capitol
-
కేపిటల్ భవనంపై దాడిలో పాల్గొన్న వారికి క్షమాభిక్ష: Donald Trump
-
USA: ‘నేను మళ్లీ గెలిస్తే’.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే తాను తొలుత చేసే పనులేంటో దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. 2021లో వాషింగ్టన్ క్యాపిటల్ హిల్ భవనంపై దాడి ఘటనలో అరెస్టయి జైళ్లలో ఉన్నవారిని వెంటనే విడుదల చేస్తానని, మెక్సికోతో సరిహద్దును మూసేసి అక్రమ వలసదారులకు అడ్డకట్ట వేస్తామని తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ట్రంప్ తాజాగా ఒక పోస్టు పెట్టారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత జో బైడెన్ గెలుపు అక్రమమని ట్రంప్ ఒక ప్రసంగం చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆయన మద్దతుదారులు 2021, జనవరి 6న వాషింగ్టన్‌లోని చారిత్రాత్మక క్యాపిటల్ హిల్ భవనంపై దాడి చేశారు. ఈ కేసులో వందల మంది అరెస్టయి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. క్యాపిటల్ హిల్ తిరుగుబాటు కేసులో అధ్యక్షునికి రాజ్యాంగ రక్షణ ఉంటుందా లేదా అనే కేసులో ట్రంప్‌పై వచ్చే ఏప్రిల్ 25న అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపైనే ట్రంప్‌నకు రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టే అర్హత ఉందా లేదా అనేది తేలిపోనుంది. కాగా, ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తలపడనున్నారు. అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయించే రిపబ్లికన్ ప్రైమరీల్లో ట్రంప్ ఇప్పటికే ఘన విజయం సాధించారు. ఇదీ చదవండి.. అమెరికాలో టిక్‌టాక్ పాలిటిక్స్.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్ -
అమెరికాలో రాష్ట్రాల క్యాపిటల్ భవనాలకు బాంబు బెదిరింపులు
న్యూయార్క్: అమెరికాలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. పలు రాష్ట్రాల క్యాపిటల్ భవనాల్లో పేలుళ్లు జరుపుతామని బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా భవనాలను ఖాలీ చేయించారు. కనెక్టికట్, జార్జియా, కెంటుకీ, మిచిగాన్, మిన్నెసోటా, మిస్సిస్సిప్పి, మిచిగాన్, మోంటానా స్టేట్‌హౌస్ కార్యాలయాలకు బెదిరింపులు వచ్చాయి. దుండగులు ఈ-మెయిల్ ఐడీ ద్వారా ఆయా కార్యాలయాలకు బెదిరింపు సందేశాలు పంపించారు. దీంతో ఆయా క్యాపిటల్ భవనాలను ఖాలీ చేయించి బాంబు స్క్వాడ్ బృందాలు గాలింపు చేపట్టాయి. అయితే.. ప్రస్తుతానికి ఎలాంటి పేలుళ్ల ఆనవాల్లు లభించలేదని అధికారులు తెలిపారు. దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు అమెరికా దాడిలో మరణించిన ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ సంస్మరణ ర్యాలీలో భారీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెనక అమెరికా, ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇదే క్రమంలో అమెరికా క్యాపిటల్ కార్యాలయాలకు బాంబు బెదిరింపులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదీ చదవండి: సైనిక చర్యకు దిగుతాం.. హౌతీలకు అమెరికా వార్నింగ్ -
పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో ఆందోళనలు
న్యూయార్క్: ఇజ్రాయెల్ తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ పాలస్తీనా అనుకూల నిరసనకారులు అమెరికాలో ఆందోళన చేపట్టారు. యూదు సంస్థలకు చెందిన సభ్యులు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొని క్యాపిటల్ బిల్డింగ్‌ను చుట్టుముట్టారు. నిరసనలకు అనుమతి తీసుకోకుండానే బిల్డింగ్‌లోకి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. నిరసనల్లో దాదాపు 300 మంది అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గాజాలో ఆల్ రిహ్లా ఆస్పత్రి దాడిలో దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. యుద్ధాన్ని నిలిపివేయాల్సిందిగా ప్రపంచదేశాలు ఇరుపక్షాలను కోరాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఇజ్రాయెల్‌లో పర్యటించారు. గాజా ఆస్పత్రి ఘటనలో ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతూనే కాల్పుల విమరణకు ఒప్పించే ప్రయత్నం చేశారు. Hundreds of primarily Jewish protesters are currently in the Capitol’s Cannon building staging a sit-in protest, calling on Biden and Congress to push for a ceasefire in Gaza. They’re slowly being arrested. pic.twitter.com/mGLELwRj6p — Jack Jenkins (@jackmjenkins) October 18, 2023 జో బైడెన్ పర్యటన అనంతరం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా నేడు ఇజ్రాయెల్ సందర్శించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో యుద్ధం పరిస్థితులపై చర్చించనున్నారు. అటు.. బైడెన్ పర్యటన అనంతరం యుద్ధంలో ఇజ్రాయెల్ కాస్త పట్ట సడలించినట్లు తెలుస్తోంది. యుద్ధంలో దెబ్బతిన్న గాజాకు ఆహారం, నీటిని రఫా సరిహద్దు గుండా అందించడానికి అంగీకరించింది. BREAKING: According to Marjorie Taylor Greene, an insurrection is currently taking place on Capitol Hill. pic.twitter.com/s30I7UgS1P — Patrick Webb (@RealPatrickWebb) October 18, 2023 అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై దాడులు చేశాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఎదురుదాడి చేస్తోంది. గాజాలో నక్కిన హమాస్ దళాలను అంతం దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే యుద్ధంలో ఇరుపక్షాల వైపు దాదాపు 4000 మందికి పైగా మరణించారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు చొరవ తీసుకుంటున్నాయి. యుద్ధాన్ని నిలిపివేయాలని కోరుతున్నాయి. ఇదీ చదవండి: ఇజ్రాయెల్ చేరుకున్న రిషి సునాక్.. నెతన్యాహుతో చర్చలు -
క్యాపిటల్ దాడులకు సపోర్ట్ చేస్తూ..'జస్టీస్ ఫర్ ఆల్' అంటూ ట్రంప్ పాట
అమెరికాలోని జనవరి 6న క్యాపిటల్‌పై జరిగిన దాడులకు మాజీ అధ్యోడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఇచ్చారు. నాటి అల్లర్లకు పాల్పడిన దోషులుకు సపోర్ట్ చేస్తూ 'జస్టీస్ ఫర్ ఆల్' అంటూ పాటను ఆలాపించారు. దీన్ని స్పూటీఫై,యాపిల్ మ్యూజిక్, యూట్యూబ్ వంటి వాటిల్లో స్ట్రీమింగ్ పాటగా అందుబాటులో ఉంచారు. దీంతో ట్రంప్‌కి ఈ పాటను స్వరపరిచిన ఘనతను కూడా లభించింది. వాస్తవానికి ఇది క్యాపిటల్ దాడులకు సంబంధించిన ఆరోపణలపై జైలులో ఉన్న ట్రంప్ మద్దతుదారుల కుటుంబాలను ఆదుకోవాడనికి నిధులు సేకరించే ప్రయత్నంలో భాగంగా ఈ పాటను రికార్డు చేశారు. ఈ మేరకు ట్రంప్ నాటి అల్లర్లుకు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల బృందం స్వచ్ఛంద సంస్థకు సహకరించారు. ఆ పాట చివర్లో ఖైదీలు యూఎస్ఏ అని ఉంటుంది. ఈ పాట విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం. ఐతే నేఈ పథ్య పాట ఖైదు చేయబడిన వారి కుటుంబాల కోసం డబ్బును సేకరించడానికి ఉద్దేశించిందే కావచ్చు గానీ పోలీసు అధికారిపై దాడి చేసిన కుటుంబాలకు మాత్రం ప్రయోజనం చేకూరదని అని ఫోర్బ్స్ మ్యాగ్జైన్ పేర్కొంది. అంతేగాదు ట్రంప్ ఈ పాటను ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని మార్-ఎ-లాగో రిసార్ట్‌లో రికార్డ్ చేశారు. ఖైదీలు తమ పాటలను జైలు ఫోన్లో రికార్డ్ చేసుకున్నట్లు సమాచారం. కాగా, నాటి దాడిలో ట్రంప్ మద్దతుదారుల అల్లర్లలో గాయపడిన పోలీసులు, ఇతరులు ఆయనపై దావా వేయవచ్చని కోర్టు పేర్కొనడం గమనార్హం. అతేగాదు ట్రంప్ వైట్‌హౌస్ నుంచి బయలుదేరడానికి రెండు వారాల ముందే ఈ అల్లర్లు జరిగాయి. (చదవండి: స్కిన్ క్యాన్సర్ నుంచి విజయవంతంగా బయటపడ్డ బైడెన్..ఇక ఎలాంటి..) -
యూఎస్ కాపిటల్ భవనంపై దాడి.. ట్రంప్‌పై 4 క్రిమినల్ కేసులు?
వాషింగ్టన్: గతేడాది అమెరికా కాపిటల్ భవనంపై జరిగిన దాడిని దర్యాప్తు చేస్తున్న కాంగ్రెస్ కమిటీ యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర అభియోగాలు మోపింది. పార్లమెంట్ భవనంపై హింసకు ట్రంప్ బాధ్యుడని పేర్కొంటూ అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సోమవారం సిఫారుసు చేసింది. తిరుగుబాటు దారులకు సాయం చేయడం, పార్లమెంట్ కార్యాకలాపాలను అడ్డుకోవడం, యూఎస్ ప్రభుత్వాన్ని మోసం చేసేందుకు కుట్ర పన్నడం, తప్పుడు ప్రకటనలు చేయడం వంటి నాలుగు నేరారోపణలతో ట్రంప్‌ను ప్రాసిక్యూట్ చేయాలని హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్యానెల్ న్యాయశాఖను కోరింది. ట్రంప్‌పై క్రిమినల్ అభియోగాలు మోపడానికి తమ విచారణ సమయంలో సేకరించిన సాక్ష్యాలు సరిపోతాయని నమ్ముతున్నట్లు ప్యానెల్ ప్రతినిధి జామీ రాస్కిన్ తెలిపారు. విచారణలో 1,000 కంటే ఎక్కువ సాక్షులను ఇంటర్వ్యూ చేసి, వేలాది డాక్యుమెంట్లను సేకరించిన తర్వాతే డెమెక్రాటిక్ నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ న్యాయశాఖకు సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ కోసం ఓ మాజీ అధ్యక్షుడిని కాంగ్రెస్ కమిటీ సిఫార్సు చేయడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇదే జరిగితే 2024 ఎన్నికల్లో పోటీ చేయాలన్న ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. కాగా కమిటీ సిఫారసుపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తనను మళ్లీ వైట్‌హౌస్‌కు పోటీ చేయకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే తప్పుడు అభియోగాలు మోపినట్లు ఆరోపించారు. ఇక 2021 జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. నలుగురు కాపిటల్ పోలీసు అధికారులు మృతి చెందారు. -
మీ మనసులోకి తొంగి చూడలేను.. శిక్ష అనుభవించాల్సిందే!
Capitol rioters tears remorse don’t spare them from jail: అధ్యక్ష ఎన్నికల ఫలితాలను మార్చాలని డిమాండ్ చేస్తూ అమెరికా పార్లమెంటు 'క్యాపిటల్' భవనంలో డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడులను ప్రపంచ దేశాలన్ని విస్తుపోయి చూసిన సంగతి తెలిసిందే. నాటి ఘటనకు కారణమైన వాళ్లందరికి కఠిన శిక్షలు విధించారు. దీంతో వారంతా కన్నీటి పర్యంతమవుతూ నాటి ఘటనకు సిగ్గుపడుతున్నాం అని చెబుతున్నప్పటికి శిక్షలు నుంచి తప్పించుకోవడం అసాధ్యం అని యూఎస్ కోర్టు స్పష్టం చేసింది. (చదవండి: భారత సంతతి అమృతపాల్ సింగ్ మాన్కు యూకే గౌరవ జాబితాలో చోటు !) అమెరికా పార్టమెంటు దాడుల ఘటనలో ఉద్యోగులు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పయారని ఇది చాలా క్రూరమైన చర్యగా కోర్టు అభివర్ణించింది. అయితే ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి సుమారు 700 మంది అభియోగాల ఉన్నాయి. అందులో ఫ్లోరిడా వ్యాపార యజమాని రాబర్ట్ పాల్మెర్కి ఐదేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇప్పటి వరకుర దాదాపు 71 మందికి శిక్షలు విధించారు. వారిలో కంపెనీ సీఈవో, ఆర్కిటెక్ట్, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ లెఫ్టినెంట్ కల్నల్, జిమ్ యజమాని, మాజీ హ్యూస్టన్ పోలీసు అధికారి, యూనివర్సిటీ ఆఫ్ కెంటకీ విద్యార్థి ఉన్నారు. అయితే వారిలో యాభై-ఆరు మంది క్యాపిటల్ భవనంలో దాడులకు పాల్పడినందుకు నేరాన్ని అంగీకరించారు. అంతేకాదు ప్రతి శిక్షకు సంబంధించిన యూఎస్ చట్టాల ప్రకారం వారిలో చాలా మందికి గృహ నిర్బంధం లేదా వారాలు లేదా నెలలలో జైలు శిక్ష విధించబడింది. అయితే పోలీసు అధికారులపై దాడి చేసిన అల్లరిమూకలు మాత్రం ఏళ్ల తరబడి కటకటాలపాలయ్యారు. ఈ మేరకు మొత్తంగా ఇప్పటి వరకు 165 మంది నేరాన్ని అంగీకరించారని, పైగా అందులో ఎక్కువగా ఆరు నెలల గరిష్ట శిక్ష విధించే నేరాలకు పాల్పడినవారే.అధికారిక లెక్కల ప్రకారం మూడు నెలలు లేదా అంతకంటే తక్కువ శిక్షలు పొందిన 22 మందితో సహా సుమారు 31 మంది నిందితులకు జైలు శిక్ష విధించబడింది. మరో 18 మంది నిందితులకు గృహ నిర్బంధం విధించారు. మిగిలిన 22 మందిని గృహనిర్బంధం లేకుండానే ప్రొబేషన్‌లో ఉంచారు. అయితే యూఎస్‌లో న్యాయమూర్తులు తరచూ పశ్చాత్తాపాన్ని శిక్షలను నిర్ణయించడంలో కీలకమైన అంశంగా పేర్కొంటారు. దీంతో చాలా మంది నిందితులు పశ్చాత్తాపతో అభ్యర్థించడం ప్రారంభించారు. ఈ మేరకు యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి తాన్యా చుట్కాన్ మాట్లాడుతూ.. మీ అందరి పశ్చాత్తాపం నిజమైనదో కాదో చెప్పలేను. పైగా నేను మీ మనసులోకి తొంగి చూడలేను. ఈ కేసు తర్వాత మీరు మీ జీవితాన్ని నిర్వహించే విధానమే మీరు నిజంగా పశ్చాత్తాపపడుతున్నారా అనే దాని గురించి తెలియజేస్తుంది" అని అన్నారు. (చదవండి: టెస్లా ఆటో పైలెట్ టీమ్‌కి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తి!) -
అభివృద్ధి అంటే అమరావతేనా...?
– వైఎస్ ఉంటే సమస్యలు ఉండేవికాదు – గడప గడపకూ వైఎస్సార్‌లో ప్రజల ఆవేదన మదనపల్లె: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాజధాని అమరావతి తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి దుయ్యబట్టారు. ఆయన శనివారం మదనపల్లె మున్సిపాలిటీలోని ఒకటో వార్డు బీకేపల్లె వైఎస్సార్ కాలనీలో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పలువురు మహిళలు మాట్లాడుతూ తమ కాలనీలో మౌలిక వసతులు లేవని వాపోయారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ఇళ్లు నిర్మించి ఇచ్చారని, తాగునీటి సౌకర్యం కల్పించలేదన్నారు. రోడ్లు, వీధి దీపాలు, కాలువలు నిర్మించలేదని తెలిపారు. పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి సీఎం చంద్రబాబు విమానాల్లో విదేశీ పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణం పూర్తయితే అక్కడ అధికారులు మాత్రమే ఉంటారని, గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది మంది సామాన్య ప్రజలు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని తెలిపారు. ఊహల్లో కాకుండా వాస్తవాల్లోకి రావాలన్నారు. వైఎస్ కాలనీలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ముఖ్యంగా మదనపల్లె నియోజకవర్గంలోని వైఎస్ కాలనీలను అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వెంట ఒకటో వార్డు ఇన్చార్జ్ మేస్త్రీ, శ్రీనివాసులు, శ్రీనాథ్‌రెడ్డి, డాక్టర్ ఖాన్, అంబేడ్కర్ చంద్రశేఖర్, కమాల్ బాషా తదితరులు ఉన్నారు.