Pennsylvania
-
గుడ్ల దొంగలొచ్చారు
పాత తెలుగు సినిమాల్లో కామెడీ దొంగలుంటారు. వాళ్ల పని ఊళ్లో కోళ్లు పట్టడమే. ఎత్తుకొచ్చిన, కొట్టుకొచ్చిన కోళ్లను చక్కగా వండుకు తినే వాళ్లు కొందరైతే వాటిని ఎంతకో కొంతకు అమ్ముకుని సొమ్ము చేసుకునే వాళ్లు ఇంకొదరు. అలాంటి దొంగలు ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో పడ్డారు. అయితే వాళ్లు దొంగకోళ్లు పట్టేవాళ్లు కాదు. కోడిగుడ్లు కొట్టేసేవాళ్లు. పెరుగుతున్న కోడి గుడ్డు ధరను సొమ్ము చేసుకునేందుకు కొందరు ఈ ‘గుడ్ల గుటకాయస్వాహ’పథకానికి వ్యూహ రచన చేశారు. అనుకున్నదే తడవుగా ఒకే దెబ్బకు 1,00,000కుపైగా గుడ్లను కొట్టేశారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని గ్రీన్‌క్యాసెల్ నగరంలో పీట్ అండ్ గ్యారీస్ ఆర్గానిక్స్ ఎల్ఎల్సీ సంస్థకు చెందిన లారీ నుంచి దొంగలు ఈ గుడ్లను దొంగతనం చేశారు. వీటి విలువ దాదాపు రూ.35 లక్షలు. కొండెక్కుతున్న గుడ్డు ధర ఎవరైనా కోళ్లను దొంగతనం చేస్తారు. వీళ్లేంటి కోడిగుడ్ల వెంట పడ్డారని అనుమానం రావొచ్చు. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి బర్డ్‌ఫ్లూ. రెండోది పెరుగుతున్న గుడ్ల ధర. అమెరికాలో గత రెండేళ్లుగా పలు ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ ప్రభావం నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. గత దశాబ్దకాలంలో ఇంతటి విస్తృత స్థాయిలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాపించడం ఇదే తొలిసారి. గతనెల లూసియానాలో మనుషులకు సైతం ప్రాణాంతకరమైన స్థాయి వేరియంట్ బర్డ్‌ఫ్లూను కనుగొన్నారు. దీంతో పౌల్ట్రీ యజమానులు ప్రతి నెలా లక్షలాది కోళ్లను చంపేస్తున్నారు. ఈ దొంగలు నిజంగానే కోళ్లను కొట్టేసి అమ్మినా జనం ‘బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్లు’అని భావించి ఎవరూ కొనక పోవచ్చు. బర్డ్‌ఫ్లూ భయంతో జనం చికెన్‌లాంటి పక్షి మాంసం వాడకం తగ్గించి చాలా మటుకు గుడ్లను తింటున్నారని తెలుస్తోంది. ఇందుకు పెరుగుతున్న కోడి గుడ్ల ధరలే ప్రబల తార్కాణం. మొత్తంగా చూస్తే కోడి గుడ్డు ధర రెట్టింపు అయినట్లు వార్తలొచ్చాయి. ఈ వార్తే దొంగలను గుడ్ల చోరీకి ఉసిగొల్పింది. దుకాణాల్లో పంపిణీ కోసం లారీలో సిద్ధంగా ఉంచిన గుడ్లను శనివారం రాత్రి ఆగంతకులు ఎత్తుకెళ్లిపోయారని పోలీసులు ప్రకటించారు. కేసు నమోదుచేసి గుడ్ల దొంగల కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపడుతున్నారు. అయితే దొంగలు ఈపాటికి గుడ్లను ఇష్టమొచ్చిన అధిక రేటుకు అమ్ముకుని మరో గుడ్ల షాపుపై రెక్కీ నిర్వహిస్తూ ఉంటారని కొందరు నెటిజన్లు సరదా వ్యాఖ్యల పోస్ట్‌లు పెట్టారు. గుడ్ల కొరత ఏర్పడటంతో గుడ్లతో చేసే వంటకాల ధరలూ రెస్టారెంట్లు, హోటళ్లలో పెరుగుతున్నాయి. అమెరికాలో 25 రాష్ట్రాల్లో దాదాపు 2,000 చోట్ల వ్యాపారం చేస్తున్న ప్రఖ్యాత వేఫుల్ హౌస్ రెస్టారెంట్ తమ గుడ్ల వంటకాల ధరను కాస్తంత పెంచింది. ‘‘మార్కెట్లో గుడ్లు దొరకట్లేవు. ఎక్కువ ఖరీదు పెట్టి కొంటున్నాం. అందుకే ఎక్కువ ధరకు అమ్ముతున్నాం’’అని రెస్టారెంట్ తాపీగా చెబుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
USA Presidential Elections 2024: వైట్‌హౌస్‌కు దారేది?..7 స్వింగ్ స్టేట్లే కీలకం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తుది అంకానికి చేరింది. అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పోలింగ్ ప్రక్రియ మంగళవారం జరగనుంది. డెమొక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అత్యంత హోరాహోరీగా తలపడుతున్నారు. దాంతో వారిలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి! అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల్లో ఏదో ఒకదానికి స్పష్టంగా మద్దతిచ్చేవే. వీటిని సేఫ్ స్టేట్స్‌గా పిలుస్తారు. ప్రతి అధ్యక్ష ఎన్నికల్లోనూ సదరు రాష్ట్రాలను ఆయా పార్టీలే గెలుచుకుంటాయి. కనుక ఎటూ తేల్చుకోని ఓటర్లు ఎక్కువగా ఉండే కొన్ని రాష్ట్రాల్లోనే పోటీ ప్రధానంగా కేంద్రీకృతం అవుతుంటుంది. వాటిని స్వింగ్ స్టేట్స్‌గా పిలుస్తుంటారు. ఈసారి అలాంటి రాష్ట్రాలు ఏడున్నాయి. అవే పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్ కరోలినా, జార్జియా, నెవడా, అరిజోనా. 93 ఎలక్టోరల్ ఓట్లు వీటి సొంతం. వాటిలో మెజారిటీ ఓట్లను ఒడిసిపట్టే వారే అధ్యక్ష పీఠమెక్కుతారు. ట్రంప్‌కు 51, హారిస్‌కు 44 అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. విజయా నికి కనీసం 270 ఓట్లు రావాలి. 48 రాష్ట్రాల్లో మెజారిటీ ఓ ట్లు సాధించిన అభ్యర్థి తాలూకు పార్టీకే ఆ రాష్ట్రంలోని మొ త్తం ఎలక్టోరల్ ఓట్లు దఖలు పడే (విన్నర్ టేక్స్ ఆల్) విధా నం అమల్లో ఉంది. ఆ లెక్కన సేఫ్ స్టేట్లన్నీ ఈసారి ఆయా పార్టీల ఖాతాలోనే పడే పక్షంలో హారిస్ 226 ఓట్లు సాధిస్తారు. ట్రంప్‌కు మాత్రం 219 ఓట్లే వస్తాయి. స్వింగ్ స్టేట్లలో ని 93 ఓట్లు అత్యంత కీలకంగా మారడానికి కారణమిదే. ట్రంప్ గెలవాలంటే వాటిలో కనీసం 51 ఓట్లు సాధించాలి. హారిస్‌కు మాత్రం 44 ఓట్లు చాలు. గత కొద్ది ఎన్నికలుగా ఈ ఏడు స్వింగ్ స్టేట్ల ఓటింగ్ ధోరణి, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా వాటిలో ఈసారి ఫలితాలు ఎలా ఉండవచ్చన్న దానిపై జోరుగా అంచనాలు, విశ్లేషణలు సాగుతున్నాయి.పెన్సిల్వేనియా కీలకం 19 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియా ఈసారి మొత్తం అమెరికా దృష్టినీ ఆకర్షిస్తోంది. అక్కడ నెగ్గిన అభ్యర్థే అధ్యక్షుడయ్యే అవకాశాలు ఏకంగా 90 శాతమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. జనాభా వైవిధ్యం విషయంలో కూడా ఆ రాష్ట్రం అచ్చం అమెరికాకు నకలులా ఉంటుంది. డెమొక్రాట్ల ఆధిపత్యం సాగే పెద్ద నగరాలు, రిపబ్లికన్ కంచుకోటలైన గ్రామీణ ప్రాంతాలు పెన్సిల్వేనియా సొంతం. దాంతో హారిస్, ట్రంప్ మధ్య హోరాహోరీ నెలకొంది.రస్ట్ బెల్ట్–సన్ బెల్ట్ అమెరికా నిర్మాణ రంగంలో ప్రముఖ పాత్ర పోషించే విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాలను రస్ట్ బెల్ట్ రాష్ట్రాలుగా పిలుస్తారు. ఈ మూడింట్లో కలిపి 44 ఓట్లున్నాయి. మిగతా దేశంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే నెవడా, అరిజోనా, నార్త్ కరోలినా, జార్జియాలను సన్ బెల్ట్ రాష్ట్రాలంటారు. వీటిలో మొత్తం 49 ఓట్లున్నాయి. → రస్ట్ బెల్ట్ నిర్మాణ రంగానికి నిలయం. దాంతో విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ఓటర్లపై కారి్మక సంఘాల ప్రభావం ఎక్కువే. → ఈ రాష్ట్రాలపై దశాబ్దాలుగా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగుతూ వస్తోంది. ఎంతగా అంటే, గత ఎనిమిది అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఏడుసార్లు ఈ మూడు రాష్ట్రాలూ ఆ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. ఒక్క 2016లో మాత్రం వాటిలో పూర్తిగా ట్రంప్ హవా నడిచింది. → ఈసారి కూడా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగితే 44 ఓట్లూ కమల ఖాతాలోనే పడతాయి. అదే జరిగితే తొలి మహిళా ప్రెసిడెంట్‌గా ఆమె చరిత్ర సృష్టిస్తారు. → అలాగాక 2016లో మాదిరిగా ట్రంప్ మరోసారి ఈ మూ డు రాష్ట్రాలనూ నెగ్గినా విజయానికి ఏడు ఓట్ల దూరంలో నిలుస్తారు. అప్పుడాయన విజయం కోసం కనీసం మరో స్వింగ్ స్టేట్‌ను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. → ఒకవేళ హారిస్ రస్ట్ బెల్ట్ రాష్ట్రాల్లో కీలకమైన పెన్సిల్వేనియాతో పాటు మరోదాన్ని దక్కించుకున్నా ఆమె విజయావకాశాలు మెరుగ్గానే ఉంటాయి. మిగతా నాలుగు స్వింగ్ స్టేట్లలో ఏ ఒక్కదాన్ని నెగ్గినా ఆమె గెలిచినట్టే. ట్రంప్ గెలవాలంటే ఆ నాలుగింటినీ స్వీప్ చేయాల్సి ఉంటుంది. → హారిస్ రస్ట్ బెల్ట్‌లో సున్నా చుట్టినా నాలుగు సన్ బెల్ట్ రాష్ట్రాలను స్వీప్ చేస్తే విజయం ఆమెదే. → అయితే ఇందుకు అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే 1948 తర్వాత డెమొక్రాట్లు సన్ బెల్ట్‌ను క్లీన్‌స్వీప్ చేయలేదు. → రిపబ్లికన్లకు మాత్రం సన్ బెల్ట్‌ను పలుమార్లు క్లీన్‌స్వీప్ చేసిన చరిత్ర ఉంది. ఈసారీ అలా జరిగినా ట్రంప్ విజయానికి అది చాలదు. రస్ట్ బెల్ట్ నుంచి కనీసం ఒక్క రాష్ట్రాన్నైనా ఆయన చేజిక్కించుకోవాలి. లేదంటే 269 ఓట్లకు పరిమితమై ఓటమి పాలవుతారు.రస్ట్ బెల్ట్‌లో విజయావకాశాలు → రస్ట్ బెల్ట్‌లో హారిస్ గెలవాలంటే పట్టణ ఓటర్లు భారీగా ఓటేయాల్సి ఉంటుంది. నల్లజాతీయులు, మైనారిటీలు, విద్యాధికులు, మధ్య తరగతి ఓట్లు, ముఖ్యంగా మహిళలు పోలింగ్ బూత్‌లకు తరలడం తప్పనిసరి. → అలాగాక గ్రామీణ ఓటర్లు భారీగా ఓటేస్తే 2016లో మాదిరిగా మరోసారి రస్ట్ బెల్ట్ ట్రంప్‌దే అవుతుంది. → ఈసారి గ్రామీణులతో పాటు యువ ఓటర్లు కూడా తనకే జైకొడతారని ఆయన ధీమాగా ఉన్నారు. సన్ బెల్ట్‌లో విజయావకాశాలు → ఇక్కడ విజయావకాశాలను అమితంగా ప్రభావితం చేసేది నల్లజాతీయులు, లాటిన్ అమెరికన్ ఓటర్లే. → జార్జియా, నార్త్ కరోలినాల్లో నల్లజాతి ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. అరిజోనా, నెవడాల్లో లాటిన్ అమెరికన్ జనాభా నానాటికీ పెరుగుతోంది. → హారిస్ జమైకన్ మూలాల దృష్ట్యా నల్లజాతీయులు ఆమెవైపే మొగ్గుతారని భావిస్తున్నారు. ఇక ట్రంప్ ర్యాలీలో ప్యూర్టోరీకన్లు, లాటిన్ అమెరికన్లపై వెలువడ్డ వ్యంగ్య వ్యాఖ్యలపై ఆగ్రహంతో వారు కూడా హారిస్‌కే ఓటేస్తారని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Donald Trump: అమెరికాకు గౌరవం తెస్తా
పెన్సిల్వేనియా: అవినీతి లేని వ్యవస్థను, అమెరికా విదేశాంగ విధానానికి తిరిగి ‘గౌరవం’ తీసుకొస్తానని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. నేరాలకు మూలమైన ఓపెన్ బోర్డర్‌ను మూసేస్తామని హామీ ఇచ్చారు. జూలై 13న తనపై హత్యాయత్నం జరిగిన మళ్లీ పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో శనివారం ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. వేలాదిగా గుమిగూడిన అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య మాట్లాడారు. రాజకీయ ప్రత్యర్థులు తనపై దు్రష్పచారం చేస్తున్నారని, చంపడానికి కూడా ప్రయతి్నంచారని ట్రంప్ ఆరోపించారు. జూలై 13న తనపై హత్యాయత్నం జరిగిన ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఓ 15 సెకన్ల పాటు కాలం ఆగిపోయింది. ఓ దుర్మార్గుడు చెడు చేద్దామని ప్రయతి్నంచాడు. కానీ విజయం సాధించలేకపోయాడు’’ అని వ్యాఖ్యానించారు. కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయమవడం, ఒక వలంటీర్ ఫైర్ చీఫ్ మరణించడం తెలిసిందే.చిందేసిన మస్క్ టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో తొలిసారి కనిపించారు. ఆయనను ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తుతూ వేదికపైకి ఆహా్వనించారు. ట్రంప్ మాట్లాడుతుండగా మస్క్ చిందేసి సభికులను అలరించారు. ట్రంప్‌కు ఓటేయడం కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని చెప్పారు. ట్రంప్ ఓడిపోతే 2024 ఎన్నికలే అమెరికన్లకు చివరివి అవుతాయని హెచ్చరించారు. -
USA Presidential Elections 2024: కమలదే పై చేయి
డిబేట్ కోసం ప్రత్యర్థులిద్దరూ ఏబీసీ వేదికపైకి రాగానే హారిసే చొరవ తీసుకుని ట్రంప్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు. తద్వారా ముందే పైచేయి సాధించారు. డిబేట్ చక్కగా సాగాలని ఆమె ఆకాంక్షించగా, ‘హావ్ ఫన్’ అంటూ ట్రంప్ స్పందించారు.గంటా నలభై ఐదు నిమిషాల పాటు సాగిన డిబేట్ ముగిశాక మాత్రం కరచాలనం వంటివేమీ లేకుండానే ఎవరికి వాళ్లు వేదిక నుంచి నిష్క్రమించారు.డిబేట్ పొడవునా హారిస్ పదేపదే ట్రంప్‌ను ఉడికించే వ్యాఖ్యలు చేశారు. పలు కేసుల్లో ఆయన దోషి అని ఇప్పటికే నిరూపణ అయిందంటూ ఎత్తిచూపారు. ఆయనపై మరెన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ట్రంప్ మాట్లాడుతుండగా పదేపదే నవ్వులు, ప్రశ్నార్థక చూపులతో ఆయన్ను ఒత్తిడిలోకి నెట్టారు.ఈ ఎత్తుగడలన్నీ బాగా ఫలించాయి. హారిస్ ఇలాంటి విమర్శలు చేసినప్పుడల్లా ట్రంప్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఆగ్రహంలో అదుపు తప్పి పదేపదే అబద్ధాలు, అవాస్తవాలు చెప్పారు.ఆఫ్రో అమెరికన్ల ఓట్ల కోసం హారిస్ ఇటీవల ఆమె నల్లజాతి మూలాలను పదేపదే చెప్పుకుంటున్నారన్న తన గత వ్యాఖ్యలపై స్పందించేందుకు ట్రంప్ నిరాకరించారు. హారిస్ మాత్రం పలు సందర్భాల్లో ట్రంప్ చేసిన వివాదాస్పద జాతి వివక్షపూరిత, విద్వేష వ్యాఖ్యలన్నింటినీ ఏకరువు పెట్టారు.వాషింగ్టన్: అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూసిన తొలి, బహుశా ఏకైక ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59)దే పై చేయి అయింది. ఆమె దూకుడు ముందు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (78) వెలవెలబోయారు. మంగళవారం రాత్రి పెన్సిల్వేనియాలో ఏబీసీ వార్తా సంస్థ వేదికగా జరిగిన డిబేట్లో మాజీ అధ్యక్షునిపై హారిస్ ఆద్యంతం స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించారు. దాదాపుగా ప్రతి అంశంలోనూ ట్రంప్‌ను చిత్తు చేశారు. ఆమె పక్కాగా హోం వర్క్ చేసి వచి్చన తీరు డిబేట్లో అడుగడుగునా కని్పంచింది. తొలుత కాస్త తడబడ్డా డిబేట్ సాగుతున్న కొద్దీ హారిస్ దూకుడు కనబరిచారు. పదునైన పంచ్‌లతో, టైమ్లీ వన్ లైనర్లతో ఎక్కడికక్కడ ట్రంప్‌ను ఇరుకున పెట్టారు. ఆర్థిక వ్యవస్థ మొదలుకుని విదేశీ విధానం, వలసలు, అబార్షన్ల దాకా ప్రతి అంశం మీదా చర్చను తను కోరుకున్న దిశగా నడిపించడంలో విజయవంతమయ్యారు. పూర్వాశ్రమంలో లాయర్ అయిన హారిస్ వాదనా పటిమ ముందు ట్రంప్ నిలువలేకపోయారు. చాలావరకు ఆమె ప్రశ్నలకు, లేవనెత్తిన అంశాలకు వివరణలు ఇచ్చుకోవడానికే పరిమితమయ్యారు. తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్లో అధ్యక్షుడు జో బైడెన్‌ను ట్రంప్ ఓ ఆటాడుకోవడం తెలిసిందే. ట్రంప్ పచ్చి అబద్దాలు చెప్పినా బైడెన్ కనీసం వాటిని వేలెత్తి చూపలేకపోయారు. పైగా ప్రసంగం మధ్యలో పదేపదే ఆగుతూ, పదాల కోసం తడుముకుంటూ, వయోభారంతో వణుకుతూ అభాసుపాలయ్యారు. ఈ దారుణ వైఫల్యంతో చివరికి పోటీ నుంచే బైడెన్ తప్పుకోవాల్సి వచి్చంది. ఆయన స్థానంలో అధ్యక్ష రేసులోకి వచ్చిన హారిస్ మాత్రం తాజా డిబేట్లో ట్రంప్‌కు చెమటలు పట్టించారు. ‘‘మన దేశాన్ని ఎలా నడపాలన్న ప్రధానాంశంపై ఈ రాత్రి మీరు ఇంతసేపూ రెండు భిన్నమైన వాదనలు విన్నారు. ఒకటి భవిష్యత్తుపై దృష్టి పెట్టిన నా వాదన. రెండోది గతం గురించి మాత్రమే మాట్లాడిన, దేశాన్ని వెనక్కే తీసుకెళ్లజూస్తున్న ట్రంప్ వాదన’’ అంటూ డిబేట్‌ను అంతే ప్రభావవంతంగా ముగించారు హారిస్.అబార్షన్‌పై హారిస్ → ట్రంప్ గెలిస్తే అబార్షన్లను నిషేధిస్తూ చట్టం తెస్తారు. → గర్భధారణలు, అబార్షన్లను ప్రభుత్వం వేయి కళ్లతో గమనిస్తుంటుంది. → అమెరికన్ల శరీరాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోరాదన్నదే నా వైఖరి. → ట్రంప్ మాత్రం మహిళల శరీరాలపై హక్కులు ప్రభుత్వాలవేనంటున్నారు.ట్రంప్ → అబార్షన్లపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలన్నదే నా విధానం. → అదిప్పటికే అమల్లో ఉంది. కనుక దీనిపై అసలు గొడవ గానీ, భిన్నాభిప్రాయాలు గానీ లేవు. → అంతే తప్ప నేనేమీ అబార్షన్లను నిషేధించబోవడం లేదు. → ఈ విషయంలో హారిస్ చెప్పేవన్నీ అబద్ధాలే.ఎన్నికల ర్యాలీలపైహారిస్ → ట్రంప్ ఎన్నికల ర్యాలీలు ఆద్యంతం పరమ బోరుగా సాగుతున్నాయి.→ జనాన్ని ఆకట్టుకునేలా మాట్లాడటంలో ఆయన ఘోరంగా విపలమవుతున్నారు. → విండ్ మిల్లుల వల్ల క్యాన్సర్ వస్తుంది వంటి కామెంట్లతో అభాసుపాలవుతున్నారు. → ట్రంప్ ప్రసంగం వినలేక జనం మధ్యలోనే వెళ్లిపోతున్నారు.ట్రంప్ → అన్నీ శుద్ధ అబద్ధాలు. బైడెన్–హారిస్ విధానాలతో అమెరికా అన్ని రంగాల్లోనూ కుదేలవుతోంది. అందుకే అమెరికన్లు పాత రోజులను కోరుకుంటున్నారు.→ దాంతో నా ర్యాలీలకు జనం పోటెత్తుతున్నారు. → వాటికి అమెరికా చరిత్రలోనూ అపూర్వమైన ఆదరణ దక్కుతోంది. → హారిస్ తన ర్యాలీలకు డబ్బులిచ్చి జనాన్ని రప్పించుకుంటున్నారు.ఆర్థిక వ్యవస్థపైట్రంప్: ఈ విషయంలో నేనేం చేయబోతున్నదీ అందరికీ తెలుసు. నా హయాంలో కరోనా కల్లోలాన్ని తట్టుకుంటూ అమెరికా ఆర్థిక వ్యవస్థను గొప్పగా మలిచా. దాన్ని మరోసారి చేసి చూపిస్తా. పన్నులకు భారీగా కోత పెడతా. హారిస్ మార్క్సిస్టు. మార్క్సిస్టు తండ్రి నుంచి పాఠాలు నేర్చుకున్నారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక విధానాల్లో ఆమె ఇప్పుడు నా భాషనే మాట్లాడుతున్నారు. కానీ గెలిచారంటే మాత్రం దేశాన్ని సర్వనాశనం చేస్తారు. బైడెన్‌కు, ఆమెకు తేడా లేదు. హారిస్: నేను బైడెన్నూ కాను, ట్రంప్‌ను అంతకన్నా కాను. ఈ విషయంలో నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. దేశానికి కొత్త తరం నాయకత్వాన్ని అందిస్తా. ఉత్త మాటలే తప్ప నిజానికి ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేందుకు ట్రంప్ వద్ద ఎలాంటి ప్రణాళికా లేదు. తన క్షేమం తప్ప ఆయనకు మీరెవరూ పట్టరు. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచి్చన నాకు ఆర్థికంగా దేశానికి ఏం కావాలో బాగా తెలుసు.వలసలపైట్రంప్ సరిహద్దుల నుంచి లక్షలాది మంది చొరబడుతున్నారంటే వలసల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న హారిసే ప్రధాన కారణం. వాళ్లు మన పెంపుడు జంతువులను కూడా తినేస్తున్నారు. ఈ చొరబాట్లు అమెరికాకు చాలా చేటు చేస్తాయి.హారిస్ ట్రంప్ వల్లే వలసల బిల్లు బుట్టదాఖలైందని విమర్శించడం మినహా ఈ అంశంపై పెద్దగా ఏమీ మాట్లాడలేదు. వలసదారులు పెంపుడు జంతువులను తింటున్నారన్న ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికన్లే పెదవి విరుస్తున్న నేపథ్యంలో వాటిపై వ్యూహాత్మక మౌనం పాటించారు.యుద్ధాలు, విదేశీ వ్యవహారాలపై... ట్రంప్ → నేను గెలిస్తే ఉక్రెయిన్ యుద్ధానికి ఒక్క రోజులో ముగింపు పలుకుతా. నేను ప్రెసిడెంట్‌గా ఉంటే యుద్ధం జరిగేదే కాదు. (ఉక్రెయిన్ గెలవాలనుకుంటున్నారా అన్న మోడరేటర్ల ప్రశ్నకు బదులు దాటవేశారు. పైగా యుద్ధానికి మిలియన్ల మంది బలయ్యారని అవాస్తవాలు చెప్పారు) → 2021లో అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం వైదొలగడం దేశ చరిత్రలోనే అత్యంత సిగ్గుచేటైన సందర్భం. → ఇజ్రాయెల్‌ను హారిస్ ద్వేషిస్తారు. హారిస్ గెలిస్తే రెండేళ్లలోనే ఇజ్రాయెల్ సర్వనాశనం ఖాయం. అరబ్బులన్నా ఆమెకు ద్వేషమే.హారిస్ → అఫ్గాన్ నుంచి వైదొలగాలన్న బైడెన్ నిర్ణయం నాటి పరిస్థితుల్లో పూర్తిగా సబబే. ట్రంప్ తాలిబన్లతో అత్యంత బలహీన ఒప్పందం చేసుకున్నారు.→ నియంతలంటే ట్రంప్‌కు మహా ఆరాధన.→ నేను ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తానన్నది పచ్చి అబద్ధం. యూదు రాజ్యాన్ని మొదటినుంచీ సమర్థిస్తున్నా. అక్టోబర్ 7 దాడి తర్వాత ఇజ్రాయెల్‌కు స్వీయరక్షణకు అన్ని హక్కులూ ఉన్నాయి. కానీ అమాయక పాలస్తీనియన్లు భారీ సంఖ్యలో యుద్ధానికి బలవుతున్నారన్నది కూడా వాస్తవమే. కనుక యుద్ధం తక్షణం ఆగాలి. కాల్పుల విరమణ, బందీల విడుదలే అందుకు మార్గం. దానికోసం కృషి చేస్తా.2020 ఎన్నికల ఫలితాలపైట్రంప్: వాటిలో నిజమైన విజేతను నేనే. క్యాపిటల్ హిల్ భవనంపై దాడితో నాకు సంబంధం లేదు. హారిస్: అమెరికా చరిత్రపై చెరగని మచ్చ ఏదన్నా ఉంటే అది కాపిటల్ హిల్‌పై దాడే. దాన్ని మర్చిపోయి ముందుకు సాగాలి. ట్రంప్‌పై హారిస్ పంచ్‌లు → ట్రంప్ ఓ బలహీన నాయకుడు. తప్పుడు నేత. ఆయన్ను చూసి ప్రపంచ దేశాధినేతలంతా నవ్వుతున్నారు. → అధ్యక్ష పదవికి ట్రంప్ కళంకమని ఆయనతో కలిసి పని చేసిన సైనిక ఉన్నతాధికారులే అంటున్నారు. → ట్రంప్ అంటేనే అబద్ధాలు, అభూత కల్పనలు. ఈ డిబేట్లో కూడా ఆయన చేసేదదే. → ట్రంప్ ఎంతసేపూ తన గురించే మాట్లాడతారు. ప్రజలు ఆయనకు అసలే పట్టరు. దేశానికి కావాల్సింది ప్రజల కోసం పాటుపడే నాయకుడే తప్ప ట్రంప్ వంటి స్వార్థపరుడు కాదు. → ఆయన 2020 ఎన్నికల్లో ఓడిపోయారు. 8.1 కోట్ల మంది ఆయనకు అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసన పలికారు (బైడెన్‌కు ఓటేసిన వారి సంఖ్యను ఉటంకిస్తూ). దాన్ని ట్రంప్ ఇప్పటికీ అస్సలు జీరి్ణంచుకోలేకపోతున్నారు.హారిస్‌కే 63 శాతం మంది ఓటు → డిబేట్లో ట్రంప్‌ను హారిస్ చిత్తు చేశారని సీఎన్ఎన్ వార్తా సంస్థ నిర్వహించిన ఫ్లాష్ పోల్‌లో 63 శాతం మంది పేర్కొన్నారు! → ట్రంప్‌కు బాగా అనుకూలమని పేరున్న ఫాక్స్ న్యూస్ కూడా డిబేట్ విజేత హారిసేనని అంగీకరించడం విశేషం. → చర్చకు వేదికైన ఏబీసీ న్యూస్ అభ్యర్థులిద్దరి వ్యాఖ్యలు, ప్రకటనలను లైవ్‌లో అప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసింది.ట్రంప్ చెప్పిన వాటిలో చాలావరకు అవాస్తవాలేనని తేలడం విశేషం. -
USA Presidential Elections 2024: అమెరికాకు అర్హుడైన ఉపాధ్యక్షుడు
ఫిలడెల్ఫియా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన కమలా హారిస్ ప్రచారం ముమ్మరం చేశారు. మంగళవారం పెన్సిల్వేనియాలో భారీ ప్రచార సభలో మాట్లాడారు. తన ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్ వాల్జ్‌ను దేశ ప్రజలకు పరిచయం చేశారు. ఆయన ఉన్నత స్థాయికి ఎదిగిన తీరును వివరించారు. ఆయన కేవలం గవర్నర్ మాత్రమే కాదు, అంతకుమించి ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్పారు. అమెరికా ప్రగతి కోసం, ప్రజల సౌభాగ్యం కోసం తాము కలిసి పని చేయబోతున్నామని వెల్లడించారు. అమెరికాకు అన్నివిధాలా అర్హుడైన ఉపాధ్యక్షుడు టిమ్ వాల్జ్ అని ప్రశంసించారు. కమలా హారిస్ మాట్లాడిన అనంతరం టిమ్ వాల్జ్ ప్రసంగం ప్రారంభించారు. జనం చప్పట్లు, కేకలతో హర్షామోదాలు వ్యక్తం చేశారు. మనకు మరో 91 రోజులపాటు సమయం మాత్రమే ఉందని, ఎన్నికల్లో విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. అవిశ్రాంతంగా కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. మరణించిన తర్వాతే మనకు నిద్ర అని వ్యాఖ్యానించారు. మరోవైపు ఏబీసీ న్యూస్ సర్వేలో ఆసక్తికరమైన అంశం బయటపడింది. వాల్జ్ ఎవరో తమకు ఇప్పటిదాకా పెద్దగా తెలియదని ప్రతి 10 మందిలో 9 మంది చెప్పారు. ఉపాధ్యక్ష అభ్యరి్థగా పేరు ఖరారైన తర్వాతే ఆయనెవరో తెలిసిందని అన్నారు. -
ట్రంప్‌కు భద్రత కల్పించడంలో విఫలమయ్యాం
వాషింగ్టన్: పెన్సిల్వేనియాలో జూలై 13వ తేదీన ఎన్నికల ర్యాలీ సమయంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ఘటన తమ వైఫల్యమేనని అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం పేర్కొంది. ఆయనకు భద్రత కల్పించడంలో వైఫల్యానికి తమదే బాధ్యతని తెలిపింది. బట్లర్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న ట్రంప్‌పై ఓ యువకుడు కాల్పులకు పాల్పడటం తెల్సిందే. ఆ ఘటన నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. ఒక బుల్లెట్ మిల్లీమీటర్ దూరం నుంచి దూసుకెళ్లగా, మరో బుల్లెట్ ఆయన చెవిని గాయపర్చింది. అప్పటి ఘటనకు బాధ్యత వహిస్తూ సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చియాటిల్ రాజీనామా చేయగా, ఆమె స్థానంలో రొనాల్డ్ రోవె తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. -
Donald Trump: చనిపోయాననే అనుకున్నా
మిల్వాయుకీ (డెలావెర్): ప్రాణాంతకమైన దాడికి గురైన క్షణాలను అమెరికా మాజీ అధ్యక్షుడు గుర్తు చేసుకున్నారు. ‘‘ఆ సమయంలో నేను చనిపోయాననే అనుకున్నా. కేవలం అదృష్టమో, దైవమో నన్ను కాపాడాయి’’ అని చెప్పుకొచ్చారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా 20 ఏళ్ల దుండగుడు ఆయనపై కాల్పులకు తెగబడటం తెలిసిందే. 78 ఏళ్ల ట్రంప్ కుడి చెవికి తూటా గాయంతో త్రుటిలో బయటపడ్డారు. తనను రిపబ్లికన్ అధ్యక్ష అభ్యరి్థగా అధికారికంగా ప్రకటించే మూడు రోజుల పార్టీ జాతీయ సదస్సుకు వెళ్తూ ఆయన న్యూయార్క్ పోస్ట్ వార్తా సంస్థతో మాట్లాడారు. సరిగ్గా కాల్పులు జరిగిన సమయంలోనే కుడివైపుకు తల తిప్పడం వల్లే బతికి బయటపడ్డానన్నారు. దీన్ని నమ్మశక్యం కాని అనుభవంగా అభివరి్ణంచారు. ‘‘గాయం తర్వాత పిడికిలి పైకెత్తి ఫైట్ అంటూ నేను నినదిస్తున్న ఫొటోను అంతా ఐకానిక్ ఫొటోగా అంటున్నారు. అలాంటి ఫొటో కావాలంటే మామూలుగానైతే చనిపోవాల్సిందే’’ అంటూ సరదా వ్యాఖ్యలు చేశారు. కాల్పుల తర్వాత కూడా ప్రసంగం కొనసాగించాలనే అనుకున్నట్టు వెల్లడించారు. అధ్యక్షుడు బైడెన్ తనకు ఫోన్ చేసి క్షేమం కనుక్కున్న తీరును అభినందించారు. ఈ సందర్భంగా ట్రంప్ కుడి చెవికి బ్యాండేజీ ధరించి కని్పంచారు. రిపబ్లికన్ సదస్సుకు భారీ భద్రత రిపబ్లికన్ల మూడు రోజుల జాతీయ సదస్సు మిల్వాయుకీలో సోమవారం మొదలైంది. ట్రంప్‌పై దాడి నేపథ్యంలో సదస్సుకు కనీవినీ ఎరగని స్థాయిలో వేలాది మంది సిబ్బందితో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలి్పంచారు.పోలీసును బెదిరించాడు!ట్రంప్‌పై దాడికి దిగిన క్రూక్స్ కదలికల్ని కాల్పులకు ముందే ఓ పోలీసు అధికారి పసిగట్టాడు. క్రూక్స్ నక్కిన గోడౌన్పైకి ఎక్కి అతన్ని సమీపించబోగా తుపాకీతో బెదిరించాడు. దాంతో ఆ పోలీసు కిందికి దిగేశాడు. అదే సమయంలో ట్రంప్‌పై క్రూక్స్ తూటాల వర్షం కురిపించాడు. స్కూలు రోజుల నుంచీ ముభావేక్రూక్స్ స్కూలు రోజుల నుంచీ ఒంటరిగా, ముభావంగానే ఉండేవాడని తోటి విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. ‘‘క్రూక్స్‌కు పెద్దగా మిత్రులు కూడా లేరు. తోటి విద్యార్థులంతా అతన్ని బాగా ఏడిపించేవారు. రైఫిల్ గురి పెట్టడం చేతగాక స్కూల్ షూటింగ్ టీమ్‌లోకి ఎంపిక కాలేకపోయాడు’’ అన్నారు.జగన్నాథుడే కాపాడాడు: ఇస్కాన్ప్రాణాంతక దాడి నుంచి ట్రంప్‌ను పురీ జగన్నాథుడే కాపాడాడని ఇస్కాన్ పేర్కొంది. 48 ఏళ్ల కింద న్యూయార్క్‌లో తొలి జగన్నాథ రథయాత్ర విజయవంతం కావడంలో ఆయన ఎంతో సాయపడ్డారని చెప్పింది.పోలీసుల తప్పిదమే: ఎఫ్‌బీఐ ట్రంప్‌పై దాడి ఉదంతంపై దర్యాప్తు ముమ్మరమైంది. దీనిపై ఉన్నత స్థాయి స్వతంత్ర విచారణకు బైడెన్ ఆదేశించడం తెలిసిందే. దేశీయ ఉగ్రవాద చర్యగా దీనిపై ఎఫ్‌బీఐ విచారణ చేపట్టింది. దుండగుడు థామస్ మాథ్యూ క్రూక్స్ ఒంటరిగానే ఈ ఘాతుకానికి తెగబడ్డట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచి్చంది. భద్రతా లోపానికి స్థానిక పోలీసు విభాగానిదే బాధ్యత అని సీక్రెట్ సర్వీస్ విభాగం వాదిస్తోంది. క్రూక్స్ మాటు వేసిన గోడౌన్ తమ భద్రతా పరిధికి ఆవల ఉందని పేర్కొంది. కనుక అదంతా స్థానిక పోలీసుల బాధ్యతేనని వివరించింది. -
USA Presidential Elections 2024: ట్రంప్‌పై హత్యాయత్నం
పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా దుండగుడు కాల్పులకు తెగబడటంతో ట్రంప్ తల వెనుకగా దూసుకెళ్తున్న తూటా. ఆయనపై మొత్తం నాలుగైదు రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయి.షికాగో/వాషింగ్టన్: అమెరికా చరిత్రపై మరో రక్తపు మరక. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (78)పై హత్యా యత్నం జరిగింది. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో గెలిచి మరోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు రిపబ్లికన్ల అభ్యరి్థగా సర్వశక్తులూ ఒడ్డుతున్న ఆయన ఈ ప్రాణాంతక దాడి నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం పెన్సిల్వేనియాలోని బట్లర్ టౌన్లో ఔట్‌డోర్ ఎన్నికల ర్యాలీలో ఉండగా ఈ ఘోరం జరిగింది. భారీగా హాజరైన మద్దతుదారులు, అభిమానులను ఉద్దేశించి సాయంత్రం ఆరు గంటలకు ట్రంప్ ప్రసంగం మొదలు పెట్టారు. అప్పటికే సమీప గోడౌన్‌పై నక్కిన ఓ దుండగుడు ఏఆర్ శ్రేణి ఆటోమేటిక్ అసాల్ట్ రైఫిల్‌తో ట్రంప్‌పైకి కనీసం ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరిపాడు. దాంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. అరుపులు, కేకలు, ఆక్రందనలు, పారిపోతున్న జనాలతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఒక తూటా ట్రంప్ కుడి చెవి పై భాగాన్ని గాయపరిచింది. మరిన్ని తూటాలు ఆయన తలకు అతి సమీపం నుంచి దూసుకెళ్లాయి. ట్రంప్ బాధతో తన చెవిని చేత్తో పట్టుకుంటూనే తూటాల నుంచి తప్పించుకునేందుకు వెంటనే డయాస్ కిందకు వంగారు. ఆలోపే సీక్రెట్ సరీ్వస్ సిబ్బంది టంప్ర్ను చుట్టుముట్టి రక్షణ కవచంలా నిలిచారు. చెవి నుంచి కుడి చెంప మీదుగా రక్తమోడుతున్న ట్రంప్‌ను హుటాహుటిన వేదిక నుంచి తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టి సురక్షితంగా తరలించారు. వేదికను వీడుతూ ట్రంప్ పిడికిలి బిగించి పైకెత్తి, సభికులనుద్దేశించి ‘ఫైట్’ అని పదేపదే భావోద్వేగంతో బిగ్గరగా నినాదాలు చేశారు. వారు కూడా తమ నేతకు మద్దతుగా ఫైట్ అంటూ పెద్దపెట్టున ప్రతి నినాదాలు చేశారు. అక్కణ్నుంచి ట్రంప్‌ను హుటాహుటిన పిట్స్బర్గ్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కారెక్కే ముందు కూడా ట్రంప్ మరోసారి పిడికిలి బిగించి నినాదాలు చేశారు. ఈ మొత్తం ఉదంతానికి సంబంధించిన వీడియో ప్రపంచమంతటా వైరలవుతోంది. ట్రంప్ క్షేమంగా ఉన్నట్టు అనంతరం ఆయన ప్రచార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దుండగుని కాల్పుల్లో సభికుల్లో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమీప భవనాలపై మోహరించి ఉన్న సీక్రెట్ సరీ్వస్ స్నైపర్లు తక్షణం స్పందించి దుండగున్ని కాల్చి చంపారు. అతన్ని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకునిగా గుర్తించారు. అతను కాల్పులకు తెగబడేందుకు కారణం తెలియాల్సి ఉంది. అమెరికా వంటి అగ్ర రాజ్యంలో మాజీ అధ్యక్షుని స్థాయి నేతపై ఇంత సమీపం నుంచి కాల్పులు జరగడం ఘోర భద్రతా వైఫల్యమేనంటున్నారు. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతోంది. ట్రంప్‌పై దాడితో ప్రపంచం నివ్వెరపోయింది. హత్యా యత్నాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రధాని నరేంద్ర మోదీతో సహా దేశాధినేతలంతా ఈ ఘటనను ఖండించారు.దేవుడే కాపాడాడు: ట్రంప్ ప్రాణాంతక దాడి నుంచి తనను భగవంతుడే రక్షించాడని ట్రంప్ అన్నారు. కాల్పుల ఘటనపై తన సొంత సోషల్ మీడియా ‘ట్రూత్’లో ఆయన స్పందించారు. కాల్పుల్లో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘‘నిర్భయంగా ముందుకెళ్దాం. ఈ సమయంలో అమెరికన్లమంతా మరింత సమైక్యంగా నిలబడాల్సిన అవసరముంది. అమెరికన్లుగా మన వ్యక్తిత్వాన్ని చాటాల్సిన, దుష్టశక్తి గెలవకుండా అడ్డుకోవాల్సిన సమయమిది. మిమ్మలి్న, మన దేశాన్ని నేను త్రికరణశుద్ధిగా ప్రేమిస్తున్నా. త్వరలో విస్కాన్సిన్ సభ ద్వారా మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’’ అని రిపబ్లికన్ పార్టీ మూడు రోజుల సదస్సును ఉద్దేశించి అన్నారు. ఈ సదస్సులో అధ్యక్ష అభ్యరి్థని అధికారికంగా ప్రకటించనుండటం తెలిసిందే.120 మీటర్ల నుంచే కాల్పులు ట్రంప్‌పై కాల్పుల ఘటనపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కేవలం 120 నుంచి 150 మీటర్ల దూరం నుంచి కాల్పులు జరిగినట్టు ప్రాథమికంగా తేలింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉండే అమెరికా మాజీ అధ్యక్షునిపైకి ఇంత సమీపం నుంచి కాల్పులు జరపడం నమ్మకశ్యం కాని విషయమని ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ కెవిన్ రోజెక్ అన్నారు. అంతమంది భద్రతా సిబ్బంది రక్షణలో ఉన్న ట్రంప్‌పైకి దుండగుడు అన్ని రౌండ్ల పాటు కాల్పులు జరపగలగడం వింతగా ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘దుండగుడు అంత సమీపానికి ఎలా రాగలిగాడు, ఎవరు సహకరించారు వంటి కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతుంది’’ అని చెప్పారు.దుండగుడు రిపబ్లికన్ ఓటరే ట్రంప్‌పై కాల్పులకు తెగబడ్డ థామస్ మాథ్యూ క్రూక్స్ రిపబ్లికన్ పార్టీ ఓటరుగా నమోదు చేసుకున్నట్టు తేలడం విశేషం. అయితే 2021లో డెమొక్రటిక్ పార్టీ అనుబంధ విభాగానికి 15 డాలర్ల విరాళం ఇచి్చనట్టు కూడా వెల్లడైంది. కొద్ది రోజుల ముందే ట్రంప్‌ను ద్వేషిస్తూ, రిపబ్లికన్ పార్టీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడట. క్రూక్స్ది పెన్సిల్వేనియాలో పిట్స్బర్గ్ శివార్లలోని బెథెల్ పార్క్ అని తేలింది. బతికుంటే ఈ నవంబర్‌లో అతను తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేవాడు. మృతదేహం వద్ద గుర్తింపు కార్డుల వంటివేవీ లభించకపోవడంతో అతన్ని గుర్తించడం ఏజెంట్లకు కష్టంగా మారింది. దాంతో చివరికి డీఎన్ఏ పరీక్ష చేసి గుర్తించారు.దుండగుని ముందస్తు ఏర్పాట్లు! ట్రంప్‌పై కాల్పులకు తెగబడేందుకు దుండగుడు ముందుగానే పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నట్టు భావిస్తున్నారు. దాడికి పాల్పడ్డ గోడౌన్ వంటి భవనం ర్యాలీకి అతి సమీపంలో ఉంది. దానిపైకి చేరుకునేందుకు ఒక నిచ్చెన కూడా ఏర్పాటు చేసి ఉంది. అతని మృతదేహం పక్కన పలు రకాలైన ప్యాకేజీలను పోలీసులు గుర్తించారు. వాటిలో పేలుడు పదార్థాలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భీతావహంగా ఘటనా స్థలి ట్రంప్‌పై హత్యా యత్నం జరిగిన బట్లర్ కేవలం 13 వేల జనాభా ఉండే చిన్న పట్టణం. పశి్చమ పెన్సిల్వేనియాలో పిట్స్బర్గ్కు 33 మైళ్ల దూరంలో ఉంటుంది. ఆరుబయట మైదాన ప్రదేశంలో ర్యాలీ జరిగింది. తన మార్కు ఎర్ర టోపీ, నల్ల సూటులో ట్రంప్ వేదికపైకి చేరుకుని ప్రసంగం మొదలు పెట్టారు. అమెరికాలోకి అక్రమ వలసలు పెరిగిపోయాయంటూ చార్ట్ సాయంతో వివరిస్తుండగా కాల్పులు మొదలయ్యాయి. దాంతో అంతా ప్రాణభయంతో కేకలు వేశారు. తూటాలను తప్పించుకునేందుకు నేలపై పడుకుండిపోయారు. ఆ ప్రదేశమంతా భీతావహంగా మారింది. ట్రంప్‌ను సురక్షితంగా తరలించాక కూడా చాలాసేపటిదాకా జనం నేలపై పడుకునే కని్పంచారు. అనంతరం భద్రతా సిబ్బంది రంగప్రవేశం చేసి ర్యాలీ వేదికను అదుపులోకి తీసుకున్నారు.ముందే చూసిన జనం...! ట్రంప్‌పై కాల్పులకు దిగిన దుండగుడు క్రూక్స్‌ను తాము ముందే చూసినట్టు సభికుల్లో పలువురు వెల్లడించారు. అతడు గోడౌన్‌పై నెమ్మదిగా కదులుతూ ట్రంప్‌కు వీలైనంత సమీపంగా వచి్చనట్టు ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాల్పులకు ముందే క్రూక్స్ చేతిలో తుపాకీని స్పష్టంగా చూసినట్టు మరో ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. ‘‘దేవుడా! అతని చేతిలో తుపాకీ ఉందంటూ అరిచా. అంతలోనే కాల్పులకు తెగబడటంతో వెంటనే నేలపై పడుకుని తలెత్తి చూశా. ఏజెంట్ల తూటాలకు అతని తల పేలిపోవడాన్ని కళ్లారా చూశా’’ అని చెప్పుకొచ్చాడు. పెరిగిన ట్రంప్ విజయావకాశాలు! అధ్యక్ష ఎన్నికల రేసులో ఇప్పటికే దూసుకుపోతున్న ట్రంప్ విజయావకాశాలు కాల్పుల ఉదంతం నేపథ్యంలో మరింతగా పెరిగినట్టు చెబుతున్నారు. ఆయన విజయావకాశాలు గత 24 గంటల్లోనే 8 శాతం పెరిగి ఏకంగా 70 శాతానికి చేరినట్టు రాజకీయ అంచనాల వేదిక పాలీమార్కెట్ పేర్కొంది. అంతటి ప్రాణాపాయ పరిస్థితిలోనూ ట్రంప్ అత్యంత వీరోచితంగా వ్యవహరించారంటూ అన్నివైపుల నుంచీ ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘‘తల పక్కనుంచి తూటాలు దూసుకెళ్లాయి. ఒకటి చెవిని ఛిద్రం చేసింది. అయినా ట్రంప్ అస్సలు భయపడలేదు. ప్రాణాలు కాపాడుకోవడానికి మోకాళ్లపై పాక్కుంటూ పోవడం వంటివేవీ చేయలేదు. ఏ మాత్రం వెరవకుండా తిరిగి లేచి నుంచున్నారు. భద్రతా సిబ్బందిని నిలువరించి మరీ పిడికిలి బిగించి పోరాట నినాదాలు చేశారు’’ అంటూ పలువురు మద్దతుదారులు ప్రశంసిస్తున్నారు.ట్రంప్‌తో మాట్లాడిన బైడెన్ హత్యా యత్నంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విస్మయం వెలిబుచ్చారు. ఈ దారుణ ఘటనను అంతా తీవ్రంగా ఖండించాల్సిన అవసరముందన్నారు. ట్రంప్ క్షేమంగా ఉండటం పట్ల హర్షం వెలిబుచ్చారు. ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం బైడెన్ ప్రజలనుద్దేశించి కూడా మాట్లాడారు. ఇలాంటి హింసకు అమెరికాలో తావు లేదన్నారు. షెడ్యూల్ ప్రకారం వారాంతాన్ని గడిపేందుకు బైడెన్ డెలావెర్ వెళ్లాల్సి ఉన్నా పర్యటన రద్దు చేసుకుని వైట్‌హౌస్‌కు తిరిగొచ్చారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో పాటు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జార్జి బుష్, డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీ నేతలు తదితరులు కూడా దాడిని తీవ్రంగా ఖండించారు.మోదీ ఖండన ట్రంప్‌పై హత్యా యత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో హింసకు తావు లేదని స్పష్టం చేశారు. ‘‘నా మిత్రుడు ట్రంప్‌పై దాడి పట్ల తీవ్రంగా ఆందోళన చెందా. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దేశాధినేతలు మాక్రాన్ (ఫ్రాన్స్), స్టార్మర్ (బ్రిటన్), ఆల్బనీస్ (ఆస్ట్రేలియా), మెలోనీ (ఇటలీ), కిషిడా (జపాన్), ట్రూడో (కెనడా), జెలెన్స్కీ (ఉక్రెయిన్), నెతన్యాహూ (ఇజ్రాయెల్) తదితరులు కూడా దాడిని తీవ్రంగా ఖండించారు.ఎప్పుడు ఏమి జరిగిందంటేఅమెరికా స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఆరింటికి ర్యాలీని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగం మొదలైంది. తర్వాతేం జరిగిందంటే... 6:11:33 – ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఒక తూటా కుడి చెవికి తాకడంతో బాధతో ముఖాన్ని తడుముకున్నారు 6:11:35 – తూటాల నుంచి తప్పించుకునేందుకు డయాస్ కిందికి వంగారు. ‘గెట్ డౌన్’ అని అరుస్తూ భద్రతా సిబ్బంది పోడియంపైకి దూసుకొచ్చారు. రక్షణ కవచంలా ట్రంప్‌ను చుట్టుముట్టారు. అంతలో మరిన్ని తూటాలు దూసుకొచ్చాయి. 6:11:41 – ‘ఏం చేస్తున్నాం మనం? ఏం జరుగుతోంది?’ అంటూ మహిళా ఏజెంట్ కేకలు. జనం కేకలు, అరుపులు. అంతటా గందరగోళం 6:11:50 – మళ్లీ కాల్పుల చప్పుడు. ఒక మహిళ ఆక్రందన 6:11:58 – ‘‘స్పేర్ (కారు) దగ్గరికి కదలండి’’ అంటూ ట్రంప్ భద్రతా ఏజెంట్ల పరస్పర హెచ్చరికలు 6:12:06 – ‘హాక్ఐ (కౌంటర్ అటాక్ టీం) వచ్చేసింది, కారు వైపు వెళ్దాం’ అన్న భద్రతా సిబ్బంది6:12:09 – సిద్ధంగా ఉండాలంటూ కార్లోని సిబ్బందికి సూచనలు6:12:21 – షూటర్ చనిపోయాడని నిర్ధారించుకున్న ట్రంప్ భద్రతా సిబ్బంది6:12:22 – కారువైపు కదిలేందుకు సేఫేనా అంటూ ఏజెంట్ల ఆరా6:12:23 – ‘అంతా సేఫ్, కారువైపు పదండి’ అన్న మరో ఏజెంట్. ట్రంప్‌ను పైకి లేపిన సిబ్బంది.6:12:35 – అంతా ఓకే అని ట్రంప్‌కు చెప్పిన ఏజెంట్లు6:12:36 – తన షూ వేసుకోనివ్వాలన్న ట్రంప్6:12:37 – ‘ఆగండి సర్. మీ తలంతా రక్తం’ అని ట్రంప్‌తో ఓ ఏజెంట్6:12:39 – ‘సర్, మనం కారువైపు కదలాలి’ అన్న మరో ఏజెంట్ 6:12:47 – ‘ఆగండి, ఆగండి’ అంటూ భద్రతా సిబ్బందిని నిలువరించిన ట్రంప్. జనంకేసి చూస్తూ పిడికిలి బిగించి ‘ఫైట్’ అంటూ బిగ్గరగా నినాదాలు. అంతే బిగ్గరగా బదులిచి్చన జనం 6:12:54 – ‘మనమిక వెళ్లాలి’ అంటూ ట్రంప్‌ను కారుకేసి తీసుకెళ్లిన భద్రతా సిబ్బంది. మరోసారి నినాదాలు చేస్తూ కార్లో కూర్చున్న ట్రంప్జుయ్మంటూ తూటాలు దూసుకెళ్తున్న శబ్దాలు స్పష్టంగా విని్పంచాయి. ఏదో జరుగుతోందని అనుకునేంతలో ఓ తూటా నా కుడి చెవి పై భాగాన్ని ఛిద్రం చేసింది. చర్మం తెగిపోయింది. విపరీతంగా రక్తం కారింది. ఏం జరుగుతోందో అప్పటికి నాకర్థమైంది. అమెరికా వంటి దేశంలో ఇలాంటి చర్య జరగడం అనూహ్యం. గాడ్ బ్లెస్ అమెరికా– తనపై కాల్పులను ఉద్దేశించి సొంత సోషల్ మీడియా ‘ట్రూత్’లో డొనాల్డ్ ట్రంప్ -
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అగంతకులు కాల్పులు జరిపారు. ట్రంప్ పెన్సిల్వినియాలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఈ ఘటన జరిగిట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ట్రంప్‌కు చెవికి గాయం కాగా ఒకరు చనిపోయినట్టు సమాచారం. I fully endorse President Trump and hope for his rapid recovery pic.twitter.com/ZdxkF63EqF— Elon Musk (@elonmusk) July 13, 2024గాయాలు తగిలిన డొనాల్డ్ ట్రంప్‌ను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే భద్రతా సిబ్బంది కాల్పులు జరిపిన దుండగుడిని కాల్చి చంపినట్టు సమాచారం. అయితే ట్రంప్ సేఫ్‌గా ఉన్నారంటూ భద్రతా సిబ్బంది పేర్కొన్నారు. Gunfire at Donald Trump's rally in Pennsylvania, secret service escorts former US President to safetyRead @ANI Story | https://t.co/Xm0iAFygmv#DonaldTrump #US #Pennsylvania #Gunfire pic.twitter.com/P5F6eSpmO3— ANI Digital (@ani_digital) July 13, 2024 -
గురక పెట్టొద్దన్నందుకు పొడిచేశాడు
మేరీల్యాండ్: చెవులకు చిల్లులు పడేలా గురుక పెట్టకురా అన్నందుకు ఓ పెద్దాయనను పొడిచి చంపిన ఘటన అమెరికాలో జరిగింది. పెన్సిల్వేనియా రాష్ట్రం మోంట్గోమేరీ కౌంటీలో 62 ఏళ్ల రాబర్ట్ వాలెస్ తల్లితో కలిసి ఉంటున్నాడు. అదే డూప్లెక్స్ భవనంలో 55 ఏళ్ల క్రిస్టఫర్ కేసీ ఒంటరిగా ఉంటున్నాడు. క్రిస్టఫర్ పెడుతున్న భారీ గురకను వినలేకపోతున్నానని ఏడాదిన్నరగా రాబర్ట్ చెప్పీచెప్పీ విసిగిపోయాడు. విషయం పోలీసుల దాకా వెళ్లింది. వాళ్లు నచ్చజెప్పినా లాభం లేకపోయింది. క్రిస్టఫర్, రాబర్ట్‌ల పడక గదులు పక్కపక్కనే ఉండటం, ఒక చెక్క గోడ మాత్రమే అడ్డుగా ఉండటంతో గురక రాబర్ట్‌కు బాగా ఇబ్బందిపెట్టేది. విసిగిపోయిన పెద్దాయన చివరకు జనవరి 15న సాయంత్రం క్రిస్టఫర్ వరండా దగ్గరికొచ్చి బెదిరించాడు. వినకపోవడంతో అతని కిటికీ స్క్రీన్‌ను చింపేసి చంపేస్తానని అరిచాడు. ఒకనొక సమయంలో నీ గురక సమస్యకు శస్త్రచికిత్స చేయిస్తానని కూడా మాట ఇచ్చాడు. వాగ్వాదం చాలాసేపు జరిగి ఆగిపోయే సమయానికి క్రిస్టఫర్ తలుపుతీయడంతో రాబర్ట్ మళ్లీ తిట్లపురాణం మొదలెట్టాడు. వీరావేశంతో ఉన్న గురకమహాశయుడు వెంటనే కత్తితో రాబర్ట్ గుండెలపై పలుమార్లు పొడిచి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
జో బైడెన్‌కు నిరసన సెగ.. ‘ఓటు వెయ్యం’ అంటూ నినాదాలు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రచారంలో నిరసన సెగ తగిలింది. గాజాలో భీకరమైన దాడులకు తెగబడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా శుక్రవారం పెన్సిల్వేనియాలో జో బైడెన్ పర్యటించారు. అయితే ఇజ్రాయెల్‌కు బైడెన్ మద్దతు ఇవ్వటంపై ఆగ్రహంతో ఉన్న అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున గుమిగూడిన ప్రజలు ‘విధ్వంసకర జో’కు తాము ఓటు వేయబోమని నినాదాలు చేశారు. అధ్యక్షుడు జో బైడెన్ ఒక ‘ఓడిపోయిన వ్యక్తి’ అని అతను ఇక ఇంటికి వెళ్లిపోవాల్సిందేనని మండిపడ్డారు. దీంతో ఏం చేయలేక అధ్యక్షుడు జో బైడెన్ పెన్సిల్వేనియా నుంచి వెనుదిరిగినట్టు తెలుస్తోంది. 2024లో జో బైడెన్ చేపట్టిన మొదటి ప్రచారంలోనే ఇలా నిరసన ఎదుర్కోవటం గమనార్హం. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు ఊహించిన దాని కంటే ఎక్కువగా క్షీణిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో 14 మిలియన్ల ఉద్యోగాలు సృష్టిస్తాన్న జో బైడెన్ హామీ ఇంకా నెరవేరలేదు. ఇప్పటికైనా అమెరికా ప్రజలు, కార్మికుల ఖర్చులు తగ్గించాల్సిన అవసరం ఉంది. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో 81 ఏళ్ల జో బైడెన్, ప్రతిపక్ష నేత డొనాల్డ్ ట్రంప్ కంటే కూడా తక్కువ అప్రూవల్ రేటింగ్‌ను పొందుతున్నారు. అమెరికాలోని నల్లజాతి, కొన్నిమైనార్టీల ఆదరణను క్రమంగా జో బైడెన్ కోల్పోతున్నట్లు తెలుస్తోంది. 2020లో జో బైడెన్ గెలవడానికి సహకరించిన ఈ వర్గాలు ప్రస్తుతం జో బైడెన్ పాలనపై అసంతృప్తి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక.. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. చదవండి: ఎన్నికల సంఘ బాధ్యతలను మేము తీసుకోబోం -
128 ఏళ్ల నాటి మమ్మీకి అంత్యక్రియలు! అదికూడా అధికారిక..
మమ్మకీ అంత్యక్రియాలా! అని ఆశ్చర్యపోకండి. ప్రమాదవశాత్తు మమ్మీగా మారిన ఆ వ్యక్తికి ఇప్పుడు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది అక్టోబర్ 6 వరకు సందర్శనార్థం ఉంచి మరుసటి రోజు అనగా అక్టోబర్ 7న ఖననం చేయనున్నట్లు తెలిపారు. ఈ ఘటన పెన్సిల్వేనియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..చరిత్రకారుల ప్రకారం..పెన్సిల్వేనియా వ్యక్తి 19వ శతాబ్దం చివరలో అనుకోకుండా మమ్మీగా చేయబడ్డాడు. స్టోన్‌మ్యాన్‌గా పిలిచే ఈ మమ్మీ 128 ఏళ్లుగా అలానే ఉండిపోయింది. నిజానికి అతని ఐడెంటిటీ గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఎట్టకేలకు ఆ మమ్మీ ఐడెంటిటీని కనుగొనడంతో అధికారులు అంత్యక్రియలు నిర్వహించాలనుకోవడమే గాక అతడెవరనేది బహిర్గతం చేయాలనకున్నారు. ఐతే ఈ వ్యక్తి వెనక దాగున్న కథ కాస్త విచిత్రమైనదే. ఈ వ్యక్తి మద్యానికి వ్యసనపరుడై దొంగతనం ఆరోపణలతో బెర్క్స్ కౌంటీ జైలులో పట్టుబడ్డాడు. నవంబర్ 19, 1895న మూత్రపిండాల వైఫల్యంతో మరణించాడు. అయితే ఆ వ్యక్తి అరెస్టు సమయంలో జేమ్స్ పెన్ అనే తప్పుడు పేరుని సూచించినట్లు పేర్కొన్నారు. తన కుటుంబీకులు పరువు పోతుందనే భయంతో ఇలా చేసినట్లు విచారణలో తేలిందని వెల్లడించారు. ఐతే ఆ తర్వాత అతడి మృతదేహం అతడి కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు యత్నించి విఫలమవ్వడంతో పెన్సిల్వేనియాలో రీడింగ్‌లోని ఔమాన్స్ ఫ్యూనరల్ హోమ్‌కి తరలించారు. అక్కడ ఎంబామింగ్ ప్రయోగాలు చేస్తున్నప్పుడు పొరపాటున ఇతర శరీరం మమ్మీ చేబడిందని అధికారులు వెల్లడించారు. ఇన్నేళ్లకు అతనెవరో గుర్తించడంతో అక్టోబర్ 6 వరకు ప్రజల సందర్శనార్థం బహిరంగంగా ఉంచాలే అధికారులు ఏర్పాటు చేశారు. ఆ విధంగా 128 ఏళ్లుగా చెక్కుచెదరని దంతాలు, వెంట్రుకలతో మమ్మీ చేయబడిన వ్యక్తి అంత్యక్రియలు అక్టోబర్ 7న నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మమ్మీని సంరక్షిస్తున్న రీడింగ్ ఫ్యూనరల్ హోం డైరెక్టర్ కైల్ బ్లాంకెన్బిల్లర్ మాట్లాడుతూ..ఆ మమ్మీతో గల తన అనుబంధాన్ని వివరించాడు. అతన్ని కేవలం మమ్మీ అని కాకుండా స్నేహితుడుగా భావించినట్లు తెలిపాడు. పెన్సిల్వేనియా నివాసితులు అతన్ని పట్టణంలో ఓ ప్రముఖుడిగా చూస్తున్నారు. పైగా ఆ వ్యక్తికి(మమ్మీ) మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ బలం కూడా ఉండటం విశేషం. ఆ మమ్మని సంరక్షించిన రీడింగ్ ఫ్యూనరల్ హెం 275వ వార్షికోత్సవం కావడంతో ఇప్పుడు ఆ మమ్మీకి 19వ శతాబ్దపు నాటి దుస్తులు వేసి .. కవాతు గౌరవంతో కూడిన అధికారిక లాంఛనాలతో అధికారులు అంత్యక్రియలు నిర్వహించడం విశేషం. (చదవండి: ఎలుక పాలు లీటరు 18 లక్షలా..! దేనికి ఉపయోగిస్తారంటే..) -
మొసలితో కుక్క విన్యాసాలు.. నోట్లో చేయిపెట్టినా మింగదట!
కుక్క అయినా మరో పెంపుడు జంతువు అయినా మనిషితో మచ్చిక ఏర్పడినప్పుడు మంచి దోస్తీ కుదురుతుంది. తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఒక వీడియో అందరినీ హడలెత్తిస్తోంది. ఒక వ్యక్తి.. మొసలిని కుక్కలా సాకుతున్నాడు. ఆ మొసలి మెడ చుట్టూ తాడు కట్టి, దానిని బయట తప్పుతున్నాడు. ఇది చూసినవారంతా షాక్‌కు గురవుతున్నాడు. ఈ ఉదంతాన్ని ఎవరో వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. ఆ మొసలిని సాకుతున్న వ్యక్తి పేరు హెనీ. అతను బేస్ బాల్ మ్యాచ్ చూసేందుకు వచ్చాడు. అయితే అతనితో పాటు మొసలిని తీసుకువచ్చిన కారణంగా అతనికి మ్యాచ్ చూసేందుకు అనుమతి ఇవ్వలేదు. అయితే తన మొసలి ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అతను మీడియాకు తెలిపాడు. తన మొసలిని ఎవరైనా తాకవచ్చని, అది ఎవరిపైనా దాడి చేయదన్నాడు. దాని నాలుకను పట్టుకున్నా కూడా ఏమీ చేయదని తెలిపాడు. ఈ ఉదంతానికి సంబంధించిన ఈ వీడియో పెన్సిల్వేనియాకు చెందినది. @NewsAlertsG హ్యాండిల్ పేరుతో పోస్ట్ అయ్యింది. పిట్స్బర్గ్ పైరేట్స్ గేమ్ టోర్నమెంట్ చూసేందుకు హెన్నీ సిటిజన్స్ బ్యాంక్ పార్క్‌కు వచ్చాడు. అయితే హెనీ ఒంటరిగా కాకుండా తన పెంపుడు జంతువు మొసలిని తీసుకుని వచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసిన చాలా మంది వీడియో తీశారు. హెనీ 2015లొ ఈ మొసలిని దత్తత తీసుకున్నాడు. దానికి వాలీ అనే పేరు పెట్టాడు. దానిని ‘వాలిగేటర్’ అని కూడా పిలుస్తుంటాడు. దీని పొడవు 56 అడుగులు. హెనీ, వాలిగేటర్లు యార్క్ కౌంటీలోని అతని ఇంటిలో కలసిమెలసి ఉంటున్నారు. ఇది కూడా చదవండి: ‘కెనడా చదువులు’ ఏం కానున్నాయి? A man, Joie Henney from Jonestown, Pennsylvania, tried to bring his "emotional support" alligator, Wally, to Citizens Bank Park for a Phillies vs. Pirates game but was denied entry. He claims Wally even sleeps in his bed with him.#alligator #pet #Pennsylvania pic.twitter.com/1onCLcsL0f — NewsAlerts Global (@NewsAlertsG) September 28, 2023 -
రెండో అంతస్తులోకి దూసుకెళ్లిన కారు.. అలా ఎలా రాజా?
వాషింగ్టన్: అమెరికాలోని పెన్సిల్వానియాలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక కారు డ్రైవర్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆశ్చర్యకరంగా పక్కన ఉన్న బిల్డింగ్ రెండో అంతస్తులోకి దూసుకెళ్లాడు. కారు పరిమాణంలో బిల్డింగ్ పైభాగంలో పెద్ద రంధ్రం కూడా పడింది. వెంటనే ఫైర్ ఫైటర్లు రంగంలోకి దిగి కారును, కారు డ్రైవరును జాగ్రత్తగా కిందకు దించారు. బిల్డింగ్ లోకి దూసుకెళ్లిన కారు దృశ్యాలు, శిధిలమైన బిల్డింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. పెన్సిల్వానియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కారును 20 ఏళ్ల యువకుడు డ్రైవింగ్ చేస్తున్నాడని ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం అతడు అక్కడికి సమీపంలోనే ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని అన్నారు. అతడు కోలుకుంటేగానీ ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందో తెలియదన్నారు. మాకైతేలండి యాక్సిడెంట్ కాదేమో అనిపిస్తున్ది అన్నారు. ఇదిలా ఉండగా స్థానికులు మాత్రం దగ్గర్లోని కల్వర్టు వద్ద ఓవర్ స్పీడింగ్ వలన రైలింగును ఢీకొని ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆ కారణంతోనే కారు గాల్లోకి లేచి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలను చూసినవారంతా కారును స్పైడర్ మ్యానో, సూపర్ మ్యానో డ్రైవింగ్ చేసి ఉంటారని కొందరు, గాల్లో వెళ్లడమంటే ఇదేనేమో అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదని మరి కొందరు మానవతా దృక్పధంతో కూడా కామెంట్లు చేస్తున్నారు. A driver has been taken to hospital after crashing a car into the second story of a house in Pennsylvania. State Police say investigators believe it wasn’t an accident. pic.twitter.com/D2U5P0fQMn — Pop Crave (@PopCrave) August 8, 2023 ఇది కూడా చదవండి: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు.. తాత్కాలిక ప్రధాని ఎవరు? -
అమెరికాలో ఇకపై ప్రతి ఏడాది రవిశంకర్ గౌరవ దినోత్సవం..
శ్రీశ్రీ రవిశంకర్ గౌరవ దినోత్సవం జరుపుకుంటున్న 27 నగరాల సరసన ఇపుడు అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని అలెఘెనీ కౌంటీ కూడా చేరింది.నగర ప్రాంతంలో హింస, నేరాలను తగ్గించి, వివిధ వర్గాల ప్రజలను స్వచ్ఛంద సేవ, సామాజిక కార్యకలాపాలవైపు మళ్లించి వారిని ఏకీకృతం చేసేందుకు చేపట్టిన చర్యలను గుర్తిస్తూ ప్రతి ఏటా జూన్ 22వ తేదీన శ్రీశ్రీ రవిశంకర్ గౌరవ దినంగా జరుపుకోబోతున్నట్లు కౌంటీ ఎగ్జిక్యూటివ్ రిచ్ ఫిట్జ్‌గెరాల్డ్ ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ రవిశంకర్‌ను ప్రపంచ మానవతావాదిగా, ఆధ్యాత్మిక నాయకుడిగా, శాంతి దూతగా’ ఆయన కొనియాడారు. శ్రీశ్రీ రవిశంకర్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఇప్పటికే ఆయన 5 దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు, 39కి పైగా ప్రపంచ దేశాల అవార్డులు, 26 గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 29 నుండి అక్టోబర్ 1 వరకు వాషింగ్టన్ లోని నేషనల్ మాల్ స్టేడియంలో ప్రపంచ శాంతి, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఉత్సవాలలో అతి పెద్దదైన ‘ది వరల్డ్ కల్చ ఫెస్టివల్’ కు శ్రీశ్రీ సారధ్యం వహిస్తున్నారు. -
US Pennsylvania :పెన్సిల్వేనియాలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్ నగరంలో డిస్కవరీ చర్చి ప్రాంగణంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ డా.నందమూరి తారకరామారావు శతజయంతిని పురస్కరించుకొని తెలుగువారి ఆత్మగౌరవానికి వందేళ్ళు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సుమారు 250 పైచిలుకు అన్న అభిమానులు అందులో ముఖ్యంగా ఆడపడుచులు పెద్ద ఎత్తున హాజరుకావటం విశేషం. జ్యోతి ప్రజ్వలన, చిన్నారులు పాడిన గణేష ప్రార్ధనతో ప్రారంభమైన ఈ వేడుకలో పిల్లలు పెద్దలు ఆద్యంతం ఉత్సహాంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన సేవలు, తెలుగువారికి తెచ్చిన గుర్తింపును పలువురు వక్తలు గుర్తు చేసుకున్నారు. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించే క్రమంలో ఆ మార్పు తన సొంత ఇంటి నుండే ప్రారంభించటం ఆయన గొప్ప తనానికి, నిబద్దతకి నిదర్శనం అని పాల్గొన్న మహిళలు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినీ, రాజకీయ రంగంలో ఆయన వేసిన ప్రతి అడుగు ఒక సంచలనమే. ఎన్టీఆర్ జీవిత విధానం ఎప్పటికి స్ఫూర్తిదాయకమే అని, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తి మనసావాచ పాటించిన కర్మ యోగి అన్న రామన్న అని గురజాల మాల్యాద్రి, శారదాదేవి పేర్కొన్నారు. ఇంతటి మంచి కార్యక్రమమును నిర్వహించటం ద్వారా మరల ఒక్కసారి ఎన్టీఆర్ తలపెట్టిన వినూత్న నిర్ణయాలను, ఆయన క్రమశిక్షణ తమ రాజకీయ జీవితాలపై ఆయన ప్రభావం మరియు ఇతర విశేషాలను పాల్గొన్న సభ్యులకు గౌతు శిరీష, గద్దె రామోహన్, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ఏలూరి సాంబశివరావు, అడుసుమిల్లి శ్రీనివాసరావు, లింగమనేని శివరామప్రసాద్, కొమ్మారెడ్డి పట్టాభిరాం తమ వీడియో బైట్స్ ద్వారా తెలిపారు. మూడు గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమములో నందమూరి బాలకృష్ణ, జూ.ఎన్.టి.ఆర్ పాటలకు పిల్లలు, పెద్దలు చేసిన నృత్యప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలలో భాగంగా గత నెల మే నెలలో నిర్వహించిన పురుషుల వాలీబాల్ మరియు మహిళలల బ్యాడ్మింటన్ పోటీలలో ప్రధమ, ద్వితీయ విజేతలకు నిర్వహకులు ట్రోఫీలతో పాటు ప్రకటించిన నగదు బహుమతిని అందించారు. గత కొన్నేళ్ళుగా అమెరికాలో స్ధిరపడి అటు వైద్యరంగంలోను, ఇటు సామాజిక సేవలల్లోను విశిష్ట సేవలు అందిస్తున్న డా.కారుమూడి ఆంజనేయులు మరియు అనురాధ దంపతులకు, డా.రామన్ పురిగళ్ళలను ఎన్.టి.ఆర్ ట్రస్ట్ పిట్స్బర్గ్ సభ్యులు సత్కరించారు. వారు చేస్తున్న సేవలు ఎంతో మందికి స్పూర్తిదాయకమని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమము నిర్వహణకు ఇంత ఘనంగా జరగటానికి తమ వంతుగా ముందుకు వచ్చిన స్పాన్సర్లకు (Avansa IT Solutions, Shineteck Inc., Uniglobal Technologies Inc., Stellium Force Inc., Midsys Inc., Red Chillies, Chutneys, Getitfromnature Arts Academy, Paturi immigration and real estate law, Manpasand spice corner, Spice n Sabzi , mintt restaurant ), ఈ వేడుకల నిర్వాహకులు వెంకట్ నర్రా, సునీల్ పరుచూరి, హేమంత్ కుమార్ శెట్టి, రవికిరణ్ తుమ్మల, శ్రీహర్ష కలగర, శ్రీ అట్లూరి, రంగరావు తూమాటి, సాయికృష్ణ పాపినేని, సాయి అక్కినేని తమ కృతజ్ఞతలు తెలిపారు. చివరగా తెలుగింటి భోజనాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. (చదవండి: మలేషియాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకలు) -
NRI Death: కొడుకు కోసం వెళ్లి కానరాని లోకాలకు..
కొడుకు కోసం బయటకు వెళ్లిన ఆ తండ్రి.. కానరాని లోకాలను వెళ్లిపోయాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో.. భర్త అంత్యక్రియల కోసం ఆమె విరాళాల సేకరణకు సిద్ధపడింది. అయితే అంత బాధలోనూ తన భర్త కిడ్నీలను స్వచ్ఛందంగా దానం చేసి మంచి మనుసు చాటుకుంది. పెన్సిల్వేనియాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. భారత సంతతికి చెందిన ప్రీతేశ్ పటేల్(39).. దశాబ్దానికి పైగా లాంకాస్టర్లో చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కుటుంబం కోసం బాగా కష్టపడుతూ వచ్చాడు. ఆపై భార్యా, ముగ్గురు పిల్లలతో కలిసి డౌఫిన్ కౌంటీ(పెన్సిల్వేనియా)కి షిప్ట్ అయ్యాడు. అక్కడే కొత్తగా ఏదైనా జాబ్‌లో చేరాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ లోపు మృత్యువు అతన్ని బలిగొంది. ప్రీతేశ్ చిన్నకొడుక్కి టైప్ 1 డయాబెటిస్ ఉంది. అతని కోసం ఇన్సులిన్‌తో పాటు పోకేమాన్ బొమ్మను కొనుగోలు చేసేందుకు జనవరి 27వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే వాల్‌మార్ట్ దగ్గర రోడ్డు దాటుతున్న క్రమంలో సిగ్నల్ వద్ద ఓ వాహనం ఢీ కొట్టి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం అధికారులు అతన్ని మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ జనవరి 30వ తేదీన అతను కన్నుమూసినట్లు తెలుస్తోంది. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ ప్రమాదంలో తప్పెవరిదో తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. మరోవైపు ప్రీతేశ్ అంత్యక్రియల నిర్వహణకు.. GoFundMe ద్వారా విరాళాల సేకరణ చేపట్టింది అతని కుటుంబం. -
ఘనంగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావుతో మీట్ & గ్రీట్
అమెరికాలో 'తానా' 23వ మహా సభలు ఘనంగా జరగనున్నాయి. వచ్చే ఏడాది జులై 7, 8, 9 తేదీలలో పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న మహా సభల్ని విజయవంతం చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ సభలకు అంజయ్య చౌదరి లావు అధ్యక్షులుగా, రవి పొట్లూరి కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. ఇందులో భాగంగా ఆగస్ట్ 20న కన్వెన్షన్ కన్వీనర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో తానా మిడ్ అట్లాంటిక్ జట్టు ఫిలడెల్ఫియా స్థానిక నాయకులు, వలంటీర్లతో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావుతో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. 300 మంది ఫిలడెల్ఫియాలో జరిగిన కార్యక్రమానికి 300 మంది హాజరై తమ మద్దతు ప్రకటించారు. అందుకు ఫిలడెల్ఫియా తానా టీం రవి పొట్లూరి, సునీల్ కోగంటి, సతీష్ తుమ్మల, ఫణి కంతేటి, రంజిత్ మామిడి, ప్రసాద్ క్రొత్తపల్లి, సురేష్ యలమంచి, కోటి యాగంటి, మోహన్ మల్లా, గోపి వాగ్వల, జాన్ మార్క్, రాజేశ్వరి కొడాలి, రామ ముద్దన, సాంబయ్య కోటపాటి కారణమని ఈ సందర్భంగా వక్తలు అభినందించారు. ఘనంగా సన్మానం ఈ కార్యక్రమంలో పాల్గొన్న తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తానా సేవా కార్యక్రమాల్ని వివరించారు. అలాగే సుమారు 22 సంవత్సరాల తర్వాత తానా మహాసభల్ని మళ్ళీ హోస్ట్ చేసే అవకాశం రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఫిలడెల్ఫియా నగరాన్ని తానా మహాసభల చరిత్రలో అత్యున్నత స్థానంలో నిలబెడతారని ఆశిస్తున్నామని అన్నారు. అనంతరం ఫిలడెల్ఫియాలో 2001లో జరిగిన తానా 13వ మహాసభలలో పాల్గొన్న హరనాథ్ దొడ్డపనేని, సరోజ సాగరం, మదన్ ఇనగంటి, సుధాకర్ పావులూరి,శ్యాంబాబు వెలువోలు తదితరులను తానా మిడ్ అట్లాంటిక్ బృందం ఘనంగా సన్మానించింది. అంజయ్య చౌదరి లావు తోపాటు తానా నుంచి జానీ నిమ్మలపూడి, రాజా కసుకుర్తి, శ్రీనివాస్ ఓరుగంటి, దిలీప్ ముసునూరు, నాగరాజు నలజుల, కిరణ్ కొత్తపల్లి, శ్రీ అట్లూరి, సతీష్ చుండ్రు, మోహన్ మల్లా, లక్ష్మణ్ పర్వతనేని, శ్రీలక్ష్మి కులకర్ణి, వెంకట్ సింగు, శ్రీనివాస్ కోట, సుబ్బా ముప్ప, సాంబ నిమ్మగడ్డ, రామ ముద్దన, రావు యలమంచిలి, లక్ష్మి అద్దంకి, హరి మోటుపల్లి, పాపారావు ఉండవల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న జాతీయ,ప్రాంతీయ సంస్థల ప్రతినిధులు తానా సభలకు మద్దతు పలికిన Ata, Tta, Nata, Nats, Tagdv, Pta, Tfas, Tasj, Hta, Njta వంటి వివిధ జాతీయ, ప్రాంతీయ సంస్థల ప్రతినిధులు ముజీబుర్ రెహ్మాన్, సురేష్ రెడ్డి వెంకన్నగారి, శ్రీనివాస్ కాశీమహంతు, మాధవరెడ్డి మోసర్ల, శర్మ సరిపల్లి, శ్రీనివాస్ భరతవరపు, సుధాకర్ తురగ, లక్ష్మి నరసింహారెడ్డి కొండా, ప్రసాద్ కునారపు, కిరణ్ గూడూరులను ఘనంగా సత్కరించారు. -
Salman Rushdie: వెంటిలేటర్‌పై రష్దీ.. ఒక కన్ను కోల్పోయే ప్రమాదం
న్యూయార్క్: భారత మూలాలున్న ప్రముఖ రచయిత, బుకర్ బహుమతి విజేత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ది సతానిక్ వర్సెస్ రచన తర్వాత దశాబ్దాలుగా ఇస్లామిక్ బెదిరింపులను ఎదుర్కొంటున్న రష్దీపై ఓ ఆగంతకుడు అమెరికాలో చర్చావేదికపైనే కత్తితో విచక్షణారహితంగా దాడిచేసిన విషయం విదితమే. రక్తసిక్తమైన రష్దీకి వాయవ్య పెన్సిల్వేనియాలోని యూపీఎంసీ హ్యమాట్ సర్జరీ సెంటర్ ఆస్పత్రి వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. 20 సెకన్ల వ్యవధిలో ఆగంతకుడు వెనుక 15 సార్లు కత్తితో పొడిచినట్లు తెలుస్తోంది. ‘గంటలపాటు ఆయనకు శస్త్రచికిత్స కొనసాగింది. మెడ భాగంలో కత్తిపోట్ల కారణంగా మెడ నుంచి చేతిలోకి వచ్చే నరాలు తెగిపోయాయి. ఒక కన్ను కోల్పోయే ప్రమాదం ఉంది. పొత్తికడుపుపై కత్తిగాటుతో కాలేయం దెబ్బతింది’ అని సల్మాన్ రష్దీ ప్రతినిధి ఆండ్రూ విలే న్యూయార్క్ టైమ్స్ వార్తాసంస్థతో చెప్పారు. పశ్చిమ న్యూయార్క్‌లోని చౌటాకా ఇన్స్టిట్యూట్లో రష్దీపై దాడి చేసిన వ్యక్తిని 24 ఏళ్ల హదీ మతార్‌గా గుర్తించారు. అతడిపై హత్యాయత్నం, దాడి సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. 150 ఏళ్ల చరిత్రలో తొలి దారుణం ‘150 ఏళ్ల లాభాపేక్షలేని విద్యా సంస్థ చరిత్రలో ఇలా దాడి జరగడం ఇదే తొలిసారి’ అని చౌటౌకా ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు మైఖేల్ హిల్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. సంస్థలో జరిగే కార్యక్రమాలకు భద్రత పెంచాలంటూ గతంలోనే విజ్ఞప్తులు వచ్చాయన్న వార్తలను ఆయన కొట్టేపారేశారు. అయితే, కార్యక్రమ నిర్వాహకులు అక్కడ ఎలాంటి సెక్యూరిటీ సెర్చ్ చేయలేదని, మెటల్ డిటెక్టర్లు లేవని, బ్యాగుల తనిఖీ విధానం లేదని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పడం గమనార్హం. ‘ఇరాన్ నేత అయోతొల్లా హత్య ఆదేశాలిచ్చినా రష్దీ తన స్వేచ్ఛా గళాన్ని వినిపించారు. ఈ కష్టకాలంలో రష్దీ ధైర్యాన్ని, అంకిత భావాన్ని వేనోళ్లా పొగడాల్సిన సమయమిది’ అని కౌంటర్ ఎక్స్‌ట్రీమిజమ్ ప్రాజెక్ట్ సీఈవో మార్క్ వ్యాఖ్యానించారు. ఉగ్రసంస్థల ఆర్థికమూలాలను దెబ్బతీయాలంటూ కౌంటర్ ఎక్స్‌ట్రీమిజమ్ ప్రాజెక్ట్ అనే లాభాపేక్షలేని ప్రభుత్వేతర సంస్థ పనిచేస్తోంది. దాడిపై ఇరాన్ మౌనం రష్దీని చంపాలంటూ దాదాపు దశాబ్దం క్రితం దేశ సుప్రీం లీడర్ అయోతొల్లా ఇచ్చిన ఫత్వాను ఇన్నాళ్లకు ఓ ఆగంతకుడు అమలుకు యత్నించాడన్న వార్తలపై ఇరాన్ పెదవి విప్పలేదు. ‘ఫత్వాను అమలుచేసే ప్రయత్నం జరిగింది’ అంటూ పొడిపొడిగా ఒక ప్రకటనను మాత్రం శనివారం ఇరాన్ అధికారిక మీడియా వెలువరించింది. ‘ ఇలాంటి ఘటనలు ఇరాన్‌ను అంతర్జాతీయ సమాజం నుంచి దూరం చేస్తాయి’ అని ఇరాన్ మాజీ దౌత్యవేత్త మాషల్లా సెఫాజదీ అన్నారు. దాడిపై వెల్లువెత్తిన నిరసనలు ఘటనను భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడిగా సాహిత్యలోకం అభివర్ణించింది. రచయితల గొంతు నొక్కే, హింసాత్మక, అణచివేత ధోరణులపై ముక్తకంఠంతో తమ తీవ్ర నిరసనను వ్యక్తంచేశారు. అత్యంత హేయమైన చర్యగా బుకర్ ప్రైజ్ విజేత, రచయిత్రి గీతాంజలి శ్రీ వ్యాఖ్యానించారు. నీల్ గైమన్, అమితవ్ ఘోష్, స్టీఫెన్ కింగ్, జీన్ గెరీరో తదితరులు దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. రష్దీ త్వగా కోలుకోవాలని కోరుకున్నారు. జాగర్‌నాట్ బుక్స్, పెంగ్విన్ రాండమ్ హౌస్ ఆఫ్ ఇండియా వంటి పలు పబ్లిషింగ్ సంస్థలూ ఘాటుగా స్పందించాయి. ఎవరీ హదీ మతార్? న్యూజెర్సీలోని ఫెయిర్‌వ్యూ ప్రాంతంలో మతార్ నివసిస్తున్నాడు. మతార్ ఎందుకు దాడి చేశాడనే కారణాలను వెతికే పనిలో అమెరికా ఎఫ్‌బీఐ, స్థానిక దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. ‘ఘటనాస్థలిలోని బ్యాక్ ప్యాక్, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సెర్చ్ వారెంట్ తీసుకునే పనిలో అధికారులు ఉన్నారు. దాడి ఘటన వెనుక ఎవరూ ఉండకపోవచ్చని, మతార్ ఒక్కడికే ఇందులో ప్రమేయముందని అధికారులు ప్రాథమికంగా విశ్వసిస్తున్నారు. లెబనాన్ మూలాలున్న మతార్ నేర చరిత్రపై వివరాలు సేకరిస్తున్నాం’ అని పోలీస్ ట్రూప్ కమాండర్ మేజర్ ఎజీన్ జె. స్టాన్జ్యూస్కీ చెప్పారు. అయితే, అతని సామాజిక మాధ్యమాల ఖాతాలను పరిశీలించగా కొన్ని విషయాలపై స్పష్టత వచ్చింది. షియా ఉగ్రవాదులకు ముఖ్యంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కు మతార్ సానుభూతిపరుడని తెలుస్తోందని దర్యాప్తులో భాగంగా ఉన్న ఒక ఉన్నతాధికారి ఎన్బీసీ న్యూస్‌తో చెప్పారు. మతార్ వాడుతున్న సెల్‌ఫోన్ మెసేజింగ్ యాప్‌లో ఇరాన్ కమాండర్ ఖాసిమ్ సులేమానీ ఫొటోను దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. సులేమానీ ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్కు సైన్యాధికారిగా ఉన్నాడు. రష్దీ రాసిన రచనను ఇరాన్ 1988లో నిషేధించిన విషయం తెల్సిందే. ఇంత భద్రత అవసరమా? గతంలో రష్దీ వ్యాఖ్య హత్యా బెదిరింపుల నేపథ్యంలో ఆయనకు కల్పించిన అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై ఒకానొక దశలో అసహనం వ్యక్తంచేశారని న్యూయార్క్ పోస్ట్ ఒక కథనం ప్రచురించింది. చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్లో ఒక సారి రచయితల సదస్సు జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చిన రష్దీ మాట్లాడారు. ‘ఇంత మందితో నాకు భద్రత కల్పించడం నిజంగా అవసరమా? నాకైతే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది. నాకు ఇంతగా అదనపు భద్రత అవసరమని నేనెప్పుడూ అడగలేదు. గతంలో ఎలాంటి భద్రతా లేకుండానే ఇక్కడొకొచ్చాను. ఇప్పుడు ఇదంతా వృథా ప్రయాస. అయినా, భద్రత అవసరమైన రోజులను నేనెప్పుడో దాటేశాను’ అని ఆనాటి సభలో అన్నారు. -
నీల్ దేశ్‌ముఖ్.. శ్రీలక్ష్మీ సురేష్.. ఒజాస్ బాత్రా.. ఇలాంటి ఇంకెందరో!
నైపుణ్యం గురించి ఎంత చెప్పుకుంటే అంత పుణ్యం! కొన్ని మంచి ముత్యాలు: ‘నీలోని నైపుణ్యాన్ని మెరుగుపెట్టడానికి మంచి మార్గం ఏమిటో తెలుసా? దాన్ని ఉపయోగించడమే’.. ‘శక్తి కంటే నైపుణ్యం గొప్పది’.. ‘నీలోని నైపుణ్యానికి సాన పడితే, ... అది ప్రతిభతో చెలిమి చేస్తుంది’.. ఈ సంవత్సరం వరల్డ్ యూత్ స్కిల్స్ డే థీమ్: ట్రాన్స్ఫార్మింగ్ యూత్ స్కిల్స్ ఫర్ ది ఫ్యూచర్ బెమ్యాక్స్.. మంచి ఆవిష్కరణ తమ అద్భుతమైన ప్రతిభాపాటవాలతో చిన్న వయసులోనే అద్భుత భవిష్యత్ నిర్మాణానికి బాటలు వేసున్న వారిలో నీల్ దేశ్‌ముఖ్ ఒకరు. తల్లిదండ్రులతో పాటు పెన్సిల్వేనియా(యూఎస్)లో ఉండే నీల్ దేశ్‌ముఖ్ ఇండియాలోని నానమ్మ వాళ్ల ఇంటికి వచ్చాడు. అదొక గ్రామం. బామ్మతో మాట్లాడుతున్న క్రమంలో ఆమె చూపు మందగించడాన్ని గమనించాడు. సరదాగా పొలాల వెంట తిరుగుతున్న సమయంలో పంట తెగుళ్ల వల్ల రైతులు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యల గురించి తెలుసుకోగలిగాడు. అమెరికాకు తిరిగి వచ్చిన తరువాత రెండు సమస్యలు అతడి ఆలోచనల్లో నిండిపోయాయి. ఒకటి...బామ్మ కంటి చూపు, రెండు...రైతు సమస్య. ఎప్పుడూ ఏదో ఆలోచించడం అంటే దేశ్‌ముఖ్‌కు ఇష్టం. లేదా అలవాటు. ఇప్పుడు ఆ అలవాటు రెండు ఆవిష్కరణలకు కారణం అయింది. తనకు ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సామర్థ్యంతో రైతులకు ఉపయోగపడే ‘ప్లాన్ంటమ్ ఏఐ’ యాప్, అంధులు, చూపు మందగించిన వారికి ఉపయోగపడే ‘వోకల్ ఏఐ’ యాప్‌లను రూపొందించాడు. తక్కువ ఖర్చుతో కూడిన పర్సనల్ హెల్త్‌కేర్ అసిస్టెంట్ ‘బెమ్యాక్స్’ మరో మంచి ఆవిష్కరణ. ఇరవై ఏళ్లు కూడా నిండని దేశ్‌ముఖ్‌కు ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు లభించాయి. ఎన్నో ప్రసిద్ధ పురస్కారాలు వరించాయి. ‘ప్లాన్ంటమ్ ఏఐ’ అనే కంపెనీ స్థాపించి రైతులకు మార్గదర్శనం చేసే మంచిపనికి శ్రీకారం చుట్టాడు దేశ్‌ముఖ్. ఏ.ఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంటే దేశ్‌ముఖ్‌కు చెప్పలేనంత ఇష్టం. కాని యూత్‌లో చాలామందికి అదంటే అయోమయం, భయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఏ.ఐ’పై భయాలను పోగొట్టడానికి క్లాసులు, వర్క్‌షాప్‌లను నిర్వహించాడు. చాలా చిన్న వయసులోనే ‘ఇ–డిజైన్’ కంపెనీకి సీయివోగా చరిత్ర సృష్టించిన శ్రీలక్ష్మీ సురేష్ (కేరళ) ఎన్నో సంస్థలకు వందకు పైగా వెబ్సైట్లను క్రియేట్ చేసింది. ఒజాస్ బాత్రా కథ వేరు పదవతరగతి మానేసిన తరువాత ‘చదవడం ఇక నా వల్ల కాదు బాబోయ్’ అని చేతులెత్తేశాడు దిల్లీకి చెందిన ఒజాస్ బాత్రా. ‘కుదరదుగాకా కుదరదు’ అని తల్లిదండ్రులు శాసించలేదు. ఎందుకంటే అతడి ‘స్కిల్స్’ ఏమిటో వారికి తెలుసు. త్రీడి డిజైన్, విఎఫ్ఎక్స్లో అతడి నైపుణ్యం పదహారు సంవత్సరాల వయసులోనే ‘హైవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్’కు ఫౌండర్, సీయివోను చేశాయి. ......యువ ప్రతిభావంతుల జాబితాలో వీరు కొందరు మాత్రమే. అయితే వీరెవరికీ అల్లావుద్దీన్ అద్భుతదీపాలు దొరకలేదు. ఆలోచనే వారి బలం, ఇంధనం. తమలోని నైపుణ్యంపై దృష్టి పెట్టారు. పదును పెట్టారు. ప్రయోగాలతో ఫలితాలు సాధించారు. బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు. ‘వరల్డ్ యూత్ స్కిల్స్ డే’ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. చదవండి: Cyber Crime Prevention Tips: రుణం కోసం అడ్వాన్స్.. చెల్లిస్తున్నారా?! అయితే ప్రమాదంలో పడ్డట్లే! ఈ జాగ్రత్తలు పాటించండి! -
పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 23వ తానా మహాసభలు
పెన్సిల్వేనియా: 23వ తానా మహాసభలు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7వ తేదీనుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ప్రకటించారు. తానా సైట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అనిల్ యలమంచిలి, సభ్యులు పూర్ణ వీరపనేని, రామ్ మద్ది బృందం తానా మహాసభల వేదిక కోసం అట్లాంటాతో పాటు పలు నగరాలలోని కన్వెన్షన్ సెంటర్స్ తో చర్చించిన తర్వాత ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ ను 2023 తానా మహాసభల వేదికగా సిఫార్సు చేయడం జరిగిందని తానా సైట్ సెలక్షన్ కమిటీ సిఫార్సు కు తానా కార్యవర్గం, బోర్డు ఆమోదం తెలిపిందని అంజయ్య చౌదరి తెలిపారు. తానా మహాసభల కోఆర్డినేటర్ గా రవి పొట్లూరిని నియమించినట్లు తెలిపారు. తానాలో రీజినల్ కోఆర్డినేటర్ నుంచి కార్యదర్శి వరకు పలు పదవులు నిర్వహించి, తానా కార్యక్రమాల నిర్వహణలో విశేష అనుభవమున్నరవి పొట్లూరి కోఆర్డినేటర్‌గా తానా సభ్యులు, నాయకత్వం, దాతల సహకారంతో 23వ తానా మహాసభలు అంగరంగ వైభవంగా జరుపునున్నట్లు అంజయ్య చౌదరి వెల్లడించారు. తానా కోఆర్డినేటర్ గా నియమించినందుకు అధ్యక్షులు అంజయ్య చౌదరికి తానా కార్యవర్గానికి తానా మహాసభల కోఆర్డినేటర్ రవి పొట్లూరి కృతజ్ఞతలు తెలిపారు. -
కొంపముంచిన మంచు తుపాన్.. ఏకంగా 50 కార్లు ఒకదానిపై మరొకటి.. వీడియో వైరల్
వాషింగ్టన్: అమెరికాలోని పెన్సిల్వేనియా హైవేపై సోమవారం భారీగా మంచు ఏర్పడింది. దీంతో ఆ హైవేపై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో మంచు కారణంగా పెద్ద సంఖ్యలో వాహనాలు ఢీకొట్టుకున్నాయి. వివరాల ప్రకారం.. హారిస్బర్గ్కు ఈశాన్యంగా 50 మైళ్ల దూరంలో ఉన్న షుయ్కిల్ కౌంటీలోని ఇంటర్‌స్టేట్ 81లో ఉదయం 10:36 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. జీరో విజిబిలిటీతో 50 నుంచి 60 వాహనాలు పరస్పరం ఢీకొట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో పాటు 12 మందికి పైగా గాయపడ్డారు. ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఘటన సమీపంలో నాలుగు ఆసుపత్రులకు తరలించినట్లు పెన్సిల్వేనియా స్టేట్ పోలీసులు తెలిపారు. ఈ వాహనాల్లో కార్లతోపాటు ట్రక్కులు, ట్రాక్టర్ ట్రాలీలు ఉన్నాయి. హైవేపై ఉన్న మంచును తొలగించేందుకు స్థానిక అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక్కడ శీతాకాలం మొదలుకాగానే వాతావరణం మంచుతో కప్పేస్తుండడంతో వాహనదారులకు రోడ్డు సరిగా కనిపించక ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటన జరగడం ఒకే నెలలో ఇది రెండోసారి అని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. -
విజేత జ్యోతి సురేఖ
సాక్షి, హైదరాబాద్: లాన్‌కాస్టర్ క్లాసిక్ అంతర్జాతీయ ఇండోర్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత స్టార్ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా అంతర్జాతీయ ఇండోర్ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె ఘనత సాధించింది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన ఈ టోర్నీలో జ్యోతి సురేఖ మహిళల ఓపెన్ ప్రొ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో పోటీపడింది. జాతీయ పోటీల్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహించే సురేఖ ఫైనల్లో 131–129 పాయింట్ల తేడాతో పేజ్ పియర్స్ (అమెరికా)పై విజయం సాధించి చాంపియన్‌గా అవతరించింది. విజయవాడకు చెందిన సురేఖ క్వాలిఫికేషన్ రౌండ్లో 660 పాయింట్లకుగాను 653 పాయింట్లు స్కోరు చేసి రెండో ర్యాంక్‌లో నిలిచింది. -
Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!!
రేగి పండ్లు, నేరేడు పండ్లు తినాలంటే ఆయా సీజన్లకోసం ఎదురు చూడకతప్పదు. సీజన్ వెళ్లిపోయాక మళ్లీ కావాలంటే ఎక్కడా దొరకవు. ఏ ఋతువులో పండేవి ఆ ఋతువులోనే దొరుకుతాయి. ఒకే చెట్టుకి 40 రకాల పండ్లు అన్ని కాలాల్లో కాస్తే! ఊహ బాగానే ఉంది కానీ.. ఒకే చెట్టుకి రకరకాల పండ్లు ఎలా సాధ్యం అని అలోచిస్తున్నారా? ఇది కల కాదు.. అబద్ధం అంతకన్నాకాదు. నిజంగానే ఓ వ్యక్తి ఒకే చెట్లుకి 40 రకాల పండ్లు కాయించాడు. పెన్సిల్వేనియాలోని రీడింగ్ సిటీకి చెందిన సామ్ వాన్ అకెన్ అనే వ్యక్తి ఈ రకమైన చెట్లను పెంచుతున్నాడు. జన్యుపరంగా ఒకేరకమైన మొక్కలను అంటుకట్టడం ద్వారా ఇది సాధ్యపడిందట. విత్తనాలు ఉండే పండ్ల మొక్కలను జన్యుపరంగా అంటుకట్టడం ద్వారా ఈ చెట్టును సృష్టించాడు. ఇది ఒక రకమైన సైన్స్ ఎక్పరిమెంట్ అని చెప్పవచ్చు. ఈ చెట్టు కూడా మామూలు చెట్లలాగానే పెరుగుతుంది. ఐతే వసంత (స్ప్రింగ్), వేసని (సమ్మర్) ఋతువుల్లో మాత్రం ఈ చెట్టు అందాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవట. పింక్ కలర్లో చూపరులను ఆకట్టుకుంటుంది. తర్వాత నెలల్లోనే ఈ చెట్టు రేగు, పీచెస్, ఆప్రికాట్ పండ్లు, నేరేడు పండు, బాదం.. ఇలా 40 రకాల పండ్లు కేవలం మూడేళ్లకే కాయడం మొదలు పెడుతుందట. ఈ ప్రక్రియ మొత్తాన్ని శామ్ వాన్ అకెన్ మాత్రం దీనిని ఆర్ట్ వర్క్‌లా భావిస్తానని చెబుతున్నాడు. 40 రకాల పండ్ల చెట్టును సృష్టించడానికి వివిధ రకాల విత్తన పండ్ల మొక్కలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. పారిశ్రామికీకరణ, ఏకీకృత సంస్కృతి వల్ల ఆహార ఉత్పత్తిలో వైవిధ్యాన్ని గుర్తించాను. వాణిజ్యపరంగా తక్కువ లాభదాయకమైన అనేక పండ్ల జాతులు కనుమరుగవుతున్నాయనే విషయం కనుగొన్నాను. రైతులు, పండ్ల తోటలు పెంచే వారినుంచి సేకరించిన మొక్కల ఆధారంగా 40 పండ్ల చెట్లను సృష్టించానని అకెన్ చెప్పుకొచ్చాడు. ఇది నమ్మశక్యం కానప్పటికీ.. అతను ఈ విధమైన మొక్కలు అనేకం సృష్టించాడు. అమెరికాలోని అర్కన్సాస్, కెంటుకీ, మైనే, మసాచుసెట్స్, న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియాలో వాన్ అకెన్ చెట్లను చూడవచ్చు. అంతేకాకుండా వివిధ రకాల పండ్ల చెట్లను పెంచడం, సాగు చేయడం, శుభ్రపరచడం.. చాలా సమయం, స్థలం వృధా అవుతుంది. కోరిన పండ్లన్నీ ఒకే చెట్టుకి కాస్తే.. అనే అతని వినూత్న ఆలోచన నుంచే ఈ చెట్టు ఉద్భవించింది. చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !! -
నెలకు అక్షరాలా రూ. 3 లక్షలు సంపాదిస్తున్న బాతు.. ఎలాగంటే..
పెన్సిల్వేనియాలోని మిల్‌ఫోర్డ్‌లో ‘మంచ్కిన్’ చాలా ఫేమస్. ఎవరీ మంచ్కిన్ అనేకదా మీ డౌట్! ఇది ఒక బాతు. 20 యేళ్ల క్రిస్సీ ఎలిస్ పెంపుడు జంతువే ఈ మంచ్కిన్ అనే బాతు. ఇప్పుడిది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా కష్టపడే పెంపుడు జంతువుగా ప్రసిద్ధి కెక్కింది. ఎలాగంటే.. క్రిస్సీకి చిన్నప్పటి నుంచి బాతులను పెంచే అలవాటుంది. ఐతే టీనేజ్‌లో ఉన్నప్పుడు మంచ్కిన్ అనే బాతు ఆమె దగ్గరికి చేరింది. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వీరిద్దరికీ కలిపి ‘డంకిన్ డక్స్’ అనే పేరుతో కామన్ ఎకౌంట్ కూడా క్రిస్సీ తెరిచేసింది. తను ఉండే టౌన్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ డంకిన్ డొనట్స్ పేరు ప్రేరణతో ఈ పేరు పెట్టిందట. ఇక అప్పటినుంచి వీరిద్దరి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియలో పోస్ట్ చేయడం ప్రారంభించింది. ఈ ప్రక్రియలో ఆమె ఇలాంటి ఆసక్తులు, అభిరుచులను పంచుకునే వ్యక్తులతో కనెక్ట్ అయ్యింది. వీరికి టిక్‌టాక్‌లో 2.7 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5లక్షలు ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలో రెండు సోషల్ మీడియాల ద్వారా నెలకు ఏకంగా 3,34,363ల రూపాయలు తన యజమానికి సంపాదించి పెడుతుందట ఈ బాతు. అంతేకాకుండా పెయింటింగ్‌ల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తోంది. దీంతో న్యూయార్క్ పోస్ట్ నివేదిక ‘కష్టపడి పనిచేసే పెట్’ అని పేర్కొంది. సాధారణంగా క్యూట్ గా ఉండే రకరకాల జంతువుల వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంటాయి. వాటిల్లో ఈ బాతు వీడియోలు మరింత క్రేజీగా దూసుకుపోతున్నాయి. చదవండి: అబ్బే ఏం లేదు.. నాకు కొంచెం సిగ్గెక్కువ.. అందుకే!! View this post on Instagram A post shared by Krissy & Munchkin (@dunkin.ducks) -
న్యూయార్క్‌లో తుపాను బీభత్సం
న్యూయార్క్: అమెరికా ఈశాన్య రాష్ట్రాలను ‘ఇదా’ తుపాను అతలాకుతలం చేస్తోంది. న్యూయార్క్, న్యూ జెర్సీ, పెన్సిల్వేనియాలలో మొత్తంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. తుపాను సృష్టించిన విలయం ధాటికి న్యూయార్క్ రాష్ట్రంలో అత్యయిక స్థితి (ఎమర్జెన్సీ)ని గవర్నర్ క్యాథీ హోచల్ ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. న్యూ ఇంగ్లండ్ (కనెక్టికట్, మెయిన్, మసాచుసెట్స్, న్యూ హాంప్‌షైర్, రోడ్ ఐలాండ్, వెర్మోంట్ రాష్ట్రాలున్న ప్రాంతం)లోనూ తుపాను ప్రభావం పెరుగుతోంది. మరిన్ని భీకర సుడిగాలులు దూసుకొచ్చే ప్రమాదముందని వార్తలొచ్చాయి. ఒక్క న్యూయార్క్‌లోనే రెండేళ్ల బాలుడు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూజెర్సీలో ఒకరు మరణించారని పోలీసులు చెప్పారు. సబ్వే స్టేషన్లలోకి వర్షపు నీరు చేరడంతో అన్ని సర్వీస్‌లను రద్దుచేశారు. సబ్వేలో సీట్లపై నిలబడే నగరవాసులు ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో దర్శనమిచ్చాయి. ఇళ్లలోకి విద్యుత్ సరఫరా నిలిచిపోయి దాదాపు 10 లక్షల మంది ప్రజలు అంధకారంలో ఉంటున్నారు. సెంట్రల్ పార్క్‌లో రికార్డుస్థాయి వర్షపాతం ‘న్యూయార్క్ సిటీలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించాం’ అని న్యూయార్క్‌లోని అమెరికా జాతీయ వాతావరణ శాఖ ప్రకటించింది. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత సెంట్రల్ పార్క్‌లో బుధవారం రాత్రి ఒక్క గంటలోనే రికార్డుస్థాయిలో 8.91 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. న్యూజెర్సీలోనూ తుపాను కారణంగా భారీస్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. సుడిగాలుల ధాటికి దక్షిణ న్యూజెర్సీ కౌంటీలో చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. మొత్తం 21 కౌంటీల్లో ఎమర్జెన్సీ విధించారు. పెన్సిల్వేనియాలో వరదల పట్టణంగా పేరున్న జాన్స్టౌన్ దగ్గరున్న ఆనకట్ట పొంగి పొర్లే ప్రమాదం పొంచి ఉంది. న్యూజెర్సీ, పెన్సిల్వేనియాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి లక్షలాది ఇళ్లలో అంధకారం అలముకుంది. సబ్వే స్టేషన్లోకి దూసుకొస్తున్న వరద నీరు; అపార్ట్మెంట్ సెల్లార్ నుంచి వృద్ధుడిని రక్షిస్తున్న దృశ్యం -
అపురూపం.. ప్రథమ వైద్యులు
భారతదేశ తొలి వైద్యురాలిగా ఆనందీ బాయి జోషీ పాపులర్ ఫొటో ఒకటి ఉంది. ఇప్పుడు మరొక అరుదైన ఫొటోలో ఆమె ప్రత్యక్షం అయ్యారు. ఇద్దరు మహిళా డాక్టర్లతో కలిసి ఆనందీబాయి దిగిన ఏళ్ల నాటి ఫొటో అది. అందులో కనిపించే ఒక డాక్టర్ జపాన్ తొలి మహిళా వైద్యురాలు! ఇంకో డాక్టర్ సిరియా తొలి మహిళా వైద్యురాలు! మరొక విశేషం.. ఆ ఫొటోలోని మూడు దేశాల తొలి మహిళా వైద్యులూ మెడిసిన్ చదివింది ఒకే కాలేజీలో! ఇక ఆ కాలేజీని స్థాపించింది ఎవరనుకున్నారు?! అమెరికా తొలి మహిళా వైద్యురాలు! డాక్టర్స్ డే సందర్భంగా జూలై 1 న డాక్టర్ ఆనందీబాయి ఫొటో ఒకటి ఇంటర్నెట్లో మళ్లీ వైరల్ అయింది. ఆ ఫొటో 135 ఏళ్ల నాటిది. డాక్టర్ ఆనందీబాయి భారతదేశ తొలి వైద్యురాలు. ఆమె ఒక్కరే ఉండే ఆ కాలం నాటి ఫొటో మనం ఎప్పుడూ చూస్తూ ఉన్నదే. అందులో ఆమె మహారాష్ట్ర సంప్రదాయ వస్త్ర ధారణలో పొడవు చేతుల జాకెట్టు, భుజం చుట్టూ కప్పుకుని ఉన్న చీరతో, చేతిలో చెయ్యి వేసుకుని నిలబడి ఓ పక్కకు చూస్తూ ఉంటారు. ఇరవై ఏళ్ల వయసులో 1886లో ఆమె మెడిసిన్ పూర్తి చేశారు. అప్పటికే ఉన్న టీబీ కారణంగా ఆ తర్వాతి ఏడాదే ఆనందీబాయి మరణించారు. భారతదేశ తొలి వైద్యురాలే అయినప్పటికీ, వైద్య సేవలకు అందించేందుకు ఆ అనారోగ్యం ఆమెకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు! ఇంకో ఫొటోలో (ఇప్పుడు వైరల్ అవుతున్నది) డాక్టర్ ఆనంది, ఆమెతో పాటు మెడిసిన్ పూర్తి చేసిన మరో ఇద్దరు మహిళా వైద్యులు ఉంటారు. గ్రాడ్యుయేషన్ ఫొటో అది. కోర్సు పూర్తి చేయడానికి ముందరి ఏడాది 1885లో అక్టోబర్ 10 న తీయించుకున్నది. అరుదైన ఆ ఫొటోలోని విశేషం.. అందులోని ముగ్గురూ మూడు దేశాల తొలి మహిళా వైద్యుల కావడం! ఎడమ వైపున ఉన్నవారు డాక్టర్ ఆనంది, మధ్యలో ఉన్నవారు జపాన్ తొలి వైద్యురాలు కై ఒకామీ, కుడివైపు ఉన్నవారు సిరియా తొలి వైద్యురాలు టబత్. ∙∙ ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోకు అనుబంధంగా మరికొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. డాక్టర్ ఆనంది, డాక్టర్ ఒకామీ, డాక్టర్ టబత్.. ముగ్గురూ ప్రఖ్యాత డబ్లు్య.ఎం.సి.పి. (ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఆఫ్ పెన్సిల్వేనియా) వైద్య విద్యార్థినులు. ప్రపంచంలోని తొలి మహిళా వైద్య కళాశాలలో ఒకటైన డబ్లు్య.ఎం.సి.పి. యూఎస్‌లోని పెన్సిల్వేనియాలో ఉంది. 173 ఏళ్ల నాటి ఆ కాలేజ్ పేరు ఇప్పుడు ‘డ్రెక్సెల్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్’. 1886 బ్యాచ్‌లో ఈ ముగ్గురే వైద్య విద్యార్థినులు. అందుకే ఇది ఇంత అపురూప చిత్రం అయింది. ఈ కాలేజ్‌ని స్థాపించింది కూడా ఒక వైద్యురాలే! ఆమె పేరు ఎలిజబెత్ బ్లాక్వెల్. ఈ ముగ్గురిలానే ఎలిజబెత్ కూడా తన దేశానికి (అమెరికా) తొలి వైద్యురాలు కావడం ఆసక్తి కలిగించే సంగతి. -
లైంగిక ఆరోపణలు: జైలు నుంచి నటుడి విడుదల.. బాధితుల ఆక్రోదన
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా అరవై మందికి పైగా బాధితులు ఆ సీనియర్ నటుడిపై లైంగిక ఆరోపణలు చేశారు. 2018లో నాటకీయ పరిణామాల మధ్య ఓ కేసులో ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడింది. మూడేళ్లు జైల్లోనూ మగ్గాడు. చివరికి జడ్జి అనూహ్య నిర్ణయంతో ఆయనకు ఊరట లభించింది. ఉన్నపళంగా నటుడు, హాలీవుడ్ నటుడు బిల్ కాస్బీ బుధవారం జైలు నుంచి విడుదల కావడం, తీర్పుపై బాధితుల అసహనంతో తీవ్ర చర్చకు దారితీసింది ఈ కేసు. హారిస్బర్గ్: హాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ బిల్ కాస్బీ(83)ని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది పెన్సిల్వేనియా అత్యున్నత న్యాయస్థానం. 2018లో లైంగిక నేరారోపణల కేసులో ఆయనకు మూడు నుంచి పదేళ్ల కారాగార శిక్ష పడింది. అయితే ఈ కేసులో శిక్ష విధించిన జడ్జి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించాడని, కాస్బీకి శిక్ష విధించబోనని ఒప్పందం కుదుర్చుకుని మరీ శిక్ష విధించడం సరికాదని పెన్సిల్వేనియా ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు లిఖిత పూర్వకంగా బాధితుల తరపున ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఈ కేసులో ఇంతకు ముందు జడ్జి, కాస్బీ నుంచి లైంగిక నేరారోపణలపై స్టేట్మెంట్ రికార్డు చేసి మరీ శిక్ష విధించబోనని బెంచ్ సాక్షిగా ప్రకటించాడు(నేరస్థులకు ఉన్న ఐదవ సవరణ హక్కు ప్రకారం). అయినప్పటికీ పదేళ్ల గరిష్ఠ జైలుశిక్ష విధించడాన్ని ఇప్పుడు తప్పు బట్టింది న్యాయస్థానం. అంతేకాదు తాజా పరిణామాలతో ఆయనకు వ్యతిరేకంగా బాధితులు అమెరికా సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి వీల్లేకుండా పోయింది. మరోవైపు ఈ తీర్పుపై బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము చేసిన న్యాయ పోరాటాన్ని.. అమెరికా చట్టంలోని లొసుగులు నీరుగారుస్తున్నాయని వాపోయారు. తదుపరి కార్యాచరణపై న్యాయ నిపుణులతో సంప్రదించి ముందుకు వెళ్తామని ప్రకటించారు. ఆండ్రియాతో మొదలు.. టెంపుల్ యూనివర్సిటీ బాస్కెట్ బాల్ టీంలో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన ఆండ్రియా కాన్స్టాండ్.. తనకు మత్తు మందిచ్చి మరీ కోస్బీ అఘాయిత్యానికి పాల్పడ్డాడని 2005లో పోలీసులను ఆశ్రయించింది. ఏడాది తర్వాత మూడున్నర మిలియన్ల డాలర్ల పరిహారం చెల్లించి ఆమెతో కేసు క్లోజ్ కోసం డీల్ కుదుర్చుకున్నాడు కోస్బీ. అయితే 11 ఏళ్ల తర్వాత (12 ఏళ్లు గడిస్తే.. లైంగిక ఆరోపణలు చెల్లవు) మళ్లీ ఆమె తెర మీదకు వచ్చింది. ఈసారి మరో ఐదుగురు ఆమెతో కలిసి కేసు వేశారు. అదే టైంలో 60వ దశకం నుంచి ఆయనపై వినిపించిన ఆరోపణలనూ పరిగణనలోకి తీసుకుంది పెన్సిల్వేనియా లోకల్ కోర్టు. చివరికి విచారణ జరిపి 2018 సెప్టెంబర్‌లో కోస్బీకి శిక్ష విధించింది. అమెరికన్ డాడ్ స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన కోస్బీ.. సుమారు ఆరు దశాబ్దాలపాటు ఆడియొన్స్‌ను అలరించారు. 1984లో టెలికాస్ట్ అయిన ది కోస్బీ షో.. గొప్ప టీవీ షోగా గుర్తింపు దక్కించుకుంది. ఈ షో ద్వారా ఆయనకు ‘అమెరికాస్ డాడ్’ అనే ఐడెంటిటీ దక్కింది. ఆ తర్వాత సినిమాల ద్వారా ఫేమ్ దక్కించుకున్నాడీయన. అయితే కెరీర్ తొలినాళ్ల నుంచే పలు అఘాయిత్యాలకు పాల్పడినట్లు కోస్బీ ఆరోపణలు ఉన్నాయి. ఇక సంచలనం సృష్టించిన #metoo ఆరోపణల్లో మొట్టమొదట జైలు శిక్షకు గురైంది ప్రముఖుడు కూడా ఈయనే. చదవండి: అత్యాచార కేసులో బాధితురాలి అరెస్ట్!. గుండెపగిలి.. -
వైరల్: రెప్పపాటులో ఎంత పద్ధతిగా కూలిందో చూడండి!
పెన్సిల్వేనియా: ఈ మధ్యన పెద్ద పెద్ద టవర్లను టెక్నాలజీ సాయంతో సెకన్ల వ్యవధిలోనే కూలగొట్టడం పరిపాటిగా మారిపోయింది. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. విషయంలోకి వెళితే.. మన దగ్గర చూడకపోయినా.. విదేశాల్లోని వ్యవసాయక్షేత్రాల్లో సిలోస్ టవర్లను విరివిగా వాడుతున్నారు. ఈ సిలోస్‌లో వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, దాన్యం నిల్వ, కెమికల్స్‌ను స్టోరేజ్ చేస్తున్నారు. తాజాగా అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందిన ఒక రైతు తన వ్యవసాయక్షేత్రంలో సిలోస్ పాడైనదశకు చేరుకోవడంతో దానిని కూలగొట్టి కొత్తది కట్టాలని నిర్ణయించుకున్నాడు. సాధారణంగానే సిలోస్‌ను కూలగొట్టాలంటే చాలా టైం పడుతుంది. అయితే కొత్త టెక్నాలజీ సాయంతో వికర్ణ దిశలో టవర్‌ను సెకన్ల వ్యవధిలో నేలమట్టం చేశారు. సిలోస్ టవర్ నేలమట్టం అయ్యే వీడియో విపరీతంగా ఆకట్టుకుంది. ఎంత పద్దతిగా అంటే.. అది కూలేటప్పుడు ఒక్క ఇటుక కూడా కదల్లేదు. అదే సమయంలో పక్కనే ఉన్న మిగతా సిలోస్ టవర్లు ఒక్క ఇంచు కదలేకపోవడం విశేషం. ఈ వీడియో చూసిన నెటిజన్లు టెక్నాలజీకి ఫిదా అవుతున్నారు. చదవండి: వైరల్: మొసలిపై కొంగ సవారీ .. నోరెళ్లబెట్టిన నెటిజన్లు -
ఇప్పటి విలువలో దాని ధర రూ. 53 కోట్లు!
బరువేమో ఏకంగా 27 టన్నులు!.. ఆక్రమించే స్థలం 1800 చదరపు అడుగులు! .. తయారీకైన ఖర్చు సంగతి సరేసరి... ఈ రోజు విలువలో ఏకంగా రూ.53 కోట్లు! .. ఏమిటీ వివరాలు అనుకుంటున్నారా? ఈ రోజుల్లో మన అరచేతుల్లో ఇమిడిపోయి... విద్య, వినోద, విజ్ఞాన ప్రపంచానికి కిటికీగా మారిన కంప్యూటర్ తొలి రూపం గురించి! ఇప్పుడు ఎందుకంటారా.... మనకు పరిచయమై 75 ఏళ్లు అవుతోంది కాబట్టి! ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్... క్లుప్తంగా ఇనియాక్! ప్రపంచంలో తొలి కంప్యూటర్ ఏదంటే వచ్చే సమాధానం ఇదే. 1946 ఫిబ్రవరిలో తొలిసారి ఇది ప్రపంచానికి పరిచయమైంది. అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని మూర్ స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 1943లో ఇనియాక్ నిర్మాణం మొదలైంది. ఎనభై అడుగుల పొడవులో యూ ఆకారంలో తయారైన ఇనియాక్‌లో మొత్తం 18,800 రేడియోవాల్వ్‌లు, వ్యాక్యూమ్ ట్యూబ్‌లు ఉండేవి. క్షిపణుల ప్రయాణ మార్గాన్ని లెక్కించి ఇవ్వడం ఈ తొలితరం కంప్యూటర్ ప్రధాన లక్ష్యం. ‘ప్రాజెక్ట్ పీఎక్స్’పేరుతో అమెరికన్ మిలటరీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీలు దీని తయారీని చేపట్టాయి. డాక్టర్ జాన్ డబ్ల్యూ మాచ్లీ, జే.ప్రెస్పర్ ఎకర్ట్ జూనియర్ల ఆధ్వర్యంలో సిద్ధమైంది. భారీ వ్యవస్థ... ఇప్పుడంటే కంప్యూటర్ అనేది అరచేతిలో ఇమిడిపోయిందిగానీ.. ఇనియాక్ మాత్రం ఓ భారీ వ్యవస్థను పోలి ఉండేది. ముందుగా చెప్పుకున్నట్లు మొత్తం 18,800 రేడియో వాల్వ్‌లు, వ్యాక్యూమ్ ట్యూబ్‌లు మాత్రమే కాదు.. సుమారు 70 వేల రెసిస్టర్లు, 10 వేల కెపాసిటర్లు, 6 వేల స్విచ్‌లు... ఎకాఎకిన 50 లక్షల సోల్డరింగ్ జాయింట్లు చేరితే ఇనియాక్ అయింది. అంతేనా... ఊహూ కానే కాదు. 1,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భారీ వ్యవస్థలో 9 అడుగుల ఎత్తైన ప్యానెళ్లు 42 ఉండగా.. వాటిని అడుగు మందమున్న ఉక్కుతో తయారు చేశారు. ఒక్కో ప్యానెల్ పైభాగంలో వ్యవస్థను చల్లబరిచేందుకు ఫ్యాన్ల వంటివి ఏర్పాటు చేశారు. ఇంతటి భారీ వ్యవస్థతో పనిచేసేందుకు ఏకంగా 150 కిలోవాట్స్/గంటల విద్యుత్తు అవసరమయ్యేదంటే ఆశ్చర్యమేమీ లేదు. లెక్కలు వేయాల్సిన ప్రతిసారి ఉన్న 6 వేల స్విచ్‌లలో కొన్నింటిని భౌతికంగా సరి చేయాల్సి వచ్చేది. అప్పట్లో ఇందుకోసం ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని నియమించారు. కే మెక్‌నల్టీ, బెట్టీ జెన్నింగ్స్, బెట్టీ స్నైడర్, మార్లిన్ వెస్కాఫ్, ఫ్రాన్ బిలాస్, రూథ్ లిచెటర్‌మ్యాన్ అనే మహిళలు ఈ ప్రోగ్రామింగ్‌ను చేసేవారు. ఈ లెక్కన ప్రపంచంలోనే తొలి ప్రోగ్రామర్లు ఎవరంటే.. ఈ మహిళలనే చెప్పాలన్నమాట. రెండో ప్రపంచ యుద్ధంలో వినియోగించనున్న ఆధునిక ఆయుధాల కోసం ఇనియాక్‌ను సిద్ధం చేయాలనుకున్నా జపాన్ అమెరికాకు లొంగిపోయిన తరువాత అంటే రెండో ప్రపంచ యుద్ధం పూర్తయ్యే సమయానికిగానీ ఇది తయారు కాలేదు. కాకపోతే ఇది హిరోషిమా, నాగసాకీలపై పడిన అణుబాంబుల తయారీలో భాగస్వామిగా మారింది. ప్రస్తుతం ఇనియాక్‌ను ముక్కలు ముక్కలుగా చేసి పెన్సిల్వేనియా వర్సిటీతోపాటు లండన్‌లోని స్మిత్సోనియన్ సైన్స్ మ్యూజియం తదితర ప్రాంతాల్లో ప్రదర్శనకు ఉంచారు. జనగణన మొదలుకొని అధ్యక్షుడి ఎంపిక వరకూ.. ఇనియాక్గా మొదలైన ఆధునిక కంప్యూటర్ ప్రస్థానం ఎక్కువ కాలం కొనసాగలేదు. 1955 నాటికి ఇనియాక్‌ను మూతవేయగా మాచ్లీ, ఎకర్ట్లు అప్పటికే రెండో తరం కంప్యూటర్ ఎడ్వ్యాక్ డిజైన్‌ను సిద్ధం చేసుకున్నారు. ఎకర్ట్–మాచ్లీ కంప్యూటర్ కార్పొరేషన్ పేరుతో ఓ సంస్థను స్థాపించి వాణిజ్యస్థాయిలో కంప్యూటర్ల తయారీ చేపట్టారు. ఈ సంస్థ తయారు చేసిన యునివాక్ కంప్యూటరే 1950 నాటి అమెరికా జనాభా లెక్కల గణన చేపట్టింది. ఆ తరువాత 1952లో విజయవంతంగా అమెరికా అధ్యక్ష ఎన్నిక విజేతను అంచనా కట్టింది కూడా. – సాక్షి, హైదరాబాద్ చదవండి: లగ్జరీ గృహాల అద్దెల్లో హైదరాబాద్ టాప్ -
ప్రతీరోజూ లైంగికదాడి,చిత్రహింసలు.. ఆపై
జోసెఫినా రివెరా పడుపు వృత్తితో పొట్టపోసుకునేది. జాక్వెలిన్ ఆస్కిన్స్ కూడా అంతే. రివెరాలాగే తనొక వేశ్య. వృత్తి ఒక్కటే కాదు.. వీరిద్దరిలో ఉన్న మరో సారూప్యత ఏమిటంటే.. ఇద్దరూ ‘హైడ్నిక్’ బాధితులే. అతడి చేతిలో చిత్రహింసలు అనుభవించినప్పటికీ బతికి బయటపడగలిగారు. అతడి అకృత్యాలను బయటి ప్రపంచానికి తెలిసేలా చేశారు. అవును... గ్యారీ హైడ్నిక్ నరరూప రాక్షసుడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు యువతులను అపహరించి, వారికి నరకం చూపించాడు. ప్రతిరోజూ అనేక మార్లు లైంగిక దాడికి పాల్పడటమే గాక, వారిని హింసిస్తూ ఆనందం పొందేవాడు. అనంతరం ఒక్కొక్కరిని చంపేసి, శరీరాన్ని ముక్కలు చేసి కుక్కలు తినే ఆహారంలో కలిపి మిగతా వాళ్లకు పెట్టేవాడు. నవంబరు 1986 నుంచి 1987 మార్చి వరకు అతడి రాక్షసకాండ కొనసాగింది. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా అతడికి దగ్గరైనట్లు, అతడిలాగే ఆలోచిస్తున్నట్లు నటించి, నమ్మించి రివెరా చేసిన సాహసంతో ఆమెతో పాటు ఆస్కిన్స్ కూడా నరకకూపం నుంచి తప్పించుకుంది. పోలీసులకు సమాచారం అందించి హైడ్నిక్ను అరెస్టు చేయించింది. ఈ క్రమంలో అతడిపై హత్య, లైంగికదాడి, కిడ్నాప్ తదితర నేరాల కింద కేసు నమోదైంది. దోషిగా తేలడంతో లీథల్ ఇంజక్షన్ ఇచ్చి హైడ్నిక్కు మరణశిక్ష అమలు చేశారు. పెన్సిల్వేనియాలో జరిగిన ఈ ఘటన గురించి రివెరా, ఆస్కిన్స్ తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూతో, అతడి దురాగతాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. గ్యారీ హైడ్నిక్ తనను తాను మత గురువుగా చెప్పుకొనేవాడు. అలా స్థానికుల్లో ఆధ్మాత్యిక వ్యక్తిగా గుర్తింపు పొందాడు. నిజానికి అతడిని చూస్తే ఇన్ని నేరాలు చేశాడంటే నమ్మబుద్ధి కాదు. 1986, నవంబరు 25న అతడు రివెరాను కిడ్నాప్ చేశాడు. గొంతునులిమి పట్టి, చేతులకు బేడీలు వేసి బలవంతంగా ఆమెను లాక్కెళ్లాడు. తన ఇంట్లో బంధించి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. అలా రివెరా అతడి కామానికి బలై పోయిన తొలి బాధితురాలిగా మారింది. రివెరా తర్వాత సాండ్రా లిండ్సే(24), లీసా థామస్(19), డెబోరా డూడ్లీ(23), జాక్వెలిన్ ఆస్కిన్స్(18), ఆగ్నస్ ఆడమ్స్(24)ను హైడ్నిక్ కిడ్నాప్ చేశాడు. వాళ్లందరినీ తన ఇంటి బేస్మెంట్ ఏరియాలో బంధీలుగా చేసి హింసించేవాడు. హైడ్నిక్ నేర చరిత్ర ఆధారంగా ‘ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్’ అనే సినిమాలో సీరియల్ కిల్లర్ బఫెలో బిల్ క్యారెక్టర్‌ను సృష్టించారు కూడా. లిండ్సేను మా కళ్లముందే.. ఆర్నెళ్ల కాలంలో తమను హైడ్నిక్ ఏవిధంగా చిత్రహింసలు పెట్టాడో చెబుతూ రివెరా, ఆస్కిన్స్ ఒళ్లు గగుర్పొడిచే విషయాలు పంచుకున్నారు. లిండ్సే మణికట్టును గొలుసు వేసి, సీలింగ్‌కు ఆమెను వేలాడదీసి కొన్ని రోజులపాటు అలాగే ఉంచేశాడు హైడ్నిక్. ఇష్టం వచ్చినట్లుగా కొడుతూ ఉండేవాడు. దీంతో ఆమెకు విపరీతమైన జ్వరం వచ్చింది. దానికి తోడు పస్తులుంచడంతో ఆకలికి తట్టుకోలేక ఆమె మరణించింది. అయినప్పటికీ హైడ్నిక్ క్రూర మనసు శాంతించలేదు. లిండ్సే శరీరాన్ని ముక్కలుగా కోసి మాంసం వండాడు. కుక్కలు తినే ఆహారంతో దానిని కలిపి మిగతా బాధితురాళ్లకు వడ్డించాడు. అంతేగాక తన రాకపోకలకు సంబంధించిన కారు శబ్దాలు వినపడకుండా స్క్రూ డ్రైవర్‌తో వారి చెవుల్లో పొడిచి చెవిటి వాళ్లను చేసేశాడు. ఇక డుడ్లీ విషయానికొస్తే.. ఆమెను నీటి గుంటలో నిలబెట్టి ఎలక్ట్రిక్ షాకిచ్చి చంపేశాడు. మిగతావారిని సైతం ఇలాగే చిత్ర విచిత్ర పద్ధతుల్లో హతమార్చాడు. ఇవన్నీ చూస్తూ భయపడిపోయిన రివెరా, హైడ్నిక్ను మచ్చిక చేసుకుని బయటపడాలని భావించింది. అందుకు తగ్గట్టుగా అతడికి మద్దతుగా ఉన్నట్లు మాట్లాడుతూ.. సంకెళ్లు విడిపించుకుంది. రివెరాను పూర్తిగా నమ్మిన హైడ్నిక్ ఆమె తన కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినిచ్చాడు. అక్కడి నుంచి బయటపడ్డ రివెరా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హైడ్నిక్ రాక్షసక్రీడ ముగిసిపోయింది. (చదవండి: 93 మందిని చంపేశాడు; ‘అందులోనే అసలైన మజా’!) తొలుత డిన్నర్‌కు తీసుకువెళ్లాడు.. ప్రాస్టిట్యూట్‌గా ఉన్న ఆస్కిన్స్ దగ్గరకు వచ్చిన హైడ్నిక్ తొలుత ఆమెను డిన్నర్‌కు ఆహ్వానించాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్లి సరదాగా గడిపాడు. ఆమెతో స్నేహంగా నటిస్తూనే, వీడియో గేమ్ ఆడుకుంటున్న సమయంలో ఆస్కిన్స్ వెనుకగా వెళ్లి గొంతు నులిమి, చేతులు కట్టేసి ఈడ్చుకెళ్లి బేస్మెంట్లో పడేశాడు. దీంతో ఆస్కిన్స్ ఏడుపులతో ఆ ప్రాంగణమంతా దద్దరిల్లింది. అక్కడ అప్పటికే బంధీగా ఉన్న రివెరా ఆస్కిన్స్కు ధైర్యం చెప్పింది. ఎలాగైనా తనను విడిపిస్తానని మాట ఇచ్చింది. అన్నట్లుగానే ఆమెను బయటకు తీసుకువచ్చింది. అయితే దురదృష్టవశాత్తూ మిగతా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అన్నట్టు... వీరంతా నల్లజాతి మహిళలే కావడం గమనార్హం. -
దారుణం: సిగరెట్లతో కాల్చి. బాత్‌టబ్‌లో పడేసి
వాషింగ్టన్: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల బుడ్డోడు ప్యాంటు తడుపుకుంటున్నాడని అతడిని చిత్రహింసలు పెట్టి చంపిందో అత్త. పూర్తి వివరాల్లోకి వెళితే.. జేమీ లైన్ జాక్సన్‌కు పన్నెండేళ్ల లోపు వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. ఆమె మేనల్లుడు మిచెల్ స్టోవర్ వీరితో కలిసి ఆడుకుంటున్నాడు. తొమ్మిదేళ్ల వయసున్న ఈ పిల్లవాడు ఎక్కడ పడితే అక్కడ టాయ్‌లెట్ పోయడంతో ఆమె కోపం నషాళానికంటింది. బుడ్డోడని చూడకుండా అతన్ని గదిలోకి తీసుకు వెళ్లి చిత్ర హింసలు పెట్టింది. అతడి శరీరాన్ని సిగరెట్లతో కాల్చింది. మెడకు ప్లాస్టర్‌ను బిగుతుగా చుట్టి కిరాతకంగా ప్రవర్తించింది. తర్వాత అతడిని బట్టలో చుట్టి బాత్‌టబ్‌లో పడేసింది. అందులో నుంచి బయటకు రాలేక అతడు గిలగిలా కొట్టుకుంటున్నా ఆమె మనసు చలించలేదు. 24 గంటల నుంచి 48 గంటల వరకు అతడి బాత్టబ్లోనే వదిలేసింది. () సాక్ష్యాలను తుడిచేసే ప్రయత్నం మరోవైపు తను చేసిన నేరం బయటపడకుండా అతడి గదినంతా శుభ్రం చేసింది. ఇది చూసిన ఆమె బంధువు అనుమానం వచ్చిపోలీసులకు సమాచారం అందించాడు. కానీ పోలీసులు ఆ ఇంటికి చేరుకునేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పసివాడి ప్రాణం గాల్లో కలిసిపోయింది. అతడి చావుకు కారణమైన జాక్సన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 2న ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా హత్యానేరంతో పాటు, మరణాన్ని దాచడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, చిత్రహింసలు పెట్టడం వంటి అభియోగాల కింద ఆమెకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. స్టోవర్ శవపరీక్ష రిపోర్టులోనూ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అతడి తల, కళ్లు, మెడ, చేతులు, కాళ్లు తీవ్ర గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. మెదడులో రక్తస్రావం జరిగిందని తేలింది. ప్రైవేటు పార్ట్స్‌పై సిగరెట్‌తో కాల్చిన గుర్తులు కూడా ఉన్నట్లు రిపోర్టు పేర్కొంది. (తల్లిని, భార్యను హతమార్చిన మాజీ అథ్లెట్) -
పెన్సిల్వేనియా కోర్టులో ట్రంప్‌కు షాక్
వాషింగ్టన్ : అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలిచిన పెన్సిల్వేనియాలో పోలింగ్‌లో అక్రమాలు జరిగాయనీ, రీకౌంటింగ్ చేపట్టా లంటూ ట్రంప్ బృందం వేసిన పిటిషన్లను పెన్సిల్వేనియా మిడిల్ డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టేసింది. పోలింగ్‌లో అక్రమాలంటూ చేసిన ఫిర్యాదులకు ఎటువంటి ఆధారాలు లేవని జడ్జి మాథ్యూ బ్రాన్ పేర్కొన్నారు. దాదాపు 70 లక్షల ఓట్లను చెల్లనివంటూ ప్రకటించాలని కోరడం తగదంటూ పిటిషన్‌ను తోసి పుచ్చారు. ఈ పరిణామంపై అధ్యక్షుడు ట్రంప్ అటార్నీ రూడీ గిలియానీ స్పందిం చారు. ఈ విషయంలో తాము సుప్రీంకోర్టుకు త్వరగా వెళ్లేందుకు పెన్సిల్వేనియా కోర్టు తీర్పు దోహదపడుతుందన్నారు. ఆధారాలను పరిశీ లించకుండానే, ఒబామా హయాంలో నియమించిన ఈ జడ్జి పిటిషన్‌ను కొట్టేశారని ఆరోపించారు. ఈ తీర్పుపై త్వరలోనే థర్డ్ సర్క్యూట్ కోర్టుకు వెళతామన్నారు. -
అమెరికా: బైడెన్‌కే పట్టాభిషేకం
వాషింగ్టన్: అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్(77)నే చివరికి విజయం వరించింది. ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడిగా శ్వేతసౌధంలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమమైంది. ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలిమహిళగా, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ రికార్డుసృష్టించనున్నారు. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో సొంత రాష్ట్రం పెన్సిల్వేనియా రాష్ట్రంలో జో బైడెన్ విజయం సాధించారు. ఈ గెలుపుతో ఆయనకు మరో 20 ఎలక్టోరల్ ఓట్లు దక్కాయి. ఎలక్టోరల్ కాలేజీలోని 538ఓట్లకుగాను మ్యాజిక్ ఫిగర్ 270 కాగా, 284 ఓట్లు బైడెన్ ఖాతాలో జమయ్యాయి. జార్జియా(16,) నార్త్ కరోలినా(15) అలాస్కా(3) వంటి రాష్ట్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది. ఈ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ తుది ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపదు. దీంతో బైడెనే తదుపరి అధ్యక్షుడని సీఎన్ఎన్, వాషింగ్టన్ పోస్ట్ తదితర ప్రముఖ వార్తా సంస్థలు ప్రకటించాయి. ‘జోసెఫ్ ఆర్.బైడెన్ జూనియర్ అమెరికా 46వ అధ్యక్షుడిగా శనివారం ఎన్నికయ్యారు. దేశంలో సాధారణ రాజకీయ పరిస్థితులను నెలకొల్పుతాననీ, ఆరోగ్యం, ఆరి్థక సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో జాతీయ ఐక్యతను సాధిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ట్రంప్ హయాంలో వైట్ హౌస్‌లో నాలుగేళ్ల పాటు సాగిన గందరగోళానికి ఆయన ముగింపు పలికారు’ అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు తెలిసిన వెంటనే బైడెన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘అమెరికా, ఈ గొప్ప దేశానికి నాయకత్వం వహించడానికి నన్ను ఎన్నుకోవడం గౌరవంగా భావిస్తున్నా. మీరు నాకు ఓటేసినా వేయకున్నా అందరు అమెరికన్లకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తా. నా లక్ష్యం చాలా కష్టమైంది. అయినప్పటికీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా’ అని పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికలు జో బైడెన్ కంటే నా కంటే కూడా దేశానికే ఎక్కువ అవసరం. ఇవి అమెరికా ఆత్మ గౌరవానికి సంబంధించినవి. అందుకోసం మనం పోరాడుదాం. లక్ష్యం సాధించేందుకు అందరం కలిసి పనిచేయడం ప్రారంభిద్దాం’ అని కమలా హ్యారిస్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గోల్ఫ్ క్లబ్‌కు ట్రంప్ ఇప్పటి వరకు ఎన్నికల్లో అక్రమాలంటూ పలు ఆరోపణలు చేస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కథ ముగిసిట్లేనని భావిస్తున్నారు. శనివారం ట్రంప్..వర్జీనియా రాష్ట్రం స్టెర్లింగ్‌లో ఉన్న తన సొంత ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌కు వెళ్లిపోయారు. ఈ ఓటమితో అమెరికా చరిత్రలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రెండో విడత ఎన్నిక కాలేని మూడో అధ్యక్షుడిగా ఆయన చరిత్రకెక్కారు. గడిచిన 25 ఏళ్లలో 1992లో జార్జి హెచ్. బుష్ తర్వాత ఇలా పరాజయం మూటగట్టుకున్న ఏకైక అధ్యక్షుడు కూడా ట్రంప్‌నే. బోసిపోయిన వైట్‌హౌస్ ఎన్నికల ఫలితాల ప్రభావం అధ్యక్షభవనంపై పడింది. సాధారణంగా అక్కడ కనిపించే హడావుడి ఒక్కసారిగా మాయమైంది. శ్వేతసౌధం లాన్లలో మాత్రమే కొద్దిపాటి మీడియా సిబ్బంది కనిపించారు. బైడెన్ మద్దతు దారులు రాజధాని వాషింగ్టన్‌తోపాటు, న్యూయార్క్, షికాగో, అట్లాంటా తదితర ప్రాంతాల్లో వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ, కెనడా ప్రధానమంత్రి ట్రూడో తదితరులు బైడెన్, కమలాహ్యారిస్లను అభినందించారు. ఎన్నికల్లో అక్రమాలంటూ మరోసారి ట్రంప్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ శనివారం మరోసారి ట్రంప్ ఆరోపణలు చేశారు. ‘పెన్సిల్వేనియా లాంటి చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి మా పరిశీలకులను రానివ్వలేదు. లోపల ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు వీల్లేకుండా చేశారు. జరక్కూడనివి జరిగిపోయాయి. చట్టబద్ధమైన పారదర్శకత కనిపించలేదు. రాత్రికి రాత్రే ఫలితాలు మారిపోయాయి. అక్కడ ఏం జరిగిందో తెలియదు’అని పేర్కొన్నారు. వాస్తవానికి భారీ మెజారిటీతో మేమే ఈ ఎన్నికల్లో గెలిచాం అంటూ ప్రకటించుకున్నారు. ‘అధ్యక్ష పదవి తనదే నంటూ జోబైడెన్ చెప్పుకోవడం తప్పు. అలా నేను కూడా చెప్పుకోగలను. ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో వేసిన పిటిషన్లపై ఇప్పుడిప్పుడే ప్రొసీడింగ్ మొదలయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల రోజున రాత్రి 8 గంటల తర్వాత కూడా అక్రమంగా వేల సంఖ్యలో ఓట్లను స్వీకరించారన్నారు. ట్రంప్ ట్వీట్లను ట్విట్టర్ సంస్థ ఫ్లాగ్ చేసి చూపింది. వాషింగ్టన్లో వైట్‌హౌస్ వద్ద సంబరాలు -
తలకిందులవుతున్న ట్రంప్ ఆశలు..
న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో డొమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ మరింత ముందుకు దూసుకెళుతున్నట్లుగా అనిపిస్తుంది. జార్జియాలో ఇప్పటికే ఆధిక్యంలోకి వచ్చిన జో బైడెన్ తాజాగా కీలకమైన పెన్సిల్వేనియాలోనూ ఆధిక్యంలోకి వచ్చినట్లు తెలుస్తుంది. పెన్సిల్వేనియాలో మొత్తం 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.దీంతో పెన్సిల్వేనియాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంచనాలు తలకిందులవుతున్నాయి. (చదవండి : జార్జియా, నెవెడాలో దూసుకుపోతున్న బైడెన్) ఇక డొనాల్డ్ ట్రంప్ చేతిలో కేవలం నార్త్ కరోలినా, అలస్కా రాష్ట్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒకవేళ కౌంటింగ్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే మాత్రం జో బైడెన్‌కు 300 ఎలక్టోరల్ ఓట్లు దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు చూసుకుంటే బైడన్‌కు 264 ఎలక్టోరల్ ఓట్లు, ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. మొత్తం ఎలక్టోరల్ ఓట్లు 538 కాగా.. మెజారిటీకి 270 ఎలక్టోరల్ ఓట్లు కావాలి. ఇప్పటికే అనధికారికంగా బైడెన్ 290 ఎలక్టోరల్ ఓట్లను గెలుచుకునే అవకాశం ఉంది. -
కోర్టుకెక్కిన ట్రంప్ మద్దతుదారులు
వాషింగ్టన్: జార్జియా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగాన్ రాష్ట్రాల్లో ఓట్ల కౌంటింగ్‌ను సవాల్ చేస్తూ ట్రంప్ మద్దతుదారులు కోర్టులో పిటిషన్లు వేశారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన మెయిల్ ఇన్ ఓట్లను లెక్కించవద్దని, కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ ఆ పిటిషన్లలో పేర్కొన్నారు. స్వింగ్ రాష్ట్రాల్లో అక్రమాలు జరిగాయని మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టాలంటూ ట్రంప్ మద్దతుదారులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. న్యాయస్థానంలో సవాళ్లు ఇవీ.. జార్జియా: ఈ రాష్ట్రంలో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. 16 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్న జార్జియాలో అత్యంత కీలక రాష్ట్రం కావడంతో ఓట్ల లెక్కింపుని వెంటనే నిలిపివేయాలని ట్రంప్ అనుచరులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విస్కాన్సిన్: విస్కాన్సిన్లో విజయం సాధించడంతో జో బైడెన్ శ్వేత సౌధానికి మరింత చేరువయ్యారు. 10 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ఓట్లను మళ్లీ లెక్కించాలని ట్రంప్ వర్గం పిటిషన్ వేసింది. దీనిపై నవంబర్ 17లోగా కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పెన్సిల్వేనియా: 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో ట్రంప్ అధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ రాష్ట్రంలో ఆలస్యంగా కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించవద్దంటూ ట్రంప్ మద్దతుదారులు కోర్టుకెక్కారు. ఈ రాష్ట్రంలో ఇంకా 10 లక్షల ఓట్లను లెక్కించాల్సిన పరిస్థితి ఉంది. నవంబర్ 12 వరకు పోస్టల్ బ్యాలెట్లను స్వీకరించడానికి గడువు పెంచడంపై ట్రంప్ వర్గం తీవ్ర అసహనంతో ఉంది. మిషిగాన్: ఈ రాష్ట్ర్రంలో ఇంచుమించుగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ట్రంప్ అనుయాయులు కోర్టుకెక్కారు. 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ట్రంప్ కంటే బైడెన్ 3శాతం అధికంగా ఓట్లను సాధించారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియకి సంబంధించి కోర్టుకెక్కినా పెద్దగా ఉపయోగం ఉండదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్‌కు ముందే వివాదాలు ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు వివాదాల చుట్టూనే తిరుగుతున్నాయి. కరోనా సంక్షోభం కారణంగా ముందస్తు ఓటింగ్, మెయిల్ ఇన్ ఓటింగ్ ప్రక్రియలు ఆది నుంచి వివాదాన్ని రేపుతున్నాయి. మెయిల్ ఇన్ ఓటింగ్‌లో అవకతవకలకు ఆస్కారం ఉందని ట్రంప్ శిబిరం ఆరోపిస్తోంది. పోలింగ్‌కు ముందే ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ 44 రాష్ట్రాల్లో 300కి పైగా కేసులు నమోదయ్యాయి. -
పోలీస్ స్టేషన్‌కు అనుకోని అతిథి
పెన్సిల్వేనియా: ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్‌కు వెళ్తారు. కానీ ఎలుగుబంటి సైతం తన సమస్యను చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? విషయం ఏమిటంటే... పెన్సిల్వేనియాలోని 'కార్బన్ కౌంటీ' ప్రాంతంలో చెత్తను తరలించే వాహనంపై ఎలుగుబంటి ఎక్కి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వాహనంపై ఉన్న ఎలుగుబంటి ఫోటోను 'కిడ్డర్ టౌన్షిప్' పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే 1400 మంది షేర్ చేయడంతో ఆ చిత్రం ఫేస్బుక్లో వైరల్‌గా మారింది. కార్బన్ కౌంటీ ప్రాంతంలో ఎలుగుబంట్ల సమస్యపై తరుచుగా ఫిర్యాదులు వచ్చేవని అక్కడి పోలీసు అధికారి అన్నారు. కానీ ఇప్పుడు వాటిని పట్టుకునేందుకు కష్టపడాల్సిన అవసరం లేకుండా ఎలుగుబంటే పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. కాసేపటికే ఎలుగుబంటి సురక్షితంగా అడవుల్లోకి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. -
కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఇలా..
న్యూయార్క్: మహమ్మారి కరోనా నిరోధక వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే దాని పంపిణీ, టీకా డోసులు ఎవరికి ముందు ఇవ్వాలన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ప్రపంచంలో అన్ని దేశాలకు ప్రాధాన్యతనిస్తూ టీకా పంపిణీ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సంపన్న దేశాలకు సూచించింది. కోవిడ్–19 ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలు, ఎవరిపై ఎక్కువగా వైరస్ దాడి చేస్తోంది, మరణాల నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు 19 మంది కలిసి ఒక విధానాన్ని రూపొందించారు. ఈ మేరకు పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన ఎజెకీల్ జే ఎమ్మన్యూల్ నేతృత్వంలో నిపుణులు మూడు దశల్లో వ్యాక్సిన్ పంపిణీకి పలు సూచనలు ఈ విధంగా ఉన్నాయి.(చదవండి: నావల్ మాస్క్ తయా రు చేసిన శాస్త్రవేత్తలు) కరోనా వైరస్‌తో అత్యధికంగా మరణాలు సంభవించే దేశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. కోవిడ్–19తో ఊహించిన దానికంటే ముందుగా మరణాలు నమోదయ్యే ప్రాంతాలను గుర్తించి టీకాలు ఇవ్వాలి. వైరస్‌తో పోరాడుతూనే ఆర్థికంగా ముందుకు వెళుతున్న దేశాలకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలి. దీని వల్ల కోవిడ్ ప్రభావంతో ఏర్పడిన పేదరికాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయాలి. -
తల్లిని, భార్యను హతమార్చిన మాజీ అథ్లెట్
వాషింగ్టన్: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన ఓ మాజీ అథ్లెట్ తన తల్లిని, భార్యను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. అనంతరం తనను గాయపరచుకున్నాడు. ఆ తర్వాత తనే పోలీసులకు ఫోన్‌చేసి సమాచారం అందించాడు. పెన్సిల్వేనియాలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఇక్బాల్ సింగ్(62) అనే వ్యక్తి 1983 ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని కాంస్య పతకం గెలుచుకున్నాడు. కువైట్‌లో జరిగిన ఈ క్రీడా ఈవెంట్ తర్వాత కొన్నాళ్లకు అతడు అమెరికాకు వలస వెళ్లాడు. టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబంతో సహా డెలావర్ కౌంటీలో స్థిరపడ్డాడు. అక్కడే న్యూటౌన్ టౌన్షిప్లో నివాసం ఉంటున్నాడు. (చదవండి: చనిపోయిన బాలిక బతికింది: గంట తర్వాత..) ఏమైందో తెలియదు గానీ.. ఇక్బాల్ సింగ్ ఆదివారం అకస్మాత్తుగా తన తల్లి నసీబ్ కౌర్, భార్య జస్పాల్ కౌర్‌పై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. వారిద్దరిని గొంతుకోసి హతమార్చాడు. ఆ తర్వాత తనను తాను అదే రీతిలో కత్తితో గాయపరచుకున్నాడు. అనంతరం తన కొడుకుకు ఫోన్ చేసి.. ‘‘వాళ్లిద్దరిని చంపేశాను. మీ అమ్మ, బామ్మను హత్య చేశాను. పోలీసులను రమ్మను’’అని చెప్పాడు. కూతురికి కూడా ఇదే విషయం గురించి ఫోన్లో వివరించాడు. తర్వాత తానే పోలీసులకు ఫోన్ చేసి నేరం చేసిన తనను అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశాడు.(చదవండి: కరోనా హాట్‌స్పాట్‌గా న్యూడిస్ట్‌ల రిసార్ట్ ) దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఇక్బాల్ సింగ్‌ను తొలుత ఆస్పత్రికి తరలించారు. అనంతరం హత్యానేరం కింద అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా నిందితుడికి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఇక రెండు హత్యలు చేసిన ఇక్బాల్ సింగ్‌కు బెయిలు మంజూరు చేసేందుకు స్థానిక కోర్టు నిరాకరించింది. కాగా ఇక్బాల్ ఎప్పుడూ అపార్టుమెంటు పరిసరాల్లో మెడిటేషన్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండేవాడని, అయితే హత్యలకు ముందురోజు కాస్త ఆందోళనగా కనిపించాడని ఇరుగుపొరుగు వారు చెప్పుకొచ్చారు. -
రెండు కీలక రాష్ట్రాల్లో ట్రంప్ వెనుకంజ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండు కీలక రాష్ట్రాల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉన్నారు. విస్కాన్సిన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాదాపు 6 పర్సంటేజ్ పాయింట్లు ఆధిక్యంలో ఉన్నారు. తాజాగా సీబీఎస్ న్యూస్ నిర్వహించిన ఒక ఒపీనియన్ పోల్‌లో ట్రంప్‌ను కలవరపరిచే ఈ విషయాలు వెల్లడయ్యాయి. గత ఎన్నికల్లో ట్రంప్ ఈ రెండు రాష్ట్రాల్లో మంచి మెజారిటీ సాధించడం గమనార్హం. కరోనాను అరికట్టే విషయంలో ట్రంప్ విఫలమయ్యారని, ఈ విషయంలో బైడెన్ సమర్ధవంతంగా వ్యవహరించేవాడని ఈ రాష్ట్రాల ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు ఆ సర్వేలో తేలింది. సీబీఎస్ న్యూస్ తరఫున బ్రిటన్ సంస్థ ‘యుగవ్’ ఈ సర్వే జరిపింది. ‘ఆర్థిక రంగానికి సంబంధించి ప్రజాభిప్రాయం ట్రంప్‌కే అనుకూలంగా ఉంటుంది. కరోనా విషయంలో విఫలమవ్వడం ఆ ఆధిపత్యాన్ని దెబ్బతీసింది’ అని సీబీఎస్ విశ్లేషించింది. బైడెన్‌కు ప్రస్తుతం ఆధిక్యం ఉన్నా.. అది మారవచ్చని పేర్కొంది. -
అమెరికాలో చైనా శాస్త్రవేత్త దారుణ హత్య
పెన్సిల్వేనియా : అమెరికాలోని పెన్సిల్వేనియాలో చైనాకు చెందిన శాస్త్రవేత్త దారుణ హత్యకు గురయ్యాడు. కరోనా వైరస్‌పై కీలక పరిశోధనలు చేస్తున్న చైనా సైంటిస్టు బింగ్ లియు (37) రెండు రోజుల క్రితం తన ఇంట్లో శవమై కనిపించారు. అతనితోపాటు హోగూ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూడా విగతజీవిగా పడి ఉన్నాడు. బింగ్ లియు, హోగూ ఇద్దరు మంచి స్నేహితులుగా మెలిగేవారు. బింగ్ లియు మెడ, తల భాగంలో తీవ్ర గాయాలున్నట్లు ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. అయితే హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. బింగ్ పిట్స్బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. కాగా బింగ్ లియుని మొదట హోగు కాల్చి చంపి, ఆ తర్వాత తనను తాను కాల్చుకుని చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. లియు చేస్తున్న పరిశోధనలకు, ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
అయ్యో ! గుడ్లన్ని నేలపాలయ్యాయి
పెన్సిల్వేనియా : చేతి నుంచి కోడిగుడ్డు జారితే ఏమవుతుంది? కింద పడి పగిలిపోతుంది. అదే విధంగా కొన్ని లక్షల గుడ్లు రోడ్డు మీద పగిలితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. తాజాగా ఇదే ఘటన పెన్సిల్వేనియాలోని హెగిన్స్ టౌన్షిప్లో చోటుచేసుకుంది. పెన్సిల్వేనియా ప్రాంతానికి చెందిన 66 ఏళ్ల జోసెఫ్ మైల్స్ అనే వ్యక్తి ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో హెగిన్స్ లోని రూట్ నెం. 125లో జోసెఫ్ తన ట్రక్కులో 1,36,000 గుడ్లను ఇంక్యుబేటర్‌లో పెట్టి తరలిస్తున్నారు. కాగా కొంతదూరం వరకు అతని ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. హెగిన్స్ ప్రాంతం కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉండడంతో జంక్షన్ వద్దకు రాగానే ట్రక్కు అదుపుతప్పి ఒక్కసారిగా గుడ్లు కింద పడిపోయాయి. ఇంకేముంది రహదారి మొత్తం పచ్చసొన వరదలా మారింది. దీంతో రోడ్డుమీద పడిన పచ్చసొనను శుభ్రం చేయడానికి 20 వేల గ్యాలన్ల నీరు అవసరం అయిందంటూ హెగిన్స్ ప్రాంతం ఎమెర్జెన్సీ కో-ఆర్డినేటర్ బ్రియాన్ ముసోలినో వాపోయాడు. ' జోసెఫ్ మైల్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎత్తైన ప్రాంతంలోకి ట్రక్కును తీసుకొచ్చి లక్షల గుడ్లు నేలపాలు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నాం' అని హెగిన్స్ పోలీస్ చీఫ్ బ్యూరో యర్ముష్ వెల్లడించారు. కానీ అక్కడి స్థానికులు మాత్రం బంగారం లాంటి గుడ్లను నేలపాలు చేశాడంటూ ట్రక్కు డ్రైవర్‌ను తిట్టిపోశారు. -
షాక్.. ఫ్రీగా బ్యాంకు ఖాతాలో రూ.85 లక్షలు..!
హారిస్బర్గ్ : పెన్సిల్వేనియాలో నివాసముండే అమెరికన్ రాబర్ట్ తన ఖాతాలోకి అప్పనంగా భారీ మొత్తం వచ్చిపడటంతో షాక్‌కు గురయ్యాడు. రూ.86 లక్షలు అతని ఖాతాలో జమైన విషయాన్ని భార్య టిఫ్ఫాని విలియమ్స్‌కు చెప్పాడు. ఇంకేముంది ఇద్దరికీ ఎప్పుడూలేని కోరికలు, సౌఖ్యాలు గుర్తొచ్చాయి. 15 రోజుల్లోనే దాదాపు రూ. 70 లక్షలు ఖర్చు చేసి.. అదీఇదీ అని కాకుండా అన్ని కొనేశారు. రెండు ఖరీదైన కార్లు కూడా కొనిపడేశారు. ఈ నేపథ్యంలో ‘టెల్లర్ ఎర్రర్’ కారణంగా పొరపాటుగా డబ్బులు రాబర్ట్ ఖాతాలో జమైనట్టు బ్యాంకు అధికారులు గుర్తించారు. వెంటనే రికవరీ కోసం సిబ్బందిని అతని ఇంటికి పంపింది. కానీ, అప్పటికే ఉన్న సొమ్ములన్నీ విచ్చలవడిగా ఖర్చు చేయడంతో ఆ దంపతులు చేతుల్తేశారు. అయితే, అరెస్టు తప్పదని భావించిన టిఫ్ఫాని ఎలాగైనా ఆ మొత్తం కడతామని నమ్మబలికింది. రికవరీ సిబ్బంది కళ్లుగప్పి దంపతులిద్దరూ తప్పించుకుని తిరగడం మొదలు పెట్టారు. చివరకు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారిపై దొంగతనం, మోసం కేసులు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. 18 లక్షల పూచీకత్తుపై కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. ఇదిలాఉండగా.. దూరపు చుట్టానికి కూడా ఆ దంపతులు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయడం గమనార్హం. -
డెలావేర్ వ్యాలీ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ అభినందన సభ
పెన్సిల్వానియా : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించి తెలుగువారందరూ గర్వపడేలా అద్భుతంగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అభినందనలు తెలియజేస్తూ అమెరికాలోని డెలావేర్ వ్యాలీ (న్యూజెర్సీ ,పెన్సిల్వేనియా మరియు డెలావేర్ )సభ్యులు, వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభినందన సభ నిర్వహించారు. గొప్ప విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, వైఎస్సార్సీపీ నాయకులకు, విజయ సారథి వైఎస్ జగన్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రాఘవారెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు నాటా తరపున సహాయసహకారాలు అందిస్తామన్నారు. అభినందన సభను నిర్వహించడంలో ముఖ్యపాత్ర వహించిన నాటా డైరెక్టర్స్ మధు గోనెపాటి ,అంజిరెడ్డి శాగంరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ చేపట్టిన అభి వృద్ధి కార్యక్రమాలకు అమెరికా ఎన్నారైల తరపున తమవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ పెనుమాడా, శ్రీనివాసరెడ్డి , శశాంక్ రెడ్డి ,సాత్విక్, కిరణ్, బాబా, రమణ కొత్త, చంద్ర దొంతరాజు, జగన్ దుద్దుకుంటా, శ్రీనివాసరెడ్డి వంగాల, మధు పాపసాని, తేజ, హరి ,నరసింహారెడ్డి కొండా, నరసింహారెడ్డి దొంతి రెడ్డి, శ్రీనివాసరెడ్డి కేసవరపు, నిరంజన్, భాస్కర్ పిన్నా, భాస్కర్, నవీన్, మధు, శ్రీనివాస్ అమరవాది,అశోక్, హను తిరుమల్ ,అరవింద్ బత్తిన, శ్రీధర్‌రెడ్డి తిక్కవరపు, విజయభాస్కర్‌రెడ్డి పొలంరెడ్డి, వెంకటరామిరెడ్డి, హరినాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి లక్కసాగరం, లక్ష్మీనారాయణ, గోపినాథ్‌రెడ్డి, హరినాథ్ రెడ్డి కురువకుండ, రామ్మోహన్‌రెడ్డి కళ్లెం, అజయ్ యరత, ప్రసాద్ సానికొమ్ము, ఆనంద్ తొండపు, చదివిరెడ్డి, విశ్వ భూమిరెడ్డి, గిరిధర్ రెడ్డి మాసిరెడ్డి, కృష్ణారెడ్డి, మనోజ్ చరపంజరి, వెంకట్‌రెడ్డి, పద్మనాభిరెడ్డి, ఆనంద్ కాకుమాని,వెంకటరెడ్డి, సురేష్ వెంకన్నగారి, నాగిరెడ్డి మున్నంగి, సుధాకర్‌రెడ్డి చేజర్ల, నరేష్,ఏటుకూరి, తదితరులు పాల్గొన్నారు. -
గొంతు, మెదడు, గుండె లేకుండానే శవాన్ని..
డ్రంక్ డ్రైవ్ కేసులో ట్రాఫిక్ పోలీసుల నుంచి నోటీసులు రావడంతో ఎవరెట్ పామర్(41) ఆరోజు పెన్సిల్వేనియాకు బయల్దేరాడు. కేసు క్లియర్ అయిన తర్వాత న్యూయార్క్ వెళ్లి తల్లిని చూడాలని భావించాడు. ఈ విషయాన్ని సోదరుడికి చెప్పి ఇంటి నుంచి బయటికి వచ్చాడు. అయితే అనుకున్నట్టుగా అతడు న్యూయార్క్ చేరకుండానే ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయాడు. ఈ విషయం గురించి తెలియని కుటుంబ సభ్యులు అతడి రాక కోసం నిరీక్షించసాగారు. రెండు రోజుల తర్వాత ఎవరెట్ న్యూయార్క్ కౌంటీ జైలులో మరణించాడనే వార్త విని హతాశయులయ్యారు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలు తెలుసుకునేందుకు అతడి కుటుంబ సభ్యులు నేటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు. జైళ్లో వింతగా ప్రవర్తించాడు.. న్యూయార్క్ కౌంటీ జైలు అధికారులు చెప్పిన ప్రకారం...‘ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరోజు బాగానే ఉన్నాడు. మరుసటి రోజు తలను సెల్డోర్కేసి గట్టిగా బాదుకున్నాడు. గట్టిగా అరుస్తూ వింతగా ప్రవర్తించాడు. దీంతో అతడిని జైలుకు చెందిన క్లినిక్‌కు తీసుకువెళ్లాం. పరిస్థితి విషమించడంతో యార్క్ ఆస్పత్రికి తరలించాం. ఆరోజు తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో అతడు మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఎవరెట్ శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. అయితే ఎవరెట్ తల భాగం పూర్తిగా తెరచిఉండటం, గొంతు భాగంలో గాట్లు కనిపించడంతో అనుమానం వచ్చిన అతడి సోదరుడు..తమకు తెలిసిన పాథాలజిస్ట్‌తో ఎవరెట్ శవానికి పరీక్షలు నిర్వహించాడు. ఈ క్రమంలో ఎవరెట్ మెదడు, గొంతు, గుండె మిస్సయిన విషయాన్ని గుర్తించారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే ఎవరెట్‌ను హత్య చేశారని అతడి కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. ఈ విషయం గురించి ఎవరెట్ తల్లి మాట్లాడుతూ..‘ నా కొడుకుకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. తను చాలా ఫిట్‌గా ఉండేవాడు. చీమకు కూడా హాని తలపెట్టని స్వభావం తనది. పోలీసులు చెప్పినట్లు ఎవరెట్ వింతగా ప్రవర్తించే అవకాశమే లేదు. సమస్యల్లో చిక్కుకున్నపుడు ఎలా బయటపడాలో తెలిసిన ధైర్యవంతుడే గానీ. ఉద్వేగాలను అదుపు చేసుకోలేని మూర్ఖుడు కాదు. ఎవరో కావాలనే నా కొడుకును హత్య చేశారు. ఆ తర్వాత వాడి శరీరంలోని అవయవాలను దొంగిలించారు’ అని ఆరోపించారు. ఈ క్రమంలో మానవ హక్కుల కార్యకర్త, లాయర్ లీ మెరిట్ ఎవరెట్ కుటుంబానికి అండగా నిలిచారు. తన కుమారుడి మరణానికి సంబంధించిన నిజాలను తెలుసుకునేందుకు రెండేళ్లుగా ఓ తల్లి పడుతున్న ఆవేదన తీర్చేందుకు తనవంతు సహాయం చేస్తున్నారు. ఇలాంటి మరణాలెన్నో.. గత కొన్నేళ్లుగా ఎవరెట్ తరహాలోనే ఎంతోమంది నల్లజాతీయులు అమెరికాలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ట్రాఫిక్ పోలీసుల చేతికి చిక్కిన తర్వాత జైలుకు వెళ్లిన కొంతమంది అకస్మాత్తుగా మరణించడం, వారికి సంబంధించిన పోస్ట్‌మార్టం రిపోర్టులు పెండింగ్‌లో ఉండటం జరుగుతోంది. 2015లో సాండ్రా బ్లాండ్ అనే మహిళ అనుమానాస్పద మృతితో ఇలాంటి వార్తలు వెలుగులోకి వచ్చాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిదనే కారణంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత జైలు గదిలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. అయితే అరెస్టు సమయంలో ఓ పోలీసు అధికారి.. సాండ్రాను దూషించడం, తుపాకీ గురిపెట్టి ఆమెను బెదిరించడం అక్కడి సీసీటీవీలో రికార్డు కావడంతో ఆమె మృతిపై పలు అనుమానాలు రేకెత్తాయి. ఈ క్రమంలో సాండ్రా కేసులో నిజానిజాలు తేల్చాలని, ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని కుటుంబ సభ్యులు, మానవహక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నా.. ఇంతవరకు ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సాండ్రా, ఎవరెట్ వంటి శ్వేతజాతీయేతర వ్యక్తులు జాత్యహంకారం కలిగి ఉన్న మూర్ఖుల చేతిలోనే బలవుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
హ్యారిస్ బర్గ్‌లో వైఎస్సార్సీపీ విజయోత్సవం
పెన్సిల్వేనియా : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండమెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా పెన్సిల్వేనియాలోని హ్యారిస్ బర్గ్‌లో ప్రవాసాంధ్రులు విజయోత్సవ సభ నిర్వహించారు. రాజన్న రాజ్యం కంటే ఇంకా అద్భుతంగా వైఎస్ జగన్ పరిపాలిస్తారని ఎన్ఆర్ఐలు అభిప్రాయం వ్యక్తం చేశారు. పెన్సిల్వేనియా వైఎస్సార్సీపీ రీజినల్ ఇంచార్జి శనివరుపు వెంకటరామి రెడ్డి(ఎస్వీఆర్ రెడ్డి), వైఎస్సార్సీపీ అమెరికా స్టూడెంట్ వింగ్ యూత్ కన్వీనర్, హ్యారిస్ బర్గ్ సిటీ ఇంచార్జి సాత్విక్ రెడ్డి గోగులమూడి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అర్పించి రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో హ్యారిస్ బర్గ్ వైఎస్సార్సీపీ ఇంచార్జి సునంద రెడ్డి, మల్లికార్జున రెడ్డి కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి గాదె, తేజ బంక (బంటీ), బాబా సొంత్యాన, బసవ శంకర్, రాజశేఖర్ రెడ్డి నరెడ్ల, ప్రవీణ్ రెడ్డి పట్టేంగురు, సత్య రెడ్డి ఏడెం, పెన్సిల్వేనియా వైఎస్సార్సీపీ హ్యారిస్ బర్గ్ కమిటీ మెంబెర్లు రఘు కటం, పురుషోత్తం రెడ్డి కొమ్మిరెడ్డి, వంశి కృష్ణ రెడ్డి, రవీందర్ రెడ్డి, సమంత్, సిద్ధార్ధ, వీర, ప్రకాష్లతోపాటూ వైఎస్సార్సీపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్ జగన్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వర్జీనియా నుండి శశాంక్ రెడ్డి, కిరణ్ ఎల్వీ, డెలావేర్ నుండి అంజిరెడ్డి, నవీన్, ఫిలడెల్ఫియా నుండి మధు గొనిపాటి, అల్లెన్ టౌన్ నుండి లక్ష్మి నరసింహ రెడ్డి కొండా, లక్ష్మి నరసింహ దొంతిరెడ్డి హాజరయ్యారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వీడియో మెసేజ్ పంపించి అందరికి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు ప్రసాద్ వీ పొట్లూరి(పీవీపీ) అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాదానాలు చెప్పి వారికి శుభాకాంక్షలు తెలియచేశారు. అమెరికాలో ఉన్న వారు ఏ రకంగా ప్రభుత్వానికి సహాయపడగలరో వివరించారు. వైఎస్సార్సీపీ కోర్ కమిటీ మెంబెర్స్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. హ్యారిస్ బర్గ్ తెలుగు అస్సోస్సీయెషన్ (హెచ్టీఏ) ప్రెసిడెంట్ సామ్ ఎల్లంకి, కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రార్థనా మందిరంలో కాల్పులు
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్బర్గ్ పట్టణంలో శనివారం ఉదయం యూదుల ప్రార్థనా మందిరం(సినగోగ్)లోకి చొరబడిన సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు సహా 8 మంది మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. మరో డజను మందికి పైగా గాయపడినట్లు తెలిసింది. ప్రజలు ఉదయపు ప్రార్థనల్లో నిమగ్నమై ఉండగా దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లు వార్తలు వెలువడ్డాయి. దాడి తరువాత నిందితుడు రాబర్ట్ బోయర్స్ పోలీసులకు లొంగిపోయినట్లు వెల్లడించింది. ఇది విద్వేషపూరిత దాడి అని, ఉగ్రకోణం లేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సినగోగ్ మూడో అంతస్తులో బోయర్స్, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని, ఈ క్రమంలో గాయపడిన అతడు ఆ తరువాత లొంగిపోయేందుకు అంగీకరించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. శ్వేత జాతీయుడైన బోయర్స్ గడ్డంతో ఉన్నాడని, యూదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పరుగెత్తుతూ కనిపించాడని చెప్పారు. దాడి జరిగిన సినగోగ్ భవనంలో తనిఖీల్ని ముమ్మరం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా పట్టణంలోని అన్ని ప్రార్థనా మందిరాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.ఈ ప్రార్థనా మందిరం ఉన్న స్క్విరిల్ హిల్ ప్రాంతంలో సాయుధుడు సంచరిస్తున్నాడని, ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అంతకుముందే పోలీసులు స్థానికుల్ని అప్రమత్తం చేశారు. -
బిడ్డకు పాలివ్వటమే శాపమైంది
పెన్సిల్వేనియా రాష్ట్రంలో విచిత్రమైన కేసు నమోదు అయ్యింది. తల్లి రొమ్మే బిడ్డ ప్రాణం తీసింది. పాలు విషంగా మారటంతో ఆ బిడ్డ మృతి చెందింది. దీంతో ఆమెపై కేసు నమోదు కాగా.. కటకటాల పాలైంది. ఏప్రిల్ 2న జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఫిలడెల్ఫియా నగరానికి చెందిన సమంత జోన్స్‌కి 11 నెలల బాబు. ఒళ్లు నొప్పులు ఉండటంతో మాత్రలు వేసి పడుకుంది. అయితే నిద్రలో పసికందు ఏడవటంతో లేచి పాలిచ్చింది. ఉదయం లేచి చూసేసరికి ఆ చిన్నారిని నురగ కక్కుకుని ప్రాణాలు విడిచాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తల్లిపాలు విషంగా మారటమే కారణమని తేలింది. కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. తర్వాత 3 మిలియన్ డాలర్ల పూచీకత్తుపై సమంత బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. కాగా, ఈ కేసులో వాదనలు శుక్రవారం మొదలుకాగా, మెథడోన్‌తో కూడిన మందులను ఆమె తీసుకోవటమే చిన్నారి మరణానికి కారణమైందని ప్రాసిక్యూషన్ వాదించారు. అయితే మెథడోన్ మందులు వాడి బిడ్డకు పాలివ్వొచ్చన్న శాస్త్రవేత్తల వాదనను సమంత తరపు అటార్నీ వాదించారు. కాగా, ఈ కేసులో తదుపరి వాదనను జూలై 23కి వాయిదా వేశారు. కోర్టు దోషిగా ప్రకటిస్తే మాత్రం ఆమెకు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. -
‘రాజధాని పేరిట వసూళ్లకు పాల్పడ్డారు’
సాక్షి ప్రతినిధి: అమరావతి నిర్మాణం పేరిట తెలుగుదేశం ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతిపై ఎన్నారైలు మండిపడ్డారు. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు హోస్ట్‌గా పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో నాటా పొలిటికల్ డిబేట్(ఆంధ్ర ప్రదేశ్) జరిగింది. ఈ చర్చాకార్యాక్రమంలో ఎన్నారైలతోపాటు మాజీ ఎంపీలు సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, కోరుముట్ల, ఇంకా ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వ తీరుపై ఎన్నారైలు, నేతలు విమర్శలు గుప్పించారు. అమరావతి పేరిట మోసం.. రాజధాని నిర్మాణం పేరిట తమ దగ్గర డబ్బులు వసూలు చేశారని పలువురు ఎన్నారైలు మండిపడ్డారు. ‘అమరావతి నిర్మాణం అంటూ డబ్బు వసూలు చేశారు. ఇప్పటి వరకు లెక్క లేదు. భవనాలు కట్టలేదు. ఇది మోసం కాదా?.. నిధుల విషయంలో టీడీపీ-బీజేపీలు దొంగాట ఆడుతున్నాయి’ అని వాళ్లు పేర్కొన్నారు. వైసీపీ నేతల స్పందన... ‘హోదా కోసం రాజీనామా చేశాం. టీడీపీ ఎంపీలు కలిసి వస్తే కేంద్రం స్పందించేది. పోలవరం ప్రాజెక్టులో ట్రక్కు మట్టి తీయటానికి అడ్డగోలుగా ఖర్చు పెడుతున్నారు’ అని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి.. జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎంపీ మిథున్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు కూడా వైఎస్సార్ సీపీకి సమానమేనని వైసీపీ నేత శిల్పా చక్రపాణి తెలిపారు. ‘నంద్యాల లో టీడీపీ ఏం చేసిందో నాకు తెలుసు. 2016 వరకు హోదాపై మాట కూడా మాట్లాడొద్దని నాడు పార్టీ నేతలకు ఆదేశాల ఇచ్చారు’ ఆయన చక్రపాణి పేర్కొన్నారు. ‘నంద్యాల తరహా ఎన్నిక చేస్తామని టీడీపీ ప్రచారం చేస్తోంది, మరి బీజేపీ ఎందుకు అప్పుడు స్పందించలేదు??’ నారుమిల్లి పద్మజ అన్నారు.. ‘జర్మనీని హిట్లర్ నాశనము చేస్తున్నారని చుట్టూ ఉన్న వాళ్లు చెబితే జర్మన్లు నమ్మలేదు, ఇప్పుడు అమరావతిలో ఇదే పరిస్థితి కనిపిస్తోందని’ కృష్ణ దేవరాయ తెలిపారు. చంద్రబాబు అంటేనే మోసం... ‘చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ మమ్మల్ని మోసం చేసింది. చంద్రబాబు గతంలో వాజ్‌పేయిని మోసం చేశారు. ఇప్పుడు ప్రధాని మోదీ విషయంలో అదే తీరును ప్రదర్శించారు. ఇకపై ఎప్పటికీ ఏ పార్టీ కూడా బాబును నమ్మొద్దు’ అని బీజేపీ నేత విలాస్ సూచించారు. -
నాటా పొలిటికల్ డిబేట్లో రసాభాస
-
రేవంత్ రెడ్డి వర్సెస్ జగదీశ్ రెడ్డి
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పెన్సిల్వేనియాలో(యూఎస్ఏ) జరిగిన నాటా(NATA) పొలిటికల్ డిబేట్(తెలంగాణ) రసాభాసగా ముగిసింది. తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకానొక పరిస్థితిలో పరిస్థితి చెయ్యి దాటి ఉద్రిక్తంగా మారింది. మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు మధు యాష్కీ, రేవంత్‌రెడ్డి, బీజేపీ నేత కృష్ణ సాగర్, మరికొందరు నేతలు ఈ డిబేట్లో పాల్గొన్నారు. అయితే విపక్ష నేతలు టీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేసిన క్రమంలో వ్యవహారం కాస్త ముదిరింది. టీఆర్ఎస్ పాలనపై విమర్శలు... చర్చాకార్యక్రమంలో ముందుగా మధు యాష్కీ మాట్లాడుతూ ప్రాజెక్టుల రీ డిజైన్ వ్యవహారంపై మండిపడ్డారు. ‘ప్రాజెక్టుల రీ డిజైన్ పేరిట కోట్ల ప్రజా ధనాన్ని టీఆర్ఎస్ సర్కార్ వృధా చేస్తోంది. ఇది ఎంత వరకు సమంజసం?.. మిషన్ కాకతీయ భవిష్యత్‌లో మిషన్ కల్వకుంట్ల కాకూడదని కోరుకుంటున్నాం. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ కాంగ్రెస్‌దే. హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఏర్పాటు చేయబోమని సోనియా ఆనాడే స్పష్టం చేశారు. ఉద్యమంలో ఎన్నారైలు కూడా కీలక పాత్ర పోషించారు. కానీ, కేసీఆర్ ఆ క్రెడిట్ మొత్తం లాగేసుకున్నారు.’ అని విమర్శించారు. దీనికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పందిస్తూ కాంగ్రెస్ నేతల ఆరోపణలు పస లేనివని.. గాంధీభవన్ నుంచి వచ్చే విమర్శలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ నేత కృష్ణ సాగర్ మాట్లాడుతూ... ‘సీఎం కేసీఆర్ అసలు సచివాలయానికి రావట్లేదు. ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యారు. అది వర్క్ ఫర్ హోమ్ కూడా’ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఒకానోక టైంలో రేవంత్-జగదీశ్‌లు వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవటంతో డిబేట్ వేడెక్కింది. వారిని శాంతిపజేసేందుకు సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని హోస్ట్(సాక్షి కన్సల్టెంట్ ఎడిటర్) ప్రయత్నించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో తమపైనా దురుసు వ్యాఖ్యలు చేశారంటూ ఎన్నారైలు ఆందోళనకు దిగారు. దీంతో నిర్వాహకులు పోలీసులను పిలిపించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. -
క్రీస్తుపై చెక్కుచెదరని గాంధీ లేఖ.. భారీ డిమాండ్
వాషింగ్టన్ : జీసస్‌పై భారత స్వాతంత్ర్య పోరాటయోధుడు మహాత్మాగాంధీ రాసిన లేఖకు భారీ డిమాండ్ పెరగనుంది. అమెరికాలోని పెన్సిల్వానియాలో ఇప్పుడు ఆ లేఖను వేలానికి పెట్టారు. దానికి ఇప్పుడు దాదాపు రూ. 32,63,250.00 (50 వేల డాలర్లు) రానున్నాయి. గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమంలో ఉన్నప్పుడు 1926, ఏప్రిల్ 6న మహాత్మాగాంధీ ఈ లేఖ రాశారు. ఒక రకమైన ఇంకుతో పెద్ద అక్షరాల్లో ఆయన ఈ లేఖను రాశారు. ఆయన సంతకం కూడా ఆ లేఖలో ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు. పెన్సిల్వానియాకు చెందిన రాబ్ కలెక్షన్ అనే సంస్థ ఈ లేఖను సేకరించింది. ఈ లేఖలో ఏసు క్రీస్తు గురించి గాంధీ ఒక్క వాక్యంలో 'సహృదయంగల బోధకులందరిలో కెల్లా క్రీస్తు గొప్ప బోధకుడు' అని గాంధీ పేర్కొన్నారు. ఆయన ఈ లేఖను అమెరికాలోని తన మిత్రుడు మిల్టన్ న్యూబెర్రీ ఫ్రాన్ట్జ్కు రాశారు. గాంధీ రాసిన లేఖల్లోనే ఇది అత్యుత్తమమైన లేఖ అని రాబ్ కలెక్షన్ సంస్థ పేర్కొంది. -
నరరూప రాక్షసుడికి ఇదే సరైన శిక్ష
వాషింగ్టన్ : సంచలనం సృష్టించిన పెన్సల్వేనియా హైస్కూల్ నరమేధంలో దోషికి ఎట్టకేలకు శిక్ష ఖరారైంది. అలెక్స్ హ్రిబల్కు 60 ఏళ్ల శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. కిరాతకంగా 21మంది తోటి విద్యార్థులను బలి తీసుకున్న హిబ్రల్(20)కు సంఘంలో తిరిగే హక్కు ఎంత మాత్రం లేదని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీంతో పెన్సల్వేనియా కోర్టు హల్ విద్యార్థుల తల్లిదండ్రుల చప్పట్లతో మారుమ్రోగిపోయింది. హ్రిబల్ మానసిక స్థితి సరిగ్గా లేదని.. అతనికి జైలు శిక్ష విధిస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదని అతని తరపు న్యాయవాది వాదించాడు. ఆ వాదనతో ఏకీభవించని జడ్జి ‘ఇలాంటి నరరూప రాక్షసుడితో సమాజానికి ఎప్పటికైనా ప్రమాదమే. తల్లిదండ్రులను కూడా చంపేందుకు యత్నించాడు. అతని మానసిక స్థితి ఆధారంగానే మరణ శిక్ష విధించటం లేదు. అతనికి ఇదే సరైన శిక్ష’ అని వ్యాఖ్యానించారు. కావాలంటే శిక్ష అనుభవించే ముందు హిబ్రల్‌కు మానసిక వైద్యం అందించేందుకు జడ్జి అనుమతి ఇచ్చారు. అయితే హిబ్రల్ మాత్రం శిక్షను అనుభవించేందుకు నేరుగా జైలుకు వెళ్లాడు. ఇక బాధితులకు నష్టపరిహారం చెల్లించే బాధ్యత హిబ్రల్ తల్లిదండ్రులకు లేదన్న న్యాయవాది వాదనతో జడ్జి ఏకీభవించారు. 2004 ఏప్రిల్ 9న ముర్రేస్విల్లెలోని ఫ్రాంక్లిన్ రీజనల్ హైస్కూల్లో తాను చదివే స్కూల్లోనే కత్తులతో వీరంగం వేసిన అలెక్స్ హ్రిబల్ తోటి విద్యార్థులపై దాడి చేశాడు. రెండు వంట గది కత్తులతో 21 మంది విద్యార్థులను, ఒక వ్యక్తిని విచక్షణరహితంగా పొడిచి హతమార్చాడు. అడ్డొచ్చిన మరికొందరిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ క్రమంలో తనను తాను కూడా గాయపరుచుకున్నాడు. ఘటన తర్వాత మీడియాతో మాట్లాడిన హిబ్రల్.. తాను మరింత మందిని చంపాల్సి ఉందని వ్యాఖ్యానించటం గమనార్హం. ఈ వ్యాఖ్యల ఆధారంగానే కోర్టు నిందితుడికి శిక్షను ఖరారు చేసింది. -
నన్ వేషంలో వచ్చి.. మహిళల బీభత్సం
-
నన్ వేషంలో వచ్చి మహిళల బీభత్సం
- తుపాకులతో పట్టపగలే బ్యాంకు దోపిడీకి యత్నం సాక్షి, టన్నెర్స్విల్లే(అమెరికా): ప్రకృతి అందాలకు నెలవైన పెన్సిల్వేనియాలోని పొకోనోలో ఇద్దరు మహిళలు బీభత్సం సృష్టించారు. స్థానిక టన్నెర్స్విల్లేలోని సిటిజన్ బ్యాంకులో పట్టపగలే దోపిడీ యత్నించారు. క్రైస్తవ సన్యాసిని(నన్)ల దుస్తులు ధరించిన ఇద్దరు మహిళలు సోమవారం మధ్యాహ్నం కస్టమర్ల మాదిరి బ్యాంకులోకి ప్రవేశించారు. కొద్ది సేపటికే దుస్తుల్లో దాచిపెట్టుకున్న తుపాకులను బయటికి తీసి సిబ్బందికి గురిపెట్టి కరెన్సీ కట్టలను తీసుకునే ప్రయత్నం చేశారు. బిక్కుబిక్కుమంటూ నిల్చున్న ఉద్యోగుల్లో ఒకరు కాస్త ధైర్యం చేసి ప్రమాదఘంటిక(ఆలారం బెల్)ను మోగించాడు. స్పీకర్ల నుంచి ఒక్కసారే ‘కుయ్.. కుయ్..’ మంటూ సైరన్ శబ్ధాలు పెద్దగా మోగడంతో ఆ మహిళా దొంగలు బిత్తరపోయారు. వెంటనే తేరుకుని అక్కడి నుంచి పారిపోయారు. కొద్దిసేపటికిగానీ బ్యాంకుకు చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలో దొంగల ముఖాలను గుర్తించారు. ఆ ఫొటోలోని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
రెస్ట్.. ఇన్ అరెస్ట్
మన శ్శాంతిని హరించడం కూడా ఆస్తుల్ని ధ్వంసం చేయడమే. ఈ సంగతి పెన్సిల్వేనియా మేయర్ బిల్ మిల్బ్రాండ్కి బాగా తెలిసివచ్చింది. సమాధులు ఉన్నచోట సెల్‌ఫోన్ టవర్ నిర్మించడానికి బిల్ అనుమతి ఇవ్వడంతో ఆ కాలనీ వాళ్లంతా బిల్‌పై విరుచుకుపడ్డారు. సమాధుల్లో గాఢ నిద్రలో ఉన్నవారి మనశ్శాంతిని ధ్వంసం చేయడానికి మీకెలా మనసొప్పిందని వారు బిల్ మీద కేసుపెట్టారు. పోలీసులొచ్చి ఆయన్ని ఆరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ‘వాండలిజం’ (ఆస్తుల్ని ధ్వసం చేయడం) కింద ఆయన్ని కోర్టు దోషిగా నిర్ధారించింది. మనుషులకే కాదు, ఆత్మలకూ హక్కులుంటాయని మేయర్‌గారు తెలుసుకుని, చే సిన తప్పుకు ఇప్పుడు తీరిగ్గా చింతిస్తున్నారు. -
భూకేంద్రానికి వెళ్లాలంటే 1.8 ఏళ్లు పడుతుంది...
హారిస్బర్గ్: భూగోళం కేంద్ర బిందువు వరకు ఓ మనిషి ప్రయాణించాలంటే ఎంతకాలం పడుతుంది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నకు అమెరికాలోని పెన్సిల్వేనియా కింగ్స్ కాలేజీకి చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు సమాధానం చెప్పారు. భూమి ఉపరితలం నుంచి భూగర్భంలోని కేంద్ర బిందువు వరకు ఓ సొరంగ మార్గం ఉందనుకుంటే అందులో ఓ విమానం ద్వారా చొచ్చుకొని పోయినట్లయితే 1.8 సంవత్సరాలు పడుతుందని భౌతికశాస్త్రవేత్తలు థామస్ కాంకనన్, గెరార్డో గియోర్డనో అంచనావేశారు. ఇంత ఎక్కువకాలం పట్టడానికి కారణం ఏమిటంటే లోపలికి వెళుతున్నాకొద్దీ పెరిగే భూమ్యాకర్షణ శక్తితోపాటు టన్నెల్ గోఢల నుంచి ఉత్పన్నమయ్యే ఒత్తిడే కారణమని వారు చెప్పారు. టన్నెల్లో గ్యాస్ రూపంలో ఎదరయ్యే ఒత్తిడి పోనుపోను ఘనపదార్థం ఒత్తిడిలా మారుతుందని కూడా వారు చెప్పారు. భూమి తిరగకుండా నిశ్చల స్థితిలో ఉందనుకుంటే, టన్నెల్లో గాలి ఒత్తిడి, భూమ్యాకర్షణ శక్తి ఏదీ లేదనుకుంటే, ఒట్టి శూన్యం మాత్రమే ఉందనుకుంటే 42 నిమిషాల్లోనే భూ కేంద్రానికి చేరుకోవచ్చని వారు తెలిపారు. ఏ వాహనం ద్వారాగానీ భూ కేంద్రం వద్దకు వెళ్లేందుకు ప్రస్తుతంగానీ, సమీప భవిష్యత్తులోగానీ సాధ్యమయ్యే పనికాదని వారు చెబుతున్నారు. -
ఎఫ్బీలో వృద్ధ మహిళకు గాలమేసి..!
ఫేస్బుక్లో ఆమెకు 'ఫ్రెండ్' పేరిట అతడు పరిచయమయ్యాడు. తనకు కష్టాలు ఉన్నాయని నమ్మబలికాడు. 'పోర్ట్ ఫీజు' కట్టడానికి తనను సహకరించాలని కోరాడు. పాపం ఆ వృద్ధ మహిళ అతడి ఉచ్చులో పడింది. తన జీవితకాలం దాచుకొని.. తన కలైన బీఎండబ్ల్యూ కారు కొనేందుకు అట్టిపెట్టుకున్న 78వేల డాలర్ల (రూ. 52లక్షల)ను అతడి చేతిలో పోసింది. ముక్కుమొఖం తెలియకున్నా.. అతడు ఇచ్చిన వివిధ బ్యాంకు అకౌంట్లకు ఆ డబ్బును జమచేసింది. ఈ డబ్బును వడ్డీతో సహా చెల్లిస్తానని నమ్మబలికాడు. గత ఏడాది ఆగస్టులో మొదలైన ఈ వ్యవహరం ఏడాది చివరినాటికి ఆమె అతడి చేతిలో పోయడంతో ముగిసింది. ఆ తర్వాత అతడు కనిపించకపోవడంతో ఆమె లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగింది. తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన బాధిత మహిళ తాజాగా, తాపీగా పోలీసులను ఆశ్రయించింది. ముక్కుమొఖం తెలియని వ్యక్తికి అంత డబ్బు ఎలా చేరిందనే అంశాన్ని పెన్సిల్వేనియా పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్‌తోపాటు, భారత్‌లోని బ్యాంకుల్లోకి ఈ డబ్బు ప్రవహించినట్టు తెలుస్తోంది. ఈ డబ్బు వెళ్లిన విధాన్నాని ట్రాక్ చేసేందుకు ప్రస్తుతం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
అమ్మాయి కోసం అన్నను చంపేశాడు
ఒక్కటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము.... అని ఓ సినీ గేయ రచయిత తాను రాసిన పాట ద్వారా సెలవిచ్చాడు. అచ్చం అలాగే ఒకే అమ్మాయిని అన్నదమ్ములు ఇద్దరు ప్రేమించారు. ఆమె నాకు కావాలి అంటే నాకు కావాలి అని పోటీ పడ్డారు. ఆ క్రమంలో ఒకరు మృత్యు ఒడిని చేరుకున్నారు. ఈ సంఘటన యూఎస్ పెన్సిల్వేనియాలోని దుపిన్ కౌంటీలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న డకొటా త్రాంటన్ (15), డొమినిక్ (18) సోదరులు. ఈ ఇద్దరు ఒకే అమ్మాయిపై మనస్సు పడ్డారు. ఆమె ప్రేమను పొందేందుకు రెడీ అయ్యారు. దీంతో ఇద్దరు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున 2.00 గంటలకు డొమినిక్‌ను డకొటా చంపేశాడు. ఈ హత్య కేసులో డకొటాను పోలీసులు అరెస్ట్ చేశారు. నా సోదరుడిని నేనే హత్య చేశాను....అని పదే పదే పోలీసుల ఎదుట చెప్పాడు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ కేసులో డకొటాకు పెద్ద శిక్ష పడే అవకాశం ఉందని న్యాయమూర్తులు భావిస్తున్నారు. -
నా కేసు నేనే వాదించుకుంటా
వాషింగ్టన్ : అమెరికాలో చిన్నారి శాన్వి, సత్యవతి దారుణహత్య కేసులో నిందితుడైన ఎన్నారై రఘునందన్ యండమూరి (29) తన కేసు తానే వాదించుకుంటానని చేసుకున్న అభ్యర్థనని పెన్సిల్వేనియా స్టేట్ సుప్రీంకోర్టు జడ్జి అంగీకరించారు. అయితే కోర్టు నిబంధనలకు లోబడి వాదనలు సాగాలని అతడికి జడ్జి సూచించారు. ఈ మేరకు స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో చిన్నారి శాన్వీని కిడ్నాప్ చేయడానికి యత్నించి ఆ పసికందును, ఆమె నాయనమ్మ సత్యావతిని దారుణంగా చంపేసిన కేసులో విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ యండమూరి రఘునందన్(28)కు స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2012లో జరిగిన ఈ జంట హత్యలపై రెండేళ్ల విచారణ అనంతరం మాంట్గోమెరీ కౌంటీ కోర్టు జ్యూరీ, రఘునందనే ఈ హత్యలు చేశాడని నిర్ధారించింది. జూదానికి బానిసైన రఘునందన్ భారీగా బకాయిలు పడడంతో, వాటిని తీర్చడానికి చిన్నారి శ్వాన్వీ కిడ్నాప్ ప్లాన్ వేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. కిడ్నాప్‌నకు అడ్డొచ్చిన చిన్నారి నాయనమ్మ వెన్న సత్యావతి (61)ని కత్తితో పొడిచి, పది నెలల పసికందు వెన్న శాన్వీని ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు రఘునందన్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. అయితే తొలుత ఈ హత్యలు చేసింది తనే అంటూ ఒప్పుకున్న రఘునందన్ ఆ తర్వాత మాట మార్చాడు. జంట హత్యలతో తనకు ప్రమేయం లేదని, జరిగిన దొంగతనంలో మాత్రమే పాల్గొన్నానంటూ ఐదుగురు సభ్యుల కోర్టు బెంచ్ ముందు వాగ్మూలం ఇచ్చాడు. ఇద్దరు అమెరికన్లు తనను బెదిరించి హత్యలకు పాల్పడ్డారని రఘునందన్ చెప్పాడు. దీంతో ఏడుగురు సభ్యుల బెంచ్‌కు కేసు బదిలీ అయింది. కేసును మళ్ళీ విచారించిన న్యాయమూర్తులు రఘునందన్ వాదనతో విభేదించారు. డబ్బుకోసం రఘునే ఈ హత్యలను చేశాడని నిర్థారించారు. దాంతో రఘనందన్‌కు అమెరికా కోర్టు మరణశిక్ష విధించింది. -
బస్సు - ట్రాక్టర్ ఢీ: ఇటలీ పర్యాటకులు మృతి
పెన్సిల్వేనియా: ఇటలీ పర్యాటకులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదం పెన్సిల్వేనియాలో బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.... మరికొంత మంది గాయపడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు సమీపంలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు ఇటలీ పర్యాటక శాఖకు చెందినదని చెప్పారు. న్యూయార్క్ నుంచి నయాగార జలపాతం సందర్శించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఉన్నతాధికారులు వివరించారు. -
రఘునందన్‌కు ఉరే సరి
అమెరికాలో చిన్నారి శాన్వీని, ఆమె నాయనమ్మను హత్య చేసిన కేసులో కోర్టు తీర్పు మొదట పెరోల్ లేని యావజ్జీవ శిక్ష వేయాలనుకున్న జ్యూరీ హత్యల తీవ్రత, దోషి మానసిక స్థితి చూసి మరణశిక్ష ఖరారు న్యూయార్క్: అమెరికాలోని పెన్సిల్వేనియాలో చిన్నారి శాన్వీని కిడ్నాప్ చేయడానికి యత్నించి ఆ పసికందును, ఆమె నాయనమ్మ సత్యావతిని దారుణంగా చంపేసిన కేసులో విశాఖపట్నా నికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ యండమూరి రఘునందన్(28)కు స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించింది. 2012లో జరిగిన ఈ జంట హత్యలపై రెండేళ్ల విచారణ అనంతరం మాంట్గోమెరీ కౌంటీ కోర్టు జ్యూరీ, రఘునందనే ఈ హ త్యలు చేశాడని ఇటీవల నిర్ధారించింది. జూదానికి బానిసైన రఘునందన్ భారీగా బకాయిలు పడడంతో, వాటిని తీర్చడానికి కిడ్నాప్ ప్లాన్ వేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. కిడ్నాప్‌నకు అడ్డొచ్చిన చిన్నారి నాయనమ్మ వెన్న సత్యావతి(61)ని కత్తితో పొడిచి, పది నెలల పసికందు వెన్న శాన్వీని ఊపిరాడకుండా చేసి చంపేశాడని స్పష్టమైంది. పశ్చాత్తాప పడని రఘునందన్ : ఈ కేసును ఐదుగురు మహిళలు, ఏడుగురు పురుషులతో కూడిన జ్యూరీ విచారించింది. విచారణ సమయంలో, చిన్నారి హత్య జరిగిన తీరు తెలిసి, సాక్ష్యాధారాలు చూసి న్యాయమూర్తులే కన్నీళ్లు పెట్టగా.. రఘునందన్ కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా ప్రవర్తించాడు. తనకు ఏమీ తెలియదని చెబుతూ వచ్చాడు. అంతేకాకుండా, ఈ వాదనలన్నీ వింటూ కూర్చొనే కంటే తనకు ఉరిశిక్ష విధిస్తే దాన్ని స్వీకరిస్తానని అనడం జ్యూరీని మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. శిక్ష ఖరారుపై జ్యూరీ మంగళవారం మూడున్నర గంటలపాటు చర్చించింది. రఘునందన్‌కు మొదట పెరోల్ లేని యావజ్జీవ శిక్ష వేసే అంశాన్ని పరిశీలించింది.చివరికి హత్యలో క్రూరత్వం, అతడి వాంగ్మూలం, మానసిక స్థితి, మితిమీరిన జూదం అలవాట్లు పరిశీలించాక ఉరే సరైన శిక్ష అని తేల్చింది. 45 రోజుల్లో అతడికి శిక్ష అమలు చేసే అవకాశముంది. శిక్ష విన్నా.. నోట్స్ రాసుకుంటూ తనకు ఉరిశిక్ష విధించినట్లు జ్యూరీ ప్రకటించినా కూడా రఘునందన్‌లో ఎలాంటి స్పందనా లేదని, తలవంచుకుని ఏదో నోట్స్ రాసుకుంటూ కనిపించాడని స్థానిక మీడియా తెలిపింది. కాగా, బాధిత కుటుంబం కోరుకున్న శిక్ష ఇదేనని మాంట్గోమెరీ కౌంటీ మొదటి అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీ కెవిన్ స్టీల్, డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ సమంతా కఫ్‌మన్ చెప్పారు. ‘‘ఈ శిక్ష వారు కోల్పోయినదాన్ని వారికి తిరిగివ్వలేదు. కానీ సాంత్వన చేకూర్చగలదంతే’’ అని పేర్కొన్నారు. విచారణ తొలి దశలో రఘునందన్ తన కేసును తానే వాదించుకున్నాడు, శిక్ష ఖరారు దశలో హెన్రీ హిలెస్ను తన అటార్నీగా పెట్టుకున్నాడు. ఇదీ కేసు ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన వెన్న శాన్వీ తల్లిదండ్రులిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. పెన్సిల్వేనియాలోని ‘కింగ్ ఆఫ్ ప్రూసియా’ అనే అపార్టుమెంట్లో నివసించేవారు. 2012 అక్టోబరు 12న చిన్నారి శాన్వి కిడ్నాప్‌కు గురైంది. పాప నాయనమ్మ దారుణంగా హత్యకు గురైంది. ఈ క్రమంలో శాన్వీ కోసం వెతుకుతున్న పోలీసులకు అక్కడో లేఖ కనిపించింది. 50 వేల డాలర్లు ఇస్తేనే పిల్లను విడిచి పెడతానని, లేదంటే చంపేస్తానంటూ ఆ లేఖలో ఉంది. అయితే శాన్వీ తల్లిదండ్రులను బాగా తెలిసిన వాళ్లు మాత్రమే పిలిచే పేర్లను ఆ నోట్లో పేర్కొనడంతో పోలీసుల దర్యాప్తు సులభమైంది. దీంతో బాగా తెలిసినవాళ్లపై ఆరా తీసిన పోలీసులకు.. మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆంధ్రప్రదేశ్ వాడే అయిన రఘునందన్‌పై అనుమానమొచ్చింది. మొదట్లో తానే హత్యలు చేశానని రఘునందన్ అంగీకరించాడు. తాను కిడ్నాప్ చేయడానికి వెళ్లిన సమయంలో అక్కడ శాన్వీ నాయనమ్మ ఉండడంతో తాను షాక్ తిన్నానని, ఆమె ను తప్పించుకునే క్రమంలో కూరగాయల కత్తితో పొడిచి చంపేశానని రఘునందన్ దర్యాప్తులో వెల్లడించాడు. తర్వాత పాప ఏడిస్తే చుట్టుపక్కల వాళ్లకు తెలిసిపోతుందన్న భయంతో ఆమె నోట్లో గుడ్డలు కుక్కేశానని, ఆమె చుట్టూ ఒక బట్ట చుట్టానని, తర్వాత బేస్మెంట్లోని చెత్తబుట్టలో పెట్టానని తెలిపాడు. తర్వాత పాప కోసం పాలు తీసుకొచ్చి చూడగా.. పాప మరణించిం దని వెల్లడించాడు. అయితే విచారణలో తనకేమీ తెలియదంటూ బుకాయిస్తూ వచ్చాడు. -
థ్రిల్ కోసం హత్య చేసిన కొత్త జంట!
పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం నానుడిని నిజం చేసింది. అమెరికాకు చెందిన ఓ కొత్త జంట. థ్రిల్ కోసం ఓ మనిషి ప్రాణాలు తీశారు. మూడు వారాల క్రితమే పెళ్లి చేసుకున్న ఓ జంట అత్యంత కర్కశంగా ఓ వ్యక్తిని హత్య చేసింది. ఆన్లైన్ ప్రకటన ఇచ్చి మరి మర్డర్ చేశారు. ఫిలడెల్పియాకు చెందిన ఎలిటీ బాబర్(22), మిరిండా బాబర్(18) ఈ కిరాతకానికి పాల్పడ్డారు. వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి హత్యానేరం మోపారు. ఫిలడెల్పియాకు ఈశాన్యంగా 100 మైళ్ల దూరంలో ఉన్న సన్బరీ పట్టణంలో నవంబర్ 12న ట్రాయ్ లా ఫెరారా అనే వ్యక్తి హత్యకు గురైనట్టు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అవాక్కయ్యే నిజాలు తెలిశాయి. నిందితుడు ఎలిటీ బాబర్ అరెస్ట్‌ను చేయడంతో హత్యోదంతం వెల్లడయింది. చాలా రోజుల నుంచి హత్య చేయాలని భావించినా లా ఫెరారా దొరికే వరకు తమ ప్రయత్నాలు ఫలించలేదని పోలీసులతో ఎలిటీ చెప్పాడు. ఆన్లైన్లో తామిచ్చిన కంపానియన్(తోడు కోసం) ప్రకటన చూసి స్పందించిన లా ఫెరారాను నవంబర్ 11న ఓ షాపింగ్ మాల్ దగ్గర కారులో ఎక్కించుకున్నామని తెలిపాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత తన భార్య సైగ చేయడంతో కారు ముందు సీట్లో కూర్చున్న లా ఫెరారా మెడకు వెనక నుంచి వైరు బిగించి పట్టుకున్నానని తెలిపాడు. అదే సమయంలో అతడిని తన భార్య కత్తితో పొడిచిందని వివరించాడు. 42 ఏళ్ల లా ఫెరారా ఒంటిపై 20 కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. లా ఫెరారా ఎవరో తనకు తెలియదని మొదట్లో బుకాయించిన మిరాండ తర్వాత నేరం ఒప్పుకుంది. హత్య చేసిన తర్వాత క్లబ్ వెళ్లి తన భర్త పుట్టినరోజును సెలబ్రేట్ చేసింది. అక్టోబర్ 22న తమ పెళ్లైన నాటి నుంచి మిరాండ ఆన్లైన్లో 'కంపానియన్' ప్రకటనలు ఇస్తోందని ఎలిటీ బాబర్ తెలిపారు. అయితే తన భార్య వేశ్య కాదని స్పష్టం చేశాడు. కేసుపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఇంకా ఎన్ని సంగతులు వెలుగు చూస్తాయో చూడాలి. -
యూఎస్‌లో వ్యక్తి కాల్పులు: ఇద్దరు మృతి
అమెరికాలోని పెన్సిల్వేనియా పట్టణంలో రాస్ టౌన్షిప్లో జరుగుతున్న సమావేశంలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారని స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది. ఆ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. వారిలో ఇద్దరు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని ప్రత్యేక విమానంలో లీహై వ్యాలీలోని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుందని చెప్పింది. అయితే కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మీడియా తెలిపింది.