
భూమి మీద స్వచ్ఛంగా మిగిలిపోయిన ప్రాంతం 23 శాతం మాత్రమేనని తేల్చేశారు శాస్త్రవేత్తలు. మిగిలినదంతా మనిషి ప్రభావంతో నాశనమైందేనని వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ, క్వీన్స్‌ల్యాండ్ యూనివర్శిటీల అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఈ 23 శాతం స్వచ్ఛమైన భూభాగాన్నైనా కాపాడుకోగలిగితే వాతావరణ మార్పుల ప్రభావాన్ని మరింత సమర్థంగా ఎదుర్కొనే అవకాశముంటుందని వీరు హెచ్చరిస్తున్నారు.అమెరికా, కెనెడా, ఆస్ట్రేలియా, రష్యా, బ్రెజిల్‌లలో ఈ ప్రాంతాలు కేంద్రీకృతమై ఉన్నాయని జాన్ రాబిన్‌సన్ అనే శాస్త్రవేత్త చెప్పారు.
జన సాంద్రత, రవాణా సౌకర్యాలు తదితర ఎనిమిది అంశాలఆధారంగా మానవ ప్రభావం అతి తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించామని, 2009లో సేకరించిన ఈ వివరాల ఆధారంగా భూమి మీద స్వచ్ఛంగా మిగిలిపోయిన భూమి, సముద్ర ప్రాంతాల విస్తీర్ణం భూవిస్తీర్ణంలో 23 శాతమే అన్న అంచనాకు వచ్చామని ఆయన వివరించారు. భూతాపోన్నతికి కారణమైన కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చేసుకోవడంలో ఈ ప్రాంతాలు అత్యంత కీలకమైనవని అన్నారు. అయితేమానవ చర్యల కారణంగా భూమి మీద 77 శాతం, సముద్రాల్లో దాదాపు 87 శాతం ప్రాంతంలో పర్యావరణ అసమతౌల్యతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment