ఓ యూట్యూబర్ కారణంగా న్యూయార్క్ వీధులు శుక్రవారం సాయంత్రం రణరంగంగా మారాయి. లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రామ్‌లో ఫ్రీ గిఫ్ట్‌ల కోసం భారీగా గుమిగూడిన యువతతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో యూట్యూబర్‌తో సహా పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
21 ఏళ్ల కాయ్ సీనట్ ప్రముఖ యూట్యూబర్. యూట్యూబ్‌తో సహా ఇన్‌స్టాగ్రామ్, ట్వీచ్ వంటి సామాజిక మాధ్యమాల్లో లక్షల కొలది ఫాలోవర్లు ఉన్నారు. తనను కలవాలంటే మ్యాన్ హట్టన్‌కు రావాలని, అక్కడే లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రామ్‌లో ప్లే స్టేషన్ కన్సోల్‌తో సహా ఉచితంగా కానుకలు ఇస్తానని సీనట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. భారీగా ప్రజాదరణ ఉన్న సీనట్ పోస్టుకు స్పందించిన యువత శుక్రవారం సాయంత్రం దాదాపు 2000 మంది ఆ ప్రాంతానికి వచ్చేశారు.
భారీ సంఖ్యలో వచ్చిన యువతతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఒకరినొకరు తోసుకున్నారు. కాలనీల్లో కార్లను ధ్వంసం చేశారు. భవంతుల పైకి ఎక్కి నినాదాలు చేయడం, బాటిళ్లను విసరడం వంటి చేష్టలకు పాల్పడ్డారు. వారిని అదుపు చేయడానికి ప్రయత్నించిన పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. భద్రత దృష్ట్యా యూట్యూబర్ సీనట్‌ను కూడా నిర్భందించి దర్యాప్తు చేపడుతున్నారు.
ఇదీ చదవండి: 3 Years Jail For Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు 3 ఏళ్ల జైలు శిక్ష.. ఐదేళ్ల అనర్హత వేటు.. ఆ వెంటనే అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment