అర్ధరాత్రి.. యువతి ఇంటి ముందు.. | young man who made a riot in front of the house at midnight | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి.. యువతి ఇంటి ముందు..

Published Wed, Aug 16 2017 9:00 AM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM

అర్ధరాత్రి.. యువతి ఇంటి ముందు.. - Sakshi

అర్ధరాత్రి.. యువతి ఇంటి ముందు..

జయనగర(కర్నాటక): అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న యువతి తలుపు తట్టి గొడవకు దిగిన యువకుడు పోలీసులు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన జయనగర ఐదవబ్లాక్‌లో జరిగింది. నాలుగురోజుల క్రితం జయనగర ఐదవ బ్లాక్‌లోని ఓ ఇంట్లోకి  యువతి కొత్తగా అద్దెకు దిగింది. యువతి ఒంటరిగా ఉండటాన్ని పసిగట్టిన యువకుడు సోమవారం అర్ధరాత్రి సమయంలో ఇంటి తలుపు తట్టడంతో ఆమె బయటకు వచ్చింది. అతడు నానా యాగీ చేయడంతో భయపడిన యువతి ఇంటి యజమానికి ఫోన్‌ చేసింది.

అంతేగాక అదే భవనంలో ఉన్న సీరియల్‌ నటుడు శ్రీధర్‌కు యువతి ఫోన్‌ చేసి సహాయం కోరింది. శ్రీధర్‌ వచ్చి యువకుణ్ని అడ్డుకుని, ఆ గొడవను సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. గొడవకు దిగిన యువకుడు కిరణ్‌ ఇదే కట్టడంలో నివాసముంటున్నాడు. మద్యం మత్తులో అల్లరికి దిగాడు. ఎందుకిలా ప్రవర్తించారని శ్రీధర్‌ నిలదీయడంతో పొరపాటున ఇలా జరిగిందంటూ శ్రీధర్‌ సెల్‌ఫోన్‌ లాక్కోవడానికి ప్రయత్నించాడు. కాగా, బాధితురాలు జయనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారణ చేపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement