‘బాస్‌! నేనూ వస్తా..’! ఆంబులెన్స్‌ వెనక దౌడుతీసిన కుక్క, వైరల్‌ వీడియో | Devoted Dog Follows Owner To Hospital, Refusing To Be Separated | Sakshi
Sakshi News home page

‘బాస్‌! నేనూ వస్తా..’! ఆంబులెన్స్‌ వెనక దౌడుతీసిన కుక్క, వైరల్‌ వీడియో

Published Sat, Sep 14 2024 12:05 PM | Last Updated on Sat, Sep 14 2024 12:22 PM

Devoted Dog Follows Owner To Hospital, Refusing To Be Separated

మనిషికి,కుక్కకు మధ్య ఉన్న బంధం ఈనాటిది  కాదు. విశ్వాసానికి మరో పేరుగా , గ్రామసింహంగా మనుషులతో  పరస్పర సాన్నిహిత్యాన్ని కలిగి ఉండే  పెంపుడు జంతువు శునకం.  కాసింత గంజిపోసినా, ఏంతో విధేయతగా ఉంటుంది. తనను ఆదరించిన యజమాని కొండంత ప్రేమను చాటుతుంది. అవసమైతే ‍ప్రాణాలు కూడా  ఇస్తుంది.  ఇందులో ఎలాంటి సందేహంలేదు.  మీకు ఇంకా నమ్మకం కలగకపోతే ఈ వైరల్‌ వీడియో గురించి  తెలుసుకుందాం పదండి!  

అనారోగ్యంతో ఉన్న  ఒక వ్యక్తిని ఆంబెలెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుంన్నారు. అలా వెళ్తున్న యజమానానిని  చూసి కుక్క మనసు ఆగలేదు.   అంబులెన్స్‌ను అనుసరిస్తూ పోయింది. చివరికి దాని  ఆత్రం, ఆరాటాన్ని చూసిన ఆంబులెన్స్‌ డ్రైవర్‌కూడా చలిచించిపోయాడు. వెంటనే వెహికల్‌ ఆపి ఆగి దాన్ని కూడా ఎక్కించుకున్నాడు. దీనికి సంబంధించి వీడియో ఎక్స్‌లో తెగ వైరలవుతోంది.  తారా బుల్‌ అనే ట్విటర్‌ యూజర్‌  షేర్‌ చేసిన 27 సెకన్ల వీడియో దాదాపు 80 లక్షల  వ్యూస్‌ను దక్కించుకుంది.  ఈ దృశ్యాలను  ఒక ద్విచక్రవాహనదారుడు వీడియో తీశాడు.  ఇది నెటిజన్ల మనసులకు బాగా హత్తుకుపోయింది.  చాలామంది కుక్క ప్రేమను, యజమానిపై దానికున్న విధేయతను ప్రశంసించారు. మరి కొందరు  మూగజీవి ఆవేదన అర్థం చేసుకున్నాడంటూ డ్రైవర్  మంచి మనసును మెచ్చుకోవడం విశేషం. (కుక్కలు చుట్టుముట్టాయ్‌..ఈ బుడ్డోడి ధైర్యం చూడండి!)

పెంపుడు జంతువుల్లో మేటి కుక్క. యజమానిని కాపాడటం  కోసం, యజమాని ఇంట్లో పిల్లలకోసం ప్రాణలను  సైతం లెక్క చేయకుండా పోరాడి, ప్రాణాలను సైతం కోల్పోయిన ఘటనలు  కోకొల్లలు. ఒంటరి జీవులకు తోడుగా నిలుస్తుంది. ఆసరాగా ఉంటుంది.  అసలు  ఒక కుక్కను పెంచు కోవాలనే ఆలోచనలోని అర్థం  పరమార్థం  ఇదే. అంతేకాదు యజమానులు కూడా తమ డాగీ అంటే ప్రాణం పెట్టే వారే. ఎంత ప్రేమ అంటే దాన్ని కుక్క అనడం కూడా వాళ్లకి నచ్చదు. దానికి పెట్టిన పేరుతోనే పిలవాలి.  ఇంట్లో మనిషిలాగా, చంటిపిల్లకంటే ఎక్కువగా  సాదుకుంటారు.  ఏ చిన్న అనారోగ్యం వచ్చినా  అల్లాడి పోతారు. చనిపోతే భోరున విలపిస్తారు. అంత్యక్రియలు నిర్వహిస్తారు.  అంతేకాదండోయ్‌.. డాగీలకు పుట్టినరోజులు, సీమంతాలు ఘనంగా చేసే వారూ ఉన్నారు.  (ఎమిలి ఐడియా అదుర్స్‌, బనానా వైన్‌!)


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement