ఫ్యాన్స్‌ సంబరాలు.. పోలీసుల దాడి | FansClash With Police While Celebrating France World Cup Semifinal Win | Sakshi
Sakshi News home page

Jul 11 2018 12:59 PM | Updated on Aug 21 2018 6:08 PM

FansClash With Police While Celebrating France World Cup Semifinal Win - Sakshi

అభిమానిని అడ్డుకుంటున్న పోలీస్‌

మ్యాచ్‌ ముగుస్తుందనగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 30 మంది వరకు..

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ : ఫిఫా ప్రపంచకప్‌ సెమీఫైనల్లో బెల్జియంను 0-1తేడాతో ఓడించి ఫ్రాన్స్‌ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఇక 12 ఏళ్ల తర్వాత తమ జట్టు ఫైనల్‌కు చేరడంతో అభిమానులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. మ్యాచ్‌ అనంతరం భారీ సంఖ్యలో అభిమానులు ప్యారిస్‌ వీధుల్లో రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అయితే భారీ ఎత్తున క్రాకర్స్‌, బాణసంచా కాల్చడమే కాకుండా,  బారీ కేడ్స్‌ అడ్డం పెట్టి సోఫాలపై కూర్చున్నారు. దీంతో అప్రమత్తమైన రియోట్‌ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా తిరగబడ్డారు. దీంతో టియర్‌ గ్యాస్‌ను ఉపయోగించి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మైదానంలో మరికొద్దీ సేపట్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 30 మంది వరకు గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement