ప్రపంచంలోని అతి పొడవైన భవనం ఏది అనగానే టక్కున బుర్జ్ ఖలీఫా అంటారు. మరి ప్రపంచంలోని అతి సన్నని, ఎత్తైన భవనం ఎక్కడుందో, దాని పేరేంటో తెలుసా? న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో నిర్మించిన ‘స్టెయిన్‌వే టవర్’. దీని వెడల్పు కేవలం 17.5 మీటర్లు. ఎత్తేమో 435 మీటర్లు. అంటే ఎత్తుకు వెడల్పుకు ఉన్న నిష్పత్తి 25:1. అదే 828 మీటర్లున్న బుర్జ్ ఖలీఫా వెడల్పు 45 మీటర్లు. ఈ సన్నని స్టెయిన్‌వే టవర్‌లో మొత్తం 82 అంతస్తులు, 60 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.
ఒక్కో అపార్ట్‌మెంట్ ధర దాదాపు రూ. 60 కోట్లు. ఇక పెంట్ హౌస్ ధరైతే ఏకంగా రూ. 500 కోట్లపైనే. ఈ సన్నని భవనంను న్యూయార్క్ ఆర్కిటెక్చర్ కంపెనీ ‘షాప్’ డిజైన్ చేసింది. జేడీఎస్ డెవలప్‌మెంట్, ప్రాపర్టీ మార్కెట్స్ గ్రూప్ అండ్ స్ప్రూస్ క్యాపిటల్ పార్ట్‌నర్స్ నిర్మించింది. ఈ సన్న భవనంకు దగ్గర్లోనే ప్రపంచంలోనే అతి పొడవైన నివాస భవనం ‘సెంట్రల్ పార్క్ టవర్’ (దీని ఎత్తు 472 మీటర్లు) ఉంది.
– సాక్షి, సెంట్రల్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment