డెలావేర్ వ్యాలీ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ అభినందన సభ | YSRCP Victory Celebrations In Pennsylvania | Sakshi
Sakshi News home page

డెలావేర్ వ్యాలీ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ అభినందన సభ

Published Mon, Jun 17 2019 9:22 PM | Last Updated on Mon, Jun 17 2019 9:42 PM

YSRCP Victory Celebrations In Pennsylvania - Sakshi

పెన్సిల్వానియా : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించి తెలుగువారందరూ గర్వపడేలా అద్భుతంగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలియజేస్తూ అమెరికాలోని డెలావేర్ వ్యాలీ (న్యూజెర్సీ ,పెన్సిల్వేనియా మరియు డెలావేర్ )సభ్యులు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు అభినందన సభ నిర్వహించారు. గొప్ప విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు, వైఎస్సార్‌సీపీ నాయకులకు, విజయ సారథి వైఎస్‌ జగన్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రాఘవారెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు నాటా తరపున సహాయసహకారాలు అందిస్తామన్నారు. అభినందన సభను నిర్వహించడంలో ముఖ్యపాత్ర వహించిన నాటా డైరెక్టర్స్ మధు గోనెపాటి ,అంజిరెడ్డి శాగంరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్‌ చేపట్టిన అభి వృద్ధి కార్యక్రమాలకు అమెరికా ఎన్నారైల తరపున తమవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 

ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ పెనుమాడా, శ్రీనివాసరెడ్డి , శశాంక్ రెడ్డి ,సాత్విక్, కిరణ్, బాబా, రమణ కొత్త, చంద్ర దొంతరాజు, జగన్ దుద్దుకుంటా, శ్రీనివాసరెడ్డి వంగాల, మధు పాపసాని, తేజ, హరి ,నరసింహారెడ్డి కొండా, నరసింహారెడ్డి దొంతి రెడ్డి, శ్రీనివాసరెడ్డి కేసవరపు, నిరంజన్, భాస్కర్ పిన్నా, భాస్కర్, నవీన్, మధు, శ్రీనివాస్ అమరవాది,అశోక్, హను తిరుమల్ ,అరవింద్ బత్తిన, శ్రీధర్రెడ్డి తిక్కవరపు, విజయభాస్కర్‌రెడ్డి పొలంరెడ్డి, వెంకటరామిరెడ్డి, హరినాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి లక్కసాగరం, లక్ష్మీనారాయణ, గోపినాథ్‌రెడ్డి, హరినాథ్‌ రెడ్డి కురువకుండ, రామ్మోహన్‌రెడ్డి కళ్లెం, అజయ్‌ యరత, ప్రసాద్‌ సానికొమ్ము, ఆనంద్‌ తొండపు, చదివిరెడ్డి, విశ్వ భూమిరెడ్డి, గిరిధర్‌ రెడ్డి మాసిరెడ్డి, కృష్ణారెడ్డి, మనోజ్‌ చరపంజరి, వెంకట్‌రెడ్డి, పద్మనాభిరెడ్డి, ఆనంద్‌ కాకుమాని,వెంకటరెడ్డి, సురేష్‌ వెంకన్నగారి, నాగిరెడ్డి మున్నంగి, సుధాకర్‌రెడ్డి చేజర్ల, నరేష్‌,ఏటుకూరి, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement