భార్య అన్నం పెట్టలేదని భర్త ఆత్మహత్యా యత్నం | Man Climb Tower For Wife Refuse to Food in Tamil nadu | Sakshi
Sakshi News home page

భార్య అన్నం పెట్టలేదని భర్త ఆత్మహత్యా యత్నం

Published Mon, Nov 11 2019 10:37 AM | Last Updated on Mon, Nov 11 2019 10:37 AM

Man Climb Tower For Wife Refuse to Food in Tamil nadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చెన్నై,టీ.నగర్‌: పోరూరు చెరువులోని విద్యుత్‌ టవరెక్కి శనివారం రాత్రి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం తెలిపారు. ఇన్‌స్పెక్టర్‌ శంకర నారాయణన్‌ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అలాగే, అగ్నిమాపక సిబ్బంది వెంట వచ్చారు. పోలీసులు యువకుడికి నచ్చచెప్పి కిందకు దించారు. విచారణలో తన పేరు చెల్లపాండియన్‌ అని, తనకు భార్య అన్నం పెట్టకపోవడంతో విద్యుత్‌ టవర్‌ ఎక్కినట్లు చెప్పాడు. శనివారం ఉదయం మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. దీంతో అతనికి భార్య అన్నం పెట్టలేదు. దీంతో ఆవేదనకు గురైన అతను ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలిసింది. పోలీసులు అతన్ని హెచ్చరించి ఇంటికి పంపివేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement