
8 మంది ఉగ్రవాదుల హతం
పారిస్: ఫ్రాన్స్లోని పలు ప్రాంతాల్లో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్లో 8 మందిని మట్టుపెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఫ్రాన్స్ ఉగ్రవాద దాడుల్లో సుమారు 150 మందికి పైగా మరణించారు. మరో 300 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. దాడి తర్వాత హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన భద్రతా బలగాలు ఇప్పటి వరకు 8 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వారిలో ముగ్గురు బాంబులతో కూడిన బెల్టులను ధరించి ఉన్నట్టు సమాచారం. వీరిని బటాక్లాన్ వేదిక వద్దే భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఉగ్రదాడితో అప్రమత్తమైన భద్రతాబలగాలు దేశ సరిహద్దులను మూసివేశాయి.
మరిన్ని దాడులు జరగకుండా గాలింపుచర్యలు ముమ్మరం చేశారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఎలాంటి దయలేకుండా అణచివేస్తామని ఫ్రెంచ్ అధ్యక్షుడు హోలాండ్ తెలిపారు. జీ20 సదస్సుకు హాజరు కావల్సి ఉండగా పర్యటనను రద్దు చేసుకున్నారు. దాడుల అనంతరం ఫ్రాన్స్లో అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ దాడితో జీ20 సదస్సు రద్దయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.