యూట్యూబ్ క్రియేటర్లకు సెర్చ్ ఇంజిన్ గూగుల్ హెచ్చరికలు జారీ చేసింది. ఫిషింగ్ (ఒరిజినల్‌గా ఉండే ఫేక్ వెబ్‌సైట్స్) పేజెస్ తో పాటు, హానికరమైన ఫైల్స్‌తో హ్యాకర్స్ దాడి చేస్తున్నారని తెలిపింది. హ్యాక్ చేసిన ఒక్కో యూట్యూబ్ ఛానల్స్‌ను 4వేల డాలర్లకు అమ్ముకుంటున్నట్లు నిర్ధారించింది.
కరోనా దెబ్బ
కరోనా కారణంగా ఆర్ధిక మాధ్యం తలెత్తెతింది. దీంతో హ్యాకర్స్ సొమ్ము చేసుకునేందుకు మాల్వేర్లతో వరుస దాడులు చేస్తూ పేట్రేగిపోతున్నారు. అయితే ఈ తరహా దాడలు ఈ మధ్య కాలంలో ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఇటీవల గూగుల్‌కు చెందిన థ్రెట్ ఎనాలసిస్ గ్రూప్ హ్యాకింగ్ గురించి హైలెట్ చేస్తూ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం హ్యాకింగ్‌కు గురైన 4వేల యూట్యూబ్ అకౌంట్లను పునరుద్ధరించినట్లు ఆ రిపోర్ట్‌లో పేర్కొంది. వీటితో పాటు 62,000 ఫిషింగ్ పేజీలు,2,400 హానికరమైన ఫైల్స్‌ను బ్లాక్ చేసినట్లు స్పష్టం చేసింది.
తెలివి మీరిన హ్యాకర్స్
ఇక యూట్యూబ్ ఛాన్సల్‌ను హ్యాక్ చేయడంలో హ్యాకర్స్ తెలివి మీరినట్లు తెలుస్తోంది. యూట్యూబ్ అఫిషియల్ మెయిల్ పేరుతో ఫేక్ ఈమెయిల్ క్రియేట్ చేశారని, ఆ మెయిల్స్ క్రియేటర్లకు వెరిఫికేషన్ కోసం పంపించినట్లు థ్రెట్ ఎనాలసిస్ గుర్తించింది. దీంతో యూట్యూబ్ క్రియేటర్లు తమకు యూట్యూబ్ నుంచి అఫియల్స్ మెయిల్ వచ్చిందని,వెంటనే వెరిఫికేషన్ కోసం ప్రయత్నించడం వల్ల హ్యాక్ అయినట్లు అనుమానం వ్యక్తం చేసింది.
వెరిఫికేషన్ కోసం పంపిన మెయిల్స్‌ను క్లిక్ చేయడం వల్ల క్రియేటర్ ఛానల్ హ్యాకింగ్ గురవ్వడంతో పాటు పర్సనల్ డేటాను సేకరించినట్లు తేలింది. అంతేకాదు హ్యాక్ చేసిన ఒక్కో యూట్యూబ్ ఛానల్‌ను 4వేల డాలర్లకు అమ్ముకున్నట్లు గూగుల్‌కు చెందిన థ్రెట్ ఎనాలసిస్ గ్రూప్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఇక మే 2021 నుండి జీమెయిల్‌లో ఫిషింగ్ ఇమెయిల్‌ల వాల్యూమ్‌ను 99.6 శాతం తగ్గించినట్లు గూగుల్ తెలిపింది.
చదవండి: మొండి గూగుల్.. ఆ ఫోన్లలో కరెక్ట్ పాస్‌వర్డ్ కొట్టినా వేస్టే! ఎందుకంటే..
Comments
Please login to add a commentAdd a comment