సడెన్‌గా విమాన ప్రయాణం క్యాన్సిల్‌ : పాపం ఆ జంట! | Sakshi
Sakshi News home page

సడెన్‌గా విమాన ప్రయాణం క్యాన్సిల్‌ : పాపం ఆ జంట!

Published Mon, Mar 4 2024 3:51 PM

US Couple Asks For Flight Change After Wife Diagnosed - Sakshi

ఓ జంట సరదాగా గడిపేందుకు ట్రిప్‌ ప్లాన్‌ చేసుకున్నారు. ప్లాన్‌ ప్రకారం విమాన టికెట్లు కూడా బుక్‌ చేసుకున్నారు. అనుకోని విధంగా భయానక వ్యాధి బారినపడటం సడెన్‌గా తిరిగొచ్చాయల్సిన పరిస్థితి ఎదురయ్యింది. అయితే సదరు విమానయాన సంస్థ ఆ జంట నుంచి నిర్థాక్షిణ్యంగా లక్షల్లో చార్జీలు వసూలు చేసింది. వారి పరిస్థితి ఇది అని వేడుకున్న ససేమిరా అంది విమానాయన సంస్థ. పాపం ఆ దంపతులుకు ఆ వ్యాధి వచ్చినందుకు బాధపడాలో లేక ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడు అయ్యినందుకు బాధపడాలో తెలియని స్థితి ఎదురయ్యింది.

ఈ చేదు ఘటన న్యూయార్క్‌ దంపతులకు ఎదురయ్యింది. జనవరిలో టోడ్‌(60) ప్యాట్రిసియా కెరెక్స్‌(70) దంపతులు జనరిలో న్యూయార్క్‌ నుంచి ఆక్లాండ్‌ వెళ్లేందుకు ఎయిర్‌ న్యూజలాండ్‌లో బిజినెస్‌ క్లాస్‌ బుక్‌ చేసుకున్నారు.  ఏప్రిల్‌ వరకు అక్కడే ఆక్లాండ్‌లోనే గడపాలని అనుకున్నారు. అయితే ఆరువారాలకే ప్యాట్రిసియా అనారోగ్యం బారిన పడింది. ఆమెకు పిత్తాశయం క్యాన్సర్‌ ఉందని నిర్థారణ అయ్యింది. నాలుగు నెలల కంటే ఎక్కువ బతకదన్నా విషాదవార్త ఆ దంపతులను నిలువున కుంగదీసింది. పైగా వెంటనే ట్రిప్‌ క్యాన్సిల్‌ చేసుకుని వచ్చేయాలని ఫ్యామిలీ డాక్టర్‌ కూడా సూచించడంతో తిరిగి వెళ్లిపోవాలని డిసైడ్‌ అయ్యింది ఆ జంట. అందుకోసమని తాము ముందుగా బుక్‌ చేసిన విమాన టికెట్లను క్యాన్సిల్‌ చేసి రీ షెడ్యూల్ చేయామని సదరు విమానయాన సంస్థను కోరారు.

అయితే సదరు విమానాయన సంస్థ రిటర్న్‌ టికెట్లు ధర ఏకంగా రూ. 18 లక్షలు దాక అవుతుందని స్పష్టం చేసింది. షాక్‌కి గురయ్యిన ఆ దంపతులు తమ పరిస్థితిని వివరించి వేడుకున్నారు. టోడ్‌ తన భార్య అనారోగ్య పరిస్థితి కారణంగా తమ ట్రిప్‌ క్యాన్సిల్‌ చేసుకున్నామని విమానాయన అధికారులకు తెలిపారు. ఇంతటి విషాదంలో ఇంతలా ఆర్థిక భారం మోపొద్దని ఎంతలా అభ్యర్థించినా సదరు విమానయాన అధికారులు అంగీకరించ లేదు. అయినా ఒక కస్టమర్‌ అనారోగ్య రీత్యా లేదా అనుకోని పరిస్థితుల వల్ల వెనక్కి వచ్చేయాల్సి వస్తే ఉండే కస్టమర్‌ ఎమర్జెన్సీ పాలసీని వర్తింపచేయొచ్చు. అయితే అధికారులు ఆ పాలసీని ఫాలో అవ్వకపోగా వేరే విమాన టికెట్లు బుక్‌ చేయాలంటే కనీసం రూ. 6.5 లక్షలు చెల్లించక తప్పదని తెగేసి చెప్పేసింది ఎయిర్‌ న్యూజిలాండ్‌.

పాపం ఆ దంపతులు హెల్త్‌ ఎమర్జెన్సీ దృష్ట్యా అంతమొత్తం చెల్లించి వెనక్కి వచ్చేశారు. అసలు న్యూజిలాండ్‌ వాసులు ఇంత కఠినంగా వ్యవహిరస్తారని మాకు తెలియదు అన్నారు ఆ దంపతులు. ఇది న్యూజిలాండ్‌ స్థాయికి తగని పని అని ఆవేదనగా చెప్పారు ఆ దంపతులు. ఇలాంటి విపత్కర స్థితిలో ఇంతలా వసూలు చేయడం అనేది ఏవిధంగా చూసిన సరైనది కాదన్నారు. ఆ దంపతులు ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి తెలుసుకున్న ఎయిర్‌ న్యూజిలాండ్‌ వెంటనే స్పందించి వారికి క్షమాపణలు చెప్పింది. వేరే విమాన టిక్కెట్లు బుక్‌ చేసేందుకు అయ్యిన అదనుపు టిక్కెట్లు ఖర్చులను కూడా వాససు ఇస్తామని స్పష్టం చేసింది.

నిజానికి ఒక కస్టమర్‌కి ఏదైన విపత్కర పరిస్థితి ఎదురయ్యితే చివరి నిమిషంలో టికెట్‌ క్యాన్సిల్‌ చేసి మరోక విమానంలో ప్రయాణించేలా చేసే వెసులబాటు ఉందని చెప్పడమే గాక ఆ దంపతులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాని పేర్కొంది. పైగా మరోసారి క్షమాపణలు చెప్పింది ఎయిర్‌ న్యూజిలాండ్‌. బస్‌, ట్రెయిన్‌ టికెట్లు క్యాన్సిల్‌ చేసుకుని డబ్బులు పోయినా అంత భయం అనిపించదు కానీ విమాన టికెట్లు క్యాన్సిల్‌ చేస్తే మాత్రం లక్షల్లో డబ్బు ఖర్చు చేయాల్సిందే. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వెసులుబాటు ఉంటుందిగానీ లేదంటే ఖర్చులు తడిసిమోపడవ్వడం గ్యారంటీ.

(చదవండి: బట్టతలపై జుట్టు పెరిగెలా చెయ్యొచ్చు! పరిశోధనలో షాకింగ్‌ విషయాలు)
 

Advertisement

తప్పక చదవండి

Advertisement