పెన్సిల్వేనియా: ఈ మధ్యన పెద్ద పెద్ద టవర్లను టెక్నాలజీ సాయంతో సెకన్ల వ్యవధిలోనే కూలగొట్టడం పరిపాటిగా మారిపోయింది. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. విషయంలోకి వెళితే.. మన దగ్గర చూడకపోయినా.. విదేశాల్లోని వ్యవసాయక్షేత్రాల్లో సిలోస్ టవర్లను విరివిగా వాడుతున్నారు. ఈ సిలోస్‌లో వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, దాన్యం నిల్వ, కెమికల్స్‌ను స్టోరేజ్ చేస్తున్నారు.
తాజాగా అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందిన ఒక రైతు తన వ్యవసాయక్షేత్రంలో సిలోస్ పాడైనదశకు చేరుకోవడంతో దానిని కూలగొట్టి కొత్తది కట్టాలని నిర్ణయించుకున్నాడు. సాధారణంగానే సిలోస్‌ను కూలగొట్టాలంటే చాలా టైం పడుతుంది. అయితే కొత్త టెక్నాలజీ సాయంతో వికర్ణ దిశలో టవర్‌ను సెకన్ల వ్యవధిలో నేలమట్టం చేశారు. సిలోస్ టవర్ నేలమట్టం అయ్యే వీడియో విపరీతంగా ఆకట్టుకుంది. ఎంత పద్దతిగా అంటే.. అది కూలేటప్పుడు ఒక్క ఇటుక కూడా కదల్లేదు. అదే సమయంలో పక్కనే ఉన్న మిగతా సిలోస్ టవర్లు ఒక్క ఇంచు కదలేకపోవడం విశేషం. ఈ వీడియో చూసిన నెటిజన్లు టెక్నాలజీకి ఫిదా అవుతున్నారు.
చదవండి: వైరల్: మొసలిపై కొంగ సవారీ .. నోరెళ్లబెట్టిన నెటిజన్లు
Comments
Please login to add a commentAdd a comment