వెళ్లిపోకు నా ప్రాణమా! బోరున విలపించిన సృజన | Nepali Influencer Bibek Pangeni Last Farewell In New York, Watch Video Inside | Sakshi
Sakshi News home page

వెళ్లిపోకు నా ప్రాణమా! బోరున విలపించిన సృజన

Published Sun, Dec 22 2024 6:06 PM | Last Updated on Sun, Dec 22 2024 6:29 PM

Nepali influencerBibek Pangeni Last Farewell  In New York

క్యాన్సర్‌తో పోరాడి ఓడిపోయిన నేపాల్‌కు చెందిన సోషల్ మీడియా సెన్సేషన్ బిబేక్ పంగేని  అంత్యక్రియలు న్యూయార్క్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా అతని భార్య  సృజన సుబేది  బోరున విలపించారు. దీనికి సంబంధించిన వీడియో  పలువురి చేత కంట తడిపెట్టిస్తోంది.  ధైర్యంగా ఉండు మిత్రమా అంటూ నెటిజన్లు సృజనకు ధైర్యం చెబుతున్నారు.


2022లో  పంగేని క్యాన్సర్‌ను గుర్తిచారు.  బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న  భర్తను   ప్రేమించి పెళ్లి చేసుకున్న సృజన కంటిరెప్పలా కాపాడుకుంది. అన్నివేళలా అతనికి తోడుగా ఉంటూ, ధైర్యం చెబుతూ కన్నతల్లి కంటే మిన్నగా సేవలందించింది. చివరికి ఆమె ప్రేమ ఓడిపోయింది. యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో పీహెచ్‌డీ విద్యార్థి అయిన బిబెక్  పంగేని  సుదీర్ఘ పోరాటం తర్వాత (డిసెంబరు19న) తనువు చాలించారు.

మూడో దశ గ్లియోమాతో పోరాడుతున్న  భర్త చికిత్సకు  చికిత్స సమయంలో ధైర్యంగా నిలబడింది.ఎ లాగైన తన భర్తను కాపాడుకోవాలని తాపత్రయప పడింది. తన మొత్తం సమయాన్ని వెచ్చించింది. దీనికి సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసేది. తాను ధైర్యంగా ఉండటమే కాదు  భర్తకు ప్రేమను పంచుతూ తనలాంటి వారికి ఎంతో ప్రేరణగా నిలిచింది. సోషల్‌మీడియాలో వీరి రీల్స్‌, వీడియోలు నెటిజనుల హృదయాలను కూడా కదిలించేవి. అతను తొందరగా కోలుకోవాలని ప్రార్థించారు. కానీ ఎవరి ప్రార్థనలు ఫలించలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement