Tower
-
Hyderabad: ‘హరేకృష్ణ’ టెంపుల్.. 430 అడుగులు!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరం మరో ఆధ్యాత్మిక కట్టడానికి ముస్తాబవుతోంది. హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ‘హరే కృష్ణ హెరిటేజ్ టవర్’ పేరుతో 430 అడుగుల ఎత్తులో అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించనున్నారు. నార్సింగిలోని గోష్పాద క్షేత్రంలో ఆరు ఎకరాల స్థలంలో నిర్మించనున్నారు. శ్రీరాధా, కృష్ణుల అద్భుతమైన విగ్రహాలతో పాటు సీతారామచంద్రులు, గౌర నితాయి విగ్రహాలను ఈ దేవాలయంలో ప్రతిష్ఠించనున్నారు.శ్రీనివాస గోవిందుడి కోసం పూర్తిగా రాతి నుంచి దేవాలయాన్ని చెక్కనున్నారు. ఈ ప్రాజెక్టులో కాకతీయులు, చాళుక్యులు, ద్రవిడ సంస్కృతి, విభిన్నమైన పురాతన కాలం నాటి దేవాలయ కట్టడాల సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. శ్రీకృష్ణ గోసేవ మండల్ ఈ ప్రాజెక్టుకు భూసేవక్లుగా వ్యవహరించనున్నారు. ఈ క్యాంపస్‌లో లైబ్రరీ, మ్యూజియం, థియేటర్, పిల్లలు, యువతకు ఆధ్యాత్మిక, సంస్కృతి, సంప్రదాయాలపై బోధనలు చేసేందుకు భగవద్గీత హాల్స్ నిర్మించనున్నారు. ఇక, ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించి అనంత శేష స్థాపన కార్యక్రమం ఈ నెల 23వ తేదీన జరగనుంది. కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే హరేకృష్ణ మూమెంట్ చైర్మన్ శ్రీమధు పండిట్ దాస ప్రభుజీ, అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీసత్య గౌర చంద్ర దాస ప్రభు జీ తదితరులు పాల్గొననున్నారు. -
విలాసవంతమైన భవనం కట్టడం డ్రీమ్!..సడెన్‌గా మర్డర్ కేసులో..
అలికిడిలేని ఇళ్ల చుట్టూ హడలెత్తించే కథలల్లుకోవడం కొత్తేం కాదు. అందుకే చాలా పాడుబడిన భవనాలు ఇప్పటికీ మిస్టరీలుగా ప్రపంచాన్ని వణికిస్తుంటాయి. థాయ్‌లండ్ రాజధాని బ్యాంకాక్‌లో 49 అంతస్తులతో అసంపూర్ణంగా మిగిలిపోయిన ‘ఘోస్ట్ టవర్’ కూడా అలాంటిదే! దీని అసలు పేరు సాథోర్న్ యూనిక్ టవర్. ఇదొక దయ్యాల భవనంగా 1997 నుంచి 2014 వరకూ పుకార్లతో షికార్లు చేసింది. ఈ భవంతిలోని 43వ అంతస్తులో 2014 డిసెంబర్ 5న స్వీడిష్ టూరిస్ట్ మృతదేహం..ఈ పుకార్లకు సాక్ష్యాన్నిచ్చింది. 2014లో.. అప్పటికే 17 ఏళ్లుగా మూసే ఉంటున్న ఈ టవర్‌లో.. స్వీడిష్ టూరిస్ట్ ఉరి తాడుకు వేలాడటం స్థానికులను హడలెత్తించింది. ప్రపంచ మీడియాను కదిలించింది. నథాపత్ అనే 33 ఏళ్ల ఫొటోగ్రాఫర్.. మొదటగా ఈ భవనంలో స్వీడిష్ టూరిస్ట్ మృతదేహాన్ని గుర్తించాడు. 30 ఏళ్ల స్వీడిష్ టూరిస్ట్ జేబులో దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ సాయంతో నవంబర్ 10 థాయిలండ్కు వచ్చాడని.. అక్కడే ఓ గెస్ట్‌హౌస్‌ను అద్దెకు తీసుకున్నాడని తేలింది. మృతదేహం దొరికిన్నాటికే అతడు చనిపోయి ఐదు రోజులు అయ్యుండొచ్చని వైద్యనిపుణులు అంచనా వేశారు. కానీ మరణానికి అసలు కారణం స్పష్టం కాలేదు. అతని కలే ఈ భవనం.. 1990లో రంగ్సన్ టోర్సువాన్ అనే ప్రముఖ థాయ్ వాస్తుశిల్పి.. విలాసవంతమైన ‘కండోమినియం కాంప్లెక్స్’ కట్టాలని కలగన్నాడు. అతడు స్వయంగా డెవలపర్ కావడంతో ఆశపడినట్లే దీని నిర్మాణాన్ని అనుకున్న సమయానికి ప్రారంభించాడు. అయితే అనుకోకుండా 1993లో థాయ్ సుప్రీంకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి మర్డర్ కేసులో ఇరుక్కున్న టోర్సువాన్.. జైలుకెళ్లాల్సి వచ్చింది. ఆర్థిక కష్టాలు మొదలుకావడం, యజమాని జైల్లో ఉండటంతో 1997లోనే ఈ నిర్మాణం ఆగిపోయింది. అప్పటికే 80 శాతం పూర్తయిన ఈ టవర్.. అసంపూర్ణంగానే మూలపడింది. నాటి నుంచి నేటికీ ఆ భవనంలో ప్రేతాత్మలున్నాయని చాలామంది నమ్ముతారు. ఆ నమ్మకానికి స్వీడిష్ డెత్ మిస్టరీ మరింత బలం చేకూర్చింది. చివరికి టోర్సువాన్.. 2010లో నిర్దోషిగా బయటికి వచ్చాడు. దయ్యాలు, మూఢనమ్మకాల చుట్టూ తిరిగే కొందరు మాత్రం ఈ పాడుబడిన భవనం గురించి మాట్లాడుకునేటప్పుడు.. టోర్సువాన్ పతనానికి ఈ భవననిర్మాణమే కారణమని భావిస్తుంటారు. ఎందుకంటే ఆ స్థలంలో గతంలో శ్మశానవాటిక ఉండేదని, దాన్ని పూర్తిగా పూడ్చేసి టోర్సువాన్ ఈ టవర్ కట్టాడని చెప్పుకుంటారు. ఒకప్పుడు ఈ టవర్‌పైకి ఎక్కడానికి అడ్డదార్లను వెతికే ఔత్సాహికులు కొందరు ఇక్కడి సెక్యూరిటీ గార్డులకు లంచం ఇచ్చి మరీ లోపలికి వెళ్లి సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టేవారు. కానీ స్వీడిష్ టూరిస్ట్ మరణం తర్వాత సెక్యూరిటీ మరింత పెరిగింది. అలాగే 2015 నుంచి రంగ్సాన్ టోర్సువాన్ వారసుడు పన్సిత్ టోర్సువాన్.. టవర్‌పైకి ఎక్కి ఆన్లైన్లో ఫొటోలు షేర్ చేసేవారిపై కేసులు పెట్టడం మొదలుపెట్టాడు. దాంతో ఈ టవర్‌లోకి అడుగుపెట్టే సాహనం ఎవరూ చేయడం లేదు. ఏది ఏమైనా ఈ టవర్‌లో దయ్యాలు ఉన్నాయా? స్వీడిష్ టూరిస్ట్ ఎలా చనిపోయాడు? ఎవరైనా అతన్ని చంపి, అక్కడ ఉరితాడుకు కట్టేసి నేరం నుంచి తప్పించుకున్నారా? లేక దయ్యాలే దాడి చేశాయా? వంటివన్నీ నేటికీ మిస్టరీనే! ∙సంహిత నిమ్మన (చదవండి: అక్కడ కవి పుట్టిన రోజు ‘బర్న్స్ నైట్’ పేరుతో ఓ పండుగలా ..!) -
30న పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈనెల 30వ తేదీ ఉదయం 6.30 గంటలకు సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగాన్ని నిర్వహించనుంది. ఇప్పటికే నాలుగు దశల అనుసంధానం పనులను పూర్తి చేసి రాకెట్‌ను మొబైల్ సర్వీస్ టవర్ (ఎంఎస్టీ)కు తీసుకువచ్చారు. అక్కడ ఏడు ఉపగ్రహాలను రాకెట్ శిఖరభాగాన అమర్చి.. హీట్‌షీల్డ్ క్లోజ్ చేసే ప్రక్రియను బుధవారం పూర్తి చేశారు. 29వ తేదీ ఉదయం 6.30 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించనున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆ సమయాన్ని కొద్దిగా మార్చే అవకాశం కూడా ఉంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన 422 కిలోల బరువు కలిగిన ఏడు ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. -
మహిళల కోసమే 102 అంతస్తుల భవనం! కేవలం వారు తప్ప..
ఆ బహుళ అంతస్తుల భవనం కేవలం మహిళలకు మాత్రమే అద్దెకిస్తారు. పురుషులకు మాత్రం అస్సలు అనుమతి లేదు. స్త్రీల కోసమే ప్రత్యేకంగా ఆ ఆ ప్లాట్లను తీర్చిదిద్దారట. ఈ బహుళ అంతస్తుల భవనం యూకేలో ఉంది. బ్రిటన్ తొలిసారిగా మహిళల కోసమే బహుళ అంతస్తుల భవనాన్ని లండన్‌లో నిర్మిస్తోంది. వివరాల్లోకెళ్తే..బ్రిటన్‌లో 1902లో ఓటింగ్ ఉద్యమంలో భాగంగా స్థాపించిన హౌసింగ్ అసోసియేషన్ దీన్ని నిర్మిస్తుంది. ఈ ప్రోపర్టీకి యజమాని అయిన ఉమెన్స్ పయనీర్ హౌసింగ్(డబ్ల్యూపీహెచ్) సంస్థ ప్రతి అపార్ట్‌మెంట్‌ని మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించనున్నట్లు తెలిపారు. మోనోపాజ్ దాటిన పెద్ద వయసు మహిళలకు తగిన విధంగా బాల్కనీ, మంచి వెంటిలేషన్ ఉండేలా ఆధునాత సౌకర్యాలతో ప్రతి అపార్ట్‌మెంట్‌ని తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించింది. ఈ ఫ్లాట్లను కేవలం గృహవేధింపులకు గురైన మహిళలకు, ఒంటరి మహిళలకు, నల్లజాతి స్త్రీలకు, అవసరమైతే ఒంటరిగా ఉన్న మైనారీటి మహిళలకు మాత్రమే అద్దెకు ఇస్తారని డబ్ల్యూపీహెచ్ పేర్కొంది. డబ్ల్యూపీహెచ్ నిబంధనల ప్రకారం..ఒంటరి మహిళలు మాత్రమే ఈ అపార్ట్మెంట్లో ఉండాలి. ఈ అపార్ట్మెంట్కి మహిళలు మాత్రమే అద్దెదారు అయ్యి ఉండి, ఆమె భాగస్వామినిగా ఉన్న పురుషుడు అయితే ఉండొచ్చు. అలాగే ఒంటిరి మహిళలకు మగ సంతానం ఉన్నట్లయితే వారు కూడా ఉండవచ్చని పేర్కొంది. అలాగే ట్రాన్స్‌జెండర్ మహళలు కూడా అద్దెకుండటానికి అనుమతి ఇస్తున్నట్లు డబ్ల్యూపీహెచ్ స్పష్టం చేసింది. అయితే ఈ భవనంపై కోర్టులో వివాదం నడుస్తున్నట్లు సమాచారం. కొందరు మాత్రం ఈ ప్రాజెక్టు అంతగా బాగోలేదని పెదవి విరిచారు. మహిళలకు ఇంత పెద్ద భవనం వారిని ప్రమాదంలోకి నెట్టేస్తుందని, అన్ని మెట్లు ఎక్కలేరంటూ విర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఈ భవనం రూపొందిస్తున్న ఆర్కిటెక్ట్ కోలిన్ వీచ్ ఆ విమర్శలను కొట్టి పారేసింది. ఈ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున మహిళలు మద్దతిస్తున్నట్లు చెప్పింది. ఈ భవనం మహిళలకు గృహవసతి కల్పిస్తుందన్నారు. నాలాంటి మహిళలు ఎందరికో ఇది ఆవాసంగా ఉపయోగపడుతుందన్నారు. దీని ద్వారా మహిళలు అనితరసాధ్యమైన సవాళ్లు చాలా సునాయాసంగా అధిగమించగలరని వీచ్ చెప్పుకొచ్చారు. (చదవండి: ఆకలితో ఉన్న ఓ విద్యార్థి ఏం చేశాడంటే..ఏకంగా రూ. 98 లక్షలు ఖరీదు చేసే..) -
వనస్థలిపురంలో రేడియో స్టేషన్ టవర్ ఎక్కి వక్తి హల్ చల్..
-
టిక్కెట్ ఇవ్వలేదని.. టవర్ ఎక్కిన ఆప్ నేత..
-
మెలికల టవర్.. ఎత్తు 590 అడుగులు..
బీజింగ్: చూశారుగా ఎలా మెలితిరిగి ఉందో.. అందుకే ఇది ప్రపంచంలోని అత్యంత మెలికలు తిరిగిన ఆకాశహార్మ్యాల్లో ఒకటిగా నిలిచింది. పశ్చిమ చైనాలోని చోంగ్క్వింగ్ నగరంలో తాజాగా ప్రారంభమైన ఈ టవర్ ఎత్తు 590 అడుగులు. ‘డ్యాన్స్ ఆఫ్ లైట్’గా పిలిచే ఈ భవంతి 8.8 డిగ్రీల కోణంలో మెలికలు తిరిగి ఉంది. ఈ తరహాలో నిర్మించిన ఇతర ఆకాశహార్మ్యాలకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ మెలికలు ఈ టవర్ సొంతమని నిర్మాణ సంస్థ ఏడస్ తెలిపింది. ఉత్తర ధ్రువం వద్ద ఆకాశంలో వివిధ ఆకృతుల్లో కనిపించే కాంతుల తరహాలో ఈ టవర్‌ను డిజైన్ చేశామని సంస్థ పేర్కొంది. పగటిపూట సూర్యకిరణాల తాకిడి వల్ల ఈ భవంతి మెరుస్తూ కనిపిస్తుందని.. రాత్రిపూట గ్లాస్ ప్యానెళ్ల వల్ల కాంతులు వక్రీభవనం, పరావర్తనం చెందుతుంటాయని.. అందుకే దీనికి డ్యాన్స్ ఆఫ్ లైట్ అని పేరు పెట్టినట్లు వివరించింది. చదవండి: జింబాబ్వేలో 'మీజిల్స్' విలయం.. 700 మంది చిన్నారులు మ్యత్యువాత -
ప్రపంచంలోనే సన్న భవనం
ప్రపంచంలోని అతి పొడవైన భవనం ఏది అనగానే టక్కున బుర్జ్ ఖలీఫా అంటారు. మరి ప్రపంచంలోని అతి సన్నని, ఎత్తైన భవనం ఎక్కడుందో, దాని పేరేంటో తెలుసా? న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో నిర్మించిన ‘స్టెయిన్వే టవర్’. దీని వెడల్పు కేవలం 17.5 మీటర్లు. ఎత్తేమో 435 మీటర్లు. అంటే ఎత్తుకు వెడల్పుకు ఉన్న నిష్పత్తి 25:1. అదే 828 మీటర్లున్న బుర్జ్ ఖలీఫా వెడల్పు 45 మీటర్లు. ఈ సన్నని స్టెయిన్వే టవర్‌లో మొత్తం 82 అంతస్తులు, 60 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక్కో అపార్ట్మెంట్ ధర దాదాపు రూ. 60 కోట్లు. ఇక పెంట్ హౌస్ ధరైతే ఏకంగా రూ. 500 కోట్లపైనే. ఈ సన్నని భవనంను న్యూయార్క్ ఆర్కిటెక్చర్ కంపెనీ ‘షాప్’ డిజైన్ చేసింది. జేడీఎస్ డెవలప్మెంట్, ప్రాపర్టీ మార్కెట్స్ గ్రూప్ అండ్ స్ప్రూస్ క్యాపిటల్ పార్ట్నర్స్ నిర్మించింది. ఈ సన్న భవనంకు దగ్గర్లోనే ప్రపంచంలోనే అతి పొడవైన నివాస భవనం ‘సెంట్రల్ పార్క్ టవర్’ (దీని ఎత్తు 472 మీటర్లు) ఉంది. – సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
పేరు పెట్టమన్న హైదరాబాద్ సీపీ.. ఆ పోస్టుకు అనూహ్య స్పందన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికే తలమానికంగా బంజారాహిల్స్‌లో రూపుదిద్దుకుంటున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు (సీసీసీ) పేరు సూచించాలంటూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నెటిజనులను కోరారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీసు అధికారిక ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశారు. రోడ్ నం.12లో 20 అంతస్తుల ఎత్తుతో నిర్మితమవుతున్న ఈ భవనాన్ని ప్రస్తుతం ట్విన్ టవర్స్‌గా పిలుస్తున్నాయి. అయితే వాస్తవంగా ఇందులో మొత్తం నాలుగు టవర్స్ ఉంటాయని పోలీసులు తెలిపారు. కేవలం హైదరాబాద్ పోలీసుకే కాకుండా తెలంగాణ పోలీసు విభాగానికే ఇది కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌గా పనిచేస్తుందని స్పష్టం చేసిన ఆనంద్... ఆ మేరకు సరైన పేరు సూచించాలని కోరారు. చదవండి: మళ్లీ లాక్‌డౌనా అనేలా హైదరాబాద్ పరిస్థితి ఈ పోస్టుకు నెటిజనుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. పోస్ట్ చేసిన ఐదు గంటల్లోనే 1500 మంది లైక్ చేయగా...1100 మంది వివిధ పేర్లను సూచించారు. కమాండో హిల్స్, 4 లయన్స్, సీ4, ఫెడ రల్ టవర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ (ఎఫ్‌టీటీ ఎస్), చార్మినార్ ప్రొటెక్షన్ సెంటర్ (సీపీసీ) తదితర పేర్లను నెటిజనులు సూచించారు. మా ర్చి 31లోగా నిర్మాణం పూర్తి చేసి, సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆనంద్ ఇటీవలే కాంట్రాక్టర్‌కు సూచించిన విషయం విదితమే. -
కేబీఆర్ పార్కు: ప్లీజ్ ఇక్కడ నేనున్నానని అందరికీ చెప్పరూ!
ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు అవతలి వారికి ఆ విషయం తెలియజేసేందుకు పూర్వకాలంలో గ్రామాలు, ఇతర చారిత్రక ప్రాంతాల్లో ధర్మ గంటలు ఏర్పాటు చేసేవారు. సమస్య ఉన్న వారు ఇక్కడికి వచ్చి ధర్మ గంటను మోగిస్తే సంబంధిత అధికారులు లేదా గ్రామ పెద్దలు అక్కడికి వచ్చి వారి సమస్యను విని పరిష్కరించేవారు. సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద ‘సేవ్ అవర్ సోల్’ (ఎస్‌వోఎస్) టవర్‌ను రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. కేబీఆర్ పార్కు ప్రధాన గేటు ముందు ఏర్పాటు చేసిన ఈ స్తంభానికి పైన ఒక కెమెరా ఏర్పాటు చేశారు. మధ్యలో ఒక బటన్ ఏర్పాటు చేసి అది నొక్కి మాట్లాడితే సంబంధిత కమాండ్ కంట్రోల్లో వారు చెప్పేది వినడమే కాకుండా వారు ఎవరో చూసేందుకు కూడా కెమెరాలు బిగించారు. చదవండి: సినిమా కథను తలపించే లవ్‌స్టోరీ.. ప్రియుడి కోసం భారత్‌కు.. అతడి మరణంతో... ► ఈ ఎస్‌వోఎస్ స్తంభం ఏర్పాటు చేసిన ఏడాదిన్నర తర్వాత ఇటీవలే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ► అయితే ఇక్కడొక ధర్మగంట ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ► వారం క్రితం ఇదే కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వేలో సినీ నటి షాలూ చౌరాసియాపై, ఈ నెల 2వ తేదీన ఫిలింనగర్‌కు చెందిన ఓ యువతిపై, జనవరి 22వ తేదీన ఓ వైద్యురాలిపై ఆగంతకుడు దాడి చేశాడు. ఆ సమయంలో ఇలాంటి ధర్మగంట ఆ ప్రాంతంలో అందుబాటులో ఉండి ఉంటే వీరు క్షణాల్లో తమ సమస్యను చెప్పుకొని పోలీసుల దృష్టికి వారి సమస్యను తీసుకెళ్లే ఆస్కారం ఉండేది. ► ఈ ఎస్‌వోఎస్ స్తంభం గురించి చాలా మందికి తెలియదు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కూడా ఈ ఎస్‌వోఎస్‌కు సంబంధించి కనెక్షన్ కూడా బిగించారు. ► ఎవరైనా తమ సమస్యను చెప్పుకోగానే క్షణాల్లో సమీపంలోని పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకునే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై బాధితులకు న్యాయంచేసే విధంగా ఏర్పాట్లు చేశారు. చదవండి: టీఎస్ఆర్టీసీపై కిన్నెరసాని మొగులయ్య పాట.. ► తీరా లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ ఎస్‌వోఎస్ స్తంభం ఎవరికీ తెలియని దుస్థితిలో ఉండిపోయింది. ► కనీసం ఆ స్తంభం విషయంలో అవగాహన కల్పించాలనే ఆలోచన కూడా సంబంధిత అధికారులకు లేకుండా పోయింది. పలుమార్లు ఈ ఎస్‌వోఎస్ స్తంభంపై అవగాహన కల్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ► కేబీఆర్ పార్కుతో పాటు పీవీఎన్‌ఆర్‌మార్గ్‌లో వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటిపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ► బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్ద, జూబ్లీహిల్స్ రోడ్ నం. 92 సీవీఆర్ న్యూస్ వద్ద, స్టార్ బక్స్ హోటల్ వద్ద, కళింగ కల్చరల్ ట్రస్ట్ అగ్రసేన్ చౌరస్తాలో, బాలకృష్ణ ఇంటి ముందు వీటిని ఏర్పాటు చేయడం ద్వారా వాకర్లకు, సందర్శకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వీరు పేర్కొంటున్నారు. -
వనస్థలిపురం లో రేడియోటవర్ ఎక్కిన వ్యక్తి
-
వైరల్: రెప్పపాటులో ఎంత పద్ధతిగా కూలిందో చూడండి!
పెన్సిల్వేనియా: ఈ మధ్యన పెద్ద పెద్ద టవర్లను టెక్నాలజీ సాయంతో సెకన్ల వ్యవధిలోనే కూలగొట్టడం పరిపాటిగా మారిపోయింది. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. విషయంలోకి వెళితే.. మన దగ్గర చూడకపోయినా.. విదేశాల్లోని వ్యవసాయక్షేత్రాల్లో సిలోస్ టవర్లను విరివిగా వాడుతున్నారు. ఈ సిలోస్‌లో వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, దాన్యం నిల్వ, కెమికల్స్‌ను స్టోరేజ్ చేస్తున్నారు. తాజాగా అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందిన ఒక రైతు తన వ్యవసాయక్షేత్రంలో సిలోస్ పాడైనదశకు చేరుకోవడంతో దానిని కూలగొట్టి కొత్తది కట్టాలని నిర్ణయించుకున్నాడు. సాధారణంగానే సిలోస్‌ను కూలగొట్టాలంటే చాలా టైం పడుతుంది. అయితే కొత్త టెక్నాలజీ సాయంతో వికర్ణ దిశలో టవర్‌ను సెకన్ల వ్యవధిలో నేలమట్టం చేశారు. సిలోస్ టవర్ నేలమట్టం అయ్యే వీడియో విపరీతంగా ఆకట్టుకుంది. ఎంత పద్దతిగా అంటే.. అది కూలేటప్పుడు ఒక్క ఇటుక కూడా కదల్లేదు. అదే సమయంలో పక్కనే ఉన్న మిగతా సిలోస్ టవర్లు ఒక్క ఇంచు కదలేకపోవడం విశేషం. ఈ వీడియో చూసిన నెటిజన్లు టెక్నాలజీకి ఫిదా అవుతున్నారు. చదవండి: వైరల్: మొసలిపై కొంగ సవారీ .. నోరెళ్లబెట్టిన నెటిజన్లు -
సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్
-
జెంబో టవర్ : క్షణాల్లో నేలమట్టం
వాషింగ్టన్: అమెరికా సాల్ట్ లేక్ సిటీ ఎయిర్‌పోర్టు అధారిటీ సంచలన వీడియోను షేర్ చేసింది. యూటా రాష్ట్రంలో సాల్ట్ లేక్ సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఉన్న 84 అడుగుల డెల్టా టవర్‌ను కూల్చేశారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లకు వాటి గేట్లకు దారి చూపేందుకు దీన్ని 1989లో నిర్మించారు. ఈ టవర్ కూల్చివేత రెండవ దశలో ఈ టవర్‌ను పూర్తిగా నేలమట్టం చేశారు. కేవలం కొన్ని సెకన్లలోనే ఈ టవర్ కుప్పకూలిన వీడియోను అక్కడి అధికారులు ట్విటర్లో షేర్ చేశారు. అంతే లక్షల లైక్స్, వేలాది వ్యూస్‌తో ఇది నెటింట్లో హల్ చల్ చేస్తోంది. డెల్టా టవర్ కూల్చివేయడంలో ఇదొక ప్రధాన మైలురాయి అని సాల్ట్ లేక్ విమానాశ్రయ ప్రతినిధి నాన్సీ వోల్మర్ చెప్పారు.గత సెప్టెంబర్‌లో కొత్త విమానాశ్రయం ప్రారంభమయ్యేవరకు డెల్టా టవర్ కార్యకలాపాలు కొనసాగాయన్నారు. అయితే ఇందులో కొన్ని సదుపాయాలను ఆ తరువాత కూడా కొనసాగించాలని అనుకున్నా కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువ గేట్లు అవసరం లేదని తాము భావించినట్టు ఆమె వెల్లడించారు. -
టవర్లెక్కిన యువకులు
కడ్తాల్: మండల కేంద్రంతో పాటు రావిచేడ్ గ్రామంలో తమ సమస్యల పరిష్కారం కోసం ఇద్దరు యువకులు సెల్‌టవర్లు ఎక్కి నిరసన తెలిపిన ఘటనలు బుధవారం చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. తన ఇంటికి వెళ్లే దారి ఇరుకుగా ఉందని, ఈ దారిలోనే మరో వ్యక్తి ఇంటి నిర్మాణంలో భాగంగా మెట్ల నిర్మాణం చేపట్టాడని ఆరోపిస్తూ కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన ఓర్సు లక్ష్మణ్ సెల్‌టవర్ ఎక్కి రెండుగంటల పాటు నిరసన వ్యక్తం చేశాడు. రహదారి ఇరుకు మారడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, మెట్ల నిర్మాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశాడు. ఈ విషయమై గ్రామపంచాయతీ కార్యాలయంతో పాటు మండల పరిషత్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాంచంద్రారెడ్డి సెల్ టవర్ వద్దకు చేరుకొని సమస్యను రాతపూర్వకంగా తెలియజేయడంతో లక్ష్మణ్ సెల్ టవర్ పైనుంయి కిందకు దిగాడు. దీంతో గ్రామస్తులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. రావిచేడ్‌లో.. సొంత అన్నకు భూమిని విక్రయిస్తే ఇంత వరకు డబ్బులు పూర్తిగా ఇవ్వలేదని ఆరోపిస్తూ మండల పరి«ధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన రాజుగౌడ్ సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ యాదయ్య పోలీస్ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని రాజుగౌడ్‌తో ఫోన్లో మాట్లాడినప్పటికీ టవర్ పైనుంచి దిగలేదు. సుమారు ఆరుగంటల పాటు టవర్ పైనే ఉండటంతో భూమిని కొనుగోలు చేసిన అతని అన్నను అక్కడికి రప్పించారు. భూమికి సంబంధించిన డబ్బులు ఇచ్చేందుకు సోదరుడు అంగీకరించడంతో పోలీసులు కిందకు దిగాలని కోరడంతో అతడు టవర్ దిగాడు. -
భార్య అన్నం పెట్టలేదని భర్త ఆత్మహత్యా యత్నం
చెన్నై,టీ.నగర్: పోరూరు చెరువులోని విద్యుత్ టవరెక్కి శనివారం రాత్రి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం తెలిపారు. ఇన్స్పెక్టర్ శంకర నారాయణన్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అలాగే, అగ్నిమాపక సిబ్బంది వెంట వచ్చారు. పోలీసులు యువకుడికి నచ్చచెప్పి కిందకు దించారు. విచారణలో తన పేరు చెల్లపాండియన్ అని, తనకు భార్య అన్నం పెట్టకపోవడంతో విద్యుత్ టవర్ ఎక్కినట్లు చెప్పాడు. శనివారం ఉదయం మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. దీంతో అతనికి భార్య అన్నం పెట్టలేదు. దీంతో ఆవేదనకు గురైన అతను ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలిసింది. పోలీసులు అతన్ని హెచ్చరించి ఇంటికి పంపివేశారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
చెన్నై , తిరువణ్ణామలై: కుటుంబకలహాలతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు విద్యుత్ టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలుకా ఎత్తువాంబాడి గ్రామానికి చెందిన రమేష్(28). ఇతని భార్య గీత, దంపతులకు గిరిజ(8), ఆర్యా(6) ఇద్దరు కుమార్తెలున్నారు. చెన్నైలో కార్మికుడిగా పనిచేస్తున్న రమేష్ కొద్ది రోజుల క్రితం సొంత గ్రామానికి వచ్చాడు. తిరిగి చెన్నైకి వెళ్లలేదు. దీంతో భార్యభర్తల మధ్య తరచూ ఘర్షణ ఏర్పడేది. ఇదిలా ఉండగా గురువారం రాత్రి మళ్లీ ఘర్షణ జరిగింది. దీంతో మనోవేదనకు గురైన రమేష్ శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అనంతరం ఆత్మహత్య చేసుకునేందుకు నెల్లవాయిపాళ్యంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ టవర్‌పైకి ఎక్కాడు. అనంతరం ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. గమనించిన స్థానికులు భార్య గీతతో పాటు పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, బంధువులు రమేష్‌తో చర్చించారు. అయినప్పటికీ రమేష్ కిందకు రావడానికి నిరాకరించాడు. దీంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని రప్పించి విద్యుత్ టవర్ చుట్టూ వలలు ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామస్తులు కొందరు రమేష్‌ను కిందకు దించేందుకు టవర్‌పైకి ఎక్కారు. రమేష్ తనను కాపాడే ప్రయత్నం చేస్తే కిందకు దూకేస్తానని బెదిరించాడు. పోలీసులు ఐదు గంటల పాటు చర్చలు జరిపినప్పటికీ రమేష్ కిందకు రాలేదు. చర్చలు జరుపుతున్న సమయంలోనే రమేష్ ఉన్న ఫలంగా కిందకు దూకాడు. కిందికి పడే క్రమంలో మధ్యలో కమ్మీలకు రమేష్ తల గట్టిగా తగలడంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య, పిల్లలు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి విచారణ చేస్తున్నారు. -
అతిపెద్ద మొబైల్ టవర్ కంపెనీగా ఎయిర్టెల్
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తన టవర్ యూనిట్‌ను ప్రత్యర్థి కంపెనీలో విలీనం చేసేందుకు ఆమోదం తెలిపింది. భారతి ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్‌ను ఇండస్ టవర్స్ లిమిటెడ్‌తో విలీనం చేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ డీల్ విలువ 10.8 బిలియన్ డాలర్లు(రూ. 71,500 కోట్లు)ఈ ఒప్పందంలో భారతి ఇన్ఫ్రాటెల్ ప్రతి ఇండస్ టవర్ వాటాకి 1,565 షేర్లను చెల్లించేందుకు అంగీకరించినట్టు భారతి ఎయిర్టెల్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. 2019 , మార్చి 31 ఈ ఒప్పందం పూర్తి కానుందని భావిస్తున్నామని తెలిపింది తాజా డీల్‌తో చైనా వెలుపల భారత్‌లో అతిపెద్ద మొబైల్ టవర్ కంపెనీగా ఎయిర్టెల్ ఆవిర్భవిస్తుంది. విలీనం తరువాత ఆవిర్భవించే ఉమ్మడి సంస్థ ఇండస్ టవర్స్ లిమిటెడ్‌గా కొనసాగనుంది. దీనికి మార్కెట్ రెగ్యులేటర్ల తుది ఆమోదం పొందాల్సి ఉంది. సంస్థగా విలీనం అనంతరం భారతదేశం అంతటా 163,000కు పైగా టవర్లను నియంత్రిస్తుంది. మరోవైపు ఒప్పందం ప్రకారం భారతి-ఇండస్ జాయింట్ సంస్థలో 783.1 మిలియన్ల కొత్త షేర్లు వోడాఫోన్‌కు లభిస్తాయి. అయితే ఇండస్‌లో వాటాను మరో టెలికాం సంస్థ ఐడియా అమ్ముకోవచ్చు లేదా, అదనంగా కొత్తషేర్లను కొనుక్కునే అవకాశాన్ని కల్పించింది. ఈ వార్తల అనంతరం భారతి ఎయిర్టెల్ 2 శాతం లాభాలతో కొనసాగుతుండగా , భారతి ఇన్ఫ్రాటెల్ స్వల్ప నష్టాలతో కొనసాగుతోంది. కాగా ఇన్ఫ్రాటెల్, వొడాఫోన్ ఇండియాలకు ఇండస్ టవర్స్‌లో 42 శాతం వాటా ఉండగా మిగిలిన వాటా ఐడియా సెల్యులార్‌ది. తాజా ఒప్పందంతో సమీప ప్రత్యర్థి అయిన బీఎస్ఎన్ఎల్తో పోలిస్తే రెండున్నర రెట్ల పరిమాణం గల కంపెనీ అవుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి -
మహిళలకు స్కూటర్.. పురుషులకు ఆటో ఇవ్వాలి!
అన్నానగర్: మహిళలకు స్కూటర్ ఇస్తున్నట్లుగానే పురుషులకు ఆటో ఇవ్వాలని మద్యం మత్తులో విద్యుత్ టవర్ ఎక్కి ఓ డ్రైవర్ ఆత్మహత్య బెదిరింపులు ఇచ్చాడు. ఈ ఘటన సోమవారం కాక్కాతోప్పులో చోటుచేసుకుంది. పరమకుడి సమీపంలోని తండివాదేవి పట్టణానికి చెందిన కాట్టురాజా కుమారుడు మురుగన్(34). ఇతను అద్దెకు ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. కొన్ని వారాల కిందట అతన్ని పని నుంచి తొలగించడంతో ఖాళీగా ఉన్నాడు. కుటుంబసభ్యులతో తగాదా పడేవాడు. ఈ స్థితిలో సోమవారం మధ్యాహ్నం మద్యం మత్తులో కాక్కాతోప్పు ప్రాంతంలోని 60 అడుగుల ఎత్తైన హై ఓల్టేజి విద్యుత్ టవర్ ఎక్కాడు. దీనిపై స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి, విద్యుత్ కార్యాలయానికి సమాచారం అందించారు. వెంటనే అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సమాచారంతో పోలీసు జాయింట్ సూపరింటెండెంట్ సతీష్‌కుమార్, నగర సీఐ పొన్రాజ్ సిబ్బందితో అక్కడికి వచ్చారు. ఇంకా 108 ఆంబులెన్స్ వాహనం పిలిపించారు. మురుగన్‌ను పోలీసులు కిందికి దిగమని అడిగారు. అందుకు అతను మహిళలకు స్కూటర్ ఇస్తున్నట్లు పురుషులకు ఆటో ఇవ్వాలన్నాడు. వెంటనే కొత్త ఆటోను అక్కడికి తెప్పించారు. అయినా మురుగన్ దానికి నంబర్ లేదని కొత్త ఆటో కొనివ్వాలని లేకపోతే కిందకుదూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అగ్నిమాపక సిబ్బంది ముగ్గురు టవర్ పైకి ఎక్కుతుండగా గమనించిన అతను వారిని దిగమని కేకలు వేశాడు. లేదంటే నేను దూకేస్తానన్నాడు. దీంతో వారు ఆగిపోయారు. తరువాత కుంటుంబీకులు వచ్చి మాట్లాడారు. నీకు ఆటో కొనిస్తామని కిందకు దిగి రా అని పలికారు. అప్పటికే టవర్ పైకి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది మురుగన్‌ను పట్టుకున్నారు. అతని నడుముకి తాడుతో కట్టి సాయంత్రం 4 గంటలకు కిందకు తీసుకువచ్చారు. అతన్ని 108 ఆంబులెన్స్ ద్వారా పోలీసుస్టేషన్‌కు తరలించారు. -
ఏం చేస్తానో చూడండంటూ ఓ వృద్ధుడు!
సాక్షి, ముంబై : సాధారణంగా తమకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. ఒక్కో దగ్గర బాధితులకు ఒక్కో అనుభవం ఎదురౌతుంది. తన ఫిర్యాదును పట్టించుకోలేదని తీవ్ర మనస్తాపానికి లోనైన ఓ వృద్ధుడు ఓ ఎత్తైన టవర్ ఎక్కి హడలెత్తించాడు. ఈ ఘటన మహారాష్ట్రలో గురువారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. 67 ఏళ్ల ఓ వృద్ధుడు ముంబైలో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఏదో సమస్య తలెత్తడంతో ఫిర్యాదు చేద్దామని స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఆయన సమస్యను పట్టించుకోని పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆ వృద్ధుడు ప్రియదర్శిని సర్కిల్ లో ఉన్న పవర్ టవర్ ఎక్కి.. కిందకి దూకేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని అతికష్టం మీద ఆ వ్యక్తిని కిందకి దించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
గాలిమరల టవర్‌పై నుంచి పడి టెక్నీషియన్ మృతి
రామగిరి: గాలిమరల టవర్‌పై పని చేస్తుండగా పట్టు తప్పి టెక్నీషియన్ కిందపడటంతో మృతి చెందాడు. ఎస్ఐ రామారావు తెలిపిన మేరకు.. విన్సోల్ ఇంజినీరింగ్ ప్రైవేట్ కంపెనీ దుబ్బార్లపల్లి వద్ద గాలిమరల ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా బుధవారం గాలిమరల టవర్‌పైకి ఎక్కి పనిచేస్తున్న టెక్నీషియన్ సహారా యోగేష్ (20) పట్టు తప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతడు మహారాష్ట్రలోని వార్తాడు జిల్లాకు చెందిన పొరగామ్ గ్రామానికి చెందినవాడని ఎస్ఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఆరు నెలల్లో జియో 45 వేల కొత్త టవర్లు!
న్యూఢిల్లీ: 4జీ నెట్వర్క్ సామర్థ్య విస్తరణలో భాగంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రానున్న ఆరు నెలల కాలంలో కొత్తగా 45,000 టవర్లు ఏర్పాటు చేయనుంది. వచ్చే నాలుగేళ్లలో రూ.లక్ష కోట్లను వ్యయం చేయనున్నామని, టవర్ల ఏర్పాటు కూడా ఇందులో భాగంగా ఉటుందని జియో వర్గాలు వెల్లడించారుు. -
టవర్‌పై నుంచి జారిపడి ఏడీఈ మృతి
డొంకరాయి (మోతిగూడెం) : విద్యుత్ టవర్‌పై మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తూ అక్కడి నుంచి జారి కిందపడి ఏపీ ట్రా¯Œ్సకో ఏడీఈ రోహిణీకుమార్ (40) శనివారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. వై.రామవరం మండలం డొంకరాయి సమీపంలోని గంగవాడ వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్ టవర్ మరమ్మతుకు గురైంది. తన సిబ్బందితో అక్కడకు వెళ్లిన రోహిణీకుమార్ టవర్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారికింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను సిబ్బంది డొంకరాయి హాస్పటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందాడు. దీనిపై డొంకరాయి ఎస్సై కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు. కాలువలో పడి వ్యక్తి మృతి బట్టేలంక (మలికిపురం):గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు చెల్లుబోయిన నరసింహమూర్తి కుమారుడు రమేష్‌కుమార్ (32) శనివారం ఉదయం కాలువలో పడి మృతి చెందాడు. ముఖం కడుక్కుంటుండగా ముందుకు పడిపోయి ఆయన చనిపోయాడు.రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, పారిశ్రామికవేత్త కేవీ చంటిరాజు, సర్పంచ్ కందికట్ల కమళామణి, సొసైటీ అధ్యక్షుడు బండారు విజయకుమార్, ఎంపీటీసీ సభ్యుడు బోనం ఏసు తదితరులు సంతాపం తెలిపారు. -
నింగికి నిచ్చెన!
-
45 రోజుల్లో 48వేల టవర్లు
♦ కాల్ డ్రాప్స్ పరిష్కారానికి ఆపరేటర్ల చర్యలు: మనోజ్ సిన్హా ♦ వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్‌కు కొత్త బ్యాండ్లు కావాలని వినతి న్యూఢిల్లీ : మొబైల్ కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారం కోసం రూ.20 వేల కోట్ల పెట్టుబడులతో లక్ష టవర్లను ఏర్పాటు చేసేందుకు టెలికం కంపెనీలు ముందుకు వచ్చాయి. అయితే, మరింత స్పెక్ట్రమ్ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాయి. కాల్ డ్రాప్స్ అంశంపై టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా సోమవారం కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. 100 రోజుల్లో 60 వేల టవర్లు నిర్మిస్తామన్న హామీలో భాగంగా 45 రోజుల్లో 48వేల టవర్ల నిర్మాణం పూర్తి చేసినట్టు సమావేశం అనంతరం మంత్రి మనోజ్ సిన్హా విలేకరులకు తెలిపారు. ఆపరేటర్ల పనితీరు సంతృప్తికరంగానే ఉందని, ప్రభుత్వం మాత్రం వినియోగదారుల అనుభవం ఆధారంగా నెట్‌వర్క్‌ను ఇంకా పటిష్ట పరచాలని ఆశిస్తోందని చెప్పారు. కాల్ డ్రాప్స్ అంశంపై ప్రభుత్వానికి, కంపెనీలకు మధ్య జరిగిన రెండో సమావేశం ఇది. జూన్‌లో జరిగిన తొలి సమావేశం సందర్భంగా నెట్వర్క్ పటిష్టతకు కంపెనీలు అదనపు టవర్ల ఏర్పాటుపై కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాయి. సెప్టెంబర్‌లో స్పెక్ట్రం వేలం సెప్టెంబర్‌లో స్పెక్ట్రమ్ వేలం నిర్వహించనున్నామని, దీంతో స్పెక్టమ్ కొరత సమస్య తీరిపోతుందని ఆపరేటర్లకు మంత్రి తెలియజేశారు. అయితే, ఈ వేలంలో 71 నుంచి 76 గిగాహెడ్జ్, 50 గిగాహెడ్జ్ నూతన ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను కూడా అందుబాటులోకి తేవాలని ఆపరేటర్లు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ బ్యాండ్లలో వైర్లెస్ సేవల ద్వారా బ్రాడ్‌బ్యాండ్‌ను 1 గిగాబైట్ వేగంతో అం దించడానికి వీలవుతుందని సూచించారు. తాము ఏడాదిలో లక్ష టవర్ల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, అదే సమయంలో నెట్‌వర్క్‌ల సామర్థ్యం పెంచుకునేందుకు గాను ఈ (71-76), వీ (50గిగాహెడ్జ్) బ్యాండ్లను కూడా అందుబాటులోకి తేవాలని కోరినట్టు సెల్యులర్ ఆపరేటర్ల సంఘం డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ తెలిపారు. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ వేసేందుకు అనుమతులు కష్టంగా ఉండడంతో ఈ బ్యాండ్లు ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. అలాగే, స్పెక్ట్రమ్ కోసం చేసే చెల్లింపులపై వడ్డీ రేటు తక్కువగా ఉంచాలని కోరినట్టు కూడా ఆయన తెలిపారు.