పారిస్ః అభిమానులు పోలీసుల మధ్య చెలరేగిన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. యూరో కప్ సాకర్ మ్యాచ్ సమయంలో రేగిన ఘర్షణలు పారిస్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఈఫిల్ టవర్ మూసివేతకు కారణమైంది.
భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకొని పారిస్ లోని ఈఫిల్ టవర్ ను మూసివేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. పారిస్ లో జరిగిన ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లకు మధ్య జరిగిన యూరోకప్ సాకర్ 2016 ఫైనల్ మ్యాచ్ లో పోర్చుగల్ చేతిలో ఫ్రాన్స్ ఓటిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో స్టేడియంలోకి అభిమానులు ప్రవేశించడానికి పోలీసులు నిరాకరించడంతో అసలు గొడవ మొదలైంది. అడ్డుకున్న పోలీసులపైకి అభిమానులు రాళ్ళు రువ్వడంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయువును, వాటర్ క్యాన్స్ సైతం ప్రయోగించారు.
ఈఫిల్ టవర్ ప్రాంతం భాష్సగోళాల పొగతో నిండిపోయింది. ఆందోళనకు దిగిన 40 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనల్లో అక్కడి వాహనాలకు, చెత్తకు నిరసనకారులు నిప్పు పెట్టారు. ఈ సందర్భంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈఫిల్ టవర్ ను ఒక రోజంతా మూసివేస్తున్నట్లు ఈఫిల్ టవర్ నిర్వాహకులు వెల్లడించారు.
మూతపడ్డ ఈఫిల్ టవర్!
Published Tue, Jul 12 2016 9:58 AM | Last Updated on Thu, Jul 11 2019 6:20 PM
Advertisement