వాతావరణ స్పృహ-నిస్పృహ
అమెరికాలో సాధారణ వ్యక్తుల నుంచి ప్రముఖుల దాకా అందరూ వాతావరణ మార్పు దుష్ఫలితాలను గుర్తించ నిరాకరించడం అక్కడి శాస్త్రజ్ఞులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ నిస్పృహ శాస్త్రప్రపంచాన్ని వాతావరణంలో మార్పులపై పరిశోధనలకే దూరం చేస్తుండటం విషాదకరం.
రెండే ళ్ల క్రితం అమెరికాలో ఒక పరిశోధకురాలు వృత్తి పట్ల తీవ్ర ఆశాభంగంతో తాను చేస్తున్న పరిశో ధనను వదులుకుని దేశం విడిచి వెళ్లిపోయారు. ఆమె ఆశాభంగానికి రీసెర్చ్ గైడ్‌తో విభేదాలు, వివ క్ష, అశక్తత, వృత్తిపట్ల అనాసక్తి... ఇవేవీ కారణం కాదు. ప్రపంచాన్ని కలవరపరుస్తున్న ఒక కీలక సమ స్యపై ఏ దేశం తరపున తాను పరిశోధన చేస్తోందో ఆ దేశంలో ఎవ్వరూ ఆ అంశాన్ని పట్టించుకోకపోవ డమే ఆమె నిరాశకు కారణం. ఆమె పేరు కెమెల్లి పరమేశన్. ఆమె చేస్తున్న పరిశోధన వాతావరణ మార్పు. అమెరికా సమాజం, ప్రభుత్వం, కీలకమైన ఫండింగ్ వ్యవస్థలు ఇలా ఎవరూ గుర్తించని అంశం పై తానెందుకు పరిశోధన చేస్తున్నట్లు అనే నిస్పృహ లోంచే ఆమె తన రీసెర్చ్‌ని వదులుకున్నారు.
కానీ ఆమె అనామక పరిశోధకురాలు కాదు. వాతావరణ మార్పుపై ప్రపంచ ప్రభుత్వాల ప్యానె ల్ తరపున రూపొందించిన మూడవ అంచనా నివే దిక కీలక రచయితగా ఆమె, అమెరికా పూర్వ ఉపా ధ్యక్షుడు అల్‌గోర్‌తోపాటు 2007లో నోబెల్ శాంతి బహుమతి పంచుకున్నారు. భూమండలంలోని ప్రాణులపై వాతావరణ మార్పు ప్రభావాలపై చేసిన కృషికి ప్రపంచంలోని 27 మంది సాహస చింతనా పరుల జాబితాలో ఆమెకు అట్లాంటిక్ పత్రిక చోటు కల్పించింది. ఈ గుర్తింపులేవీ ఆమె పరిశోధనకు ఊతం ఇవ్వలేకపోయాయి. యావత్ ప్రపంచానికీ కలగనున్న పెనుముప్పుపై అమెరికాలో ఏ ఒక్కరూ దృష్టి పెట్టకపోవడంపై ఆమె విసిగిపోయారు.
తానెందుకీ పరిశోధన చేస్తున్నట్లు అన్న ప్రశ్న వెంటాడగానే ఆమె అమెరికాను విడిచిపెట్టి భర్త స్వస్థలమైన ఇంగ్లండ్‌కు వెళ్లిపోయారు. వాతావరణ మార్పు నిజంగానే సంభవిస్తోందనే అంశాన్ని అకడ మిక్ చర్చల్లో, బహిరంగ సభల్లో సభికులకు అర్థం చేయించడానికే తనకు సగం సమయం పట్టేదని కెమెల్లీ వాపోయారు. ఇప్పుడామె ఇంగ్లండ్‌లోని ప్లి మౌత్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
విషాదకరమైన అంశం ఏమంటే ఈ ఉదంతం ఒక్క కెమెల్లి పరమేశన్‌కే పరిమితమైనది కాదు. భూతాపం ఇప్పటికే మానవ మనస్తత్వంపై తీవ్ర ప్రభావం కలిగిస్తోంది. వాతావరణ మార్పుతో వస్తు న్న పెనుతుపానులు విధ్వంసకరంగా మారటం, దీర్ఘకాలిక కరువులు సంభవించడం వంటివి ఇప్ప టికే ప్రపంచ జనావళిని తీవ్ర నిస్పృహలోకి నెడుతు న్నాయి. విపత్తు అనంతర దుస్థితిని సహించలేక ఆత్మహత్యాధోరణులు ప్రబలుతున్నాయి. వాతా వరణ దుష్ఫలితాలను ప్రతిరోజూ పోగవుతున్న కొత్త డేటాతో పోల్చిచూస్తున్న శాస్త్రజ్ఞులు సైతం భావోద్వేగాలకు గురవుతున్నారు.
కానీ సామాన్య ప్రజానీకంతోపాటు దేశాధ్య క్షులు, పారిశ్రామికవేత్తలు, కీలక నిర్ణేతలు, ద్రవ్య సంస్థలు సైతం వాతావరణ మార్పుల దుష్ర్పభావా లపై శీతకన్ను వేస్తుండటం శాస్త్ర ప్రపంచాన్ని కలవరపెడుతోంది. యావత్ ప్రపంచం దీనివల్ల ఏం కోల్పోనున్నదో గమనిస్తూ ఉద్వేగానికి, ఒత్తిడికి గురికాని శాస్త్రవేత్త లేరని పరమేశన్ స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్న చికాకులపైనే యావత్ సమాజ చర్చ సాగుతోందని ఆమె ఆరోపణ. కానీ వాతావరణ విపత్తు ఫలితంగా వేల సంవత్సరాల పాటు ప్రాణులలో మార్పులు, ప్రభావాలు కలుగనున్న తరుణంలో.. సరైన సాకర్ సామగ్రిని కొనుక్కోవడం, స్కూలులో మర్చిపోయి న దానిపై ఆలోచించడం అనేది పరమ విచారకరం.
పైగా భవిష్యత్తుకు కలుగనున్న విపత్తు గురించిన సమాచారాన్ని ఎవరితోనయినా పంచుకుంటే దాన్ని తాము నమ్మలేమంటూ మొత్తం చర్చను నమ్మకా లు, అపనమ్మకాల జంజాటనగా మార్చేస్తున్నారు. ఇలా ఏ రకంగాను రానున్న ముప్పుపై అమెరికా సమాజం స్పందించకపోవడం శాస్త్రజ్ఞులను తీవ్ర నిస్పృహకు గురిచేస్తోంది. పైగా సైన్స్‌ను మత దృష్టి తో గుడ్డిగా వ్యతిరేకిస్తున్న వారు వాతావరణ మా ర్పు దుష్ఫలితాలపై శాస్త్రజ్ఞుల వాస్తవ భయాలను సైతం తోసిపుచ్చుతున్నారు.
భూమ్మీద జీవవైవిధ్యా న్ని ధ్వంసం చేస్తున్న విపరిణామాలపై తాము ప్రకటించే తాజా సమాచారాన్ని కూడా సైన్స్‌కు వ్యతిరేకంగా ప్రయోగించడం, సైన్స్‌నే తృణీకరించ డం అమెరికన్ పరిశోధకులపై ఒత్తిడులను కలిగి స్తోంది. పరిశోధన ద్వారా ప్రపంచ భవిష్యత్తుపై తమకు తెలుస్తున్న వాస్తవాలకు, సమాజం వాటి పట్ల ప్రతిస్పందిస్తున్న తీరుకు మధ్య అంతరాన్ని జీర్ణించుకోలేక ఆ వృత్తిలోని వారు మానసిక జాడ్యా నికి గురవుతున్నారు. పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య భేదాన్ని పెంచుతున్న ఈ పరిస్థితికి ధ్యానం, చికిత్సతోపాటు తమ పరిశోధన పట్ల నిజాయితీని విడిచిపెట్టవద్దని మానసిక నిపుణుల సలహా.
పైగా వాతావరణ పరిశోధనలో నిమగ్నమైన వారు తాము పడుతున్న భావోద్వేగ సంఘర్షణలను తమలోనే దాచుకోకుండా బహిరంగ పర్చాలని అప్పుడే ‘క్లైమేట్ సైక్’ అనే స్థితిని సులభంగా ఎదు ర్కోవచ్చని వీరంటున్నారు. అయితే శాస్త్రజ్ఞుల మాన సిక అఘాతాలకంటే, ప్రపంచ కార్బన్ ఉద్గారాలను మనం తగ్గించి తీరాలని గత ఆదివారం వాతావరణ మార్పుపై ప్రపంచ ప్రభుత్వాల ప్యానెల్ ప్రకటిం చిన చారిత్రక నివేదికను అమెరికా గుర్తించవలసిన అవసరం ఎంతైన ఉంది.
కె. రాజశేఖరరాజు