మనలో చాలా మంది శునకాలను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. వాటిని ఎంతో ప్రేమగా, ఇంట్లో మనిషిలానే పెంచుకుంటారు. విశ్వాసానికి, ప్రేమకు గుర్తుగా భావిస్తారు. అవి కూడా తమ యజమానుల పట్ల ఎనలేని విశ్వాసాన్ని కనబరుస్తాయి. ప్రస్తుత సమాజంలో.. పక్కవాడిని పట్టించుకోని కొందరు మనుషుల కన్నా.. నోరులే జీవాలే మేలని చాలా మంది భావిస్తున్నారు.
శునకాలు కూడా తమ చేష్టలతో, యజమానితో ఆడుకుంటూ తమ ప్రేమను కనబరుస్తాయి. యజమానులు పెంపుడు జీవులతో ఆడుకుంటూ.. వారి ఒత్తిడిని దూరం చేసుకుంటారు. శునకాల విశ్వాసానికి సంబంధించిన ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా, ఈ కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ఒక వృద్ధుడు బస్టాండ్ పక్కన ప్లాట్‌ఫాంలో ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు.
ఇంతలో ఒక శునకం అతడిని సమీపించింది. అతని ముందు కూర్చుని అప్యాయంగా తోక ఊపింది. ఆ వ్యక్తి కూడా ఆ శునకాన్ని ప్రేమతో దగ్గరకు తీసుకుని, హత్తుకున్నాడు. ఎన్నోరోజుల నుంచి విడిపోయిన తన.. యజమానిని చూసినట్టు వృద్ధుడి ఒడిలో అది కూర్చుండిపోయింది. అతను కూడా దాన్ని ప్రేమతో దగ్గరకు తీసుకొని, దాని తలను నిమురుతూ కూర్చున్నాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ఈ వీడియోను బ్యాటింజిబిడేన్ అనే యూజర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు..‘కొందరు మనుషుల కన్నా.. శునకమే నయం..’, ‘నోరులేని జీవాలు కూడా మనిషిలానే భావోద్వేలను కల్గి ఉంటాయి..’, ‘ పాపం.. అతడికి నేనున్నాను.. అనే భరోసా ఇచ్చింది..’ అంటూ కామెంట్‌లు చేస్తున్నారు.
This dog approaches a homeless man and seems to know what he needs.. 🥺 pic.twitter.com/uGWL351fCR
— Buitengebieden (@buitengebieden_) December 30, 2021
Comments
Please login to add a commentAdd a comment