
సాహిత్యకుమార్
దేవరాపల్లి (మాడుగుల): దేవరాపల్లి మండలం మారేపల్లి గ్రామానికి చెందిన యువకుడు అవుగడ్డ సాహిత్య కుమార్ వైద్య రంగలో విస్తృత పరిశోధనలు చేస్తూ దేశవిదేశాలలో ప్రశంసలందుకుంటున్నాడు. విదేశాలలో ఒక పక్క ఉద్యోగం చేస్తూనే మరోవైపు పరిశోధన వైపు దృష్టి నిలిపాడు. ఇటీవల అమెరికాలో అత్యంత విశిష్ట త కల్గిన లారెన్స్ బర్కిలీ నేషనల్ లేబొరేటరీ రీసెర్చ్ అప్లియేట్‌గా దేవరాపల్లి మండలం మారేపల్లి గ్రామానికి చెందిన సాహిత్య కుమార్‌కు అరుదైన అవకాశం లభించింది. ఇటలీలో ఇటాలియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జినోవాలో నానో మెటీరియల్స్ ఫర్ బయో మెడికల్స్‌లో పరిశోధకునిగా పని చేస్తున్న సాహిత్య కుమార్‌కు ఇటీవల అమెరికా నుంచి ఆహ్వానం అందింది. ఇటలీలో పరిశోధకునిగా పని చేస్తున్న సాహిత్యకుమార్‌కు అక్కడి ప్రభుత్వం ప్రస్తుతం నెలకు సుమారు రూ.1.25లక్షల జీతం ఇస్తోంది.
ఇటలీలో పరిశోధకునిగా ఉన్న సమయంలో ఈ ప్రతిష్టాత్మక లారెన్స్ బర్కిలీ నేషనల్ లేబరేటరీ రీసెర్చ్ అప్లి్లయేట్‌గా అర్హత సాధించినందుకు ఇటలీ ప్రభుత్వం సైతం సాహిత్యకుమార్‌ను అభినందనలతో ముంచెత్తుతోంది. మారేపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు అవుగడ్డ అప్పలనాయుడు కుమారుడు సాహిత్య కుమార్ హైదరాబాద్‌లో ఇనిసి ్టట్యూట్ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్‌లో ఎంఎస్సీ పూర్తి చేశారు. అనంతరం ఇటలీలో సియోనో యూని వర్శిటీలో బయోమెడిసిన్ మరో ఎంఎస్‌సీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఇటలీలోనే క్యాన్సర్ మీద పీహెచ్‌డీ చేస్తుండగా పరిశోధనకు అయ్యే ఖర్చును ఇటలీ ప్రభుత్వమే భరిస్తోంది. లారెన్స్ బర్కిలీ నేషనల్ లేబరేటరీ రీసెర్చ్ అప్లియేట్‌గా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 20 నుం చి 30 మందికి మాత్రమే ఎంపిక చేస్తారు. భార తదేశం తరఫున ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాహి త్య కుమార్ ఎంపిక కావడం పట్ల విద్యావేత్తలు, విద్యార్థులతో పాటు స్వచ్ఛంద సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాలో మూడు నెలల పాటు శిక్షణ ఇస్తారని సాహిత్య కుమార్ తెలి పారు. ఈ ఏడాది జూన్ 15 నుంచి ప్రారంభమైన శిక్షణ సెప్టెంబర్ 15 వరకు ఉంటుంది.
చీఫ్ సైంటిస్ట్ ప్రోత్సాహం
ఇక్కడ శిక్షణకు హాజరైన సాహిత్య కుమార్‌కు ప్రస్తుతం నెలనెలా ఇస్తున్న జీతానికి రెట్టింపు చెల్లిస్తోంది. ఇంత మంచి అవకాశం రావడం పట్ల తన చీఫ్ సైంటిస్ట్ చెరిస్సా స్పెల్లీ గ్రీన్ ప్రోత్సాహం ఉందని సాహిత్య కుమార్ తెలిపారు. సాహిత్య కుమార్ సోదరీ శిరీష విజయనగరం జిల్లా వేపాడ మండల వ్యవసాయ అధికారి ఉద్యో గం చేస్తూ ఇటీవల యలమంచిలి వ్యవసా య పరిశోధన స్థానం శాస్త్రవేత్తగా నియమితులయ్యారు.
ఆనందంగా ఉంది
అమెరికాలో అత్యంత విశిష్ట కలిగిన∙లారెన్స్ బర్కిలీ నేషనల్ లేబరేటరీ రీసెర్చ్ అప్లియేట్‌గా మా కుమారుడు సాహిత్య కుమార్ ఎంపిక కావడం ఆనందంగా ఉంది. నేటి యువత, విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించి దేశానికి పేరు తీసుకురావలసిన అవసరం ఉంది.∙–అవుగడ్డ అప్పలనాయుడు,రిటైర్డ్ టీచర్, సాహిత్య కుమార్ తండ్రి, మారేపల్లి
Comments
Please login to add a commentAdd a comment