తెలంగాణ బేస్‌బాల్‌ అసోసియేషన్‌ చైర్మన్‌గా ఎస్‌ రాంచంద్రారెడ్డి | S Ramachandra Reddy Elected As New Chairman For Telangana Baseball Association | Sakshi
Sakshi News home page

తెలంగాణ బేస్‌బాల్‌ అసోసియేషన్‌ చైర్మన్‌గా ఎస్‌ రాంచంద్రారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

Published Mon, Mar 14 2022 7:51 PM | Last Updated on Mon, Mar 14 2022 8:56 PM

S Ramachandra Reddy Elected As New Chairman For Telangana Baseball Association - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బేస్‌బాల్‌ అసోసియేషన్‌ నూతన చైర్మన్‌గా ఎస్‌ రాంచంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీనియర్‌ ఉపాధ్యక్షుడు ఎస్‌ గోపికృష్ణణ్‌ అధ్యక్షతన మార్చి 13న జరిగిన అసోసియేషన్‌ వార్షిక సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఈ మేరకు తీర్మాణంచారు. నూతనంగా ఏర్పడిన కార్యవర్గానికి పాట్రన్స్‌గా టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్‌, కృష్ణ ఎదుల, మహేశ్వర్‌ గౌడ్‌.. చైర్మన్‌గా రాంచంద్రారెడ్డి, అధ్యక్షుడిగా ఎస్‌ గోపికృష్ణణ్‌, ఉపాధ్యక్షులుగా వి అరవింద్‌, ఎస్‌ వెంకటేశ్‌, ఎం శ్రీనివాసరావు వ్యవహరించనున్నారు.


వీరంతా 2025 వరకు ఆయా పదవుల్లో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ బేస్‌బాల్‌ అసోసియేషన్‌ చైర్మన్‌గా ఎన్నిక కావడం గౌరవంగా భావిస్తున్నానని, రాష్ట్రంలో బేస్‌బాల్‌ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నాడు. ఇదే సందర్భంగా కార్యదర్శి ఎల్ రాజేందర్ వార్షిక నివేదికను సమర్పించగా, సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement