పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం
Published Mon, Feb 24 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM
అరండల్‌పేట(గుంటూరు), న్యూస్‌లైన్: పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కలిసి రావాలని కలెక్టర్ ఎస్ సురేశ్‌కుమార్ పిలుపునిచ్చారు. గుంటూరు మల్లిఖార్జునపేటలోని పట్టణ ఆరోగ్యకేంద్రంలో ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండేళ్లుగా దేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్యసంస్థ గుర్తించిం దన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 4.33 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం 2,500 శిబిరాలు, 91 సంచార బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. 2000 సంవత్సరం నుంచి పోలియో రహిత జిల్లాగా గుంటూరు నిలిచిందన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో రెండేళ్లు ప్రపంచవ్యాప్తంగా పల్స్‌పోలియో కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మేయర్ కొల్లి శారద, ఇన్‌చార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నాగమల్లేశ్వరి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎం.సుహాసిని, డాక్టర్ పద్మావతి పాల్గొన్నారు.డీఎంహెచ్‌వో కార్యాలయంలో జేసీ.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన పల్స్‌పోలియో కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. స్వచ్చందసంస్థల ప్రతి నిధు లు ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ వైద్యాధికారి వై.కామేశ్వరప్రసాద్, డిప్యూటీ డెమో శ్రీరాముడు, లయన్స్‌క్లబ్ ఆఫ్ మెల్విన్‌జోన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు
Advertisement
Advertisement