riot
-
మాక్ డ్రిల్.. పవర్ఫుల్
సత్తెనపల్లి : ఒక్కసారిగా జరిగిన ఈ అలజడికి పట్టణవాసులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పట్టణ సీఐ పోలూరి శ్రీనివాసరావు ఘటనా స్ధలికి చేరుకొని నిరసనకారుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు సరి కదా.. ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. చేతికందినవన్నీ పోలీసులపై విసరడం మొదలు పెట్టారు. అంతే ఉన్నతాధికారులకు సీఐ శ్రీనివాసరావు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఎస్పీ మలికా గార్గ్ ఆదేశాలతో డీఎస్పీ గుర్నాథ్బాబు ఆధ్వర్యంలో ఆర్మ్డ్ రిజర్వ్ దళాలు, సివిల్, ప్రత్యేక సాయుధ దళాలు వ్యాన్లతో అక్కడికి చేరాయి.ముందుగా ఆందోళనకారులకు హెచ్చరికలు చేశారు. అయినప్పటికీ ఖాతరు చేయకపోవడంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి బాష్ప వాయువును ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గక పోవడం.. పరిస్థితులు ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో మరోవైపు ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైర్ చేసి హెచ్చరించారు. ఆందోళనకారుల్ని చెదరగొడుతూ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఓ నిరసనకారుడికి బుల్లెట్ తగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో కుప్పకూలగా.. మరొకరు తలకు గాయాలై తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్ట్రెక్చర్‌పై వాహనంలో తరలించారు. అంబులెన్సుల హడావుడి.. పోలీస్ సైరన్ల శబ్దాలతో ఆ ప్రాంతమంతా తీవ్ర గందరగోళం నెలకొంది. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకొని పోలీసులు వారిని వాహనాల్లో తరలించారు. కళ్లకు కట్టిన ప్రదర్శన ఈ దృశ్యాలను చూస్తూ భీతావహులైన ప్రజలకు మైక్‌లో ఒక ఎనౌన్స్మెంట్ వినిపించింది. ‘ఇది మాక్ డ్రిల్.. కౌంటింగ్ నేపథ్యంలో ఏమైనా హింసాత్మక ఘటనలు జరిగితే ఎలా ఎదుర్కోవాలో వివరించడంలో భాగంగా పోలీసులు చేసిన సన్నాహక కార్యక్రమం’ అని పోలీసులు ప్రకటించడంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అంతవరకు ‘నటించిన’ పోలీసులు అక్కడి నుంచి ని్రష్కమించారు. పట్టణంలో పోలీసులు చేపట్టిన నమూనా ప్రదర్శన ఇది. పేరుకే మాక్ డ్రిల్ అయినప్పటికీ వాస్తవాలను కళ్లకు కట్టింది.స్థలం : సత్తెనపల్లిలోని తాలూకా సెంటర్ సమయం: ఆదివారం సాయంత్రం 5.11 గంటలు 50 మందికి పైగా ఆందోళనకారుల గుంపు ఒక్కసారిగా దూసుకొచ్చింది.. ఓ చేతిలో ప్లకార్డులు .. మరో చేతిలో రాళ్లు ... పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు. తాలూకా సెంటర్లో నడిరోడ్డుపై మంట పెట్టిన టైర్లు.. ఎటుచూసినా భయానక వాతావరణం..అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అల్లర్లకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని ఏఆర్ అడిషనల్ ఎస్పీ రామచంద్రరాజు అన్నారు. మాక్ డ్రిల్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అల్లర్లు, ఆందోళనలు, విధ్వంసాలకు పాల్పడి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని తెలిపారు. ఇప్పటికే శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పెట్రోల్ బంకుల్లో లూజ్ విక్రయాలకు, పేలుడు పదార్థాలు, బాణసంచా విక్రయాలకు సైతం అనుమతి లేదని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మరో మూడు రోజులు 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ కూడా అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రదర్శనలు, అల్లర్లు, గుమికూడటం చేయరాదని సూచించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లపై కూడా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే నరసరావుపేటలో ఒకరిపై చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో క్రైం అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి, సత్తెనపల్లి డీఎస్పీ గురునాథ్ బాబు, ఏఆర్ డీఎస్పీ గాంధీ, సత్తెనపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.రాంబాబు, సత్తెనపల్లి రూరల్ సీఐ ఎం.రాజేష్ కుమార్, ఎస్ఐలు ఎం. సంధ్యారాణి, ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు. -
అంగళ్లు అల్లర్ల కేసులో టీడీపీ నేత శ్రీనివాసులు అరెస్ట్
మదనపల్లె: మాజీ సీఎం చంద్రబాబు ‘యుద్ధభేరి’ పేరుతో చేపట్టిన ప్రాజెక్ట్‌ల సందర్శన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లులో జరిగిన అల్లర్ల కేసులో మదనపల్లె మండలం టీడీపీ అధ్యక్షుడు దేవరింటి శ్రీనివాసులును శనివారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపారు. ముదివేడు పిచ్చలవాండ్లపల్లె ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిలిపివేయాలని చంద్రబాబు హైకోర్టులో స్టే తెచ్చిన నేపథ్యంలో... ఆగస్టు 4న చంద్రబాబు అన్నమయ్య జిల్లా పర్యటనలో నిరసన తెలిపేందుకు ఆయకట్టు రైతులు అంగళ్లుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులపై ఆగ్రహం వ్యక్తంచేసిన చంద్రబాబు వారిని కొట్టాలని, చంపాలని ఆవేశంతో కార్యకర్తలను రెచ్చగొట్టారు. దీంతో రైతులపై టీడీపీ నాయకులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీనిపై అంగళ్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమాపతిరెడ్డి ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, 20మందికి పైగా టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదుచేశారు. వీరిలో కొందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపగా, మరికొందరు పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం దేవరింటి శ్రీనివాసులును రూరల్ సీఐ శివాంజనేయులు అరెస్ట్ చేశారు. ఆయనకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా, రిమాండ్ విధించారు. -
యూట్యూబర్ నిర్వాకం.. రణరంగంగా మారిన న్యూయార్క్ వీధులు..
ఓ యూట్యూబర్ కారణంగా న్యూయార్క్ వీధులు శుక్రవారం సాయంత్రం రణరంగంగా మారాయి. లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రామ్‌లో ఫ్రీ గిఫ్ట్‌ల కోసం భారీగా గుమిగూడిన యువతతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో యూట్యూబర్‌తో సహా పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 21 ఏళ్ల కాయ్ సీనట్ ప్రముఖ యూట్యూబర్. యూట్యూబ్‌తో సహా ఇన్స్టాగ్రామ్, ట్వీచ్ వంటి సామాజిక మాధ్యమాల్లో లక్షల కొలది ఫాలోవర్లు ఉన్నారు. తనను కలవాలంటే మ్యాన్ హట్టన్‌కు రావాలని, అక్కడే లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రామ్‌లో ప్లే స్టేషన్ కన్సోల్‌తో సహా ఉచితంగా కానుకలు ఇస్తానని సీనట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. భారీగా ప్రజాదరణ ఉన్న సీనట్ పోస్టుకు స్పందించిన యువత శుక్రవారం సాయంత్రం దాదాపు 2000 మంది ఆ ప్రాంతానికి వచ్చేశారు. భారీ సంఖ్యలో వచ్చిన యువతతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఒకరినొకరు తోసుకున్నారు. కాలనీల్లో కార్లను ధ్వంసం చేశారు. భవంతుల పైకి ఎక్కి నినాదాలు చేయడం, బాటిళ్లను విసరడం వంటి చేష్టలకు పాల్పడ్డారు. వారిని అదుపు చేయడానికి ప్రయత్నించిన పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. భద్రత దృష్ట్యా యూట్యూబర్ సీనట్‌ను కూడా నిర్భందించి దర్యాప్తు చేపడుతున్నారు. ఇదీ చదవండి: 3 Years Jail For Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు 3 ఏళ్ల జైలు శిక్ష.. ఐదేళ్ల అనర్హత వేటు.. ఆ వెంటనే అరెస్ట్ -
క్యాపిటల్ దాడులకు సపోర్ట్ చేస్తూ..'జస్టీస్ ఫర్ ఆల్' అంటూ ట్రంప్ పాట
అమెరికాలోని జనవరి 6న క్యాపిటల్‌పై జరిగిన దాడులకు మాజీ అధ్యోడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఇచ్చారు. నాటి అల్లర్లకు పాల్పడిన దోషులుకు సపోర్ట్ చేస్తూ 'జస్టీస్ ఫర్ ఆల్' అంటూ పాటను ఆలాపించారు. దీన్ని స్పూటీఫై,యాపిల్ మ్యూజిక్, యూట్యూబ్ వంటి వాటిల్లో స్ట్రీమింగ్ పాటగా అందుబాటులో ఉంచారు. దీంతో ట్రంప్‌కి ఈ పాటను స్వరపరిచిన ఘనతను కూడా లభించింది. వాస్తవానికి ఇది క్యాపిటల్ దాడులకు సంబంధించిన ఆరోపణలపై జైలులో ఉన్న ట్రంప్ మద్దతుదారుల కుటుంబాలను ఆదుకోవాడనికి నిధులు సేకరించే ప్రయత్నంలో భాగంగా ఈ పాటను రికార్డు చేశారు. ఈ మేరకు ట్రంప్ నాటి అల్లర్లుకు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల బృందం స్వచ్ఛంద సంస్థకు సహకరించారు. ఆ పాట చివర్లో ఖైదీలు యూఎస్ఏ అని ఉంటుంది. ఈ పాట విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం. ఐతే నేఈ పథ్య పాట ఖైదు చేయబడిన వారి కుటుంబాల కోసం డబ్బును సేకరించడానికి ఉద్దేశించిందే కావచ్చు గానీ పోలీసు అధికారిపై దాడి చేసిన కుటుంబాలకు మాత్రం ప్రయోజనం చేకూరదని అని ఫోర్బ్స్ మ్యాగ్జైన్ పేర్కొంది. అంతేగాదు ట్రంప్ ఈ పాటను ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని మార్-ఎ-లాగో రిసార్ట్‌లో రికార్డ్ చేశారు. ఖైదీలు తమ పాటలను జైలు ఫోన్లో రికార్డ్ చేసుకున్నట్లు సమాచారం. కాగా, నాటి దాడిలో ట్రంప్ మద్దతుదారుల అల్లర్లలో గాయపడిన పోలీసులు, ఇతరులు ఆయనపై దావా వేయవచ్చని కోర్టు పేర్కొనడం గమనార్హం. అతేగాదు ట్రంప్ వైట్‌హౌస్ నుంచి బయలుదేరడానికి రెండు వారాల ముందే ఈ అల్లర్లు జరిగాయి. (చదవండి: స్కిన్ క్యాన్సర్ నుంచి విజయవంతంగా బయటపడ్డ బైడెన్..ఇక ఎలాంటి..) -
కరోనా : జైలులో తిరుగుబాటు.. 23 మంది మృతి
బొగోటా : కరోనా వైరస్ వ్యాప్తిపై జైళ్లలోని ఖైదీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు కరోనా విజృంభిస్తున్న వేళ జైలులో కనీస పారిశుద్ధ్యం కరువైందని, సరైన వైద్యసదుపాయాలు లేవని ఆరోపించిన ఖైదీలు అధికారులపై తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో జరిగిన అల్లర్లలో 23 మంది ఖైదీలు మరణించగా, 83 మంది గాయపడ్డారు. ఈ ఘటన కొలంబియా రాజధాని బొగోటాలోని లా మోడెలో జైలులో చోటుచేసుకుంది. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే.. లా మోడెలో జైలులో పరిశుభ్రత లేదని అందువల్ల తమకు కరోనా సోకే అవకాశం ఉందని ఖైదీలు ఆరోపించారు. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. జైలు అధికారులపై తిరగబడటమే కాకుండా.. అక్కడ ఉన్న సామాగ్రికి నిప్పుపెట్టారు. దీంతో అప్రమత్తమైన జైళ్ల శాఖ అధికారులు వారిని కట్టడి చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో 23 మంది మృతిచెందారు. ఈ ఘటనపై న్యాయశాఖ మంత్రి కాబెలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం 32 మంది ఖైదీలు, ఏడుగురు భద్రతా సిబ్బంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో ఇద్దరు భద్రతా సిబ్బంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. జైలులో పథకం ప్రకారమే అల్లర్లు జరిగాయని చెప్పారు. జైల్లో పారిశుద్ధ్యానికి సంబంధించి ఎలాంటి సమస్య లేదని.. అల్లర్లు సృష్టించేందుకే ఖైదీలు ఇలా చేశారని అన్నారు. జైలులో ఏ ఒక్క ఖైదీకి కూడా కరోనా సోకలేదని, ఎవరినీ ఐసోలేషన్‌లో ఉంచలేదని ఆమె స్పష్టం చేశారు. కాగా, ఈ విషయం తెలసుకున్న ఆ జైలులోని ఖైదీల బంధువులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తమవారి పరిస్థితి ఎలా ఉందో వెల్లడించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రత బలగాలు జైలు వద్దకు చేరకున్న తర్వాత కాల్పుల శబ్దాలు వినిపించాయని వారు అంటున్నారు. చదవండి : లాక్డౌన్ : రోడ్లపైకి జనం.. కలెక్టర్ ఆగ్రహం భారత్‌లో స్మార్ట్ఫోన్ల తయారీ నిలిపివేత.. -
పోలింగ్ తుది దశ పశ్చిమ బెంగాల్లో పలు చోట్ల అల్లర్లు
-
దర్శక దిగ్గజంపై కేసు నమోదు
సాక్షి, చెన్నై : దర్శక దిగ్గజం భారతీరాజాపై కేసు నమోదైంది. మత ఉద్రిక్తతలు, అల్లర్లు రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జనవరిలో ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. వినాయకుడు దిగుమతి చేసుకున్న దేవుడి వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని హిందూ మక్కల్ మున్నాని సంస్థ ఫిర్యాదు చేసింది. 76 ఏళ్ల భారతీరాజాపై గతంలోనూ ఇదే తరహాలో కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయకుండా మద్రాస్ హైకోర్టు గతంలో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
జైల్లో ఘర్షణ, 68మంది మృతి
కారకస్: వెనిజులాలోని జైల్లో మరోసారి తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. సెంట్రల్ నగరంలోని వాలెన్సియాలోని జైలునుంచి తప్పించుకునేందుకు ఖైదీలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా జైలుకు నిప్పు పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో అగ్ని ప్రమాదంలో 68 మంది మృతి చెందారు. దీనిపై చీఫ్ ప్రాసిక్యూటర్ తారెక్ విలియం సాబ్ ట్విటర్లో సమాచారం అందించారు. బాధాకరమైన సంఘటన అంటూ బాధిత కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. కరోబోబో రాష్ట్రంలో నిర్బంధ కేంద్రంలోని జైళ్లలో నమోదువుతున్న ఘోరమైన సంఘటనలకు తాజా ఉదంతమిది. బుధవారం చెలరేగిన ఘర్షణల సందర్భంగా ఎంతమంది చనిపోయిందీ పూర్తి స్పష్టత లేనప్పటికీ.. ప్రాథమికంగా 68మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక వర్గాల సమాచారం. ఒక పోలీసు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. దీంతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. మరోవైపు సరైన సమాచారాన్ని అధికారులు అందించడలేదంటూ జైలు బయట ఆందోళనకు దిగారు. ఆందోళనకారులపై భాష్ప వాయువు ప్రయోగించి పరిస్థిని అదుపు చేశారు. మృతులకు సంబంధించిన వివరాలను ఫోరెన్సిక్ వైద్యులు అంచనా వేస్తున్నారని , త్వరలోనే పూర్తి వివరాలను అధికారులు ప్రకటించారు. సమగ్ర దర్యాప్తునకు హామీ ఇచ్చారు. కాగా వెనిజులాలోని జైళ్లలో అధ్వాన్నమైన పరిస్థితుల నేపథ్యంలో జైళ్లలో ఘర్షణలు, హత్యలు సర్వసాధారణం. గతంలో జైళ్లలో పెద్ద ఎత్తున చెలరేగిన ఘర్షణల్లో డజన్ల కొద్దీ ఖైదీలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. -
అర్ధరాత్రి.. యువతి ఇంటి ముందు..
జయనగర(కర్నాటక): అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న యువతి తలుపు తట్టి గొడవకు దిగిన యువకుడు పోలీసులు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన జయనగర ఐదవబ్లాక్లో జరిగింది. నాలుగురోజుల క్రితం జయనగర ఐదవ బ్లాక్‌లోని ఓ ఇంట్లోకి యువతి కొత్తగా అద్దెకు దిగింది. యువతి ఒంటరిగా ఉండటాన్ని పసిగట్టిన యువకుడు సోమవారం అర్ధరాత్రి సమయంలో ఇంటి తలుపు తట్టడంతో ఆమె బయటకు వచ్చింది. అతడు నానా యాగీ చేయడంతో భయపడిన యువతి ఇంటి యజమానికి ఫోన్ చేసింది. అంతేగాక అదే భవనంలో ఉన్న సీరియల్ నటుడు శ్రీధర్‌కు యువతి ఫోన్ చేసి సహాయం కోరింది. శ్రీధర్ వచ్చి యువకుణ్ని అడ్డుకుని, ఆ గొడవను సెల్ఫోన్లో వీడియో తీశారు. గొడవకు దిగిన యువకుడు కిరణ్ ఇదే కట్టడంలో నివాసముంటున్నాడు. మద్యం మత్తులో అల్లరికి దిగాడు. ఎందుకిలా ప్రవర్తించారని శ్రీధర్ నిలదీయడంతో పొరపాటున ఇలా జరిగిందంటూ శ్రీధర్ సెల్‌ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. కాగా, బాధితురాలు జయనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. -
ఖైదీల ఘర్షణ: 60 మంది మృతి
బ్రెజిల్ లోని ఓ జైలులో ఆదివారం ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 60 మంది మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. మనాస్ లోని అమెజాన్ జంగిల్ నగరంలో గల జైలులో రెండు డ్రగ్ గ్యాంగ్ ల మధ్య రేగిన వాగ్వాదమే ఇందుకు కారణమని తెలిసింది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అమెజాన్ భద్రతా అధికారి చెప్పారు. ఆదివారం అర్ధరాత్రి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగారని తెలిపారు. కొందరు ప్రత్యర్ధులను చంపిన తర్వాత వారి శవాలను జైలు గోడ అవతలికి విసిరేశారని చెప్పారు. మరికొందరు జైల్లో నుంచి తప్పించుకుపోయారని వెల్లడించారు. సోమవారం తెల్లవారుజాము సమయానికి జైల్లో అతికష్టం మీద శాంతియుత వాతావరణం నెలకొల్పినట్లు తెలిపారు. అయితే, బ్రెజిల్ జైళ్ల విధానాన్ని పలు అంతర్జాతీయ సంస్ధలు విమర్శిస్తూ వస్తున్నాయి. బ్రెజిల్ జైళ్లలో ఖైదీలు కిక్కిరిసి ఉంటారు. దీంతో తరచుగా అక్కడి జైళ్లలో గొడవలు జరుగుతుంటాయి. -
మూతపడ్డ ఈఫిల్ టవర్!
పారిస్ః అభిమానులు పోలీసుల మధ్య చెలరేగిన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. యూరో కప్ సాకర్ మ్యాచ్ సమయంలో రేగిన ఘర్షణలు పారిస్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఈఫిల్ టవర్ మూసివేతకు కారణమైంది. భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకొని పారిస్ లోని ఈఫిల్ టవర్ ను మూసివేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. పారిస్ లో జరిగిన ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లకు మధ్య జరిగిన యూరోకప్ సాకర్ 2016 ఫైనల్ మ్యాచ్ లో పోర్చుగల్ చేతిలో ఫ్రాన్స్ ఓటిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో స్టేడియంలోకి అభిమానులు ప్రవేశించడానికి పోలీసులు నిరాకరించడంతో అసలు గొడవ మొదలైంది. అడ్డుకున్న పోలీసులపైకి అభిమానులు రాళ్ళు రువ్వడంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయువును, వాటర్ క్యాన్స్ సైతం ప్రయోగించారు. ఈఫిల్ టవర్ ప్రాంతం భాష్సగోళాల పొగతో నిండిపోయింది. ఆందోళనకు దిగిన 40 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనల్లో అక్కడి వాహనాలకు, చెత్తకు నిరసనకారులు నిప్పు పెట్టారు. ఈ సందర్భంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈఫిల్ టవర్ ను ఒక రోజంతా మూసివేస్తున్నట్లు ఈఫిల్ టవర్ నిర్వాహకులు వెల్లడించారు. -
తన్నుకున్నారని తరలించారు..
అమెరికాలోని ఓ జైళ్లో ఖైదీలంతా ఒక చోట చేరి అధికారులపై తిరగబడేందుకు ప్రయత్నించడమే కాకుండా వాళ్లల్లో వాళ్లు తన్నుకోవడంతో 500మందికి పైగా ఖైదీలను వేర్వేరు జైళ్లకు తరలించారు. అమెరికాలోని రేమాండ్విల్లే అనే చోట జైళ్లో దాదాపు 2,800మంది ఖైదీలు ఉన్నారు. గత వారం ఖైదీల్లో వాళ్లల్లో వారికే అనుకోకుండాగొడవలు తలెత్తి ఘర్షణలకు దారి తీసింది. అనంతరం వారు జైలులోని పలు వస్తువులను ధ్వంసం చేశారు. పోలీసు అధికారులపై తిరగబడేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వివాదానికి కారణమైనవారిని ప్రశ్నించి చివరికి వారిని టెక్సాస్‌కు ఇరువైపుల ఉన్న వేర్వేరు జైళ్లలోకి తరలించారు. -
యూపీలో మళ్లీ మత ఘర్షణలు
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో మత విద్వేషాలు చల్లారేలా లేవు. ముజఫర్ నగర్ మంటలు చల్లారకముందే.. కాన్పూర్‌లో విద్వేషాగ్ని రగిలింది. ఘటంపూర్ ప్రాంతంలో ఆదివారం చెలరేగిన అల్లర్లలో ఒకరు చనిపోగా, ఆరుగురు పోలీసులు సహా 12 మంది గాయపడ్డారు. అల్లరిమూకలు గృహదహనాలకు పాల్పడటంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. భీతర్ గ్రామంలో రెండు రోజుల క్రితం ఒక ఇంటిలో దొంగతనం చేస్తున్న ఒక వర్గానికి చెందిన ఇద్దరు బాలలను గ్రామస్తులు పట్టుకుని, తీవ్రంగా కొట్టి, అనంతరం పోలీసులకు అప్పగించారు. ఆదివారం వారిని ఆ ఊరిపెద్ద విడిపించి తీసుకువెళ్లాడు. అయితే, తీవ్రంగా కొట్టడంతో ఆ పిల్లలు చనిపోయారన్న వదంతులు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఒక వర్గం వారి ఇళ్లు, దుకాణాలు లక్ష్యంగా రాళ్లదాడులు చేశారు. పదులసంఖ్యలో షాపులకు మంటలు పెట్టారు.ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఘర్షణల్లో ఒక షాప్ యజమాని మరణించాడు. మరో మహిళ 70% కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది. ఘర్షణలకు సంబంధించి 13 మందిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని కాన్పూర్ గ్రామీణ ఎస్పీ అనిల్ మిశ్రా తెలిపారు.