సేవతోనే సమాజంలో గుర్తింపు | recognition through service | Sakshi
Sakshi News home page

సేవతోనే సమాజంలో గుర్తింపు

Published Sat, Aug 27 2016 11:17 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

గూడెంలో తాగునీటి కుళాయిని ప్రారంభిస్తున్న ఎస్పీ - Sakshi

గూడెంలో తాగునీటి కుళాయిని ప్రారంభిస్తున్న ఎస్పీ

– ప్రతి చెంచుగూడెం నుంచి ఐఏఎస్, ఐపీఎస్‌ అవ్వాలి
– రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలి
– చెంచుగూడేల అభివద్ధికి కషి
– ఎస్పీ ఆకే రవికృష్ణ
 
జూపాడుబంగ్లా/కొత్తపల్లి: సేవతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. డీఎస్పీ సుప్రజ దత్తత గ్రామమైన శివపురం చెంచుగూడెంలో శనివారం ఎస్పీ పర్యటించారు. ఈ సందర్భంగా గూడెం మహిళలు సాంప్రదాయ నత్యంతో ఎస్పీ, డీఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ చెంచుగూడెంలో కలియతిరిగి గూడెంలో నిర్మించిన బీటీ రహదారులు, తాగునీటి కుళాయిలు, నీటితొట్లు, ఆశ్రమ పాఠశాలలో తాగునీటి కుళాయిల ఏర్పాటు వంటి మౌళిక వసతులను పరిశీలించి ప్రారంభించారు. అనంతరం గూడెంలోని ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌సొసైటీ వారి సహకారంతో 92 మంది కుటుంబాలకు వంటింటి సామగ్రి, దోమతెర, దుప్పటి, టవాళ్లు, అందజేశారు. అలాగే పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున స్కూల్‌ డ్రస్సులను పంపిణీ చేశారు. అనంతరం నలుగురు గర్భిణిలకు శ్రీమంతం నిర్వహించి వారికి చీరె,సారెలను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ చదువుకుంటే  ఉన్నత స్థానాలకు చేరుకోవడం ఎంతో సులువన్నారు. ప్రతి గూడెం నుంచి ఒక ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలన్నారు. ప్రభుత్వం గిరిజనులకు కల్పించిన రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శివపురం గూడెం అభివద్ధికి తనవంతు సహకారం అందిస్తానాన్నరు. ఓ రోజు గూడెంలో రాత్రి బసచేస్తానని ఆయన గూడెం వాసులకు హామీనిచ్చారు.  కార్యక్రమంలో సీఐ శ్రీనాథ్‌రెడ్డి, దివాకర్‌రెడ్డి, ఎస్‌ఐలు సుబ్రమణ్యం, శివాంజల్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డి, రాజ్‌కుమార్, రమేష్, శివశంకర్‌నాయక్, ముచ్చుమర్రి పీఎస్‌ఐ నరసింహ, సర్పంచి సంతోషమ్మ, జడ్పీటీసీలు పురుషోత్తంరెడ్డి, యుగంధర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 
 
ఎక్కడున్నా శివపురం గూడెంను మరవను: డీఎస్పీ సుప్రజ
విధి నిర్వహణలో తాను ఎక్కడున్నా శివపురం గూడెంను మరవనని, వీలున్నప్పుడల్లా ఇక్కడికి వస్తానని డీఎస్పీ సుప్రజ తెలిపారు.  ఎస్పీ ఆకె రవికష్ణ ఆదర్శంతోనే తాను ఈ గూడెంను దత్తత తీసుకున్నానన్నారు. అప్పటి నుంచి ప్రతి పదిహేను రోజులకోసారి గూడెం ప్రజలతో చర్చించి వారికి కావాల్సిన వసతుల కల్పనకు కషి చేశానన్నారు. ఈ మేరకు గూడెంలో బీటీరోడ్లు, తాగునీటి కుళాయిలు, విద్యుత్‌ సౌకర్యం, పాఠశాలలో తాగునీటి కుళాయిలు, దుస్తువులు వంటి సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement