సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుడిహత్నూర్ మండలంలోని కొల్హరి గ్రామానికి చెందిన దంపతులు విజయ్, పల్లవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు..మహారాష్ట్రకు చెందిన పల్లవికి కొల్హారి గ్రామానికి విజయ్‌కు గత మే నెలలో వివాహం జరిగింది. సంక్రాంతికి పుట్టింటికి వెళ్ళి వచ్చిన పల్లవి.. శుక్రవారం మధ్యాహ్నం అత్తగారి ఇంటికి వచ్చింది.
సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పల్లవి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.. దీంతో తనపై అపవాదు వస్తుందన్న భయంతో ఆమె భర్త విజయ్ శ్మశాన వాటికకు వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment