అమెరికాలోని జనవరి 6న క్యాపిటల్‌పై జరిగిన దాడులకు మాజీ అధ్యోడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఇచ్చారు. నాటి అల్లర్లకు పాల్పడిన దోషులుకు సపోర్ట్ చేస్తూ 'జస్టీస్ ఫర్ ఆల్' అంటూ పాటను ఆలాపించారు. దీన్ని స్పూటీఫై,యాపిల్ మ్యూజిక్, యూట్యూబ్ వంటి వాటిల్లో స్ట్రీమింగ్ పాటగా అందుబాటులో ఉంచారు. దీంతో ట్రంప్‌కి ఈ పాటను స్వరపరిచిన ఘనతను కూడా లభించింది. వాస్తవానికి ఇది క్యాపిటల్ దాడులకు సంబంధించిన ఆరోపణలపై జైలులో ఉన్న ట్రంప్ మద్దతుదారుల కుటుంబాలను ఆదుకోవాడనికి నిధులు సేకరించే ప్రయత్నంలో భాగంగా ఈ పాటను రికార్డు చేశారు.
ఈ మేరకు ట్రంప్ నాటి అల్లర్లుకు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల బృందం స్వచ్ఛంద సంస్థకు సహకరించారు. ఆ పాట చివర్లో ఖైదీలు యూఎస్‌ఏ అని ఉంటుంది. ఈ పాట విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం. ఐతే నేఈ పథ్య పాట ఖైదు చేయబడిన వారి కుటుంబాల కోసం డబ్బును సేకరించడానికి ఉద్దేశించిందే కావచ్చు గానీ పోలీసు అధికారిపై దాడి చేసిన కుటుంబాలకు మాత్రం ప్రయోజనం చేకూరదని అని ఫోర్బ్స్ మ్యాగ్జైన్ పేర్కొంది. అంతేగాదు ట్రంప్ ఈ పాటను ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని మార్-ఎ-లాగో రిసార్ట్‌లో రికార్డ్ చేశారు. ఖైదీలు తమ పాటలను జైలు ఫోన్‌లో రికార్డ్ చేసుకున్నట్లు సమాచారం. కాగా, నాటి దాడిలో ట్రంప్ మద్దతుదారుల అల్లర్లలో గాయపడిన పోలీసులు, ఇతరులు ఆయనపై దావా వేయవచ్చని కోర్టు పేర్కొనడం గమనార్హం. అతేగాదు ట్రంప్ వైట్‌హౌస్ నుంచి బయలుదేరడానికి రెండు వారాల ముందే ఈ అల్లర్లు జరిగాయి.
(చదవండి: స్కిన్ క్యాన్సర్ నుంచి విజయవంతంగా బయటపడ్డ బైడెన్..ఇక ఎలాంటి..)
Comments
Please login to add a commentAdd a comment