రాక్స్ పేరిట వీకెండ్స్ వాక్,
అక్షరాళ్ల బడి
రాక్ సొసైటీ గుర్తింపు పొందిన ఉర్దూ విశ్వవిద్యాలయంలోని పత్తర్ కే దిల్, ఏక్‌తా మే తాకత్ హై పేర్లు కలిగిన రెండు బండరాళ్లకు మాత్రం 2500 మిలియన్ల ఏళ్ల చరిత్ర ఉందని, దక్కన్ పీఠభూముల్లో భాగం అని చెబుతున్నారు. ముఖ్యంగా నాలుగు బండరాళ్లలో రెండు రాళ్లు పక్కపక్కనే ఉండడాన్ని గుర్తించి ఈ రాళ్లకు ‘పత్తర్‌కే దిల్’ అని నామకరణం చేశారు. రాళ్లన్నీ ఒకేచోట ఉండడంతో ఏక్‌తా మే తాకత్ హై (యునైటెడ్ వి స్టాండ్) అని నామకరణం చేశారు. అలాగే మరోచోట ఉన్న రాళ్లకు కూడా అనేక్ తా మే ఏక్‌తా (యూనిటీ ఇన్ డైవర్సిటీ) అని కూడా పిలుస్తున్నారు.
రాక్స్ పేరిట వీకెండ్స్ వాక్
∙విభిన్న రాష్ట్రాలు, భాషలు, కులాలు, మతాలకు చెందిన వారితో మినీ భారత్‌గా మారిన హెచ్‌సీయూలో విద్యార్థులలో ఐక్యత బలపడేలా చేసేందుకు హెచ్‌సీయూ ఎక్స్‌ప్లోరర్ పేరిట వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేశారు. ఈ గ్రూపు ద్వారా వీకెండ్స్‌లో వాక్‌లను నిర్వహిస్తున్నారు. హెచ్‌సీయూ క్యాంపస్‌లో మష్రూమ్ రాక్, వైట్ రాక్, టెంపుల్ రాక్, వర్జిన్ రాక్, వైట్ రాక్స్, హైరాక్స్, సాసర్ రాక్, కోన్ రాక్ కాంప్లెక్స్ ఇలా రకరకాల పేర్లతో ఈ బండరాళ్లను విద్యార్థులు పిలుస్తుంటారు.
హెచ్‌సీయూ, మనూ యూనివర్సిటీల్లో హెరిటేజ్ రాక్స్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ‘ఏక్‌తా మే తాకత్ హై’పేరుతో పిలిచే రాళ్లు
‘పత్తర్ కే దిల్.. ఏక్ తా మే తాకత్ హై.. అనేక్ తా మే ఏక్‌తా.. ‘మష్రూమ్ రాక్,.. వైట్ రాక్స్.. టెంపుల్ రాక్’లు హెరిటేజ్ రాక్స్‌గా గుర్తింపు పొందాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన భారీ బండరాళ్లకు పెట్టిన పేర్లు ఇవి. నగరంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న రాతి సంపద హెచ్‌సీయూ, మనూ ఉర్దూ యూనివర్సిటీల్లో ఉండడం విశేషం. నగరంలో గుర్తించిన హెరిటేజ్ రాళ్లలో హెచ్‌సీయూ ‘మష్రూమ్‌రాక్’ ఉంది. వీటికి శతాబ్దాల చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతుంటారు. వీటి గురించి భావితరాలకు తెలిసేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. హెచ్‌సీయూలో 2,300 ఎకరాలు, ‘మనూ’లో 200 ఎకరాలు కలిపి 2,500 ఎకరాలలో విభిన్న తరహాలో ఏర్పడిన భారీ బండరాళ్ల (రాక్స్)ను రక్షిస్తూ వస్తున్నారు.
– రాయదుర్గం
Comments
Please login to add a commentAdd a comment