ఉక్రెయిన్‌కు సాయం తగ్గుతుంది: ట్రంప్
వాషింగ్టన్: 2021 యూఎస్ కేపిటల్ భవనంపై దాడిలో పాల్గొన్న వారికి క్షమాభిక్ష ప్రసాదిస్తానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంకేతాలిచ్చారు. జనవరి 20న బాధ్యతలు స్వీకరించగానే వలసలు, ఇంధనం, ఎకానమీతో పాటు క్షమాభిక్షకు సంబంధించి కూడా ఉత్తర్వులు జారీ చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల విజయం తరువాత ఎన్బీసీతో జరిగిన తొలి మీట్ ది ప్రెస్‌లో ట్రంప్ పలు అంశాలపై మాట్లాడారు.
ఉక్రెయిన్‌కు తన హయాంలో ఆశించనంత సాయం అందకపోవచ్చన్నారు. ‘‘అమెరికాలో జని్మంచిన ప్రతి ఒక్కరికీ దేశ పౌరసత్వం పొందడానికి అర్హత కలి్పంచే జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేస్తా. బైడెన్, ఆయన కుటుంబంపై ప్రత్యేక విచారణ కోరబోను. నాపై విచారణ జరిపిన డెమొక్రటిక్ పార్టీ నేతృత్వంలోని ప్రతినిధుల సభ కమిటీ సభ్యులు మాత్రం జైలుకు వెళ్లాల్సిందే’’ అని ట్రంప్ అన్నారు.
నాటోతోనే.. కానీ!
నాటో నుంచి ఆమెరికా వైదొలిగే విషయమై ట్రంప్ ఆసక్తికరంగా స్పందించారు. మిగతా సభ్య దేశాలు తమ వాటా నిధులను చెల్లిస్తే, నిష్పాక్షింగా వ్యవహరిస్తున్నాయని భావిస్తే నాటోలో కొనసాగుతామని చెప్పారు. అబార్షన్ మాత్రలపై ఆంక్షలు విధించాలని తాను కోరబోనని చెప్పారు.
మెక్సికో, కెనడా కూడా అమెరికాలో కలిసి పోతే మేలు!
మెక్సికో, కెనడాలకు అమెరికా ఇస్తున్న భారీ రాయితీలను ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘కెనడాకు ఏటా 100 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 8,48,700 లక్షల కోట్లు). మెక్సికోకైతే ఏకంగా 300 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,46,100 లక్షల కోట్ల). ఇంతటి రాయితీలివ్వడం అమెరికాకు అవసరమా? అసలు రాయితీలు ఎందుకివ్వాలి? దీనికి బదులు వాటిని పూర్తిగా అమెరికాలో కలుపుకుంటే సరిపోతుంది’’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment