ఆదిలాబాద్ : ఉద్యోగంలోకి తీసుకోవాలనే డిమాండ్‌తో సెల్‌ఫోన్ టవర్ ఎక్కి కంపెనీ సిబ్బందిని ఆందోళనకు గురిచేశాడో వ్యక్తి. వివరాలు...ఆదిలాబాద్ జిల్లా కాశీపేటలోని ఓరియెంట్ సిమెంట్ కంపెనీ... తరచూ విధులకు గైర్హాజరు అవుతుండటంతో కె.శ్రీనివాస్ అనే ఉద్యోగిని తొలగించింది. దీంతో శ్రీనివాస్ బుధవారం ఉదయం కంపెనీ వద్దకు వచ్చి అక్కడున్న ఓ సెల్‌ఫోన్ టవర్ ఎక్కాడు.
తనను ఉద్యోగంలోకి తీసుకోవాలని, అలా అని హామీ ఇస్తేనే టవర్ దిగుతానని, లేకుంటే దూకుతానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కంపెనీ అధికారులతో మాట్లాడి ఉద్యోగంలోకి తీసుకునేలా చూస్తామని హామీనివ్వడంతో అతడు శాంతించాడు.
(కాశీపేట్)