faith
-
ప్రతిపక్షాలకు రాజ్యాంగంపై విశ్వాసం లేదు: సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
నాగ్‌పూర్: ప్రతిపక్ష పార్టీలకు రాజ్యాంగంపై నమ్మకం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఆదివారం మంత్రి వర్గ విస్తరణ, డిసెంబర్ 16న జరగనున్న రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల కోసం ఫడ్నవీస్ నాగ్‌పూర్‌లో అడుగుపెట్టారు.ఈ సందర్భంగా విలేకరులతో ఫడ్నవీస్ మాట్లాడుతూ, ‘‘ముఖ్యమంత్రిగా నా జన్మభూమి, కర్మభూమికి (స్వస్థలం, పార్టీ కార్యాలయం) రావడం చాలా సంతోషకరమైన క్షణం. నాగ్‌పూర్ నా కుటుంబం, నా కుటుంబం నేడు నాకు సాదర స్వాగతం పలుకుతోంది. ప్రధాని మోదీ నాయకత్వంలోని మహాయుతి (కూటమి) పేదలు, గిరిజనులు, రైతులు, దళితులు, ఓబీసీలు ఇతరుల ఆశీర్వాదంతో భారీ విజయం సాధించింది. ముఖ్యంగా మహిళలు, లడ్కా, షెత్కారీ (రైతులు), లడ్కే , ధంగార్లు, మరాఠాలు, ఇతరులు ఇలా అన్ని వర్గాలు ప్రభుత్వంపై నమ్మకముంచినందువల్లే ఇంతటి ఘనవిజయం సాధ్యమైంది. మహాయుతిని ఆశీర్వదించి, నన్ను ముఖ్యమంత్రిని చేసినందుకు 14 కోట్ల మంది మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు. ప్రజలు తమకు సేవ చేసేందుకు, వారి జీవితాలను, మహారాష్ట్రను మార్చేందుకు మహాయుతిని ఎంచుకున్నారు. ప్రజల కలను నెరవేర్చేందుకు నేను, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కలిసి పనిచేస్తాం. ‘ఈ ప్రభుత్వం ప్రజల కోసం 24 గంటలూ నిబద్ధతతో పనిచేస్తుంది’అన్నారు. నిరాశతోనే ప్రేలాపనలు.. ఈవీఎంల వ్యవహారంపై ప్రతిపక్షాలు దూకుడుగా వ్యవహరించడం పట్ల ఫడ్నవీస్‌ను ప్రశి్నంచగా, ‘‘ఈ వ్యక్తులు (ప్రత్యర్థులు) నిరాశ చెందారు, వారికి ప్రజాస్వామ్యం మరియు ఎన్నికల సంఘంపై నమ్మకం లేదు. సుప్రీంకోర్టు, రిజర్వ్ బ్యాంక్‌పై విశ్వాసం లేదు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌పై నమ్మకం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని విశ్వసించరు. ’అని మండిపడ్డారు. నవంబర్ 20న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 230 స్థానాల్లో విజయం సాధించి మహాయుతి కూటమి విజయం సాధించడంతో డిసెంబర్ 5న ఫడ్నవీస్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేవలం 46 సీట్లు మాత్రమే గెలుచుకున్న ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్లలో (ఈవీఎం) అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది. ఇదీ చదవండి: ఏ–332 ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు మళ్లీ మొదలు ‘భూమిపుత్రుడికి’ స్వాగతం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి విజయం సాధించిన తరువాత సీఎంగా నాగ్‌పూర్‌కు చేరుకున్న ఫడ్నవీస్‌కు పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. నాగ్‌పూర్ విమానాశ్రయం నుంచి ధరంపేట్‌లోని ఫడ్నవీస్ నివాసం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఫడ్నవీస్ తన భార్య అమృతా ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే, ఇతరులతో కలిసి అలంకరించబడిన ఓపెన్–టాప్ వాహనంలో ఎక్కి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ సాగే దారి పొడవునా ‘మట్టి కుమారుడికి స్వాగతం’ పలుకుతూ బ్యానర్లు వెలిశాయి. ఈసందర్భంగా ఫడ్నవీస్ తన మద్దతుదారులను ఉద్దేశించి ’ఏక్ హై తో సేఫ్ హై’, ’మోడీ హై తో ముమ్కిన్ హై’ నినాదాలు చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ -
సీబీఐ దర్యాప్తుపై నమ్మకముంది
బరాసత్(పశ్చిమబెంగాల్): కోల్‌కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో తమ కుమార్తెపై అత్యాచారం, హత్య ఘటనపై సీబీఐ చేపట్టిన విచారణపై విశ్వాసముందని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. ‘ఈ ఘటన వెనుక ఉన్న వారిని రక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు మాకున్న అనుమానం నిజమేనని తేలింది. ఈ నేరానికి కేవలం ఒక్కరు మాత్రమే కారణం కాదు’అని శుక్రవారం నార్త్ 24 పరగణాల జిల్లాలోని తమ నివాసంలో మీడియాతో వారన్నారు. ఆర్జీ కార్ ఆస్పత్రిలో జరిగే అక్రమాల గుట్టును బయటపెట్టాలన్నారు. -
ముంబయి నుంచి అయోధ్యకు ముస్లిం మహిళ పాదయాత్ర
లక్నో: రాముడు ఆదర్శపురుషుడు. సర్వవ్యాప్తమైన రాముని జీవన విధానం ఆచరణీయం. రామునిపై విశ్వాసం అందరిసొంతం అని నిరూపిస్తోంది ఓ ముస్లిం మహిళ. అయోధ్య రామున్ని దర్శించుకోవడానికి ముంబయి నుంచి కాలినడకన బయలు దేరింది. ఆమె సహచరులతో కలిసి ఏకంగా 1,425 కిలోమీటర్ల దూరం కాలినడకనే ప్రయాణిస్తోంది. ముంబయికి చెందిన షబ్నమ్‌కు రాముడంటే ఎంతో ఇష్టం. అయోధ్యలో కొలువుదీరనున్న రామున్ని దర్శించుకోవడానికి కాలినడకనే వెళ్లాలని నిర్ణయించుకుంది. తన సహచరులు రామన్ రాజ్ శర్మ, వినీత్ పాండేలతో కలిసి ప్రయాణాన్ని ప్రారంభించింది. ముస్లిం మహిళను అయినప్పటికీ రామున్ని పూజించడానికి అచంచలమైన భక్తి ఒక్కటే అర్హతని అంటోంది. రామున్ని పూజించడానికి హిందువు కానవసరం లేదని పేర్కొంది. మంచి మనిషిగా జీవించడమే ముఖ్యమని చెబుతోంది. ప్రస్తుతం యాత్రలో మధ్యప్రదేశ్‌కు చేరుకుంది. ప్రతి రోజూ 25 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు వెల్లడించింది. సుధీర్ఘ యాత్రలో అలసట వచ్చినప్పటికీ రామునిపై ఉన్న భక్తే తమ యాత్రను కొనసాగిస్తోందని షబ్నమ్ తెలిపింది. రాముని ఆరాధన ఏ ప్రత్యేక మతం లేదా ప్రాంతానికి పరిమితం కాదని, అది సరిహద్దులను దాటి ప్రపంచం మొత్తాన్ని చుట్టుముడుతుందని షబ్నమ్ గట్టిగా నమ్ముతోంది. మతంతో సంబంధం లేకుండా రాముడు అందరివాడనే ప్రేరణ కలిగించడానికే యాత్రను చెపట్టినట్లు పేర్కొంది. అబ్బాయిలు మాత్రమే ఇలాంటి కష్టతరమైన యాత్రలు చేయగలరనే అపోహను దూరం చేస్తానంటోంది. యాత్రలో వీరిని కలిసిన పలువురు ఫొటోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. అయితే.. షబ్నమ్ పాదయాత్రకు సవాళ్లు తప్పలేదు. ఆమెకు భద్రత కల్పించడమే కాకుండా భోజనం, వసతి ఏర్పాట్లు కల్పించడంలో పోలీసులు కీలకంగా వ్యవహరించారు. సున్నితమైన ప్రాంతాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు పోలీసులు ఆమెకు భద్రత కల్పించారు. సోషల్ మీడియాలో కొందరు ద్వేషిస్తున్నప్పటికీ.. షబ్నమ్ తన ప్రయాణాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తోంది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. విశేష స్పందనలు ప్రోత్సాహాన్నిస్తున్నాయని తెలిపింది. రాముని జెండాను పట్టుకుని నడుస్తున్నప్పుడు ముస్లింలతో సహా అనేక మంది 'జై శ్రీరామ్' అని నినదించిన ఆనంద క్షణాలను అనుభవించానని షబ్నమ్ చెబుతోంది. -
పెద్ద పదవులు కోరుకోవడం లేదు: నితీశ్
పాట్నా: గత వారం ఢిల్లీలో జరిగిన విపక్ష ‘ఇండియా’ కూటమి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పట్ల తాను అసంతృప్తితో ఉన్నానంటూ వెలువడిన వార్తలను బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ ఖండించారు. తమ కూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు త్వరలోనే పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యరి్థగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నితీశ్ కుమార్ సోమవారం పాటా్నలో మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగతంగా తనకు పెద్ద కోరికలేవీ లేవని తెలిపారు. పెద్ద పదవులను తాను ఆశించడం లేదన్నారు. ‘ఇండియా’ కూటమి నిర్ణయాలపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఉద్ఘాటించారు. జేడీ(యూ) నేతల మధ్య తీవ్ర విభేదాలున్నాయన్న ప్రచారాన్ని నితీశ్ కొట్టిపారేశారు. పారీ్టలో ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. -
యూదుల ఆరాధనా విధానం ఏమిటి? ‘కిప్పా’కు ఎందుకంత ప్రాధాన్యత?
ప్రపంచంలోని పురాతన మతాలలో జుడాయిజం ఒకటి. దీనికి సుమారు మూడు వేల ఏళ్ల చరిత్ర ఉంది. క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం దాదాపు ఒకే సమయంలో ఉద్భవించాయని చెబుతారు. ఈ కారణంగానే ఈ మతాల మధ్య ఎంతో సారూప్యత కనిపిస్తుంది. జుడాయిజాన్ని హిందూ మతంతో పోల్చిచూస్తే కొన్ని అంశాలు మినహా, ఎటువంటి సారూప్యత కనిపించదు. జుడాయిజం ప్రకారం ఈ మతాన్ని నమ్మేవారు రోజుకు మూడు సార్లు ప్రార్థనలు చేస్తారు. యూదులు ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్నా, వారు ప్రార్థన చేసే సమయంలో జెరూసలేం వైపు చూస్తారు. జుడాయిజం విగ్రహారాధనను విశ్వసించదు. జుడాయిజంను అనుసరిస్తున్నవారు ప్రతిపనికీ దేవునికి కృతజ్ఞతలు చెబుతారు. ఖబద్ హౌస్ యూదులకు చాలా ప్రత్యేకమైనది. ఖబద్ హౌస్‌లు పలు దేశాలలో కనిపిస్తాయి. ఇక్కడ యూదులు ప్రార్థనలు చేస్తారు. భారతదేశంలోని ముంబై, ఢిల్లీలోని పహర్‌గంజ్, అజ్మీర్, హిమాచల్‌లోని ధర్మ్కోట్, రాజస్థాన్‌లోని పుష్కర్‌లలో ఖబద్ హౌస్‌లు ఉన్నాయి. విదేశాల నుంచి భారత్ సందర్శనకు వచ్చే ఇజ్రాయిలీలు ఈ ఖబద్ హౌస్‌లలో ప్రార్థనలు చేస్తుంటారు. హిమాచల్ ప్రదేశ్, ధర్మశాల, ధర్మ్కోట్లోని ఖబద్ హౌస్‌లను సందర్శించడానికి ప్రతి సంవత్సరం ఇజ్రాయెల్ నుండి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. యూదులు ప్రార్థనా సమయంలో తలపై కిప్పా(టోపీ) తప్పనిసరిగా ధరిస్తారు. కిప్పా అనేది ప్రతి యూదు ప్రత్యేక సందర్భాలలో ధరించే టోపీ. ఇది హిందూ, ఇస్లాంలో కూడా కనిపిస్తుంది. హిందువులు పూజ చేసేటప్పుడు తలపై గుడ్డ పెట్టుకునే ఆచారం కొన్నిచోట్ల కనిపిస్తుంది. ఇస్లాంలో కూడా నమాజ్ చదివేటప్పుడు తప్పనిసరిగా టోపీ ధరిస్తారు. ఇది కూడా చదవండి: యూదుల పవిత్ర గ్రంథం ‘తొరా’లో ఏముంది? బైబిల్‌తో సంబంధం ఏమిటి? -
యూదుల పవిత్ర గ్రంథం ‘తొరా’లో ఏముంది? బైబిల్‌తో సంబంధం ఏమిటి?
ఏ మతంలోనైనా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. జుడాయిజంలో కూడా అదే ఉంది. ఆధునిక విద్యతో పాటు యూదులు తమ పిల్లలకు తమ మత విలువలను కూడా బోధిస్తారు. ప్రతి యూదు కుటుంబంలో ఇది కనిపిస్తుంది. పిల్లలకు చదువుకునే వయసు రాగానే ఇంటి పెద్దలు జుడాయిజానికి సంబంధించిన విషయాల గురించి చెబుతారు. తమ పవిత్ర గ్రంథమైన ‘తోరా’ను వారిచేత చదివిస్తారు. ప్రతి యూదు ‘తోరా’ను తప్పక చదివి అర్థం చేసుకుంటారు. ఇది చదివిన వారే నిజమైన యూదునిగా ఆ మత పెద్దలు గుర్తిస్తారు. ‘తోరా’ యూదుల ఆరాధనా గ్రంథం. తోరా అనే పదం తోహ్-రా అంటే నేర్చుకోవడం అనే పదం నుండి రూపొందింది. మనం ఉపయోగిస్తున్న తోహ్-రా అనే పదం బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలను సూచిస్తుంది. వీటిని పంచగ్రంథం అంటారు. ఇవి జెనెసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్, డ్యూటెరోనమీ. ‘తోరా’ను మోషే రాశాడని చెబుతారు. అందుకే దీనిని మోషే ధర్మశాస్త్ర గ్రంథం అని కూడా అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూదులు ఈ పుస్తకం ద్వారానే తమ దేవుణ్ణి స్మరించుకుంటారు. భారతదేశంలోని యూదులు కూడా ఈ గ్రంథాన్ని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. వారు నిర్వహించే పవిత్రమైన కార్యక్రమంలో ఖచ్చితంగా ఈ గ్రంథాన్ని ఉంచుతారు. సృష్టి ప్రారంభం నుంచి మోషే మరణం వరకు దేవుడు ప్రజలతో ఎలా వ్యవహరించాడో ఈ పవిత్ర గ్రంథంలో పేర్కొన్నారని చెబుతారు. దీనితో పాటు ప్రతి యూదు విశ్వసించాల్సిన మోషే చట్టాలు, నియమాలు దీనిలో ఉన్నాయని చెబుతారు. యూదుల ప్రత్యేక ప్రార్థన ఈ గ్రంథంలో కనిపిస్తుంది. యూదుల దేవుడైన యెహోవా పేరు ఈ పుస్తకంలో 1800 సార్లు కనిపిస్తుంది. ఇది కూడా చదవండి: యూదులు ఇతరుల రక్తాన్ని ఎందుకు ఎక్కించుకోరు? వారు చెప్పే కారణం ఏమిటి? -
ఆ ఊళ్లో బసచేస్తే మంత్రి పదవి ఊడిపోతుండట!
కొందరు బడాబాడా నాయకులకు సైతం అనేక మూఢనమ్మకాలను కలిగి ఉంటారు. ఇలాంటివారు కొన్ని నమ్మకాలను అనుసరిస్తూ జీవితాన్ని గడుపుతుంటారు. ఈనాటికీ చాలామంది నాయకులు రాత్రివేళ ఆ ప్రాంతంలో బస చేయాలంటే సంకోచిస్తారట. ఇలా చేయడం వల్ల వారు తమ పదవులకు కోల్పోతారట. ఈ ప్రదేశం మధ్యప్రదేశ్‌లో ఉంది. అక్కడ ఏ ముఖ్యమంత్రి లేదా మంత్రి రాత్రి బసచేయాలంటే భయపడిపోతారు. ఎందుకంటే రాత్రిపూట అక్కడ బస చేసిన ఏ మంత్రీ తిరిగి అధికారంలోకి రాలేదని చెబుతుంటారు. చాలా మంది మంత్రులు, ముఖ్యమంత్రులు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రాత్రవేళ బసచేసే ధైర్యం చేయరు. మహాకాళేశ్వరుడు కొలువై ఉండటమే ఇందుకు కారణమని భావిస్తారు. ఉజ్జయినిలో కొలువైన మహారాజు.. మహాకాళేశ్వరుడేనని, అందుకే అక్కడ మరే ఇతర రాజు ఉండడం తగదని అంటుంటారు. అలా చేస్తే శిక్ష అనుభవించాల్సి వస్తుందని అంటారు. దీనికి పౌరాణిక కథలను ఉదాహరణలుగా చూపిస్తుంటారు. చాలామంది నేతలు ఇదే నమ్మకాన్ని కలిగివుండటంతో మిగిలిన నేతలు కూడా వారిని అనుసరిస్తున్నారు. మహాకాళీశ్వరుని ముందు తలవంచి, నమస్కరిస్తూ పూజలు చేసినప్పటికీ.. ఏనాయకుడూ రాత్రివేళ ఇక్కడ ఉండేందుకు ఇష్టపడటం లేదు. ఎంతటి అధికార బలం ఉన్నా ఇక్కడికి వస్తే వాటిని పోగొట్లుకోవడం ఖాయమని అంటున్నారు. ఇలాంటి నమ్మకాలు కేవలం ఉజ్జయినిలో మాత్రమే కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని చెబుతుంటారు. కొంతమంది ఇందుకు వాస్తు దోషాలను కారణంగా చూపుతుంటారు. ఇది కూడా చదవండి: హిజ్రాల పెళ్లి వేడుక ఏడుపుతో ఎందుకు ముగుస్తుంది? ఇదేమైనా సంప్రదాయమా? -
‘హలాల్ హాలిడే’ అంటే ఏమిటి? ముస్లిం యువతులకు ఎందుకంత ఇష్టం?
తాజాగా పలు ముస్లిం దేశాలలో ‘హలాల్ హాలిడే’కు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ముస్లిం మహిళలు హలాల్ హాలిడేని ఇష్టపడుతున్నారు. పలు దేశాలలోని ముస్లిం మహిళలు ఇస్లామిక్ నియమాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ, తమ హక్కుల కోసం డిమాండ్ చేయడాన్ని చూస్తుంటాం. అయితే ‘హలాల్ హాలిడే’ దీనిని భిన్నమైనది. ఇంతకీ ఈ ‘హలాల్ హాలిడే’అంటే ఏమిటి? ఈ ప్రత్యేక సెలవుల కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హలాల్ హాలిడే అంటే ముస్లింలు ఇస్లామిక్ నియమాలను అనుసరిస్తూనే ఎక్కడైనా పర్యటించడం. ఈ సమయంలో వారు మతపరమైన విలువల విషయంలో రాజీ పడాల్సిన అవసరం ఎదురుకాదు. వారు మత ఆచారాను పాటిస్తూనే కొన్ని రోజులు వారికి నచ్చిన చోట గడుపుతారు. ఇప్పుడు ఈ భావనను బలోపేతం చేస్తూ, వారికోసం అనేక హోటళ్లు తెరుచుకున్నాయి. చాలా మంది ముస్లింలు విహారయాత్రకు వెళ్లినప్పుడు వారు మద్యం అందుబాటులో లేని రెస్టారెంట్ల కోసం వెదుకుతారు. అయితే ఇప్పుడు హలాల్ హాలిడేను దృష్టిలో ఉంచుకుని పలు హోటళ్లు ఏర్పాటయ్యాయి. ఈ హోటళ్లలో మద్యం ఉండదు. ఆహారం విషయంలో కూడా మతాచారాలకు అనువైనవి అందుబాటులో ఉంటాయి. ఇంతేకాకుండా ఈ ప్రదేశాలలో దుస్తులకు సంబంధించిన నియమాలు కూడా ఇస్లాం ఆచారాల ప్రకారమే ఉంటాయి. ఎవరైనా ముస్లిం మహిళ స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లాలనుకుంటే ఆయా హోటళ్లలో ఆమెకు ఎటువంటి ఇబ్బంది ఎదురుకాదు. ఎందుకంటే ఆ హోటళ్లలో ఆమె చుట్టూ అదే నియమాన్ని అనుసరించే వారు ఉంటారు. అందుకే ముస్లిం యువతులు ‘హలాల్ హాలిడే’ను ఇష్టపడుతున్నారు. ‘హలాల్ హాలిడే’ కోసం ఏర్పాటైన ప్రాంతాల్లో నమాజ్ మొదలైన మతాచారాల కోసం ప్రత్యేక స్థలం ఉంటుంది. ఫలితంగా వారు మత నిబంధనల విషయంలో రాజీ పడాల్సిన అవసరం ఏర్పడదు. గ్లోబల్ ముస్లిం ట్రావెల్ ఇండెక్స్ ప్రకారం 2022లో హలాల్ ట్రావెల్ వ్యాపారం $ 220 బిలియన్లకు చేరుకున్నదని బీబీసీ ఒక నివేదికలో తెలిపింది. ఇది కూడా చదవండి: షాజహాన్‌కు ‘మసాలా పిచ్చి’ ఎందుకు పట్టింది? -
Patenting: ప్రకృతికి పేటెంట్ తీసుకోవచ్చా!!!
భగవంతుడు మనకు మాట ఇచ్చాడు, బుద్ది ఇచ్చాడు, ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చాడు... అన్న విశ్వాసం మనకు ఉండాలి. నేను ఏదో సాధించాలన్న ఉద్దేశంతోనే నాకు ఇవి బహూకరించాడు... ఎన్ని ప్రతిబంధకాలు ఎదురయినా సరే... నేను అనుకున్నది సాధించితీరతాను... అన్న పట్టుదల ఉంటే ఎంతటి నిరాశానిస్పృహలు ఎదురయినా సరే... సునాయాసంగా వాటిని దాటి... లక్ష్యాలను సాధించవచ్చు... అనడానికి – ఆత్మహత్య ఆలోచనలను వెనక్కి తీసుకుని, కష్టాలతోనే కడుపు నింపుకుని, ఒకటి కాదు, రెండు నోబెల్ బహుమతులు గెలుచుకున్న ధీర వనిత మేరీ క్యూరీ గొప్ప ఉదాహరణ. మేరీ అసలు పేరు మరియా. 1867 నవంబరు 7న జన్మించారు. పోలండ్ దేశస్థురాలు. తల్లిదండ్రులు టీచర్లు. 11వ ఏట తల్లి మరణించింది. పోలండ్ లోని రాజకీయ అనిశ్చితి వాతావరణంలో తండ్రి ఉద్యోగం పోయింది. అక్కడినుంచి కష్టాలను ఈదుకుంటూ పారిస్ చేరుకుంది. ఆ రోజుల్లో సై¯Œ ్స చదవడానికి స్త్రీలు ముందుకు రాకుండా సంప్రదాయవాదులనుండి అనేక అవరోధాలుండేవి. ఆమెకు సైన్సంటే మక్కువ, పరిశోధనలంటే ప్రాణం. ఇంటిపట్టునే ఉన్నవనరులతోనే ప్రయోగశాల పెట్టుకుంది. ప్రొఫెసర్ హెన్నీ బెకెరెల్ సాయంతో పరిశోధనలు చేసేది. ఇంచుమించు తనలాగే అనేక కష్టాలను ఓర్చుకుంటూ పరిశోధనలు సాగిస్తున్న పీరే క్యూరీతో పరిచయం, సాహచర్యం తరువాత పెళ్ళికి దారితీసాయి. అయినా కష్టాలు తీరకపోగా కలిసి అనుభవించడం అలవాటు చేసుకున్నారు. భయంకరమైన కాన్సర్ వ్యాథి చికిత్సకు తోడ్పడగల కారకాల కోసం పరిశోధనలు ముమ్మరంగా సాగుతుండేవి. రేడియోయాక్టివిటీ సిద్ధాంత అభివృద్ధికి, దాని తాలూకు పరిశోధనలకు ఆమె గురువుకి, భర్తకి, ఆమెకు కలిపి నోబెల్ బహుమతి లభించింది. ఆ తరువాత ఒక చిన్న రోడ్డు ప్రమాదంలో ఆమె భర్త మరణించారు. తరువాత కాలంలో పొలోనియం, రేడియం మూల పదార్థాల అన్వేషణకు ఈసారి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఆమెను వరించింది. ఒక స్త్రీకి రెండుసార్లు, అదీ రెండు వేర్వేరు సబ్జెక్ట్ లలో నోబెల్ రావడం విశేషం, అపూర్వం. ఆమె సాధించిన ఫలితాలకు ఆమె కానీ, ఆమె భర్త కానీ పేటెంట్ తీసుకుని ఉంటే.... వారి వారసులు ఇప్పటి లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా ఉండేవారు. కానీ ఆమె నిజ జీవిత సిద్ధాంతం ఏమిటో తెలుసా... ‘‘అవి (ఖనిజాలు) ప్రకృతి ఇచ్చిన వరం. అది ప్రజలది. వాటి మీద నాకేం హక్కు ఉందని పేటెంట్ తీసుకోవాలి. అందరి మేలుకోసం వాటిని నేను ఉపయోగించగలగడం నాకు జీవితంలో దక్కిన అదృష్టం... అందుకే వాటికోసం తాపత్రయపడలేదు. నిజానికి దంపతులిద్దరికీ అవార్డులు, రివార్డుల మీద ధ్యాస ఉండేది కాదు... నిరంతరం పరిశోధనలే... అవికూడా ఇంటిపట్టున ఏర్పాటు చేసుకున్న అరాకొరా సౌకర్యాలతో... సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో ... ధార్మిక ప్రభావానికి ఆమె శరీరం గురయింది... చివరకు ఆమెకు కూడా కాన్సర్ సోకి, మరణానికి దారితీసింది... ఆమె పారిస్(ఫ్రా¯Œ ్స దేశం)లో స్థిరపడినా, మాతృదేశం పట్ల ఆమెకు ఎంత గాఢమైన ప్రేమంటే... తాను కనుగొన్న పదార్థాలలో ఒకదానికి తన దేశం పేరు ధ్వనించేలా పొలోనియం అని పేరుపెట్టింది. చివరకు తన మరణానంతరం ఖననానికి ముందు.. శవపేటిక తెరచి.. జన్మభూమి పోలండ్ నుంచి తెచ్చిన మట్టి చల్లాలని కోరింది. మానవాళి శ్రేయస్సుకు తపించడం తప్ప ఆమె సర్వసుఖాలను, సంపదలను దూరంగా పెట్టింది.. చివరకు కీర్తికాంక్షను కూడా. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
తిండి లేదు.. తిప్పలు పడింది.. విశ్వాసమే మళ్లీ నెగ్గింది!
27 రోజులు.. 64 కిలోమీటర్లు.. దారి తెలీయకున్నా ఎక్కడా ప్రయాణం ఆపలేదు. తిండి లేదు.. తోవలో తిప్పలెన్నో పడింది.. చివరకు కథ సుఖాంతం అయ్యింది. విశ్వాసానికి మారుపేరైన శునకం మరోసారి తన స్వామి భక్తిని చాటుకుని వార్తల్లోకి ఎక్కింది. అదేంటో మీరూ చదివేయండి.. సృష్టిలో ప్రేమ అనంతం. కానీ, ఆ ప్రేమకు స్వచ్ఛతను.. అచ్చమైన అర్థాన్ని చెప్పేవి మాత్రం కొన్నిగాథలే. మూగజీవాలు మనుషుల పట్ల కనబరిచే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా ఇక్కడో శునకం.. యజమాని(కేర్ టేకర్) కోసం చేసిన సాహసం గురించి ముమ్మాటికీ చెప్పుకోవాల్సిందే. పైన ఫొటోలో ఉంది కూపర్. Golden Retriever జాతికి చెందిన శునకం. ఒక నెలకిందట.. ఐర్లాండ్ ఉత్తర భాగంలోని టైరోన్ కౌంటీలోని ఓ ఇంటికి దత్తత వెళ్లింది. కారు నుంచి దిగీదిగగానే పరుగులు అందుకుంది కూపర్. అలా మొదలైన ప్రయాణం 40 మైళ్ల పాటు సాగింది. లండన్డెర్రీలోని టోబర్మోర్లో ఉన్న తన కేర్ టేకర్ చెంతకు చేరింది. కనిపించకుండా పోయిన మూగజీవాల గురించి ఆరా తీసే లాస్ట్‌పాస్ ఎన్ఐ అనే ఛారిటీ కూపర్‌కు చెందిన అందమైన కథను సోషల్ మీడియాలో పంచుకుంది. దాదాపు నెలపాటు సాగిన కూపర్ ప్రయాణం.. ఎక్కడా ఆగలేదు. ఎవరి సాయం లేకుండానే అది ముందుకు సాగింది. దారి తెలియకపోయినా.. అది పాత ఓనర్ చేరుకున్న తీరు ఆశ్చర్యానికి గురి చేయిస్తోందని సదరు ఛారిటీ పేర్కొంది. మరోవైపు అది తిరిగి రావడం చూసి దానిని దత్తత ఇచ్చిన వ్యక్తి భావోద్వేగానికి లోనయ్యారు. ఇకపై కూపర్ ఎక్కడికి వెళ్లదని, తనతోనే ఉంటుందని కన్నీళ్లతో చెబుతున్నారు. -
పార్లమెంట్ విశ్వాసం పొందిన పాక్ పీఎం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం పార్లమెంట్‌లోని దిగువసభ నేషనల్ అసెంబ్లీ విశ్వాసం పొందారు. మొత్తం 342 మంది సభ్యులకుగాను 180 మంది షరీఫ్ నాయకత్వంపై విశ్వాసం ప్రకటించారు. షరీఫ్ ప్రభుత్వం, న్యాయ వ్యవస్థకు మధ్య ఇటీవలి కాలంలో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న సమయంలో ఈ పరిణామం సంభవించింది. గత ఏడాది అధికారంలోకి వచ్చిన సమయంలో షరీఫ్‌కు 174 మంది సభ్యులు మాత్రమే మద్దతు తెలపడం గమనార్హం. పంజాబ్, ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్స్ అసెంబ్లీలకు ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ)కి అవసరమైన నిధుల కేటాయింపునకు సంబంధించిన బిల్లును నేషనల్ అసెంబ్లీ ఇటీవల తిరస్కరించిన నేపథ్యంలో షరీఫ్ ప్రభుత్వం బలనిరూపణకు సిద్ధమయింది. వెంటనే పార్లమెంట్ ఎన్నికలు జరపాలంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐ పార్టీ గట్టిగా పట్టుబడుతోంది. -
Saurashtra Tamil Sangamam: అడ్డంకులున్నా ముందడుగే..
సోమనాథ్: మన దేశం వైవిధ్యానికి మారుపేరు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విశ్వాసం నుంచి ఆధ్యాత్మిక దాకా.. అన్ని చోట్లా వైవిధ్యం ఉందని తెలిపారు. దేశంలో వేర్వేరు భాషలు, యాసలు, కళలు ఉన్నాయని గుర్తుచేశారు. ఈ వైవిధ్యం మనల్ని విడదీయడం లేదని, మన మధ్య అనుబంధాన్ని, సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ‘సౌరాష్ట్ర–తమిళ సంగమం’ వేడుక ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏదైనా కొత్త విజయం సాధించే శక్తి సామర్థ్యాలు మన దేశానికి ఉన్నాయని ఉద్ఘాటించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలన్నదే మన ఆశయమని వివరించారు. ఈ లక్ష్య సాధనలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయని, మనల్ని అటంకపరిచే శక్తులకు కొదవలేదని చెప్పారు. అయినప్పటికీ లక్ష్యాన్ని చేరుకోవడం తథ్యమని స్పష్టం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు పూర్తయినా దేశంలో ఇంకా బానిస మనస్తత్వం ఇంకా కొనసాగుతుండడం ఒక సవాలేనని అన్నారు. బానిస మనస్తత్వం నుంచి మనకి మనమే విముక్తి పొందాలని, అప్పుడు మనల్ని మనం చక్కగా అర్థం చేసుకోగలమని, మన ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగమని ఉద్బోధించారు. అన్ని అడ్డంకులను అధిగమించి, మనమంతా కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. ఆరోగ్య సమస్యలను సరిహద్దులు ఆపలేవు న్యూఢిల్లీ: ఆరోగ్య రంగంలో మన ముందున్న సవాళ్లను దీటుగా ఎదిరించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని మ్రోదీ పిలుపునిచ్చారు. ‘వన్ ఎర్త్, వన్ హెల్త్–అడ్వాంటేజ్ హెల్త్‌కేర్ ఇండియా 2023’ సదస్సులో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ఆరోగ్య సంరక్షణ విషయంలో సమీకృత కృషిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. మెరుగైన, చౌకైన వైద్య సేవలు అందరికీ అందాలన్నారు. -
పాలించడమెలాగోచూపిస్తా
లండన్: ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో సతమతమవుతున్న బ్రిటన్‌కు స్థిరత్వం, ప్రజలకు విశ్వాసం కలిగించడమే తమ ప్రభుత్వ అజెండాలో ప్రధానాంశమని నూతన ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు. తాజా మాజీ ప్రధాని లిజ్ ట్రస్ చేసిన ఆర్థిక తప్పిదాలను సరిచేసేందుకే కన్జర్వేటివ్ ఎంపీలు తనను సారథిగా ఎన్నుకున్నారని అభిప్రాయపడ్డారు. ‘‘మార్పు కోసం ట్రస్ చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. ఆమె ఉద్దేశాలు మంచివే. కాకపోతే తీసుకున్న నిర్ణయాల్లో, వాటి అమల్లోనే తప్పిదాలు దొర్లాయి’’ అన్నారు. మంగళవారం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ నుంచి జాతినుద్దేశించి ఆయన తొలి ప్రసంగం చేశారు. దేశం చరిత్రలోనే అతి పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే, ‘‘తొలుత కరోనా, తర్వాత రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మన పాలిట పెను సమస్యలుగా మారాయి. పరిస్థితిని దీటుగా ఎదుర్కొంటాం. కరోనా, దానివల్ల తలెత్తిన ఆర్థిక సమస్యలను ఆర్థిక మంత్రిగా ఎంత సమర్థంగా నిభాయించుకొచ్చానో అందరికీ తెలుసు. ప్రజలను, వ్యాపార వాణిజ్యాలను పరిరక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నా. అదే స్ఫూర్తితో ఇప్పుడూ సమస్యలను అధిగమిస్తాం. సమస్యను చూసి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. పూర్తి జవాబుదారీతనం, సమగ్రత, పక్కా ప్రొఫెషనలిజంతో కూడిన పాలన ఎలా ఉంటుందో చూపిస్తా. మాటలతో కాకుండా చేతల్లో దేశాన్ని ఐక్యం చేసి చూపిస్తా’’ అని చెప్పారు. ‘‘మనం చెల్లించలేనంత భారీ అప్పులను ముందు తరాలపై రుద్దే ప్రసక్తే లేదు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తా’’ అని స్పష్టం చేశారు. అదే సమయంలో పౌరుల సంక్షేమం పట్ల సహానుభూతితో వ్యవహరిస్తామన్నారు. ‘‘మేం పూర్తి స్పష్టతతో రంగంలోకి దిగాం. ఈ క్షణం నుంచే మా పని మొదలైంది. దేశ సంక్షేమం కోసం అహోరాత్రాలూ కష్టపడతాను’’ అని ప్రకటించారు. ‘‘మనమంతా కలిసి పని చేస్తే అద్భుతాలు చేసి చూపించొచ్చు’’ అంటూ ఆత్మవిశ్వాసం వెలిబుచ్చారు. అందరి ఆకాంక్షలకు అనుగుణంగానే తన పాలన ఉంటుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఆ క్రమంలో తాను పలు కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలపై రిషి విమర్శలు ఎక్కుపెట్టారు. భార్య అక్షత, కుమార్తెలు కృష్ణ, అనౌష్కలతో కలిసి మాట్లాడతారని అంతా భావించగా రిషి ఒంటరిగానే దాదాపు 6 నిమిషాల పాటు మాట్లాడారు. బ్రిటన్ చరిత్రలో ఓ కొత్త ప్రధాని చేసిన అతి సుదీర్ఘ తొలి ప్రసంగాల్లో ఇదొకటని చెబుతున్నారు. బోరిస్ జాన్సన్ మాత్రం 2019లో బాధ్యతలు చేపట్టాక ఏకంగా 11 నిమిషాల 13 సెకన్లు మాట్లాడారు! తాజా మాజీ ప్రధాని ట్రస్ తన తొలి ప్రసంగాన్ని 4 నిమిషాల్లో ముగించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మంచి మాట: ఆధ్యాత్మికత అంటే..?
‘దేవుణ్ణి మీరు చూశారా..?’ అని ప్రశ్నించాడో యువకుడు ఒక సాధకుణ్ణి. చురుకైన కళ్ళు.. తీక్షణమైన చూపులు. గిరజాల జుట్టు.. దానిలో కొన్ని వంకీలు అతని విశాల ఫాలభాగాన నర్తిస్తుండగా. ‘ఆ“చూసాను’. అన్నాడాయన చిరునవ్వుతో. ‘చూశారా..!?’ అన్నాడా యువకుడు తన అనుమానానికి అపనమ్మకాన్ని జోడిస్తూ. ‘చూశాను. నిన్ను చూస్తున్నంత స్పష్టంగా’ అన్నాడాయన మరింత ప్రశాంతంగా నవ్వుతూ. ఆ మాటలకు ఆ యువకుడు విభ్రాంతుడే అయ్యాడు. ఆ సాధకుడి గొంతులో ధ్వనించిన విశ్వాసం.. నమ్మకం.. సూటిదనం.. అతణ్ణి ఒక నిమిషంపాటు ఆపాదమస్తకాన్ని కంపింప చేసింది. ఇంతకుముందు తను కలసిన సాధకుకులు.. యోగులు.. గురువులు... అందరూ కూడా దేవుణ్ణి చూడలేదనే చెప్పారు. ఆ దేవదేవుని సాక్షాత్కారానికి తపస్సు చేస్తూనే ఉన్నామన్నారు. ఒకవేళ ఒకరిద్దరు చూశామని చెప్పినా ఇంత గట్టిగా.. విశ్వాసంతో చెప్పలేదు. ఇందుకే ఆ వంగ దేశీయుడికి ఆ పరమహంస మీద గురి.. ఏర్పడింది. అందుకే ఆయనను గురువుగా అంగీకరించాడు. ఆ పై ఆ గురుశిష్యులిరువురూ ఎంత విశ్వవిఖ్యాతులయ్యారో లోకవిదితమే. దేవుణ్ణి చూశామన్న వారెవరైనా ఆయన భావనను, తత్వాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నారని అర్థం. దేవుడి సర్వాంతర్యామిత్వ భావనను గ్రంథాలనుండి గ్రహించటమే కాదు, దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవటం. ఈ సకల చరాచరసృష్టిలో ప్రతి జీవిలో చూడగలగటం. ప్రత్యక్షంగా చూసి అనుభవంగా చేసుకోవటమే కదా! ఆ పరమహంస.. నిన్ను చూసినంత బాగా చూశాను’ అని చెప్పటంలో అదే అర్థం. ‘ఇందు గలడందు లేడని సందేహం వలదు..’ అన్న పద్య సారాంశ మదే కదా. తన ఎదురుగా తను ఆరాధిస్తున్న విగ్రహమే దేముడు.. అయన ఉనికి ఇక్కడే.. ఈ నాలుగు గోడల మధ్యే అన్న ఆలోచనా పరిధి.. పరిమితులనుండి నుండి మనిషి బయటకు రానంతకాలం.. రాకూడదనుకున్నంత కాలం ఆ సర్వాంతర్యామిత్వాన్ని బుద్ధికే పరిమితం చేసుకున్నాడు. అంతే కానీ మనస్సులో ఆ భావనను ప్రతిష్టించుకోలేకపోయాడు. నిజమైన ఆధ్యాత్మికమార్గానికిది పెద్ద అవరోధం. భావన.. అనుభూతి.. దృష్టి ఈ మూడింటిని ఆధ్యాత్మికపథంలో పయనించాలనుకున్న వారు తప్పనిసరిగా అలవరచుకోవలసిన లక్షణాలు. అనేక శాస్త్రాలు.. కావ్యాలు.. వేదాంత గ్రంథాలు చదివిన ఓ పండితుడు గంగానదిలో స్నానమాచరించి తన పాప ప్రక్షాళన చేసుకోవాలన్న తన జీవితేచ్ఛను జీవిత చరమాంకంలో కాని తీర్చుకోలేకపోయాడు. ‘ఈ గంగానదికి పాపాలను పరిహరించే మహత్తు నిజంగా వుందా..? అన్న అనుమానం మదిలో మొలకె త్తింది. తత్ఫలితంగా సద్గతులు కొంచెం ఆలస్యంగా ప్రాప్తించాయి. కారణం..!? భావన, అనుభూతి. అయితే ఈ పండితుడి పలుకుల మీద విశ్వాసముంచి మామూలు నదిలో స్నానం చేసిన సాధారణ వ్యక్తి ఆ పండితుడికన్నా ముందుగా సద్గతులు పొందాడు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలనుకునేవారికి ఉండవలసిన ప్రథమ లక్షణం భావన.. అనుభూతి.. విశ్వాసం. మన భౌతికావసరాలు, బాధ్యతలు నెరవేర్చటం కోసం ఏదో ఒక వృత్తినో .. ఉద్యోగాన్నో.. పొంది డబ్బు సంపాదించాలి. భార్యను, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని పోషించాలి. ఇది ప్రధాన బాధ్యత. ఇది కాని జీవితం ఇంకేమైనా ఉందా? ఇదే జీవిత పరమార్థమా? మనిషి ఈ చింతన చేయటానికి తన అంతరంగంలోకి చూడగలగాలి. తన మనస్సును న్యాయాధీశుని చేసుకుని తను చేసే పనుల మంచి చెడులను ప్రశ్నించుకోవాలి. ఆలోచనలను, ప్రవర్తనను సింహావలోకనం చేసుకోవాలి. తను ఎంతవరకు నిజాయితీగా.. న్యాయబద్ధతతో.. ప్రవర్తిస్తున్నాడు? నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాడా..? ఎదుటివారికి చేయగలిగిన మేలు చేస్తున్నానని కీడు చేయటంలేదు కదా..! ఇటువంటి ప్రశ్నలు తానే తన మీద సంధించుకోవాలి. వీటికి సంతృప్తికరమైన సమాధానాలు ఎవరు పొందగలరో వారు నిస్సందేహంగా చక్కని, ఆదర్శవంతమైన జీవితాన్నే గడుపుతున్నట్టే. ఈ పరిశీలన.. శోధనకే అంతర్ముఖత్వమని పేరు. ఆధ్యాత్మికతకు ఇదొక ముఖ్యమైన లక్షణమే కాదు కాదు, ఖచ్చితంగా ఉండవలసినది. ఇది ఆస్తికులకైనా, నాస్తికులకైనా.. ఆ మాట కొస్తే మనిషన్న వాడికెవడికైనా వర్తిస్తుంది. ఏ మత విశ్వాసానికైనా అన్వయించుకోతగ్గది, అందరికీ అభిలషణీయమైనదీ మార్గం. ఈ అంతరంగ యానం.. లోచూపు ఎవరైతే అలవరచుకుంటారో వారు జీవితాన్ని సరిగా అర్థం చేసుకున్నారని చెప్పవచ్చు. సరైన రీతిలో మలచుకుంటున్నారని అర్థం. ధనం వల్ల ఇహంలో మనం పొందే భౌతికమైన, ఉన్నతస్థితి కాక.. ఇంకా ఎంతో ఉన్నతమైన స్థితికి చేరినట్టు. కొందరు భౌతికపరమైన విషయాలను పక్కకు పెట్టి బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండి అంతర్ముఖులు కాబోతున్నామని ప్రకటనలు చేస్తారు. కానీ ఆ ప్రయత్నం చేయనే చేయరు. మన మనస్సు తీరు.. గతి.. ఆలోచనా పద్ధతి.. మన వ్యక్తిత్వాన్ని ఒక అంచనా వేసుకుని మన జీవితాన్ని, మన ఆలోచనా ప్రవాహన్ని క్రమబద్దీ కరించుకునేందుకు మన మనస్సు చెప్పే సంగతులు తెలుసుకోవాలి. సరిగా లేకుంటే దిద్దుకోవాలి. ఇందుకు అంతర్ముఖత్వం ప్రతి ఒక్కరికీ అవసరం. మానవ మేధ, శక్తియుక్తులకు పరిధులు, పరిమితులున్నాయని, ఆ మానవాతీత శక్తి భగవంతుడని సర్వశక్తిమంతుడని. సర్వవ్యాపకుడని, అతడివల్లే ఇంతటి సృష్టి జరిగిందని భావించే వారున్నారు. వారు అతడినే కేంద్ర బిందువు చేసుకుని తమ అంతర్ముఖ ప్రయాణపు తొలి.. ఆఖరి అడుగు అతడితోనే ముగిస్తారు. కొందరు ప్రకృతి పరిణామక్రమంలో ఏర్పడ్డదీ సృష్టి అంటూ ఒక మానవాతీత శక్తి వుందని అంటారు. కానీ దాన్ని భగవంతుడుగా భావన చేయరు. వీరిరువురూ కూడ అంతర్ముఖత్వానికి పెద్దపీట వేస్తారు. మనిషి మహాత్ముడు కాకపోయినా మనిషి గా నిలబడటానికి ఇది అవసరమని ఇద్దరూ ఏకీభవిస్తారు. జీవితం అర్థవంతమైనదవ్వాలంటే ఇది అత్యంత అవసరమైనదని ఇద్దరూ అంగీకరిస్తారు. ఈ ఆధ్యాత్మిక చింతన లేదా అంతర్ముఖత్వం ఒక సత్యాన్వేషణ. ఒక సత్యశోధన. మనలోని చైతన్యాన్ని తెలుసుకోవటం. జీవితాన్ని అర్థం చేసుకుని, దాని పట్ల ఉన్న భయాందోళనలు తొలగి నిర్భయులమై స్వేచ్ఛానందాలను పొందాలంటే ప్రతి ఒక్కరూ అంతర్ముఖులు కావాలి. ఆధ్యాత్మిక చింతనంటే కేవలం భక్తి ఒక్కటే కాదు. దానికి భావన..అనుభూతి.. విశ్వాసం.. వీటిని చేర్చాలి. ఆధ్యాత్మికత అంటే పెదవులతో దేవుడి నామాన్ని పలకటమే కాదు. భగవంతుడి రూపాన్ని అన్నిచోట్లా.. అందరిలోనూ చూడగలగటం. మన ఆణువణువునా ఆ భావనను పొందుపరచుకోవటం. అపుడే మనం ఆయన సర్వాంతర్యామిత్వాన్ని విశ్వసించినట్టు! ఆధ్యాత్మికత అంటే మనం నమ్మిన దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవటం. ఈ దశకు చేరు కోవటమంటే నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నట్టే. ఆధ్యాత్మికత తొలి మెట్టు ఇదే కావాలి. భగవంతుని తత్వాన్ని మనసులో నిలుపుకుని తోటివారితో ఎవరైతే చక్కగా సంభాషిస్తారో... అభాగ్యుల.. అనాథల మీద కరుణ, ప్రేమ చూపిస్తారో.. కష్టాలలో ఉన్నవారిని ఆదుకుంటున్నారన్న విషయాలకు ఎవరు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారో వారు నిజమైన ఆధ్యాత్మికపరులు. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
‘బస్టాండ్‌లో ఒంటరిగా వృద్ధుడు.. నేనున్నానంటూ..’ వైరల్ వీడియో
మనలో చాలా మంది శునకాలను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. వాటిని ఎంతో ప్రేమగా, ఇంట్లో మనిషిలానే పెంచుకుంటారు. విశ్వాసానికి, ప్రేమకు గుర్తుగా భావిస్తారు. అవి కూడా తమ యజమానుల పట్ల ఎనలేని విశ్వాసాన్ని కనబరుస్తాయి. ప్రస్తుత సమాజంలో.. పక్కవాడిని పట్టించుకోని కొందరు మనుషుల కన్నా.. నోరులే జీవాలే మేలని చాలా మంది భావిస్తున్నారు. శునకాలు కూడా తమ చేష్టలతో, యజమానితో ఆడుకుంటూ తమ ప్రేమను కనబరుస్తాయి. యజమానులు పెంపుడు జీవులతో ఆడుకుంటూ.. వారి ఒత్తిడిని దూరం చేసుకుంటారు. శునకాల విశ్వాసానికి సంబంధించిన ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా, ఈ కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ఒక వృద్ధుడు బస్టాండ్ పక్కన ప్లాట్‌ఫాంలో ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఒక శునకం అతడిని సమీపించింది. అతని ముందు కూర్చుని అప్యాయంగా తోక ఊపింది. ఆ వ్యక్తి కూడా ఆ శునకాన్ని ప్రేమతో దగ్గరకు తీసుకుని, హత్తుకున్నాడు. ఎన్నోరోజుల నుంచి విడిపోయిన తన.. యజమానిని చూసినట్టు వృద్ధుడి ఒడిలో అది కూర్చుండిపోయింది. అతను కూడా దాన్ని ప్రేమతో దగ్గరకు తీసుకొని, దాని తలను నిమురుతూ కూర్చున్నాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ఈ వీడియోను బ్యాటింజిబిడేన్ అనే యూజర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు..‘కొందరు మనుషుల కన్నా.. శునకమే నయం..’, ‘నోరులేని జీవాలు కూడా మనిషిలానే భావోద్వేలను కల్గి ఉంటాయి..’, ‘ పాపం.. అతడికి నేనున్నాను.. అనే భరోసా ఇచ్చింది..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. This dog approaches a homeless man and seems to know what he needs.. 🥺 pic.twitter.com/uGWL351fCR — Buitengebieden (@buitengebieden_) December 30, 2021 -
పొత్తుల పొడగిట్టని జనం..
పొత్తులపై ప్రజల్లో విశ్వాసం పెద్దగా లేదు. ఎన్నికల్లో గెలుపు కోసం ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న వారు వచ్చే ఎన్నికల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. ఇలాంటి వారిపట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడం సహజం. మోదీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న పార్టీలతో ప్రజలకు పెద్దగా సమస్యలేదు. ఎందుకంటే రాబోయే రెండు మూడేళ్ళలో తిరిగి ఆయా పార్టీలు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మారడం ఖాయమని వారు భావిస్తున్నారు. ఒకవేళ పొత్తులతో వారు గెలిచినప్పటికీ ప్రభుత్వాన్ని కొనసాగించగలరన్న విశ్వాసం ప్రజలకు కలగడం లేదు. అందుకే కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా ప్రాంతీయ పార్టీల పొత్తులు బీజేపీని నిరోధించగలిగినా మహాఘటబంధన్ వంటి భారీ పొత్తులు మాత్రం ప్రజలను అంతగా ఆకర్షించలేవు. వ్యతిరేక ప్రచారమే మోదీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది. -
మళ్లీ మోదీనే రావాలి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి మరో అవకాశమిస్తే తమ భవిష్యత్తు బాగుంటుందని 50 శాతం మంది అభిప్రాయపడినట్లు ఓ సర్వేలో తేలింది. 63 శాతం పైగా మంది ఎన్డీయే ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తీకరించారు. వార్తా వెబ్సైట్ డైలీహంట్, డేటా అనలిటిక్స్ సంస్థ నీల్సన్ ఇండియాలు సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించాయి. దేశ విదేశాల్లో సుమారు 54 లక్షల మంది అభిప్రాయాల్ని ఆన్లైన్లో సేకరించి ఈ నిర్ధారణకు వచ్చాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెలువడిన ఈ సర్వే ఫలితాల్ని కాంగ్రెస్ కొట్టిపారేసింది. ఈ అంచనాలు వృథా, నకిలీవని పేర్కొంది. ‘ప్రజా విశ్వాసం కోల్పోయిన ఎన్డీయేకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తప్పదు. అన్ని దారులు మూసుకుపోయాక తన అర్థ బలంతో ఇలాంటి నకిలీ సర్వేలను తెరపైకి తెచ్చి, అవి నిజమని నిరూపించాలనుకుంటోంది. ప్రజలే తిరస్కరించాక ఇలాంటి వృథా సర్వేలతో వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. సర్వేలో ఏం తేలిందంటే.. ► మోదీ పనితీరు, నాయకత్వంపై సంతృప్తి వ్యక్తం చేసిన 63 శాతం మంది. 2014తో పోలిస్తే మోదీ ప్రభుత్వంపై వారికి ఏమాత్రం విశ్వాసం సడలలేదు. ► సంక్షోభ సమయంలో దేశాన్ని నడిపించేందుకు మోదీనే అందరి కన్నా ఎక్కువ అర్హుడని అభిప్రాయపడిన సుమారు 62 శాతం మంది. తరువాతి స్థానాల్లో రాహుల్ గాంధీ(17 శాతం), అరవింద్ కేజ్రీవాల్(8 శాతం), అఖిలేశ్ యాదవ్(3 శాతం), మాయావతి(2 శాతం) ఉన్నారు. ► మోదీకి రెండోసారి ప్రధాని అయితే తమ భవిష్యత్తు బాగుంటుందన్న 50 శాతం మంది. ► అవినీతి నిర్మూలనలో మోదీకి మద్దతుతెలిపిన సుమారు 60 శాతం మంది. ► ఈ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కన్నా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎక్కువ మద్దతు పలికారు. ► ఇతర వయో బృందాల కన్నా 35 ఏళ్లకు పైబడిన వారే మోదీకి అత్యధిక మద్దతు తెలిపారు. ► త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ ప్రజలు మోదీపై విశ్వాసం ఉంచగా, తెలంగాణలో మాత్రం ఇందుకు విరుద్ధమైన ధోరణి కనిపించింది. -
విశ్వాసముంటే.. నాలుగేళ్ల అధికాయుష్షు!
దైవాన్ని, మతాన్ని నమ్మేవారు ఇతరుల కంటే నాలుగేళ్లు ఎక్కువ బతికేందుకు అవకాశముంది అంటున్నారు శాస్త్రవేత్తలు. అమెరికాలో ఇటీవల ఒక అధ్యయనం జరిపి మరీ తాము ఈ అంచనాకు వచ్చామని లారా వాలెస్ అనే శాస్త్రవేత్త తెలిపారు. సాధారణంగా మతాన్ని నమ్మిన వాళ్లు ధార్మిక కార్యక్రమాలు లేదంటే సామాజిక కార్యకలాపాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉంటారని.. ఇలాంటి వారు ఇతరుల కంటే ఎక్కువ కాలం బతుకుతారని గతంలోనే అనేక పరిశోధనలు స్పష్టం చేశాయని లారా అంటున్నారు. ఈ నేపథ్యంలో తాము మతాల వివరాలను సేకరించేందుకు సంస్మరణ సభలను ప్రాతిపదికగా తీసుకున్నామని, కుటుంబ సభ్యులు, మిత్రులు చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకుంటూనే.. మరణించిన వ్యక్తి స్త్రీయా, పురుషుడా? వివాహమైందా? లేదా? అన్నవీ గమనించి పరిశీలించినప్పుడు మతాన్ని నమ్మినవారు దాదాపు 6.48 ఏళ్లు ఎక్కువ జీవించేందుకు అవకాశముందన్న అంచనాకు వచ్చామని వివరించారు. అమెరికాలోని మొత్తం 43 ప్రధాన నగరాల్లోని 1096 మందిపై జరిగిన రెండో అధ్యయనంలో ఇది 5.64 ఏళ్లుగా ఉన్నట్లు స్పష్టమైందని, మొత్తమ్మీద చూస్తే మతవిశ్వాసాలు కలిగి ఉండటం.. ధార్మిక, సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడం నాలుగేళ్ల ఆయుష్షునిస్తుందని తెలుస్తోందని లారా చెప్పారు. -
దైవకార్యాలతో గ్రామాల్లో సుఖ శాంతులు
అమరాపురం: గ్రామాల్లో దైవ కార్యాలు చేయడం ద్వారా సుఖ శాంతులు వెల్లి విరుస్తాయని కర్ణాటక రాష్ట్రం సిద్దరబెట్ట మఠాధీశులు వీరభద్ర శివాచార్య స్వామీజీ అన్నారు. గురువారం మండలంలోని చిట్నడుకు గ్రామంలో ఈశ్వర దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు తమ ఇంటి నుంచి గంగాజలం తీసుకుని స్వామివారికి కుంభాలతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తితోనే ముక్తి మార్గం పొందవచ్చని స్వామీజీ తెలిపారు. -
పడి ఉవ్వెత్తున లేచే కెరటం విశ్వాసి!!
సువార్త యేసుక్రీస్తుకు దగ్గరి వారైన 70 మంది శిష్యుల్లో మార్కు ఉన్నాడు. యేసును రోమా భటులు బంధించినప్పుడు ఆయన్ను వెంబడించి మధ్యలో ఆయన్ని వదిలి పారిపోయిన యువకుడు మార్కు (మార్కు 14:51,52) ఇతనేనన్నది చరిత్రకారుల అభిప్రాయం. యేసు చివరిసారి పస్కా ఆచరించిన ఇల్లు ఇతని తల్లిదేనని, పస్కా ఏర్పాట్లన్నీ ఈయనే చేశాడని కూడా చెబుతారు (మార్కు 14:12–16). యేసు పునరుత్థానం తర్వాత పౌలు బర్నబాతో కలసి సువార్త యాత్ర కోసం సైప్రస్ దేశానికి వెళ్లాడు. కాని అతను మధ్యలోనే వారినొదిలేసి యెరూషలేముకొచ్చేశాడు. ఆ తర్వాత పౌలు, బర్నబా మరో సువార్త యాత్రకు వెళ్దామనుకున్నప్పుడు మార్కును వెంట తీసుకెళ్దామని బర్నబా ప్రతిపాదిస్తే, మునుపు మనల్ని మధ్యలో వదిలేసి పారిపోయిన వ్యక్తి మనతో ఎందుకంటూ పౌలు తీవ్రంగా విభేదించాడు. ఆ కారణంగా పౌలు, బర్నబా విడిపోయి పౌలు సౌలు అనే వ్యక్తితో, బర్నాలా మార్కుతో కలసి చెరోవైపు వెళ్లిపోతారు. (అపో.కా.15:39–41). దుడుకు తత్వం, పిరికితనం, మధ్యలో పారిపోయే చంచలత్వం ఉన్న మార్కును ఆనాడు అంతా తక్కువ చేసి మాట్లాడారేమో కాని, దేవునికి మాత్రం అతని పట్ల దృఢ సంకల్పం, తిరుగులేని ప్రేమ ఉన్నాయి. కాబట్టే యేసుక్రీస్తు జీవిత విశేషాలపై ఆయన రాసిన గ్రంథాలన్నీ దేవుడు బైబిల్ లోని నాలుగు సువార్త గ్రంథాల్లో ఒకటిగా మార్కు సువార్తగా చేర్చాడు. అదే దేవుని ప్రేమలోని ప్రత్యేకత. ప్రజల దృష్టిలో అల్పుడైన వ్యక్తి దేవుని దృష్టిలో కూడా అల్పుడు కానక్కరలేదు. ప్రజలు ఆకాశానికెత్తే వ్యక్తిని దేవుడు కూడా హెచ్చిస్తాడనడానికి లేదు. ఎందుకంటే, మనలాగా ఆలోచించడానికి దేవుడు మానవుడు కాదు. పరిచర్యలో పడుతూ లేస్తూ ముందుకు సాగిన మార్కులాంటి బలహీనుడికి బైబిల్లో ఏకంగా సువార్త గ్రంథాన్ని రాసే ఆధిక్యతనివ్వడం దేవునికే చెల్లింది. అందుకే లోకాన్ని చూస్తూ, లోకం మెప్పుకోసం పాకులాడితే దేవుడు నిర్దేశించిన పథంలో పరుగెత్తడం కష్టమవుతుంది. అందువల్ల ఎన్ని వైఫల్యాలున్నా దేవుని వైపే చూస్తూ నిదానంగానైనా ముందుకు సాగే బలహీనులు, ఫలహీనుల్లోనే దేవుడు తన కృపను, మహదైశ్వర్యాన్ని నింపుతాడు. వాళ్లే దేవుని రాజ్యాన్ని అద్భుతంగా నిర్మిస్తారు. పడిపోయిన మార్కును దేవుడు ఘనంగా వాడుకోవడమే కాదు, అతనిలో వచ్చిన మంచి మార్పును, ఆత్మీయ పరిణతిని, ఎదుగుదలను పౌలు కూడా గ్రహించి అతన్ని అద్భుతంగా ప్రేమించాడు. బలహీనులే అయినా తనకు విధేయంగా వుండే వారితోనే దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. పొరపాటున జారిపడ్డా, తప్పులు చేసినా, విశ్వాసాన్ని పాదుకొని, పరులను గెలవడమెలాగో విశ్వాసులంతా మార్కును చూసి నేర్చుకోవాలి. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
కుక్కను మించిన విశ్వాసం..
అర్వపల్లి: సాదారణంగా ఇళ్ళు, వ్యవసాయ బావుల వద్ద కాపలా కోసం కుక్కలను పెంచుకుంటాం. కానీ, కుక్కలకు మించి కాపలాగా ఉంటుంది ఆకోడిపుంజు. మండలంలోని కొమ్మాల గ్రామంలో సర్పంచ్ కుంట్ల సురేందర్‌రెడ్డి తన వ్యవసాయ బావి వద్ద ఓ కోడిపుంజును పెంచుతున్నారు. ఇందులో పెద్ద విషయమేముంది అనుకుంటున్నారా... ఈ కోడిపుంజు ఆరున్నర కిలోల బరువు ఉంటుంది. అయితే ఇది మామూలు కోడి పుంజు కాదు. కుక్క కన్న విశ్వాసం గలది ఈ కోడిపుంజు ఆ బావి వద్దకు కొత్త వ్యక్తులు వస్తెచాలు వెంటబడి పొడుస్తుంది. తన యజమాని కుటుంబ సభ్యులను తప్ప మరెవ్వరిని అక్కడకు రానివ్వదు. ఎవరైనా కొత్త వారు వస్తున్నారంటే కుటుంబ సభ్యులు కోడిపుంజుని అటు వైపు పోనివ్వరు. దూరంగా తీసుకెళుతారు. లేదంటే పశువల దొడ్లోకి తోలుతారు. ఎంతైనా ఆ కోడిపుంజు విశ్వాసం గలది కదూ. -
ఊరిలో దీపం పెట్టింది!
* కెన్యా అథ్లెట్ ఘనతకు ప్రభుత్వ సాయం * సొంత ఊరికి కరెంట్ సరఫరా ఎన్దబిబిట్ (కెన్యా) : ఒలింపిక్స్ వేదికపై తాను స్వర్ణం సాధించిన క్షణంలో ఆమెకు తెలీదు తాను ఊరివారందరి ఇళ్లల్లో వెలుగు నింపబోతున్నానని... తన గెలుపు ఆటల్లో సాధించిన ఘనత మాత్రమే కాదని, అది చీకటిని చీల్చే కిరణం కానుందని! సాధారణంగా ఒలింపిక్ విజేతలు తాము సాధించిన పతకాలు చూసుకుంటూ జరుపుకునే సంబరాలకు భిన్నమైన కథ ఇది. వివరాల్లోకెళితే... కెన్యా అథ్లెట్ ఫెయిత్ చెపాంగ్టిక్ కిపైగాన్ రియో ఒలింపిక్స్‌లో 1500 మీటర్ల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది. అయితే ఆ సమయంలో తన కూతురి ఘనతను కనీసం టీవీలో కూడా చూడలేకపోయానని, తమ ఊరు ఎన్దబిబిట్కు కరెంట్ సౌకర్యం కూడా లేదని ఫెరుుత్ తండ్రి శామ్యూల్ కూచ్ తమ దేశాధ్యక్షుడు ఉహురు కెన్యట్టాకు ఆవేదనగా లేఖ రాశాడు. ఇక ముందైనా నా కూతురి పరుగు చూసే అవకాశం కల్పించమని అతను కోరాడు. అంతే... 40 ఏళ్లుగా చీకట్లోనే మగ్గిపోతున్న ఆ ఊర్లోకి విద్యుత్ శాఖ అధికారులు ఒక్కసారిగా వాలిపోయారు. రికార్డు స్థాయిలో తొమ్మిది రోజుల్లో లైన్లు వేయడంతో పాటు కనెక్షన్ కూడా ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వ అత్యున్నత అధికారితో ప్రారంభోత్సవం కూడా చేయించేశారు! చీకటి గదినుంచి రియోకు వెళ్లిన చెపాంగ్టిక్ తన పసిడితో పాటు విద్యుత్ వెలుగుల మధ్య ఇంట్లోకి ప్రవేశించింది. ఆమెకు అద్భుత రీతిలో స్వాగతం పలికిన గ్రామస్థులు... ఆమె వల్లే ఊరికి విద్యుత్ వచ్చిందని, జీవిత కాలం గుర్తుంచుకుంటామని హృదయపూర్వకంగా దీవించారు. దీనిని చూసి తండ్రి హృదయం కూడా పులకించిపోయింది. ఇక ముందు నీ కూతురు ఆటను చూడమంటూ స్యామ్సంగ్ ఫ్లాట్ స్కీన్ టీవీ బహుమతిగా ఇవ్వగా, సూపర్ స్పోర్ట్ డిష్ కనెక్షన్ కూడా ఇచ్చింది. అన్నట్లు... ప్రారంభోత్సవానికి వచ్చిన అధికారి అథ్లెట్‌కు లక్ష షిల్లింగ్లు బహుమతిగా అందిస్తే, ఓవెన్ కొనుక్కునేందుకు స్థానిక ఎంపీ 10 వేల షిల్లింగ్లు అందజేశారు. జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడైతే కిపైగాన్కు గ్యాస్ కుకర్ కొనిస్తానని హామీ ఇచ్చారు! -
క్రియల మూలంగా కాదు...
విశ్వాసం వల్లే నీతిమంతులమవుతాము సువార్త విశ్వాసం ఒక వ్యక్తి ఆంతర్య ఆధ్యాత్మిక అనుభవం. క్రియలు ఒక వ్యక్తి యందలి విశ్వాసానికి అంటే ఆధ్యాత్మిక అనుభవానికి బాహ్య నిదర్శనాలు లేక ప్రతిబింబాలు. ఈ రెండింటికి మధ్య చాలా సున్నితమైన అంశం స్పష్టమవ్వాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి మంచి పనులు చేస్తున్నాడు గనుక అతడు మంచివాడా? లేక ఒక వ్యక్తి మంచివాడు కాబట్టి అతడు మంచి పని చేస్తున్నాడా? అన్న ప్రశ్నలో ఈ అంశానికి జవాబు దాగి ఉన్నది. క్రియలు ఒక వ్యక్తిని మంచివానిగా చేయవు. ఒకవేళ మంచివాడు అనే గుర్తింపు ఇవ్వవచ్చు. కాని ఒక్క క్రియ మాత్రమే మనిషి మంచికి ప్రామాణికత కాదు. కొండమీది ప్రసంగంగా అత్యంత ప్రాచుర్యం పొంది, అనేకులను ప్రభావితం చేసిన యేసుప్రభువు బోధలో మన ప్రతి క్రియకు ఉండవలసిన ఆధ్యాత్మిక ఉద్ధేశాన్ని, దృక్పథాన్ని బహు ఖండితముగా ప్రభువు బోధించెను (మత్తయి 5,6,7). ‘‘మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి’’ అంటూ మనం చేయవలసిన సత్క్రియలను ప్రోత్సహించారు. మనం దేవుని ప్రార్థించినా పరులకు ఉపకార ధర్మం చేసినా, దేవునికి మనం అర్పణ చెల్లించినా, ఆత్మశుద్ధి కోసం ఉపవాసముండినా, కరుణించినా క్షమించినా ఇతరులకు కనబడటం కోసం ఉద్దేశించిన క్రియగా ఉండరాదు. ఒకవేళ అలా ఉంటే అది వేషధారణే అవుతుంది తప్ప, అట్టి వాటి వలన ఏ ఫలితం ఉండదని ప్రభువైన యేసు తేటగా బోధించారు. మన క్రియల విషయంగా మనకున్న తప్పుడు భ్రమను గూర్చి ప్రభువు హెచ్చరిక చేస్తున్నాడు. ‘‘క్రియల మూలమున గాక క్రీస్తు నందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుదుము’’ అని పరిశుద్ధ పౌలు (గలతీ 2:16) పేర్కొన్నారు. అయితే ప్రభువు యొక్క శిష్యుడు యాకోబు తన రచనలో ‘‘క్రియలు లేని విశ్వాసము మృతము’’ అంటూ మన విశ్వాసం మన క్రియల మూలముననే వ్యక్త పరచబడవలసి ఉంది అని (యాకోబు 2:17) తెలియజేశాడు. అవును, ఈనాడు మన మతాలు భక్తి విశ్వాసాలు అన్నవి క్రియలేని ఆచరణలేని వ్యక్తిగత వ్యాపకాలుగా మారాయి. ఆచారాలనే గాని ఆచరణలకు నోచుకోలేకపోన్నాయి. మానవత్వపు స్పర్శ సృహలేని మత విన్యాసాలుగా తయారయ్యాయి. మదర్ థెరిస్సా అంటుండేవారు ‘‘ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులే మిన్న’’ అని. క్రియ లేని విశ్వాసం, విశ్వాసం లేని క్రియ రెండూ అనర్థాలే. వీటి రెండింటిని వేరు వేరుగా కాక, విశ్వాసము క్రియలు అను ఈ రెండింటి సమ్మేళనం, సమ్మిళితం, సమల్యంతో కూడిన జీవనశైైలిని అలవర్చుకొందాం. క్రియలతో కూడిన విశ్వాస జీవితమే మనల్ని స్వచ్ఛమైన ఆధ్యాత్మిక పరిపూర్ణత దిశ వైపు నడిపిస్తుంది. ఒక రోజున ధనవంతుడైన యవ్వనస్థుడు యేసుప్రభువు దగ్గరకు వచ్చి ‘నిత్యజీవానికి వారసుడవడానికి నేను ఏ మంచి కార్యం చేయాలి?’ అని అడిగాడు. అప్పుడు ప్రభువు నీకు ఒకటి కొదువుగా ఉన్నది ‘‘నీకు కలిగినదంతయు అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించుము’’ అని సెలవిచ్చాడు. అందుకు ఆ యవ్వనస్థుడు తను మిగుల ఆస్తి గలవాడు గనుక దానిని విడిచిపెట్టలేక దుఃఖముఖుడై వెళ్ళిపోయాడు. సత్క్రియ అనగా మత నిష్టాగరిష్టులు కాదు, దానధర్మాలే కాదు, వ్యామోహాలు విడనాడి దేవునిపై స్వచ్ఛమైన విశ్వాసంతో ఆయనను పూర్ణ మనస్సుతో వెంబడించు జీవన విధానం. మనం దేవుని ప్రార్థించినా పరులకు ఉపకార ధర్మం చేసినా, దేవునికి మనం అర్పణ చెల్లించినా, ఆత్మశుద్ధి కోసం ఉపవాసముండినా, కరుణించినా క్షమించినా ఇతరులకు కనబడటం కోసం ఉద్దేశించిన క్రియగా ఉండరాదు. - రెవ.పి. ఐజక్ వరప్రసాద్ -
ప్రజా విశ్వాసం కోల్పోతున్న టీడీపీ ప్రభుత్వం
లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు కఠారి భవానీపురం : తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానాల ఊబిలో చిక్కుకుని నానాటికీ ప్రజల్లో విశ్వాసం కోల్పోతోందని పార్టీ జాతీయ అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు విమర్శిం చారు. బెంజిసర్కిల్ వద్ద గల వేదిక హాల్లో ఆదివారం జరిగిన రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆ యన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. లోక్‌సత్తా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగటానికి తగిన ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీవీవీఎస్ వర్మ, జాతీయ నాయకులు రవిమారుతి, జె.వెంకటేశ్వర్లు తమ సందేశాలను అందించారు. రాజకీయ అంశాలపై రాష్ర్ట ఉపాధ్యక్షుడు నర్రా శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి ఐ.రామమూర్తి, ప్రజా సమస్యలపై ప్రత్యక్ష కార్యాచరణ కార్యక్రమంపై రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెన్నుపాటి వజీర్, పార్టీ సంస్థాగత అంశాలను ప్రధాన కార్యదర్శి రమేష్‌రెడ్డి ప్రతిపాదించారు. ప్రభుత్వ మద్యం పాలసీపై రాష్ర్ట నాయకులు మనోరమ, పద్మారాణి ప్రవేశపెట్టగా, విభజన హామీలపై తీర్మానాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓంకార్, వెంకటేశ్వరరావు ప్రతిపాదించగా, అవినీతి వ్యతిరేక తీర్మానాన్ని ఎస్.నరేంద్ర, ఎం.వెంకటేశ్వరరావులు ప్రతిపాదించారు. -
అద్దం పగిలితే... పాకెట్ చిరిగినట్టే... అట!
విశ్వాసం లోకంలో సత్యాలు, అసత్యాలు మాత్రమే కాదు, నమ్మకాలు కూడా ఉంటాయి. అసలు సత్యాన్ని బహువచనంలో చెప్పడమే పొరపాటని, దేశ కాలాలకు అతీతంగా సత్యం ఒకటే ఉంటుందనీ, అదే అంతిమమైనదనిన్నీ సత్యాన్వేషకులు ప్రవచిస్తుంటారు. అదేమిటో పూర్తిగా అర్థమై చావదు కాబట్టి, దానినలా వదిలేద్దాం. ఇక అసత్యాల గురించి చెప్పాలంటే ఒక జన్మ సరిపోదు. సగటు మనిషికి సత్యాసత్యాలతో పెద్దగా నిమిత్తం లేదు. నడిసంద్రమున నావ లాంటి జీవితాలు గడిపే వారికి నమ్మకాలే పెద్ద ఆధారం. ⇒ మేధావులు వాటికి ముద్దుగా ‘మూఢ’ విశేషణాన్ని చేర్చినప్పటికీ, సామాన్యుల జీవనాన్ని ప్రభావితం చేసేవి నమ్మకాలే! ప్రపంచవ్యాప్తంగా అనాదిగా కొనసాగుతున్న కొన్ని సుప్రసిద్ధ నమ్మకాల గురించి ముచ్చటించుకుందాం... ⇒ ఆదివారం అమావాస్య చాలా అరుదుగా వస్తుంది. ఆ రోజు పిశాచాలు నిద్రలేస్తాయని నమ్ముతారు. ఆదివారం అమావాస్య అర్ధరాత్రి క్షుద్రపూజలు చేసేవారికి పండగేనని మన దేశంలో వ్యవహారంలో ఉన్న అభిప్రాయం. ⇒ ఏ నెలలోనైనా శుక్రవారం 13వ తేదీన వస్తే క్రైస్తవులు దానిని దురదృష్టకరమైన రోజుగా భావిస్తారు. ఏసుక్రీస్తును శిలువ వేయడానికి ముందు రోజు రాత్రి విందులో (లాస్ట్ సప్పర్) పదమూడు మంది పాల్గొనడమే దీనికి కారణమని చెబుతారు. ⇒ పాశ్చాత్యులకు బ్రెడ్ ప్రధానమైన ఆహారం. బ్రెడ్‌ను తిరగేసి పట్టుకుంటే దురదృష్టం తప్పదని ఫ్రెంచి ప్రజలు నమ్ముతారు. తిరగేసి పట్టుకున్న బ్రెడ్‌ను ఇచ్చినా, పుచ్చుకున్నా అరిష్టమేనని వారి నమ్మకం. ⇒ పెళ్లి వేడుకల్లో పెళ్లికొడుకుకైనా, పెళ్లికూతురుకైనా కానుకలు చదివించేటప్పుడు జతగా ఉండే వస్తువులనే చదివించడం వియత్నాంలో ఆనవాయితీ. నవదంపతులలో ఎవరికి కానుకలు చదివించినా, దుప్పట్లయినా, కంచాలైనా... ఏవైనా జతగా ఉండే వస్తువులనే చదివించాలని, లేకుంటే అరిష్టమని వియత్నాం ప్రజల నమ్మకం. ⇒ ఈలవేసి గోల చేయడాన్ని మనం మామూలుగా ఆకతాయి చేష్టగా కొట్టి పారేస్తాం. అయితే, రాత్రివేళ ఈలవేస్తే దయ్యాలను పిలుస్తున్నట్లు చైనా ప్రజలు, పాములను రప్పించే ప్రయత్నంగా జపనీయులు భావిస్తారు. ⇒ మన జీవితంలో దాదాపు మూడోవంతు కాలాన్ని నిద్రలోనే గడిపేస్తాం. నిద్రపోయేటప్పుడు పడుకునే తీరుపై కూడా ప్రపంచంలో కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఉత్తరదిశగా తలపెట్టి నిద్రించరాదనే నమ్మకం భారత్‌లోనే కాదు, జపాన్‌లోనూ చిరకాలంగా ఉంది. దీనికి శాస్త్రీయమైన వివరణ కూడా ఉంది. ⇒ నల్లపిల్లి చుట్టూ అల్లుకున్న నమ్మకాలు చాలానే ఉన్నాయి. పైగా అవి ఒకదానికొకటి భిన్నమైనవి. బ్రిటన్ సహా పలు యూరోపియన్ దేశాల్లో నల్లపిల్లిని శుభశకునంగా పరిగణిస్తే, భారత్ వంటి ఆసియన్ దేశాల్లో దుశ్శకునంగా పరిగణిస్తారు. ⇒ దారిలో గుర్రపు నాడా దొరికితే అదృష్టంగా భావిస్తారు. గుర్రపు నాడాను కొనుక్కొని అయినా, దానితో ఉంగరం తయారు చేయించుకుని, వేలికి తొడుక్కుంటే దురదృష్టం తొలగిపోతుందని, శనిదోష నివారణ జరుగుతుందని మన దేశంలో చాలామంది నమ్ముతారు. ⇒ నిచ్చెన కింద నుంచి నడిచి వెళితే దురదృష్టం తప్పదని యూరోపియన్లు నమ్ముతారు. నిచ్చెనను గోడకు చేరవేసి, నిలబెట్టినప్పుడు ఆ ఆకారం పిరమిడ్‌ను తలపిస్తుంది. అలాగే నిచ్చెన కింద నిలుచుంటే ప్రేతాత్మలు మేలుకుంటాయని ఈజిప్షియన్లు భావిస్తారు. ⇒ పగిలిన అద్దంలో ముఖాన్ని చూసుకుంటే దురదృష్టం వెంటాడుతుందనే నమ్మకం మనదేశంలోనే కాదు, చాలా చోట్ల ఉంది. ఇంట్లో ఉన్న అద్దం అనుకోకుండా పగిలిపోతే, అప్పటి నుంచి దుర్దినాలు ప్రారంభమైనట్లేనని కొన్ని దేశాల్లో భావిస్తారు. ఆర్థిక నష్టాలు కలుగుతాయని, దరిద్రం వెంటాడుతుందని నమ్ముతారు. ⇒ పీడకలలు వెంటాడుతుంటే, దిండుకింద చాకు లేదా కత్తెర ఉంచుకుంటారు. ఈ నమ్మకం మన దేశంలో కొన్నిచోట్ల ఇప్పటికీ ఉంది. ⇒ ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఎవరైనా తుమ్మితే దురదృష్టంగా భావిస్తారు. అలాగే, ఏదైనా పని మీద బయటకు బయలు దేరుతుంటే, ఎవరైనా వెనక్కు పిలిచినా దురదృష్టం తప్పని నమ్ముతారు. ఇంటి నుంచి బయలుదేరాక తిరిగి వెనక్కు వెళ్తే, ఆ పని జరగదంటారు. ⇒ చైనాలో ‘4’ అంకెను దురదృష్ట కరమైనదిగా భావిస్తారు. చివరకు ‘4’తో ఏర్పడే 14, 24 వంటి సంఖ్యలను కూడా. చైనా భాషలో నాలుగు, చావు పదాలు దాదాపు ఒకేలా వినిపించడమే ఈ నమ్మకానికి కారణం. -
మతపర విషయాల్లో జోక్యం వద్దు: శివసేన
ముంబై: మతపరమైన నమ్మకాలు, విశ్వాసాలకు సంబంధించిన అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిదంటూ శివసేన...కోర్టులకు సలహా ఇచ్చింది. ముంబైలోని బాగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో మండపాలను, ఉత్సవాలను నిషేధిస్తూ ఇటీవల ముంబై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ పై శివసేన తన అధికార పత్రిక సామ్నాలో విమర్శలు గుప్పించింది. మత నమ్మకాలకు సంబంధించిన అంశాలలో జోక్యం చేసుకోవద్దంటూ కోరింది. దీనివల్ల గణేష్ ఉత్సవం, నవరాత్రి, దహీహండీ, శివ జయంతి లాంటి హిందువుల పండగల సంస్కృతి నాశనమవుతుందని ఆవేదవ వ్యక్తం చేసింది. ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ అభిప్రాయాన్ని మొత్తం ప్రజల అభిప్రాయంగా కోర్టు ఎలా పరిగణిస్తుందని మండిపడింది. ఎలాంటి ఉత్సవాలు, పండుగలు లేనపుడు కూడా దేశ వ్యాప్తంగా వచ్చే పోయే జనాలతో ముంబాయి నగరం సంవత్సరం పొడవునా అత్యంత రద్దీగా ఉంటుందని పేర్కొంది. భారీగా వచ్చి పడుతున్న ఈ వలసలను కోర్టులు కట్టడి చేయగలవా అని ప్రశ్నించింది. జాతీయ పండుగలను, ఉత్సవాలను నిషేధించడం అంటే ప్రజల్లోని స్పూర్తిని చంపి వేయడమే అని శివసేన అభిప్రాయపడింది. కోర్టులు ప్రజలందరికి న్యాయం జరిగేలా వ్యవహరించాలని సలహా ఇచ్చింది. ముఖ్యంగా కోర్టులు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిదంటూ వ్యాఖ్యానించింది. -
ఓనమ్మహోత్సవమ్
సందర్భం- 7న ఓనమ్ ఓనమ్ సమయంలో మహాబలి ఆత్మ కేరళ రాష్ట్రమంతా సంచరిస్తుందని ఒక విశ్వాసం. ఆయనను సాదరంగా ఆహ్వానించడానికే కేరళీయులు ఈ పండుగను జరుపుకుంటారు. కేరళీయులకు ఓనమ్ పెద్ద పండుగ. కేరళ ప్రాంతంలో పంటలు ఈ మాసంలోనే ఇంటికి వస్తాయి. అందుకే ఇది పంటల పండుగ కూడా. ఈ పండుగను ఆనందోత్సాహాలతో, కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు. బలిచక్రవర్తి గాథ రాక్షసరాజయిన మహాబలి పాలనలో రాజ్యమంతా స్వర్ణయుగంలా ఉండేది. అందుకు కేరళీయులే సాక్ష్యం. రాష్ట్రంలో అందరూ సంతోషంగా, సంపదలతో తులతూగుతుండేవారు. మహాబలికి ఎన్నో మంచి లక్షణాలున్నా, అతనిలో ఒక బలహీనత ఉంది. అదే అతనిలోని అహంకారం. ఆ అహంకారాన్ని అణగదొక్కడానికి దేవతలందరూ పూనుకున్నారు. అదే సమయంలో మహాబలి చేసిన మంచి వల్ల దేవతలు అతనికి ఒక వరం కూడా ఇచ్చారు, అతనితో సన్నిహితంగా ఉండేవారందరినీ ఏడాదికొకమారు కలుసుకోవచ్చన్నది ఆ వరం. అలా మహాబలి తన ప్రజలను కలుసుకోవడానికి వచ్చే రోజే ఓనమ్. ఓనమ్ పదిరోజుల పాటు జరుగుతుంది. పది రకాలుగా జరుగుతుంది. (1. అత్తం 2.చితిర 3. చోఢీ 4. విశాగం 5. అనిళమ్ 6. త్రికేత 7. మూలమ్ 8. పూరడామ్ 9. ఉత్తరాడమ్ 10. తిరు ఓనమ్). తిరు ఓనమ్‌తో ఓనమ్ ఉత్సవాలు ముగుస్తాయి. అయితే తిరు ఓనమ్ తరువాత రెండురోజుల పాటు కూడా ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ పండుగలో ప్రధాన అంశం ఈ పది రోజులుగా పూగళమ్ (పూలముగ్గు)లో ఉంచిన బలిచక్రవర్తి ప్రతిమను నదిలో కానీ సముద్రంలో కానీ నిమజ్జనం చేయడం. నిమజ్జనం తరువాత పూగళమ్ను తీసేసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తారు. ఓనమ్ పండుగ ‘చింగామ్’ మాసం ఆరంభంలో వస్తుంది. ఈ మాసం మన తెలుగువారి చైత్రమాసం లాంటిది. అక్కడ ఇది ఆగస్టు - సెప్టెంబర్ మాసాలలో వస్తుంది. ఈ పండుగకు ప్రత్యేకంగా విందువినోదాలు, జానపద గీతాలు, అద్భుతమైన నృత్యాలు, చిత్రవిచిత్రమైన క్రీడలు, ఏనుగులపై ఊరేగడాలు, పడవ పోటీలు, పూల అలంకరణ... వంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అత్తం రోజున పెద్ద ఊరేగింపు ఉంటుంది. ఆ రోజు నుండి పండుగ వాతావరణం, ఆనందోత్సాహాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పదవరోజైన తిరు ఓనమ్ నాడు అందరూ ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటారు. ఈ పదవ రోజునే మహాబలి ఆత్మ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని వీరు విశ్వసిస్తారు. ఓనమ్ ఉత్సవాలు ఓనమ్‌లో మరో ముఖ్యమైన ఘట్టం వల్లంకలి, పాము పడవ పోటీలు. పంపా నదిలో ఈ పోటీలు జరుగుతాయి. అందంగా అలంకరించిన ఈ పడవలను వందలమంది పాటలు పాడుతూ నడుపుతూ ఉత్సాహంగా పాల్గొంటారు. - డా. వైజయంతి -
ఇద్దరు దేవుళ్లు!
దైవికం కష్టాల్లో దేవుడు గుర్తొస్తాడు. లేదంటే, దేవుడిలాంటి మనిషైనా గుర్తొస్తారు. అయితే దేవుడి లాంటి మనిషికన్నా కూడా, దేవుడే ఎక్కువగా మనిషికి అందుబాటులో ఉంటాడు! దేవుడు.. గుడిలో ఉంటాడని మనకు నమ్మకంగా తెలుసు. పరుగున వెళ్లి ‘దేవుడా నువ్వే దిక్కు’ అని వేడుకోవచ్చు. బైబిల్లో, భగవద్గీతలో, ఖురాన్లో, తక్కిన పవిత్ర గ్రంథాలలో అక్షరాల రూపంలో దేవుడి స్వరూపం సాక్షాత్కరిస్తుంది కనుక దైవవాక్యాలను గుండెకు హత్తుకుని మనసుకు మరమ్మతులు చేసుకోవచ్చు. ఆకాశం దేవుడి నివాసం అని కూడా మనకో నమ్మకం కనుక కన్నీళ్లతోనో, నీళ్లింకిన కళ్లతోనో నింగి వంక చూస్తూ దేవుడిని ప్రార్థించవచ్చు. అయితే దేవుళ్లా వచ్చి గట్టెక్కించే వరకు దేవుడిలాంటి మనిషి ఎలా ఉంటారో తెలియదు. ఎక్కడుంటారో తెలీదు. ఏ రూపంలో వస్తారో తెలీదు. అమ్మ, నాన్న, తోబుట్టువు, స్నేహితుడు, బంధువు... ఎవరైనా కావచ్చు. ఆఖరికి శత్రువు కూడా దేవుడు పంపిస్తే వచ్చినట్లు రావచ్చు. ఒకటే తేడా. దేవుడిని మనం వెతుక్కుంటూ పోతాం. దేవుడి లాంటి మనిషి మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. దేవుడు ఎంతో కరుణిస్తే తప్ప దేవుడి లాంటి మనిషి దొరకరు. సాధారణంగా కష్టాలు, కన్నీళ్లు మామూలు వ్యక్తులకే వస్తాయని, వాళ్లకే తరచు దేవుడి అవసరం కలుగుతుంటుందని అనుకుంటాం. అయితే దేశంలోనే అత్యున్నత హోదాలలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఈ మధ్య దేవుడు గుర్తొచ్చాడు. వాళ్లలో ఒకరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం. లోథా! ఇంకొకరు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ! ‘‘ఫర్ గాడ్స్ సేక్, న్యాయవ్యవస్థ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని చెక్కు చెదరనియ్యకండి. న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేస్తూ పోతుంటే జాతికి తీరని హాని జరుగుతుంది’’ అని లోథా ఆగ్రహంతో అభ్యర్థించారు. ‘న్యాయమూర్తుల నియామకాల్లోని గుట్టుమట్లను బహిర్గత పరచి, ఆ వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టండి’ అని ఒక పౌరుడు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తున్న సందర్భంలో లోథా పై విధంగా స్పందించారు. ‘ఫర్ గాడ్స్ సేక్’ అని ఆయన అనడంలో ‘భగవంతుడా ఏమిటీ విపరీతం’ అన్న నిస్పృహ ఉంది. ఇలాంటి నిస్పృహకే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా లోనయ్యారు. ఇటీవల ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు ప్రదానం చేస్తున్న ఉమ్మడి సభలో తృణమూల్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఎంపీలు ‘చోటు’ కోసం గొడవ పడడం చూసి ఆయన ఎంతో ఆవేదన చెందారు. ప్రజాస్వామ్యానికి ఆలయం లాంటి పార్లమెంటు భవనంలో సభ్యులు కనీస గౌరవ మర్యాదలు కూడా విస్మరించి సభ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించడం ఆయనను బాధించింది. ‘‘ప్లీజ్.. ఫర్ గాడ్స్ సేక్, హుందాగా వ్యవహరించండి. మీరంతా ప్రజాప్రతినిధులన్న సంగతి మర్చిపోయి, సభలో గందరగోళం సృష్టిస్తే పవిత్రమైన పార్లమెంటు అపహాస్యం పాలవుతుంది’’ అని ఆక్రోశించారు. ఆ ఆక్రోశంలో ‘దేవుడా, వీళ్లకు మంచి బుద్ధిని ప్రసాదించు’ అన్న వేడుకోలు ఉంది. అదే సందర్భంలో ప్రణబ్ ముఖర్జీ.. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు భవనంలోకి అడుగుపెట్టేముందు, అక్కడి మెట్లకు శిరస్సుతో నమస్కరించడాన్ని గుర్తు చేస్తూ.. మోడీని కొనియాడారు కూడా. లోథాకు, ప్రణబ్‌కి వచ్చిన కష్టం.. పెద్ద కష్టంగా మనకు అనిపించకపోవచ్చు. అసలవి కష్టాలే కాదని కూడా అనిపించవచ్చు. అయితే ఏ మనిషి కష్టాన్నయినా మనం అనుకునే హెచ్చుతగ్గులను బట్టి అంచనా వెయ్యకూడదు. కష్టం తీవ్రత దేవుడిని తలచుకోవడంలో ఉంటుంది. ఎవరైనా బాధగా ‘దేవుడా’ అనుకున్నారంటే అది కష్టం అవుతుంది తప్ప, చిన్నకష్టమో, పెద్ద కష్టమో కాదు. కష్టాల్లో.. దేవుడు గానీ, దేవుడి లాంటి మనిషిగానీ గుర్తొస్తారని కదా అనుకున్నాం. అంటే ప్రతి మనిషికి ఇద్దరు దేవుళ్లు. ఒకరు దేవుళ్లలో దేవుడు. ఇంకొకరు మనుషుల్లో దేవుడు. మనకిక భయం ఏమిటి? దేవుడు తప్పక మన కష్టం తీరుస్తాడు. లేదా కష్టం తీర్చి రమ్మని తన తరఫున మనిషినైనా పంపిస్తాడు. అలా కూడా జరగలేదంటే.. ఎవరి వల్ల కష్టం వచ్చిపడిందో వారిలో పరివర్తన తెచ్చి, వారినే కష్టం తీర్చే మనిషిగా మన ముందుకు పంపే ఆలోచనలో ఆయన ఉన్నాడని. అప్పటి వరకు కష్టాన్ని ఓర్చుకోవడమే దేవుడికి మనం చెల్లించగల స్తుతి. - మాధవ్ శింగరాజు -
ఆలయాలలోనే ప్రశాంతత ఎందుకు లభిస్తుంది?
ఎందుకు? ఇంటిలో మనం ఎంతసేపు పూజ చేసుకున్నా ఆలయానికి వెళ్లి, ఆ మూర్తి ముందు రెండు నిమిషాలు గడిపితే చాలు... ఎనలేని ప్రశాంతత చేకూరుతుంది. ఎందుకంటే దేవాలయాలలో దేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడే యంత్రాన్ని కూడా ప్రతిష్ఠాపన చేస్తారు. ఆ యంత్రాల ప్రతిష్ఠాపన కార్యక్రమం యోగులు, స్వామీజీలు, బాబాల చేతుల మీదుగా జరుగుతుంది. వారు జీవించి వున్నంత కాలమే కాదు, తమ భౌతిక దేహం వీడిన తర్వాత కూడా వారి ఆత్మశక్తి, జప ఫలం, తపో మహిమ ఆ యంత్రాలను చేరతాయని ఒక నమ్మకం. ఈ పుణ్యపుడమిలో ఎందరో అవతార పురుషులు జన్మించారు. వారు అవతారం చాలించగానే వారి దివ్యమహిమలన్నీ ఆ పరిసర ప్రాంతాల్లో వుండే ఆలయాల్లోని యంత్రాలలో ప్రతిష్ఠితమవుతాయని. ఆ యంత్రాలలోని బీజాక్షరాలలో వుండే దివ్యశక్తులు స్వరబద్ధమైన మంత్రాల ద్వారా మన చెవులను చేరి మన కోరికలను తీరుస్తాయని అంటారు. ఆ సమ్మోహన శక్తే మనల్ని వందలు, వేల మైళ్ల దూరం ప్రయాణించి ఆయా ఆలయాలలోని దేవతల దర్శనం చేసుకునేలా చేస్తుంది, మనసులకు ప్రశాంతత ప్రసాదిస్తుంది. -
నిత్య ప్రార్థనేనిత్య జీవము
సువార్త దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. (ఫిలిప్పీ 4:6) ప్రార్థన... దేవుడిని, భక్తుడిని అనుసంధానం చేసే సాధనం. మనల్ని ప్రభువుకు దగ్గర చేసే అతి శక్తిమంతమైన ఉపకరణం. ప్రభువు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతాడు. మనం ప్రభువుతో ప్రార్థన ద్వారా మాట్లాడుతాం. ప్రార్థన లేని జీవితం అద్భుతాలను చూడలేదు. ప్రార్థన లేని జీవితం క్రైస్తవుని జీవితానికి సాఫల్యతనివ్వదు. అందుకే యెడతెగక ప్రార్థన చేయమని చెప్పాడు దేవుడు. ప్రార్థన ఒక బలం. ప్రార్థన చెడును జయించే ఓ సాధనం. ప్రార్థన ఓ ధైర్యం. ప్రార్థన మనల్ని పరలోకానికి చేర్చే ఒక మార్గం. మనిషికి ఎన్నో చింతలు. అది ఉంది, ఇది లేదు, ఇంకేదో కావాలి అంటూ ఆలోచనలు. అయితే దేని గురించీ అంత చింతించాల్సిన పని లేదని సూటిగా చెబుతున్నాడు ప్రభువు పై వాక్యంలో. అయితే ఆ ప్రార్థన ఎలా ఉండాలి? నాకిది కావాలి ఇవ్వు ‘తండ్రీ అని అడిగేస్తే సరిపోతుందా? లేదు. నిండు విశ్వాసంతో, పూర్ణమనసుతో, కృతజ్ఞత నిండిన ప్రార్థన చేయాలి. విన్నవించుకోవాలి. మనకు సర్వస్వాన్నీ అనుగ్రహించువాడు ప్రభువే. ఆయనే అన్నాడు ‘అడుగుడి ఇవ్వబడును’ అని. తండ్రీ నా శక్తి చాలదు, నాకిది అనుగ్రహించు’ అని వేడుకుంటే ఆయన తప్పక మనకు దానిని ఇస్తాడు. విశ్వాసంతో నిండిన ప్రార్థనను, నమ్మకంతో కూడా విన్నపాన్ని ఆయన ఎప్పుడూ తోసిపుచ్చడు. లోక సంబంధిత విషయాల కొరకు చింతించనవసరం లేదు. ఆయన అవన్నీ చూసుకుంటాడు. ఓ క్రైస్తవుడిగా దైవ సంబంధిత చింతనను మాత్రమే కలిగివుండాలి. ప్రార్థనాశక్తి ఎంతటిదో పలు సందర్భాల్లో రుజువు అయ్యింది. నమ్మకంతో ప్రార్థించినవారి రోగాలు నయమయ్యాయి. నమ్మకంతో ప్రార్థన చేసినవారి నుంచి దురాత్మలు దూరమయ్యాయి. యేసుక్రీస్తు సైతం ఎన్నో సందర్భాల్లో ప్రార్థన చేసినట్టు పరిశుద్ధ గ్రంథం చెబుతోంది. అంత గొప్ప ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? ప్రతిదినం దేవుడిని ప్రార్థిస్తున్నామా? ఉరుకుల పరుగుల జీవన ప్రయాణంలో పడి ప్రార్థనను విస్మరిస్తున్నామా? ప్రతి క్రైస్తవుడూ ఈ ప్రశ్నలు వేసుకోవాలి. ప్రార్థనకు మన జీవితాల్లో ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నామో తరచి చూసుకోవాలి. నిత్యం ప్రార్థించాలి. ఆ ప్రార్థనే... మనకు నిత్యజీవాన్ని అనుగ్రహిస్తుంది. - జాయ్స్ మేయర్ -
పరస్పర సహకారంతోనే సమాజం సుభిక్షం
ప్రవక్త ప్రవచించినట్లు, సాటివారి కష్టాలను దూరం చెయ్యడం, వారి బాధల్లో పాలు పంచుకోవడం, అన్న వస్త్రాలు, గృహవసతి లాంటి ప్రాథమిక అవసరాలు తీర్చడంతోపాటు, పీడన, వివక్ష, అసమానతలు లేని సమాజం ఆవిష్కృతమైతే ఇంకా అంతకంటే కావలసినదేముంటుంది? సమాజం సుభిక్షంగా ఉండాలంటే, మానవుల మధ్య పరస్పర సంబంధ బాంధవ్యాలు సజావుగా, సామరస్య పూర్వకంగా, ప్రేమమయంగా ఉండాలి. హజ్రత్ అబూ హురైరా (రజి) కథనం ప్రకారం, ఈ విషయాన్ని దైవప్రవక్త ముహమ్మద్ (స) ఇలా విశదీకరించారు... ‘‘ఒక వ్యక్తి మరో వ్యక్తికి సంభవించే ప్రాపంచిక ఆపదల్లో కనీసం ఒకదాన్నయినా సరే దూరం చేసినట్లయితే, దైవం ఆ వ్యక్తిని ప్రళయదినం నాటి ఆపదల్లో ఒకదాన్నుండి కాపాడతాడు. వస్త్రాలు లేనివారికి వస్త్రాలు సమకూరిస్తే, దైవం పరలోకంలో అతనికి ఆచ్ఛాదన కలుగజేస్తాడు. సాటి మానవుల కష్టాలు తీర్చడంలో, వారికి సాయం చెయ్యడంలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో, అలాంటి వారి కష్టాలు తీర్చడంలో వారికి సాయం చేయడంలో దైవం లీనమై ఉంటాడు. జ్ఞానసముపార్జన కోసం, దాన్ని సర్వసామాన్యం చెయ్యడంకోసం కృషి చేస్తున్నవారికి దైవం స్వర్గమార్గాన్ని సుగమం చేస్తాడు. ఎవరైతే దైవగృహాల్లో సమావేశమై దైవగ్రంథాన్ని పారాయణం చేస్తారో, దాన్ని ఇతరులకు ఉపదేశిస్తారో, అలాంటి వారి హృదయాలకు దైవం శాంతి, సాంత్వన కలుగజేస్తాడు. ఆకలి, అజ్ఞానం, పేదరికం, దోపిడీ, పీడన, అసమానత, అమానవీయతల్లేని సమసమాజ నిర్మాణానికి మనమీనాడు ముహమ్మద్ ప్రవక్త (స) వారి ఈ బోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈనాటి మన మానవ సమాజంలో కనిపిస్తున్న అన్ని లోపాలకూ, అవలక్షణాలకూ, రుగ్మతలకూ ఈ బోధనల్లో పరిపూర్ణ పరిష్కారం ఉంది. ప్రవక్త ప్రవచించినట్లు, సాటివారి కష్టాలను దూరం చెయ్యడం, వారి బాధల్లో పాలు పంచుకోవడం, అన్న వస్త్రాలు, గృహవసతి లాంటి ప్రాథమిక అవసరాలు తీర్చడంతోపాటు, పీడన, వివక్ష, అసమానతలు లేని సమాజం ఆవిష్కృతమైతే ఇంకా అంతకంటే కావలసినదేముంటుంది? కాని మానవుల్లో స్వార్థం ఉన్నంతకాలం సాటివారి పట్ల సానుభూతి, ప్రేమ జనించనంతకాలం ఇది అసాధ్యం. మానవుల్లో ఈ సుగుణాలు జనించాలంటే దైవంపై అచంచల విశ్వాసం ఉండాలి. ఆయన తన ప్రవక్త ద్వారా మానవులకు అందజేసిన హితోపదేశాలను హృదయపూర్వకంగా ఆచరించకపోతే, దైవానికి సంజాయిషీ చెప్పుకోవలసి ఉంటుందన్న భయం ఉండాలి. ఆయన ఆదేశాలను పాటించకపోతే శిక్షిస్తాడన్న భీతితోపాటు, చిత్తశుద్ధితో ఆచరిస్తే అనంతంగా సంతోషించి చక్కటి ప్రతిఫలం ప్రసాదిస్తాడన్న ఆశ ఉండాలి. ఈ విధంగా దైవభీతి, పరలోక చింతన కలిగి, నైతిక, ఆధ్యాత్మిక పరివర్తనతో జీవితం గడిపితే నిజంగానే మానవ సమాజం శాంతి సౌభాగ్యాలతో, సుభిక్షంగా వర్థిల్లుతుంది. కాబట్టి ప్రవక్త మహనీయుని హితోపదేశాలను పాటిస్తూ, ఆకలి, దారిద్య్రం, అసమానతల్లేని ఓ సుందర సత్సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం. - యండి ఉస్మాన్‌ఖాన్ -
మనల్ని దేవుడికి దగ్గర చేసే సాధనాలు....
సాయినాథుడు తన భక్తుల నుంచి శ్రద్ధ, భక్తి, విశ్వాసాన్ని దక్షిణగా కోరారు. అవి తనకిస్తే బతుకుల్ని తీయబరుస్తానని అభయమిచ్చారు. మనం చేసే పనిలో కూడా మనం చూపే భక్తిశ్రద్ధలే ఆ పనిలో రాణించేలా చేస్తాయి. భక్తి, శ్రద్ధ, సబూరి...ఇవి రెండూ కలిస్తే కలిగేది మేలిమి విశ్వాసం. ఇవే మనల్ని భగవంతునికి దగ్గర చేసే సాధనాలు. ఇటువంటి శ్రద్ధాభక్తులు ఎవరికైతే ఉంటాయో, వారే మహనీయులుగా మారతారు. ఓ బాటసారి దూరపు ప్రయాణానికి బయల్దేరాడు. భగవంతుడంటే అతనికి ఏ మూలో కొద్దిగా భక్తి ఉంది. మార్గమధ్యంలో ఎక్కడా ఆపదల బారిన పడకుండా ఉండేందుకు భగవన్నామస్మరణ చేసుకుంటూ కాలినడకన సాగిపోతున్నాడు. ప్రయాణంలో అక్కడక్కడా చిన్నచిన్న ఆటంకాలు కలిగినా అవన్నీ భగవంతుడి దయవల్ల తొలగిపోయాయని సంతోషపడ్డాడు. ఒకచోట పెద్ద నదిని దాటవలసి వచ్చింది. అక్కడ పడవ, తెప్ప వంటి సాధనాలేవీ లేవు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ అటూఇటూ తిరగసాగాడు. అంతలో అతని అదృష్టంకొద్దీ సమీపంలో ఒక సిద్ధుడు కనిపించాడు. బాటసారి ఆశగా ఆయన వైపు వెళ్లి తన సమస్యను చెప్పాడు. సిద్ధుడు బాటసారి చెప్పింది శ్రద్ధగా విని, ‘ఇది నిన్ను నదిని దాటిస్తుంది’ అంటూ ఒక తాయెత్తును అతని చేతిలో పెట్టాడు. సిద్ధుని మాటతీరు, గాంభీర్యం బాటసారిలో ఆయనపై ఒక గౌరవాన్ని, నమ్మకాన్ని కలిగించాయి. ఆయనకు నమస్కారం చేసి తాయెత్తును జాగ్రత్తగా పట్టుకుని బాటసారి నదిపై నడక సాగించాడు. తన సమస్య తీరినందుకు అతను ఎంతగానో సంతోషించాడు. తను నదిపై ఎలా నడవగలుగుతున్నానా అని ఆశ్చర్యానందాలకు గురయ్యాడు. సరిగా నదిపై సగం దూరం వెళ్లగానే అతనిలో చిన్న సందేహం కలిగింది. తనను నదిని దాటించగల అద్భుతశక్తిని ఇచ్చిన తాయెత్తులో అసలేముంది? అందులోని ఏ శక్తి తనను నది దాటిస్తోంది? అదేమిటో చూడాలనే కుతూహలం అతనిలో కలిగింది. ఒక్క క్షణం కూడా ఓపిక పట్టలేకపోయాడు. ఇంకొక్క పది అడుగులు వేస్తే అతను నదికి ఆవలివైపు చేరిపోయేవాడే. కాని అతనిలో కలిగిన కుతూహలం అతనిని కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే చేతిలోని తాయెత్తును విప్పి చూశాడు. అందులో ‘సాయి... సాయి’ అనే మంత్రాక్షరాలు మాత్రమే ఉన్నాయి. బాటసారిలో ఒక్కసారిగా తృణీకారభావం కలిగింది. ‘ఓస్... సాయి అనే పేరు నన్ను నదిని దాటిస్తుందా? ఇంకా ఏదో గొప్ప మంత్ర తంత్రాలేవో నన్ను నదిని దాటిస్తున్నాయనుకున్నాను’ అని తేలికగా అనుకున్నాడు. అప్పటివరకు విశ్వాసంతో పడిన అతని అడుగులు అవిశ్వాసంతో ఒక్కసారిగా తడబడ్డాయి. అంతే, అతను నీటిలో మునిగిపోయాడు. శ్రీసాయి సచ్చరిత్రలో బాబా చెప్పినట్లు... ఈ దేహం కొన్నాళ్లకు శిథిలమవుతుంది. ఊపిరి గాలిలో కలుస్తుంది. అయినా ఈ శరీరం శాశ్వతమనే గొప్ప భ్రమను మనిషి విడువలేడు. ఆ భ్రమ తొలగాలంటే, అతనిలో ఆ జ్ఞానం కలగాలంటే ఆధ్యాత్మికతను ఆశ్రయించటం ఒక్కటే మార్గం. అశాశ్వత తత్వానికి శాశ్వత నిద్రలో ఉన్న శవాన్ని మించిన ఉదాహరణ లేదు. అయినా మనం సత్యాన్ని అంటిపెట్టుకోం. ప్రాణం విడిచిన వారితో గతానుభవాలు, సంబంధాలు గుర్తు చేసుకుని మరీ విలపిస్తాం. రోజులు గడిచేకొద్దీ మళ్లీ మామూలు మనుషులమవుతాం. మనుషుల్ని దేహస్వరూపులుగా కాకుండా ఆత్మస్వరూపులుగా భావించినప్పుడే అందరిలోనూ భగవంతుడిని చూడగలుగుతాం. అందుకే ఈ శరీరాన్ని ధర్మకార్యాచరణకే వినియోగించాలి. సత్కర్మలు ఆచరించాలి. పరమాత్మకోసం ఆరాటపడాలి. అదే నిజమైన భక్తి. అదే నిజమైన ఆధ్యాత్మిక దృక్పథం. అది అలవడాలంటే భక్తి, శ్రద్ధలను కలిగి ఉండాలి. అప్పుడే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. -డా.కుమార్ అన్నవరపు సాయి సూక్తి: ఈ ప్రపంచమంతా దేవుడే ఆవరించి ఉన్నాడు. అందుకే నాకు ఎవరూ శత్రువులు, మిత్రులు లేరు. అందరిలో సమభావంతో జీవించడమే నా తత్వం. భగవన్నామంలోని శ్రద్ధాభక్తులు మనుషుల చేత అద్భుతకార్యాలను చేయిస్తాయి. అయితే ఆ నామస్మరణలో భక్తిశ్రద్ధలు ముఖ్యం. అవి లేకుండా పవిత్ర నామాల్ని ఎన్నిసార్లు స్మరించినా కలిగే ఫలితం నిష్ఫలం.