
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈనెల 30వ తేదీ ఉదయం 6.30 గంటలకు సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ56 ప్రయోగాన్ని నిర్వహించనుంది. ఇప్పటికే నాలుగు దశల అనుసంధానం పనులను పూర్తి చేసి రాకెట్‌ను మొబైల్ సర్వీస్ టవర్ (ఎంఎస్‌టీ)కు తీసుకువచ్చారు. అక్కడ ఏడు ఉపగ్రహాలను రాకెట్ శిఖరభాగాన అమర్చి.. హీట్‌షీల్డ్ క్లోజ్ చేసే ప్రక్రియను బుధవారం పూర్తి చేశారు. 29వ తేదీ ఉదయం 6.30 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించనున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆ సమయాన్ని కొద్దిగా మార్చే అవకాశం కూడా ఉంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన 422 కిలోల బరువు కలిగిన ఏడు ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment