హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో నిర్మాణం
గోష్పాద క్షేత్రంలో ఆరెకరాల స్థలంలో..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరం మరో ఆధ్యాత్మిక కట్టడానికి ముస్తాబవుతోంది. హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ‘హరే కృష్ణ హెరిటేజ్ టవర్’ పేరుతో 430 అడుగుల ఎత్తులో అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించనున్నారు. నార్సింగిలోని గోష్పాద క్షేత్రంలో ఆరు ఎకరాల స్థలంలో నిర్మించనున్నారు. శ్రీరాధా, కృష్ణుల అద్భుతమైన విగ్రహాలతో పాటు సీతారామచంద్రులు, గౌర నితాయి విగ్రహాలను ఈ దేవాలయంలో ప్రతిష్ఠించనున్నారు.
శ్రీనివాస గోవిందుడి కోసం పూర్తిగా రాతి నుంచి దేవాలయాన్ని చెక్కనున్నారు. ఈ ప్రాజెక్టులో కాకతీయులు, చాళుక్యులు, ద్రవిడ సంస్కృతి, విభిన్నమైన పురాతన కాలం నాటి దేవాలయ కట్టడాల సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. శ్రీకృష్ణ గోసేవ మండల్ ఈ ప్రాజెక్టుకు భూసేవక్‌లుగా వ్యవహరించనున్నారు. ఈ క్యాంపస్‌లో లైబ్రరీ, మ్యూజియం, థియేటర్, పిల్లలు, యువతకు ఆధ్యాత్మిక, సంస్కృతి, సంప్రదాయాలపై బోధనలు చేసేందుకు భగవద్గీత హాల్స్ నిర్మించనున్నారు.
ఇక, ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించి అనంత శేష స్థాపన కార్యక్రమం ఈ నెల 23వ తేదీన జరగనుంది. కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే హరేకృష్ణ మూమెంట్ చైర్మన్ శ్రీమధు పండిట్ దాస ప్రభుజీ, అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీసత్య గౌర చంద్ర దాస ప్రభు జీ తదితరులు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment