క్యాపిటల్ హిల్‌పై దాడి నిందితులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చారు. ఆయన ఇచ్చిన క్షమాభిక్షను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం జనాల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందనే ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారువాళ్లు.
2021,జనవరి 6వ తేదీన క్యాపిటల్ హిల్‌పై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. అయితే.. వాళ్లలో 1,500 మందికి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన వెంటనే క్షమాభిక్ష ప్రసాదించారు ట్రంప్. పైగా వాళ్లను అమాయకులుగా, దేశభక్తులుగా అభివర్ణించారాయన. అయితే తాము తప్పు చేసినప్పుడు.. చేయలేదని ట్రంప్ ఎలా క్షమిస్తారని ఇద్దరు నిందితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అయితే జాసన్ రిడెల్, పమేలా హెంప్‌హిల్ అనే ఇద్దరు మాత్రం ఆ క్షమాభిక్షను తిరస్కరిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. 2020 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి.. క్యాపిటల్ హిల్‌పై దాడి ఘటనలో తమ ప్రమేయం పూర్తిగా ఉందని అంగీకరిస్తున్నారు వాళ్లు. ట్రంప్ మాకు ఇచ్చిన భిక్షను అంగీకరిస్తే.. ఆనాడు మేం జరిపింది శాంతియుత నిరసన అనే తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి పంపిస్తుంది. అందుకే మేం ఆ క్షమాభిక్షను అంగీకరించం అని అంటున్నారువాళ్లు. అంతేకాదు.. ట్రంప్‌కు ఇక మీదట మద్దతుగా ఉండకూదని నిర్ణయించుకుంటున్నారువాళ్లు.
‘‘ఆనాడు నేను ఉద్దేశపూర్వకంగానే చేసిన దాడి అది. అలాంటిది దానికి నేను బాధ్యురాలిని కాదని ఆయన ఎలా? అంటారు’’ అని 71 ఏళ్ల పమేలా హెంప్‌హిల్ చెబుతున్నారు. కాపిటల్ హిల్ కేసులో 2022లో ఈమెకు 60 రోజుల శిక్ష, మూడేళ్లపాటు ప్రొబేషన్ శిక్ష పడింది.
ఇక.. విశ్రాంత సైనికుడు జేసన్ రిడెల్ కూడా తన క్షమాభిక్షను వద్దనుకుంటున్నారు. నాడు క్యాపిటల్ హిల్‌లోని సెనేట్ కార్యాలయంలోకి చొరబడ్డ ఆయన.. తప్పతాగి, ఓ పుస్తకాన్ని చోరీ కూడా చేశారు. ‘‘ట్రంప్ అలా జరగకూడదని అన్నారు. కానీ, అలా జరిగిపోయింది. జరిగిన దాంట్లోనా ప్రమేయం ఉంది. అలాంటప్పుడు ఆయన క్షమాభిక్ష మాకెందుకు?’’ అని అంటున్నారాయన. అంతేకాదు హాష్‌మనీ కేసులోనూ తనకు మద్దతుగా రోడ్ల మీదకు రావాలంటూ అప్పట్లో ట్రంప్ పిలుపు ఇవ్వడాన్ని రిడెల్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. మాటిమాటికి ప్రజలను రోడ్లెక్కాలని పిలుపు ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ట్రంప్‌ను ప్రశ్నించారాయన.
2020 ఎన్నికల్లో తనదే గెలుపని, అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, తనకు మద్దతుగా అంతా కదలి రావాలని డొనాల్డ్ ట్రంప్ పిలుపు ఇచ్చారు. అయితే ఈ పిలుపు వేల మంది రోడ్డెక్కి క్యాపిటల్ హిల్స్‌పై దాడికి దిగేందుకు దారి తీసింది.
Comments
Please login to add a commentAdd a comment