న్యూయార్క్: అమెరికాలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. పలు రాష్ట్రాల క్యాపిటల్ భవనాల్లో పేలుళ్లు జరుపుతామని బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా భవనాలను ఖాలీ చేయించారు.
కనెక్టికట్, జార్జియా, కెంటుకీ, మిచిగాన్, మిన్నెసోటా, మిస్సిస్సిప్పి, మిచిగాన్, మోంటానా స్టేట్‌హౌస్ కార్యాలయాలకు బెదిరింపులు వచ్చాయి. దుండగులు ఈ-మెయిల్ ఐడీ ద్వారా ఆయా కార్యాలయాలకు బెదిరింపు సందేశాలు పంపించారు. దీంతో ఆయా క్యాపిటల్ భవనాలను ఖాలీ చేయించి బాంబు స్క్వాడ్ బృందాలు గాలింపు చేపట్టాయి. అయితే.. ప్రస్తుతానికి ఎలాంటి పేలుళ్ల ఆనవాల్లు లభించలేదని అధికారులు తెలిపారు. దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
మరోవైపు అమెరికా దాడిలో మరణించిన ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ సంస్మరణ ర్యాలీలో భారీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెనక అమెరికా, ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇదే క్రమంలో అమెరికా క్యాపిటల్ కార్యాలయాలకు బాంబు బెదిరింపులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదీ చదవండి: సైనిక చర్యకు దిగుతాం.. హౌతీలకు అమెరికా వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment