయ్యింది. ఎంవీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, రామన్‌మెగసెసె అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతా సిన్హా, మాజీ అడ్వొకేట్ జనరల్ ఏ సత్యప్రసాద్, కిమ్స్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె.కృష్ణయ్య, సీనియర్ సంపాదకులు డాక్టర్ ఏబీకే ప్రసాద్, డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ డీఎన్ రెడ్డి, ఎలికో ఫార్మా సీఎఫ్ఓ, మేనేజింగ్ డెరైక్టర్ వనితా దాట్ల న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశమైన జ్యూరీ విస్తృతంగా చర్చించిన అనంతరం తుది విజేతలను ఖరారు చేసింది. తమకు అందిన ప్రతి ఎంట్రీని న్యాయనిర్ణేతలు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతిదీ ఒకదానితో మరొకటి పోటీపడుతున్నట్లుగా ఉందని జ్యూరీ సభ్యులు అభిప్రాయపడ్డారు. సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల జ్యూరీకి సభ్యులుగా వ్యవహరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం జ్యూరీ సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, కార్పొరేట్ కమ్యూనికేషన్ డెరైక్టర్ రాణిరెడ్డి పాల్గొన్నారు. -
కల్యాణలక్ష్మి పై ఆరా తీసిన ఎమ్.వి.రెడ్డి
హైదరాబాద్ : సోషల్ డెవలప్మెంట్ అధికారి ఎమ్.వి.రెడ్డి మంగళవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆళ్లూరు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కల్యాణలక్ష్మీ పథకం తీరుతెన్నులు గురించి ఆరా తీశారు. అంతేకాకుండా గ్రామంలో నూతనంగా వివాహం చేసుకున్న జంటకు కల్యాణలక్ష్మీ పథకం గురించిన పూర్తి వివరాలను తెలిపారు. ఈ పథకం గురించి అధికారులు ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారా లేదా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ ను సందర్శించారు. (చేవెళ్ల) -
మానవాభివృద్ధి సూచీలో మొదటి స్థానం పొందిన దేశం?
Civils Prelims Paper - I ఎకానమీ సాంఘిక అభివృద్ధి, సమ్మిళిత వృద్ధి వస్తు, సేవల ఉత్పత్తిలోని పెరుగుదలను ఆర్థిక వృద్ధిగా పరిగణిస్తాం. ప్రతిపౌరుడు కనీస అవసరాలు పొందగలిగిన స్థితిని సాంఘిక అభివృద్ధిగా భావించవచ్చు. ఆర్థికవృద్ధిని ఆట్చౌఛ్ఛీట ్ఛఛ్ఛిలో చూసినప్పుడు సాంఘికాభివృద్ధి ఆర్థికాభివృద్ధిలో మిళితమై ఉంటుంది. ఈ స్థితిని సమ్మిళిత వృద్ధిగా భావిస్తాం. మరోవైపు సాంఘి క అభివృద్ధి, సమ్మిళిత వృద్ధి రెండూ వేర్వేరు అని కొంతమంది ఆర్థికవేత్తల అభిప్రాయం. సాంఘిక అభివృద్ధి, ఆర్థిక వృద్ధి ఒకే రూపంలో ఉండాల్సిన అవసరం లేదు. ఆదాయస్థాయి, మానవాభివృద్ధిలో దేశాలు ఒకే స్థానాన్ని పొందలేకపోవడాన్ని బట్టి సాంఘిక, ఆర్థిక అభివృద్ధిని వేర్వేరుగా భావించవచ్చు. భారత్‌లో ఐదు దశల ఆర్థిక వృద్ధి 1. మొదటి దశలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంపై ఆర్థిక వ్యవస్థ దృష్టి కేంద్రీకరిస్తుంది. మూలధన కల్పనరేటు పెంచడం ద్వారా వస్తు, సేవల ఉత్పత్తిని అధికం చేసినప్పుడు ఆర్థికవృద్ధిని గమనించవచ్చు. ఈ వృద్ధి ద్వారా ప్రజలు మెరుగైన జీవన ప్రమాణాలు పొందగలరు. ఆర్థికవృద్ధిని వేగవంతం చేయడం ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది. 2. రెండో దశలో ఆర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధి మధ్య తేడా, ఆదాయ పంపిణీలాంటి అంశాలు చర్చనీయాంశంగా ఉంటాయి. సమానంగా, స్వతంత్ర లక్ష్యంగా ఆర్థిక వృద్ధి ఫలాల పంపిణీ రూపొందుతుంది. అతిపెద్ధ ఆర్థిక వ్యవస్థల్లో ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి ముఖ్యాంశంగా ఉంటుంది. 3. మూడో దశలో సమానత్వం అనే అంశం ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఆహా రం, విద్య, శుభ్రమైన తాగునీరు, ఆరోగ్య సేవలు లాంటి కనీస అవసరాలు ప్రజలందరికీ లభ్యమవుతున్నాయా? లేదా అనే అంశంపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. 4. నాలుగో దశలో సుస్థిర వృద్ధి సాధన ఆర్థిక వృద్ధిలో భాగంగా ఉంటుంది. పర్యావరణ క్షీణతను అరికట్టి ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా సుస్థిర వృద్ధి ప్రధానమైంది. 5. ఐదో దశలో మానవాభివృద్ధి ప్రధాన మైంది. ప్రజల జీవన నాణ్యత మెరుగుపర్చడానికి చర్యలు అవసరం. మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంతోపాటు ప్రజలు తమ సామర్థ్యాన్ని వినియోగించుకునే విధంగా శిక్షణను ఇచ్చి తగిన ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. విద్య, ఆరోగ్య రంగాలపై ప్రభుత్వ వ్యయం భారత్‌లో విద్య, ఆరోగ్య రంగాలపై తలసరి ప్రభుత్వ వ్యయంలో తేడా వల్ల మానవాభివృద్ధిలో రాష్ట్రాల మధ్య అసమానతలు పెరిగాయి. తమిళనాడు, హర్యానా, గోవా, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో విద్యపై తలసరి ప్రభుత్వ వ్యయం ఎక్కువ కాగా, జమ్మూ కాశ్మీర్లో అతి తక్కువ (రూ.11)గా నమోదైంది. బీహార్, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వరుస క్రమంలో విద్యపై తలసరి ప్రభుత్వ వ్యయం తక్కువగా ఉంది. ప్రణాళికా సంఘం ప్రకారం... ఆరోగ్యంపై తలసరి ప్రభుత్వ వ్యయం గోవా (రూ. 861)లో ఎక్కువ కాగా, తర్వాత స్థానాల్లో హిమాచల్ ప్రదేశ్ (రూ.630), ఢిల్లీ (రూ. 560), జమ్మూ కాశ్మీర్ (రూ.512) రాష్ట్రాలు నిలిచాయి. తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (రూ. 128), మధ్యప్రదేశ్ (రూ. 146), చత్తీస్‌గఢ్ (రూ. 146), అసోం (రూ. 162) రాష్ట్రాలు ఉన్నాయి. బీహార్‌లో తక్కువ (రూ. 93)గా తలసరి ప్రభుత్వ వ్యయం నమోదైంది. స్వాతంత్య్రానంతరం భారత్‌లో విద్య, ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపడిన కారణంగా అక్షరాస్యత, ప్రజల ఆయుర్దాయంలో పెరుగుదల ఏర్పడింది. కానీ బంగ్లాదేశ్, బ్రెజిల్, మెక్సికోలాంటి దేశాలతో పోల్చినప్పుడు ప్రాథమిక విద్యలో డ్రాప్ అవుట్ల సంఖ్య, ఐదేళ్ల వయసులోపు వారితో పాటు శిశు, ప్రసూతి మరణాలు లాంటి సూచికల్లో భారత్ స్థితి ఆశాజనకంగా లేదు. అదేవిధంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మెరుగైన పారిశుధ్యం లభించే ప్రజల శాతం, 5 నుంచి 69 నెలల్లోపు రక్త హీనతతో బాధపడే పిల్లల సంఖ్య లాంటి సూచికల విషయంలోనూ భారత్ ఇలాంటి స్థితినే ఎదుర్కొంటోంది. వృద్ధి, మానవాభివృద్ధి మధ్య సంబంధం ప్రాథమిక స్థాయిలో ఆర్థికవృద్ధి, సాంఘిక అభివృద్ధి లేదా మానవాభివృద్ధి మధ్య ఏ విధమైన వివాదమూ లేదు. మానవుని భౌతిక శ్రేయస్సు పెంపులో విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం భాగంగా ఉంటాయి. సాంఘికాభివృద్ధి సాధనకు రెండు మార్గాలను ఎంచుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధించిన క్రమంలో కలిగే లబ్ధ్ది అన్ని వర్గాల ప్రజలకు చేకూరడం ఒక మార్గం. ఈ వ్యూహాన్ని ట్రికిల్‌డౌన్ వ్యూహంగా వర్గీకరించవచ్చు. ట్రికిల్‌డౌన్ వ్యూహం అమలు కావాలంటే ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వృద్ధిని సాధించాలి. స్వాతంత్య్రానంతరం మొదటి మూడు దశాబ్దాల్లో సాధించిన వృద్ధి ఫలాలు సమాజంలో అన్ని వర్గాలకు చేరలేదు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ అభివృద్ధి వ్యూహంగా సాంఘిక అవస్థాపనలపై దృష్టి కేంద్రీకరించాలి. విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, శుభ్రమైన తాగునీరు లాంటి సౌకర్యాలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు లభ్యమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. భారత్‌తోపాటు ఇతర ఏ దేశం కూడా ఇలాంటి ప్రత్యేక దృక్పథాన్ని అవలంబించలేదు. ఆయా దేశాల్లో వివిధ కాలాల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు చేయడంతోపాటు ప్రాథమిక విద్య, ఆరోగ్యం లాంటి మౌలిక సౌకర్యాలపై దృష్టి కేంద్రీకరించాయి. మెరుగైన విద్య, ఆరోగ్య సౌకర్యాలు ఆర్థిక వృద్ధిని పెంపొందించగలవని కచ్చితంగా భావించలేం. జాతీయాదాయ వృద్ధిని వేగవంతం చేయడానికి ఈ సౌకర్యాలు ఉపకరిస్తాయి. మరోవైపు ఆర్థికవృద్ధి వేగవంతం కానిదే దీర్ఘ కాలంలో మానవాభివృద్ధిపై వివిధ దేశాలు పెట్టుబడిని నిరంతరం కొనసాగించలేవు. అనేక ప్రాంతాలు, దేశాల్లో మానవాభివృద్ధి సూచికల విషయంలో ఏర్పడిన ప్రగతి ఆర్థికాభివృద్ధికి దారితీయలేదని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మానవాభివృద్ధి సూచికలు, ఆర్థికాభివృద్ధి అంశాలను రెండుగా విభజించి తేడాను గమనించినప్పుడు ఆర్థిక వ్యవస్థలో సాంఘిక అలజడులు (Social Unrest) పెరుగుతాయి. ఉదాహరణకు విద్యారంగంలో ప్రగతి కారణంగా చదువుకున్న యువతకు ఉత్పాదకత తోకూడిన ఉపాధిని కల్పించగలగాలి. ఆర్థికవృద్ధి, సాంఘిక అభివృద్ధి ఒకేదశలో పయనించగలిగినప్పుడు రెండూ ప్రయోజనాన్ని పొందగలుగుతాయి. సమానత్వం, వృద్ధి రెండూ సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. అనేక దేశాల్లో ఆర్థిక వృద్ధి కారణంగా పేదరికంలో తగ్గుదల సంభవించినట్లు అనుభవ పూర్వక ఆధారా లున్నాయి. అందరికీ సమాన అవకాశాలు కల్పించగలిగినప్పుడే వృద్ధిరేటు పెరుగుతుంది. నిర్లక్ష్యానికి గురైన వివిధ వర్గాల ప్రజల అభ్యున్నతికి అవసరమైన కార్యక్రమాలు అవసరం. అయితే స్వల్ప కాలంలో ఆశించిన ప్రయోజనం కనిపించనప్పటికీ దీర్ఘకాలంలో సామర్థ్య పెంపు ద్వారా ఆర్థిక వృద్ధి సిద్ధిస్తుంది. పేద ప్రజలు తమ అవకాశాలను మెరుగుపర్చుకునే విధంగా ్కటౌఞౌౌట విధానాలు అవసరం. ఆయా విధానాలు పేద ప్రజల సామర్థ్యం పెంపునకు దారితీస్తాయి. Pro-poor విధానాల్లో భాగంగా ఆదాయ బదిలీలే కాకుండా పేద ప్రజలు ఆధారపడిన అనేక రంగాలపై పెట్టుబడి పెరిగే విధంగా చర్యలు అవసరం. గ్రామీణాభివృద్ధిలో భాగంగా వ్యవసాయ రంగ వృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విద్య, ఆరోగ్యం, ఇతర సాంఘిక సేవలు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి. మానవాభివృద్ధి నివేదిక 1991 మానవ వ్యయ నిష్పత్తి (Human Expenditure)ని ప్రవేశపెట్టింది. ప్రాథమిక విద్య, పౌష్టికాహారం, వాటర్ సప్లయ్, పారిశుధ్యం లాంటి వాటిపై జాతీయాదాయంలో ఎంతశాతాన్ని వ్యయం చేశారో తెలుసుకోవడానికి ఈ నిష్పత్తి ఉపకరిస్తుంది. మానవాభివృద్ధిలో సంతృప్తికరమైన ఫలితాలు సాధించాలంటే మానవ వ్యయ నిష్పత్తి 5 శాతంగా ఉండాలని ఈ నివేదిక వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు సాంఘిక అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సమ్మిళిత వృద్ధి వ్యూహం -సమస్యలు అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో సమ్మిళిత వృద్ధి వ్యూహం సాధనలో భాగంగా కింద పేర్కొన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. 1. పేదరికం: ప్రపంచబ్యాంక్ ప్రకారం భారత్‌లో 456 మిలియన్ల ప్రజలు దారిద్య్రరేఖ దిగువన నివసిస్తున్నారు. మొత్తం దేశ జనాభాలో వీరి వాటా 42శాతం. 2. ఉపాధి: భారత్‌లో మొత్తం ఉపాధిలో అసంఘటిత రంగం వాటా 85 శాతం. 3. వ్యవసాయ రంగం: ప్రకృతి వైపరీత్యాలు, తక్కువ వర్షపాతం, భూ కేటాయింపుల్లో ఎదురవుతున్న సమస్యలు 4. సాంఘికాభివృద్ధి: విద్య, ఆరోగ్య ప్రమాణాలు సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో లేకపోవడం, మానవాభివృద్ధి సూచీలో ఉన్న మొత్తం 187 దేశాల్లో భారత్ 135వ స్థానాన్ని పొందడం. 5. ప్రాంతీయ అసమానతలు: తలసరి ఆదాయంలో రాష్ట్రాల మధ్య అసమానతలు ఎక్కువ. బాలికల్లో శిశు మరణాల రేటు కేరళలో తక్కువగా ఉంటే, మధ్యప్రదేశ్‌లో అధికంగా ఉంది. కేరళలో మహిళా అక్షరాస్యతా రేటు ఎక్కువ కాగా, బీహార్‌లో తక్కువ. పేద రాష్ట్రాలతో పోల్చినప్పుడు ధనిక రాష్ట్రాల్లో వృద్ధిరేటు అధికంగా ఉంటోంది. 11వ ప్రణాళిక - సమ్మిళిత వృద్ధికి చర్యలు 1. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ప్రత్యేక ఆర్థిక ప్రాంతాలకు ప్రోత్సాహం 2. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునికీకరించడం 3. రాష్ర్ట ప్రభుత్వాలు పారిశ్రామిక స్నేహపూర్వక వాతావరణం కల్పించేదిశగా చర్యలు తీసుకోవడం 4. తయారీ రంగంలో ఉపాధిని పెంచేలా శ్రమసాంద్రత పరిజ్ఞానాన్ని వినియోగించడం 5. పన్నులు, డ్యూటీలకు సంబంధించి ప్రోత్సాహకాలు 6. ప్రతేక, చిన్నతరహా సంస్థల అభివృద్ధికి తోడ్పాటును అందించడం 7. మైనింగ్ విధానాన్ని సమీక్షించడం ద్వారా మైనింగ్ కార్యకలాపాల్లో పెట్టుబడి పెంచే విధంగా అవరోధాలను తొలగించడం 8. విద్యారంగంలో ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ముఖ్యమైన ప్రశ్నలు 1. ఆర్థికవృద్ధి సరిపోయినంతగా లేకుండా సాంఘిక ప్రగతి సాధ్యమవుతుందని మీరు భావిస్తున్నారా? చర్చించండి? 2. సాంఘికాభివృద్ధి, సమ్మిళిత వృద్ధి మధ్య (ynergies) తేడాను వివరించండి? 3. సాంఘిక రంగాలపై వ్యయం సాంఘిక ప్రగతికి దారితీస్తుందని మీరు భావిస్తున్నారా? 4. సాంఘిక రంగాలపై వ్యయం ద్వారా మంచి ప్రతిఫలం పొందడానికి అవసరమైన సంస్థాపరమైన (Organisati-onal), ప్రోత్సహించే (Motivational) కారకాలను పేర్కొనండి? 5. సాంఘిక అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వం, ప్రైవేట్ రంగ పాత్ర వివరించండి? మాదిరి ప్రశ్నలు 1. మానవ వ్యయ నిష్పత్తి (Human Expd, Index)ని ఏ నివేదిక ప్రవేశపెట్టింది? 1) మానవాభివృద్ధి నివేదిక 1991 2) మానవాభివృద్ధి నివేదిక 1992 3) మానవాభివృద్ధి నివేదిక 1994 4) మానవాభివృద్ధి నివేదిక 1996 2. మానవాభివృద్ధి నివేదిక 2014 ప్రకారం మానవాభివృద్ధిలో భారత్ స్థానం? 1)133 2) 122 3)136 4) 135 3. విద్యారంగంలో తలసరి ప్రభుత్వ వ్యయం తక్కువగా ఉన్న రాష్ర్టం? 1) జమ్మూ కాశ్మీర్ 2) మధ్యప్రదేశ్ 3) రాజస్థాన్ 4) కేరళ 4. అత్యంత ఎక్కువ మానవాభివృద్ధి చెంది నవిగా 2014 మానవాభివృద్ధి నివేదిక ఎన్ని దేశాలను పేర్కొంది? 1) 49 2) 50 3) 48 4) 54 5. మానవాభివృద్ధి సంతృప్తికరమైన ఫలితాలు సాధించాలంటే మానవ వ్యయ నిష్పత్తి ఎంతగా ఉండాలని మానవాభివృద్ధి నివేదిక అభిప్రాయపడింది? 1) 10 శాతం 2) 9 శాతం 3) 3 శాతం 4) 5 శాతం 6. 2014 మానవాభివృద్ధి నివేదిక ప్రకారం మానవాభివృద్ధి సూచీలో మొదటిస్థానం పొందిన దేశం? 1) నార్వే 2) అమెరికా 3) స్వీడన్ 4) నైజర్ 7. 2014 ఏఈఖ ప్రకారం మానవాభివృద్ధి సూచీలో 187వ స్థానం పొందిన దేశం? 1) స్వీడన్ 2) నైజర్ 3) అమెరికా 4) బ్రెజిల్ 8. ఆరోగ్యంపై తలసరి ప్రభుత్వ వ్యయం ఏ రాష్ర్టంలో తక్కువ? 1) రాజస్థాన్ 2) జమ్మూ కాశీర్ 3) మధ్యప్రదేశ్ 4)గోవా సమాధానాలు 1) 1; 2) 4; 3) 1; 4) 1; 5) 4; 6) 1; 7) 2; 8) 4. -
వందేళ్ల ఓటరు చైతన్యం
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. హైదరాబాద్‌లోని ఓ పోలింగ్ బూత్... ఓటర్లు వరుసలో నిలబడి ఓట్లు వేసి బయటకు వస్తున్నారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులున్నారు. విశేషం ఏమిటంటే, ఆ ముగ్గురూ మూడు తరాల ప్రతినిధులు.101 ఏళ్ల నారాయణ స్వామి, ఆయన కుమారుడు, మనుమరాలు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి ఇప్పటి దాకా విడవకుండా ఓటు వేస్తున్న శతాధిక చైతన్యశీలి నారాయణ స్వామిని కదిలిస్తే... సామాజిక అభివృద్ధి! స్వాతంత్య్రం తరవాత భారతదేశం చాలా అభివృద్ధి చెందింది. రిజర్వేషన్లు మంచి ఫలితాన్నే ఇచ్చాయి. సమాజంలో అన్ని వర్గాల్లోనూ విద్యాప్రమాణాలు, జీవనప్రమాణాలు మెరుగుపడ్డాయి. మా చిన్నతనంలో భూస్వాములు... పనివాళ్లను ఓటు వేయనివ్వకుండా కొట్టాల్లో దాచేసేవారు. ఎస్.సి. లకు కేటాయించిన స్థానాల్లో తమ పాలేర్లను నిలబెట్టి వారిని నామమాత్రంగా ఉంచేసేవారు. ఆ స్థితి నుంచి ప్రతి ఒక్కరికీ తమ ప్రతినిధిని ఎన్నుకోవడంలో స్వేచ్ఛ వచ్చింది. మేము హైస్కూల్‌కి ఏడు మైళ్లు నడిచివెళ్లాం. ఈ తరం ఇంటర్నెట్ సాయంతో ఇంట్లో కూర్చునే ప్రపంచాన్ని చూసేస్తోంది. జ్ఞానం మన అరచేతిలోకే వచ్చేసింది. రవాణా సులువైంది. అప్పటితో పోలిస్తే చాలానే అభివృద్ధి జరిగింది. కంప్యూటర్ ముందు కూర్చుని ఫేస్బుక్లో నాయకుల కామెంట్లకు లైక్‌లు కొట్టే యువత పోలింగ్‌బూత్ వైపు అడుగు వేయట్లేదు. అలాంటిది ఈ వందేళ్ల పౌరుడు ఓటేయడానికి వచ్చాడు. తనతోపాటు కొడుకును తీసుకురావడం సరే... మనుమరాలు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా ప్రేరణగా నిలిచారీయన. ఈ సందర్భంగా మువ్వా నారాయణస్వామి పంచుకున్న అనుభవాలు... గ్రామంలో చైతన్యం! ‘‘మాది గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర నరసాయపాలెం. మా గ్రామంలో సామాజిక చైతన్యం ఎక్కువే. ఇందుకు ఓ ఉదాహరణ... 1952- 55 మధ్య సంగతి ఇది. జాతీయ కాంగ్రెస్ పార్టీ గురించి, రాజకీయ విధానాల గురించి గ్రామస్థులకు వివరించే ప్రయత్నంలో మేధావులు ఊరూరికీ వచ్చారు. మా ఊరికీ ఇద్దరు న్యాయవాదులు వచ్చారు. వాళ్లు ఊరిపొలిమేరలో పశువుల కాపర్లతో మాటలు కలిపారు. అప్పుడు మా గ్రామంలో పశువులు కాసుకునే వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఆ లాయర్లు బదులు చెప్పలేకపోయారు. నిరక్షరాస్యుల్లోనే ఇంత చైతన్యం ఉంటే చదువుకున్న వాళ్లతో చర్చించడం తమకు సాధ్యమయ్యే పని కాదని ఊళ్లోకి రాకుండానే వెనక్కివెళ్లారు. అదే చైతన్యంతో మేము గ్రామంలో పాతుకొని పోయి ఉన్న మారెమ్మ జాతరలో జంతుబలిని ఆపేశాం. వేదాలు చదివిన త్రిపురనేని రామస్వామి చౌదరి, కొల్లూరి రాఘవయ్యలతో గ్రామంలో తర్కం నడిపి పొత్తర్లు వంటి క్రతువులను ఆపేశాం’’ అన్నారు నారాయణస్వామి. యోధుల ప్రసంగాలు... రచనలు! జాతీయోద్యమం దిశగా తనను ప్రభావితం చేసిన అంశాలనూ గుర్తు చేసుకున్నారాయన. ‘‘వీర సావర్కర్ రాసిన ‘ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ చదివాను. మార్క్స్, వివేకానందుని రచనలు చదివాను. మా చిన్నప్పుడు వేసవిలో గ్రామాల్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. చండ్రరాజేశ్వరరావు గారి దగ్గర డ్రిల్ నేర్చుకోవడం నాకు బాగా గుర్తుంది. కమ్యూనిస్టు నాయకులు వచ్చి విప్లవాల గురించి బోధించేవారు. వివిధ దేశాల విప్లవాలను చదివాను. ఆ ప్రభావంతో ఇంటర్ చదివేటప్పుడు బందరులో ఎన్నికల్లో చల్లపల్లి రాజాకు వ్యతిరేకంగా ప్రచారం చేశాం’’ అన్నారు. ప్రజా జీవితం నుంచి అజ్ఞాతం లోకి... స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కమ్యూనిస్టులకు పోరాటం తప్పలేదు. 1947లో మనకు ప్రకటించింది సంపూర్ణ స్వాతంత్య్రం కాదు, అధినివేశ ప్రతిపత్తి మాత్రమేనని, భారతీయులు బ్రిటన్ రాణి పాలనలో ఉన్నట్లేనని ఊరూరా ప్రచారం చేశాం. 1948వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మా నరసాయపాలెంలో నేను ప్రసంగిస్తున్నప్పుడు పోలీసులు వచ్చారు. అప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాను. ఆ తర్వాత జైలు జీవితం అనుభవించాను. వీటన్నింటినీ దాటుకుని 1950లలో మా బాపట్లలో స్వయంగా ఎన్నికలు నిర్వహించిన బృందం మాది. మా ఊరి గ్రంథాలయాన్ని పోలీస్ స్టేషన్‌గా మార్చింది ప్రభుత్వం. అప్పుడు మేము మరో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాం. మా నాన్న ప్రజాఉద్యమాలు, రాజకీయాల్లో ఎంత చొరవగా ఉన్న ఫర్వాలేదు, కానీ అసెంబ్లీకి మాత్రం పోటీ చేయవద్దు అన్నారు. ఎందుకన్నారో తెలియదు, ఆ మాట ప్రకారం నేను పోటీ చేయలేదు’’ అన్నారు. ఎందుకు ఉద్యమించామో! ప్రజల నిరాసక్తత ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదంటారు రాజనీతిజ్ఞులు. ఆ స్తబ్ధత పోవాలంటే ఓ నిశ్శబ్ద విప్లవం రావాల్సిందే. కానీ మనదేశంలో విప్లవం వచ్చే అవకాశాల్లేవంటారు నారాయణస్వామి. ‘‘పాశ్చాత్యులు వచ్చిన వందల యేళ్లకు కానీ జాతీయోద్యమం మొదలు కాలేదు. అప్పట్లో పోలీసులు వస్తే మా ఇంటి కుక్క వాళ్లను అడ్డుకుంది. దానిని తుపాకీతో మోది చంపారు. వెనుకవైపు నుంచి వచ్చిన పోలీసులను మా ఎడ్లు ఢీ కొన్నాయి. పోలీసుల విధ్వంసంతో ఒక ఎద్దుకు పిచ్చిపట్టింది, మా నాన్న పక్షవాతంతో మంచం పట్టారు. ఇప్పటి పరిస్థితులను చూస్తుంటే అప్పుడు మేము ఉద్యమించినది ఎందుకో అర్థం కావట్లేదు’’ అన్నారు కొంత నిర్లిప్తంగా. క్రియాశూన్య జ్ఞానంతో సున్నా! గ్రామాలు రాజకీయంగా చైతన్యవంతం అయ్యాయి. గ్రామీణులు ప్రతి పరిణామాన్నీ నిశితంగా గమనిస్తున్నారు. కానీ ఊళ్లో అరుగుల మీద కూర్చుని ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎందుకు చేయలేదు అని తూర్పారబట్టడానికే పరిమితమవుతున్నారు. సొంతూళ్లో పాల డెయిరీ ఎలా నడుస్తోంది? చౌక దుకాణంలో సరుకులు సరిగా ఇస్తున్నారా? పంచాయితీ ఎలా నడుస్తోంది... అని చూడడం లేదు. క్రియాశూన్యమైన కొండంత జ్ఞానంతో ఏదీ సాధించలేం, క్రియాశీలకంగా గోరంత జ్ఞానం చాలు... అనేటప్పుడు ఆయన మాటల్లో సమాజానికి ఇంకా ఏదో చేయాలనే తాపత్రయం కనిపించింది. నాటి జ్ఞాపకాలతోనే... ‘‘రెండవ ప్రపంచ యుద్ధకాలంలో శత్రుదేశాల సైన్యం మనదేశంలోకి చొచ్చుకు వస్తోందనే సమాచారంతో మాకు ఆత్మరక్షణ పద్ధతులు నేర్పించారు. చేతి రుమాలులో కొండరాళ్లు కట్టే వాళ్లం. శత్రువులు వస్తే ఆ రాళ్ల మూటను వడిసెలాగా తిప్పి విసిరితే అక్కడికక్కడే కింద పడిపోతారు. అలా ఏవేవో నేర్చుకున్నాం. ఇప్పుడు అర్థం కాని పుస్తకం తీసుకుని కుస్తీ పట్టడమే నా వ్యాపకం’’ అన్నారాయన నవ్వుతూ. ప్రతిరోజూ ‘ది హిందూ’, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ దినపత్రికలు చదువుతారు నారాయణస్వామి. ఫ్రంట్‌లైన్ మ్యాగజైన్‌ను క్రమం తప్పరు. వీటితోపాటు ప్రాచీన భారతీయ సంస్కృతి, సామాజిక రచనలనూ చదువుతారు. ప్రజాస్వామ్యం అంటే... ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధుల ద్వారా పరిపాలన సాగడం అని మాత్రమే మనకు పుస్తకాలు తెలిపాయి. అయితే ఆ ప్రతినిధులు ప్రజలతో మమేకమయ్యేవారే అయి ఉండాలని మరో భాష్యం చెప్పారు నారాయణస్వామి. ఈయన చదివిన పుస్తకాలన్నీ చదవడం ఎందరికి సాధ్యమవుతుందో కానీ, ఆయనే ఓ పుస్తకం. ఈ పుస్తకాన్ని చదవగలిగితే చాలా విషయాలు తెలుస్తాయనడంలో సందేహం లేదు. - వాకా మంజులారెడ్డి, ఫొటోలు : ఎస్ ఎస్ ఠాకూర్ మనలో ఒకరైతే! ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులు నియోజకవర్గ ప్రజలకు తెలిసిన వారైతే ఓటు వేయాలనే ఉత్సాహం వస్తుంది. ప్రజల్లో మమేకమై నియోజకవర్గంలోని ప్రజల కోసం పనిచేసిన వాళ్లు, కనీసం మాటసాయానికి అందుబాటులో ఉండే వాళ్లు నిలబడితే అందరూ ఓటు వేస్తారు. అలా కాకపోతే ఎన్నికల పట్ల ఆసక్తి చూపించలేరు. ఇందుకు బాధ్యత అంతా రాజకీయ పార్టీలదే. - మువ్వా నారాయణస్వామి -
పనుల పందేరం
రాజాం, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వ, ప్రజా ప్రతినిధుల పదవీకాలం దాదాపు ముగిసిపోయింది. కొద్దిరోజుల్లోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. మరోవైపు రాష్ట్ర విభజన నేపథ్యంలో ముఖ్యమంత్రి రాజీనామా చేయడంతో అటు ప్రభుత్వం.. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ అంపశయ్య మీదకు చేరుకున్నాయి. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీల వైపు క్యూ కడుతున్నారు. దీంతో బెంబేలెత్తిన రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేజారిపోకుండా తాయిలాల ఎర వేస్తున్నారు. పనుల పందేరం చేపట్టి వారిని కట్టడి చేసే ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. హడావుడిగా ఎమ్మెల్యే కోటా నిధుల నుంచి సామాజిక అభివృద్ధి పనుల కోసం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు రూ.8.93 లక్షలు కేటాయించారు. ఈ మేర కు ఆర్సి నెం.49/12/ సిడిపి/ఎంఎల్ఏక్యూ/ఆర్జెఎం/17-2-14తో నిధులు విడుదల చేస్తు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పనులను నామినేషన్ పద్ధతిలో చేయిం చాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాజాం మండలం కంచరాం-డిఆర్వలస రోడ్డులో కల్వర్టు నిర్మాణానికి రూ.1.60 లక్షలు, వి.ఆర్.అగ్రహారంలో పైపులైన్ల విస్తరణకు రూ.50 వేలు, అంతకాపల్లిలో బోరువెల్ ఏర్పాటుకు రూ.60 వేలు, బొద్దాంలో అదనపు విద్యుత్ పోల్స్ ఏర్పాటుకు రూ.14,776, రాజయ్యపేటలో ఎల్.టి.లైన్ ఏర్పాటుకు రూ.32,416, బొద్దాంలో ఎల్.టి.లైన్ పోల్ మార్చడానికి రూ.5,714, 11 కె.వి.లైన్ మార్చడానికి రూ.90,305, మారేడుబాక, ఎం.జె.వలసగ్రామాల్లో వీధిలైట్ల ఏర్పాటుకు రూ.50 వేలు చొప్పన మంజూరు చేశారు. వంగర మండలం కొట్టిశలో మత్య్సకారుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.లక్ష, సంతకవిటి మండలం గోళ్లవలస జంక్షన్ వద్ద బస్సు షెల్టర్ నిర్మాణానికి రూ. 2 లక్షలు, మిర్తివలస, మండాకురిటిలలో రెండు బోర్‌వెల్స్ నిర్మాణానికి రూ.1.20 లక్షలు మంజూరు చేశారు. రేగిడిలో గోపెంపేటలో మరో నిర్మాణానికి రూ. 60 వేలు మంజూరు చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పనులను ద్వితీయ శ్రేణి నాయకులకు కట్టబె ట్టడానికి చకచక సన్నాహాలు సాగుతున్నాయి. అధికారం చివరి దశలో మంజూరైన ఈ పనులను దక్కించుకోవడానికి కాంగ్రెస్ నాయకులు పైరవీలు ప్రారంభించారు. -
ప్రయత్నం ప్రకాశించింది!
ప్రభుత్వం తన విధికి ఆమడ దూరంలో నిలిచిన చోట కొంతమంది వ్యక్తులు బాధ్యతలను తీసుకొంటుంటారు. తమదైన శైలిలో వాటిని నిర్వర్తిస్తుంటారు. కటక్‌కు చెందిన ప్రకాశ్‌రావు కూడా ఇలాంటివారే. కటక్‌లోని ఒక మురికివాడను ఈయన సంస్కరిస్తున్న విధానం అభినందనీయం. కటక్‌లోని బక్సీబజార్ అసాంఘిక శక్తులకు ఆటపట్టులాంటిది. ఇక్కడ ఉండే వారిలో ఎక్కువమంది తాగుబోతులు, మత్తుపదార్థాలకు బానిసలుగా మారినవారే! అక్కడ యువత వక్రమార్గంలో నడుస్తుంటాన్ని గమనించి.. వారిని మొక్కగా ఉండగానే సరిచేయాల్సిందన్న విషయాన్ని గ్రహించి... రేపటి పౌరులైన బాలలపై దృష్టిపెట్టారు ప్రకాశ్‌రావు. మరి వారిని స్కూల్లో చేర్పిద్దామంటే తల్లిదండ్రుల సహకారం, దగ్గర్లో స్కూలు రెండూ లేవు. దీంతో తనే స్వయంగా ఒక స్కూల్‌ను ఏర్పాటు చేశారీయన. 2002లో ‘ఆశా ఆశావర’ అనే స్కూల్‌ను స్థాపించారు. రెండు గదులున్న తన ఇంటిలో ఒక గదిలో చిన్నపిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు. స్థానికంగా ఒక టీస్టాల్ నడిపే ప్రకాశ్‌రావు ప్రయత్నానికి మొదట్లో నలుగురు పిల్లలు కలిసి వచ్చారు. కొద్దికాలంలోనే మరో 25 మంది పిల్లలు తోడయ్యారు. సంఖ్యాపరంగా అభివృద్ధి చెందుతున్న పాఠశాలను నడపడానికి నిధుల అవసరం పెరిగింది. ఆ సమయంలో ప్రకాశ్‌రావు తన టీ స్టాల్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని స్కూల్ కోసమే వెచ్చించేవారట. దీంతో ఈయన ప్రయత్నానికి మంచి గుర్తింపు వచ్చింది. స్థానికంగా ఉండే ఒక ట్రస్ట్ వాళ్లు స్కూల్‌కోసం ఒక బిల్డింగ్ కట్టించారు. ఇప్పుడు ప్రకాశ్‌రావు స్కూల్లోని స్ట్రెంగ్త్ 60 మంది. ప్రస్తుతం నలుగురు టీచర్లు పనిచేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు ఈ స్కూల్‌కు గుర్తింపును ఇచ్చారు. సర్వశిక్ష అభియాన్ కింద ప్రకాశ్‌రావు స్కూల్‌కు ప్రభుత్వం తరఫున ఫండ్స్ ఇస్తున్నారు. ఈ పాఠశాల స్లమ్‌లో చాలా మార్పులు తీసుకు వచ్చింది. ఇప్పుడు ఆ మురికివాడలో వక్రమార్గంలో నడిచే పిల్లల కన్నా... బడి బాట పట్టిన పిల్లలే ఎక్కువమంది ఉన్నారు. చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కన్నా చిరుదివ్వెను వెలిగించడం మిన్న అన్న మహాకవి మాటలను ప్రకాశ్రావులా అందరూ ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించాలి. అప్పుడే సామాజిక అభివృద్ధి.