Dog Identifies Friend During Video Call, Its Reaction Viral - Sakshi
Sakshi News home page

వీడియో కాల్‌లో ఫ్రెండ్‌ను గుర్తుపట్టిన శునకం.. వీటి ప్రేమకు నెటిజన్లు ఫిదా..

Published Thu, Apr 6 2023 9:18 PM | Last Updated on Fri, Apr 7 2023 10:42 AM

Viral Video Dog Identifies Friend During Video Call - Sakshi

శనకాలు వాటి యజమానులను గుర్తిస్తాయని అందిరికీ తెలుసు. తమ స్నేహితులను కూడా సులభంగా గుర్తుపెట్టుకుంటాయి.  అయితే వీడియో కాల్‌లో శునకాలు ఇతరులను గుర్తించలవా? అంటే సమాధానం చెప్పలేదు.

కానీ ఓ కుక్క మాత్రం తన ఫ్రెండ్‌ను వీడియో కాల్‌లో చూసిన వెంటనే టక్కున గుర్తుపట్టింది. దానితో ఆప్యాయంగా మాట్లాడింది. ఈ ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య సాగిన సంభాషణ, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ నెటిజన్లను కట్టిపడేసింది.

శునకం మరో శుకనంతో వీడియో కాల్‌ మాట్లాడిన దృశ్యాలను ఓ వ్యక్తి  సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. వీటి మధ్య ప్రేమను చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు.

మీ బెస్ట్ ఫ్రెండ్‌ను నిజంగా మిస్ అయితే ఇలానే ఉంటుందేమో? ప్రేమానురాగాల విషయంలో జంతువులకు మనషులకు తేడా లేదని ఈ శునకాలు నిరూపించాయి అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

మనకు ఇష్టమైన స్నేహితులు బయటకు వెళ్లినప్పుడు వారు తిరిగొచ్చేంతవరకు డోర్ దగ్గరే ఎదురుచూస్తుంటాం. ఇలాంటి ప్రేమ పొందడం నిజంగా అదృష్టం.  మనుషులైనా, శునకాలైనా స్నేహం, ప్రేమ విషయంలో ఒక్కటే.. అని మరో యూజర్ రాసుకొచ్చాడు.
చదవండి: జైలులో నన్ను టార్చర్ చేశారు.. పిల్లలు అడిగిన ప్రశ్నలు బాధించాయి: నవనీత్ రానా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement