attackers
-
Trump: ‘ఆయన క్షమాభిక్ష మాకు అక్కర్లేదు’
క్యాపిటల్ హిల్‌పై దాడి నిందితులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చారు. ఆయన ఇచ్చిన క్షమాభిక్షను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం జనాల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందనే ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారువాళ్లు.2021,జనవరి 6వ తేదీన క్యాపిటల్ హిల్‌పై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. అయితే.. వాళ్లలో 1,500 మందికి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన వెంటనే క్షమాభిక్ష ప్రసాదించారు ట్రంప్. పైగా వాళ్లను అమాయకులుగా, దేశభక్తులుగా అభివర్ణించారాయన. అయితే తాము తప్పు చేసినప్పుడు.. చేయలేదని ట్రంప్ ఎలా క్షమిస్తారని ఇద్దరు నిందితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే జాసన్ రిడెల్, పమేలా హెంప్‌హిల్ అనే ఇద్దరు మాత్రం ఆ క్షమాభిక్షను తిరస్కరిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. 2020 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి.. క్యాపిటల్ హిల్‌పై దాడి ఘటనలో తమ ప్రమేయం పూర్తిగా ఉందని అంగీకరిస్తున్నారు వాళ్లు. ట్రంప్ మాకు ఇచ్చిన భిక్షను అంగీకరిస్తే.. ఆనాడు మేం జరిపింది శాంతియుత నిరసన అనే తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి పంపిస్తుంది. అందుకే మేం ఆ క్షమాభిక్షను అంగీకరించం అని అంటున్నారువాళ్లు. అంతేకాదు.. ట్రంప్‌కు ఇక మీదట మద్దతుగా ఉండకూదని నిర్ణయించుకుంటున్నారువాళ్లు.‘‘ఆనాడు నేను ఉద్దేశపూర్వకంగానే చేసిన దాడి అది. అలాంటిది దానికి నేను బాధ్యురాలిని కాదని ఆయన ఎలా? అంటారు’’ అని 71 ఏళ్ల పమేలా హెంప్‌హిల్ చెబుతున్నారు. కాపిటల్ హిల్ కేసులో 2022లో ఈమెకు 60 రోజుల శిక్ష, మూడేళ్లపాటు ప్రొబేషన్ శిక్ష పడింది.ఇక.. విశ్రాంత సైనికుడు జేసన్ రిడెల్ కూడా తన క్షమాభిక్షను వద్దనుకుంటున్నారు. నాడు క్యాపిటల్ హిల్‌లోని సెనేట్ కార్యాలయంలోకి చొరబడ్డ ఆయన.. తప్పతాగి, ఓ పుస్తకాన్ని చోరీ కూడా చేశారు. ‘‘ట్రంప్ అలా జరగకూడదని అన్నారు. కానీ, అలా జరిగిపోయింది. జరిగిన దాంట్లోనా ప్రమేయం ఉంది. అలాంటప్పుడు ఆయన క్షమాభిక్ష మాకెందుకు?’’ అని అంటున్నారాయన. అంతేకాదు హాష్‌మనీ కేసులోనూ తనకు మద్దతుగా రోడ్ల మీదకు రావాలంటూ అప్పట్లో ట్రంప్ పిలుపు ఇవ్వడాన్ని రిడెల్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. మాటిమాటికి ప్రజలను రోడ్లెక్కాలని పిలుపు ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ట్రంప్‌ను ప్రశ్నించారాయన. 2020 ఎన్నికల్లో తనదే గెలుపని, అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, తనకు మద్దతుగా అంతా కదలి రావాలని డొనాల్డ్ ట్రంప్ పిలుపు ఇచ్చారు. అయితే ఈ పిలుపు వేల మంది రోడ్డెక్కి క్యాపిటల్ హిల్స్‌పై దాడికి దిగేందుకు దారి తీసింది. -
‘వాళ్లు మనుషులు కాదు.. హింసే పైశాచిక ఆనందం’
ఇజ్రాయెల్ సైన్యం హమాస్ దళాలను అంతమొందించడమే లక్ష్యంగా గాజాపై భీకర దాడులు చేస్తోంది. అక్టోబర్ 7న మొదటి సారి హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేయడంతో దానికి ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం గాజాపై వైమానిక, భూతల దాడులతో విరుచుకుపడుతోంది. అయితే యుద్ధం కారణంగా ఎందరో అమాయకులు బలయ్యారు. అనాగరికమైన హమాస్ దళాల కిరాతకమైన ప్రవర్తనను ఒక వారి దాడుల నుంచి బయటపడిన ఓ వ్యక్తి తాను ప్రత్యక్షంగా చూసిన హమాస్ ఆగడాలను ఓ మీడియా సంస్థకు తెలియజేశారు. హమాస్ దాడుల నుంచి బయటపడిని రాజ్ కోహెన్.. తాను ప్రత్యక్షంగా చూసిన హమాస్‌కు సంబంధంచిన దారుణమైన ఘటనను వెల్లడించారు. ఒక మహిళను ఐదుగురు హమాస్ సాయుధులు పట్టుకొని.. ఆమెను చుట్టుముట్టారు. తర్వాత ఆమె బట్టలు విప్పి పైశాచిక ఆనందం పొందారు. అక్కడితో ఆగకుండా ఆమెపై ఒకరు అత్యాచారం చేసి మరీ కత్తితో దారుణంగా హత్య చేశారు. పశు ప్రవృత్తిగల ఆ వ్యక్తి మళ్లీ ఆ మహిళపై అత్యాచారం చేశాడని రాజ్ కోహెన్ ఒకింత బాధతో తెలిపారు. వాళ్లు ఎప్పుడూ పెద్దగా నవ్వుతూ ఉంటారని అన్నారు. ఇలా పైశాచికంగా ప్రవర్తించడం వారికి ఓ ఆనందమని అన్నారు. ఇదే పైశాచిక ఆనందం కోసం.. చాలా మందిని వారు పొట్టనపెట్టుకున్నారని తెలిపారు. బాధింపబడిన మహిళ మరో మహిళతో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తే.. ఆమె స్నేహితురాలను సైతం హమాస్ దళాలు చంపేశాయని రాజ్ తెలిపారు. హమాస్ దళాలు తనపై కాల్పుల జరుగుతున్న సమయంలో పరుగెత్తుకుంటూ వారికంట కనబడకుండా ఓ పొదలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నానని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో హమాస్ చేతిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందగా.. ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై చేసిన దాడుల్లో 22000 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. చదవండి: విమానం గాల్లో ఉండగా ఊడిపోయిన డోర్.. వీడియో వైరల్ -
ఓరి దేవుడా..! హ్యాకర్లు తెలివి మీరారు..ప్రమాదంలో యూట్యూబ్ క్రియేటర్లు
యూట్యూబ్ క్రియేటర్లకు సెర్చ్ ఇంజిన్ గూగుల్ హెచ్చరికలు జారీ చేసింది. ఫిషింగ్ (ఒరిజినల్‌గా ఉండే ఫేక్ వెబ్‌సైట్స్) పేజెస్ తో పాటు, హానికరమైన ఫైల్స్‌తో హ్యాకర్స్ దాడి చేస్తున్నారని తెలిపింది. హ్యాక్ చేసిన ఒక్కో యూట్యూబ్ ఛానల్స్‌ను 4వేల డాలర్లకు అమ్ముకుంటున్నట్లు నిర్ధారించింది. కరోనా దెబ్బ కరోనా కారణంగా ఆర్ధిక మాధ్యం తలెత్తెతింది. దీంతో హ్యాకర్స్ సొమ్ము చేసుకునేందుకు మాల్వేర్లతో వరుస దాడులు చేస్తూ పేట్రేగిపోతున్నారు. అయితే ఈ తరహా దాడలు ఈ మధ్య కాలంలో ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఇటీవల గూగుల్‌కు చెందిన థ్రెట్ ఎనాలసిస్ గ్రూప్ హ్యాకింగ్ గురించి హైలెట్ చేస్తూ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం హ్యాకింగ్‌కు గురైన 4వేల యూట్యూబ్ అకౌంట్లను పునరుద్ధరించినట్లు ఆ రిపోర్ట్‌లో పేర్కొంది. వీటితో పాటు 62,000 ఫిషింగ్ పేజీలు,2,400 హానికరమైన ఫైల్స్‌ను బ్లాక్ చేసినట్లు స్పష్టం చేసింది. తెలివి మీరిన హ్యాకర్స్ ఇక యూట్యూబ్ ఛాన్సల్ను హ్యాక్ చేయడంలో హ్యాకర్స్ తెలివి మీరినట్లు తెలుస్తోంది. యూట్యూబ్ అఫిషియల్ మెయిల్ పేరుతో ఫేక్ ఈమెయిల్ క్రియేట్ చేశారని, ఆ మెయిల్స్ క్రియేటర్లకు వెరిఫికేషన్ కోసం పంపించినట్లు థ్రెట్ ఎనాలసిస్ గుర్తించింది. దీంతో యూట్యూబ్ క్రియేటర్లు తమకు యూట్యూబ్ నుంచి అఫియల్స్ మెయిల్ వచ్చిందని,వెంటనే వెరిఫికేషన్ కోసం ప్రయత్నించడం వల్ల హ్యాక్ అయినట్లు అనుమానం వ్యక్తం చేసింది. వెరిఫికేషన్ కోసం పంపిన మెయిల్స్‌ను క్లిక్ చేయడం వల్ల క్రియేటర్ ఛానల్ హ్యాకింగ్ గురవ్వడంతో పాటు పర్సనల్ డేటాను సేకరించినట్లు తేలింది. అంతేకాదు హ్యాక్ చేసిన ఒక్కో యూట్యూబ్ ఛానల్‌ను 4వేల డాలర్లకు అమ్ముకున్నట్లు గూగుల్‌కు చెందిన థ్రెట్ ఎనాలసిస్ గ్రూప్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఇక మే 2021 నుండి జీమెయిల్లో ఫిషింగ్ ఇమెయిల్‌ల వాల్యూమ్‌ను 99.6 శాతం తగ్గించినట్లు గూగుల్ తెలిపింది. చదవండి: మొండి గూగుల్.. ఆ ఫోన్లలో కరెక్ట్ పాస్వర్డ్ కొట్టినా వేస్టే! ఎందుకంటే.. -
దూరం మరచి... వైరం పెరిగి...
చైనీస్ తైపీ: కరోనా కారణంగా స్టేడియంలో ఆటగాళ్లే ఉన్నారు. ప్రేక్షకుల్ని అనుమతించలేదు. ఈలగోలల్లేని మైదానంలో ఎంచక్కా ఆడుకోవాల్సిన ఆటగాళ్లు దెబ్బలాడుకున్నారు. ఈ తగువులాటలో భౌతిక దూరం సంగతే మరిచారు. మ్యాచ్ ప్రసారం కావాల్సిన టీవీల్లో కొట్లాట ‘ప్రత్యక్ష’ ప్రసారమైంది. చైనీస్ తైపీ బేస్‌బాల్ లీగ్‌లో భాగంగా ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. రకుటెన్ మంకీస్, ఫుబొన్ గార్డియన్స్ జట్ల మధ్య బేస్‌బాల్ మ్యాచ్ ప్రేక్షకుల్లేకుండా జరిగినా ... ఇరుజట్ల ఆటగాళ్ల తగవుతో అల్లరిపాలైంది. భౌతిక దూరం పాటించాలనే ఉద్దేశంతో ఎవరినీ అనుమతించని స్టేడియంలో... విచక్షణ మరిచి ఒకరిమీద ఒకరుపడి మరీ కొట్టుకోవడం తైపీ వర్గాల్ని కలవరపెట్టింది. ఇక ఈ ద్వీప దేశం బేస్‌బాల్ తగవుతో వార్తల్లోకెక్కినా... ప్రపంచాన్నే వణికిస్తున్న వైరస్‌నే పకడ్బందీ చర్యలతో కట్టడి చేసిన దేశంగా కితాబులందు కుంటోంది. -
భద్రకాళిలా మారిన భార్య విశ్వరూపం చూశారా
-
భద్రకాళిలా మారిన భార్య విశ్వరూపం చూశారా
సాక్షి, హర్యానా : ఓ మహిళ అపరభద్రకాళి అవతార మెత్తింది. తన భర్తను కొట్టి చంపేందుకు ప్రయత్నించిన దుండగుల ముందు అపరకాళిలా మారి వారిని పరుగులు తీయించింది. ఒంటి చేత్తో వారిని ఢీకొని తోకముడిచి పారిపోయేలా చేసింది. ఈ ఘటన హర్యానాకు సమీపంలోని యమునా నగర్లో చోటు చేసుకుంది. ఆమె కుటుంబానికి మరికొందరు వ్యక్తులకు ఎప్పటి నుంచో భూమి తగాదాలు ఉన్నాయంట. దాంతో పొలంవైపు ఒంటరిగా వెళ్లిన తన భర్తపై నలుగురు వ్యక్తులు పెద్ద కర్రలతో దాడులకు దిగారు. దీంతో ఆమె ఓ పెద్ద కర్ర చేతబుచ్చుకొని వారి నలుగురిని ఎదుర్కొంది. బాగా దెబ్బలు తిని స్పృహతప్పిపోయిన తన భర్తను చూసి కట్టలు తెగే ఆవేశంతో ఒంటి చేత్తో వారిని పరుగులు పెట్టించి భర్త ప్రాణాలు కాపాడుకుంది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
ఆ.. మహిళపైనా మృగాళ్ళ దాడి!
మహిళ కనిపిస్తే చాలు మగాళ్ళు.. మృగాళ్ళై పోతున్నారు. రాను రాను మానవత్వం నశించి, రాక్షసులుగా మారుతున్నారు. శారీరక వాంఛలు తీర్చుకోవడం కోసం తన,పర, లింగ, వయో బేధాలను సైతం మర్చిపోతున్నారు. కనిపించిన వారిని కాటేసేందుకు సిద్ధమైపోతున్నారు. అటువంటి మానవ మృగాల దారుణాలకు అభంశుభం తెలియని అమాయకులు బలైపోతున్నారు. పాకిస్తాన్ లో వెలుగులోకి వచ్చిన దారుణం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఓ ఇరవై ఏళ్ళ ట్రాన్స్ జెండర్ మహిళపై దుండగులు ఒడిగట్టిన కిరాతక చర్య.. మానవ సమాజం తలదించుకునేలా చేసింది. తొడపై తీవ్ర గాయంతో బాధపడుతున్న ఆమె.. పాకిస్తాన్ కు చెందిన ఇరవై ఏళ్ళ ట్రాన్స్ జెండర్ మహిళ. మాన్ సెహరా పట్టణం వాయువ్యప్రాంతంలోని ఆమె నివాసానికి చేరిన ముగ్గురు సాయుధ దుండగులు తలుపు బద్దలుకొట్టిమరీ ఆమెపై దాడికి దిగారు. తుపాకీతో కాల్చి, ఆమెపై ఆఘాయిత్యానికి ప్రయత్నించారు. లైంగిక చర్యలకు తమకు సహకరించలేదన్న కోపంతో ఆమెను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. బాధితురాలు తీవ్రంగా ఎదుర్కోవడంతో కాల్పులు జరిపి పారిపోయినట్లు పోలీసు అధికారి అమ్మర్ నియాజ్ తెలిపారు. దుండగులను నిర్బంధించేందుకు దాడులు నిర్వహిస్తున్నామని, త్వరలో వారిని అరెస్టు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. బాధితురాలు గాయం నుంచి కోలుకొంటోందని, ఆస్పత్రినుంచి ఆమెను డిశ్చాడ్చి చేసినట్లు పోలీసులు తెలపడంతో విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జరిగిన ఘటనతో పాకిస్తాన్ మాన్ సెహరా ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తాయి. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ లక్ష్యంగా ఖైబర్ పఖ్తున్ఖ్వ ప్రాంతంలో దాడులు జరుగుతున్నాయంటూ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సభ్యులు, హిజ్రా కమ్యూనిటీ మద్దతుదారులు వీధుల్లో ఆందోళన చేపట్టారు. అధికారులు నేరస్థులను పట్టుకొని, తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇటువంటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాన్స్ జెండర్లకు రక్షణ కల్పించాలని, భద్రత పెంచాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. నిజానికి ప్రపంచంలోని ఇతర దేశాల్లోకంటే ట్రాన్స్ జెండర్లు పాకిస్తాన్ లో తమ హక్కులను వినియోగించుకుంటుండగా, విద్య, ఉద్యోగాలు, ఆరోగ్యం, విషయంలో మాత్రం పక్షపాత ధోరణి కనిపిస్తుంది. వాటిలో అట్టడుగున ఉండటంతోపాటు అనేక వేధింపులను, హింసను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేటికీ పాకిస్తాన్ తోపాటు, భారత్, బాంగ్లాదేశ్ వంటి దక్షిణాసియా దేశాల్లో పలువురు హిజ్రాలు దాడులు, మానభంగాలకు గురవ్వడమేకాక, వేశ్యలుగా కూడ పనిచేస్తున్నారు. కొందరు పొట్టపోసుకొనేందుకు ట్రాఫిక్ లైట్లవద్ద, వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్నారు. కాగా ఇటీవలి కాలంలో ఒక్క ఖైబర్ పఖ్తున్ఖ్వ ప్రాంతంలోనే తమ కమ్యూనిటీ సభ్యులపై కనీసం ఐదు దాడులు జరిగినట్లు ట్రాన్స్ జెండర్ సంఘాలు చెప్తున్నాయి. మే నెలలో పెషావర్ ప్రాంతంలో ఓ ట్రాన్స్ జెండర్ మహిళపై ఆమె స్నేహితుడు పలుమార్లు దాడి చేయడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. పైగా ఆమెను మేల్, ఫిమేల్ వార్డుల్లో ఏ వార్డులో చేర్చాలో తెలియక ఆలస్యం చేయడంతోనే ఆమె చనిపోయినట్లు స్నేహితులు చెప్పడం ఆందోళన రేకెత్తించింది. తమకు ఐడీ కార్డులు జారీచేయాలంటే లింగ నిర్థారణ పరీక్షలు తప్పనిసరి అంటున్నారని, అందుకు తాము అంగీకరించకపోతే కార్డులు ఇవ్వడంలో వివక్ష చూపిస్తున్నారని పాకిస్తాన్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అల్మాస్ బాబీ తెలిపారు. ఇప్పటికైనా వివక్షను విడనాడి, తమనుసైతం మనుషులుగా గుర్తించి, రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
నన్ను హత్యచేయాలనే వచ్చారు
మహారాష్ట్ర ఆలయాల్లో మహిళల ప్రవేశం కోసం పోరాడి విజయం సాధించిన భూమాత రణరాగిణి బ్రిగేడ్ నాయకురాలు తృప్తిదేశాయ్ తనపై కొందరు శివసేన, ఇతర సంస్థల కార్యకర్తలు దాడిచేయడంపై నిరసన వ్యక్తంచేశారు. కొల్హాపురీ మహాలక్ష్మి ఊరేగింపు సందర్భంగా తనపై దాడిచేసిన వారు తనను హత్యచేయాలనే పథకంతో వచ్చారని ఆరోపించారు. ఆమె గుడిలోంచి సజీవంగా బయటకు రావడానికి వీల్లేదంటూ వీరంగం సృష్టించారని మీడియాకు తెలిపారు. మహిళల్ని జుట్టుపట్టుకొని లాగి, దుస్తులను చించి అవమానించారని తృప్తి విమర్శించారు. చివరికి పూజారులు సైతం తమను దుర్భాషలాడారని వాపోయారు. తనకు పక్షవాతం సోకే అవకాశాలున్నాయని వైద్యులు అనుమానం వ్యక్తం చేసినట్టు తెలిపారు. బుధవారం నాటి ఆందోళనలో తీవ్ర గాయాలపాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తృప్తి దేశాయ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు మీడియాకు వివరించారు. ఆమె డీహైడ్రేట్ అయ్యారని, లో షుగర్, లో బీపీతో బాధపడుతున్నారని ఆమెకు చికిత్స అందిస్తున్న డా.అర్జున్ అద్నాయ్ తెలిపారు. దేవాలయాల్లో మహిళల ప్రవేశం కోసం పోరాడుతున్న తృప్తిదేశాయ్, బుధవారం కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో వస్త్రధారణ నియమాలను ఉల్లంఘించి మరో సంచలనం సృష్టించారు. ఇతర కార్యకర్తలతో కలిసి ఆలయానికి ఊరేగింపుగా వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మహిళలు సల్వార్ కమీజ్ ధరించి ఆలయంలోకి ప్రవేశించడంపై శివసేన, ఇతర హిందూ సంస్థల కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. తరాని చౌక్‌లో వారిని అడ్డుకోవడంతో దేవాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డ్రస్ కోడ్‌ను పాటించాలని పోలీసులు, పురోహితులు కూడా పట్టుబట్టారు. దీంతో ఉద్రిక్తత రాజుకుంది. చీరకట్టులో మాత్రమే గర్భగుడిలోకి రావాలని పోలీసులు, ఆలయ అధికారులు పెట్టిన ఆంక్షలను ధిక్కరించి ఆమె సల్వార్ కమీజ్ లో దర్శనం చేసుకున్నారు. భక్తులు, పూజారులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆమె వారిని తోసేసి గుడిలోపలికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని వచ్చారు. ఈ క్రమంలో డిప్యూటీ ఎస్పీ భరత్ కుమార్ ఆధ్వర్యంలో తృప్తి సహా, పలువురు మహిళలను ముందు జాగ్రత్త చర్యగా నిర్బంధంలోకి తీసుకున్నారు. -
'యాపిల్' తో పనిలేకుండా ఐఫోన్ అన్‌లాక్?
కాలిఫోర్నియా : ఇక యాపిల్ ఐ ఫోన్ అన్‌లాక్ వివాదం ముగిసే అవకాశం కనిపిస్తోంది. శాన్ బెర్నార్డినోలో దాడికి పాల్పడిన ఉగ్రవాది వాడిన ఫోన్ ను అన్‌లాక్ చేసేందుకు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ థర్డ్ పార్టీ సహకారం తీసుకోబోతోంది. సెల్ ఫోన్లో సమాచారం తెలుసుకునేందుకు సహకరించాలంటూ ఇంతకు ముందు ఎఫ్‌బీఐకు సహకరించాలని అమెరికా ప్రభుత్వం ఆపిల్ కంపెనీని కోరింది. అయితే కంపెనీ అందుకు నిరాకరించడంతో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషనలో భాగంగా థర్డ్ పార్టీ సహకారం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాది సయ్యద్ రిజ్వాన్ ఫరూక్ ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్న ఎఫ్‌బీఐ ఆ ఫోన్ అన్‌లాక్ చేసేందుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తోంది. ఫోన్ అన్‌లాక్ చేస్తే వినియోగదారుల భద్రతకు ముప్పు కలుగుతుందని భావిస్తున్న యాపిల్ సంస్థ అందుకు నిరాకరించడంతో దీనిపై కోర్టులో న్యాయ పోరాటం జరుగుతోంది. శాన్ బెర్నార్డినో దాడుల్లో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు వాడిన ఐఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు థర్డ్ పార్టీ సేవలు పొందబోతున్నట్లు ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ప్రకటించడంతో ఇక ఐఫోన్ అన్‌లాక్ సమస్య వివాదం సమసిపోయేట్లు కనిపిస్తోంది. అన్‌లాక్ చేసేందుకు ఓ థర్డ్ పార్టీ సహకరించేందుకు ముందుకు రావడంతో కేసు విచారణ వాయిదా వేయాలని ప్రభుత్వం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అభ్యర్థనను అనుమతించిన కాలిఫోర్నియాలోని రివర్సైడ్ ఫెడరల్ కోర్టు మెజిస్ట్రేట్ జడ్జి షెరి పిమ్... ఇవాళ (మంగళవారం) నిర్వహించవలసిన విచారణను వచ్చే నెల ఐదవ తేదీకి వాయిదా వేశారు. తదుపరి వాయిదా లోపు కొత్త పద్ధతిని ఉపయోగించి ఐఫోన్ అన్‌లాక్ చేసేందుకు థర్డ్ పార్టీతో కలసి ఎఫ్‌బీఐ ప్రయత్నిస్తుంది. -
'నా పొలం మీదనుంచే ఉగ్రవాదులు వెళ్లారనుకుంటా'!
బమియాల్: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి దిగిన జైషే ఈ మహ్మద్ ఉగ్రవాదులు భారత్ సరిహద్దులోని బమియాల్ సెక్టార్లో పంటపొలాల నుంచి పఠాన్ కోట్ కు వచ్చినట్లు తెలిసింది. ఉల్లిగడ్డ, గోధుమ పంట పొలాల మధ్యలో నుంచి వారు వచ్చినట్లుగా స్పష్టమవుతోంది. 400 మీటర్ల నిడివిలో రెండు పాద ముద్రలు గుర్తించినట్లు ఆ పొలం యజమాని జస్పాల్ సింగ్ పక్కో ఎన్ఐఏ అధికారులకు చెప్పాడు. ఆ పాదముద్రలు చూసి అనుమానించిన అతడు తన ఫోన్లో ఫొటోలు తీసుకొని వెళ్లి సమీపంలోని పోలీస్ స్టేషన్లో చూపించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న జాతీయ భద్రతా సంస్థకు ఈ రైతు ఇచ్చిన సమాచారమే కీలకంగా మారింది. అతడు ఎన్ఐఏ అధికారులకు ఏం చెప్పాడంటే..'డిసెంబర్ 31న సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో నా పొలానికి నీళ్లు పెట్టి వెళ్లాను. ఉదయాన్నే వచ్చి చూడగా బూటు ముద్రలు గుర్తించాను. ఆ సమయంలోనే ఇక్కాగర్ సింగ్ చనిపోయినట్లు నాకు తెలిసింది. నాకెందుకో అనుమానం వేసింది. ఆ బూటుగుర్తులు కూడా సాధారణంగా గ్రామస్తులుగానీ, బీఎస్ఎఫ్ జవాన్లుగానీ, ఆర్మీగానీ వేసుకొనేవాటితో పోలిస్తే చాలా పెద్దగా ఉన్నాయి. వెంటనేవాటిని ఫొటోలు తీసుకొని పోలీసుల వద్దకు వెళ్లాను' అని అతడు అధికారులకు వివరించాడు. -
పారిస్‌లో భీకర కాల్పులు
-
8 మంది ఉగ్రవాదుల హతం
-
8 మంది ఉగ్రవాదుల హతం
పారిస్: ఫ్రాన్స్‌లోని పలు ప్రాంతాల్లో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్లో 8 మందిని మట్టుపెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఫ్రాన్స్ ఉగ్రవాద దాడుల్లో సుమారు 150 మందికి పైగా మరణించారు. మరో 300 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. దాడి తర్వాత హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన భద్రతా బలగాలు ఇప్పటి వరకు 8 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వారిలో ముగ్గురు బాంబులతో కూడిన బెల్టులను ధరించి ఉన్నట్టు సమాచారం. వీరిని బటాక్లాన్ వేదిక వద్దే భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఉగ్రదాడితో అప్రమత్తమైన భద్రతాబలగాలు దేశ సరిహద్దులను మూసివేశాయి. మరిన్ని దాడులు జరగకుండా గాలింపుచర్యలు ముమ్మరం చేశారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఎలాంటి దయలేకుండా అణచివేస్తామని ఫ్రెంచ్ అధ్యక్షుడు హోలాండ్ తెలిపారు. జీ20 సదస్సుకు హాజరు కావల్సి ఉండగా పర్యటనను రద్దు చేసుకున్నారు. దాడుల అనంతరం ఫ్రాన్స్‌లో అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ దాడితో జీ20 సదస్సు రద్దయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. -
రేప్ కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
రేప్ కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లోసుప్రీంకోర్టు బుధవారం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అత్యాచార బాధితులకు, నిందితులకు మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించడాన్ని ఉన్నత ధర్మాసనం తీవ్రంగా ఖండించింది. రేప్ కేసులలో బాధితురాలితో నిందితుల ఒప్పందాలు చెల్లవని స్పష్టం చేసింది. ఈ చర్య మహిళల గౌరవానికి వ్యతిరేకమైనదని వ్యాఖ్యానించింది. ఇటీవల తమిళనాడు కోర్టు అత్యాచార కేసులో మధ్యవర్తిత్వానికి ఆదేశించడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు పైవిధంగా స్పందించింది. దోషులకు కఠినమైన శిక్షలు అమలు చేయాలని, నిందితులు, బాధితులు రాజీ చేసుకున్నా దాన్ని తీవ్ర నేరంగా పరిగణించాలని ఆదేశించింది. లైంగిక దాడి చేసిన వ్యక్తులతో రాజీ కుదుర్చుకోమని కోరడమంటే నేరస్తుల పట్ల మెతకవైఖరి చూపించినట్లు అవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాజీ చేయడమంటే మహిళా హక్కులను కాలరాయడమేనని పేర్కొంది. ఇది చాలా తీవ్రమైన తప్పిదమని పేర్కొంది. కాగా ఇటీవల మద్రాస్ హైకోర్టు ఒక రేప్ కేసులో జైల్లో ఉన్న నిందితుడుకి ..బాధితురాలితో మాట్లాడి రాజీ చేసుకోవడానికి వీలుగా బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా సదరు వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాల్సిందిగా బాధిత మహిళకు జడ్జి సూచించడం వివాదాన్ని రాజేసింది. -
ఎవరా దుండగులు?
* సూర్యాపేట కాల్పుల కేసులో కనిపించని పురోగతి * నిందితుల కోసం * జల్లెడపడుతున్న పోలీసులు *యూపీ, ఒడిశాకు వెళ్లిన దర్యాప్తు బృందాలు *అంతర్రాష్ర్ట ముఠా * పనేనంటున్న అధికారులు * కూపీ లాగేందుకు ఇర్ఫాన్‌ను విచారించే అవకాశం సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట కాల్పుల కేసు దర్యాప్తులో పోలీసులకు ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదు. నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో బుధవారం అర్ధరాత్రి సోదాలు జరుపుతున్న పోలీసులపై కాల్పులకు తెగబడి ఓ కానిస్టేబుల్‌తో పాటు హోంగార్డును హతమార్చిన దుండగులను పట్టుకునేందుకు పోలీస్ యంత్రాంగం తీవ్రంగా గాలిస్తోంది. ఆక్టోపస్ కమాండోలతో పాటు స్పెషల్ ఇంటెలిజెన్స్(ఎస్ఐబీ), కౌంటర్ ఇంటెలిజెన్స్ తదితర విభాగాలతో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటివరకు నిందితులను గుర్తించలేదు. అయితే ఇది అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా పనేనని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఘటన జరిగి రెండు రోజులు గడిచిపోవడంతో దుండగులు ఇప్పటికే రాష్ట్ర సరిహద్దులు దాటి సురక్షిత ప్రాంతా ల్లో తలదాచుకుని ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అధికారులు 2 బృందాలను ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు పంపించారు. కాగా, సూర్యాపేట పోలీసులు కొన్ని రోజుల కింద అంతర్రాష్ట దోపిడీ ముఠా నాయకుడు ఇర్ఫాన్, అతని సహచరుడు అక్తర్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరిద్దరు అక్కడి జైలులోనే రిమాండు ఖైదీలుగా ఉన్నారు. వీరి అరెస్టు తర్వాతే బస్టాండ్‌లో కాల్పుల ఘటన జరగడంతో ఇందులో ఇర్ఫాన్ ముఠా హస్తముందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దర్యాప్తు అధికారులు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. ఇర్ఫాన్ ముఠాలో అందరూ వయసు మళ్లిన వారున్నారని, పోలీసులపై దాడి చేసే సామర్థ్యం వారికి లేదని అంటున్నారు. అయితే, అసలు నిందితులను గుర్తించేందుకు ఇర్ఫాన్ సహకారాన్ని తీసుకోవాలని భావిస్తున్నారు. అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాల సమాచారాన్ని సేకరించేందుకు త్వరలో కోర్టు అనుమతితో ఇర్ఫాన్, అక్తర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. కాగా, బుధవారం మధ్యాహ్నమే హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో జ్యోతిష్యుడు నాగరాజుపై కాల్పులు జరిపిన కిరాయి హంతక ముఠాకూ సూర్యాపేట కాల్పులకు ఎలాంటి సంబంధం లేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇక ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సీఐ మొగిలయ్య, హోంగార్డు కిశోర్ ఇచ్చే సమాచారంతో కేసు దర్యాప్తులో పురోగతి ఉంటుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరిద్దరూ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఇర్ఫాన్ అరెస్టు తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడి స్వస్థలం మీరట్(యూపీ)కు సీఐ మొగిలయ్య వెళ్లి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన కోలుకున్నాక కీలక సమాచారాన్ని వెల్లడించే అవకాశముంది. కాగా, ప్రస్తుతం స్థానిక డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగా.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) సైతం సమాంతర దర్యాప్తు ప్రారంభించింది. ఎస్ఐబీ ఎస్పీ చంద్రశేఖర్ శుక్రవారం సూర్యాపేట బస్టాండ్‌ను సందర్శించి ఘటన జరిగిన తీరును స్థానిక పోలీసుల ద్వారా తెలుసుకున్నారు. త్వరలో ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి రాష్ర్ట ప్రభుత్వం అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.