
సాక్షి, హైదరాబాద్: సీఎం కప్ బేస్‌బాల్ టోర్నమెంట్‌లో మారేడ్‌పల్లి ప్లేగ్రౌండ్స్ జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో మారేడ్‌పల్లి పీజీ జట్టు 2–1 స్కోరుతో స్మాషర్స్ స్పోర్ట్స్ క్లబ్‌పై విజయం సాధించింది. మారేడ్‌పల్లి తరఫున సంజయ్, యోగేశ్ ఒక్కో పరుగు చేశారు. స్మాషర్స్ జట్టులో సాయి సంతోష్ ఒక పరుగు చేశాడు.
అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దినకర్ బాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతగా నిలిచిన మారేడ్‌పల్లి జట్టుకు ట్రోఫీని అందజేశారు. సన్నీ స్పోర్ట్స్ లీగ్‌కు చెందిన మణికంఠ, మారేడ్‌పల్లి ఆటగాడు చరణ్ కుమార్ ‘బెస్ట్ పిచెర్’ అవార్డులు అందుకోగా, సర్దార్ పటేల్ బేస్‌బాల్ క్లబ్‌కు చెందిన అరవింద్‌కు ‘బెస్ట్ క్యాచర్’, మారేడ్‌పల్లి ఆటగాడు సంజయ్‌కి ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డులు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment