ఉట్నూర్, న్యూస్‌లైన్ : సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులను తిరిగి విధుల్లోకి తీసుకునేంత వరకు ఈ నెల 16 నుం చి ప్రారంభం కానున్నా పదో తరగతి స్పాట్‌ను జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయులు బహిష్కరిస్తున్నట్లు ఐక్యఉపాధ్యాయ సంఘాల(జాక్టో) స్పష్టం చేసింది. ఆదివారం మండల కేంద్రంలోని ప్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పదో తరగతి పరీక్షల్లో ఇన్విజిలేషన్ విధులు నిర్వహించిన ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి సస్పెండ్ చేయడం సరైంది కాదన్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఈ సమావేశంలో జాక్టో తరుఫున డీటీఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుగు శామ్యూల్, మండల కార్యదర్శి బంకట్‌లాల్, టీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్ట లక్ష్మణచారి, మండల శాఖ అధ్యక్షుడు దాసరి రాజన్న, ఎస్‌టీయూ మండల శాఖ అధ్యక్షుడు రాథోడ్ గణేష్, కార్యదర్శి ఆత్మరాం, పీఆర్‌టీయూ మండల శాఖ అధ్యక్షప్రధాన కార్యదర్శులు దినేష్, విజయ్‌కుమార్ నాయకులు పాల్గొన్నారు.
రెబ్బెనలో..
రెబ్బెన : ఈనెల 16 నుంచి నిర్వహించబోయే ప దో తరగతి స్పాట్ వ్యాల్యుయేషన్‌ను 14 ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరిస్తున్నట్లు పీఆర్ టీ యూ మండల శాఖ ప్రధాన కార్యదర్శి రవికుమార్ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ఇటీవల పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడటంతో ఇన్విజిలేషన్ చేస్తున్న 24 మంది ఉపాధ్యాయులను బాధ్యులను చేస్తూ కలెక్టర సస్పెండ్ చేశారని అన్నారు.
దీనికి నిరసనగా ఈనెల 16 నుంచి జరగబోయే స్పాట్ వ్యాల్యుయేషన్‌ను బహిష్కరిస్తున్నామని అన్నా రు. స్పాట్ వ్యాల్యుయేషన్‌కు వెళ్లే ఉపాధ్యాయులకు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బలవంతంగా రిలీవ్ చేయరాదని అ న్నారు. సస్పెండ్‌కు గురైన ఉపాధ్యాయుల వెం ట 14 ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయని అ న్నారు. ఈనెల 15 లోగా ఉపాధ్యాయులపై ఉ న్న సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని లేని పక్ష్యంలో ఆ నిరాహార దీక్ష కైన సిద్ధమని హెచ్చరించారు.
పది స్పాట్‌ను బహిష్కరిస్తాం..
Published Mon, Apr 14 2014 2:07 AM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM
Advertisement
Advertisement