ఆ బహుళ అంతస్తుల భవనం కేవలం మహిళలకు మాత్రమే అద్దెకిస్తారు. పురుషులకు మాత్రం అస్సలు అనుమతి లేదు. స్త్రీల కోసమే ప్రత్యేకంగా ఆ ఆ ప్లాట్‌లను తీర్చిదిద్దారట. ఈ బహుళ అంతస్తుల భవనం యూకేలో ఉంది. బ్రిటన్ తొలిసారిగా మహిళల కోసమే బహుళ అంతస్తుల భవనాన్ని లండన్‌లో నిర్మిస్తోంది. వివరాల్లోకెళ్తే..బ్రిటన్‌లో 1902లో ఓటింగ్ ఉద్యమంలో భాగంగా స్థాపించిన హౌసింగ్ అసోసియేషన్ దీన్ని నిర్మిస్తుంది. ఈ ప్రోపర్టీకి యజమాని అయిన ఉమెన్స్ పయనీర్ హౌసింగ్(డబ్ల్యూపీహెచ్) సంస్థ ప్రతి అపార్ట్‌మెంట్‌ని మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించనున్నట్లు తెలిపారు.
మోనోపాజ్ దాటిన పెద్ద వయసు మహిళలకు తగిన విధంగా బాల్కనీ, మంచి వెంటిలేషన్ ఉండేలా ఆధునాత సౌకర్యాలతో ప్రతి అపార్ట్‌మెంట్‌ని తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించింది. ఈ ఫ్లాట్‌లను కేవలం గృహవేధింపులకు గురైన మహిళలకు, ఒంటరి మహిళలకు, నల్లజాతి స్త్రీలకు, అవసరమైతే ఒంటరిగా ఉన్న మైనారీటి మహిళలకు మాత్రమే అద్దెకు ఇస్తారని డబ్ల్యూపీహెచ్ పేర్కొంది. డబ్ల్యూపీహెచ్ నిబంధనల ప్రకారం..ఒంటరి మహిళలు మాత్రమే ఈ అపార్ట్‌మెంట్‌లో ఉండాలి. ఈ అపార్ట్‌మెంట్‌కి మహిళలు మాత్రమే అద్దెదారు అయ్యి ఉండి, ఆమె భాగస్వామినిగా ఉన్న పురుషుడు అయితే ఉండొచ్చు.
అలాగే ఒంటిరి మహిళలకు మగ సంతానం ఉన్నట్లయితే వారు కూడా ఉండవచ్చని పేర్కొంది. అలాగే ట్రాన్స్‌జెండర్ మహళలు కూడా అద్దెకుండటానికి అనుమతి ఇస్తున్నట్లు డబ్ల్యూపీహెచ్ స్పష్టం చేసింది. అయితే ఈ భవనంపై కోర్టులో వివాదం నడుస్తున్నట్లు సమాచారం. కొందరు మాత్రం ఈ ప్రాజెక్టు అంతగా బాగోలేదని పెదవి విరిచారు. మహిళలకు ఇంత పెద్ద భవనం వారిని ప్రమాదంలోకి నెట్టేస్తుందని, అన్ని మెట్లు ఎక్కలేరంటూ విర్శలు వినిపిస్తున్నాయి.
కానీ ఈ భవనం రూపొందిస్తున్న ఆర్కిటెక్ట్ కోలిన్ వీచ్ ఆ విమర్శలను కొట్టి పారేసింది. ఈ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున మహిళలు మద్దతిస్తున్నట్లు చెప్పింది. ఈ భవనం మహిళలకు గృహవసతి కల్పిస్తుందన్నారు. నాలాంటి మహిళలు ఎందరికో ఇది ఆవాసంగా ఉపయోగపడుతుందన్నారు. దీని ద్వారా మహిళలు అనితరసాధ్యమైన సవాళ్లు చాలా సునాయాసంగా అధిగమించగలరని వీచ్ చెప్పుకొచ్చారు.
(చదవండి: ఆకలితో ఉన్న ఓ విద్యార్థి ఏం చేశాడంటే..ఏకంగా రూ. 98 లక్షలు ఖరీదు చేసే..)
Comments
Please login to add a commentAdd a comment