
అమెరికన్ లీగ్ వైల్డ్ కార్డ్ గేమ్‌లో ఓ ఆసక్తికర సంఘన చోటు చేసుకుంది. ఆటలు ఆడుతున్నప్పుడు దెబ్బలు తగలడం సాధారణ విషయమే. కొన్ని సందర్భాల్లో దెబ్బ తగిలిన వారి పెయిన్‌ని చూసి అరరే ఎంత పనైంది అనుకోవడం కూడా సహజమే. అయితే బేస్ బాల్ టోర్నీలో దెబ్బతగిలిన ఆటగాడి కంటే.. మరో ఆటగాడు ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
న్యూయార్క్ యాంకీస్ జట్టుకు చెందిన డేవిడ్ రాబర్ట్‌సన్(పిట్చర్) వేసిన బాల్ నేరుగా గ్యారీ స్యాంకెజ్ (క్యాచర్) గజ్జల్లో తగిలింది. దీంతో ఒక్కసారిగా అతను కుప్పకూలి పోయాడు. గ్యారీకి గాయమైన క్షణాల్లోనే డేవిడ్ తనకే బాల్ తగిలిందా అన్న రేంజ్‌లో ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. సరిగ్గా అదే సమయంలో ఓ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోల్లో డేవిడ్ రాబర్ట్‌సన్ రియాక్షన్స్ చాలా స్పష్టంగా వచ్చాయి. దీనికి సంబంధించి ఓ వీడియో క్లిప్‌తోపాటూ డేవిడ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే దెబ్బలు తగలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో కొద్దిసేపటి తర్వాత గ్యారీ తిరిగి తన ఆటను ప్రాంభించాడు.
డేవిడ్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ సంబంధించిన వీడియోను వీక్షించండి

డేవిడ్ రాబర్ట్‌సన్

గ్యారీ స్యాంకెజ్
Comments
Please login to add a commentAdd a comment