రేప్ కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు | Directing Settlement in Rape Cases is 'Spectacular Error', Rules Supreme Court | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 1 2015 12:19 PM | Last Updated on Wed, Mar 20 2024 3:35 PM

అత్యాచార కేసుల్లోసుప్రీంకోర్టు బుధవారం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అత్యాచార బాధితులకు, నిందితులకు మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించడాన్ని ఉన్నత ధర్మాసనం తీవ్రంగా ఖండించింది. రేప్ కేసులలో బాధితురాలితో నిందితుల ఒప్పందాలు చెల్లవని స్పష్టం చేసింది. ఈ చర్య మహిళల గౌరవానికి వ్యతిరేకమైనదని వ్యాఖ్యానించింది. ఇటీవల తమిళనాడు కోర్టు అత్యాచార కేసులో మధ్యవర్తిత్వానికి ఆదేశించడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు పైవిధంగా స్పందించింది. దోషులకు కఠినమైన శిక్షలు అమలు చేయాలని, నిందితులు, బాధితులు రాజీ చేసుకున్నా దాన్ని తీవ్ర నేరంగా పరిగణించాలని ఆదేశించింది. లైంగిక దాడి చేసిన వ్యక్తులతో రాజీ కుదుర్చుకోమని కోరడమంటే నేరస్తుల పట్ల మెతకవైఖరి చూపించినట్లు అవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాజీ చేయడమంటే మహిళా హక్కులను కాలరాయడమేనని పేర్కొంది. ఇది చాలా తీవ్రమైన తప్పిదమని పేర్కొంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement