ప్రజలకు దూరంగా విద్య
మన సాంకేతిక సైన్యం సిలికాన్ వ్యాలీని సృష్టించింది. మన శాస్త్రవేత్తలే చాలా దేశాల ఆర్థికవ్యవస్థకు పట్టుగొమ్మలుగా నిలిచారు. కానీ మన దగ్గర తయారవుతున్న ఇంజనీర్లు మాత్రం రాష్ట్రాన్ని పట్టి పీడస్తున్న సమస్యలపై దృష్టి పెట్టడం లేదు.
పరిశోధన కుంటుపడ్డ సమాజంలో అభివృద్ధి అడుగంటుతుంది. పాలకులకు ముందుచూ పు కొరవడితే వాళ్లను సక్రమ మార్గంలో పెట్టి నడిపించేది విద్యారంగమే. ఆ విద్యారంగం కూడా నిర్వీర్యమైతే సమాజం పతనావస్థకే చేరుతుంది. భారతీయ సమాజం ఆ దశలోనే ఉందనిపిస్తుంది. భారతీయ సమాజం నేడు ప్రపంచ మార్కెట్ వ్యవస్థ గుప్పిట్లోకి వెళ్లి పోయింది. ప్రజల మధ్య అంతరాలు పెరిగి, వికృతరూపం దాల్చటంతో విషఫలితాలు వస్తున్నాయి.
ప్రజా సమస్యలు తీవ్రరూపం దాల్చి న ప్పుడు విద్యావేత్తలు స్పందించాలి. కానీ ఆ స్పందన కనిపించటం లేదు. రాష్ట్రంలో చేనేత కార్మికులు, విశ్వకర్మ కులస్థుల ఆత్మహత్యలు విపరీతంగా జరిగాయి. చేనేత వడ్రంగి, కం సాలి, కంచరి, కమ్మరి, శిల్పుల కులాలకు చెం దిన వారి మరణాలు ఇంకా ఎక్కువగా జరి గాయి. ఉన్నత విద్యారంగం దృష్టి పెట్ట వల సింది ఇలాంటి వాటిపైనే. దీనికి మారుగా విశ్వవిద్యాలయాలు బాగా డబ్బులు వచ్చే దూరవిద్యా వ్యవస్థ వైపు దృష్టి మళ్లిస్తున్నా యి. ఒకప్పుడు జిల్లాకు ఒకటో రెండో డిగ్రీ కాలేజీలుండేవి. ఇప్పుడు జిల్లాకొక విశ్వవి ద్యాలయం వచ్చింది. ఒక్కొక్క జిల్లాలో ఒక్కోరకమైన సమస్యతో ప్రజలు బాధప డుతున్నారు. ఏ నేలపైనైతే విశ్వవిద్యాలయం ఉందో అక్కడి సమస్యలను పట్టించుకోకపోతే వృద్ధి ఆగి పోతుంది.
మన సాంకేతిక సైన్యం సిలికాన్ వ్యాలీని సృష్టించింది. మన సాంకేతిక శాస్త్రవేత్తలే చాలా దేశాల ఆర్థికవ్యవస్థకు పట్టుగొమ్మ లుగా నిలిచారు. కానీ మన దగ్గర తయార వుతున్న ఇంజనీర్లు మాత్రం రాష్ట్రాన్ని పట్టి పీడస్తున్న సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. రాష్ట్రంలో 700కు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు న్నాయి. 300కి పైగా ఫార్మసీ కాలేజీ లున్నా యి. 24 విశ్వవిద్యాలయాలున్నాయి. ఇవిగాక తెలుగు యూనివర్సిటీ, ద్రవిడ యూనివర్సి టీలున్నాయి. హైదరాబాద్‌లో సెంట్రల్ యూ నివర్సిటీ, ట్రిపుల్ ఐఐటీలు లాంటి ప్రతిష్టాక సంస్థలున్నాయి. చేతివృ త్తులు చితికిపోతుం టే, ప్రత్యామ్నాయ మార్గాలను ఉన్నత విద్యా రంగం చూపే అవకాశం ఉంది. కానీ ఆ పని చేయడంలేదు. మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు పిల్లల దగ్గర ఫీజులను వసూలు చేసినంత శ్రద్ధగా చుట్టూ ఉన్న సమస్యల పరిష్కారాల కోసం పరిశోధన చేయించటంలేదు.
ఫార్మసీ కాలేజీలను అదే దుస్థితి వెంటాడు తున్నది. ఇది ఉన్నత విద్యారంగం చేస్తున్న నేరమే. పైగా ఇక్కడ చేతివృత్తుల వారి పరిస్థి తిని పట్టించుకోకుండా తక్కువ ధరకు వస్తు న్నాయని ఇంజనీరింగ్ కాలేజీల యాజమా న్యాలే చైనా నుంచి బల్లలు, కుర్చీలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఇక్కడ చైనా నుంచి వస్తు వులు దిగుమతి చేసుకోవటాన్ని తప్పు పట్ట డంలేదు. అక్కడి విద్యాలయాలే పరిశోధనలు చేసి చైనాలో ఉత్పాదనారంగాన్ని అభివృద్ధి చేసుకున్నారు. కానీ మన పరిశోధనా రంగాన్ని మన ఉన్నత విద్యారంగమే గొంతు పిసికి చం పుతున్నది. ఎంతో పేరున్న ఫార్మసీ కాలేజీలు న్నాయి. కానీ పేద వాని ఆరోగ్య అవసరాలకు సంబంధించి ఒక్క పరిశోధనా ఏ కాలేజీ చేయ లేదు. రాష్ట్రంలో దళిత, బహుజన, ఆదివాసీ, మైనార్టీ వర్గాల ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రజాసమస్యలకు పరి ష్కారాలు చూపే సంస్థలుగా నిలబడవలసిన ఉన్నత విద్యావ్యవస్థ కొడిగట్టుకుపోతే ప్రజా స్వామ్య వ్యవస్థకు ప్రమాదం కాదా? సాంకే తిక విశ్వవిద్యాలయాలు ఉత్పాదనా రంగంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఇంజనీరింగ్ చదువంటే శ్రమజీవుల చేతికి సాంకేతిక విద్యను అందిం చి ఉత్పాదనా రంగాన్ని వికసింపచేయడం.
విద్యపై పెట్టే పెట్టుబడులవల్ల శాస్త్ర, సాంకేతిక రంగాలే కాకుండా ఆర్ధికవ్యవస్థ కూడా అభివృద్ధి సాధిస్తుందని అమెరికా, జపాన్, దక్షిణ కొరియా వంటివి గ్రహించా యి. అమెరికా అయితే, 1850 ప్రాంతా ల్లోనే ప్రపంచశ్రేణి విద్యాలయాలను ఏర్పాటు చేసింది. సాంకేతికరంగంలో ఆ దేశాలన్నీ ఇప్పుడు అగ్రగాములుగా ఉంటున్నాయంటే అందుకు కారణం ఆ ముందుచూపే. మన దేశంలో ప్రామాణిక విద్య లభించడంలేదని ఈమధ్యే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వే వెల్లడించింది. ఇంజనీరింగ్ కళాశాలల వరకూ వెళ్లనవసరంలేదు. మనం ఎంతో గొప్పగా చెప్పుకునే ఐఐటీలు సైతం గత ఏడాదితో పోల్చినా ర్యాంకుల్లో నాసిరకంగా నిలిచాయి. ఆ ర్యాంకింగ్ విధానంలో లోపం ఉన్నదని మన ఐఐటీ డెరైక్టర్లు కొందరు అంటున్నమాట వాస్తవం కావొచ్చుగానీ మొత్తంగా పరిశోధ నలో మనం బాగా వెనకబడ్డామన్నది మాత్రం నిజం. పరిశోధనలనేవి సామాజిక అవసరా లకు అనుగుణంగా ఉంటే అవి ఉపయోగకర మవుతాయి. ఇందుకు అధ్యాపకవర్గంలోనూ, విద్యార్ధుల్లోనూ సృజనాత్మకత పెరగాలి. విద్యాసంస్థల నిర్వహణ అస్తవ్యస్థంగా ఉన్న చోట ఈ సృజనాత్మకత లభించదు. ఫలితంగా ప్రమాణాలు పడిపోతున్నాయి. నాలుగేళ్ల పాటు చదువుకున్న విద్యార్థి బయటికొచ్చి అటు సమాజానికిగానీ, ఇటు కుటుంబానికి గానీ ఉపయోగపడ లేకపోతున్నాడు.
-జూలూరు గౌరీశంకర్, అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక