మొసలితో కుక్క విన్యాసాలు.. నోట్లో చేయిపెట్టినా మింగదట! | Pennsylvania: Emotional support Alligator denied entry to Philly Baseball game | Sakshi
Sakshi News home page

మొసలితో కుక్క విన్యాసాలు.. నోట్లో చేయిపెట్టినా మింగదట!

Published Sat, Sep 30 2023 8:10 AM | Last Updated on Sat, Sep 30 2023 9:17 AM

Pennsylvania man take Alligator to see Philly Baseball Game - Sakshi

కుక్క అయినా మరో పెంపుడు జంతువు అయినా మనిషితో మచ్చిక ఏర్పడినప్పుడు మంచి దోస్తీ కుదురుతుంది. తాజాగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఒక వీడియో అందరినీ హడలెత్తిస్తోంది. ఒక వ్యక్తి.. మొసలిని కుక్కలా సాకుతున్నాడు. ఆ మొసలి మెడ చుట్టూ తాడు కట్టి, దానిని బయట తప్పుతున్నాడు. ఇది చూసినవారంతా  షాక్‌కు గురవుతున్నాడు. 

ఈ ఉదంతాన్ని ఎవరో వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. ఆ మొసలిని సాకుతున్న వ్యక్తి పేరు హెనీ. అతను బేస్ బాల్ మ్యాచ్ చూసేందుకు వచ్చాడు. అయితే అతనితో పాటు మొసలిని తీసుకువచ్చిన కారణంగా  అతనికి మ్యాచ్‌ చూసేందుకు అనుమతి ఇవ్వలేదు. అయితే తన మొసలి ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అతను మీడియాకు తెలిపాడు. తన మొసలిని ఎవరైనా తాకవచ్చని, అది ఎవరిపైనా దాడి చేయదన్నాడు. దాని నాలుకను పట్టుకున్నా కూడా ఏమీ చేయదని తెలిపాడు. ఈ ఉదంతానికి సంబంధించిన ఈ వీడియో పెన్సిల్వేనియాకు చెందినది. @NewsAlertsG హ్యాండిల్‌ పేరుతో పోస్ట్ అయ్యింది. 

పిట్స్‌బర్గ్ పైరేట్స్ గేమ్ టోర్నమెంట్‌ చూసేందుకు హెన్నీ సిటిజన్స్ బ్యాంక్ పార్క్‌కు వచ్చాడు. అయితే హెనీ ఒంటరిగా కాకుండా తన పెంపుడు జంతువు మొసలిని తీసుకుని వచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసిన చాలా మంది వీడియో తీశారు. హెనీ 2015లొ ఈ మొసలిని దత్తత తీసుకున్నాడు. దానికి వాలీ అనే పేరు పెట్టాడు. దానిని ‘వాలిగేటర్’ అని కూడా పిలుస్తుంటాడు. దీని పొడవు 56 అడుగులు. హెనీ, వాలిగేటర్‌లు యార్క్ కౌంటీలోని అతని ఇంటిలో కలసిమెలసి ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: ‘కెనడా చదువులు’ ఏం కానున్నాయి?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement