Baseball
-
మొసలితో కుక్క విన్యాసాలు.. నోట్లో చేయిపెట్టినా మింగదట!
కుక్క అయినా మరో పెంపుడు జంతువు అయినా మనిషితో మచ్చిక ఏర్పడినప్పుడు మంచి దోస్తీ కుదురుతుంది. తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఒక వీడియో అందరినీ హడలెత్తిస్తోంది. ఒక వ్యక్తి.. మొసలిని కుక్కలా సాకుతున్నాడు. ఆ మొసలి మెడ చుట్టూ తాడు కట్టి, దానిని బయట తప్పుతున్నాడు. ఇది చూసినవారంతా షాక్‌కు గురవుతున్నాడు. ఈ ఉదంతాన్ని ఎవరో వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. ఆ మొసలిని సాకుతున్న వ్యక్తి పేరు హెనీ. అతను బేస్ బాల్ మ్యాచ్ చూసేందుకు వచ్చాడు. అయితే అతనితో పాటు మొసలిని తీసుకువచ్చిన కారణంగా అతనికి మ్యాచ్ చూసేందుకు అనుమతి ఇవ్వలేదు. అయితే తన మొసలి ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అతను మీడియాకు తెలిపాడు. తన మొసలిని ఎవరైనా తాకవచ్చని, అది ఎవరిపైనా దాడి చేయదన్నాడు. దాని నాలుకను పట్టుకున్నా కూడా ఏమీ చేయదని తెలిపాడు. ఈ ఉదంతానికి సంబంధించిన ఈ వీడియో పెన్సిల్వేనియాకు చెందినది. @NewsAlertsG హ్యాండిల్ పేరుతో పోస్ట్ అయ్యింది. పిట్స్బర్గ్ పైరేట్స్ గేమ్ టోర్నమెంట్ చూసేందుకు హెన్నీ సిటిజన్స్ బ్యాంక్ పార్క్‌కు వచ్చాడు. అయితే హెనీ ఒంటరిగా కాకుండా తన పెంపుడు జంతువు మొసలిని తీసుకుని వచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసిన చాలా మంది వీడియో తీశారు. హెనీ 2015లొ ఈ మొసలిని దత్తత తీసుకున్నాడు. దానికి వాలీ అనే పేరు పెట్టాడు. దానిని ‘వాలిగేటర్’ అని కూడా పిలుస్తుంటాడు. దీని పొడవు 56 అడుగులు. హెనీ, వాలిగేటర్లు యార్క్ కౌంటీలోని అతని ఇంటిలో కలసిమెలసి ఉంటున్నారు. ఇది కూడా చదవండి: ‘కెనడా చదువులు’ ఏం కానున్నాయి? A man, Joie Henney from Jonestown, Pennsylvania, tried to bring his "emotional support" alligator, Wally, to Citizens Bank Park for a Phillies vs. Pirates game but was denied entry. He claims Wally even sleeps in his bed with him.#alligator #pet #Pennsylvania pic.twitter.com/1onCLcsL0f — NewsAlerts Global (@NewsAlertsG) September 28, 2023 -
తెలంగాణ బేస్‌బాల్ అసోసియేషన్ చైర్మన్‌గా ఎస్ రాంచంద్రారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బేస్‌బాల్ అసోసియేషన్ నూతన చైర్మన్‌గా ఎస్ రాంచంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీనియర్ ఉపాధ్యక్షుడు ఎస్ గోపికృష్ణణ్ అధ్యక్షతన మార్చి 13న జరిగిన అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఈ మేరకు తీర్మాణంచారు. నూతనంగా ఏర్పడిన కార్యవర్గానికి పాట్రన్స్గా టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్, కృష్ణ ఎదుల, మహేశ్వర్ గౌడ్.. చైర్మన్‌గా రాంచంద్రారెడ్డి, అధ్యక్షుడిగా ఎస్ గోపికృష్ణణ్, ఉపాధ్యక్షులుగా వి అరవింద్, ఎస్ వెంకటేశ్, ఎం శ్రీనివాసరావు వ్యవహరించనున్నారు. వీరంతా 2025 వరకు ఆయా పదవుల్లో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ బేస్‌బాల్ అసోసియేషన్ చైర్మన్‌గా ఎన్నిక కావడం గౌరవంగా భావిస్తున్నానని, రాష్ట్రంలో బేస్‌బాల్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నాడు. ఇదే సందర్భంగా కార్యదర్శి ఎల్ రాజేందర్ వార్షిక నివేదికను సమర్పించగా, సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. -
దూరం మరచి... వైరం పెరిగి...
చైనీస్ తైపీ: కరోనా కారణంగా స్టేడియంలో ఆటగాళ్లే ఉన్నారు. ప్రేక్షకుల్ని అనుమతించలేదు. ఈలగోలల్లేని మైదానంలో ఎంచక్కా ఆడుకోవాల్సిన ఆటగాళ్లు దెబ్బలాడుకున్నారు. ఈ తగువులాటలో భౌతిక దూరం సంగతే మరిచారు. మ్యాచ్ ప్రసారం కావాల్సిన టీవీల్లో కొట్లాట ‘ప్రత్యక్ష’ ప్రసారమైంది. చైనీస్ తైపీ బేస్‌బాల్ లీగ్‌లో భాగంగా ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. రకుటెన్ మంకీస్, ఫుబొన్ గార్డియన్స్ జట్ల మధ్య బేస్‌బాల్ మ్యాచ్ ప్రేక్షకుల్లేకుండా జరిగినా ... ఇరుజట్ల ఆటగాళ్ల తగవుతో అల్లరిపాలైంది. భౌతిక దూరం పాటించాలనే ఉద్దేశంతో ఎవరినీ అనుమతించని స్టేడియంలో... విచక్షణ మరిచి ఒకరిమీద ఒకరుపడి మరీ కొట్టుకోవడం తైపీ వర్గాల్ని కలవరపెట్టింది. ఇక ఈ ద్వీప దేశం బేస్‌బాల్ తగవుతో వార్తల్లోకెక్కినా... ప్రపంచాన్నే వణికిస్తున్న వైరస్‌నే పకడ్బందీ చర్యలతో కట్టడి చేసిన దేశంగా కితాబులందు కుంటోంది. -
క్వార్టర్స్‌లో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: జాతీయ సాఫ్ట్‌బేస్‌బాల్ టోర్నమెంట్లో తెలంగాణ బాలికల జట్టు క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో తెలంగాణ 17–8తో పంజాబ్‌పై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గఢ్ 13–0తో రాజస్తాన్‌పై, కేరళ 10–0తో హరియాణాపై గెలుపొందాయి. బాలుర విభాగంలో బిహార్, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, ఒడిశా జట్లు క్వార్టర్స్ చేరుకున్నాయి. ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో బిహార్ 14–1తో హరియాణాపై, ఆంధ్రప్రదేశ్ 5–2తో పంజాబ్‌పై, చండీగఢ్ 12–0తో గుజరాత్‌పై, ఒడిశా 5–1తో ఛత్తీస్‌గఢ్‌పై గెలుపొందా యి. అంతకుముందు జరిగిన బాలుర లీగ్ మ్యాచ్‌ల్లో కేరళ 13–3తో ఉత్తరప్రదేశ్‌పై, మహారాష్ట్ర 18–0తో హిమాచల్ ప్రదేశ్‌పై, ఢిల్లీ 10–0తో ఒడిశాపై నెగ్గి ముందంజ వేశాయి. , , -
మారేడ్‌పల్లి ప్లేగ్రౌండ్స్కు టైటిల్
సాక్షి, హైదరాబాద్: సీఎం కప్ బేస్‌బాల్ టోర్నమెంట్లో మారేడ్‌పల్లి ప్లేగ్రౌండ్స్ జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో మారేడ్‌పల్లి పీజీ జట్టు 2–1 స్కోరుతో స్మాషర్స్ స్పోర్ట్స్ క్లబ్‌పై విజయం సాధించింది. మారేడ్‌పల్లి తరఫున సంజయ్, యోగేశ్ ఒక్కో పరుగు చేశారు. స్మాషర్స్ జట్టులో సాయి సంతోష్ ఒక పరుగు చేశాడు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దినకర్ బాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతగా నిలిచిన మారేడ్‌పల్లి జట్టుకు ట్రోఫీని అందజేశారు. సన్నీ స్పోర్ట్స్ లీగ్‌కు చెందిన మణికంఠ, మారేడ్‌పల్లి ఆటగాడు చరణ్ కుమార్ ‘బెస్ట్ పిచెర్’ అవార్డులు అందుకోగా, సర్దార్ పటేల్ బేస్‌బాల్ క్లబ్‌కు చెందిన అరవింద్‌కు ‘బెస్ట్ క్యాచర్’, మారేడ్‌పల్లి ఆటగాడు సంజయ్‌కి ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డులు లభించాయి. -
బాల్ 'అక్కడ' తగిలితే.. రియాక్షన్ ఇక్కడ
అమెరికన్ లీగ్ వైల్డ్ కార్డ్ గేమ్‌లో ఓ ఆసక్తికర సంఘన చోటు చేసుకుంది. ఆటలు ఆడుతున్నప్పుడు దెబ్బలు తగలడం సాధారణ విషయమే. కొన్ని సందర్భాల్లో దెబ్బ తగిలిన వారి పెయిన్‌ని చూసి అరరే ఎంత పనైంది అనుకోవడం కూడా సహజమే. అయితే బేస్ బాల్ టోర్నీలో దెబ్బతగిలిన ఆటగాడి కంటే.. మరో ఆటగాడు ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. న్యూయార్క్ యాంకీస్ జట్టుకు చెందిన డేవిడ్ రాబర్ట్సన్(పిట్చర్) వేసిన బాల్ నేరుగా గ్యారీ స్యాంకెజ్ (క్యాచర్) గజ్జల్లో తగిలింది. దీంతో ఒక్కసారిగా అతను కుప్పకూలి పోయాడు. గ్యారీకి గాయమైన క్షణాల్లోనే డేవిడ్ తనకే బాల్ తగిలిందా అన్న రేంజ్లో ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సరిగ్గా అదే సమయంలో ఓ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోల్లో డేవిడ్ రాబర్ట్సన్ రియాక్షన్స్ చాలా స్పష్టంగా వచ్చాయి. దీనికి సంబంధించి ఓ వీడియో క్లిప్తోపాటూ డేవిడ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే దెబ్బలు తగలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో కొద్దిసేపటి తర్వాత గ్యారీ తిరిగి తన ఆటను ప్రాంభించాడు. డేవిడ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ సంబంధించిన వీడియోను వీక్షించండి -
జాతీయస్థాయి పోటీలకు విద్యార్థినుల ఎంపిక
పెదపాడు : మండలంలోని వట్లూరు సోషల్ వెల్ఫేర్ స్కూల్‌కు చెందిన విద్యార్థినులు జాతీయస్థాయి టెన్నిస్ వాలీబాల్, బేస్‌బాల్ క్రీడా పోటీలకు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్ తాళ్లూరు ఉమాదేవి తెలిపారు. ఇటీవల కర్నూలు, పెదపాడుల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు ప్రతిభ చూపినట్టు చెప్పారు. టెన్నిస్ వాలీబాల్ జాతీయస్థాయి పోటీలకు ఎ.అజిత, వి.సంధ్యారాణి, ఎన్.ధనూశ్రీ, ఎం.శ్రావణి ఎంపికయ్యారని, బేస్‌బాల్ పోటీలకు పి.మృదుల, సీహెచ్ జ్యోత్సాS్నరాణి ఎంపికైనట్టు తెలిపారు. -
9న సబ్‌జూనియర్ బేస్‌బాల్ క్రీడాకారుల ఎంపిక
అమరావతి : ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు అమరావతి శ్రీరామకృష్ణ్ణహిందూ హైస్కూల్ క్రీడా మైదానంలో సబ్‌జూనియర్ బేస్‌బాల్ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా బేస్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి సజ్జనరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎపికలకు వచ్చే క్రీడాకారులు తప్పనిసరిగా పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఇక్కడ ఎంపికయిన వారు ఈ నెల 13, 14 తేదీల్లో ఏలూరులో జరిగే రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మిగిలిన వివరాలకు పీఈటీలు అనురాధ సెల్ : 9494676206, జయరావు సెల్ : 9959164809ను సంప్రదించాలని సూచించారు. -
బేస్‌బాల్ పురుషుల చాంపియన్ ఏఎన్‌యూ
ఏఎన్‌యూ: జాతీయ స్థాయి అంతర్ విశ్వవిద్యాలయ బేస్‌బాల్ టోర్నమెంట్లో పురుషుల విభాగం చాంపియన్‌షిప్‌ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జట్టు కైవసం చేసుకుంది. ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించిన టోర్నమెంట్ బుధవారంతో ముగిసింది. మొదటి నాలుగు స్థానాల కోసం చివరి రోజైన బుధవారం ఏఎన్‌యూ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, పంజాబ్ యూనివర్సిటీ(చండీగఢ్), యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ జట్లు పోటీపడ్డాయి. కాలికట్ యూనివర్సిటీ జట్టుపై 5-0 స్కోరుతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జట్టు విజయం సాధించి మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. పంజాబ్ వర్సిటీ జట్టుపై 5-0 స్కోరుతో గెలిచిన ఢిల్లీ వర్సిటీ జట్టు రెండో స్థానంలో నిలిచింది. మూడు, నాలుగు స్థానాలను పంజాబ్ వర్సిటీ, కాలికట్ వర్సిటీ జట్లు దక్కించుకున్నారుు. మహిళల విభాగంలో మొదటి నాలుగు స్థానాల కోసం ఢిల్లీ యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ (పాటియాల), గురునానక్‌దేవ్ యూనివర్సిటీ(అమృత్సర్), పంజాబ్ యూనివర్సిటీ (చండీగఢ్) జట్లు పోటీపడ్డాయి. గురునానక్ దేవ్ వర్సిటీ జట్టుపై ఢిల్లీ వర్సిటీ జట్టు 1-0 స్కోరుతో విజయం సాధించి చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. పంజాబ్ వర్సిటీ (చండీగఢ్) జట్టుపై పంజాబ్ వర్సిటీ(పాటియూల) జట్టు 14-04 స్కోరుతో విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది. గురునానక్ దేవ్ వర్సిటీ, పంజాబ్ వర్సిటీ (చండీగఢ్) జట్లు మూడు నాలుగు స్థానాలతో సరిపెట్టుకున్నారుు. జాతీయ జట్ల ఎంపికలో ఏఎన్‌యూకు కీలకపాత్ర ప్రపంచ విశ్వవిద్యాలయూల బేస్‌బాల్ పోటీల్లో పాల్గొనే జాతీయ పురుషులు, మహిళల జట్ల ఎంపిక, ప్రాతినిధ్యంలో ఏఎన్‌యూ కీలకపాత్ర పోషించనుందని వీసీ ఆచార్య కె.వియ్యన్నారావు చెప్పారు. ఏఎన్‌యూలో బుధవారం నిర్వహించిన బేస్‌బాల్ టోర్నీ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న భారత దేశ వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్ జట్ల ఎంపికలు ఏఎన్‌యూలో జరిగాయని గుర్తుచేశారు. జాతీయ స్థాయి బేస్‌బాల్ టోర్నీ విజేతలు అంతర్జాతీయ టోర్నమెంట్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఏఎన్‌యూలో విద్యాబోధన కొనసాగుతోందన్నారు. శాంతి, సౌభ్రాతృత్వాలకు ప్రతీకైన బుద్ధుడు నడయాడిన ప్రాంతంలో ఏర్పాటైన ఏఎన్‌యూ ఆ విలువల పరిరక్షణకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య వై.కిషోర్ నివేదికను సమర్పించారు. బేస్‌బాల్ టెక్నికల్ అధికారి నాగరాజు, గుంటూరు కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ శివశంకర్, ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ సెక్రటరీ పి.శ్రీనివాసులు, అధ్యాపకులు డి.సూర్యనారాయణ తదితరులు ప్రసంగించారు. అనంతరం విజేతలకు వీసీ వియ్యన్నారావు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వివిధ విశ్వవిద్యాలయాల క్రీడాకారులు, టెక్నికల్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అమెరికాలో మన ‘మెరికలు’
బేస్‌బాల్ పేరు కూడా వినిపించని దేశంలో.. రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబంలో జన్మించిన యువకులు.. ప్రొఫెషనల్ బేస్‌బాల్ ఆటగాళ్లవుతారని, అమెరికాలో బేస్‌బాల్ లీగ్‌లో ఆడతారని ఊహించగలమా! కానీ.. ఊహకు కూడా అందని విషయాన్ని ఇద్దరు భారత యువకులు నిజం చేసి చూపించారు. అమెరికాలో 2009లో జరిగిన గల్ఫ్ కోస్ట్ లీగ్ (జీసీఎల్)లో ఇద్దరు భారత ఆటగాళ్లు తొలిసారిగా బేస్‌బాల్ క్రీడలో పాల్గొన్నారు. అదీ.. పేరున్న పిట్స్బర్గ్ పైరేట్స్ వంటి క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించారు. దీంతో వారి నేపథ్యమేంటని అంతా ఆరా తీస్తే అప్పుడు తెలిసింది.. వారు భారత్‌లో జావెలిన్ త్రో ఆటగాళ్లని, బేస్‌బాల్ గురించి కనీస అవగాహన కూడా లేని స్థాయి నుంచి వచ్చారని, అన్నింటికన్నా ముఖ్యంగా కడు బీద కుటుంబాలకు చెందినవారని. వారే.. రింకూ సింగ్, దినేశ్ పటేల్. రియాలిటీ షో రూపంలో నిర్వహించిన టాలెంట్ హంట్ ద్వారా ఎంపికై, అమెరికాలో బేస్‌బాల్ శిక్షణ పొంది, అక్కడి లీగ్‌లో సత్తా చాటారు. వీరిలో రింకూ సింగ్ ఇప్పటికే పలు మేజర్ బేస్‌బాల్ లీగ్‌లలో రాణించి మున్ముందు మరిన్ని సంచలనాలు సృష్టించాలన్న పట్టుదలతో ఉండగా, దినేశ్ పటేల్ మాత్రం జావెలిన్ త్రోపై మక్కువను వదులుకోలేక తిరిగి స్వదేశానికి వచ్చాడు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నాడు. రియాలిటీ షో ద్వారా.. బేస్‌బాల్ క్రీడకు భారత్‌లోనూ ప్రాచుర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఇక్కడి యువతలో ఆసక్తి గల వారిని వెతికి పట్టుకొని, వారికి శిక్షణనిచ్చేందుకు జె.బి.బెర్న్‌స్టీన్ అనే అమెరికా స్పోర్ట్స్ ఏజెంట్ 2008లో ‘ద మిలియన్ డాలర్స్ ఆర్మ్’ పేరిట ఓ టెలివిజన్ రియాలిటీ షో రూపంలో టాలెంట్ హంట్ నిర్వహించాడు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో 37 వేల మందికి పైగా యువకులు పాల్గొన్నారు. లక్ష డాలర్ల ప్రైజ్‌మనీ కలిగిన ఈ షోలో రింకూ సింగ్.. గంటకు 88 మైళ్ల వేగంతో బంతిని విసిరి విజేతగా నిలిచాడు. దినేశ్ పటేల్ రెండో స్థానం సాధించాడు. లక్నో సమీపంలోని హోలేపూర్ గ్రామానికి చెందిన రింకూ సింగ్.. బీద కుటుంబంలో పుట్టి పెరిగాడు. సాధారణ ట్రక్కు డ్రైవర్ కుమారుడు రింకూ. వారణాసి సమీపంలోని ఖాన్పూర్ గ్రామానికి చెందిన దినేశ్‌ది కూడా పేదకుటుంబం. వీరిద్దరికీ అంతకుముందెప్పుడూ బేస్‌బాల్‌ను కనీసం తాకిన అనుభవం కూడా లేకపోవడం విశేషం. వీరిద్దరిని లాస్ ఏంజెల్స్‌కు తీసుకెళ్లిన నిర్వాహకులు అక్కడే శిక్షణ ఇప్పించారు. ఆ తరువాత పిట్స్బర్గ్ పైరేట్స్ క్లబ్ జట్టులో సభ్యులుగా మారిన రింకూ, దినేశ్... జూన్, 2009లో పైరేట్స్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకొని అమెరికా బేస్‌బాల్ క్లబ్‌కు సంతకం చేసిన తొలి భారతీయులుగా రికార్డు సృష్టించారు. ఆ ఏడాది జరిగిన జీసీఎల్‌లో పైరేట్స్ క్లబ్ తరపున ఆడి రాణించారు. దీంతో రింకూకు ‘ఎ’ లెవల్ లీగ్‌కు ప్రమోషన్ రాగా, 2010, 2011లలో మేజర్ లీగ్‌లలో పాల్గొన్నాడు. ఇప్పటికి 84 గేమ్‌లు ఆడిన రింకూసింగ్.. గాయం కావడంతో ప్రస్తుతం స్వదేశంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. సినిమాగా రింకూ, దినేశ్‌ల కెరీర్.. రింకూ సింగ్, దినేశ్ పటేల్‌ల జీవితం వెండితెరకెక్కనుంది. వారు వెలుగులోకి వచ్చిన రియాలిటీ షో ‘మిలియన్ డాలర్స్ ఆర్మ్’ పేరుతోనే ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ.. ఓ క్రీడా నేపథ్య చిత్రాన్ని రూపొందిస్తోంది. హాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్రశ్రేణి నటులు నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మేలో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. - కంచర్ల శ్యాంసుందర్