![TDP leader Srinivasulu arrested in Angallu riots case - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/11/SRINIVAS.jpg.webp?itok=INrvCZ3A)
దేవరింటి శ్రీనివాసులుకు జిల్లా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తున్న పోలీసులు
మదనపల్లె: మాజీ సీఎం చంద్రబాబు ‘యుద్ధభేరి’ పేరుతో చేపట్టిన ప్రాజెక్ట్‌ల సందర్శన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లులో జరిగిన అల్లర్ల కేసులో మదనపల్లె మండలం టీడీపీ అధ్యక్షుడు దేవరింటి శ్రీనివాసులును శనివారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపారు. ముదివేడు పిచ్చలవాండ్లపల్లె ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిలిపివేయాలని చంద్రబాబు హైకోర్టులో స్టే తెచ్చిన నేపథ్యంలో... ఆగస్టు 4న చంద్రబాబు అన్నమయ్య జిల్లా పర్యటనలో నిరసన తెలిపేందుకు ఆయకట్టు రైతులు అంగళ్లుకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా రైతులపై ఆగ్రహం వ్యక్తంచేసిన చంద్రబాబు వారిని కొట్టాలని, చంపాలని ఆవేశంతో కార్యకర్తలను రెచ్చగొట్టారు. దీంతో రైతులపై టీడీపీ నాయకులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీనిపై అంగళ్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమాపతిరెడ్డి ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, 20మందికి పైగా టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదుచేశారు. వీరిలో కొందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపగా, మరికొందరు పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం దేవరింటి శ్రీనివాసులును రూరల్ సీఐ శివాంజనేయులు అరెస్ట్ చేశారు. ఆయనకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా, రిమాండ్ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment