పారిస్: ఫ్రాన్స్ ప్రభుత్వంపై ఆ దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఫ్రెంచ్ గవర్నమెంటుపై కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడుల కారణంగా తమవారిని కోల్పోయామని, తీరని నష్టం చవిచూశామని ఈ విషయంలో ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొంటూ ఆ దేశ అగ్ర న్యాయస్థానంలో మూకుమ్మడిగా అభియోగాలు మోపనున్నారు. ఈ మేరకు వారి తరుపు న్యాయవాది మీడియాకు వెల్లడించాడు.
గత ఏడాది నవంబర్ 13న పారిస్ నగరంపై ఉగ్రవాదులు విరుచుపడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 130మంది ప్రాణాలుకోల్పోగా 250మంది గాయపడ్డారు. వీరిలో చాలామంది ఇప్పుడు ఫ్రెంచ్ సర్కారుని బాధ్యురాలిగా చేస్తూ కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ‘ఉగ్రవాదుల దాడులను ముందుగా పసిగట్టి నిలువరించలేకపోయిన ఫ్రాన్స్ సర్కారును ఎండగట్టేందుకు సాధ్యమైనన్ని అన్ని పనులు చేస్తాం అని వారు ప్రకటించారు’ అని మైత్రీ సమియా మక్తోఫ్ అనే న్యాయవాది చెప్పారు.
పారిస్ ప్రభుత్వంపై పదుల కేసులు
Published Wed, Jul 13 2016 11:27 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
Advertisement